PaniPuri
-
వహ్వా రసం పూరి.. తింటారా మైమరచి!
మీరెప్పుడైనా పానీ పూరి తిన్నారా? వాటిల్లో రకరకాల ఫ్లేవర్స్ రుచి చూశారా?తినే ఉంటారు! మరి.. రసం పూరి?దీన్ని తినాలంటే మాత్రం మీరు... కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపికి వెళ్లాల్సిందే! ఎందుకంటే అక్కడి ‘విప్ర’ ఛాట్ హోమ్‌కు వెళ్లాల్సిందే! జూనియర్ ఎన్టీఆర్, కాంతార హీరో రిషభ్ శెట్టిలు ఇటీవల దర్శించుకున్న ప్రఖ్యాత శ్రీకృష్ణ దేవాలయం మాత్రమే కాకుండా.. ఉడుపి టమోటా రసంకు చాలా ప్రసిద్ధి. శ్రీకృష్ణ మఠం నిత్యాన్నదాన కార్యక్రమంలో ఈ వంటకం ఓ స్పెషల్ అట్రాక్షన్. దీని రుచి, పరిమళం వేరే లెవల్ అని అంటారు అభిమానులు. ఇంతలా చాలామంది అభిమానం చూరగొన్న వంటకానికి మరింత ప్రచారం కల్పించాలని అనుకున్నారో ఏమో తెలియదు కానీ.. ‘విప్ర’ ఛాట్ హోమ్ వారు సాధారణ పానీ పూరి స్థానంలో రసం పూరిని ప్రవేశపెట్టారు. ఉడుపి రసంను పూరీల్లో పోసి ఇస్తారన్నమాట! ఈ సారి మీరేమైనా ఉడుపి వెళితే ఒకసారి ట్రై చేసి చూడండి మరి! మధుకర్ ఆర్. మయ్యా అనే వ్యక్తి ఎక్స్ వేదికగా ఈ సరికొత్త ఛాట్ వీడియో ఒకటి పోస్ట్ చేశారుಉಡುಪಿ ಸಾರನ್ನು ಚ್ಯಾಟ್ಸ್ ರೂಪದಲ್ಲಿ ಸವಿದಿದ್ದೀರಾ| ವಿಪ್ರ ಚಾಟ್ ಹೋಮ್ ರಸಂ ಪುರಿ | ಕೃಷ್ಣ ಮಠದ ಪಾರ್ಕಿಂಗ್ ಏರಿಯಾದ ಶ್ರೀರಾಮ ಧಾಮ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ | ಉಡುಪಿಯ ಕಂಡೀರಾ pic.twitter.com/h2DPhS5H1p— Madhukara R Maiya 🇮🇳 (@madhumaiya) September 2, 2024 -
పానీపూరి.. రోగాల దారి!
భాగ్యనగరంలో నిత్యం చిన్నారులు మొదలు విద్యార్థులు, పెద్దల దాకా లాగించే స్ట్రీట్ ఫుడ్ గోల్గప్పా. అదేనండి.. పానీపూరీ లేదా గప్‌చుప్. పానీపూరీలకు మధ్యలో చిల్లు పెట్టి.. ఉడికించిన ఆలూ, కాబూలీ చెనా దట్టించి.. ఆపై పుదీనా, చింతపండు, మసాలా కలగలిపిన నీటిలో ముంచి ఇస్తుంటే మనోళ్లు గుటుక్కుమనిపిస్తుంటారు. దాని రుచికి ఫిదా అవుతూ వహ్వా అంటుంటారు. గల్లీగల్లీలో కనిపించే పానీపూరీ బండ్ల వద్ద ఈ టేస్టీ ఎక్స్పీరియన్స్ కోసం క్యూలు కూడా కడుతుంటారు.కానీ కొందరు పుదీనా నీటిలో కలిపేకృత్రిమ రంగులు, పూరీల తయారీకి వాడే నూనెల వల్ల అనారోగ్యం పాలవుతారని వైద్యులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే ఇటీవల తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో పానీపూరీ నమూనాలను పరీక్షించగా వాటిల్లో కేన్సర్కారక పదార్థాలు ఉన్నట్లు తేలింది. దీంతో పానీపూరీల వినియోగంపై నిషేధం విధించాలని ఆ రాష్ట్రాలు యోచిస్తున్నాయి.సాక్షి, హైదరాబాద్పానీపూరీల తయారీలో వాడే పదార్థాలు ఎలా ఉన్నా.. చాలా మంది పరిశుభ్రమైన వాతావరణంలో వాటిని తయారు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సైతం అప్పుడప్పుడూ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా కలుషితమైన నీటినే కొందరు చిరువ్యాపారులు వినియోగిస్తున్నారు. అలాంటి నీటిలో ఈ–కొలి వంటి బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు, ఇతర రోగకారకాలు ఉంటాయి. అలాంటి నీటిని పానీపూరిలో వాడితే ఇక మన ఆరోగ్యం అంతే సంగతులు.ఎసిడిటీ.. అల్సర్లు..!పానీపూరీ అంటే ఎంత ఇష్టమైనా అతిగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తరచూ పానీపూరీ లాగించే వారిలో గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఎసిడిటీ, అల్సర్ వంటి జబ్బులు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వస్తున్నట్లు చెబుతున్నారు. దీనివల్ల టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు కూడా ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు.వర్షాకాలంలో జాగ్రత్త..అసలే వర్షాకాలం.. ఇంట్లో తాగే నీటి విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కలరా, డయేరియా వంటి అనారోగ్యాలు చుట్టుముడతాయి. అలాంటిది ఏ నీటిని వాడారో తెలియని పానీపూరీ బండ్ల వద్ద తిని ఏరికోరి అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం ఎందుకని వైద్యులు ప్రశి్నస్తున్నారు. ఎందుకంటే.. సాధారణంగా చిరువ్యాపారులు ఎక్కడా చేతులకు గ్లౌజులు తొడుక్కోరు. ఒక చేత్తో పొయ్యిపై ఆలూ, శనగలను ఉడకబెడుతూనే అదే చేత్తో ఉప్పు, కారం, మసాలాలు చల్లుతూ పక్కనుండే ఓ నీటి గిన్నెలో చేతులు కడుగుతుంటారు. ఆపై అదే చేత్తో పానీపూరీలను మసాలా నీటిలో ముంచి అందిస్తుంటారు. టీబీ వచ్చే చాన్స్..అపరిశుభ్ర వాతావరణంలో తయారైన ఆçహార పదార్థాలు, పరిసరాల వల్ల క్షయ వ్యాధి వచ్చే ప్రమాదమూ ఉంది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధకులు కూడా చెబుతున్నారు. అపరిశుభ్ర ప్రదేశాల్లో ఉండే బ్యాక్టీరియాలు శోషరస గ్రంథుల్లోకి (లింఫ్ ఎడినైటిస్) చేరితే క్షయ వ్యాధి (ఎక్స్ట్రా పల్మొనరీ) సోకే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. మెనింజైటిస్ వచ్చే ప్రమాదంపానీపూరీలో ఎలాంటి నీళ్లు వాడుతారో తెలియదు. కలుషితమైన నీటిలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఉండే అవకాశం ఉంది. ఇటీవల కేరళలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. దీంతో మెనింజైటిస్ అనే వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువగా చిన్న పిల్లల్లో వస్తుంది. ఇది చాలా ప్రాణాంతక వ్యాధి. – డాక్టర్ నాజ్నీన్ తబస్సుమ్ఇంట్లో చేసుకుంటే మేలు.. పానీపూరీ అంటే ఇష్టమున్నా బయట తింటే అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయని బాధపడుతున్నారా? అయితే ఎంచక్కా ఇంట్లోనే రుచిగా, శుచిగా తయారు చేసుకోండి. ఇందుకు అవసరమయ్యే పదార్థాలన్నీ దుకాణాల్లో దొరుకుతాయి. వాటిని ఎలా తయారు చేయాలో యూట్యూబ్ వీడియోల్లో చూసి నేర్చుకొని ఇంట్లోనే ఎంచక్కా తయారు చేసుకుంటే చాలు. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. మార్కెట్లోకి ఆటోమేటిక్ పానీపూరి డిస్పెన్సర్లు.. ఇటీవల కాలంలో చాలా ప్రాంతాల్లో ఆటోమేటిక్ పానీపూరి డిస్పెన్సర్లు అందుబాటులోకి వచ్చాయి. వెండింగ్ మెషీన్ లాంటి ఈ డిస్పెన్సర్లలో మనం డబ్బు చెల్లిస్తే చాలు పానీపూరి ఆటోమేటిక్‌గా మనం తీసుకుని ఎంజాయ్ చేయొచ్చు. దీనివల్ల కొంతలో కొంత కలుíÙతం కాకుండా ఉంటుంది. కాకపోతే అందులో డిస్టిల్డ్ వాటర్ వాడితే ఎలాంటి సమస్యలు రావని చెబుతున్నారు. గోబీ మంచూరియాపై నిషేధం.. గోబీ మంచూరియాపై ఇప్పటికే దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాలు నిషేధం విధించాయి. గోబీ మంచూరియాను గోవా, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక బ్యాన్ చేశాయి. టార్ట్రజైన్, కార్మోసిన్, సన్‌సెట్ యెల్లో, రోడమైన్ అనే రసాయనాలను గోబీ మంచూరియా తయారీలో వాడుతున్నారని, అవి తీవ్ర అనారోగ్య సమస్యలు తీసుకొస్తాయని గుర్తించారు. గోబీ మంచూరియాతోపాటు పీచు మిఠాయిని కూడా ఆయా రాష్ట్రాలు నిషేధించాయి. వాటిల్లో వాడే రసాయనాలు చిన్నారుల్లో అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయని చెబుతున్నారు. రుచి కాదు.. శుచి ముఖ్యం.. పానీపూరి బండ్లు కొన్ని చోట్ల అపరిశుభ్రమైన వాతావరణంలో ఉంటాయి. చేతులు కడగకుండానే ఇస్తుంటారు. వాటినే చాలామంది రుచిగా తింటారు. అయితే రుచి కాదు.. శుచి ముఖ్యం.. ఈ మధ్య చిన్నపిల్లలు, కాలేజీ విద్యార్థులు ఇష్టంగా తినే మెనూలో పానీపూరి ఉండటం బాధాకరం. – వేణుగోపాల్, బ్యాంకు ఉద్యోగి, ఉప్పల్దుమ్ము, ధూళి వాటిపైనే..పానీపూరీ చాలామంది తింటుంటారు. అందులో వాడే నీరు ఎలాంటిదో ఎవ్వరికీ తెలియదు. పైగా.. ప్లాస్టిక్ ఫోమ్ ప్లేట్లు వాడుతుంటారు. వాటి మీద వేడి పదార్థాలు వేస్తే.. రసాయనాలు కరిగి.. ఆరోగ్య సమస్యలు తెస్తుంటాయి. ఆ బళ్లు కూడా రోడ్ల పక్కనే ఉంటాయి. దుమ్ము, ధూళి వాటిపై పడి కలుషితం చేస్తాయి. – సురేశ్ బొల్లేపల్లి, అంబర్‌పేట -
పానీపూరి లవర్స్ కు బిగ్ షాక్.. తింటే పోతారంట !
-
త్వరలో ఈ రెండు రాష్ట్రాల్లో పానీ పూరీ బ్యాన్!?
బెంగళూరు/చెన్నై: పానీ పూరీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్. కర్ణాటక, తమిళనాడులో పానీ పూరీని బ్యాన్ చేసే దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. పానీ పూరీలో క్యాన్సర్ కారక పదార్దాలు ఉన్నట్టు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.కాగా, పానీ పూరి అనేక వ్యాధులకు కారణమవుతోందని ఫుల్ సెఫ్టీ అధికారులు గుర్తించారు. వీటిని అమ్మేవారు సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పానీపూరీ తిన్న వారు డయేరియా, టైఫాయిడ్, జాండిస్ వంటి వ్యాధులకు గురవుతున్నారు. ఇక, తాజాగా కర్ణాటకలో 250 నమూనాలు సేకరించగా దీనిలో 40 భద్రతా ప్రమాణాలు విఫలమయ్యాయని తేలింది.వీటిలో బ్రిలియంట్ బ్లూ, టార్ట్రాజైన్ వంటి రసాయనాలు కనుగొన్నారు. వీటిలో క్యాన్సర్ కలిగించే పదార్థాలను కనుగొన్నారు. పానీ పూరిలో రంగుల వాడకమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇక, ఇప్పటికే కర్ణాటకలో గోభీ మంచూరియన్, కబాబ్స్ వంటి ఇతర స్నాక్స్‌లలో ఇటువంటి అనేక ఏజెంట్ల వాడకంపై నిషేధం విధించారు.ఇక, తమిళనాడులో కూడా దాదాపు 80 చోట్ల 1500 పానీ పూరీ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదని గుర్తించారు. అలాగే, చాట్ మసాలాలలో ఇథిలీన్ ఆక్సైడ్ ఎక్కువగా కూడా గుర్తించారు. దీంతో, పానీ పూరీని బ్యాన్ చేసే దిశగా ఆలోచిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. -
షాకింగ్ రిపోర్ట్: పానీ పూరీతో కేన్సర్ వస్తుందా?
శివాజీనగర: ఆరోగ్యానికి హానికరమంటూ రాష్ట్రంలో రంగులు వాడి చేసే గోబి మంచూరియా, బొంబై మిఠాయి, చికెన్ కబాబ్‌లను సర్కారు నిషేధించడం తెలిసిందే. పానీపూరిలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయని, త్వరలో చర్యలను ప్రకటిస్తామని తెలిపింది. ఈ జాబితాలో అరబ్ దేశాల వంటకమైన చికెన్ షావర్మా కూడా చేరనుంది. ఆహార భద్రత, వైద్య అధికారులు రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన పలు షావర్మా నమూనాలలో అనారోగ్యానికి కారణమయ్యే బ్యాక్టీరియా, ఈస్ట్‌లు బయటపడ్డాయి. కాబట్టి వాటి విక్రయాలను నిషేధించాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.17 నమూనాలను పరీక్షించగాకొంతకాలంగా బెంగళూరు, మంగళూరు వంటి నగరాలలో షావర్మా షాపులు వెలిశాయి. చికెన్‌ను పెద్ద గోపురం మాదిరిగా ఏర్పాటు చేసి వేడి చేసి ముక్కలుగా కత్తిరించి, చపాతీలో చుట్టి ఇస్తారు. దీనిని సేవించి అస్వస్థతకు గురైన కేసులు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆరోగ్య శాఖ రాష్ట్రవ్యాప్తంగా 17 చోట్లలో శాంపిల్స్‌ను సేకరించగా, 8 శాంపిల్స్‌లో బ్యాక్టీరియా, ఈస్ట్‌లు బయటపడ్డాయి. దీంతో షావర్మా అసురక్షితం అని నిర్ధారించారు. ఆహారాన్ని ఎక్కువసేపు నిల్వ ఉంచితే బ్యాక్టీరియాలు, ఈస్ట్‌లు ఏర్పడతాయి. కేరళలో షావర్మా తిని పలువురు చనిపోయారు కూడా. షావర్మ వ్యాపారులు తప్పనిసరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐలో నమోదు చేసుకోవాలని నిబంధన ఉంది. షాపులో ఆ రిజిస్ట్రేషన్ పత్రం పెట్టకపోతే అమ్మకాన్ని బ్యాన్ చేస్తామని హెచ్చరించినట్లు ఓ అధికారి తెలిపారు. -
మినిమం 30.. తగ్గేదేలే..! ఇది కదా పానీ పూరీ మజా....వీడియో వైరల్
భారతదేశంలో అత్యంత ఇష్టమైన,అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది పానీ పూరీ. ఖట్టా-మీఠా ఇలా వివిధ రకాల రుచులు, స్టఫ్ఫింగ్స్‌తో .. అసలు ఈ పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరాల్సిందే. ఇది కేవలం స్ట్రీట్ ఫుడ్ మాత్రమే కాదు. అదొక ఎమోషన్ చాలామందికి. అలాంటి పానీ పూరీ తాజాగా, అమెరికావాసులను కూడా ఫిదా చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by Curry Corner (@currycornermn) మిన్నియాపాలిస్ వాసులు అక్కడి భారతీయ రెస్టారెంట్ , కర్రీ కార్నర్ వద్ద పానీ పూరీ తెగ లాగించేస్తూ మురిసిపోతున్నారు. ‘ఆహా తినరా మై మైరచి అంటున్నారు. మరికొందరైతే మాటల్లేవు.. అంటూ పానీ పూరీని ఆస్వాదించే పనిలో బిజీగా ఉన్నారు. పానీపూరి ప్యూర్ లవ్ అని అని ఒక ఇన్‌స్టా యూజర్ కామెంట్ చేశాడు. మినిమం 30 పూరీలు ఏగబిగిన లాగించేయాల్సిందే.. 20కి పైగా పానీ పూరీలు తింటూ ఉంటే.. అలా కళ్లవెంబడి నీళ్లు జలజలా రాలిపోతే ఉంటే అప్పుడు గానీ పానీ పూరీ తినడంలోని మజా అర్థం కాదు.. ఇలా పలు కామెంట్లు సందడి చేస్తున్నాయి. పాపులర్ పానీ పూరీని మిన్నియాపాలిస్ వాసులకు పరిచయం చేశాము అంటూ సదరు రెస్టారెంట్ ఇన్‌స్టాలో రీల్ పోస్ట్ చేసింది. ఇటీవల పోస్ట్ చేసిన ఈ రీల్ ఏకంగా 3.9 మిలియన్ల వీక్షణలు, 90వేలకు పైగా లైక్స్ సాధించింది. -
పానీ పూరీ: ఈ అనిల్ భాయ్ లెక్కే వేరు: వైరల్ వీడియో
పానీ పూరీ అంటే ప్రాణం లేచి వస్తుంది చాలామందికి. అయితే పానీ పూరి బండి నడిపే 71 ఏళ్ల వృద్ధుడితో సెల్ఫీల కోసం జనం ఎగబడుతున్నారు. ఆయన పేరే గుజరాత్‌కు చెందిన అనిల్ భాయ ఠక్కర్. ఈ పానీ పూరీ వాలా ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాడు. స్టోరీ ఏంటంటే.. మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారట. అది ఎంతవరకు నిజమోగానీ, గుజరాత్‌కు చెందిన అనిల్ భాయ్ ఠక్కర్ మాత్రం తన సైడ్ ప్రొఫైల్, హెయిర్‌స్టైల్, తెల్లటి గడ్డం, ఆఖరికి డ్రెస్సింగ్ స్టయిల్ కూడా అచ్చం ప్రధాన మంత్రి మోదీ పోలికలతో కస్టమర్లను కట్టిపడేస్తున్నాడు. ఈయన గుజరాత్‌లోని ఆనంద్‌లో ‘తులసి పానీ పూరీ సెంటర్’ను నడుపుతున్నాడు. అచ్చం మోదీలా ఉన్న అనిల్ భాయ్నును స్థానికులంతా పీఎం మోదీ అని పిలుచుకుంటారు. ప్రధాని మోదీతో ఉన్న పోలిక కారణంగా స్థానికులు, పర్యాటకుల నుండి తనకు చాలా ప్రేమ, గౌరవం లభిస్తోంది అంటాడు ఆనందంగా అనిల్ భాయ్. అంతేకాదు ప్రధాని తనకు ఎంతో స్ఫూర్తి పొందానని, పరిశుభ్రతకు ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తారో, అలాగే తన స్టాల్‌ను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటారని అనిల్ భాయ్ చెప్పుకొచ్చాడు. అనిల్ భాయ్ వాస్తవానికి జునాగఢ్‌కు చెందినవాడు. తన తాత ప్రారంభించిన 'తులసి పానీ పూరీ సెంటర్'ను 18 ఏళ్ల వయస్సునుంచే నడిపిస్తున్నాడు. కాగా ముంబైలోని మలాడ్‌కు చెందిన వికాస్ మహంతే కూడా ప్రధాని పోలికలతో ఇటీవల వార్తల్లో నిలిచాడు. గర్భా వాయిస్తున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
పానీ పూరీ ప్రియులకు ఇక పూనకాలే.. వైరల్ వీడియో
పానీ పూరీ అంటేనే చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఇష్టంగా లొట్టలేసుకుంటూ తింటారు. దాని గురించి ఎన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసినా, పానీ పూరీకున్న క్రేజ్ముందు అవన్నీ దిగదిడుపే. అందుకే దుకాణదారులు కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా వెరైటీ పానీపూరీ వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. బంగారం, సిల్వర్ రంగుల్లో పానీపూరీలు తెగ వైరల్అవుతున్నాయి. ఫుడ్ హ్యాండిల్ అనే ఇన్‌స్టా ఖాతా వివరాల ప్రకారం పూరీలపై బంగారు , వెండి రేకులను పూయడం ఇందులో చూడొచ్చు. బెంగళూరుకు చెందిన ఒక వ్యాపారి ఈ సరికొత్త పానీపూరీలను అమ్ముతున్నాడు. గోల్డ్, సిల్వర్ పూతతో పానీపూరీలను విక్రయిస్తున్నాడు. అంతేకాదు ఆ పానీపూరీల్లో డ్రైఫ్రూట్స్, తేనె కూడా జోడిస్తున్నాడు. వీటిని బంగారు రంగు ప్లేట్లోనే పెట్టి అందిస్తుండటం మరో విశేషం. దీన్ని షారియత్ అంటారట. దేశంలోఇదే తొలి హైజీనిక్ పానీ పూరీ అట. ఇప్పటికే 20 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.కొందరు ఆ వ్యాపారి క్రియేటివిటీని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ఇది ‘‘ బప్పి లాహిరి పానీ పూరి అని పిలవాలి అని ఒకరు వ్యాఖ్యానించగా, దీని పేరును కూడా మార్చండి” బ్రో అని మరొక నెటిజన్ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Khushbu Parmar | Manan | CTT (@cherishing_the_taste_) -
స్ట్రీట్ ఫుడ్.. ఆ ‘పాత’ మధురమే..
కుమారి ఆంటీ ఒక్కసారి మన చూపులన్నీ స్ట్రీట్ ఫుడ్ వైపు మరోసారి లాగేసింది కానీ, వీధిలో నిలబడి ఓ కప్పు చాయ్, ఓ సాయంత్రం నాలుగు ప్లేట్ల పానీపూరీ విత్ ప్యాజ్, కాసింత చాట్ .. బాగా వేయించిన ఫిష్ ఫ్రై.. గరం గరం మిర్చి బజ్జీలు, వేడివేడి ఇడ్లీలు, వావ్ అనిపించే వడాపావ్‌లు.. తినని సగటు జీవి ఉంటాడా..∙మన రోడ్లన్నీ ఘుమ ఘుమలాడే రెస్టారెంట్లే కదా.. మన కడుపు నింపే వారి కడుపు నింపుకొని నలభీములు తిరుగాడే ప్లేస్లే కదా.. పల్లె, పట్నం తేడా లేదు. వెజ్ నాన్ వెజ్ తేడాల్లేవు. ఎక్కడికివెళ్లినా రోడ్డు టిఫిన్ సెంటర్ల నుంచి మినీ ‘స్ట్రీట్ హోటళ్ల’ దాకా ఎన్నో .. ధరలు తక్కువ.. ఉన్నంతలో రుచీ ఎక్కువే. అయితే స్ట్రీట్ ఫుడ్‌కు.. రామాయణ, మహాభారతాలకు ఉన్నంత చరిత్ర ఉంది. ఆనాటి నుంచే నగరాల్లోని వీధుల్లో ‘వేయించిన గింజలు, రొట్టెలు’ వంటివి అమ్మేవారట. పాత రుచులపై మొహం మొత్తిన కొద్దీ, జనం పెరిగిన కొద్దీ.. మెల్లగా కొత్త కొత్త రుచులు పుట్టుకొచ్చాయి. స్థానిక ఆచారాలు, ఆహార అలవాట్లను బట్టి ఎక్కడికక్కడ కొత్త వెరైటీలు మొదలయ్యాయి. షాజహాన్ చాట్ ... మొఘలుల కాలం నాటికి స్ట్రీట్ ఫుడ్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందట. షాజహాన్ ఆగ్రా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చినప్పుడు.. వర్తకులు, రోజువారీ పనిచేసుకునేవారు మధ్యాహ్నం కడుపు నింపుకోవడానికి వీలుగా ‘చాట్’ స్టాల్స్‌ను ఏర్పాటు చేయించాడని అంటారు. అలా మొదలైన ‘చాట్’ ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది. గ్రీస్ .. ఫ్రై ఫిష్.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. గ్రీస్ సామ్రాజ్యంలో పది వేల ఏళ్ల కిందే ‘స్ట్రీట్ ఫుడ్’ అమ్మకాలు మొదలయ్యాయట. ప్రధాన రహదారుల పక్కన ్రౖఫై చేసిన చేప ముక్కలను అమ్మేవారట. తర్వాత ఇది రోమ్కు విస్తరించిందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే నాడు ‘స్ట్రీట్ ఫుడ్’ ధనవంతులకేనని, వారు ఇళ్లలో వండుకోకుండా తెప్పించుకుని తినేవారని అంటున్నారు. తర్వాత నగరాలు విస్తరించి, జనాభా పెరిగే కొద్దీ.. ‘స్టాల్స్’ పెరిగిపోయి పేదల ఫుడ్‌గా మారింది. ఈజిప్ట్ బ్రెడ్.. ► క్రీస్తుపూర్వం 1200వ సంవత్సరం సమయంలోనే ఈజిప్ట్‌లోని సిర్సా నగర వీధుల్లో గోధుమ రొట్టెలను అమ్మినట్టు పురాతత్వ తవ్వకాల్లో గుర్తించారు. స్టూడెంట్స్‌కు నంబర్ వన్ స్ట్రీట్ ఫుడ్ ఏనాడో భారత సంస్కృతిలో, చరిత్రలో ఓ భాగమైపోయింది. మెల్లగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకూ విస్తరించింది. కాలేజీ స్టూడెంట్లు, ఉద్యోగులు, రోజువారీ పనిచేసుకునేవారు, ఏదో ఓ పనిపై బయటికి వెళ్లేవారు.. ఇలా అందరికీ ‘స్ట్రీట్ స్టాల్స్’తోనే కడుపు నిండేది. ఇలాంటి వారు ఎక్కువగా ఎక్కడెక్కడ ఉంటారో.. అలాంటి ప్రాంతాలన్నీ స్ట్రీట్ ఫుడ్‌కు అడ్డాలే. ► ఇటీవల వారణాసిలో నిర్వహించిన అధ్యయనంలోనూ ఈ విషయం స్పష్టమైంది. 25–45 ఏళ్ల మధ్య వయసువారిలో 42 శాతం, 14–21 ఏళ్ల మధ్య వయసువారిలో 61 శాతం మంది ఉద్యోగులు, విద్యార్థులు మధ్యాహ్నం పూట ‘స్ట్రీట్ ఫుడ్’తోనే బండి లాగించేస్తామని చెప్పడం గమనార్హం. ► రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న మహారాణా ప్రతాప్ వ్యవసాయ, సాంకేతిక వర్సిటీ విద్యార్థుల ‘స్ట్రీట్ ఫుడ్’ అలవాటుపై ఇటీవల ఓ సర్వే జరిగింది. రుచిగా, ధర తక్కువగా ఉండ టం, త్వరగా తినేయగలగడం, స్నేహితులతో కలసి సరదాగా వెళ్లి తినడం వల్ల ‘స్ట్రీట్ ఫుడ్’కు ప్రాధాన్యత ఇస్తామని 88.3 శాతం మంది యువకులు, 90 శాతం మంది యువతులు వెల్లడించారు. ఫుడ్ పెట్టే... స్ట్రీట్ స్ట్రీట్‌ఫుడ్ విక్రయించేవారు.. అందరి కడుపు నింపుతూ, తామూ పొట్టపోసుకుంటున్నారు. మన దేశంలో స్ట్రీట్ ఫుడ్‌తో ఉపాధి పొందుతున్నవారు కోటి మంది వరకు ఉంటారని అంచనా. ఇందులో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి పెద్ద నగరాల్లోనే 60 లక్షల మంది దాకా ఉన్నారు. ఈ నగరాల్లో రోజూ ఓ పూట బయటే తిని బతుకు వెళ్లదీస్తున్నవారూ లక్షల మంది ఉన్నారు. ► ఇలా అమ్మేవాళ్లు, తినేవాళ్లు కలసి దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికీ ఓ చెయ్యి వేస్తున్నారు. దేశంలో స్ట్రీట్‌ఫుడ్ రోజువారీ వ్యాపారం విలువ రూ.8 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. అంటే ఏడాదికి రూ.30 లక్షల కోట్లపైమాటే. ► దేశంలో ప్రాంతాన్ని బట్టి 2 శాతం నుంచి 10 శాతం మంది జనాభా స్ట్రీట్ ఫుడ్, దానిపై ఆధారపడిన పనులతోనే ఉపాధి పొందుతున్నారు. సాటి లేని వెరైటీ.. దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలనే తేడా లేదు.. సమోసాలు, మిర్చీలు, బజ్జీలు, పానీపూరీ, చాట్, ఇడ్లీ, దోశ వంటివాటితోపాటు కబాబ్‌లు, ఫ్రైడ్ రైస్‌లు, బిర్యానీల దాకా ‘స్ట్రీట్ స్టాల్స్’లో దొరకని వెరైటీలంటూ లేవు. జిలేబీ వంటి స్వీట్లనూ అలా రోడ్డుపక్కన నిలబడి లాగించేయొచ్చు. స్ట్రీట్ ఫుడ్‌లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం.. ఏ నగరానికి ఆ నగరమే ప్రత్యేకం. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పోహా, జిలేబీ కాంబినేషన్ ఊరిస్తే.. ముంబైలో వడాపావ్ నోరూరిస్తుంటుంది. యూపీలో ఆలూ టిక్కీ ఆకర్షిస్తే.. కోల్‌కతా నగర వీధుల్లో చేపల ఫ్రై, కబాబ్ రోల్స్ రారమ్మని పిలుస్తుంటాయి. ► ఒక అంచనా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోకెల్లా ఇండియాలో ఫుడ్ వెరైటీలు ఎక్కువ. పదో, ఇరవయ్యో కాదు.. స్ట్రీట్‌ఫుడ్‌లోనే వందల రకాలు ఉన్నాయి మరి. స్ట్రీట్ ఫుడ్ పండుగే.. ‘నోయిడా ఉత్సవ్’.. ఇక్కడ అన్ని స్ట్రీట్ ఫుడ్లు దొరకబడును! ఢిల్లీ శివార్లలోని నోయిడాలో ఏటా ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు జరిగే ‘నోయిడా ఉత్సవ్’ స్ట్రీట్‌ఫుడ్‌కు వెరీ స్పెషల్. ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండార్స్ ఆఫ్ ఇండియా (నస్వీ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉత్సవంలో.. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన విభిన్నమైన స్ట్రీట్ ఫుడ్‌లన్నీ అందుబాటులో ఉంటాయి. ఆహా.. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా..! -
పానీ పూరీ అమ్మడానికి థార్.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..
భారతీయ మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన థార్ కారుకి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరికిని ఆకర్శించిన ఈ ఆఫ్ రోడర్ కారుని ఒక యువతి పానీ పూరీ అమ్మడానికి ఉపయోగించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం. వీడియోలో గమనించినట్లయితే.. ఒక పానీపూరీ విక్రయించే యువతి తన పానీపూరీ బండిని లాగడానికి మహీంద్రా థార్ ఉపయోగిస్తున్నట్లు చూడవచ్చు. ఈ వీడియోకు ఆనంద్ మహీంద్రా కూడా ఫిదా అయిపోయారు. వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా.. తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా రియాక్ట్ అవుతూ.. ప్రజలు ఎదగటానికి మా కార్లు సహాయపడాలని కోరుకుంటున్నట్లు, ఆ వీడియో తనకు ఎంతగానో నచ్చినట్లు ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ వీడియో చూసి ఆ యువతిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇదీ చదవండి: క్షణాల్లో రోడ్డు వేసేస్తుంది.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా పానీపూరి బండిని గతంలో స్కూటర్‌తో, తర్వాత బుల్లెట్ బైక్‌తో, ఇప్పుడు మహీంద్రా థార్‌తో లాగుతుంది. ఈమె పేరు తాప్సీ ఉపాధ్యాయ్. పనీ పూరి బండిని లక్షల ఖరీదైన కారుతో లాగడం చూసి చాలామంది అవాక్కవుతున్నారు, మరికొందరు మెచ్చుకుంటున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఈ మహీంద్రా థార్ కారుని పానీపూరీ అమ్మి కొనుగోలు చేసింది. What are off-road vehicles meant to do? Help people go places they haven’t been able to before.. Help people explore the impossible.. And in particular we want OUR cars to help people Rise & live their dreams.. Now you know why I love this video…. pic.twitter.com/s96PU543jT — anand mahindra (@anandmahindra) January 23, 2024 -
ఉద్యోగమా? పానీ పూరీ అమ్ముకోవడమా? ఏది బెటర్: వైరల్ వీడియో
కార్పొరేట్, లేదా టెకీ ఉద్యోగం అంటేనే అంతులేని పని ఒత్తిడి. పగలూ రాత్రీ తేడాలేని పనివేళలు,నిబంధనలతో పనిలేకుండా గంటలకొద్దీ అలా పని చేయాల్సిందే. ఇలాంటి సవాలక్ష సవాళ్లు ఉద్యోగం అంటేనే నిస్తేజం. జీవితం గడవాలి కాబట్టి ఎలాగోలా తట్టుకుని నెట్టుకొస్తున్నా ఇటీవలి కాలంలో లేఆఫ్స్ భూతం ఉద్యోగులను మరింత వేధిస్తోంది. ఆర్థికమాంద్యం, ఖర్చుల తగ్గింపు పేరుతో అనేక కార్పొరేట్ కంపెనీలు, ఐటీ దిగ్గజాలు వేలాదిమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరలవుతోంది. యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన మూడు రోజుల్లోనే 20.3 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకోవడం విశేషం. పారిశ్రామికవేత్త హర్షగెయెంకాను ఈ వీడియోను ఆకర్షించింది. ఆయన కూడా ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. కార్పొరేట్ ఉద్యోగం కంటే..పానీ పూరీ విక్రయించుకునే వ్యక్తి జీవితం మేలు అన్నట్టుగా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. కొందరు ఇదొక విషాదకర పరిస్థితి అని అంటే, మధ్య తరగతి వాళ్లతో పోలిస్తే దిగువ మధ్యతరగతి ప్రజలు ధనవంతులు. ఎందుకుంటే వారు ఖర్చు తక్కువ పొదుపు ఎక్కువ చేస్తారని మరొకరు కామెంట్ చేశారు. మరో యూజర్ ఏమన్నారంటే పానీ పూరి వ్యాపారి ఎక్కువ సంపాదించినా కూడా కార్పొరేట్ ఉద్యోగికి గౌరవం లభిస్తుంది. ఇది ఆలోచించాల్సిన విషయం. అలాగే కార్పొరేట్ ఉద్యోగులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన వాతావరణంలో పనతోపాటు ఉద్యోగ భద్రత కూడా ఎక్కువే. టైంకి జీతం రావడం, ఆరోగ్య బీమా, పదవీ విరమణ ప్రణాళికల్లాంటివి ఉంటాయి. (యూట్యూబ్ కింగ్ గౌరవ్ తనేజా గుర్తున్నాడా? మళ్లీ ట్రెండింగ్లోకొచ్చేశాడు!) కార్పొరేట్ ఉద్యోగులు ఉద్యోగపరంగా మరింతపైకి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది గొప్ప వ్యక్తులు, ఇతర నిపుణులతో కలిసి పనిచేయడం లేదా ప్రసిద్ధ కంపెనీలో పని చేయడం అనేది వారికి వ్యక్తిగతంగా తృప్తినిస్తుంది. అయితే కార్పొరేట్ ఉద్యోగిగా ఉండాలా లేక పానీ పూరి వ్యాపారిలా ఉండాలి అనే నిర్ణయం వైయుక్తికమైంది. ఏది మంచి, ఏది చెడు అనేది వారి వారి ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. Why would you be a corporate employee! pic.twitter.com/NY23wLeem8 — Harsh Goenka (@hvgoenka) October 19, 2023 -
పానీపూరీలు అమ్మే యశస్వి జైశ్వాల్ అంటూ! అసలు నిజం ఇదే తెలుసా?
యశస్వీ జైశ్వాల్.. ప్రస్తుతం భారత క్రికెట్లో ఒక యువ సంచలనం. అంతర్జాతీయ క్రికెట్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు ఈ ముంబై బ్యాటర్. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టుతో డెబ్యూ చేసిన జైశ్వాల్.. తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 382 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 171 పరుగులు చేశాడు. సంచలన ఇన్నింగ్స్ ఆడిన జైశ్వాల్‌పై ఇప్పటికీ ప్రశంసల వర్షం కురుస్తోంది. కొంతమంది దిగ్గజ క్రికెటర్లు జైశ్వాల్‌ను ట్రినిడాడ్ యువరాజు, విండీస్ లెజెండ్ బ్రియాన్ లారాతో పోలుస్తున్నారు. ఇక జైశ్వాల్ ఈ స్ధాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉందనే సంగతి తెలిసిందే. అయితే యశస్వీ క్రికెట్ ఫీల్డ్‌లో అదరగొట్టిన ప్రతీసారి.. అతడి పానీ పురీ స్టోరీ బయటకు వస్తోంది. గతంలో యశస్వీ తన క్రికెట్ శిక్షణ కోసం పానీ పూరీలను విక్రయించేవాడని పలుసార్లు మనం వింటూ వస్తున్నాం. ఈ వార్తలను యశస్వి జైస్వాల్ చిన్ననాటి కోచ్ జ్వాలా సింగ్ తోసిపూచ్చాడు. జైస్వాల్ తన జీవనోపాధి కోసం ఎప్పుడూ పానీపూరీలు అమ్మలేదని అతడు చెప్పుకొచ్చాడు. జైస్వాల్ పానీపూరి స్టోరీపై జ్వాలా సింగ్ పూర్తి క్లారిటీ ఇచ్చాడు. అసలు నిజం ఇదే.. "మొదట్లో యశస్వీని ఇంటర్వ్యూ చేయమని చాలా మీడియా సంస్ధలను అడిగాను. కానీ ఎవరూ కూడా తన ఇంటర్వ్యూ చేయడానికి ముందుకు రాలేదు. ఆ సమయంలో నాకు చాల బాధ అనిపించింది. కానీ ఒక రోజు సడన్‌గా కొన్ని ప్రముఖ మీడియా సంస్ధలు నాకు తెలియకుండా జైశ్వాల్‌ను ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నించాయి. ఆ సమయంలో నేను ఇంగ్లండ్‌లో ఉన్నాను. వారు జైశ్వాల్‌ను సంప్రదించగానే అతడు నాకు ఫోన్ చేశాడు. కొంతమంది జర్నలిస్టులు తనను ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారని నాతో చెప్పాడు. అందుకు నేను కూడా సరే అని అన్నాను. ఇంటర్వ్యూలో జైశ్విల్ను కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు అడిగారు. అప్పుడు జైశ్వాల్ తన అమాయకత్వంతో పానీపూరీ సంఘటనను ప్రస్తావించాడు. అయితే జర్నలిస్టులు వారు స్టోరిలకు వెయిటేజీ ఇవ్వడం కోసం పానీపూరీ అంశాన్ని తమ హెడ్‌లైన్స్‌గా ఉపయోగించుకున్నారు. ఆ హెడ్‌లైన్స్ చూసి నేను షాక్ అయ్యా. ఎందుకంటే నేను అతడిని నా కొడుకులా పెంచి అన్ని సౌకర్యాలు కల్పించాను. జైశ్వాల్ అద్భుతంగా ఆడిన ప్రతిసారీ, పానీపూరీ స్టాల్లో ఒక వ్యక్తితో కలిసి ఉన్న ఫోటో బయటకు వస్తోంది. మీడియా సంస్థలు జైశ్వాల్ పక్కన ఉన్న వ్యక్తి తన తండ్రి అని ప్రచురిస్తాయి. అతడు జైశ్వాల్ తండ్రి కాదు. అది అనుకోకుండా దిగిన ఫోటో. జైశ్వాల్ తండ్రి ఎప్పుడూ జీవనోపాధి కోసం పానీపూరీలు అమ్మలేదు. జైశ్వాల్ కూడా ఎప్పుడూ పానీపూరీలు అమ్మలేదు. ఈ విషయాన్ని చాలా సార్లు తెలియజేశాం. 2013లో జైశ్వాల్ నాతో క్రికెట్ శిక్షణ ప్రారంభించాడు. జైశ్వాల్ ముంబైకి వచ్చిన మొదటిలో ఓ టెంట్లో నివసించేవాడు. ఆ సమయంలో కరెంటు,సరైన ఆహారం వంటి కనీస సౌకర్యాలు కూడా లేవు. వర్షాకాలంలో వారు వేసుకున్న టెంట్ నీటితో నిండిపోయేది. జైశ్వాల్ తన చిన్నతనంలో ఓ దుఖణాంలో పనిచేసేవాడు. అతని తల్లిదండ్రులు అతనికి ప్రతి నెల రూ. 1000 రపాయలు పంపేవారు. అయితే ఎప్పుడైతే అతడు నాతో క్రికెట్ శిక్షణను ప్రారంభించాడో అతడి కష్టాలు కొంతవరకు తీరాయి. గత 10 సంవత్సరాలుగా యశస్వినిని చూస్తున్నానని, U-19 ప్రపంచ కప్ 2020కి ముందు పానీపూరీ అమ్మినట్లుగా కథనాలు రాశారు. ఈ రకమైన స్టోరీలు అతనికి సహాయం చేసిన వ్యక్తులను కించపరుస్తాయి. అతడు ఈ స్ధాయికి చేరుకోవడానికి నేను నా వంతు కృషి చేశాను. నా జీవితంలో విలువైన 9 ఏండ్ల కాలన్ని యశస్వీకి ఇచ్చాను. అయితే చివరగా జైశ్వాల్‌ను ఈ స్ధాయిలో చూడడం చాలా సంతోషంగా ఉంది అని తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్వాలా సింగ్ పేర్కొన్నాడు. చదవండి: IND vs WI: టీమిండియాతో టీ20 సిరీస్.. వెస్టిండీస్‌కు గుడ్ న్యూస్! విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు -
పానీపూరీ గురించి నమ్మలేని నిజాలు.. ఇంత చరిత్ర ఉందా?
పానీపూరి.. ఈ పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరుతాయి. పానీపూరీ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. మన దేశంలో ఎన్ని వెరైటీలు ఉన్నా ఇప్పటికీ పానీపూరీనే చాలామందికి ఫేవరెట్ స్ట్రీట్‌ఫుడ్. గోల్ గప్పా, గప్ చుప్ అని వివిధ పేర్లతో దీన్ని పిలుస్తుంటారు. సాయంత్రం అయిందంటే చాలు వీధి చివరన పానీపూరీ బండి వద్ద జనాలు గుమిగూడతారు. లొట్టలేసుకొని మరీ పానీపూరీని ఆరగిస్తుంటారు. ఎంతో ఇష్టంగా తినే పానీపూరీ వంటకం ఇప్పటిది కాదట. మహాభారత కాలం నుంచే ఉందట. మరి అప్పట్లో పానీపూరీని కనిపెట్టింది ఎవరు? ఏంటా స్టోరీ అన్నది ఇప్పుడు చూద్దాం. పురాణాల ప్రకారం.. పానీపూరీని ద్రౌపది తొలిసారిగా కనిపెట్టిందని అంటారు.పెళ్లయ్యాక అత్తగారింటికి వచ్చిన ద్రౌపదికి కుంతీదేవి ఓ టాస్క్ ఇచ్చిందట. మిగిలిపోయిన ఒక ఆలుగడ్డ, ఒక్క చనాతీకి మాత్రమే సరిపడా పిండిని అందించి తన ఐదుగురు కొడుకుల ఆకలిని తీర్చి భర్తల మెప్పు పొందాల్సిందిగా సవాల్ విసురుతుందట. అప్పుడు ద్రౌపది ఉన్న వస్తువులతోనే చిన్నచిన్న పూరీలు చేసి భర్తల ఆకలిని తీర్చిందట. ద్రౌపది తెలివికి మెచ్చుకున్న కుంతిదేవి ద్రౌపది కనిపెట్టిన పానీపూరీ శాశ్వతంగా ఉండిపోతుందని దీవించిందట. అప్పట్నుంచి పానీపూరీ ప్రజలకు పరిచయం అయ్యిందని అంటుంటారు. -
క్రిస్పీ..క్రిస్పీ పానీ పూరీ లవ్: గూగుల్ డూడుల్ ఇంటరాక్టివ్ గేమ్
పానీ పూరీ, గోల్ గప్పా, ఫుచ్కాస్ పేరేదైనా ఈ మాట వివగానే నోట్లో ‘పానీ’ ఊరాల్సిందే కదా? దేశ వ్యాప్తంగా అంత పాపులారిటీ ఉంది పానీ పూరీకి. భారతదేశం అంతటా పలు ప్రాంతాల్లో రకరకాలుగా పిలుచుకున్నప్పటికీ స్ట్రీట్ ఫుడ్‌లో ఇదే రారాణి. అందుకే సెర్చి ఇంజీన్ దిగ్గజం గూగుల్ కూడా ప్రాధాన్యత ఇచ్చింది. ఇంటరాక్టివ్ గేమ్ డూడుల్ పానీ పూరీని వేడుక జరుపుతోంది.ఇంటరాక్టివ్ గేమ్ డూడుల్‌లో, ప్రత్యేకమైన గేమ్‌తో 'పానీ పూరీ' వేడుక జరుపుతోంది. 2015, జూలై 12న మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఒక రెస్టారెంట్ 51 రకాల పానీ పూరీ రుచులను అందించి ప్రపంచ రికార్డ్‌ను సాధించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, ఎనిమిదో వార్షికోత్సవంగా ఈ విశేషమైన రికార్డును సెలబ్రేట్ చేస్తోంది. ఇందుకోసం ఇంటరాక్టివ్ గేమ్‌ను ఆడే అవకాశాన్ని వినియోగదారులకు అందిస్తోంది. ఇంటరాక్టివ్ గేమ్ డూడుల్‌లో పానీ పూరీ ఆర్డర్ ఇవ్వొచ్చు. తద్వారా వీధి వ్యాపారులకు సాయం చేయడంతోపాటు, ప్రతి కస్టమర్‌ను సంతోషంగా ఉంచాలనేది ప్రధాన లక్ష్యంమని గూగుల్ తెలిపింది. వినియోగదారులు వారి రుచి , పరిమాణం ప్రాధాన్యతకు సరిపోయే పూరీలను ఎంచుకోవాల్సి ఉంది. ఈ ఇంటర్యాక్టివ్ గేమ్ ఆడాలంటే గూగుల్ డాట్ కామ్‌కు లాగిన్ చేయండి పైన ఉన్నడూడుల్పై క్లిక్ చేయండి టైమ్, లేదా రిలాక్స్డ్ తింటారా అనే మోడ్ ఎంచుకోవాలి? సరైన పానీ పూరీ ఫ్లేవర్‌పై క్లిక్ చేయడమే.. ద్రౌపది క్రియేటివిటీకి ప్రతి రూపమే పానీ పూరీ అంతేకాదు ఈ పానీ పూరీకి పెద్ద చరిత్రే ఉందట, పురాణ మహాభారత కాలంలో కొత్తగా పెళ్లయిన ద్రౌపదికి తన ఐదుగురు భర్తలకు ఉన్న కొద్ది వస్తువులతోనే ఏదైనా కొత్తగా వండి పెట్టాలనే చాలెంజ్ వచ్చిందంట. ముఖ్యంగా కొద్దిగా మిగిలిన బంగాళదుంపలు, ఇతర కూరగాయలు, చాలా కొంచెం గోధుమ పిండితోనే చేయాలి. ఇక్కడే ద్రౌపది తన క్రియేటివిటీని ప్రదర్శించింద. ఆలూ,ఇతర కూరలతో స్టఫింగ్ తయారు చేసి, ఉన్న కొద్దిపాటి పిండితోనే పూరీలు చేసి పెట్టిందట. అలా పానీ పూరీ తయారైందని గూగుల్ పేర్కొంది. ఆహా అనరా మైమరచి కాగా మహారాష్ట్ర , ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉడికించిన ఆలూ, చిక్పీస్ మిశ్రమాన్ని పూరీలో స్టఫ్ చేసి, పుదీనా, చాట్ మలాసా యాడ్ చేసి, కారం కారంగా, వేడి వేడిగా ఉండే పానీలో ముంచి, పైన అలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని క్రిస్పీ పూరీని అలా అమాంతం నోట్లో వేసుకుని, కర కర మంటూ నమిలి మింగుతూ ఉంటే ఆహా.. అనరా మైమరచి అంటారు. ఉత్తర భారతంలో పంజాబ్, జమ్మూ అండ్ కశ్మీర్, న్యూ ఢిల్లీలలో, బంగాళాదుంపలు చిక్‌పీలను మిశ్రమం, జల్జీర నీటిలో ముంచిన ట్రీట్‌నే గోల్ గప్పే లేదా గోల్ గప్పా అంటారు. దీన్నే పుచ్‌కాస్ లేదా ఫుచ్కాస్ అని పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాలలో పిలుస్తారు. అన్నట్టు దీనికి చింతపండు గుజ్జు, బెల్లంతో చేసిన ‘స్వీట్’ కొసమెరుపు. -
డేంజర్.. వర్షకాలంలో రోజూ పానీపూరీ తింటున్నారా?
పానీపూరి అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాధారణంగానే సాయంత్రం కాగానే వీధి చివర్లోని పానీపూరీ బండి వద్ద గుమిగూడుతుంటారు. ఇక మరీ ముఖ్యంగా వర్షాకాలంలో పానీపూరి క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు.కాస్త చినుకులు పడగానే పానీపూరీల కోసం జనాలు ఎగబడతారు. అయితే వర్షాకాలంలో పానీపూరీ తినడం డేంజర్ అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. పానీపూరీ అంటే ఆహా ఓహో అంటూ లొట్టలు వేసుకొని తినేవాళ్లు చాలామందే ఉంటారు. తినేటప్పుడు అది ఎలా తయరుచేశారో, ఆ తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యల గురించి ఏమాత్రం ఆలోచించరు. అయితే ఇలా అడ్డగోలుగా ఎక్కడపడితే అక్కడ పానీపూరీ తింటే మాత్రం రోగాల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పానీపూరీలు అమ్మే స్థలం పరిశ్రుభంగా లేకపోయినా, తయారు చేసే వ్యక్తికి ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా అవి మీకు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలంలో పానీపూరీలు తినాలనుకుంటే మాత్రం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. లేదంటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అపరిశుభ్రమైన నీళ్లు తాగడం వల్ల టైఫాయిడ్, ఉదర సంబంధిత వ్యాధులకు గురవుతారు. ► పానీపూరీకి ఉపయోగించే నూనె మంచిది కాకపోతే డేంజరే. ఎందుకంటే స్ట్రీట్ వెండర్స్ చాలావరకు ఒకసారి వాడిన నూనెను మళ్లీమళ్లీ ఉపయోగిస్తుంటారు. ఇలా నూనెను ఎక్కువసార్లు వేడి చేయడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ► పానీపూరీలో పాన్ మసాలా కలుపుతారు అన్న విషయంలో చాలా మందికి తెలియదు. ఇది క్యాన్సర్‌కు కారకం అవుతుంది. ► పానీపూరీలో సోడియం ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజూ తినడం వల్ల ఉదర సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. ► వీటితో పాటు అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. ఇది కేవలం పానీపూరీకే వర్తించదు. అన్ని రకాల స్ట్రీట్ ఫుడ్స్, పరిశ్రుభత పాటించని హోటళ్లు చాలానే ఉన్నాయి. వీటివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే బయటి ఫుడ్‌కు దూరంగా ఉండటమే మంచిదంటున్నారు నిపుణులు. -
ఐస్‌క్రీమ్ పానీపూరీ! ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి
ఐస్‌క్రీమ్ పానీపూరీ కావలసినవి: ఐస్ క్రీమ్ – పావు కప్పు చొప్పున 2 రకాలు (ముందుగానే నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్.. కాస్త మెల్ట్ అయ్యాక కవర్లో వేసుకుని.. కోన్ లా చేసుకుని కాసేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి) పానీపూరీ – 10 లేదా 15 డార్క్ సెమీ స్వీట్ చాక్లెట్ – 300 గ్రా. (ఒక వంద గ్రాములు తురుములా కోరి పక్కనే పెట్టుకోవాలి) కమలాపండు తొనలు – 10 (గార్నిష్ కోసం) చాక్లెట్స్ చిప్స్, టూటీ ఫ్రూటీ, డార్క్ స్ప్రింకిల్స్ కలర్ స్ప్రింకిల్స్ – 3 టేబుల్ స్పూన్ల చొప్పున (అభిరుచిని బట్టి) తయారీ విధానం: ముందుగా ఓవెన్ లో 200 గ్రాముల డార్క్ సెమీ స్వీట్ చాక్లెట్ కరిగించి, ప్రతి పానీపూరీని కాస్త చిదిమి, దానికి మొత్తం చాక్లెట్ క్రీమ్ పట్టించి, ఆ పూరీలన్నిటినీ పావుగంట పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అనంతరం ప్రతి పానీపూరీలో రెండు ఐస్ క్రీమ్స్ నింపుకుని, చాక్లెట్ తురుము, కమలాపండు తొనలతో గార్నిష్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి చాక్లెట్స్ చిప్స్, టూటీ ఫ్రూటీ, కలర్ స్ప్రింకిల్స్, డార్క్ స్ప్రింకిల్స్ వాటిపై వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. (చదవండి: సూపర్ స్నాక్స్.. తమలపాకు గారెలు తయారీ ఇలా) -
పానీపూరీలు అమ్ముకుంటున్న వైద్యురాలు.. ఎందుకంటే..
ఓ లేడీ డాక్టర్ రోడ్డుపై పానీపూరి బండి పెట్టుకుని పానీపూరీలు అమ్ముకుంటోంది. ఆ బండి పైనే బోర్డుపై ప్రైవేటు డాక్టర్ అని కూడా రాసి ఉంది. ఆమె తోపాటు పనిచేసిన సిబ్బంది పక్కనే టీ అమ్ముకుంటూ కనిపించారు. అక్కడ ఉన్న వేలాది మంది వైద్యులు రోడ్డుపై ఇలా వివిధ వ్యాపారాలు చేసుకుంటూ కనిపించారు. అక్కడ ఆ వైద్యులు ఇలా చేయడానికి పెద్ద కారణమే ఉంది. వివరాల్లోకెళ్తే.. రాజస్తాన్‌లోని ప్రైవేటు ఉద్యోగులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా వినూత్నంగా నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సికార్ జిల్లాకు చెందిన ఓ లేడీ డాక్టర్ ఆస్పత్రికి తాళం వేసి మరీ ఇలా పానీపూరీలు అమ్ముకుంటోంది. అక్కడ ఉన్న మిగతా ప్రైవేటు వైద్యులంతా ఆస్పత్రులకు తాళం వేసి ఇలానే టీ, పానీపూరీలు, కోడుగుడ్లు స్టాల్స్ పెట్టుకుని నిరసనలు తెలుపుతున్నారు. ఆ స్టాల్స్‌పై ఏర్పాటు చేసిన బోర్డుపై ప్రైవేటు డాక్టర్లమని రాసి ఉంటుంది. ఆస్పత్రి యాజమాన్యం సైతం ఇలానే చేస్తూ తమ నిరసన తెలుపుతున్నారు. వాస్తవానికి అక్కడ రాజస్తాన్ ప్రభుత్వం రైట్ టు హెల్త్ అనే బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లు ప్రకారం ప్రతి పౌరుడు ఎలాంటి చార్జీలు లేకుండా ఎక్కడైనా అత్యవసర వైద్యం పొందొచ్చు. దీన్ని రాజస్తాన్‌లోని ప్రైవేటు ఉద్యోగులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేటు వైద్యుల బృందం ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయకూడదని డిమాండ్ చేస్తూ..ఇలా విభిన్నంగా ర్యాలీలు చేపట్టారు. ఈ చట్టం పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు రాజస్తాన్ ప్రభుత్వం యత్నిస్తుందంటూ ఆరోపిస్తున్నాయి. ఈ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ వైద్యుల డిమాండ్ చేస్తున్నారు. అంతేగాదు సోమవారం రాజస్తాన్‌లోని మొత్తం వైద్య సదుపాయాలను మూసి వేసి..ఇలాంటి నిరసనలే పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. పైగా ఈ నెల 29న దేశంలోని కొన్ని రాష్ట్రాల నుంచి వైద్యుల బృందాలు ఈ నిరసన కోసం రాజస్తాన్‌కు వస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీనిపై రాజస్తాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాత్రే తనను కలవాలని వైద్యులకు చెప్పినా.. వాని నుంచి ఎలాంటి స్పందన లేదు. అలాగే ఆదివారం మీడియా ద్వారా ప్రభుత్వం వైద్యులందరిని విధుల్లోకి రావాల్సిందిగి విజ్ఞప్తి చేసినా..అందుకు కూడా వైద్యులు ప్రతిస్పందించ లేదు. దీంతో ప్రభుతం ఈ నిరసనలను అణిచివేసేందుకు సన్నహాలు ప్రారంభించినట్లు అధికారిక వర్గాల సమాచారం. (చదవండి: జైలు నుంచి రాను..ఆ శిక్ష ఏదో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విధించండి) -
Viral Video: మోదీతో కలిసి పానీపూరీ రుచి చూసిన జపాన్ ప్రధాని
న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని ప్యుమియో కిషిదా వన విహారం చేశారు. రాష్ట్రపతిభవన్ వెనక ఉన్న సెంట్రల్ రిడ్జ్ రిజర్వ్‌ఫారెస్ట్ పరిధిలోని బుద్ధ జయంతి పార్క్‌లో ఇరు నేతలు కొద్దిసేపు కలియతిరిగారు. గౌతమ బుద్ధుని 2,500వ జయంతిని పురస్కరించుకుని చాన్నాళ్ల క్రితం ఈ పార్క్‌ను అభివృద్ధిచేశారు. పార్క్‌లోని బుద్దుని ప్రతిమకు నేతలు నివాళులర్పించారు. బోధి వృక్షం మొక్కను కిషిదాకు మోదీ బహూకరించారు. పార్క్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన స్టాల్లో వివిధ రకాల భారతీయ తినుబండారాలను కిషిదా రుచిచూశారు. ఇందులో భారత వీధుల్లో ఎక్కవ ఫేమస్ అయిన చిరుతిండి పానీపూరీని (గోల్గప్పా) ఇరు నేతలు ఆరగించారు. రెండు పానీపూరీ తిన్న తర్వాత మరొకటి అడిగి తినడం వీడియోలో కనిపిస్తుంది. ఇదే కాకుండా వేయించిన మామిడికాయల గుజ్జు రసాన్ని, లస్సీ తాగారు. ఫ్రైడ్ ఇడ్లీ కూడా తిన్నారు. తర్వాత బెంచ్‌పై కబుర్లు చెప్పుకుంటూ చాయ్ తాగారు. ఈ పార్క్‌ను 1964 అక్టోబర్‌లో నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ప్రారంభించారు. కాగా రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ ప్రధానమంత్రి ప్యుమియో కిషిదా సోమవారం ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. భారత్–జపాన్ అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఇరు దేశాల ప్రధానులు ప్రతినబూనారు. రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలతోపాటు ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిర, స్వేచ్ఛాయుత వాతావరణం పరిడవిల్లేలా చూసేందుకే ద్వైపాక్షిక చర్చలు సాగించినట్లు ఇరు దేశాధినేతలు ప్రకటించారు. ఇండో– పసిఫిక్ ప్రాంతాన్ని తన ఆధిపత్య నీడలోకి తెచ్చేందుకు సాహసిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు, ఉక్రెయిన్ యుద్ధంతో ఉద్రిక్తతలు నెలకొన్న అంతర్జాతీయ సమాజంలో శాంతి స్థాపనకు తమ వంతు కృషిచేసేందుకు జపాన్, భారత్‌లు ముందుకొచ్చినట్లు నేతలు తెలిపారు. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi) -
బీటెక్ అమ్మాయి.. బుల్లెట్‌పై హైజీనిక్ పానీపూరి
ఈ మధ్య చదువులకు, చేసే పనికి సంబంధం ఉండటం లేదు. డిగ్రీలున్నా ఉద్యోగ అవకాశాలు లేక కొందరు చిరు వ్యాపారాలతో స్వయం ఉపాధి చూసుకుంటుంటే మరికొందరు మాత్రం డిగ్రీ చేసినా ప్రత్యేకమైన లక్ష్యంతో చిరువ్యాపారాల బాట పడుతున్నారు. 21 ఏళ్ల తాప్సీ ఉపాధ్యాయ్.. బీటెక్ పానీపూరి వాలీగా ప్రసిద్ధి చెందారు. బుల్లెట్ బండికి ఏర్పాటు చేసుకున్న చిన్న బండిపై ఆమె పానీపూరీలను విక్రయిస్తున్నారు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఆమె ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతోనే తాను ఈ వ్యాపారాన్ని ప్రారంభినట్లు తాప్సీ చెబుతున్నారు. (జీవితాంతం ఒంటరిగానే ఉంటా కానీ! హోలీ యాడ్‌పై దుమారం: అసలేమైంది?) ఇదీ చదవండి: టాప్ సీక్రెట్ చెప్పిన గూగుల్ మాజీ వైస్ ప్రెసిడెంట్... ఇది ఉంటే జాబ్ పక్కా! View this post on Instagram A post shared by Are you hungry (@are_you_hungry007) తాజాగా ఆమె బుల్లెట్ వాహనానికి పానీపూరి బండిని కట్టుకుని తీసుకెళ్తున్న వీడియోను ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. అంత చదువు చదువుకుని ఇలా పానీపూరీ అమ్ముకుంటున్నావేంటి అని చాలా మంది ప్రశ్నించారని, కొందరైతే భద్రంగా ఉండాలంటే ఇంటికి తిరిగి వెళ్లాలని సలహా ఇచ్చారని తాప్సీ చెప్పారు. ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి దాదాపు మూడు లక్షల లైక్‌లు వచ్చాయి. ఆ యువతి స్ఫూర్తిని అభినందిస్తూ పలువురు కామెంట్లు పెట్టారు. -
అసలే వర్షాకాలం.. లొట్టలేసుకుని పానీపూరి తింటున్నారా?.. జాగ్రత్త!
సాక్షి, మెదక్: చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ అందరూ పానీపూరిని ఇష్టపడతారు. స్పైసీగా ఉండటంతో దీన్ని తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అయితే చాలా బండ్ల యజమానులు కలుషిత నీటిని వినియోగిస్తుండటంతో ప్రజలు టైఫాయిడ్, ఉదర సంబంధిత వ్యాధులకు గురవుతూ విషజ్వరాలతో మంచం ఎక్కుతున్నారు. పట్టణాలు, గ్రామాల్లో వెలసిన పానీపూరి బండ్లపై అధికారుల తనిఖీలు లేకపోవడంతో యజమానులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు టైఫాయిడ్ వంటి జ్వరాలు వస్తుండటంతో పలువురు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. వర్షాకాలంలో పానీపూరీ తినవద్దని గతంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాస్ ప్రకటన ఇవ్వడంతో అందరి దృష్టి పానీపూరిపై పడింది. ఊసేలేని అధికారుల తనిఖీలు ►ఆహారభద్రత చట్టం కింద జిల్లాలో ఫుడ్ సేప్టీ అధికారులు హోటళ్లు, ఇతర తినుబండారాలు అందించే ఏ దుకాణాన్ని అయినా తనిఖీ చేసే అధికారం ఉంది. పురపాలికల్లో వైద్యాధికారులు, గ్రామాల్లో పంచాయతీ అధికారులు తనిఖీ చేయొచ్చు. పెద్దపెద్ద హోటళ్లపై అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తున్నప్పటికీ తోపుడు బండ్లపై తనిఖీలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ►సిబ్బంది కొరత.. చిరు వ్యాపారుల పొట్టగొట్టడం ఎందుకన్న మానవతా దృక్పథంతో అధికారులు పానీపూరీ, చాట్ బండారాల దుకాణాల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో పలు దుకాణాల వారు, తోపుడు బండ్ల వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారు. ►జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఫుడ్ సేప్టీ అధికారులు పానీపూరి బండ్లతో పాటు వీధుల్లో తినుబండారాల దుకాణాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. అప్రమత్తంగా ఉండాలి యువత, చిన్నపిల్లలకు పానీపూరీ తినడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. దుకాణం వద్ద అపరిశుభ్రంగా ఉన్నా రోజూ సాయంత్రం తినడం రివాజుగా మారింది. వర్షాకాలంలో పానీపూరి తినకపోవడమే మంచిది. యజమానులు షాపుల వద్ద పరిశుభ్రంగా ఉంచాలి. శుద్ధమైన నీటినే వినియోగించాలి. ప్రజలు సైతం వారి ఆరోగ్యంపై వారే బాధ్యత తీసుకొని మెలగాలి. – సత్యనారాయణ, ఆస్పత్రి సూపరింటెండెంట్, సదాశివపేట -
ఎంచక్కా పానీపూరీలు లాగించేస్తున్న గజేంద్రుడు
పానీపూరీ గురించి తెలియనివారు ఎవరు ఉండారు. సగాని పైగా ఆ స్నాక్స్ అంటే పడి చచ్చేవాళ్లే. అలాంటి పానీపూరిని ఒక ఏనుగు ఎంతో ఇష్టంగా లాగించేస్తోంది. సదరు బండివాడు చక్కగా సర్వ్ చేస్తుంటే ...చక్కగా ఒక్కొక్కటి నోట్లో వేసుకుని ఎంజాయ్ చేస్తూ...లాగించేస్తోంది. ఈ ఘటన అస్సాంలోని తేజ్‌పూర్‌లో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఏనుగు మార్కెట్లో ఉన్న పానీ పూరీ బండి వద్దకు వచ్చి మరీ పానీపూరీలను తింటోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. Elephant enjoying pani puri in Guwahati.#guwahati #elephant #panipuri pic.twitter.com/AJz3RVwlBa — Trolls Officials (@trollsofficials) October 12, 2022 (చదవండి: పులితో పరాచకాలు వద్దు! దాడి చేస్తే ఖతమే!) -
పానీపూరి తిని 100 మందికి అస్వస్థత!
కోల్‌కతా: పానీపూరి అంటే చాలా మంది ఇష్టపడతారు. లొట్టలేసుకుంటూ తింటారు. వీధుల్లో పానీపూరి బండి కనిపించిందంటే చాలు.. నోట్లో నీళ్లురూతాయి. అయితే, అదే పానీపూరి 100 మందికిపైగా ప్రాణాల మీదకు తెచ్చింది. స్ట్రీట్ స్టాల్లో పానీపూరి తిని మూడు గ్రామాల్లో 100 మందికిపైగా అస్వస్థతకు గురైన సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని సుగంధ గ్రామపంచాయతీ పరిధి డొగచియాలో ఓ వీధి బండి వద్ద బుధవారం చాలా మంది పానీపూరి తిన్నారు. వారిలో దాదాపు అందరు సాయంత్రానికి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. నీటి కాలుష్యం వల్ల కలిగే డయేరియాగా వైద్యులు అనుమానిస్తున్నారు. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించినట్లు చెప్పారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న స్థానిక ఆరోగ్య శాఖ సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకుని ఔషధాలు అందించారు. పలువురు తీవ్రంగా ప్రభావితమైన క్రమంలో ఆసుపత్రిలో చేరాలని సూచించారు. అస్వస్థతకు గురైన వారిలో డొగచియా, బహిర్ రనగచా, మకల్టాలా గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. ఇదీ చదవండి: Actress Kamya Punjabi: పానీపూరి మైకంలో లక్ష రూపాయలు మరిచిపోయిన నటి.. -
ఉన్న ఊరిని... వ్యవసాయాన్ని వదిలి
వరుణుడు కరుణించలే.. నమ్ముకున్న భూమాత గుప్పెడు గింజలివ్వలే...ఉన్న ఊరు జానెడు పొట్టను నింపలే... చేసేదేమీ లేక పొట్ట చేత పట్టుకుని అయిన వారినంతా వదిలి బతుకు జీవుడా అంటూ వలసి వచ్చారు. ఊరుగాని ఊరులో తెలియని వ్యక్తుల మధ్య కొత్త జీవితానికి నాంది పలికారు. నేడు నలుగురు మెచ్చే స్థాయికి ఎదిగారు. మెరుగైన జీవనంతోపాటు నాలుగు కాసులు వెనకేసుకుంటూ కన్నబిడ్డలను తమలాగా కాకుండా నాలుగు అక్షరం ముక్కలను నేర్పించుకుంటూ జీవనయానం సాగిస్తున్నారు. కడప ఎడ్యుకేషన్: అన్నమయ్య జిల్లా మదనపల్లె, తంబళ్లపల్లె నియోజక వర్గాల పరిధిలోని 50 గ్రామాలకు చెందిన దాదాపు వెయ్యి కుటుంబాల వారు పానీ పూరి బండ్లే జీవనోపాధిగా ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరంతా గత 18 ఏళ్లకు పైగా కడపతోపాటు జిల్లాలో పలు నియోజకవర్గ, మండల కేంద్రాలలో పానీపూరీ బండ్లను ఏర్పాటు చేసుకుని స్థిర జీవనాన్ని సాగిస్తున్నారు. నీటి వసతి లేక ఉన్న ఊరిని వదిలి... మదనపల్లె, తంబళ్లపల్లె నియోజక వర్గ పరిధిలో దండోరుపల్లె, కురువపల్లె, రెడ్డింపల్లె, బాటవారికురువపల్లె, అమరేపల్లె, వాయల్పాడు, సీటీఎం, బి. కొత్తకోట, పెద్దతిప్ప సముద్రంతోపాటు దాదాపు 50 గ్రామాల పరిధిలో రైతులందరూ వ్యవసాయమే జీవనోపాధిగా జీవనం సాగించేవారు. ప్రతి రైతు రెండు నుంచి ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న ఆసాములే. అయితే రానురాను సకాలంలో వర్షాలు లేక, సరైన నీటి వసతి లేక.. పంటలు పండక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. దీంతో చేసేదేమీ లేక వలసలు పోవాల్సి వచ్చేది. ఈ తరహాలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 20 ఏళ్ల క్రితం కడపకు వలసి వచ్చి పానీపూరీ బండితో జీవనాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత అతని బంధువులు ఇలా ఒక్కొక్కరికిగా ఎవరి అçనుకూలమై స్థావరానికి వారు వెళ్లి పానీపూరీ బండ్లను ఏర్పాటు చేసుకుని బతుకు వెళ్లదీస్తున్నారు. ఇలా వలస వచ్చిన వారే వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా దాదాపు వెయ్యి కుటుంబాల వారున్నారు. ఉదయమంతా పానీపూరి తయారీ... సాయంత్రం బండ్ల నిర్వహణ... వలస వచ్చిన వారంతా ఉదయాన్నే పానీపూరి నిర్వహణకు కావాల్సిన కూరగాయలు, సరకులు మార్కెట్ నుంచి తెచ్చుకుని పూరీలు, పానీ, మసాలాలతోపాటు కావాల్సిన వస్తువులన్నీ వారే సొంతంగా సిద్ధం చేసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి నగరంలోని ప్రధాన కూడళ్లలో వారు వారు ఎంచుకున్న స్థావరాల్లో బండ్లను ఏర్పాటు చేసుకుని వ్యాపారాన్ని సాగిస్తారు. రాత్రి 9 గంటలకంతా వ్యాపారాన్ని ముగించుకుని ఇళ్లకు చేరిపోతారు. కూలీ, ఖర్చులు పోను ఇలా ఒక్కో బండిపైన రోజుకు వెయ్యి నుంచి 15 వందల రూపాయల వరకు ఆదాయం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అంతా ఒకే కులానికి చెందిన వారే... వలస వచ్చిన వారిలో ప్రత్యేకతేంటంటే వేరే వేరే ఊళ్లకు చెందిన వారైనా సరే అంతా ఒకే కులానికి చెందిన వారు కావడం విశేషం. పానీపూరి బండి నిర్వహణ ను ప్రధాన వృత్తిగా మలుచుకుని జీవిస్తున్నారు. 18 ఏళ్ల క్రితం పొట్ట చేతపట్టుకుని... నాపేరు కొల్లె రమణయ్య. మాది దండువారిపల్లె గ్రామం. నాకు మా గ్రామంలో రెండు ఎకరాల పొలం ఉండేది. ఆ పొలం వర్షాధారంతోనే పండేది. వర్షాలు సరిగా రాకపోవడంతో ఉన్న పొలం పండక బీడుగా ఉండేది. జీవనం కష్టం కావడంతో చేసేదేమీ లేక 18 క్రితం పొట్ట చేతపట్టుకుని కడపకు వలస వచ్చాను. అప్పట్లో పానీ పూరి బండిని ఏర్పాటు చేసుకుని ప్లేటు పానీపూరి రూపాయితో వ్యాపారాన్ని మొదలు పెట్టాను. తరువాత నా కుమారులు ఇద్దరితో కూడా ఇదే వ్యాపారాన్ని పెట్టించాను. ఇప్పుడు జీవనం బాగానే ఉంది. ఉన్న ఊరిలో బతకలేక... నా పేరు తొల్లగోర్ల శ్రీరాములు. మాది బి.కొత్తకోట మండలం రాపూరివారిపల్లె. నాకు మా గ్రామంలో 3 ఎకరాల పొలం ఉంది. కానీ నీటి వసతి లేదు. వర్షం వస్తే పంటలు పండాలి లేదంటే ఎండాలి. ఈ తరుణంలో మా బంధువులు పానీపూరీ బండి పెట్టుకుని జీవనం సాగించేవారు. వారి ద్వారా నేను 18 ఏళ్ల క్రితం కడపకు వచ్చి పానీపూరి బండి వ్యాపారాన్ని ప్రారంభించాను. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు పడ్డా రానురాను మెరుగుపడి దేవుడి దయవల్ల బాగానే ఉన్నాను. నా ముగ్గురు పిల్లలను నాలా కాకుండా బాగా చదివించుకుంటున్నాను. కాంట్రాక్టు ఉద్యోగాన్ని వదిలేసి... నాపేరు రేషమ్ మహేష్. మాది అంగళ్లు గ్రామం. నేను చదువు ముగించుకుని హైదరాబాదులో ఏపీ ట్రాన్స్ కోలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. అప్పటో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ట్రాన్స్‌కోలో కాంట్రాక్టు కింద ఉద్యోగం చేసేవారందరిని తొలగించారు. దీంతో చేసేదేమీ లేక మా బంధువుల ద్వారా కడపకు వచ్చాను. అప్పటి నుంచి పానీ పూరి బండి ఏర్పాటు చేసుకుని జీవనం ప్రారంభించాను. 3 ఎకరాల పొలం ఉన్నా ... నాపేరు గంట్ల నారాయణమ్మ, మాది దండువారిపల్లె. మాకు 3 ఎకరాల పొలం ఉండేది. నీటి వసతి లేని కారణంగా పంటలను సకాలంలో సాగు చేసుకోలేక పోయేవాళ్లం. వర్షం వచ్చినప్పుడు పంటలను సాగు చేస్తాము. తరువాత సకాలంలో వర్షం వచ్చి అన్ని అనుకూలిస్తే పంట చేతి కొస్తే వస్తుంది లేదంటే పోతుంది. ఇలా కొన్నేళ్లపాటు పోరాటం చేశాం. అయినా ఏం లాభం ఉండేదికాదు. దీంతో మా కుమారుడిని తీసుకుని కడపకు వచ్చి పానీపూరి బండి ఏర్పాటు చేసుకుని ప్లేటు రూ.3తో వ్యాపారం ప్రారంభించాను. ప్రస్తుతం ప్లేటు రూ. 20కి అమ్ముతున్నాం. -
పానీపూరి మైకంలో లక్ష రూపాయలు మరిచిపోయిన నటి..
Actress Kamya Punjabi Forget Rs 1 Lakh At Pani Puri Stall In Indore: పానీపూరి పేరు వింటే చాలు మైమరిచిపోతారు అమ్మాయిలు. వారికి ఇది ఎంతో ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్. పానీపూరిని తింటూ లోకాన్నే మరిచిపోతారు అమ్మాయిలు. ఈ విషయంలో సాధారణ యువతులే కాదు సెలబ్రిటీలేం అతీతం కాదని ఈ సంఘటన చూస్తే అర్థమవుతోంది. ఈ పానీపూరి మైకంలో ఏకంగా లక్ష రూపాయలను అక్కడే మరిచిపోయి వచ్చింది ఓ నటి. ఆ నటి ఎవరో కాదు కోయి మిల్ గయా, కహో నా ప్యార్ హై వంటి తదితర హిట్ సినిమాల్లో నటించిన కామ్య పంజాబీ. ఆమె ఇటీవల ఇండోర్‌కు వెళ్లిన కామ్య ఓ ఈవెంట్లో పాల్గొంది. అక్కడ బయటకు వెళ్లి పానీపూరిలను ఓ పట్టు పట్టింది. పానీపూరిలు ఆస్వాదిస్తూ అక్కడ టేబుల్‌పై రూ. లక్ష ఉన్న ఎన్వలప్ కవర్‌ను పెట్టింది. తర్వాత అక్కడ ఫొటోలు తీస్తూ తీస్తూ ఆ ఎన్వలప్‌ను అక్కడే మరిచిపోయి హోటల్‌కు తిరిగివెళ్లింది. హోటల్‌కు వెళ్లిన కొద్దిసేపటికే ఎన్వలప్‌ను మరిచిపోయిందనే సంగతి గుర్తుకు వచ్చి తన మేనేజర్‌ను పంపించదట. తాను మరిచిపోయిన చోటుకు వెళ్లిన కామ్య మేనేజర్ ఆ ఎన్వలప్‌ను తిరిగి తీసుకువచ్చాడు. ఈ విషయాన్ని నటి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఎన్వలప్ మరిచిపోయిన సమయంలో తీవ్ర ఒత్తిడిగి గురైనట్లు కామ్య తెలిపింది. 'నిజానికి ఆ డబ్బు దొరకదనుకున్నాను. అంత రద్దీ ప్రదేశంలో విలువైన ఎన్వలప్ దొరకడం ఆశ్చర్యంగా ఉంది. ఇండోర్ ప్రజలు చాలా మంచివారు, దయగలవారు.' అని కామ్య పంజాబీ తెలిపింది. చదవండి: విపరీతమైన చెమటలు.. కేకే ఆఖరి వీడియో వైరల్ ఆయన పాటలు అనేక భావోద్వేగాలను పలకించేవి: ప్రధాని మోదీ -
హిందీ మాట్లాడేవాళ్లు పానీపూరి అమ్ముకుంటున్నారు
హిందీ భాషపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ కౌంటర్లు వస్తూనే ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలను మొదటి నుంచి తమిళనాడు సర్కార్, సీఎం స్టాలిన్ ఖండించిన విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడు విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల ప్రకారం.. కోయంబత్తూర్‌లోని భారతీయర్ యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి కే పొన్నుడి మాట్లాడుతూ.. హిందీ మాట్లాడేవారు కోయంబత్తూర్‌లో పానీపూరీలు అమ్ముకుంటున్నారని ఎద్దేవా చేశారు. హిందీ భాష మరిన్ని ఎక్కువ ఉద్యోగాలు కల్పించేదే అయితే ఉత్తర భారతీయులు ఇక్కడ(తమిళనాడులో) పానీ పూరీ ఎందుకు అమ్ముకుంటున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తమిళనాడు ప్రజలు ఇంగ్లీష్, తమిళ్ మాట్లాడుతారని అన్నారు. అలాగే, తాము అంతర్జాతీయ భాషగా ఇంగ్లీష్ నేర్చుకుంటుండగా ఇతర భాషలతో పనేముందని మంత్రి ఆయన ప్రశ్నించారు. మరో అడుగుముందుకేసి.. హిందీ కేవలం ఆప్షనల్ ల్యాంగ్వేజ్ మాత్రమేనని, దాన్ని నేర్చుకోవడం తప్పనిసరి కాదని కుండబద్దలుకొట్టారు. తమిళ విద్యార్ధులు ఏ భాష నేర్చుకునేందుకైనా సిద్ధంగా ఉంటారని చెప్పారు. అంతకు ముందు.. హిందీ జాతీయ భాష కాదంటూ కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: మీ ఇంటిని కూల్చివేస్తామంటూ బీజేపీ చీఫ్‌కు వార్నింగ్ -
Panipuri: పానీపూరి పంచాయితీ.. ఎంతకూ తెగకపోవడంతో చివరకు
అనంతపురం సెంట్రల్: పానీపూరి బాగో లేదన్నందుకు వివాదం చెలరేగి చివరకు పోలీస్ స్టేషన్లోనే యువకుడిపై చేయి చేసుకునే స్థాయికి చేరుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం నగరంలోని పోలీసు కాంప్లెక్స్‌లో రాణి అనే మహిళ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. బెంగళూరులో ఎంబీబీఎస్ చదువుతున్న రాంనగర్ నివాసి వెంకటకృష్ణారెడ్డి శనివారం సాయంత్రం పానీపూరి తినేందుకు తన తమ్ముడితో కలిసి రాణి నిర్వహిస్తున్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు వెళ్లాడు. చదవండి: నాలుగేళ్లుగా సహజీవనం.. ప్రియుడు మందలించడంతో.. పానీపూరి తిన్న తర్వాత రుచి బాగోలేదని తన అభిప్రాయాన్ని ఆ యువకుడు వ్యక్తం చేశాడు. ఇది నచ్చని నిర్వాహకురాలు వెంటనే అతనితో వాదనకు దిగింది. మాటామాట పెరగడంతో స్థానికులు డయల్ 100కు సమాచారం అందించారు. దీంతో అనంతపురం రెండో పట్టణ ఎస్ఐ అల్లాబకాష్, సిబ్బంది అక్కడకు చేరుకుని ఇరువర్గాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్లో విచారణ చేస్తున్న సమయంలో వెంకటకృష్ణారెడ్డిపై రాణి చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది. ఘటనపై వెంకటకృష్ణారెడ్డి కుటుంబసభ్యులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఆహారకల్తీ నిరోధకశాఖ, నగరపాలకసంస్థ అధికారులు వెంటనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తనిఖీలు చేపట్టారు. -
అడక్కుండానే పానీ పూరి తెచ్చిన భర్త.. కోపంతో ఊగిపోయిన భార్య..
పూణే: చిన్న చిన్న విషయాలకు కూడా ఈ మధ్య చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడి విలువైన జీవితాలను అంతం చేసుకుంటున్నారు. అడగకుండానే పానీ పూరీని తీసుకువచ్చినందుకు భార్య విషం తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహరాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. షోలాపూర్‌కు చెందిన గహినీనాథ్ సర్వదే 2019లో ప్రతిక్షను అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆమె భర్త పూణే లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం వీరు పూణేలోని అంబేగావ్ పీఠభూమి ప్రాంతంలో నివసిస్తున్నారు. కాగా వివాహమైనప్పటి నుంచి గహినీనాథ్ కు ప్రతీక్ష మధ్య చాల విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో గత శుక్రవారం గహినీనాథ్ ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్న సమయంలో పానీ పూరి తీసుకుని ఇంటికి వెళ్లాడు. అయితే తనను అడగకుండానే పానీ పూరిని తీసుకువచ్చినందుకు ప్రతీక్షకు కోపం వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మరుసటి రోజు ప్రతీక్ష విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రతిక్ష తండ్రి ప్రకాష్.. భారతి విద్యాపీఠ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్త గహినీనాథ్పై ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: తల్లిదండ్రులు లేని జీవితంపై విరక్తితో తనువు చాలించిన యువకుడు -
ఓరి దుర్మార్గుడా.. పానీపూరీలో.. ఛీ అది కలిపావేంట్రా
Assam Man Mixing Urine In Pani Puri Water: సోషల్ మీడియాలో వచ్చే వాటిలో కొన్ని వైరల్ గా మారి రచ్చ చేస్తే, మరి కొన్ని మాత్రం మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తాయి. ఇక నోరూరించే వంటకాలు సైతం నెట్టింట కనిపించడం ఇటీవల ట్రెండ్‌గా మారిందనే చెప్పాలి. అదే క్రమంలో కొన్ని ఘటనలు చూస్తే బయట తిండి తినాలంటే భయమేస్తుంది. ప్రత్యేకంగా బయట పుడ్ ఇష్టపడే భోజన ప్రియులు రోడ్డు పక్కన తినే తినుబండారాల విషయంలో ఎంతో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని చాటే ఒక వీడియో తాజాగా వైరల్ అవడమే గాక చూసిన వారిని షాక్‌కు గురి చేస్తుంది. ఈ ఘటన అసోంలోని గువాహటిలో చోటు చేసుకుంది. అసలు ఏముంది అందులో.. గువహటి నగరంలో ఓ పానీ పూరీ బండి నిర్వహకుడు చేసిన పని చూస్తే అత్యంత అసహ్యంగా అనిపిస్తోంది. పాస్టపుడ్ సెంటర్లు మొదలైనప్పటి నుంచి భోజన ప్రియులు బయట పుడ్ తినడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో పానీపూరి తినే వారి జాబితా పెద్దదే అని చెప్పాలి. అయితే వారు ఈ వీడియో చూస్తే మాత్రం ఇకపై తినడం మానేస్తారేమో. రోడ్డు పక్కన పానీపూరీ బండితో జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి పానీపూరి చేస్తూనే మరో వైపు ఏమీ తెలియనట్లు మగ్గుతో తన మూత్రాన్ని చాటుగా పట్టి దాన్ని పానీపూరీ బకెట్లో కలిపాడు. కాగా అతను ఇది ఎందుకు చేశాడు తెలియదు. అయితే ఈ వ్యవహారమంతా ఎవరో చాటుగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అతి జుగుప్సాకరమైన దీన్ని చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. చివరకు ఇది ఆహార శాఖ అధికారుల వరకు చేరింది. వెంటనే అధికారులు స్పందించి సదరు స్ట్రీట్ వెండర్ అయిన పానీపూరీ బండి నిర్వహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రోడ్డు పక్కన అమ్మే తినుబండారాలాను తినేముందు ఒకసారి ఆలోచించుకోవాలిని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. Shocking!A street vendor(pani puri saller) has been arrestd in Guwahati after viral a sensational video in which he mixed his urine with water and using the same Water in Pani Puri.#ViralVideo #Guwahati @ABPNews @ANI @the_viralvideos @ViralPosts5 @indiatvnews @TheQuint @SkyNews pic.twitter.com/ncekjhMeh1 — Mamun Khan (@Mk817Khan) August 20, 2021 -
పానీపూరి బండి వాడ్ని పెళ్లి చేసుకోవాలనుకున్నా : నటి
'ఐస్‌క్రీమ్' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తేజేస్వి సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా నటిగా గుర్తింపును సంపాదించుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో వెండితెరకు పరిచయం అయిన తేజస్వి.. ఆ తర్వాత 'లవర్స్', 'మనం', 'హార్ట్ ఎటాక్' సహా పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అయితే 2018లో వచ్చిన బిగ్‌బాస్-2లో పాల్గొన్న అనంతరం తేజస్వి పలు విమర్శలను ఎదుర్కొంది. ముఖ్యంగా కౌశల్‌తో ప్రవర్తించిన తీరుతో ట్రోల్స్ బారిన పడి ఇమేజ్ను డ్యామేజ్ చేసుకుంది. ఆ తర్వాత కారణాలు ఏవైనా సినిమా ఆఫర్లు మాత్రం తగ్గుతూ వచ్చాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ తన అందచందాలతో హాట్ ఫోటో షూట్లలో పాల్గొనే తేజస్వీ తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. 'చిన్నప్పుడు పానీపూరి బండివాడ్ని పెళ్లి చేసుకోవాలి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నేను చిన్నపిల్లను కాదు కదా..ఇప్పుడు అసలు పెళ్లే అవసరం లేదని రియలైజ్ అయ్యాను' అంటూ పానీపూరి బండిని తోసుకెళ్తున్న ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట హల్చల్ చేస్తుంది. కొంపదీసి ఆ బండిని మీ ఇంటికి తీసుకెళ్తావా ఏంటి అంటూ కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) -
పానీ పూరీ జ్యువెల్లరీ: పెళ్లికూతురి వైరల్ వీడియో
సాక్షి, ముంబై: పానీ పూరీ అంటే చాలామంది అమ్మాయిలు లొట్టలేసుకుంటూ తింటారు. లాక్డౌన్ కాలంలో కూడా పానీ పూరీకోసం ఎగబడిన దృశ్యాలను చూశాం. ఇండియాలో స్ట్రీట్ ఫుడ్‌లో పానీ పూరీ లేదా గోల్ గప్పా కున్న స్పెషాల్టీ అది. కానీ పానీ పూరీ కిరీటం పెట్టుకున్న పెళ్లికూతుర్ని మాత్రం ఎక్కడా చూడ లేదు. అందుకే ఈ పానీ పూరీ స్పెషల్ పెళ్ళి కూతురి వీడియో వైరల్‌గా మారింది. సాధారణంగా పెళ్లి అనగానే కాబోయే పెళ్ళి కూతుళ్ల హడావిడి అంతా ఇంతాకాదు. పెళ్లి చీరలు, డిజైనర్ బ్లౌజ్‌లు, వీటన్నింటికీ మించి వారు ధరించే నగలపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. కానీ ఒక ఈ వధువు మాత్రం పానీ పూరిపై ప్రేమను తెలిపేందుకు మరో అడుగు ముందుకేసింది. సాధారణ నగలతో పాటు ఏకంగా పానీ పూరీ నగల్ని ధరించింది. వెరైటీ పానీపూరీ నగలతో ఉన్న నవ వధువును బంధువులు సరదాగా ఆటపట్టిస్తోంటే సిగ్గుతో ఆమె చిరునవ్వులు చిందించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. వాస్తవానికి ఒక బ్రైడల్ మేకప్ సంస్థ ఈ వీడియోను పోస్ట్ చేసింది. అయితే అనూహ్యంగా ఈ వీడియోలోని పానీ పూరీలు హైలైట్ కావడం విశేషం. లక్షా పదివేలకు పైగా లైక్స్ సాధించిన ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఔరా! గోల్ గప్పా ప్రేమా అంటూ నోరెళ్లబెడుతున్నారు. మరికొందరైతే తామూ కూడా ఫాలో అవుతాం.. తామూ ఇలాగే చేస్తామంటూ మురిసిపోతూ వ్యాఖ్యానించడం కొసమెరుపు. View this post on Instagram A post shared by PEARLS Beauty Lounge & Academy (@arthibalajimakeoverstyles) -
పానీపూరీలో ఉంగరం పెట్టి.. యువతికి వెరైటీ పెళ్లి ప్రపోజల్..
పానీ పూరీ.. తలుచుకోగానే నోట్లో నీరు ఊరని వారుండరు. పెద్దవారి నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరు పానీపూరీని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, ఇక్కడొక యువకుడు తాను ప్రేమించిన అమ్మాయికి చేయబోయే లవ్ ప్రపోజ్ కూడా పానీపూరీతోనే చెప్పాడు. ‘ఆ యువతికి గప్‌చుప్‌లంటే ప్రాణం.. ఆ గప్‌చుప్‌లో ఏదైన పెట్టి ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు...’ ఆలోచన వచ్చిందో లేదో.. వెంటనే అమలులో పెట్టేయాలనుకున్నాడు. ఒకరోజు సాయంత్రం ఆ యువతి దగ్గరకు వెళ్లి సరదాగా గప్‌చుప్ తినడానికి వెళదామని కోరాడు. ఈ క్రమంలో వారిద్దరు కలిసి గప్‌చుప్ షాపు దగ్గరకు చేరుకున్నారు. అక్కడ, కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. అయితే, అప్పటికే సదరు యువకుడు తన ప్లాన్‌తో సిద్ధంగా ఉన్నాడు. ఆ గప్‌చుప్ షాపువారు.. ఒక ప్లేట్లో కొన్ని గప్‌చుప్‌లు, మసాలా, బటానీ పెట్టిచ్చారు. ఇతను మాత్రం ఒక గప్‌చుప్‌లో బంగారు ఉంగరాన్ని ఉంచాడు. ఆ ప్లేటును ఆ యువతికి ఇచ్చాడు. అయితే, ఆ యువతి ఆ గప్‌చుప్ ప్లేటును తీసుకుంది. దానిలో మధ్యలో ఉన్న పానీపూరీ ఏదో మెరుస్తూ కనిపించింది. కాసేపు.. సరిగ్గా చూసేసరికి అది ఒక ఉంగరం అని గుర్తుపట్టింది. వెంటనే ఆ యువకుడిని చూసింది. అతగాడి ముఖం అప్పటికే ఏదో వెలిగి పోతుంది. ఆ యువకుడు, నవ్వుతూ.. తన మనసులో మాటను ఆ యువతికి తెలియజేశాడు. ఈ వెరైటీ సర్‌ప్రైజ్‌కి ఆ యువతి ఎంతో సంతోషించింది. ఆమె ఆనందంగా ఉండటం చూసిన యువకుడు.. ఇక క్షణం ఆలస్యం చేయకూడదని ‘ ఆ ఉంగరాన్ని చూపిస్తూ.. నన్ను పెళ్లి చేసుకుంటావా..’ అంటూ ఆమెను ప్రపోజ్ చేశాడు. మొదట ఆశ్చర్యపోయినప్పటికి ఆ యువకుడి నిజాయితీకి ఆమె ఫిదా అయ్యింది. ఆ యువతి కూడా సరిగ్గా పానీపూరీ బండి దగ్గరే తన ప్రియుడి ప్రపోజల్‌కి ఒకే చెప్పేసింది. అయితే, ఇది ఎక్కడ జరిగిందో తెలియలేదు. ఈ క్లిప్పింగ్‌లను ట్విట్టర్‌లోని ‘మంత్లీ అందాజ్ ఇ జాన్’ అనే పేజీలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్నిచూసిన నెటిజన్లు ‘మీ.. ఐడియా సూపర్..’, ‘ పానీపూరీకి ఏ అమ్మాయి ‘నో’ చెప్పలేదు. మరి అలాంటి పానీపూరిలో రింగ్ పెట్టి ప్రపోజ్ చేస్తే.. ఆమె ‘నో’ అనగలదా? ’, ‘ ఆమె పానీపూరి చూడ కుండా తింటే ఏమై ఉండేదో..’, ‘ కొంత యువతులకు పానీపూరీని అమాంతం మింగేస్తారు.. ’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. చదవండి: మెట్రోలో సీటు కోసం.. ఎంత పని చేశాడు! వైరల్ వీడియో -
వైరల్: అతడు..ఆమె.. ఓ పానీపూరీ ప్రేమ కథ
లవ్ అట్ ఫస్ట్ సైట్లో కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు చూసిన వెంటనే ప్రేమలో పడిపోతుంటారు. కానీ అదే ప్రేమను తెలపాలంటే చాలా కష్టపడుతుంటారు. ఎందుకంటే ప్రేమను మనం ఇష్టపడే వారికి తెలియపరచడం అనేది ఓ మధురానుభూతి. అందుకే ప్రేమించడం సులువు గానీ అది వ్యక్తపరచడం చాలా కష్టమని అంటుంటారు. ఇలా ఇష్టపడే అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయడం కోసం అబ్బాయిలు చాలానే ఆలోచిస్తుంటారు. అలా ఓ ప్రేమికుడు తను ప్రేయసికి సరికొత్తగా తన ప్రేమను తెలపాలనుకున్నాడు. దాని కోసం ఎంతో ఆలోచించి ఓ క్రేజీ ఐడియాతో తను ప్రేమించిన అమ్మాయికి సరికొత్తగా ప్రేమను వ్యక్తపరిచాడు. ఇంకేముంది కొత్తదనం ఉంటే చాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొట్టేస్తుందన్న విషయం తెలిసిందే. ఆ ప్రేమికుడు తన ప్రేయసిని.. అలా పానిపూరి దుకాణంలో తీసుకెళ్లాడు. ఎలా చెప్పాలా అనుకుంటూ ఉండగా ఆకస్మాత్తుగా అతనికి ఓ ఐడియా మదిలో మెదిలింది. అనుకున్నదే తడువుగా.. ‘పానీపూరీలో ఉంగరం పెట్టి లవ్ ప్రపోజ్’ చేసేశాడు. ఇక ఈ వెరైటీ ప్రపోజల్‌కు అమ్మాయితో పాటు నెటిజన్లు కూడా ఫిదా అయ్యారండోయ్. మామూలుగానే పానీ పూరీ అంటే ఇష్టపడనివారు ఎవరు ఉండరు. దీంతో పానీపూరితో పిల్లను ప్రేమలో పడేశావ్ బ్రో అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఫన్నీ నెటిజన్లు. ఈ పానీపూరి రింగ్ ప్రపోజల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి హల్చల్ చేస్తోంది. i mean,, can’t say no to pani puri Gol gappay or pani puri are enjoyed by everyone and they are a real treat. But none of us would have imagined getting proposed through gol gappay. This man is doing things differently and after bizarre food proposals, pic.twitter.com/OwvGFc1Jd4 — MonthlyAndazeJahan (jiddat group of publications) (@e_monthly) June 3, 2021 చదవండి: Fact Check: వ్యాక్సిన్ తీసుకుంటే అయస్కాంత లక్షణాలు! -
గప్‌చుప్‌లు మనుషులకే కాదు.. మాకు ఇష్టమే
ముంబై: గోల్ గప్పా.. గప్‌చుప్.. పానీపూరి ఇలా ఏ పేరుతో పిలిచినా దీనిని ఇష్టపడని వారు ఎవరు ఉండరు. నోట్లో పెట్టుకోగానే నాలుకకు మంచి రుచిని అందించే గప్‌చుప్‌ను తినేందుకు జనాలు పెద్ద ఎత్తున్న ఎగబడతారు. ఇక ముంబై వీధుల్లో గప్‌చుప్ హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే గప్‌చుప్‌లు మనుషులకే కాదు మాకు ఇష్టమే అన్న చందంగా ఒక ఆవు.. దాని లేగ దూడ లొట్టేలేసుకుంటూ ఆరంగించాయి. సాధారణంగా ఆవులు ఇంటిముందుకు వస్తే చాలామంది ఆహారాన్ని కిందపడేసి వెళ్లిపోతారు. అలా పడేసిన ఆహారాన్ని తినేసి వెళ్లిపోతాయి. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం తన దగ్గరకు వచ్చిన ఆవు, లేగ దూడను దగ్గర్లోని చాట్ బండి వద్దకు తీసుకెళ్లి గప్‌చుప్ తినిపించాడు. అయితే కింద పెట్టకుండా స్వయంగా తానే తన చేతులతో వాటికి తినిపించాడు. ఇంకేముంది.. అంత ప్రేమగా తినిపిస్తుంటే అవి కూడా సంతోషంగా ఆరగించాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను దాదాపు 58వేల మంది వీక్షించారు. చదవండి: వైరల్: రైతు దుశ్చర్య.. పాపం ఎలుకల దండుని.. View this post on Instagram A post shared by sree130920 (@sree130920) -
పానీపూరీ కాదు.. పానీ, పూరీ తెచ్చిన రచ్చ!
పానీ పూరీ అంటే తెలియని స్ట్రీట్‌ఫుడ్ ప్రియులు ఎవరుండరు. రోడ్డు పక్కన ఉన్న పానీపురీ బండిని చూశామంటే అంతే సంగతులు..! నోట్లో నీళ్లూరడం ఖాయం. ప్రాంతాన్ని బట్టి పానీపూరీని వివిధ పేర్లతో పిలుస్తారు. గప్‌చుప్, గోల్ గప్పే, పానీకే పటాషే, ... ఇలా ప్రాంతాలను బట్టి పేరు మారితేనేం? దీని రుచిలో ఉండే మజానే వేరు. కానీ ప్రస్తుతం ఈ పానీపూరీయే ట్విటర్లో కొత్త రచ్చకు దారీ తీసింది. ఈ అంశంపై నెటిజన్లు రెండుగా విడిపోయారు. కాగా, ట్విటర్లో ఓ నెటిజన్ గోల్గప్పే, పానీపూరి ఒకటి కాదని చర్చకు తెరలేపింది. ట్విటర్లో ఓ ఫొటోనూ షేర్ చేసింది. ఈ ఫోటోలో గోల్గప్పేకు సూచకంగా అసలైన పానీపూరీ ఫోటో పెట్టగా.. పానీపురీ అంటే గ్లాసులో నీరు ఆ పక్కనే పూరి ఉన్న ఫోటోను ఉంచింది. దీంతో కొంత మంది నెటిజన్లు ఈ ట్వీట్ పై ఆగ్రహానికి గురైయ్యారు. ప్రాంతాలను బట్టి తినే ఆహార పదార్ధాల పేర్లు మారుతుంటాయి. రకరకాల పేర్లతో పిలుచుకుంటాము అందులో తేడా ఏముంది. అందరూ దాన్ని ఇష్టంగానే ఆస్వాదిస్తాం అని ఓ నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు. తాము పాటిస్తున్న ఆచార వ్యవహారాలే గొప్ప అని అనుకోవడం మూర్ఖత్వమని పేర్కొన్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలైంది. In bengal it call puchka in West Bengal, gup chup in jharkhand, chattisgarh, pani ke patashe in Uttar Pradesh, padaka in alli garh. Same dish just different names. — Reena🌝 lost soul 🥳 💐💋✤ (@borahae_bts_0) March 29, 2021 చదవండి: రోడ్లపై చెత్త వేస్తున్నారా? సిగ్గు పడండి, కాకి వీడియో వైరల్ -
షాకింగ్.. టాయిలెట్ వాటర్‌తో పానీపూరి
ముంబై: ‘పానీ పూరి’ దేశవ్యాప్తంగా అందరికి ఇష్టమైన చిరుతిండి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ స్నాక్ ఐటం ప్రస్తుతం గ్రామాల్లో కూడా లభిస్తుంది. కరోనాతో ప్రస్తుతం చాలా మంది జనాలు బయటి ఆహారం తీసుకోవాలంటనే ఒణుకుతున్నారు. దాంతో ఇప్పుడు పానీపూరికి గిరాకి బాగా తగ్గిపోయింది. ఒకప్పుడు సాయంత్రం అయితే చాలు రోడ్డుకు ఇరువైపులా పానీపూరి బళ్లు.. దాని చుట్టూ జనాలు కిక్కిరిసి ఉండేవారు. మధ్యాహ్నం మొదలయ్యే ఈ వ్యాపారం రాత్రి పది వరకు కూడా నడిచేది. ఇక చిన్న పిల్లలు మొదలు.. ముసలి వారు వరకు ఇష్టంగా తినేవారు. మరో విశేషం ఏంటంటే పానీపూరి వ్యాపారంలో కల్తీకి సంబంధించి ఎన్ని వార్తలు వచ్చిన గిరాకీ మాత్రం తగ్గేది కాదు. మరి ఇప్పుడు ఈ వార్త చదివిన తర్వత అయినా జనాల్లో మార్పు వస్తుందో లేదో చూడాలి. తాజాగా ఓ పానీ పూరీ బండి వ్యక్తి టాయిలెట్ వినియోగం కోసం ఉంచిన నీటిని తెచ్చి.. పానీపూరికి వాడే రసంలో కలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో జనాలు అతడిని చితకబాదారు. (చదవండి: ప్రాణం తీసిన గప్‌చుప్) ఈ ఘటన కొల్హాపూర్‌లో చోటు చేసుకుంది. పట్టణంలోని రంకాల లేక్ సమీపంలో ‘ముంబై కా స్పెషల్ పానీ పూరి వాలా’ పేరుతో నడిచే ఈ పానీ పూరి బండి ఆ ప్రాంతంలో తెగ ఫెమస్. సాయంత్రం అయ్యిందంటే చాలు.. పానీ పూరి కోసం జనాలు బండి దగ్గర క్యూ కడతారు. ఈ క్రమంలో ఓ రోజు సదరు పానీ పూరి బండి వ్యక్తి రోడ్డు పక్కన టాయిలెట్ బయట ఉన్న నీటిని తెచ్చి పానీపూరి రసంలో మిక్స్ చేశాడు. అయితే అతడి నిర్వకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వీడియో చూసిన జనాలు ఆగ్రహంతో అతడి బండిని కిందపడేసి.. వస్తువులను నాశనం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. ఇంట్లో ఎంతో శుభ్రంగా, రుచిగా చేసిపెట్టినప్పటికి కొందరికి మాత్రం బయటి తిండే రుచిగా అనిపిస్తుంది. అలాంటి వారు ఇది చదివాకైనా మారితే మంచిది. -
ప్రాణం తీసిన గప్‌చుప్
భువనేశ్వర్ : ఆబాలగోపాలం లొట్టలేసుకుని ఆరగించే గప్‌చుప్ ఓ మహిళ ప్రాణాల్ని బలిగొంది. బంగాళదుంప మిశ్రమం కూరిన చిన్న డొల్ల పూరీలో చురచురలాడించే చింతపండు నీరు నింపుకుని గుటుక్కున (గప్‌చుప్) మింగేయడంలో జరిగిన తొందరపాటు చర్య ఈ ప్రమాదానికి కారణమైంది. సుందరగడ్ జిల్లా లెఫ్రిపడా పోలీసు స్టేషన్ పరిధి సరఫ్‌గడ్ గ్రామంలో మంగళవారం రాత్రి ఈ విషాదం జరిగింది. స్థానికురాలైన ఫూలమతి కిషాన్ (30) అనే మహిళ సరదాగా మింగబోయిన గప్‌చుప్ ఆమె గొంతు గుండా శ్వాసనాళంలో ఇరుక్కుపోవడంతో ఉక్కిరి బిక్కిరై అక్కడికక్కడే కుప్పకూలింది. భర్త, కుమారుడితో కలిసి ఇంటి ఆవరణలో గప్‌చుప్ తింటుండగా ఈ విషాదం సంభవించింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ప్రాణం పోయినట్లు వైద్యులు ప్రకటించారు. -
మదిని దోచేస్తున్న పానీపూరీ ఏటీఎం
బయటకొచ్చారంటే చాలా మంది పానీపూరీ తినకుండా ఉండరు. మార్చిలో లాక్డౌన్ ప్రకటించగానే, పానీపూరీ తినందే రోజుగడవని పానీపూరీ ప్రియులెందరో ఎంతగానో తల్లడిల్లిపోయారు. అయినా పానీపూరీ ప్రియులంతా నోటికి తాళం వేసుకోక తప్పలేదు. ఎందుకంటే అప్పటికప్పుడు చేసి ఇచ్చే తినుబండారాలు కావడంతో, వీటిని ఏ జొమాటో, స్విగ్గీ, ఉబర్ ఈట్స్‌లోనో ఇంటికి తెప్పించుకొని ఆరగించే అవకాశం కూడా లేకపోయింది. దీంతో పానీపూరీ లేని కొరత తీర్చలేనిదంటూ సోషల్ మీడియాలో చాలా జోక్స్ చక్కర్లు కొట్టాయి. అయితే సోషల్ మీడియా జోక్స్‌కి చెక్‌పెట్టేసే రోజొచ్చింది. (చదవండి: కరోనా కేళి.. జేబులు ఖాళీ!) సామాజిక దూరాన్ని పాటిస్తూ, ఎవర్నీ అంటుకోకుండా, పరిశుభ్రమైన పానీపూరీని మీ చేతుల్లో పెట్టే పానీపూరీ విక్రయ యంత్రం మార్కెట్లోకి వచ్చేస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వీడియో నెటిజన్ల మదిని దోచేస్తోంది. పానీపూరీ వెండింగ్ మెషీన్లో 20 రూపాయల నోటుని ఉంచితే సరి, మెషీన్‌లోనుంచి కదులుతోన్న బెల్టుపై వెంటనే గోల్గప్పా ప్రత్యక్షం అవు తుంది. ఈ యంత్రం అభివృద్ధిపరిచేందుకు ఆరు నెలల కాలం పట్టిందని, ఈ యంత్రం వినియోగాన్ని గురించి వీడియోలో వివరించిన వ్యక్తి చెప్పారు. ఈ పానీపూరీ యంత్రం ఆవిష్కర్తలను అస్సాం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హార్ది సింగ్, ‘ఇది భారతీయుల నిజమైన చాతుర్యం’అని ప్రశంసించారు. (చదవండి: పానీపూరి ప్రియులను కలవరపరిచే వంటకం) -
"మ్యాగీ పానీపూరి"
-
'ఛీ, వినడానికే దరిద్రంగా ఉంది'
న్యూఢిల్లీ: జనాలు అస్సలు మొహమాట పడని ఏకైక చోటు పానీపూరి బండి. అబ్బాయిలకు పానీపూరి ఇష్టం ఉంటుంది, కానీ అమ్మాయిలకు పానీపూరి పిచ్చి ఉంటుంది. ఎందుకంటే ఆ బండి దగ్గరకు ఎప్పుడూ వెళ్లే రెగ్యులర్ కస్టమర్స్ వీళ్లు. ఇప్పుడు చెప్పబోయే ఈ వార్త కచ్చితంగా పానీపూరి ప్రియులకు కోపం తెప్పిస్తుంది. ఇప్పటివరకు నెట్టింట్లో వెరైటీ వంటకాల పేరుతో ఎన్నో ఘోరాలను చూశాం. అందులో గులాబ్‌జామూన్ పావ్ బాజీ, కుర్కురే మిల్క్‌షేక్, స్వీట్ మ్యాగీ, ఓరియో సమోసా, న్యూటెల్లా బిర్యానీ ఇలా పేర్లు వింటేనే గుండెలదిరే వంటకాల గురించి విన్నాం. (2020లో ఇవి మాత్రం ప్రయత్నించకండి) తాజాగా భోజనప్రియులను బెంబేలెత్తించే మరో కొత్త వంటకం పుట్టుకొచ్చింది. అదే "మ్యాగీ పానీపూరి". ఇది ఎలా తయారుచేయాలో వివరిస్తూ బన్నీ అనే వ్యక్తి దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో పూరీలో పప్పు, పానీకి బదులుగా రెడీ చేసి పెట్టిన మ్యాగీని వేసి ఉంచాడు. దీన్ని చూసి షాక్‌కు లోనైన నెటిజన్లు 'ఇది హారర్ చిత్రంలోని దృశ్యంలా ఉంది', 'ఇది 2020 ఏడాది కన్నా పెద్ద ఘోరం', 'ఛీ, ఈ రెసిపీ పేరు వినడానికే దరిద్రంగా ఉంది', 'నువ్వు ఎవరో తెలీదు కాని నువ్వంటే నాకు పరమ అసహ్యం' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (పానీపూరి తిన్న 40 మంది చిన్నారులకు అస్వస్థత) -
కోలుకుంటున్న చిన్నారులు
పానీపూరి తిని అస్వస్థతకు గురైన చిన్నారులు కోలుకుంటున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్‌నగర్, సుందరయ్యనగర్ కాలనీల్లో సోమవారం పానీపూరి తిన్న చిన్నారులు వాంతులు, విరోచనాలతో రిమ్స్ ఆస్పత్రిలో చేరిన విషయం విదితమే. దాదాపు 50మంది చిన్నారులు చికిత్స పొందగా మంగళవారం వీరిలో పలువురు కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆదిలాబాద్‌టౌన్: పానీపూరి తిని అస్వస్థతకు గురైన చిన్నారులు కోలుకుంటున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్‌నగర్, సుందరయ్యనగర్ కాలనీల్లో సోమవారం తోపుడు బండిపై ఓ చిరు వ్యాపారి పానీపూరి విక్రయించాడు. వాటిని తిన్న చిన్నారులు వాంతులు, విరోచనాలతో రిమ్స్ ఆస్పత్రిలో చేరిన విషయం విదితమే. దాదాపు 50మంది చిన్నారులు చికిత్స పొందగా మంగళవారం వీరిలో పలువురు కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరికొంత మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రిమ్స్ వైద్యులు చెబుతున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించిన చిరు వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని పలు సంఘాలు పేర్కొంటున్నాయి. మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్.. పానీపూరి తిని చిన్నారులు అస్వస్థతకు గురి కావడానికి కారకులైన మున్సిపల్ అధికారులు, తదితరులపై చర్యలు చేపట్టాలని బాలల హక్కుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు అచుత్‌రావు తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌లో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనకు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తితో ప్రజలు భయాందోళనలు చెందుతున్న సమయంలో నాసిరకం, కలుషిత తినుబండరాళ్లను అనుమతించడంపై అసహనం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలకు ఆదేశించాలని, అస్వస్థతకు గురైన చిన్నారులకు ప్రభుత్వ ఖర్చులతో వైద్యం అందించాలని కోరారు. సీపీఐ నాయకుల పరామర్శ ఎదులాపురం(ఆదిలాబాద్): ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను మంగళవారం సీపీఐ జిల్లా నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. చిన్నారుల అస్వస్థతకు కారణమైన గుప్చుప్ వ్యాపారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించేలా ఫుడ్ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సీపీఐ నాయకులు అరుణ్‌కుమార్ అన్నారు. -
పానీపూరి తిని చిన్నారులకు అస్వస్థత
-
పానీపూరి తిన్న 40 మంది చిన్నారులకు అస్వస్థత
సాక్షి, ఆదిలాబాద్ : పానీపూరి తిన్న40 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కావడంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఆదిలాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం సాయంత్రం పట్టణంలోని సుందరయ్య నగర్, ఖుర్షీద్ నగర్‌లలోకి గప్‌చూప్ బండి వచ్చింది. దీంతో పలువురు పిల్లలు, పెద్దలు పానీపూరి తిన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అందులో చాలా మందికి కడపునొప్పితోపాటు వాంతులు, విరేచనాలు కావడం ప్రారంభమయింది. దీంతో వెంటనే వారిని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న డీఎంఅండ్‌హెచ్‌వో రిమ్స్‌కు చేరుకుని వైద్య సేవలను పర్యవేక్షించారు. ఇందుకు సంబంధించి రిమ్స్ డైరెక్టర్ బలరాం మాట్లాడుతూ.. పానీపూరి తినడం వల్లనే బాధితులు అస్వస్థతకు గురైనట్టుగా భావిస్తున్నామని తెలిపారు. వారికి పూర్తి స్థాయిలో టెస్ట్‌లు నిర్వహించనున్నట్టు చెప్పారు. పిల్లలను బయట ఆహార పదార్థాలకు దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. 24 గంటల తర్వాత బాధితులను డిశ్చార్జి చేస్తామని వెల్లడించారు. -
తింటే తంటాయే!
సాక్షి, పెదవేగి రూరల్: రోడ్ల పక్కన విక్రయించే చిరుతిళ్లు చూస్తుంటే నోరూరుతుంది. వాటిని తినాలని మనసు పీకుతుంది. జిహ్వచాపల్యానికి లోనై వాటిని తిన్నామా...అనారోగ్యం పాలుకాక తప్ప దు. దెందులూరు నియోజకవర్గంలో ప్రధాన గ్రామాల్లో వీధి పక్కన విక్రయించే చిరుతిళ్ల వ్యాపారం మూడు ప్లేట్లు ఆరు పార్శిళ్లుగా జోరుగా సాగుతోంది. గతంలో పట్టణాల్లో మాత్రమే కనిపించే ఈ వ్యాపారాలు ఇప్పుడు పల్లెలోనూ బాగా విస్తరించాయి. కంటికి ఇంపుగా...మసాలా గుమగుమలతో కూడిన ఆహారం ఆకట్టుకుంటుంది. న్యూడిల్స్, మంచూరియా, పానీపూరీ,చాట్మసాలాలు అబ్బో అనిపిస్తుంటాయి. వాటిని చూస్తుంటే తినాలనిపిస్తుంటుంది. అయితే వాటి తయారీలో ఎటువంటి నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదు. వాటిని తరచుగా తింటే అనారోగ్యం పాలు కాక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా ఆపరిశుభ్రమైన ఆహరాన్ని తింటే అమీబియాసిస్, మలబద్దకం తదితర సమస్యలు తలెత్తుతాయి. అంతేకాక వీటిని ఎక్కువగా తినేవారు ఊబకాయులుగా, లేకుంటే బక్కచిక్కడమో జరుగుతుందని పోషకాహార నిపుణులుచెబుతున్నారు. ఆకర్షితులవుతున్న యువత బజారులోని ఆహార వ్యాపారులు ఎక్కువగా కళాశాలలు, వసతిగృహలు, విద్యాసంస్థలు, జనం ఎక్కువగా సంచరించే జంక్షన్లలో దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలో పుట్‌పాత్‌లపైన, కళాశాలల ఎదురుగా ఉన్న ఈ బళ్లవద్ద 90 శాతం పైగా విద్యార్థులే కనిపిస్తుంటారు. పరిశుభ్రత నాస్తి విద్యార్థులు, యువత ఎక్కువగా ఇష్టపడే వీధి వంటకం పానీపూరీ చాట్, నీటితో నింపి ఇచ్చే క్రమంలో బ్యాక్టీరియా, ఫంగస్‌ను మన శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. పానీపూరీలో చాట్ నింపిన అనంతరం పూరీలను ప్రత్యేకంగా తయారయ్యే నీటితో ఉంచి వినియోగదారునికి అందిస్తుంటారు. ఈ క్రమంలో కనీస పరిశుభ్రత చర్యలు పాటించరు. ఈ క్రమంలో కనీస పరిశుభ్రత చర్యలు పాటించరు. వ్యాపారం జరిగే నాలుగైదు గంటల సమయం సదా వ్యాపారి చేతులు నీళ్లలో నానుతూనే ఉంటాయి. వేళ్ల సందుల్లో గోళ్ల మధ్య ప్రమాదకర క్యాండీడా ఫంగస్ చేరుతుంది. మురిగిపోయిన చాట్‌ను మరుసటి రోజు వినియోగిస్తుంటారు. చాట్‌లో బ్యాక్టీరియా, వైరస్ పోగు ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని గత ఏడాది హైదరాబాద్ కేంద్రగా జరిగిన ఏక్రాస్ సెక్షనల్ స్టడీ ఆన్ మైక్రోబయాజికల్ క్వాలిటీ ఆఫ్ స్పష్టం చేసింది. -
పానీపూరి కోసం వెళ్లి..
పహాడీషరీఫ్: పానీ పూరీ బండి అద్దాన్ని చేతితో పగులగొట్టేందుకు యత్నించి తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు మృతి చెందిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై నాగేశ్వర్ రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.తుక్కుగూడ గ్రామానికి చెందిన కట్టెల శ్రీనివాస్(28) పెట్రోల్ పంప్లో పని చేసేవాడు. బుధవారం రాత్రి అతను స్థానిక సిండికేట్ బ్యాంక్ సమీపంలోని పానీపూరీ బండి వద్దకు వెళ్లి పానీపూరి నిర్వాహకుడు బాబురావును పానీపూరి ఇవ్వాలని కోరాడు. అందుకు అతను నిరాకరించడంతో ఆగ్రహానికి లోనైన శ్రీనివాస్ అతనితో వాగ్వాదానికి దిగాడు. కోపం పట్టలేక పానీ పూరీ బండి అద్దంపై బలంగా కొట్టడంతో అద్దం పగిలి అతని మోచేతికి గుచ్చుకుంది. నరం తెగడంతో తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు అతడిని విజయ సాయి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. కాగా అతడి మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ అతడి సోదరుడు గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పానీపూరి బండిలో సిలిండర్ పేలుడు
సాక్షి, కడ్తాల్(కల్వకుర్తి): పానీపూరి బండిలో గ్యాస్ సిలిండర్ పేలిన సంఘటనలో ఇద్దరు వ్యక్తులకు స్వల్ఫ గాయాలయ్యాయి. ఈ ఘటన కడ్తాల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీశైలం–హైద్రాబాద్ జాతీయ రహదారిపై మండల కేంద్రంలోని బస్‌స్టాప్ పక్కన, మార్వాడీ కమలేష్ అనే వ్యక్తి కొంత కాలంగా పానీపూరి తోపుడుబండిని ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్నాడు. మంగళవారం సాయంత్రం పానిపూరిలు తయారు చేస్తుండగా, ఒక్కసారిగా సిలిండర్ పైపు నుంచి గ్యాస్ లీకై క్షణాల్లో ఆ బండి మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో భయాందోళనకు గురైన సమీపంలోని చిరువ్యాపారులు పరుగులు పెట్టారు. గమనించిన స్థానికులు కొంత మంది సమీపంలోని పాలశీతలీకరణ కేంద్రం నుంచి నీళ్లు తీసుకువచ్చి వేంటనే మంటలపై నీళ్లు చల్లుతూ, బండి క్రింద ఉన్న సిలిండర్‌ను తొలగించారు. ఈ సంఘటనలో పానీపూరి బండి యాజమాని కమలేష్‌తో పాటు, అతని కుమారుడికి స్వల్ఫంగా గాయాలయ్యాయి. పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు, సమీపంలోని చిరువ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. -
పానీపూరీ ప్రియులకు చేదు వార్త!
-
ఇక పానిపూరి బ్యాన్...
గాంధీనగర్ : పానిపురి.. ఈ ఉత్తరాది చాట్ మనకు కూడా బాగా అలవాటయ్యింది. ఎంతలా అంటే ఇప్పుడు గల్లీకో పానీపూరి బండి కనిపిస్తుంది. ఇప్పిడిప్పుడే ఓ మోస్తరు నగరాలను దాటుకుని గ్రామాల్లోకి కూడా ప్రవేశిస్తోంది. అంతలా ఈ పానిపురి మన మనసుల్ని గెల్చుకుంది. అయితే పానిపురి ప్రియులకు ప్రభుత్వం ఒక బ్యాడ్ న్యూస్ తెలిపింది. ఇక మీదట పానిపురిని బ్యాన్ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఇది అంతటా కాదు.. కేవలం గుజరాత్ వడోదరలో మాత్రమే. మన దగ్గర పానిపురి, ఉత్తరాదిలో ‘గోల్గప్ప’ అని పిల్చుకునే ఈ చిరుతిండిని బ్యాన్ చేస్తున్నట్లు వడోదర మున్సిపల్ అధికారులు ప్రకటించారు. కారణం వీటిని అపరిశుభ్ర వాతావరణంలో తయారుచేయడమే. అసలే ఇది వర్షాకాలం.. అంటు వ్యాధులు అధికంగా ప్రబలే కాలం. అపరిశుభ్ర వాతావరణంలో తయారవుతుంటాయనే ఉద్దేశంతో బయటి తిండి తినకూడదని హెచ్చరిస్తుంటారు. పానిపూరిల తయారీల్లో కల్తీలు జరుగుతున్నాయనే సమాచారం అందుకున్న వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్యశాఖ అధికారులు పట్టణంలోని దాదాపు 50 ప్రాంతాల్లోని పానిపూరి తయారి కేంద్రాలపై దాడి చేశారు.ఈ తనిఖీల్లో పాడయిపోయిన పిండి, కుళ్లిన ఆలుగడ్డలు, వినియోగించిన నూనేను వాడి పానీపూరిలు తయారి చేస్తున్నాట్లు గుర్తించామన్నారు. దాదాపు 4, 000 కేజీల పానీ పూరిలను, 3, 500 కేజీల కాబూలి శనగలు, ఆలుగడ్డలతో పాటు 1200 లీటర్ల రసాయన నీటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ విషయం గురించి మున్సిపల్ శాఖ ఆరోగ్యాధికారి ఒకరు ‘పానిపూరిలు చాలా అపరిశుభ్ర వాతావరణంలో తయారవుతున్నాయనే సమాచారం అందింది. అందువల్లే దాడులు నిర్వాహించాము. ఇంత అపరిశుభ్ర వాతావరణంలో తయారవుతున్న వీటిని తింటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే వీటిని బ్యాన్ చేశాం’ అని తెలిపారు. -
జియో పానీపూరి.. అన్లిమిటెడ్
టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. జియో దెబ్బకు టెలికాం సంస్థలు అన్నీ ఒక్కసారిగా కిందకు దిగి వచ్చాయనే చెప్పాలి. ఉచిత కాల్స్, డేటా పేరుతో మార్కెట్లో హల్చల్ చేసింది. జియోను ఆదర్శంగా తీసుకున్న పానీపూరి వ్యాపారి తన వినియోగదారులకు సరికొత్త ఆఫర్లు ప్రకటించాడు. జియోలో అన్లిమిటెడ్ ప్లాన్లు లాగే జియో అన్లిమిటెడ్ పానీపూరీ అంటూ ఆఫర్లను ఫ్లెక్సీ పెట్టి మరీ వ్యాపారం చేస్తున్నాడు. దీంతో అక్కడి పానీపూరి ప్రియులు భలే చౌక బేరం అంటూ పండగ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పానీపూరి వ్యాపారి ప్రకటించిన ఆఫర్లు ఏంటంటే.. 80 రూపాయలు చెల్లిస్తే గంటపాటు అన్ లిమిటెడ్‌గా పానీపూరి. 200 రూపాయలకు ఒకరోజు మొత్తం, 2000 రూపాయలకు ఒక నెల మొత్తం పానీపూరి అన్ లిమిటెడ్‌గా తినొచ్చు. -
జర భద్రం లేకుంటే పానీపూరితో పరేషానే
వైరా: సాయంత్రం వేళల్లో వేడివేడి గప్‌చుప్, పానీపూరి తింటుంటే ఆహా..భలే రుచి అనుకుంటారు. అయితే..తయారీలో కొందరు అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని, కలుషిత నీటిని వాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే..పరిశుభ్రంగా ఉన్న బండ్ల వద్దనే తినాలని పెద్దలు, వైద్యులు సూచిస్తున్నారు. పూరిని బొటనవేలుతో నొక్కి..అందులో ద్రావణాన్ని నింపుతాడు. గోరులో మట్టి రేణువులు ఉంటే..అవి అందులో కలిసే అవకాశముంది. కుండకు కట్టే ఎర్రటి వస్త్రాన్ని ఉతకడంపై అనేక అనుమానాలు ఉంటాయి. నీటిని వేడి చేయని కారణంగా సూక్ష్మజీవులు చనిపోవు. ఈ–కొలై అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని వైద్యులు అంటున్నారు. పానీ, పూరిలను తయారు చేసే ప్రాంతాలపై పట్టింపు లేదు. అధికారుల తనిఖీలు ఉండవు రోడ్ల పక్కన అమ్ముతున్నప్పుడు దుమ్ముధూళి ఎగసిపడుతున్నా..అమ్మకాలు జరుగుతుంటాయి. అలాంటివి తింటే..వాంతులు, విరేచనాలు అయ్యే ప్రమాదముంది. చింతపండు పులుసు (పానీ) తయారీకి ఉప్పు, జీరావన్ (మధ్యప్రదేశ్‌కు చెందిన మసాలా), పుదీనా, నల్ల మిరియాల పొడి ఇలా అనే రకాలు కలుపుతారు. అయితే..పరిశుభ్రమైన నీటిని వాడరనే అపవాదు ఉంది. సంబంధిత అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తే..ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని పెద్దలు అంటున్నారు. నిల్వ ఉంటే బ్యాక్టీరియానే.. పానీలో రాజస్థాన్‌కు చెందిన మసాలాలు కలుపుతారు. ఇవి చాలా ఘాటుగా ఉంటాయి. చిన్న పిల్లలకు జీర్ణం కావు. వేడి చేయకుండా నిల్వ ఉండే పులుసులో బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. అప్పటికప్పుడు తయారు చేసింది కొద్దిగా తీసుకుంటే ఏం కాదు. ఎక్కువ తీసుకోవద్దు. కడుపులో అల్సర్, గ్యాస్ సమస్యలున్న వారు దీని జోలికి వెళ్లకపోవడం మంచిది. – డాక్టర్ ఖలీముద్దీన్, ప్రభుత్వ వైద్యుడు , వైరా -
అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి
– భర్తే హత్య చేశాడని బంధువుల ఆరోపణ – పరారీలో భర్త వెల్దుర్తి(కృష్ణగిరి): వెల్దుర్తి పట్టణంలోని విద్యానగర్‌లో నివాసముంటున్న కౌసల్య(28) అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. పూర్తి వివరాలు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లాల్జీ, కౌసల్య దంపతులకు ఇద్దరు సంతానం. వీరు ఏడాది కాలంగా పానీపూరి వ్యాపారం చేసుకుంటూ వెల్దుర్తిలోనే జీవనం సాగిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోనే ఉన్న వీరి కుమారుడు చిన్నారి హేమంత్‌ను కౌసల్య మేనమామ లక్ష్మణ్ వారం రోజుల క్రితం వెల్దుర్తికి తీసుకొచ్చాడు. కాగా ఆదివారం రాత్రి భార్య, భర్త, కుమారుడు ఇంట్లో నిద్రించగా లక్ష్మణ్ ఇంటి ముందు నిద్రించాడు. ఉదయం నిద్రలేచి ఇంట్లోకి వెళ్లిన లక్ష్మణ్‌కు కౌసల్య నిర్జివంగా పడివుండటాన్ని గమనించాడు. విషయాన్ని తమ బంధువులకు చేరవేశాడు. కాగా సమీపంలోనే బెల్ట్ ఉండటం, ముక్కు నుంచి రక్తం కారడం, లాల్జీ కనిపించకుండా పోవడం బట్టి హత్య చేసివుంటాడని బంధువులతో పాటు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాదస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ నాగేష్ తెలిపారు. -
ఈ టేస్ట్ సెపరేట్ గురూ
సాగర్‌నగర్ : కొత్త లోకం..కొత్త మనుషులు, కొత్త అందాలు, అందమైన ప్రకతి, ఇవ్వన్నీ ఒక స్మార్ట్ విశాఖ బీచ్‌లకే సొంతం. ప్రశాంతంగా ఉన్న ఈ అద్బుతమైన బీచ్ వెంట రుచి నడక ఆనందం, శాంతి ఒక మరుపురాని ఆనుభవాన్ని అందిస్తుంది. రోజుకు వేలాది మంది పర్యాటకులు, సందర్శకులు విచ్చేసే బీచ్‌లో బెస్ట్ రిఫ్రెష్మెంట్...పానీపూరి, మురీమిక్సర్. సందర్శకులు వీటిని రుచి చూడకుండా వెళ్లరంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ వ్యాపారం మూడు ప్లేట్లు, ఆరు టేస్ట్లుగా విరజల్లుతోంది. ధనికులు సైతం రహదారుల పక్కన ఎటువంటి హంగు ఆర్భాటం లేని బండ్లపై అమ్మే తినుబండారాల రుచి చూస్తుంటారు. అనుకున్నప్పుడు ఆలస్యం లేకుండా ఇష్టమైనది తినడానికి వీలుండడంతో స్ట్రీట్ ఫుడ్...ఇట్స్ డిఫరెంట్ అంటూ లొట్టలు వేస్తున్నారు. చోటా బిజినెస్.. బడా మార్కెట్: పానీపూరీ, మురీమిక్సర్.. బీచ్‌రోడ్డులో ఎన్నో రకాల స్ట్రీట్ ఫుడ్ దొరుకుతున్నా వీటి ప్రత్యేకతే వేరు. రుషికొండ బీచ్ నుంచి ఫిషింగ్ హార్బర్ వరకు పానీపూరీ, మురీమిక్సర్ బండ్లు దుకాణాలు కలిపి మొత్తం 225 ఉన్యాయి. ముఖ్యంగా పర్యాటకులు, సందర్శల తాకిడి అధికంగా ఉన్న ఆర్కే బీచ్ (వైఎసార్ విగ్రహం నుంచి ఫిషింగ్ హార్బర్)వరకు మురీమిక్స్ర్, అమ్మేవారు 200 మంది ఉన్నారు. తెన్నేటిబీచ్ పార్కు, రుషికొండ బీచ్‌లో పానీపూరీ విక్రయించేవారు 25 మంది మాత్రమే. ఒక్కొ దుకాణం రోజూ పెట్టుబడి పోనూ రూ.1000కాగా, ఆదివారం రూ.1500 వరకు ఆదాయం ఉంటుంది. అంటే నెలవారీగా రూ.30,000 చొప్పున, ఏటా 3.60 లక్షల రూపాయాలు సగటున ఆదాయం లభిస్తోంది. మొత్తం 225 మంది కలసి ఏడాదికి రూ. 8 కోట్ల, 10లక్షల రూపాయాలు వ్యాపారం జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉండే ఆర్కే బీచ్‌లో దీని బిజినెస్ రెట్టింపుగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా మురీమిక్సర్, మురీ బజ్జీ వ్యాపారం ఉంటుంది. తెన్నేటి బీచ్ పార్కు వద్ద పానీపూరీ బిజినెస్ అధికంగా ఉంటుంది. ఇక రుషికొండ బీచ్‌లో పానీపూరి, మురీమిక్సర్, మురీబజ్జీలు, మొక్కజొన్న కంకెలు నోరూరిస్తాయి. రూ.10 నుంచి రూ.20 ధరల్లో లభించే ఈ చట్పటా ఐటెమ్స్ యూత్‌కే కాదు అన్ని వయస్కుల్లోనూ ఫేవరిట్. మురీమిక్సర్కు ఉల్లి, టమాటా, పల్లీలు (వేరుశనగ)పచ్చబటానీ, బజ్జీలు, సాల్ట్,నిమ్మ,మసాల కారం, మరమరాలు కలిపి తయారు చేస్తారు. -
వరల్డ్ స్ట్రీట్ ఫుడ్
పానీపూరీ, సమోసా చాట్, మిర్చీబజ్జీ, పావ్‌బాజీ... ఇవి హైదరాబాదీ వీధుల్లో నిరంతరం లభించే స్ట్రీట్‌ఫుడ్. ఇవే కాదు, వివిధ దేశాల్లో లభించే స్ట్రీట్‌ఫుడ్‌ను ది స్క్వేర్ నోవాటెల్ ప్రతి శుక్రవారం నగరవాసులకు అందిస్తోంది. అమెరికన్, యూరోపియన్, అరబిక్, మెక్సికన్ వెరైటీలైన చుర్రోస్, కుక్కీస్ క్రీమ్, లైవ్ సబ్వే, మినీ బర్గర్ స్టేషన్, క్వోసెల్లీడాస్, పోటిన్ వంటి రుచులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువగా ఉన్న ఈ హోటల్.. వీకెండ్లో సకుటుంబ సమేతంగా ఉల్లాసంగా గడిపే ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. నగరంలోనే అతిపెద్ద జిమ్, స్పా, డిన్నర్ కోసం లైవ్ కిచెన్‌తో కూడిన ఇండియన్ రెస్టారెంట్, స్విమ్మింగ్‌పూల్, టెన్నిస్, వాలీబాల్, బాస్కెట్‌బాల్ కోర్టులు ఇక్కడ దేశ విదేశీ అతిథులకు ఆహ్వానం పలుకుతాయి. ఈ హోటల్ శని, ఆదివారాల్లో వీకెండ్ ఫ్రెండ్లీ ప్యాకేజీలనూ అందిస్తోంది. ఈ ప్యాకేజీల్లో పిల్లలకు ఎలాంటి చార్జీలూ ఉండకపోవడం విశేషం. - ఓ మధు -
'పానీపూరి' సినిమా స్టిల్స్
-
వినోదాల ‘పానీపూరి’
‘‘కుటుంబ విలువలతో కూడిన చిత్రమిది. వినోదంతో పాటు చిన్నపాటి సందేశం కూడా ఉంది’’ అని సుమన్ చెప్పారు. సూర్యతేజ, హర్షిక పూంచా జంటగా కేఆర్ విష్ణు దర్శకత్వంలో ప్రదీప్‌కుమార్ జంపా నిర్మిస్తున్న ‘పానీపూరి’ చిత్రం టాకీపార్ట్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘టైటిల్ తరహాలోనే సినిమా ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు. కథే ఈ చిత్రానికి ప్రాణమని, పాటలు మినహా చిత్రీకరణ పూర్తయిందని నిర్మాతలు తెలిపారు. సోలో హీరోగా తనకిది తొలి చిత్రమని సూర్యతేజ చెప్పారు. ఈ సినిమాలో ప్రతి పాత్ర కొత్తగా ఉంటుందని నరేష్ అన్నారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే: కె.బ్రహ్మారెడ్డి, సంగీతం: సునీల్ కశ్యప్.