పానీ పూరీ అమ్మడానికి థార్.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే.. | Anand Mahindra Shares Panipuri Girl With Mahindra Thar | Sakshi
Sakshi News home page

Anand Mahindra: పానీ పూరీ అమ్మడానికి థార్.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..

Published Thu, Jan 25 2024 2:31 PM | Last Updated on Thu, Jan 25 2024 4:58 PM

Anand Mahindra Share Panipuri Girl With Mahindra Thar - Sakshi

భారతీయ మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన థార్ కారుకి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరికిని ఆకర్శించిన ఈ ఆఫ్ రోడర్ కారుని ఒక యువతి పానీ పూరీ అమ్మడానికి ఉపయోగించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.

వీడియోలో గమనించినట్లయితే.. ఒక పానీపూరీ విక్రయించే యువతి తన పానీపూరీ బండిని లాగడానికి మహీంద్రా థార్ ఉపయోగిస్తున్నట్లు చూడవచ్చు. ఈ వీడియోకు ఆనంద్ మహీంద్రా కూడా ఫిదా అయిపోయారు.

వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా.. తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా రియాక్ట్ అవుతూ.. ప్రజలు ఎదగటానికి మా కార్లు సహాయపడాలని కోరుకుంటున్నట్లు, ఆ వీడియో తనకు ఎంతగానో నచ్చినట్లు ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ వీడియో చూసి ఆ యువతిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఇదీ చదవండి: క్షణాల్లో రోడ్డు వేసేస్తుంది.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

పానీపూరి బండిని గతంలో స్కూటర్‌తో, తర్వాత బుల్లెట్ బైక్‌తో, ఇప్పుడు మహీంద్రా థార్‌తో లాగుతుంది. ఈమె పేరు తాప్సీ ఉపాధ్యాయ్. పనీ పూరి బండిని లక్షల ఖరీదైన కారుతో లాగడం చూసి చాలామంది అవాక్కవుతున్నారు, మరికొందరు మెచ్చుకుంటున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఈ మహీంద్రా థార్ కారుని పానీపూరీ అమ్మి కొనుగోలు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement