Mahindra Thar
-
థార్ రాక్స్ Vs గూర్ఖా: ఆఫ్ రోడర్ కింగ్ ఏది?
ఎస్యూవీ, ఎంపీవీ, హ్యాచ్‌బ్యాక్, కూపే, సెడాన్ వంటి వాటికి మాత్రమే కాకుండా భారతీయ మార్కెట్లో ఆఫ్-రోడర్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల 5 డోర్ థార్ (థార్ రాక్స్) లాంచ్ చేసింది. అయితే ఈ విభాగంలో ఫోర్స్ కంపెనీకి చెందిన గూర్ఖా కూడా ఇప్పటికే అమ్మకానికి ఉంది. ఈ రెండు కార్లు ఒకే విభాగానికి చెందినవి కావడం వల్ల, కొనుగోలుదారులు ఏ కారు ఎలాంటి ఫీచర్స్ కలిగి ఉందనే విషయంలో కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు కార్ల గురించి మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ చూసేద్దాం..ధరలుమహీంద్రా కంపెనీ లాంచ్ చేసిన థార్ రాక్స్ ప్రారంభ ధరలు రూ.12.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఫోర్స్ గూర్ఖా 5 డోర్ ప్రారంభ ధర రూ. 18 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే ధరలు మీరు ఎంచుకునే వేరియంట్ మీద, నగరాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంది.డిజైన్థార్ రాక్స్, ఫోర్స్ గూర్ఖా రెండూ కూడా ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్ మీద ఆధారపడి ఉంటుంది. హార్డ్ టాప్ ఆప్షన్స్ కలిగిన ఈ ఆఫ్-రోడర్స్ 5 డోర్స్ పొందుతాయి. థార్ చూడటానికి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. గూర్ఖా కఠినమైన లేదా దృఢమైన డిజైన్ పొందుతుంది. లైటింగ్ సెటప్, సైడ్ ప్రొఫైల్, రియర్ ప్రొఫైల్ అన్నీ ఆకర్షణీయంగా ఉంటాయు.ఫీచర్స్మహీంద్రా థార్ రాక్స్ 10.25 ఇంచెస్ డిజిటల్ డిస్ప్లేలను పొందుతుంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, న్యావిగేషన్, హార్మన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి వాటితో పాటు మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ఏడీఏఎస్ టెక్నాలజీ కూడా ఉన్నాయి.ఫోర్స్ గూర్ఖా 5 డోర్ మోడల్ 9 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, ఏసీ వెంట్స్, వన్-టచ్ అప్/డౌన్ విండో, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారులో ఏబీఎస్ విత్ ఈబీడీ, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.ఇంజిన్ వివరాలుమహీంద్రా థార్ రాక్స్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్ పొందుతుంది. ఫోర్స్ గూర్ఖా కేవలం ఒకే డీజిల్ ఇంజిన్ ఆప్షన్ పొందుతుంది. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.ఇదీ చదవండి: టీవీఎస్ జుపీటర్ 125 Vs హోండా యాక్టివా 125: ఏది బెస్ట్?మహీంద్రా థార్ రాక్స్ లాంగ్ జర్నీ చేయడానికి, నగర ప్రయాణానికి, కఠినమైన భూభాల్లో ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఫోర్స్ గూర్ఖా కఠినమైన రహదారుల్లో కూడా హుందాగా ముందుకు వెళ్తుంది. ధర పరంగా గూర్ఖా 5 డోర్ కంటే కూడా థార్ రాక్స్ ధర చాలా తక్కువ. -
థార్ రాక్స్ 4x4 ధరలు ఇవే
థార్ రాక్స్ 4x4 వేరియంట్ ధరలను మహీంద్రా కంపెనీ వెల్లడించింది. ఈ SUV ధరలు రూ. 14.79 లక్షల నుంచి రూ. 22.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ఎడిషన్ ఎంఎక్స్5, ఏఎక్స్5 ఎల్, ఏఎక్స్7 ఎల్ అనే మూడు వేరియంట్లలో కేవలం డీజిల్ ఇంజిన్ ఆప్షన్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.మహీంద్రా థార్ రాక్స్ 4x4 ఎడిషన్ 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో 330 Nm టార్క్ 150 Bhp పవర్ అందిస్తుంది. అదే 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 172 Bhp పవర్, 370 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్నో, సాండ్, మడ్ అనే మూడు పవర్ మోడ్స్ పొందుతుంది.ఇదీ చదవండి: పరిమాణం చిన్నది.. పనిమాత్రం పెద్దది: 'పవర్'ఫుల్ రియాక్టర్థార్ రాక్స్ ఎంఎక్స్5 4x4 ఎడిషన్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, రివర్స్ కెమెరా, సన్‌రూఫ్, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్, ఆటో హెడ్‌లైట్స్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఏఎక్స్5 ఎల్ వేరియంట్ 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్, లెవల్ 2 ఏడీఏఎస్ టెక్ వంటివి పొందుతుంది. ఏఎక్స్7 ఎల్ పనోరమిక్ సన్‌రూఫ్, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా వంటివి పొందుతాయి. -
5 డోర్ల థార్ ‘రాక్స్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మహీంద్రా అయిదు డోర్ల థార్ రాక్స్ భారత్‌లో ఎంట్రీ ఇచి్చంది. ప్రారంభ ధర ఎక్స్‌షోరూంలో రూ.12.99 లక్షలు. సెప్టెంబర్ 14 నుంచి టెస్ట్ డ్రైవ్ కోసం రాక్స్ అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 3 నుంచి బుకింగ్స్ ప్రారంభం. దసరా నుంచి డెలివరీలు ఉంటాయి. 2 లీటర్ ఎం–స్టాలియన్ టీజీడీఐ పెట్రోల్ ఇంజన్, 2.2 లీటర్ ఎం–హాక్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్‌లో ఆరు వేరియంట్లలో రేర్ వీల్ డ్రైవ్, 4 వీల్ డ్రైవ్ డ్రైవ్ట్రెయిన్తో లభిస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంచుకోవచ్చు. 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, కీ లెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్, 644 లీటర్స్ బూట్ స్పేస్ వంటి హంగులు ఉన్నాయి. -
మహీంద్రా థార్ రాక్స్ వచ్చేసింది.. దసరాకి డెలివరీలు!
ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న మహీంద్రా థార్ రాక్స్ ఎట్టకేలకు లాంచ్ అయింది. అయితే బుకింగ్స్, టెస్ట్ డ్రైవ్, డెలివరీల కోసం మాత్రం కొంత సమయం వేచిఉండాలి. కాగా ఈ క్రేజీ ఎస్యూవీ గురించిన కొన్ని వివరాలను కంపెనీ వెల్లడించింది.మహీంద్రా థార్ రాక్స్ ధరలు (ఎక్స్-షోరూమ్) రూ.12.99 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 14 నుంచి టెస్ట్ డ్రైవ్‌లు అందుబాటులోకి రానున్నాయి. అయితే బుకింగ్‌లు మాత్రం అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతాయి. డెలివరీల విషయానికొస్తే దసరా నాటికి వినియోగదారులకు వాహనాలను అందజేయడం ప్రారంభిస్తుంది.వేరియంట్లు, ధరలుథార్ రోక్స్ MX1, MX3, MX5, AX3, AX5, AX7 వంటి అనేక రకాల ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. కానీ మహీంద్రా కేవలం ఎంపిక చేసిన కొన్ని పెట్రోల్, డీజిల్ వేరియంట్ల ధరలను మాత్రమే ప్రకటించింది.పెట్రోల్ వేరియంట్లు» మహీంద్రా థార్ రాక్స్ MX1 MT RWD: రూ. 12.99 లక్షలు» మహీంద్రా థార్ రాక్స్ MX3 AT RWD: రూ. 14.99 లక్షలుడీజిల్ వేరియంట్లు» మహీంద్రా థార్ రాక్స్ MX1 MT RWD: రూ. 13.99 లక్షలు» మహీంద్రా థార్ రాక్స్ MX3 MT RWD: రూ. 15.99 లక్షలు» మహీంద్రా థార్ రాక్స్ AX3L MT RWD: రూ. 16.99 లక్షలు» మహీంద్రా థార్ రాక్స్ MX5 MT RWD: రూ. 16.99 లక్షలు» మహీంద్రా థార్ రాక్స్ AX5L AT RWD: రూ. 18.99 లక్షలు» మహీంద్రా థార్ రాక్స్ AX7L MT RWD: రూ. 18.99 లక్షలుఇంజిన్, గేర్బాక్స్మహీంద్రా థార్ రాక్స్ 2.0L mStallion టర్బో-పెట్రోల్, 2.2L mHawk టర్బో-డీజిల్ అనే రెండు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. టర్బో-పెట్రోల్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో గరిష్టంగా 162 హెచ్‌పీ పవర్ అవుట్‌పుట్, 330 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఆటోమేటిక్‌లో అయితే గరిష్ట అవుట్‌పుట్‌లు 177 హెచ్‌పీ, 380 ఎన్ఎం వరకు పెరుగుతాయి. ఆయిల్ బర్నర్ విషయానికి వస్తే ఇది స్టిక్ షిఫ్ట్‌తో 152 హెచ్‌పీ, 330 ఎన్ఎం అవుట్‌పుట్‌ను అందిస్తుంది. అయితే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ 175 హెచ్‌పీ, 370 ఎన్ఎమ్లను అందుకుంటుంది.కలర్ ఆప్షన్లు, ఫీచర్లుథార్ రాక్స్ మొత్తం ఏడు రంగుల్లో లభిస్తుంది. స్టెల్త్ బ్లాక్, టాంగో రెడ్, ఎవరెస్ట్ వైట్, డీప్ ఫారెస్ట్, నెబ్యులా, బాటిల్షిప్ గ్రే, బర్న్ట్ సియెన్నా కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ పెయింట్ స్కీమ్‌లన్నీ బ్లాక్-పెయింటెడ్ రూఫ్‌తో జత చేయబడి ఉంటాయి. 60:40 రియర్ స్ప్లిట్, 10.25-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, పవర్డ్ సీట్లు, రెండు సన్‌రూఫ్ ఆప్షన్లు, కనెక్టెడ్ కార్ టెక్, లెవెల్-2 ADAS, అకౌస్టిక్ గ్లాసెస్, 9-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. -
ఎస్‌యూవీల రారాజు ఇదే..
దేశంలో ఎస్‌యూవీలకు ఆదరణ ఇటీవల బాగా పెరుగుతోంది. భారతీయులు కొంటున్న పాసింజర్ వాహనాల్లో దాదాపుగా సగం ఎస్‌యూవీలే ఉంటున్నాయి. కస్టమర్లలో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా అన్ని ప్రముఖ ఆటోమొబైల్ మేకర్లు ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్ ఎస్‌యూవీలను కస్టమర్లకు పరిచయం చేస్తున్నాయి.దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో 14 శాతం వృద్ధితో 2.12 లక్షల వాహనాల అమ్మకాలను సాధించింది. ఇందులో 1.24 లక్షల వాహనాలు ఎస్‌యూవీలు ఉన్నాయి. ఉత్పత్తి సామర్థ్యం కూడా గణనీయంగా పెరిగింది. నెలవారీ ఉత్పత్తి 49,000 యూనిట్లను నుంచి ఈ సంవత్సరం చివరి నాటికి 64,000 యూనిట్లకు పెంచుతోంది కంపెనీ.దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో మహీంద్రా అగ్రగామిగా నిలిచింది. మొత్తం ఎస్యూవీ మార్కెట్లో మహీంద్రా ఎస్‌యూవీల వాటా 21.6 శాతంగా ఉంది. ఇతర విభాగాల్లోనూ మహీంద్రా లీడ్‌లో ఉంది. 50.9 శాతం మార్కెట్ వాటాతో ఎల్సీవీ (లైట్ కమర్షియల్ వెహికల్), 44.7 శాతం వాటాతో ట్రాక్టర్లు, 43.4 శాతం వాటాతో ఎలక్ట్రిక్ 3-వీలర్లతో సహా అనేక ఇతర విభాగాలలో వాహనాలను అత్యధికంగా విక్రయిస్తోంది. దీంతో కంపెనీ మొత్తం త్రైమాసిక ఆదాయం 10 శాతం పెరిగింది. అయితే నికర లాభం మాత్రం 6 శాతం పడిపోయింది.ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థార్ 5-డోర్ వాహనాన్ని ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆవిష్కరించడానికి మహీంద్రా సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు టీజర్లు, ట్రైలర్లు వచ్చాయి. ఈ వాహనానికి థార్ రోక్స్ అని పేరు పెట్టింది కంపెనీ. దీని ప్రారంభ ధర సుమారు రూ.14 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండవచ్చని అంచనా. -
సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి ఆనంద్ మహీంద్ర స్పెషల్ గిఫ్ట్
పారిశ్రామికవేత్త, ఎంఅండ్ఎం అధినేత ఆనంద్ మహీంద్ర మరోసారి తన గొప్ప మనుసు చాటుకున్నారు. క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రిని ఉద్దేశించి ఉద్వేగభరితమైన ట్వీట్ చేశారు. క్రికెటర్ సర్ఫరాజ్‌లో విశ్వాసాన్ని నింపింనందుకు అతని తల్లిదండ్రులను అభినందనల్లో ముంచెత్తారు. అనుకున్నది సాధించేంతవరకు నమ్మకాన్ని కోల్పోకూడదనే స్పూర్తి నిచ్చారు అంటూ వారిని ప్రశంసించారు. ఈ సందర్బంగా నౌషాద్ మాటలు, సర్ఫరాజ్ బ్యాటింగ్ వీడియోను షేర్ చేశారు. ఒక బహుమతిని కూడా ప్రకటించారు. విశ్వాసాన్ని కోల్పోవద్దు....కఠోర శ్రమ, ధైర్యం, సహనం..ఇంతకంటే గొప్ప లక్షణాలు ఏముంటాయి ఒక తండ్రి పిల్లల్లో స్ఫూర్తి నింపేందుకు. అందుకే స్పూర్తిదాయకమైన తండ్రి నౌషద్ ఖాన్‌కు థార్ బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నా. ఇది తనకు గౌరవం ఈ బహుమతిని ఆయన స్వీకరిస్తానని విశ్వసిస్తున్నా.. అంటూ ట్వీట్ చేశారు. “Himmat nahin chodna, bas!” Hard work. Courage. Patience. What better qualities than those for a father to inspire in a child? For being an inspirational parent, it would be my privilege & honour if Naushad Khan would accept the gift of a Thar. pic.twitter.com/fnWkoJD6Dp — anand mahindra (@anandmahindra) February 16, 2024 జెర్సీ నంబర్ 97తో బరిలోకి సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రంలోనే ఇంగ్లండ్‌తో గురువారం రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో జరిగిన మూడో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి తానేంటో నిరూపించుకున్నాడు. కాగా దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు సర్ఫరాజ్ ఖాన్. భారత వెటరన్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అతడికి అరంగేట్రం క్యాప్ అందించిన సందర్భంలో సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్, సర్ఫరాజ్ భార్య భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించినవ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. జెర్సీ నంబర్ 97 సర్ఫరాజ్ తండ్రి నౌషాద్ కూడా క్రికెటర్. తన కలను నెరవేర్చుకునే ఆశయంలో భాగంగా కుమారుడికి శిక్షణ ఇచ్చాడు. ఇక 97 విషయానికి వస్తే మూడో టెస్టుకు ముందు మాట్లాడుతూ జెర్సీ నంబర్ 97 విశేషాలుతెలిపాడు. తండ్రి పేరులోని నౌ అంటే తొమ్మిది, షాద్ నుంచి 7 తీసుకున్నట్లు తెలిపాడు. అంతేకాదు ఇటీవల అండర్-19 ప్రపంచకప్‌లో ఆడిన సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ జెర్సీ నంబర్ కూడా 97 కావడం విశేషమే మరి. -
రూ. 700లకు థార్ అడిగిన బుడ్డోడు.. ఫ్యాక్టరీలో హల్చల్ చేశాడు - వీడియో
కొన్ని రోజులకు ముందు చీకు అనే బుడ్డోడు మహీంద్రా కంపెనీకి చెందిన థార్ SUVను రూ. 700కి కొనాలని ప్లాన్ చేస్తున్న ఓ చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ 'ఆనంద్ మహీంద్రా'ను ఎంతగానో ఆకర్శించింది. 700 రూపాయలకు థార్ కొనలేవని స్పష్టం చేసిన ఆనంద్ మహీంద్రా పూణేలోని చకన్లోని తమ ప్లాంట్‌ని సందర్శించమని పేర్కొన్నాడు. చీకు చకాన్కి వెళ్తున్నాడు అనే ట్యాగ్‌తో ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. 2.4 నిమిషాల నిడివిగల వీడియోలో థార్ కారులోనే చీకు పూణేలోని చకన్లోని మహీంద్రా తయారీ కర్మాగారం చేరుకుంటాడు. ప్లాంట్ సిబ్బంది ఆ పిల్లాడికి ప్రవేశద్వారం వద్ద పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ఫ్యాక్టరీలోకి ప్రవేశించే సమయంలో హెల్మెట్ ధరించాడు. హెల్మెట్ కారణంగా తన తలపై దురద ఉందని చీకు పేర్కొన్నాడు. ఆ తరువాత అతడు కార్ల అసెంబ్లింగ్ లైన్ తిరుగుతూ.. అక్కడ కార్లను ఎలా అసెంబ్లిగ్ చేయాలో తెలుసుకుంటాడు. చుట్టూ తిరుగుతూ టైర్ ర్యాక్ దగ్గరికి వస్తాడు, అసెంబ్లీ లైన్‌పై ఉన్న ఫ్యాన్ చూసి ఒక్కసారిగా షాక్‌కు గురవుతాడు. ఇదీ చదవండి: కంపెనీ పెట్టండి.. పెట్టుబడి నేను పెడతా - ఆనంద్ మహీంద్రా చీకు అక్కడే ఉన్న మహీంద్రా XUV700 డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ అతని వల్ల కాకపోవడంతో సిబ్బంది సహాయం చేస్తారు. కారులో కూర్చున్న తర్వాత సన్‌రూఫ్‌ను ఓపెన్ చేయమని అలెక్సాని అడుగుతాడు. చివరకు ఒక చిన్న చెట్టును నాటడం ద్వారా మహీంద్రా ప్లాంట్ పర్యటనను ముగించుకుంటాడు. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ.. వైరల్ వీడియోతో చీకు చకన్ ప్లాంట్‌ను సందర్శించి, చిరునవ్వులు చిందించాడు. ఇప్పుడు తన తండ్రితో రూ. 700లకు థార్ కొనమని అడగకుండా ఉంటాడని ఒక ఎమోజీ యాడ్ చేసి ట్వీట్ చేసాడు. CHEEKU goes to CHAKAN. From a viral video to a real-life adventure…Cheeku, the young Thar enthusiast, visited our Chakan plant, bringing smiles and inspiration with him. Thank you @ashakharga1 and Team @mahindraauto for hosting one of our best brand ambassadors! (And I’m… pic.twitter.com/GngnUDLd8X — anand mahindra (@anandmahindra) February 1, 2024 -
పానీ పూరీ అమ్మడానికి థార్.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..
భారతీయ మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన థార్ కారుకి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరికిని ఆకర్శించిన ఈ ఆఫ్ రోడర్ కారుని ఒక యువతి పానీ పూరీ అమ్మడానికి ఉపయోగించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం. వీడియోలో గమనించినట్లయితే.. ఒక పానీపూరీ విక్రయించే యువతి తన పానీపూరీ బండిని లాగడానికి మహీంద్రా థార్ ఉపయోగిస్తున్నట్లు చూడవచ్చు. ఈ వీడియోకు ఆనంద్ మహీంద్రా కూడా ఫిదా అయిపోయారు. వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా.. తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా రియాక్ట్ అవుతూ.. ప్రజలు ఎదగటానికి మా కార్లు సహాయపడాలని కోరుకుంటున్నట్లు, ఆ వీడియో తనకు ఎంతగానో నచ్చినట్లు ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ వీడియో చూసి ఆ యువతిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇదీ చదవండి: క్షణాల్లో రోడ్డు వేసేస్తుంది.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా పానీపూరి బండిని గతంలో స్కూటర్‌తో, తర్వాత బుల్లెట్ బైక్‌తో, ఇప్పుడు మహీంద్రా థార్‌తో లాగుతుంది. ఈమె పేరు తాప్సీ ఉపాధ్యాయ్. పనీ పూరి బండిని లక్షల ఖరీదైన కారుతో లాగడం చూసి చాలామంది అవాక్కవుతున్నారు, మరికొందరు మెచ్చుకుంటున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఈ మహీంద్రా థార్ కారుని పానీపూరీ అమ్మి కొనుగోలు చేసింది. What are off-road vehicles meant to do? Help people go places they haven’t been able to before.. Help people explore the impossible.. And in particular we want OUR cars to help people Rise & live their dreams.. Now you know why I love this video…. pic.twitter.com/s96PU543jT — anand mahindra (@anandmahindra) January 23, 2024 -
మహీంద్రా థార్ పేరు మారనుందా..? కొత్త పేరు ఏదంటే!
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరను పొందిన 'మహీంద్రా థార్' (MahindraThar) 5 డోర్ వేరియంట్ రూపంలో విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. అయితే కంపెనీ ఈ కారు పేరుని మార్చున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ థార్ SUV కొత్త పేరు కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు చేసింది. ఇందులో 'సెంచూరియన్, కల్ట్, గ్లాడియస్, రెక్స్, రోక్స్, సవన్నా, ఆర్మడ' అనే ఏడు పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 'ఆర్మడ' అనేది మహీంద్రా కంపెనీకి చెందిన 1993 నుంచి 2001 మధ్య అమ్ముడైన కారు అని తెలుస్తోంది. మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ దాని 3 డోర్స్ వెర్షన్ కంటే కూడా పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. డిజైన్ పరంగా 3 డోర్ థార్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఫీచర్స్ పరంగా కొంత అప్డేట్ పొందినట్లు తెలుస్తోంది. థార్ 5 డోర్ SUV టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్, సన్‌రూఫ్, రియర్ పార్కింగ్ కెమెరా, పిల్లర్ మౌంటెడ్ గ్రాబ్ హ్యాండిల్ వంటి వాటితో పాటు ADAS వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని కలిగి ఉండనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: అప్పుడు ఆస్తి పోగొట్టుకున్నాడు.. ఇప్పుడు రూ.37000 కోట్ల సామ్రాజ్యం.. అనేక సార్లు టెస్టింగ్ సమయంలో కనిపించిన మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్, 2.0 లీటర్ mStallion పెట్రోల్ ఇంజిన్లను పొందుతుంది. ఇంజిన్లు 6 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది. మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ 2024లో లాంచ్ అవుతుందని సమాచారం, అయితే ఎప్పుడు లాంచ్ అవుతుందనేది కంపెనీ స్పష్టంగా వెల్లడించలేదు. ధరలు, బుకింగ్స్ వంటి వివరాలతో పాటు డెలివరీలకు సంబంధించిన విషయాలు కూడా లాంచ్ సమయంలోనే అధికారికంగా వెల్లడవుతాయి. -
రూ. 700లకే మహీంద్రా థార్! ఆనంద్ మహీంద్రా రిప్లై ఇలా..
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన చాలా సంఘటనలను తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. ఈ తరహాలోనే తాజాగా ఓ పిల్లాడికి సంబంధించిన వీడియో షేర్ చేసారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో 'చీకూ యాదవ్' అనే పిల్లాడు తన తండ్రితో మహీంద్రా థార్‌ను 700 రూపాయలకు కొనుగోలు చేయడం గురించి మాట్లాడాడు. మహీంద్రా థార్, ఎక్స్‌యూవీ 700 రెండూ ఒకేలాగా ఉన్నాయని.. వాటిని రూ.700లకే కొనుగోలు చేయవచ్చని వాదించాడు. ఈ వీడియో ఎక్స్ (ట్విటర్) వేదికగా బాగా వైరల్ అయింది. ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. చీకూ వీడియోలను చాలానే చూసాను, ఇప్పుడు అతడంటే ఇష్టం ఏర్పడింది. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే.. థార్‌ను 700 రూపాయలకు విక్రయిస్తే.. మేము త్వరలో దివాళా తీయాల్సి ఉంటుందని అన్నారు. ఇదీ చదవండి: రూ.167 కోట్ల కారులో కనిపించిన 'శామ్ ఆల్ట్‌మన్' - వీడియో వైరల్ ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే.. వేలమంది వీక్షించారు, కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేశారు. చీకూ అమాయకత్వానికి చాలా మంది ముగ్దులైపోయారు. మరికొందరు చీకు మాటలు నిజమవుతాయని సమర్ధించారు. లక్షల విలువైన కారు కేవలం వందల రూపాయలకే కొనుగోలు చేయవచ్చనే అమాయకత్వం చాలా మందిని ఆకర్శించారు. My friend @soonitara sent me this saying “I love Cheeku!” So I watched some of his posts on Insta (@cheekuthenoidakid) and now I love him too. My only problem is that if we validated his claim & sold the Thar for 700 bucks, we’d be bankrupt pretty soon…😀 pic.twitter.com/j49jbP9PW4 — anand mahindra (@anandmahindra) December 24, 2023 -
గ్లాస్ సీలింగ్ బ్రేక్స్:ఈ మెకానికల్ ఇంజనీర్ గురించి తెలిస్తే ఫిదా
దేశీయ ఐఐటీ గ్రాడ్యుయేట్లు ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద కంపెనీలను లీడ్ చేస్తున్నారు. కొత్త ఆవిష్కరణకు నాంది పలుకు తున్నారు. పురుషులతో పాటు సమానంగా మహిళలు మెకానికల్ ఇంజనీరింగ్, డిజైనింగ్ రంగాల్లో సత్తా చాటుతున్నారు. కొత్త మహీంద్రా థార్‌ను డిజైన్ చేసిన మహిళ, BITS పిలానీకి చెందిన మెకానికల్ ఇంజనీర్ రామ్‌కృపా అనంతన్ విశేషంగా నిలుస్తున్నారు. ఆటోమోటివ్ పరిశ్రమలో రామ్‌కృపా అనంతన్ పేరు తెలియని వారు లేరు అతిశయోక్తి కాదు.ముఖ్యంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్‌లో డిజైన్ హెడ్‌గా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. అంతేకాదు సొంత డిజైన్ స్టూడియోను కూడా నిర్వహిస్తున్న రామ్ కృపా అనంతన్ గురించి, ఆమె సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం. మహీంద్రా అండ్ మహీంద్ర అండ్ లేటెస్ట్ వాహనాల్లో థార్ SUVకున్న క్రేజ్గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి అంతటి ప్రజాదరణ ఉన్న థార్ 2వ తరం థార్ ఆవిష్కారం వెనుక చీఫ్ డిజైనర్ రామ్ కృపా. పాపులర్ బొలెరో, మహీంద్రా SUV విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత కూడా ఆమెదే. థార్, XUV700, స్కార్పియోలాంటి మహీంద్రా ఉత్పత్తులకు చీఫ్ డిజైనర్ గా తన సత్తా చాటుకున్నారు. ఎవరీ రామ్ కృపా అనంతన్ బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ , ఐఐటీ బాంబే నుంచి మాస్టర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ ను పూర్తి చేశారు. ఆ తర్వాత 1997లో మహీంద్రా అండ్ మహీంద్రాలో ఇంటీరియర్ డిజైనర్‌గా కరియర్‌ను మొదలు పెట్టారు. 2005లో డిజైన్ హెడ్‌గా మహీంద్రా XUV 500 SUVని డిజైన్ చేసిన క్రెడిట్ దక్కించుకున్నారు.అలాగే XUV 700, స్కార్పియో ఐకానిక్ డిజైన్లను రూపకల్పన చేశారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత, రామ్‌కృపా అనంతన్ చీఫ్ డిజైనర్ పాత్రకు పదోన్నతి పొందారు. క్రక్స్ స్టూడియో, మైక్రో ఈవీ కాన్సెప్ట్ రెండేళ్ల తరువాత ప్రస్తుతం ఆమె సొంతంగా KRUX డిజైన్ స్టూడియో స్థాపించారు. 20 శాతం అప్‌సైకిల్ భాగాలను ఉపయోగించి Two 2 అనే మైక్రో-మొబిలిటీ కాన్సెప్ట్ వాహనాన్ని ఆవిష్కరించారు. చిన్న బ్యాటరీతో కూడా ఎక్కువ పరిధినిస్తుంది. 'ఓలా ఎలక్ట్రిక్'లో కృపా అనంతన్ దేశీయ ఈవీ మేకర్ బెంగళూరుకు చెందిన కంపెనీ తన ఎలక్ట్రిక్ కారు ‘ఓలా ఎలక్ట్రిక్ సెడాన్‌ను విడుదల చేయనుంది. దీని ధర రూ. 15 నుండి రూ. 25 లక్షల శ్రేణిలో ఉంటుందని అంచనా. గత ఏడాది ఆగస్టులో రామకృపా అనంతన్ ఓలా ఎలక్ట్రిక్స్‌లో డిజైన్ హెడ్‌గా చేరారు. ద్విచక్ర వాహనం , రాబోయే నాలుగు-చక్రాల విభాగాలకు ఆమె లీడ్‌గా ఉన్నారు. -
ఆనంద్ మహీంద్రాకే కంటతడి పెట్టిస్తోంది! వీడియో వైరల్
నిత్యజీవితంలో ప్రతి రోజూ మనసును తాకే సంఘనటనలు ఎన్నెన్నో కనిపిస్తూ ఉంటాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఇలాంటి సంఘటన దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా'ను సైతం కన్నీళ్లు పెట్టుకునే చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కార్తీక్ సింగ్ అనే ఒక చిన్నారి క్యాన్సర్ చికిత్స కోసం క్రమం తప్పకుండా ఆసుపత్రికి వస్తాడు, వచ్చిన ప్రతిసారి మహీంద్రా థార్ వీడియోలు చూడటం పట్ల, ఆ కారు గురించి మాట్లాడటం పట్ల ఎక్కువ ఆసక్తి కనపరిచేవాడు. అక్కడి వైద్యులతో తానూ పెద్దవాడైన తరువాత మహీంద్రా థార్ కొనుగోలు చేస్తానని చెప్పేవాడు. దీంతో ఆ చిన్నారి కోరికను నెరవేర్చారు. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా స్వయంగా తన ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేశారు. నిజానికి ఈ వీడియోను అపోలో హాస్పిటల్స్ లక్నో షేర్ చేసింది. హాస్పిటల్ అధికారులు కార్తీక్‌కు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. దీని కోసం లక్నో సమీపంలోని డీలర్‌షిప్‌ను సందర్శించి అక్కడి సిబ్బందికి విషయాన్ని పూర్తిగా వివరించింది. డీలర్షిప్ కూడా వారికి సహాయం సంతోషించారు. కార్తీక్ తరువాత కీమో సెషన్ షెడ్యూల్ సమయానికి అతనిని పికప్ చేయడానికి మహీంద్రా థార్ అతని ఇంటికి వచ్చింది. అప్పటికే కారు క్యాబిన్ బెలూన్లతో నిండిపోయి ఉంది. ఇది చూసి కార్తిక్ ఎంతగానో సంతోషించాడు. నిజంగా హాస్పిటల్ సిబ్బంది తీసుకున్న చొరవ చాలా అభినందనీయం. ఇదీ చదవండి: ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబం.. ఒక షిప్ విలువే వేల కోట్లు! తమ కుమారుడిని సంతోషపెట్టేందుకు ఆసుపత్రి అధికారులు చేసిన ప్రయత్నాలకు తల్లిదండ్రులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఆనంద్ మహీంద్రా ఈ వీడియో షేర్ చేస్తూ 'నాకు మాటలు రావడం లేదు, కళ్ళల్లో కన్నీళ్లు మాత్రమే ఉన్నాయంటూ' వెల్లడించాడు. మమ్మల్ని ఈ మంచి పనిలో భాగస్వామ్యం చేసినందుకు హాస్పిటల్ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తూ అభిఞ్ఞాదిస్తున్నారు. I’m speechless. Just tears in my eyes. Thank you @drsangitareddy Thank you Apollo Hospitals for an initiative with such humanity & for making us a part of it. और कार्तिक, मैं आपका सबसे बड़ा Fan हूं ! pic.twitter.com/d0Z1LETB9a — anand mahindra (@anandmahindra) September 23, 2023 -
బిగ్ బ్రో.. హే చోటా బ్రో.. ఆనంద్ మహీంద్రా, నాగాలాండ్ మంత్రి ఫన్నీ ట్వీట్స్!
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra), నాగాలాండ్ మంత్రి, బీజేపీ నేత టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ (Temjen Imna Along) మధ్య ఫన్నీ సంభాషణ జరిగింది. ఆనంద్ మహీంద్రాను మంత్రి అలోంగ్ బిగ్ బ్రో అని సంబోధించగా.. మంత్రిని ఆనంద్ మహీంద్రా చోటా బ్రో అంటూ సంబోధించారు. నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ ఇటీవల ఎక్స్ (ట్విటర్)లో మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ వాహన (Mahindra Thar.e) చిత్రాన్ని పోస్ట్ చేస్తూ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆగస్టు 15న మహీంద్రా కంపెనీ ఆవిష్కరించింది. మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని అలోంగ్ ప్రశంసిస్తూ ‘బిగ్ బ్రో ఆనంద్ మహీంద్రా.. కొత్త వాహనం నెక్ట్స్ లెవల్లో ఉంది’ అంటూ రాసుకొచ్చారు. వాహనాన్ని రూపొందించిన బృందానికి అభినందనలు తెలియజేశారు. అలోంగ్ ట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా కూడా ప్రతిస్పదించారు. ‘హే చో బ్రో (చోటా బ్రో)’ అంటూ ఆప్యాయంగా సంబోధించారు. మహీంద్రా థార్.ఈ వాహనాన్ని ఉద్దేశిస్తూ ఇది మీ స్థాయికి చేరిందంటూ పేర్కొన్నారు. ఈ వాహనం లాంచ్ అయిన తర్వాత మిమ్మల్ని షికారుకు తీసుకెళ్తుందని అలోంగ్‌కు తెలియజేశారు. Hey Cho Bro (Chota Bro) @AlongImna Aakhir aapke level tak pahunch gaye! When this is launched, will take you for a spin in it… #TharE https://t.co/3eY8a24e9j — anand mahindra (@anandmahindra) August 20, 2023 -
‘థార్’పై సవారీకి పెరుగుతున్న క్రేజ్
కట్టిపడేసే ఆకృతి.. ఉట్టిపడే రాజసంతో ‘థార్’ వెహికిల్ ఆకట్టుకుంటోంది. ఇది మధ్యతరగతి నుంచి సంపన్న వర్గాల వరకు అందరి మనసూ దోచుకుంటోంది. ‘థార్’పై సవారీకి చాలామంది ఆసక్తి చూపుతుండడంతో జిల్లాలోనూ ఈ వాహనాల సంఖ్య పెరుగుతోంది. జిల్లా రోడ్లపై రయ్యిరయ్యిమంటూ దూసుకుపోతున్న ‘థార్’పై సండే స్పెషల్.. సాక్షి, కామారెడ్డి: కరోనా వ్యాప్తి తర్వాత చాలామంది కార్ల కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో జిల్లాలో కార్ల సంఖ్య పెరుగుతోంంది. ఆర్థికశక్తి కూడా పెరగడంతో లగ్జరీ కార్ల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. మహీంద్ర కంపెనీ తయారు చేసిన ‘థార్’ మోడల్‌కు చాలామంది ఫిదా అవుతున్నారు. రాజకీయ నాయకులు తమ కాన్వాయ్‌లో థార్లు ఉంచుకుంటున్నారు. వ్యాపారులూ ఈ వా హనంపై మనసు పారేసుకుంటున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో రాణించిన వాళ్లు హుందాతనం కోసం థార్ మీద సవారీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కొందరైతే రెండు, మూడు వాహనాలు కొనుగోలు చేశారు. దీంతో ‘థార్’ వాహనాలు జిల్లా రోడ్లపై రయ్యిమంటూ పరుగులు తీస్తున్నాయి. లాంగ్ డ్రైవ్‌కు అనుకూలం.. చాలామంది లాంగ్ డ్రైవ్కోసం థార్‌ను ఎంచుకుంటున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ వాహనంలో విహార యాత్రలకు వెళ్లివస్తున్నా రు. కూర్చునేందుకు అనువుగా సీట్ల అమరిక ఉండడంతో ఇందులో ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు. ధరతోపాటు మెయింటెనెన్స్ ఖర్చు కాస్త ఎక్కువే అయినా థార్‌ను కలిగి ఉండడాన్ని స్టేటస్ సింబల్‌గా భావిస్తుండడంతో జిల్లాలో వాహనాల సంఖ్య పెరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వందకుపైగా థార్లు ఉన్నట్లు తెలుస్తోంది. హుందాగా ఉంటుంది.. థార్‌లో వెళ్తే ఎంతో హుందాగా ఉంటుంది. ఎటైనా ఇదే వాహనంలో వెళ్తున్నా. మట్టి రోడ్లపై ప్రయాణించినా, గుట్టల మీదికి వెళ్లినా సౌకర్యవంతంగా ఉంటుంది. లాంగ్ డ్రైవ్ కోసం కూడా ఉపయోగపడుతుంది. – సురేందర్‌రెడ్డి, కామారెడ్డి పార్ట్‌నర్స్‌తో కలిసి.. వ్యాపార భాగస్వాములం కలిసి థార్‌ను కొనుగోలు చేశాం. ఇటీవల ఫ్యామిలీతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చాను. ఫ్యామిలీతో వెళ్లడానికి ఈ వాహనం బాగుంటుంది. ఎంత ఎత్తు ప్రదేశమైనా ఎక్కడానికి ఉపయోగపడుతుంది. – రాజు పాటిల్, దేవునిపల్లి, కామారెడ్డి ఆకట్టుకునేలా.. థార్ మోడల్ చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది. స్నేహితులతో కలిసి లాంగ్ డ్రైవ్ చేయడానికి అనుకూలంగా ఉంది. రెగ్యులర్‌గా ఇందులోనే తిరుగుతున్నాం. – పత్తి శ్రీనివాస్, పిట్లం సౌకర్యవంతంగా ఉంటుంది మహీంద్ర థార్ మోడల్ ఆకర్షణీయంగా కనిపి స్తుంది. కుటుంబంతో కలిసి ఎలాంటి రోడ్లపైనైనా ప్రయాణించడా నికి ఈ వాహనం సౌకర్యంగా ఉంటుంది. – అంజద్‌ఖాన్, సీతాయిపల్లి, గాంధారి మండలం థార్ కొనాలన్నది నా కల థార్ మోడల్ చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. చిన్న ఫ్యామిలీ ప్రయాణించడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ మోడల్‌ను కొనాలన్నది నా కల. దానిని నెరవేర్చుకున్నాను. కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకూ ఇందులోనే వెళ్తా. – సిద్ధి శ్రీధర్, ఎల్లారెడ్డి పిల్లలూ ఇష్టపడతారు నేను హైదరాబాద్‌లో ఉంటాను. పదిపదిహేను రోజులకు ఒకసా రి స్వగ్రామం బిచ్కుందకు వస్తుంటా. ఇక్కడ వ్యవసాయ పనులు చూసుకుని తిరిగి వెళ్తా. ఫ్యామిలీతో కలిసి వచ్చి వెళ్తుంటాం. ఇందులో ప్రయాణాన్ని పిల్లలూ ఎంజాయ్ చేస్తారు. – నాలం శ్రీధర్, బిచ్కుంద ఎటు వెళ్లాలన్నా.. థార్ వాహనం బాగుందని నేను కొనుగోలు చేశాను. కుటుంబ సభ్యులతో కలిసి ఎటు వెళ్లాలన్నా ఇందులోనే ప్రయాణిస్తున్నాం. సేఫ్ జర్నీకి ఇలాంటి వాహన అవసరం. – భీంరెడ్డి, తిప్పాపూర్, భిక్కనూరు మండలం -
Mahindra Thar.e: అదిరిపోయే లుక్‌లో మహీంద్ర థార్ ఎలక్ట్రిక్ వెర్షన్ (ఫోటోలు)
-
అదిరిపోయే లుక్‌లో మహీంద్ర థార్ ఎలక్ట్రిక్ వెర్షన్
Mahindra Thar.e మహీంద్రా అండ్ మహీంద్ర పాపులర్ ఎస్యూవీ థార్ ఎలక్ట్రిక్ ఆఫ్-రోడర్ ఫ్యాన్స్‌కు విపరీతంగా నచ్చేస్తోంది. 'థార్-ఇ' పేరుతో రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ కారు ఫస్ట్ లుక్‌ను దక్షిణాఫ్రికాలో జరిగిన ఫ్యూచర్‌స్కేప్ ఈవెంట్లో మహీంద్ర రివీల్ చేసింది. అదిరిపోయే మిలిటరీ-గ్రేడ్ లుక్, ఫీచర్స్‌తో సరికొత్తగా భారీ క్రేజ్ సంపాదిస్తోంది. దీని ఫీచర్స్ స్పెషాలిటీస్, లుక్ మాత్రం ప్రస్తుత థార్‌కి భిన్నంగా బాక్సీ లుక్‌లో చాలా స్టయిలిష్‌గా ఉంది. 'థార్-ఇ' ఆకట్టుకంటోంది. ఈ వెహికల్లో 400 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందించే పెద్ద బ్యాటరీ ప్యాక్‌ని అమర్చనుంది. INGLO ప్లాట్‌ఫారమ్ ఎలక్ట్రిక్ రేంజ్ పరంగా చాలా అనుకూలంగా ఉండనుదని భావిస్తున్నారు. హార్డ్‌కోర్ ఆఫ్-రోడర్ కి అనుకూలంగా ఆల్ వీల్ డ్రైవ్, డబుల్ మోటార్ లేఅవుట్‌తో వస్తుంది.కొత్త LED లైటింగ్ ఎలిమెంట్స్, గ్రిల్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఫ్రంట్ అండ్ రియర్ ప్రొఫైల్‌లు గ్రే-కలర్ స్కిడ్ ప్లేట్స్ ఇచ్చింది. ఇంటీరియర్ ఫీచర్లను పరిశీలిస్తే.. అద్భుతమైన టచ్‌స్క్రీన్ కోసం రెండు స్క్రీన్లను అందిస్తోంది. థార్-ఇ ఉత్పత్తిని 2026లో తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఇక ధర విషయానికి వస్తే 20-25 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. -
థార్ జీప్ బీభత్సం.. ఇద్దరు రిజర్వు కానిస్టేబుళ్ల దుర్మరణం
మైసూరు: మైసూరు నగరంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు దుర్మరణం చెందారు. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో బైక్‌ను థార్ జీప్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రాష్ట్ర రిజర్వు పోలీసు విభాగానికి చెందిన కానిస్టేబుళ్లు మహేశ్ (23), అమర్నాథ్ (24) అక్కడికక్కడే మృతి చెందారు. నగరంలోని కుంబార కొప్పళకు చెందిన పి మహేశ్, బీజాపుర జిల్లా జమఖండి తాలూకాకు చెందిన అమరనాథ్‌లు ఐదో బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరు రాత్రి 10.30 గంటల సమయంలో నగరంలోని సిద్ధార్థ లేఔట్ సమీపంలోని ఫుడ్‌స్ట్రీట్‌లో భోజనం చేసి పల్సర్ బైక్‌లో కేఎస్ఆర్పీ బెటాలియన్ కేంద్రానికి బయలుదేరారు. నగరంలోని లలిత్ మహల్ హోటల్ సమీపంలో ఎదురుగా వచ్చిన థార్ జీప్ వీరి బైక్‌ను వేగంగా ఢీకొంది. దాదాపు పది మీటర్ల వరకు వారిని లాక్కెళ్లింది. ఇద్దరి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. థార్ జీప్ నడిపిన వ్యక్తి పారిపోయాడు. సిద్దా నగర ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
Nikhat Zareen: సాహస యాత్రలకు సిద్ధం: వరల్డ్ బాక్సింగ్ చాంపియన్
భారత స్టార్ బాక్సర్, వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు మహీంద్రా కంపెనీ స్పోర్ట్ యుటిలిటి వెహికిల్‌ను బహూకరించింది. తమ కంపెనీకి చెందిన ప్రఖ్యాత ఎస్యూవీ ‘థార్’ను బహుమతిగా అందించింది. మహీంద్ర ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్ విజేతగా నిలిచిన తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్‌కు థార్‌ను ప్రదానం చేసింది. మహీంద్రా కంపెనీ సౌత్ జోనల్ హెడ్ రాయ్, రీజినల్ సేల్స్ హెడ్ అభిషేక్, కొత్తగూడ మహీంద్రా వీవీసీ షోరూం ఎండీ వీవీ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా నిఖత్‌కు ఎస్‌యూవీని అందజేశారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్-2023లో విజేతగా నిలిచిన నిఖత్‌కు థార్‌ను గిఫ్ట్‌గా అందిస్తామని ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన మహీంద్రా కంపెనీ.. తాజాగా ఆమెకు ఎస్యూవీ తాళాలను అందజేసింది. ఈ ఈవెంట్లో కంపెనీ ఉద్యోగులతో పాటు కస్టమర్లు కూడా పాల్గొన్నారు. నిఖత్ జరీన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక తనకు ప్రతిష్టాత్మక మహీంద్ర ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్ అవార్డు రావడం పట్ల నిఖత్ జరీన్ సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తనకైతే డ్రైవింగ్ రాదని.. త్వరలోనే ‘థార్’తో తన ప్రయాణం మొదలుకానుందని పేర్కొంది. తన ప్యాషన్‌కు అనుగుణంగా ఈ ఎస్‌యూవీతో సాహసయాత్రలు చేస్తానంటూ చెప్పుకొచ్చింది. ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ (50 కేజీలు) ఈ ఏడాది మరోసారి చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. వరుసగా రెండో ఏడాది పసిడి సాధించి సత్తా చాటింది. ఢిల్లీలో జరిగిన ఫైనల్లో ఎన్గుయెన్ థిటామ్ను ఓడించి విజేతగా అవతరించి.. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో రెండు స్వర్ణాలు గెలిచిన రెండో భారత బాక్సర్‌గా నిలిచింది. -
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్: మహీంద్ర థార్‌పై బంపర్ ఆఫర్
భారత్ మార్కెట్లో మహీంద్రాకు చెందిన మహీంద్రా థార్ ఎస్యూవీ కున్న ఆదరణ, క్రేజే వేరు. మరోవైపు హీంద్రా థార్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ఆగస్ట్ 15న విడుదల కానుంది. ఆవిష్కరణకు ముందు మహీంద్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. థార్ వెహికల్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మహీంద్రా థార్ ఈవీ ఆవిష్కరణకు ముందు, 3-డోర్ల మహీంద్రా థార్ గరిష్టంగా రూ. 20,000 ప్రయోజనాలతో అందుబాటులో ఉంది. తాజా నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా కొన్ని మహీంద్రా షోరూమ్‌లు కొత్త థార్‌పై రూ. 20,000 వరకు ప్రయోజనాలను అందిస్తున్నాయి.పెట్రోల్, డీజిల్ మహీంద్రా థార్ 4x4 వేరియంట్లపై ఆఫర్ లభిస్తోంది. థార్ 4x4 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ,2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్‌లో ఉంది. (కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్‌కు బంపర్ ఆఫర్) కాగా మహీంద్రా థార్ ధరలను కంపెనీ ఇటీవల భారతదేశంలో రూ. 1.05 లక్షల వరకు పెంచేసింది. ప్రజాదరణ పొందిన మహీంద్రా థార్ 4WD వెర్షన్ ఇప్పుడు రూ. 13.49 లక్షల నుండి రూ. 16.77 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. డీజిల్-మాన్యువల్ హార్డ్-టాప్ RWD మహీంద్రా థార్ చౌకైన వేరియంట్ ఇప్పుడు రూ. 55,000 ఎక్కువ. LX డీజిల్-మాన్యువల్ హార్డ్-టాప్ రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్ ధర రూ. 1.05 లక్షలు పెరిగింది. ఆగస్ట్ 15న దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో థార్ ఎలక్ట్రిక్ వెహికల్ కాన్సెప్ట్‌ను వెల్లడించేందుకు మహీంద్రా సిద్ధంగా ఉంది. (అమ్మకోసం...భళా బుడ్డోడా! వైరల్ వీడియో) -
ఆనంద్ మహీంద్రా మనసు దోచిన వీడియో.. చప్పట్లు కొడుతూ ట్వీట్!
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భారతీయ పారిశ్రామిక వేత్త 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ట్విట్టర్ వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను ఫిదా చేసింది. షేర్ చేసిన అతి తక్కువ సమయంలోనే తెగ వైరల్ అయిపోతోంది. ఇంతకీ ఆ వీడియో ఏంటి? ఎందుకింతలా వైరల్ అవుతోందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక కారు వరద నీటిలో దూసుకెళ్లడం చూడవచ్చు. అయితే ఈ కారు మహీంద్రా థార్ (Mahindra Thar) కావడం గమనార్హం. వరద నీటిలో చిక్కుకున్న ఒక బాలున్ని కాపాడటానికి థార్ ఇంత సాహసం చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే విషయం తెలియరాలేదు. కానీ ఈ వీడియో 'సిద్దార్థ్ దాస్' అనే వ్యక్తి ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ఋతుపవనాల సమయంలో ప్రతి ఇంటికి తప్పకుండా థార్ ఉండాలని చెప్పుకొచ్చాడు. వీడియో చూసినవారందరూ థార్ SUVని తెగ మెచ్చుకుంటున్నారు. (ఇదీ చదవండి: మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో టాప్ 5 మొబైల్స్!) 👏🏽👏🏽👏🏽 https://t.co/887sp7u9Wh — anand mahindra (@anandmahindra) July 9, 2023 -
ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపనున్న థార్ 5 డోర్ - లాంచ్ ఎప్పుడంటే?
Mahindra Thar 5 Door: దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' (Mahindra & Mahindra) మార్కెట్లో కొత్త 'థార్ 5 డోర్' కారుని విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్న సంగతి తెలియసిందే. అయితే రానున్న భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగష్టు 15న గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించడానికి మూహూర్తం ఖరారు చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. థార్ 5 డోర్ నివేదికల ప్రకారం.. మహీంద్రా 5 డోర్ థార్ ఆఫ్-రోడర్ దక్షిణాఫ్రికాలో జరగనున్న ఒక ఈవెంట్లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. కాగా వచ్చే ఏడాది నాటికి ఇది భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహీంద్రా తన ఎక్స్యువి300, ఎక్స్యువి700, స్కార్పియో ఎన్ వంటి ఆధునిక ఉత్పత్తులను దక్షిణాఫ్రికా మార్కెట్లో విక్రయిస్తోంది. త్వరలో మహీంద్రా థార్ 5 డోర్ కూడా ఈ విభాగంలో చేరనుంది. త్వరలో విడుదలకానున్న కొత్త మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ రెండు ఇంజిన్ ఎంపికలతో విడుదలయ్యే అవకాశం ఉంది. అవి 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ & 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది దాని ప్రత్యర్థి 5 డోర్ జిమ్నీ కంటే పెద్దదిగా ఉంటుంది. ఇప్పటికే థార్ అనేక సార్లు టెస్టింగ్ దశలో కనిపించింది. డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. అయితే ఇది 3 డోర్ థార్ కంటే కూడా పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది, కావున పనితీరు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. (ఇదీ చదవండి: మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది! లాంచ్ ఎప్పుడంటే?) ఇండియా లాంచ్ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీఈఓ (ఆటో అండ్ ఫార్మ్ సెక్టార్) రాజేష్ జెజురికర్ గతంలో ధృవీకరించినట్లుగా, మహీంద్రా 5-డోర్ థార్ 2024లో భారతదేశంలో విడుదల కానున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ SUV కి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడవుతాయి. -
మహీంద్రా థార్ Vs మారుతి జిమ్నీ - ఏది బెస్ట్ అంటే?
Mahindra Thar vs Maruti Jimny: భారతీయ మార్కెట్లో చెప్పుకోదగ్గ అత్యంత ప్రజాదరణ పొందిన ఆఫ్ రోడర్ ఏది అనగానే టక్కున వచ్చే సమాధానం మహీంద్రా కంపెనీకి చెందిన థార్. అయితే థార్ ఎస్‌యువికి అసలు సిసలైన ప్రత్యర్థిగా 'మారుతి జిమ్నీ' ఇటీవలే దేశీయ విఫణిలో అడుగెట్టింది. ఈ రెండు ఆఫ్ రోడర్ల మధ్య ఉన్న వ్యత్యాసం ఈ కథనంలో తెలుసుకుందాం. డిజైన్ మారుతి సుజుకి జిమ్నీ బాడీ-ఆన్-ఫ్రేమ్ డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. అంటే బాడీ ప్రత్యేక ఛాసిస్‌పై నిర్మించబడి ఉంటుంది. కంపెనీకి చెందిన ఇతర కార్ల మాదిరిగా కాకుండా ఇది చాలా ప్రత్యేకమైన డిజైన్ పొందుతుంది. ఇందులో రౌండ్ హెడ్ లైట్స్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, స్కేల్డ్-డౌన్ జి-వ్యాగన్ మాదిరిగానే బాక్సీ డిజైన్‌తో నిటారుగా ఉన్న ఫ్రంట్ గ్రిల్ ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా భారతీయ భూభాగాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. మహీంద్రా థార్ విషయానికి వస్తే, ఇది బాడీ-ఆన్-ఫ్రేమ్ డిజైన్ పొందుతుంది. ఇది ఆఫ్-రోడింగ్ చేయడానికి అనుకూలమైన వాహనం. ఇది సాఫ్ట్ టాప్ మరియు హార్డ్ టాప్ అనే రెండు ఆప్షన్స్ పొందుతుంది. ఫీచర్స్ ఫీచర్స్ పరంగా రెండూ కూడా ఉత్తమంగా ఉంటాయి. మంచి పట్టుని అందించడానికి అనుకూలంగా ఉండే స్టీరింగ్ వీల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఏసీ వెంట్స్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం, డ్రైవర్ డిస్ప్లే, అద్భుతమైన సీజింగ్ పొజిషన్, క్లైమేట్ కంట్రోల్ ఉంటాయి. వీటితో పాటు సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సేఫ్టీ విషయంలో మహీంద్రా థార్ 4 స్టార్ స్కోరింగ్ సొంతం చేసుకుని భారతదేశంలో అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది. కాగా జిమ్నీ కూడా మంది సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది, అయితే సేఫ్టీ రేటింగ్ ఇంకా తెలియాల్సి ఉంది. కలర్ ఆప్షన్ మహీంద్రా థార్ మొత్తం ఆరు కలర్ ఆప్షన్స్ పొందుతుంది. అవి న్యాపోలీ బ్లాక్, రెడ్ రేజ్, గెలాక్సీ గ్రే, ఆక్వా మెరైన్, ఎవరెస్ట్ వైట్, బ్లేజింగ్ బ్రాంజ్ కలర్స్. ఇక జిమ్నీ కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే.. ఇది మిడ్ నైట్ బ్లాక్ రూప్‌తో రెడ్ కలర్, బ్లూయిష్ బ్లాక్ రూప్‌తో రెడ్, బ్లూయిష్ బ్లాక్ రూప్‌తో కైనెటిక్ ఎల్లో, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, గ్రానైట్ గ్రే, సిజ్లింగ్ రెడ్, బ్లూయిష్ బ్లాక్, నెక్సా బ్లూ కలర్స్ పొందుతుంది. డైమెన్షన్ మారుతి జిమ్నీ కొలతల పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీని పొడవు 3850 మిమీ, వెడల్పు 1645 మిమీ, ఎత్తు 1730 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 210 మిమీ, వీల్ బేస్ 2550 మిమీ వరకు ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మహీంద్రా థార్ పొడవు 3985 మిమీ, వెడల్పు 1820 మిమీ, ఎత్తు 1970 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 219 మిమీ, వీల్ బేస్ 2450 మిమీ వరకు ఉంటుంది. మహీంద్రా థార్ 3 డోర్స్ మోడల్ అయినప్పటికీ పరిమాణం పరంగా జిమ్నీ కంటే కొంత ఎక్కువగా ఉంటుంది. ఇంజన్ మారుతి జిమ్నీ 5 డోర్ ఎస్యువి 1.5-లీటర్ K-సిరీస్ ఇంజన్ కలిగి మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సహాయంతో 102 bhp పవర్ 137 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. జిమ్నీ ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది. (ఇదీ చదవండి: వందల కోట్లు సామ్రాజ్యం సృష్టించిన కూలీ కొడుకు - ఎవరీ ముస్తఫా?) మహీంద్రా థార్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇందులోని 2.0-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 150 bhp పవర్ 300 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలు ఇందులో ఉంటాయి. పెట్రోల్ ఇంజిన్ లీటరుకు 15.2 కిమీ మైలేజ్ అందిస్తుంది. 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ 130 bhp పవర్ 300 Nm టార్క్ అందిస్తుంది. ఇందులో కూడా 6 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలు ఉంటాయి. డీజిల్ ఇంజిన్ కూడా లీటరుకు 15.2 కిమీ మైలేజ్ అందిస్తుంది. (ఇదీ చదవండి: అప్పుచేసి ట్రక్కు కొని వేలకోట్లు సంపాదిస్తున్నాడిలా!) ప్రాక్టికాలిటీ మారుతి జిమ్నీ 5 డోర్స్ మోడల్ అయినప్పటికీ పరిమాణంలో మహీంద్రా థార్ కొంత పెద్దదిగా ఉంటుంది. రెండూ కూడా అద్భుతమైన డిజైన్, ఫీచర్స్ కలిగి పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటాయి. కాగా ఇప్పటికే మార్కెట్లో మహీంద్రా థార్ సంచలన అమ్మకాలను పొందింది. జిమ్నీ కూడా విడుదలకు ముందే దాదాపు 30,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. కావున జిమ్నీ కూడా తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. మొత్తం మీద డిజైన్, ఫీచర్స్, కలర్ ఆప్షన్స్ మొదలైన విషయాల్లో దేనికదే సాటిగా ఉన్నాయి. కావున కొనుగోలుదారులు ఇవన్నీ బేరీజు వేసుకుని నచ్చిన మోడల్ కొనుగోలు చేసుకోవచ్చు. -
మహీంద్రా థార్ దెబ్బకి రెండు ముక్కలైన ట్రాక్టర్? వైరల్ వీడియో
మహీంద్రా పాపులర్ వెహికల్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు మహీంద్రా థార్. ఆఫ్-రోడింగ్ సామర్థ్యం, డిజైన్, రగ్గడ్ లుక్స్‌తో దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన లైఫ్ స్టయిల్ ఎస్‌యూవీగా పేరొందింది.అయితే థార్‌కు సంబంధించిన ఒకవీడియో ఇపుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) థార్ ఢీకొనడం వల్ల ట్రాక్టర్‌ను రెండు భాగాలుగా విడిపోవడం హాట్‌టాపిక్‌గా నిలుస్తోంది. వీడియోలో ఇది స్పష్టంగా కనిపించింది. యూట్యూబర్ ప్రతీక్ సింగ్ తన ఛానెల్లో షేర్ చేసిన వీడియో ప్రకారంప్రమాదానికి గురైన తర్వాత ట్రాక్టర్ రెండు భాగాలుగా విడిపోవడం, అలాగే రోడ్డు పక్కన దెబ్బతిన్న మహీంద్రా థార్ ఎస్యూవీ కనిపిస్తుంది. గుజరాత్‌లోని ఉనా-భావనగర్ నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. తాజా నివేదిక ప్రకారం తీవ్రంగా గాయపడిన ట్రాక్టర్ డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే ఇక్కడ తప్పు ఎవరిది అనేది అస్పష్టం. అయితే ట్రాక్టర్ డ్రైవర్ యు-టర్న్ తప్పించుకోవడానికి రాంగ్ సైడ్ నుండి రావడం వల్ల ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక అంచనా. ఈ వార్తపై పూర్తి స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.! (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ) -
మహీంద్రా థార్ లాంచ్‌పై కీలక అప్డేట్
మహీంద్రా థార్ (5-డోర్) దేశంలో అత్యంత ఎదురుచూస్తున్న ఎస్యూవీ(SUV)లలో ఒకటి. ఇప్పటి వరకు ఈ ఏడాది ఆగస్టు 15న ఈ ఎస్యూవీ లాంచ్ అవుతుందని పుకారు ఉండేది. అయితే థార్ 5-డోర్ లాంచ్ ఎప్పుడనేది కంపెనీ అధికారికంగా ధ్రువీకరించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వాహన ప్రియులను మరింత నిరీక్షణలోకి నెట్టేసింది. మహీంద్రా థార్ 5-డోర్ 2024లో లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. అలాగే ఈ సంవత్సరం కంపెనీకి సంబంధించిన కొత్త ఉత్పత్తులేవీ లేవని మహీంద్రా అండ్ మహీంద్రా (ఆటో & ఫార్మ్ సెక్టార్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో రాజేష్ జెజురికర్ తెలిపారు. ఇప్పటికే 50,000లకుపైగా బుకింగ్‌లు 5-డోర్ థార్‌కు చాలా డిమాండ్ ఉందని, ఇప్పటికే 50,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు వచ్చాయని జెజురికర్ పేర్కొన్నారు. కస్టమర్ల నిరీక్షణకు తెర దించుతూ 2024 సంవత్సరంలో 5-డోర్ థార్‌ను లాంచ్ చేయనున్నట్లు వివరించారు.పెంచాలి మరియు ఇప్పుడు మేము 2024లో వచ్చే థార్ 5-డోర్లను చూస్తున్నాము”, జోడించారు. మహీంద్రా థార్‌కు దేశంలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ ఎస్యూవీ డెలివరీ పొందాలంటే కస్టమర్లు మరికొంత కాలం వేచి ఉండాలి. కాగా మహీంద్రా ఈ సంవత్సరం ప్రారంభంలో థార్‌లో RWD 4X2 వెర్షన్‌ను కూడా ప్రారంభించింది. ఇక మహీంద్రా థార్ 5-డోర్ డిజైన్, ఇతర ప్రత్యేకతల విషయానికి వస్తే పొడవైన స్తంభాలతో బాక్స్ లాంటి ఆకారాన్ని కలిగి ఉంటుంది. వాహనం ముందు, వెనుక భాగాలు ప్రస్తుత థార్ మాదిరిగానే ఉంటాయని తెలిసింది. అయితే కొత్త 5-డోర్ థార్‌లో పొడవైన డోర్లు, వీల్‌బేస్‌తో మరింత విశాలమైన క్యాబిన్ ఉంటుంది. సరికొత్త అల్లాయ్ వీల్స్, హుడ్ కింద 2.2 లీటర్ డీజిల్, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్లు ఉంటాయని వెల్లడైంది. ఇదీ చదవండి: మెర్సిడెస్ కొత్త వర్షన్స్ భారత్‌కు వచ్చేశాయ్! ధరలు ఇవే.. -
షాకింగ్ ప్రైస్: మహీంద్రా థార్ 'చైనీస్ వెర్షన్' ధర రూ. కోటి!
న్యూఢిల్లీ: మహీంద్రా థార్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మహీంద్రాకు చెందిన అప్ కమింగ్ వాహనం మహీంద్రా థార్ (5-డోర్స్)కు ఇప్పటికే భారీ క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే కాపీ క్యాట్ చైనా దీన్ని కూడా కాపీ చేసేసింది. తాజాగా 'చైనీస్ వెర్షన్' పాకిస్తాన్లో తాజా థార్ తెలిస్తే షాక్అవుతారు. ఏకంగా కోటి రూపాయలకు అమ్ముడు బోయింది. చైనీస్ వాహన తయారీదారులు ప్రపంచవ్యాప్తంగా అనేక పాపులర్ వాహనాల డిజైన్‌ను కాపీ చేయడంలో ముందుంటారు. కార్లు, మోటార్ సైకిళ్లను కూడా కాపీ చేస్తారు. దీనికి పెద్ద ఉదారణ మహీంద్రా థార్, బొలెరో మిశ్రమంతో వచ్చిందే చైనీస్ థార్‌గా పిలిచే BAIC BJ40 ప్లస్. (మెట్‌గాలా 2023: ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే షాకవుతారు!) పాక్వీల్స్ వెబ్సైట్ ప్రకారం, పాకిస్తాన్లో BAIC BJ40 ప్లస్ ధర రూ. 1.12 కోట్లు (ఎక్స్-షోరూమ్). భారతదేశంలో మహీంద్రా థార్ ధర రూ. 10.54 లక్షల నుండి ప్రారంభం. ఇక డిజైన్ BAIC BJ40 ప్లస్ విషయానికి వస్తే, ఫీచర్లు, సైడ్ ప్రొఫైల్ ప్రముఖ రాంగ్లర్ ఎస్‌యూవీకి దాదాపు సమానం. (రెనాల్ట్ కైగర్ కొత్త వేరియంట్ వచ్చేసింది.. ఆర్ఎక్స్జెడ్ వెర్షన్‌పై భారీ తగ్గింపు) BAIC BJ40 ప్లస్ వాహనంలో 2.0 లీటర్ల టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చింది. ఇది 5500 rpm వద్ద 218 hpని ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇంజీన్ 4500 rpm వద్ద 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫైవ్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌తో ఇది లభ్యం. అలాగే ఇకో, కంఫర్ట్, స్పోర్ట్స్, స్నోఫీల్డ్ 4 డ్రైవింగ్ మోడ్లతో వచ్చింది. దీంతోపాటు కొత్త తరం ఎలక్ట్రికల్ పార్ట్ టైమ్ 4WDని కూడా కలిగి ఉంది. జీప్ రాంగ్లర్కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న మహీంద్రా థార్ 5-డోర్ త్వరలోనే ఇండియాలోనే లాంచ్ కానుందని అంచనా. విక్రయాల్లో సరి కొత్త రికార్డులను చేరు కుంటుందని భావిస్తున్నారు.మహీంద్రా థార్ పాకిస్థాన్‌లో అందుబాటులో లేకపోవడంతో చైనీస్ మేకర్స్ ఈ ఎత్తుగడ వేశారు. కాగా BAIC BJ40 Plus ప్రస్తుతం భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!)