దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన థార్ కొనుగోలుదారుల కోసం ఒక అద్భుతమైన ఆఫర్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ ఆఫ్ రోడర్ కొనుగోలు చేసేవారు భారీ డిస్కౌంట్ పొందవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..
దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మాత్రం డిమాండ్ తగ్గకుండా గొప్ప అమ్మకాలతో ముందుకు సాగుతున్న థార్ ఎంతోమంది ఆఫ్ రోడర్లకు ఇష్టమైన వాహనం. ఇప్పటికి కూడా ఈ SUV కోసం చాలా రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో కంపెనీ థార్ కొనుగోలు మీద రూ. 65,000 తగ్గింపుని అందించనుంది.
నివేదికల ప్రకారం, కొన్ని ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో మాత్రమే మహీంద్రా థార్‌పై రూ. 65,000 తగ్గింపు లభిస్తుంది. ఇందులో రూ. 40వేలు క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. క్యాష్ డిస్కౌంట్ & ఎక్స్ఛేంజ్ బోనస్ అనేది మీరు ఎంచుకున్న వేరియంట్‌పై కూడా ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఇదిలా ఉండగా ఇటీవల మహీంద్రా థార్ ధరలు రూ. 1.05 లక్షల వరకు పెరిగాయి. డీజిల్-మాన్యువల్ హార్డ్-టాప్ RWD వేరియంట్ ధర ఇప్పుడు మునుపటికంటే రూ. 55,000 ఎక్కువ. దేశీయ మార్కెట్లో మహీంద్రా థార్ 4WD వెర్షన్ ధర రూ. 13.49 లక్షల నుంచి రూ. 16.77 లక్షల మధ్య ఉంది.
Comments
Please login to add a commentAdd a comment