భారతీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి అత్యధిక అమ్మకాలతో ముందుకు సాగుతున్న 'మహీంద్రా థార్' (Mahindra Thar) త్వరలో మరో కొత్త వేరియంట్‌లో విడుదలకానుంది. ఇది థార్ ఎంట్రీ లెవెల్ వేరియంట్ అని సమాచారం. ఇది భారతీయ మార్కెట్లో అరంగేట్రం చేయనున్న మారుతీ సుజుకీ జిమ్నీకి ప్రధాన పోటీదారుగా ఉండే అవకాశం ఉంటుంది.
మహీంద్రా కంపెనీ 2020లో థార్ SUVని లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారీ సంఖ్యలో బుకింగ్స్ స్వీకరిస్తూనే ఉంది. అయితే కస్టమర్ల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని మహీంద్రా తన థార్ ఎస్‌యువిలో నిరంతరం అప్డేట్స్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే థార్ ఆర్డబ్ల్యూడీ వేరియంట్ కూడా విడుదలైంది.
ఇప్పటికి వెల్లడైన సమాచారం ప్రకారం, ఎంట్రీ లెవెల్ 4X4 థార్ వేరియంట్‌ను కంపెనీ త్వరలోనే విడుదల చేయనుంది. ఇది బేస్ లెవెల్ ఏఎక్స్ మోడల్ మాదిరిగా ఉండే అవకాశం ఉంది. కావున ఇది 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందనుంది. అయితే ఈ ఇంజిన్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్కి మాత్రమే పరిమితమవుతాయి.
(ఇదీ చదవండి: ప్రపంచంలో అతిపెద్ద లిక్కర్ సామ్రాజ్యం: ఇకపై మహిళ సారథ్యంలో..)
మహీంద్రా విడుదల చేయనున్న థార్ ఎంట్రీ లెవెల్ వేరియంట్ ఎక్కువ ఫీచర్స్ పొందే అవకాశం లేదు. కావున ధర దాని స్టాండర్డ్ మోడల్ కంటే తక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 13.59 లక్షల కంటే తక్కువ ఉండవచ్చు.
మహీంద్రా థార్ SUV మారుతీ జిమ్నీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. మార్కెట్లో ఆఫ్ రోడ్ కార్లకు పెరుగుతున్న ఆదరణ కారణంగా వాటి అమ్మకాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే అమ్మకాల పరంగా జిమ్నీకి మహీంద్రా థార్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. మారుతి సుజుకి తన జిమ్నీ ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ దీని ప్రారంభ ధర రూ. 9.5 లక్షల కంటే తక్కువ ఉండవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment