మహీంద్రా థార్ పేరు మారనుందా..? కొత్త పేరు ఏదంటే! | Mahindra Thar 5 Door New Names | Sakshi
Sakshi News home page

మహీంద్రా థార్ పేరు మారనుందా..? కొత్త పేరు ఏదంటే!

Published Wed, Dec 27 2023 5:36 PM | Last Updated on Wed, Dec 27 2023 5:50 PM

Mahindra Thar 5 Door New Names - Sakshi

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరను పొందిన 'మహీంద్రా థార్' (MahindraThar) 5 డోర్ వేరియంట్ రూపంలో విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. అయితే కంపెనీ ఈ కారు పేరుని మార్చున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ థార్ SUV కొత్త పేరు కోసం ట్రేడ్‌మార్క్‌ దాఖలు చేసింది. ఇందులో 'సెంచూరియన్, కల్ట్, గ్లాడియస్, రెక్స్, రోక్స్, సవన్నా, ఆర్మడ' అనే ఏడు పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 'ఆర్మడ' అనేది మహీంద్రా కంపెనీకి చెందిన 1993 నుంచి 2001 మధ్య అమ్ముడైన కారు అని తెలుస్తోంది.

మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ దాని 3 డోర్స్ వెర్షన్ కంటే కూడా పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. డిజైన్ పరంగా 3 డోర్ థార్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఫీచర్స్ పరంగా కొంత అప్డేట్ పొందినట్లు తెలుస్తోంది. థార్ 5 డోర్ SUV టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్, సన్‌రూఫ్, రియర్ పార్కింగ్ కెమెరా, పిల్లర్ మౌంటెడ్ గ్రాబ్ హ్యాండిల్ వంటి వాటితో పాటు ADAS వంటి అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని కలిగి ఉండనున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: అప్పుడు ఆస్తి పోగొట్టుకున్నాడు.. ఇప్పుడు రూ.37000 కోట్ల సామ్రాజ్యం..

అనేక సార్లు టెస్టింగ్ సమయంలో కనిపించిన మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్, 2.0 లీటర్ mStallion పెట్రోల్ ఇంజిన్లను పొందుతుంది. ఇంజిన్లు 6 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది.

మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ 2024లో లాంచ్ అవుతుందని సమాచారం, అయితే ఎప్పుడు లాంచ్ అవుతుందనేది కంపెనీ స్పష్టంగా వెల్లడించలేదు. ధరలు, బుకింగ్స్ వంటి వివరాలతో పాటు డెలివరీలకు సంబంధించిన విషయాలు కూడా లాంచ్ సమయంలోనే అధికారికంగా వెల్లడవుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement