Mahindra Thar 5 Door: దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' (Mahindra & Mahindra) మార్కెట్లో కొత్త 'థార్ 5 డోర్' కారుని విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్న సంగతి తెలియసిందే. అయితే రానున్న భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగష్టు 15న గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించడానికి మూహూర్తం ఖరారు చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
థార్ 5 డోర్
నివేదికల ప్రకారం.. మహీంద్రా 5 డోర్ థార్ ఆఫ్-రోడర్ దక్షిణాఫ్రికాలో జరగనున్న ఒక ఈవెంట్‌లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. కాగా వచ్చే ఏడాది నాటికి ఇది భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహీంద్రా తన ఎక్స్‌యువి300, ఎక్స్‌యువి700, స్కార్పియో ఎన్ వంటి ఆధునిక ఉత్పత్తులను దక్షిణాఫ్రికా మార్కెట్లో విక్రయిస్తోంది. త్వరలో మహీంద్రా థార్ 5 డోర్ కూడా ఈ విభాగంలో చేరనుంది.
త్వరలో విడుదలకానున్న కొత్త మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ రెండు ఇంజిన్ ఎంపికలతో విడుదలయ్యే అవకాశం ఉంది. అవి 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ & 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది దాని ప్రత్యర్థి 5 డోర్ జిమ్నీ కంటే పెద్దదిగా ఉంటుంది. ఇప్పటికే థార్ అనేక సార్లు టెస్టింగ్ దశలో కనిపించింది. డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. అయితే ఇది 3 డోర్ థార్ కంటే కూడా పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది, కావున పనితీరు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.
(ఇదీ చదవండి: మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది! లాంచ్ ఎప్పుడంటే?)
ఇండియా లాంచ్
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీఈఓ (ఆటో అండ్ ఫార్మ్ సెక్టార్) రాజేష్ జెజురికర్ గతంలో ధృవీకరించినట్లుగా, మహీంద్రా 5-డోర్ థార్ 2024లో భారతదేశంలో విడుదల కానున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ SUV కి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment