new cars
-
కళ్లుచెదిరే కొత్త కార్లు.. భళా నయా బైక్‌లు..
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో (Bharat Mobility Global Expo 2025) కనులపండువగా సాగుతోంది. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025(రెండో ఎడిషన్)ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ఆటోమొబైల్ ఎక్స్ పో వేదికగా పలు కార్లు, టూవీలర్ కంపెనీలు తమ నూతన ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్నాయి.హీరో మోటోకార్ప్ నాలుగు కొత్త మోడళ్లు హీరో మోటోకార్ప్ (Hero Motocorp) భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో వేదికగా నాలుగు ద్విచక్ర వాహన మోడళ్లను ఆవిష్కరించింది. ఎక్స్ట్రీమ్ 250ఆర్, ఎక్స్‌ప్లస్ 210 పేరుతో రెండు మోటార్స్ బైకులు లాంచ్ చేసింది. స్కూటర్ల పోర్ట్‌ఫోలియోలో ఎక్స్మ్ 125, ఎక్స్మ్ 160 రెండు సరికొత్త వేరియంట్లను అందుబాటులోకి తెచ్చింది. కొత్త ఆవిష్కరణలతో ప్రీమియం బ్రాండ్లు ఎక్స్ట్రీం, ఎక్స్ప్లస్లు మరింత బలోపేతమయ్యాయని కంపెనీ సీఈఓ నిరంజన్ తెలిపారు. వీటి బుకింగ్స్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయి. మార్చి నుంచి డెలీవరి ఉంటుంది. యమహాయమహా (Yamaha) తమ పెవిలియన్‌లో RX- 100, RD-350 వంటి లెజెండరీ మోటార్‌సైకిళ్లతోపాటు ప్రీమియం శ్రేణి మొదటి తరం మోడళ్లను ప్రదర్శించింది. ఇందులో ప్రముఖ YZF-R15, మస్కులర్ FZ సిరీస్‌లు ఉన్నాయి.హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ హ్యుండై మోటార్ ఇండియా క్రెటా ఎలక్ట్రిక్‌ను (Hyundai CRETA Electric) విడుదల చేసింది. పరిచయ ఆఫర్లో ధర రూ.17.99 లక్షలు ఉంది. ఆరు వేరియంట్లలో లభిస్తుంది. ఒకసారి చార్జింగ్‌తో 42 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 390 కిలోమీటర్లు, 51.4 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 473 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. కియా ఈవీ6 అప్‌గ్రేడెడ్ వర్షన్ దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ సంస్థ కియా తాజాగా ఈవీ6 అప్‌గ్రేడెడ్ వర్షన్‌ను (Kia EV6) పరిచయం చేసింది. 84 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 650 కిలోమీటర్లకుపైగా పరుగెడుతుందని కంపెనీ ప్రకటించింది. 350 కిలోవాట్ ఫాస్ట్ చార్జర్‌తో 10 నుంచి 80 శాతం చార్జింగ్ 18 నిముషాల్లో అవుతుంది. ఇప్పటి వరకు ఈ మోడల్‌కు 77.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ వాడారు. బీఎండబ్ల్యూ మేడిన్ ఇండియా ఈవీ జర్మనీ లగ్జరీ కార్ల తయారీలో ఉన్న బీఎండబ్ల్యూ (BMW) భారత్‌లో తయారైన ఎలక్ట్రిక్ వెహికిల్ ఐఎక్స్1 లాంగ్ వీల్‌బేస్ ఆల్ ఎలక్ట్రిక్‌ను విడుదల చేసింది. ధర రూ.49 లక్షలు. 66.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 531 కిలోమీటర్లు పరుగెడుతుంది.మైబహ్ కొత్త ఈవీ మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో లగ్జరీ ఎలక్ట్రిక్ ఈక్యూఎస్ మైబహ్ ఎస్యూవీ (Mercedes-Benz Maybach EQS SUV) 680 నైట్ సిరీస్‌ను విడుదల చేసింది. ధర రూ.2.63 కోట్లు. గరిష్ట వేగం 210 కిలోమీటర్లు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 4.4 సెకన్లలో చేరుకుంటుంది. మైబహ్ జీఎల్ఎస్ 600 నైట్ సిరీస్‌లో కొత్త వేరియంట్‌ను రూ.3.71 కోట్ల ధరతో ప్రవేశపెట్టింది. అలాగే సీఎల్ఏ క్లాస్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది.టాటా మోటార్స్భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో టాటా మోటార్స్ పలు కొత్త మోడళ్లను ప్రదర్శించింది. వీటిలో హ్యారియర్ ఈవీ, అవిన్యా ఎక్స్ కాన్సెప్ట్, టాటా సియర్రా ఎస్వీ, టాటా ఇంట్రా వాహనాలున్నాయి.టయోటా టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తమ అద్భుతమైన ఉత్పత్తులను, అధునాతన సాంకేతికతలను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. -
ఒకేసారి రెండు కార్లు లాంచ్ చేసిన ఎంజీ మోటార్: ధర & వివరాలు
జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా తన హెక్టర్ లైనప్‌ను విస్తరించడంతో భాగంగా.. ఒకేసారి రెండు కొత్త 7 సీటర్ వేరియంట్లను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో ఒకటి హెక్టర్ ప్లస్ 7 సీటర్ 'సెలెక్ట్ ప్రో' కాగా, మరొకటి 'స్మార్ట్ ప్రో'. ఈ రెండు వేరియంట్ల ధరలు వరుసగా రూ.19.71 లక్షలు, రూ.20.64 లక్షలు.హెక్టర్ ప్లస్ 7 సీటర్ సెలెక్ట్ ప్రో వేరియంట్ 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కలిగి సీవీటీ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. స్మార్ట్ ప్రో వేరియంట్ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ కలిగి మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. కాబట్టి ఇవి రెండూ కూడా ఉత్తమ పనితీరును అందిస్తాయని భావిస్తున్నాము.ఎంజీ హెక్టర్ కొత్త వేరియంట్లు వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఐ-స్మార్ట్ టెక్నాలజీతో కూడిన 14 ఇంచెస్ పోర్ట్రెయిట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఈ కారులో సుమారు 75 కంటే ఎక్కువ కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నట్లు సమాచారం.ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఫ్లోటింగ్ టర్న్ ఇండికేటర్లు, ఎల్ఈడీ బ్లేడ్-స్టైల్ కనెక్టెడ్ టెయిల్ లాంప్, 18 ఇంచెస్ డ్యూయెల్ టోన్ మెషిన్డ్ అల్లాయ్ వీల్స్ వంటివి పొందిన కొత్త ఎంజీ హెక్టర్ ప్లస్ లెథెరెట్ సీట్లు, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటివి కూడా కలిగి ఉంటుంది.ఇదీ చదవండి: వచ్చేసింది కొత్త మారుతి డిజైర్: ధర రూ.6.79 లక్షలు మాత్రమే..లేటెస్ట్ డిజైన్ కలిగిన ఎంజీ హెక్టర్ ప్లస్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం, హిల్ హోల్డ్ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, బ్రేక్ అసిస్ట్, ఇసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్ వంటి అప్డేటెడ్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కంపెనీ ఇప్పుడు ఈ రెండు వేరియంట్లకు ఎంజీ షీల్డ్ ప్రోగ్రామ్ కింద.. 3 సంవత్సరాల వారంటీ, 3 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 3 సంవత్సరాల లేబర్ ఫ్రీ పీరియాడిక్ సర్వీస్ వంటి వాటిని కూడా అందిస్తుంది. -
వచ్చేసింది కొత్త మారుతి డిజైర్: ధర రూ.6.79 లక్షలు మాత్రమే..
మారుతి సుజుకి ఎట్టకేలకు తన నాల్గవ తరం 'డిజైర్' కారును భారతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. కంపెనీ ఈ కారును నాలుగు ట్రిమ్‌లలో రూ.6.79 లక్షల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధర వద్ద లాంచ్ చేసింది. ఇప్పటికే సంస్థ ఈ సెడాన్ కోసం రూ.11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం కూడా స్టార్ట్ చేసింది.2024 డిజైర్.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఇతర మారుతి కార్ల కంటే కూడా భిన్నంగా ఉంటుంది. ఇది హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్, హోండా అమేజ్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాగా ఇప్పటికే మారుతి డిజైర్ గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించి అత్యంత సురక్షితమైన కారుగా రికార్డ్ సృష్టించింది.ఇదీ చదవండి: లాంచ్‌కు ముందే డిజైర్ ఘనత: సేఫ్టీలో సరికొత్త రికార్డ్కొత్త డిజైన్ కలిగి, అప్డేటెడ్ ఫీచర్స్ పొందిన ఈ మారుతి డిజైర్ కారు సింగిల్ పేన్ సన్‌రూఫ్ వంటి వాటిని కూడా పొందుతుంది. ఇది 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా ఇది 82 హార్స్ పవర్, 112 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. -
స్కోడా కొత్త కారు 'కైలాక్' వచ్చేసింది: రూ.7.89 లక్షలు మాత్రమే
దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా మరో కాంపాక్ట్ ఎస్‌యూవీని 'కైలాక్' (Kylaq) పేరుతో లాంచ్ చేసింది. ప్రత్యేకంగా భారతీయ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ కారును లాంచ్ చేసింది. దీని ధర రూ. 7.89 లక్షలతో ప్రారంభమవుతుంది. ఈ కారు కోసం 2024 డిసెంబర్ 2 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభమవుతుంది.ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఇతర స్కోడా కార్ల కంటే కైలాక్ కొంత భిన్నంగా ఉండటం చూడవచ్చు. 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందిన ఈ ఎస్యూవీ డ్యూయల్ డిజిటల్ స్క్రీన్లు, పవర్డ్ డ్రైవర్ సీట్, లెథెరెట్ అప్హోల్స్టరీ, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, యాంబియంట్ లైటింగ్, సిక్స్-స్పీకర్ కాంటన్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ పొందుతుంది.ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్ ప్రోగ్రామ్, ఇసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు, హెడ్‌రెస్ట్‌లు, త్రీ పాయింట్ సీట్ బెల్ట్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా కైలాక్ కారులో అందుబాటులో ఉన్నాయి. 189 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన ఈ కారు బూట్ స్పేస్ 1265 లీటర్ల వరకు ఉంటుంది.స్కోడా కైలాక్ 1.0 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 114 Bhp పవర్, 178 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. ఈ కొత్త కారు మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, మారుతి ఫ్రాంక్స్, బ్రెజ్జా, టయోటా టైసర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
పండక్కి 13 స్పెషల్ ఎడిషన్స్.. మార్కెట్లో కొత్త కార్ల జోరు
ఈ పండుగ సీజన్లో ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నంలో కార్ల తయారీ సంస్థలు స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ చేశాయి. ఈ జాబితాలో మారుతీ సుజుకి, టయోటా, మహీంద్రా, జీప్, రెనాల్ట్ మొదలైన కంపెనీలు ఉన్నాయి. ఈ కథనంలో ఇటీవల దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన స్పెషల్స్ ఎడిషన్స్ ఏవనే వివరాలు తెలుసుకుందాం.స్పెషల్ ఎడిషన్స్ ➺మారుతి వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ ఎడిషన్➺మారుతి స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్➺మారుతి గ్రాండ్ విటారా డొమినియన్ ఎడిషన్➺మారుతి బాలెనో రీగల్ ఎడిషన్➺టయోటా హైరైడర్ ఫెస్టివల్ ఎడిషన్➺టయోటా గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్➺టయోటా రూమియన్ ఫెస్టివల్ ఎడిషన్➺టయోటా టైసర్ ఫెస్టివల్ ఎడిషన్➺మహీంద్రా స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్➺జీప్ కంపాస్ యానివెర్సరీ ఎడిషన్➺రెనాల్ట్ నైట్ అండ్ డే ఎడిషన్➺ట్రైబర్ నైట్ అండ్ డే ఎడిషన్➺క్విడ్ నైట్ అండ్ డే ఎడిషన్దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన ఈ స్పెషల్స్ ఎడిషన్స్ కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ మాత్రమే పొందినట్లు సమాచారం. వీటికి అదనంగా యాక్ససరీస్ ఫ్యాక్స్ కూడా ఎంపిక చేసుకోవచ్చు. కాబట్టి ధరలు స్టాండర్డ్ మోడల్స్ కంటే కొంత ఎక్కువగా ఉంటాయి. ధరలు కొనుగోలుదారు ఎంచుకునే యాక్ససరీస్ ప్యాక్ మీద ఆధారపడి ఉంటాయి. ఇందులో కొన్ని కార్లు ఈ నెల చివర వరకు మాత్రమే విక్రయానికి ఉండనున్నట్లు సమాచారం. కాబట్టి ఈ కార్లకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం మీ సమీపంలోనే కంపెనీ అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
దీపావళి ఆఫర్: కొత్త కారు కొనడానికే ఇదే మంచి సమయం!
అసలే పండుగ సీజన్.. కొత్త కారు కొనాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు దిగ్గజ కంపెనీలు సైతం భారీ డిస్కౌంట్స్ ప్రకటించాయి. ఇందులో బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కంపెనీలు ఉన్నాయి. ఒక్కో కంపెనీ ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ రూ.10 లక్షల వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నాయి.కార్లు, వాటిపై లభించే డిస్కౌంట్స్ఆడి క్యూ3: రూ. 5 లక్షలుమెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ: రూ. 5 లక్షలుఆడి క్యూ5: రూ. 5.5 లక్షలుబీఎండబ్ల్యూ ఐ4: రూ. 8 లక్షలుమెర్సిడెస్ బెంజ్ సీ200: రూ. 9 లక్షలుఆడి క్యూ8 ఈ ట్రాన్: రూ. 10 లక్షలుఆడి ఏ6: రూ. 10 లక్షలుబీఎండబ్ల్యూ ఎక్స్5: రూ. 10 లక్షలుకియా ఈవీ6 ఆల్ వీల్ డ్రైవ్: రూ. 12 లక్షలుకార్లపైన కంపెనీలు ఇస్తున్న ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ తగ్గింపులు ఎంచుకునే మోడల్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్లను పొందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైన తగ్గింపులను గురించి తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
టయోటా లాంచ్ చేసిన మరో ఫెస్టివ్ ఎడిషన్ ఇదే..
టయోటా కంపెనీ గ్లాన్జా, టైసర్, హైరైడర్ ఫెస్టివల్ ఎడిషన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు తాజాగా రూమియన్ ఫెస్టివ్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ కారు కొనుగోవులు చేసేవారు ఎటువంటి అదనపు ఖర్చులు లేకుండానే రూ. 20608 విలువైన యాక్సెసరీలను పొందవచ్చు.టయోటా రూమియన్ ఫెస్టివ్ ఎడిషన్ మడ్ ఫ్లాప్‌లు, మ్యాట్లు, క్రోమ్ డోర్ వైజర్, స్పాయిలర్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా టెయిల్‌గేట్, రియర్ బంపర్, హెడ్‌ల్యాంప్, నంబర్ ప్లేట్, బాడీ మౌల్డింగ్లకు గార్నిష్‌లు ఉన్నాయి. ఈ కొత్త యాక్ససరీస్ వల్ల కారు మరింత అద్భుతంగా కనిపిస్తుంది.టయోటా రూమియన్ దాని మునుపటి మోడల్లోని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 102 Bhp పవర్, 138 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అప్షన్స్ పొందుతుంది. ఈ ఫెస్టివల్ ఎడిషన్ ఎస్, జీ, వీ ట్రిమ్‌లలో మాత్రమే కాకుండా CNG రూపంలో కూడా అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: టయోటా టైజర్ లిమిటెడ్ ఎడిషన్.. మంచి ఆఫర్‌తో..మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టయోటా రూమియన్ ప్రధానంగా మారుతి సుజుకి ఎర్టిగా, కియా కారెన్స్, హ్యుందాయ్ అల్కాజార్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఇది ఫెస్టివ్ ఎడిషన్ కాబట్టి మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. అయితే ఈ కారు ఎప్పటి వరకు మార్కెట్లో విక్రయానికి ఉంటుందనేది తెలియాల్సి ఉంది. -
లాంచ్‌కు సిద్దమవుతున్న బీఎండబ్ల్యూ కారు ఇదే..
బీఎండబ్ల్యూ కంపెనీ తన 2 సిరీస్ గ్రాన్ కూపే ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే కంపెనీ ఈ కారును అధికారికంగా లాంచ్ చేయడానికి ముందే దీనికి సంబంధించిన వివరాలను, ఫోటోలను విడుదల చేసింది. దీన్ని బట్టి చూస్తే ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంత బిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది.బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే ఫేస్‌లిఫ్ట్ ఒక పెద్ద ఎయిర్ డ్యామ్ పొందుతుంది. బంపర్ విశాలంగా ఉంటుంది. పరిమాణంలో కూడా ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కొంత పెద్దదిగానే ఉంది. ఇంటీరియర్ స్పేస్ కూడా కొంత పెరిగినట్లు తెలుస్తోంది. లోపలి భాగం చాలా వరకు బ్లాక్ అవుట్ ట్రీట్మెంట్ పొందుతుంది. అంతే కాకుండా ఇక్కడ ఫిజికల్ బటన్ల సంఖ్య కూడా చాలా తక్కువగానే ఉంటుంది. వెనుక వైపు నెంబర్ ప్లేట్ టెయిల్ ల్యాంప్‌ల మధ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: రూ.80 లక్షల జీతం: సలహా ఇవ్వండి.. టెకీ పోస్ట్ వైరల్బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే ఫేస్‌లిఫ్ట్ 1.5 లీటర్ త్రి సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 48 వోల్ట్స్ మైల్డ్-హైబ్రిడ్ సెటప్‌తో వస్తుంది. ఈ కారు 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. మొత్తం మీద పనితీరు కూడా దాని మునుపటి మోడల్ కంటే ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు 2025 ప్రారంభంలో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. -
సిట్రోయెన్ సీ3 ఆటోమేటిక్ వేరియంట్ ధరలు ఇవే..
ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సీ3 ముఖ్యమైన ఫీచర్ అప్డేట్లను ప్రకటించిన నెల రోజుల తరువాత ఆటోమేటిక్ వేరియంట్ ధరలను ప్రకటించింది. ఇది కేవలం టాప్-స్పెక్ షైన్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉంది. సీ3 ఆటోమాటిక్ ధరలు రూ. 10 లక్షల నుంచి రూ. 10.27 లక్షల మధ్య ఉన్నాయి.సిట్రోయెన్ సీ3 ఆటోమేటిక్ వేరియంట్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ పొందుతాయి. అయితే ఇది చూడటానికి దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. డిజైన్ కొంత అప్డేట్ పొందినప్పటికీ.. ఫీచర్స్ జాబితాలో మాత్రం మాన్యువల్ వేరియంట్‌తో సమానంగా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్‌తో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ వింగ్ మిర్రర్స్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, 7 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.2 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్ మొదలైనవి ఇందులో ఉన్నాయి.ఇదీ చదవండి: అక్టోబర్‌లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?సిట్రోయెన్ సీ3 ఆటోమేటిక్ 1.2 లీటర్ టర్బో పిత్రోల్ ఇంజిన్ ద్వారా 110 హార్స్ పవర్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఇది ఇండియన్ మార్కెట్లో టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
అక్టోబర్‌లో లాంచ్ అయ్యే కొత్త కార్లు ఇవే..
పండుగ సీజన్ వచ్చేస్తోంది. ఈ తరుణంలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ కావడానికి కొన్ని కార్లు సిద్ధమవుతున్నాయి. ఇందులో కొరియన్ బ్రాండ్, చైనా బ్రాండ్, జర్మనీ బ్రాండ్స్ మొదలైనవి ఉన్నాయి. వచ్చే నెలలో (అక్టోబర్ 2024) లాంచ్ అయ్యే కార్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.2024 కియా కార్నివాల్కొత్త తరం కియా కార్నివాల్ 2023 అక్టోబర్ 3న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందనుంది. 2+2+3 సీటింగ్ లేఅవుట్‌తో 7-సీటర్ కాన్ఫిగరేషన్‌తో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ కారు 2.2 లీటర్ డీజిల్ కలిగి 193 పీఎస్ పవర్, 441 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రానున్నట్లు సమాచారం.కియా ఈవీ9ఎప్పటి నుంచో లాంచ్‌కు సిద్దమవుతున్న కియా ఈవీ9 వచ్చే నెలలో దేశీయ విఫణిలో లాంచ్ అవుతుందని సమాచారం. దీని ధర రూ. 90 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ధర ఎక్కువగా ఉండటానికి కారణం.. ఇది సీబీయూ మార్గం ద్వారా దేశానికి దిగుమతి కావడమనే తెలుస్తోంది.నిస్సాన్ మాగ్నైట్ ఫేస్లిఫ్ట్భారతీయ విఫణిలో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న నిస్సాన్ మాగ్నైట్.. అక్టోబర్ 4న ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ అవుతుంది. ఇది అప్డేటెడ్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందనున్నట్లు సమాచారం. పరిమాణం పరంగా స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. రీడిజైన్డ్ ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్‌లు, అప్డేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్, అల్లాయ్ వీల్స్, టెయిల్‌లైట్ మొదలైనవి ఉంటాయి.బీవైడీ ఈమ్యాక్స్7దేశీయ విఫణిలో అతి తక్కువ కాలంలోనేఅధిక ప్రజాదరణ పొందిన చైనా బ్రాండ్ బీవైడీ అక్టోబర్ 8న ఈమ్యాక్స్7పేరుతో ఓ కారును లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. మొదటి 1000 మంది కస్టమర్లకు రూ. 51000 విలువైన ప్రయోజనాలను అందించనున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: తక్కువ ధర.. ఎక్కువ రేంజ్: ఇదిగో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు2024 మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్ ఎల్డబ్ల్యుబీమెర్సిడెస్ బెంజ్ తన 2024 ఈ క్లాస్ ఎల్డబ్ల్యుబీ కారును అక్టోబర్ 9న ఆవిష్కరించనుంది. ఇది పెట్రోల్, డీజిల్ ఎంపికలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారు కోసం కంపెనీ ఇప్పటికీ ఫ్రీ బుకింగ్స్ స్వీకరిస్తున్నట్లు సమాచారం. డెలివరీలు లాంచ్ అయిన తరువాత ప్రారంభమవుతాయి. ధర, వివరాలు తెలియాల్సి ఉంది. -
రెనో సీఎన్జీ వేరియంట్స్ వస్తున్నాయ్..
చెన్నై: వాహన తయారీలో ఉన్న ఫ్రెంచ్ కంపెనీ రెనో.. భారత మార్కెట్లో సీఎన్జీ వేరియంట్లను త్వరలో పరిచయం చేయనుంది. తొలుత ట్రైబర్, కైగర్ ఆ తర్వాత క్విడ్ సీఎన్జీ రానున్నాయి. కొన్ని నెలల్లో కంపెనీ ప్రవేశపెట్టదలచిన ఆరు కొత్త మోడళ్ల కంటే ముందే ఈ సీఎన్జీ వేరియంట్లు దర్శనమీయనున్నాయని రెనో ఇండియా ఆపరేషన్స్ సీఈవో, ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు.భారత్‌లో 2023లో సీఎన్జీ ఆధారిత ప్యాసింజర్ వెహికిల్స్ 5.24 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ సంఖ్య 4.8 లక్షల యూనిట్లు రోడ్డెక్కాయి. కాగా, కంపెనీ విడుదల చేయనున్న మోడళ్లలో సరికొత్త బి–సెగ్మెంట్ ఎస్యూవీ, సి–సెగ్మెంట్ ఎస్యూవీ, రెండు ఈవీలతోపాటు ఆధునీకరించిన ట్రైబర్, కైగర్ ఉన్నాయి.రెనో ఇండియా ప్రత్యేక ఫీచర్లతో ట్రైబర్, కైగర్, క్విడ్ మోడళ్లలో నైట్ అండ్ డే లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లను బుధవారం ప్రవేశపెట్టింది. లిమిటెడ్ ఎడిషన్‌లో 1,600 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంచామని వెంకట్రామ్ తెలిపారు. గతేడాది మాదిరిగానే 2024లో 53,000 యూనిట్లను విక్రయించే అవకాశం ఉందని రెనో ఇండియా అంచనా వేస్తోంది. -
ఒక్కరికి మాత్రమే ఈ కొత్త కారు.. ధర ఎంతంటే?
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బీఎండబ్ల్యూ ఇండియన్ మార్కెట్లో కొత్త 'ఎక్స్ఎమ్ లేబుల్' కారును లాంచ్ చేసింది. దీని ధర రూ. 3.15 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర బీఎండబ్ల్యూ కార్లకంటే కూడా భిన్నంగా ఉంది.గత ఏడాది ఏప్రిల్‌లో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త 'ఎక్స్ఎమ్ లేబుల్ రెడ్' పేరుతో అడుగుపెట్టింది. ఇదే భారతీయ విఫణిలో ఎక్స్ఎమ్ లేబుల్ రూపంలో లాంచ్ అయింది. ఇది 4.4 లీటర్ ట్విన్ టర్బో వీ8 హైబ్రిడ్ ఇంజిన్ కలిగి 748 హార్స్ పవర్, 1000 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇందులో 25.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది గరిష్టంగా 82 కిమీ రేంజ్ అందిస్తుంది.ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు 3.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. పవర్ నాలుగు చక్రాలకు డెలివరీ అవుతుంది.ఎక్స్ఎమ్ లేబుల్.. కిడ్నీ గ్రిల్ సరౌండ్, రియర్ డిఫ్యూజర్ ఇన్సర్ట్, మోడల్ బ్యాడ్జ్‌లు, విండో ఫ్రేమ్ సరౌండ్, షోల్డర్ లైన్, వీల్ ఇన్సర్ట్లు వంటివన్నీ రెడ్ ఎలిమెంట్లను పొందుతాయి. ఇందులో 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇంటీరియర్ కూడా రెడ్ అండ్ బ్లాక్ కలర్ చూడవచ్చు.ఇదీ చదవండి: ఈ ఏడాది 850 టన్నులు!.. బంగారానికి భారీ డిమాండ్ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. కంపెనీ ఈ కారును ప్రపంచ వ్యాప్తంగా 500 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. ఇందులో నుంచి ఒక్క కారు మాత్రమే ఇండియాకు కేటాయించి. అంటే భారతదేశంలో ఈ కారును కేవలం ఒక్కరు మాత్రమే కొనుగోలు చేయగలరు. ఇది స్పెషల్ ఎడిషన్ అని చెప్పడానికి కంట్రోల్ డిస్ప్లే క్రింద “500లో 1” అని ఉంటుంది. -
మారుతి స్విఫ్ట్ సీఎన్జీ వచ్చేసింది: ధర ఎంతంటే?
మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో తన 14వ సీఎన్జీ కారుగా 'స్విఫ్ట్'ను లాంచ్ చేసింది. దీంతో స్విఫ్ట్ ఇప్పుడు సీఎన్జీ రూపంలో కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఈ మోడల్ ప్రారంభ ధరలు రూ. 8.20 లక్షలు. ఈ ధర పెట్రోల్ వేరియంట్ కంటే కూడా రూ. 90వేలు ఎక్కువ కావడం గమనార్హం.మారుతి స్విఫ్ట్ సీఎన్జీ కారు 1.2 లీటర్ ఇంజిన్ పొందుతుంది. ఇది సీఎన్జీలో ప్రయాణించేటప్పుడు 69 బీహెచ్పీ, 102 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పెట్రోలుతో నడిచేటప్పుడు 80.4 బీహెచ్పీ, 112 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.ఇది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే పొందుతుంది.ఇదీ చదవండి: ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి.. చుక్కలు తాకిన కొత్త ధరలు!చూడటానికి సాధారణ స్విఫ్ట్ మాదిరిగా కనిపించే ఈ కొత్త సీఎన్జీ కారు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ కారులో 60:10 స్ప్లిట్ రియర్ సీటు ఉంటుంది. కాబట్టి లగేజ్ కొంత ఎక్కువగా తీసుకెళ్లడానికి అనుమతిస్తుంది. -
రూ.65 లక్షల బీఎండబ్ల్యూ కొత్త కారు: పూర్తి వివరాలు
బీఎండబ్ల్యూ కంపెనీ ఇండియన్ మార్కెట్లో ఎట్టకేలకు '320ఎల్‌డబ్ల్యు ఎమ్ స్పోర్ట్ ప్రో' లాంచ్ చేసింది. ఈ సెడాన్ ధర రూ.65 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.బీఎండబ్ల్యూ 320ఎల్‌డబ్ల్యు ఎమ్ స్పోర్ట్ ప్రో మోడల్ బ్లాక్ కిడ్నీ గ్రిల్, స్మోక్డ్ అవుట్ ఎఫెక్ట్ అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్లైట్లు, గ్లోస్ బ్లాక్ రియర్ డిఫ్యూజర్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా బ్లైండ్ స్పాట్ అసిస్టెంట్, లేన్ చేంజ్ అసిస్టెంట్, పార్కింగ్ అసిస్టెంట్ ప్లస్ వంటి అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టం ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.కొత్త బీఎండబ్ల్యూ కారు మినరల్ వైట్, స్కైస్క్రాపర్ గ్రే, కార్బన్ బ్లాక్, పోర్టిమావో బ్లూ అనే నాలుగు రంగులలో లభిస్తుంది. యాంబియంట్ లైటింగ్‌లో భాగంగా ఫ్రంట్ సీట్స్ వెనుక భాగంలో కొత్త ఇల్యూమినేటెడ్ కాంటౌర్ స్ట్రిప్ కూడా ఉంది.బీఎండబ్ల్యూ 320ఎల్‌డబ్ల్యు ఎమ్ స్పోర్ట్ ప్రో 12.3 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే, 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 16 స్పీకర్లతో హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: సింగిల్ ఛార్జీతో 611 కిమీ రేంజ్.. కొత్త బెంజ్ కారు వచ్చేసిందిబీఎండబ్ల్యూ 320ఎల్‌డబ్ల్యు ఎమ్ స్పోర్ట్ ప్రో మోడల్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా 190 హార్స్ పవర్, 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 7.6 సెకన్లలో 0 - 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందిన ఈ కారు 19.61 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులో ఎకో ప్రో, కంఫర్ట్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. -
లాంచ్‌కు సిద్ధమవుతున్న జర్మన్ బ్రాండ్ కారు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'ఆడి' కొత్త తరం 'క్యూ5' కారును ఆవిష్కరించింది. ఇది ప్రీమియం ప్లాట్‌ఫారమ్ కంబస్షన్ (PPC) ఆధారంగా తయారైన బ్రాండ్ మొదటి వెహికల్. ఈ కారు వచ్చే ఏడాది దేశీయ విఫణిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.కొత్త ఆడి క్యూ5 మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, అప్డేటెడ్ ఫ్రంట్ బంపర్, చిన్న గ్రిల్, వెనుకవైపు కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, డ్యూయల్ టోన్ బంపర్ వంటివి పొందుతుంది. ఇంటీరియర్ డిజైన్ ఆడి క్యూ6 ఈ-ట్రాన్ మాదిరిగా ఉంటుంది.కొత్త తరం ఆడి క్యూ5 11.9 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 14.5 ఇంచెస్ టచ్‌స్క్రీన్, త్రీ-స్పోక్ స్టీరింగ్ వంటివి కలిగి ఉంటుంది. ఇది మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. అవి 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్, 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్, 3.0 లీటర్ వీ6 టర్బో పెట్రోల్ ఇంజిన్స్.ఆడి క్యూ5 కారు ఈ నెల చివరినాటికి జర్మనీలో, ఆ తరువాత యూరప్‌లోని ఇతర దేశాలలో లాంచ్ అవుతుంది. 2025 మొదటి త్రైమాసికంలో డెలివరీలు ప్రారంభమవుతాయి. ఇది భారతీయ మార్కెట్లో వచ్చే ఏడాది లాంచ్ అవుతుందని సమాచారం. కంపెనీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడించాల్సి ఉంది.భారతదేశంలో లాంచ్ అయిన తరువాత, ఆడి క్యూ5 కారు ఇప్పటికే విక్రయానికి ఉన్న మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ, వోల్వో ఎక్స్‌సీ60 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కారు ధర రూ. 65 లక్షల కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అధికారిక ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
భారత్‌లో మరో మసెరటి కారు లాంచ్: ధర ఎంతో తెలుసా?
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'మసెరటి'.. భారతీయ మార్కెట్లో సెకండ్ జనరేషన్ 'గ్రాన్టూరిస్మో' (GranTurismo) లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభ ధరలు రూ. 2.72 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది మోడెనా, ట్రోఫియో అనే రెండు ట్రిమ్‌లలో లభిస్తుంది.రెండు డోర్స్, నాలుగు సీట్లు కలిగిన ఈ కారు 3.0 లీటర్ వీ6 ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 490 హార్స్ పవర్, 600 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 3.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది.మసెరటి గ్రాన్టూరిస్మో 12.2 ఇంచెస్ డిజిటల్ డయల్ డిస్ప్లే, 12.3 ఇంచెస్ సెంట్రల్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉన్నాయి. దానికి కింద భాగంలో క్లైమేట్ కంట్రోల్స్ కోసం 8.8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ కూడా ఉంటుంది. డిజిటల్ క్లాక్, ఆప్షనల్ హెడ్ అప్ డిస్ప్లే, సోనస్ ఫాబ్రే ఆడియో సిస్టమ్ మొదలైనవి కూడా ఇందులో చూడవచ్చు.20 ఇంచెస్ ఫ్రంట్ వీల్, వెనుకవైపు 21 ఇంచెస్ వీల్స్ పొందిన మసెరటి గ్రాన్టూరిస్మో ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న బీఎండబ్ల్యూ ఎం8 కాంపిటీషన్, ఫెరారీ రోమా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
కొత్తగా మారిన పాత కార్లు..! (ఫొటోలు)
-
లాంచ్‌కు సిద్దమవుతున్న ఫ్రెంచ్ బ్రాండ్ ఇదే.. ఫోటోలు చూశారా?
సిట్రోయెన్ కంపెనీ దేశీయ విఫణిలో ఆగష్టు 2న 'బసాల్ట్' SUVని లాంచ్ చేయనుంది. అయితే సంస్థ అంత కంటే ముందు ప్రొడక్షన్ వెర్షన్ వెల్లడించింది. ఇది చూడటానికి చాలా మంచి డిజైన్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.కొత్త సిట్రోయెన్ బసాల్ట్ కారు 17 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, హాలోజన్ టెయిల్-ల్యాంప్, డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌తో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ వంటివి పొందుతుంది. వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.2 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టోగుల్ స్విచ్‌లతో కూడిన ఆటో క్లైమేట్ కంట్రోల్, కాంటౌర్డ్ రియర్ హెడ్‌రెస్ట్‌లు మరియు స్టోరేజ్‌తో ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.కలర్ ఆప్షన్స్ వెల్లడి కావాల్సి ఉంది. అయితే ఈ కారులో సన్‌రూఫ్ లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఎక్కువమంది సన్‌రూఫ్ ఉన్న కార్లనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ సమయంలో సిట్రోయెన్ సన్‌రూఫ్ లేకుండా లాంచ్ చేస్తే.. ఎలాంటి అమ్మకాలను పొందుతుందనేది తెలియాల్సిన విషయం.బసాల్ట్ కారు 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి.. 110 హార్స్ పవర్ మరియు 205 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందనున్నట్లు సమాచారం. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు ప్రారంభ ధర రూ. 11 లక్షల నుంచి రూ. 12 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని సమాచారం. -
రూ.72.90 లక్షల కొత్త బీఎండబ్ల్యూ కారు - వివరాలు
బీఎండబ్ల్యూ కంపెనీ సరికొత్త 5 సిరీస్ కారు ఎల్డబ్ల్యుబీ లాంచ్ చేసింది. ఇది 530ఎల్ఐ అనే సింగిల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. దీని ధర రూ. 72.90 లక్షలు (ఎక్స్ షోరూమ్).కొత్త బీఎండబ్ల్యూ 530ఎల్ఐ వేరియంట్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో 48వోల్ట్స్ మైల్డ్ హైబ్రిడ్ అసిస్ట్ పొందుతుంది.ఇది 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ద్వారా వెనుక చక్రాలను పవర్ డెలివరీ చేస్తుంది. ఇది 6.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ లగ్జరీ కారు టాప్ స్పీడ్ 250 కిమీ/గం.కొత్త డిజైన్ కలిగిన బీఎండబ్ల్యూ 5 సిరీస్.. పరిమాణంలో దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కొంత పెద్దగా ఉంటుంది. ఇందులో కిడ్నీ గ్రిల్, 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, స్పోర్టియర్ ఫ్రంట్, రియర్ బంపర్లు ఉన్నాయి. లోపల 12.3 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ మొదలైనవి ఉన్నాయి. -
జులై 24న లాంచ్ కానున్న రెండు కార్లు ఇవే!
భారతీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన మినీ ఇండియా ఈ నెల ప్రారంభంలోనే తన 'కూపర్ ఎస్, న్యూ జనరేషన్ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్' కార్ల కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కంపెనీ ఈ రెండు కార్లను జూలై 24న దేశీయ విఫణిలో అధికారికంగా లాంచ్ చేయనుంది.మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్కొత్త మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ మంచి డిజైన్ కలిగి అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు రీడిజైన్డ్ హెడ్‌లైట్స్, రివైజ్డ్ టెయిల్‌లైట్స్, 9.5 ఇంచెస్ రౌండ్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే మొదలైనవి పొందుతుంది. ఇందులో ఎలక్ట్రిక్ మోటారు 201 Bhp పవర్, 250 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 66.45 కిలోవాట్ బ్యాటరీ ఒక సింగిల్ చార్జితో 462 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారు ధర రూ. 70 లక్షల వరకు ఉంటుంది. ఇది కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU)గా దిగుమతి అవుతుంది.మినీ కూపర్ ఎస్ఇప్పటికే మంచి అమ్మకాలు పొందుతున్న మినీ కూపర్ ఎస్.. మరికొత్త హంగులతో లాంచ్ కానుంది. ఇది రౌండ్ హెడ్‌ల్యాంప్స్, ఇందులో రౌండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఫీచర్స్ ఉంటాయి. ఇందులో 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 201 Bhp పవర్, 300 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా శక్తిని ఫ్రంట్ వీల్స్‌కు పంపుతుంది. ఈ కారు 6.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవతం అవుతుంది. దీని ధర రూ. 42 లక్షల కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. -
భారత్‌లో సరికొత్త అమెరికన్ బ్రాండ్ కారు లాంచ్.. ధర ఎంతో తెలుసా?
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన అమెరికన్ బ్రాండ్ జీప్.. భారతీయ విఫణిలో సరికొత్త 'స్పెషల్ ఎడిషన్ మెరిడియన్ ఎక్స్' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ధర రూ. 34. 27 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా వరకు అప్డేట్స్ పొందింది.జీప్ మెరిడియన్ స్పెషల్ ఎడిషన్.. గ్రే రూఫ్, గ్రే యాక్సెంట్లతో అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది. ఇందులో సైడ్ మౌల్డింగ్, పుడిల్ ల్యాంప్స్, ప్రోగ్రామబుల్ యాంబియంట్ లైటింగ్, సన్‌షేడ్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, ప్రీమియం కార్పెట్ మ్యాట్స్ మొదలైనవి ఉన్నాయి. ఈ స్పెషల్ ఎడిషన్ ధర దాని ఎంట్రీ లెవల్ లిమిటెడ్ (ఓ) వేరియంట్ కంటే రూ. 50000 ఖరీదైనది.కొత్త జీప్ మెరిడియన్ ఎక్స్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 170 హార్స్ పవర్ మరియు 350 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 9 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో లభిస్తుంది.జీప్ కంపెనీ ఈ ఏడాది చివర్లో మిడ్-లైఫ్ అప్డేట్ను అందుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ అప్డేటెడ్ SUV ఇటీవలే టెస్టింగ్ దశలో కనిపించింది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందిందని తెలుస్తోంది. ఇది దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత స్కోడా కొడియాక్, ఎంజీ గ్లోస్టర్, టయోటా ఫార్చ్యూనర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
హైబ్రీడ్ కార్.. ఒక్కసారికి 2000 కిమీ ప్రయాణం
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో ఆధునిక ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఈ తరుణంలో చైనాకు చెందిన బీవైడీ కంపెనీ సింగిల్ చార్జితో ఏకంగా 2000 కిమీ కంటే ఎక్కువ ప్రయాణించే హైబ్రిడ్ కారును ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.బీవైడీ కంపెనీ ఆవిష్కరించిన కొత్త హైబ్రిడ్ కారును ఒక ఫుల్ ఛార్జ్ చేసి.. ఫుల్ ట్యాంక్ ఇంధనం నింపిన తరువాత, ప్రయాణం ప్రారంభిస్తే.. 2000 కిమీ ప్రయాణించే వరకు మళ్ళీ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యూయల్ ట్యాంక్‌లో ఇంధనం నింపాల్సిన అవసరం కూడా లేదు.కంపెనీ ఆవిష్కరించిన కారు పేరు తెలియాల్సి ఉంది. అయితే దీని ధర 100000 యువాన్లు (13800 అమెరికన్ డాలర్లు) వరకు ఉంటుందని సమాచారం. లాంచ్ సమయంలో కంపెనీ అధికారిక ధరలను వెల్లడిస్తుంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ హైబ్రిడ్ కారుకు సంబంధించిన ఫీచర్స్ మాత్రమే కాకుండా.. లాంచ్ డేట్ వంటి వివరాలు కూడా అధికారికంగా త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
త్వరలో లాంచ్ కానున్న కొత్త బెంట్లీ కారు ఇదే.. ఫోటోలు
బెంట్లీ కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త 'కాంటినెంటల్ జీటీ పీహెచ్ఈసీ' అధికారికంగా మార్కెట్లో లాంచ్ కాకముందే.. ఫోటోలు విడుదలయ్యాయి. ఇప్పటికి విడుదలైన ఫోటోల ప్రకారం.. బెంట్లీ కాంటినెంటల్ జీటీ మంచి స్టైలింగ్ అప్డేట్లను పొందుతుందని స్పష్టమవుతోంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా ఉత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం.కొత్త బెంట్లీ కాంటినెంటల్ జీటీ పీహెచ్ఈసీ టియర్‌డ్రాప్ డిజైన్ హెడ్లైట్లను పొందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది ఇంకా టెస్టింగ్ దశలోనే ఉండటం వల్ల మొత్తం డిజైన్ వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. అయినప్పటికీ ఇది అద్భుతమైన డిజైన్ పొందుతుందని స్పష్టమవుతోంది.బెంట్లీ కాంటినెంటల్ జీటీ పీహెచ్ఈసీ ఒక ఎలక్ట్రిక్ మోటార్‌తో 4.0 లీటర్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఎలక్ట్రిక్ మోటార్, ఇంజిన్ రెండూ కలిసి 782 హార్స్ పవర్, 1001 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త బెంట్లీ కాంటినెంటల్ జీటీ పీహెచ్ఈవీ మొదట గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఆ తరువాత భారతీయ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాలు తెలియాల్సి ఉంది.A new era is coming.Discover more: https://t.co/anuS4iG6oX-CO2 Emissions and fuel consumption data for EU27 is pending; subject to EU Type Approval pic.twitter.com/eJZih65PYf— Bentley Motors (@BentleyMotors) May 16, 2024 -
భారత్‌లో లాంచ్ అయిన జర్మన్ బ్రాండ్ కార్లు - వివరాలు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి (Audi) భారతీయ మార్కెట్లో క్యూ3 SUV , క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ బోల్డ్ ఎడిషన్ వేరియంట్లను లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన కార్ల ధరలు వరుసగా రూ. 54.65 లక్షలు, రూ. 55.71 లక్షలు.కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కార్లు అద్భుతమైన డిజైన్ పొందుతుంది. అయితే ఇంటీరియర్, పవర్‌ట్రెయిన్ విషయంలో ఎటువంటి మార్పులు లేదని తెలుస్తోంది. బోల్డ్ ఎడిషన్ వేరియంట్లు ఎక్కువగా బ్లాక్ అవుట్ ఎలిమెంట్స్ పొందుతాయి. ఇందులోని గ్రిల్‌పై గ్లోస్ బ్లాక్ ట్రీట్మెంట్, ఫ్రంట్ బంపర్‌పై ఎయిర్ ఇన్‌టేక్ సరౌండ్‌లు, విండో లైన్ సరౌండ్, వింగ్ మిర్రర్ క్యాప్స్, రూఫ్ రైల్స్ మొదలైనవి చూడవచ్చు. ఈ కార్లు 18 ఇంచెస్ 5 స్పోక్ అల్లాయ్ వీల్స్ పొందుతాయి.స్టాండర్డ్ వెర్షన్ కార్ల ధరలతో పోలిస్తే.. బోల్డ్ ఎడిషన్ ధరలు వరుసగా రూ. 1.48 లక్షలు, రూ. 1.49 లక్షలు ఎక్కువ. ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, ఫోర్-వే లంబార్ సపోర్ట్‌తో పవర్డ్ ఫ్రంట్ సీట్లు, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జర్, రియర్ వ్యూ కెమెరా మొదలైనవి ఉన్నాయి.ఆడి క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ బోల్డ్ ఎడిషన్లు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతాయి. ఇవి 190 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్స్ 7 స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి.Make a bold statement with the Audi Q3 and Audi Q3 Sportback Bold Edition that come with the black styling package plus.*Terms and conditions apply.#AudiIndia #AudiQ3models #AudiBoldEdition pic.twitter.com/t6Yeq5CKT0— Audi India (@AudiIN) May 10, 2024 -
బీజింగ్ మోటార్ షోలో అడుగుపెట్టిన ఫోక్స్‌వ్యాగన్ కారు ఇదే..
బీజింగ్ మోటార్ షో 2024లో సరికొత్త 'ఫోక్స్‌వ్యాగన్ టైరాన్' అధికారికంగా వెల్లడైంది. చైనా మార్కెట్లో విక్రయానికి రానున్న ఈ కొత్త కారు 5 సీటర్ టైగన్ ఎల్ ప్రో పేరుతో విక్రయానికి రానుంది. ఇది 2025 నాటికి దేశీయ మార్కెట్లో 7 సీటర్ రూపంలో అడుగుపెట్టనుంది.ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ చూడటానికి చాలా వరకు టైగన్ మాదిరిగా ఉంటుంది. కాబట్టి ఇది ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, పెద్ద గ్లాస్‌హౌస్ వంటి వాటిని పొందుతుంది. ఇది దాని ఇతర మోడల్స్ కంటే కూడా కొంత పొడవుగా ఉంటుంది. ఇది సెంటర్ కన్సోల్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్రైవ్ సెలెక్టర్ కోసం రోటరీ డయల్, రెండు కప్హోల్డర్లతో మంచి లేఅవుట్‌ను పొందుతుంది. వీటితో పాటు 360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ADAS ఫీచర్స్ కూడా ఉన్నాయి.ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ 2.0-లీటర్, ఫోర్ సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ రెండు ట్యూన్లలో లభిస్తుంది. బేస్ మోడల్ 184 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టాప్ వేరియంట్ 217 హార్స్ పవర్, 350 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ గ్లోబల్ మోడల్ అని సీఈఓ థామస్ షాఫర్ వెల్లడించారు. చైనా తరువాత జపాన్, ఆ తరువాత మెక్సికోలో తయారవుతుంది. 2025లో భారతీయ తీరాలను చేరే అవకాశం ఉందని సమాచారం. ఇది దేశీయ విఫణిలో లాంచ్ అయిన తరువాత జీప్ మెరిడియన్, స్కోడా కొడియాక్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.