హ్యుందాయ్ కంపెనీ భారతదేశంలో 2023 వెర్నా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ మిడ్-సైజ్ సెడాన్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఈ సెడాన్ ఇటీవల టెస్టింగ్ సమయంలో కనిపించింది.
హ్యుందాయ్ వెర్నా దాని మునుపటి మోడల్స్ కంటే చాలా ఆధునిక డిజైన్ పొందుతుంది. ఈ సెడాన్ ముందు భాగంలో స్పోర్టినెస్ డిజైన్ లాంగ్వేజ్ కలిగి, పారామెట్రిక్ గ్రిల్ పొందుతుంది. ఫ్రంట్ బంపర్ కొత్తగా కనిపిస్తుంది. బోనెట్ మీద బ్రాండ్ లోగో చూడవచ్చు. స్ప్లిట్ హెడ్‌లైట్ సెటప్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ గ్రిల్ పక్కన అమర్చబడి ఉంటుంది.
సైడ్ ప్రొఫైల్‌లో డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక వైపు వెడల్పు అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ టెయిల్ లైట్ చూడవచ్చు. దాని పైన హ్యుందాయ్ బ్రాండ్ లోగో ఉంటుంది. ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ వంటివి ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు, అయినప్పటికీ ఇందులో బెస్ట్ ఫీచర్స్, ఏడిఏఎస్ టెక్నాలజీ వంటివి వుండే అవకాశం ఉంది.
2023 హ్యుందాయ్ వెర్నా రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందనుంది. ఇందులో మొదటి 1.5 లీటర్ ఇంజిన్, ఇది 115 పిఎస్ పవర్ & 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండవ ఇంజిన్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్, ఇది 160 పిఎస్ పవర్ & 265 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్, పర్ఫామెన్స్ వివరాలు కూడా అధికారికంగా వెల్లడి కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment