అత్యంత ప్రజాదరణ పొందిన 'హ్యుందాయ్ వెన్యూ' కారును దేశీయ విఫణిలో ఆరు లక్షల మంది కొనుగోలు చేశారు. 2019లో ప్రారంభమైన ఈ ఎస్‌యూవీ ఐదున్నర సంవత్సరాల్లో ఈ మైలురాయిని చేరుకుంది. అత్యధికంగా 2024 ఆర్ధిక సంవత్సరంలో 1,28,897 యూనిట్లు అమ్ముడయ్యాయి.
హ్యుందాయ్ వెన్యూ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత.. మొదటి ఆరు నెలల్లో 50,000 యూనిట్ల మైలురాయిని చేరుకుంది. ఆ తరువాత 15 నెలల్లో లక్ష యూనిట్లు, 25 నెలల్లో రెండు లక్షల యూనిట్లు, 36 నెలల్లో మూడు లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. 2023 నవంబర్ నాటికి వెన్యూ సేల్స్ ఐదు లక్షల యూనిట్లు కావడం గమనార్హం. ఆ తరువాత లక్ష యూనిట్లు అమ్ముడు కావడానికి 12 నెలల సమయం పట్టింది.
ఇదీ చదవండి: పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఇవే!.. రేంజ్ కూడా ఎక్కువే..
హ్యుందాయ్ వెన్యూ మొత్తం 26 వేరియంట్లు, 3 ఇంజన్లు, 3 గేర్‌బాక్స్ ఎంపికలలో లభిస్తుంది. దీని ధరలు రూ. 7.94 లక్షల నుంచి రూ. 13.44 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. కాగా కంపెనీ 2025 వెన్యూ కారును వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కారు పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. రాబోయే 2025 వెన్యూ మోడల్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment