Car Sales
-
కొత్త ఏడాది.. మంచి బోణీ మారుతీ సుజుకీదే..
మారుతీ సుజుకీ (Maruti Suzuki) కొత్త ఏడాది జనవరిలో మొత్తం 2,12,251 వాహనాలు విక్రయించింది. గడిచిన ఏడాది ఇదే జనవరి అమ్మకాలు 1,99,364 యూనిట్లతో పోలిస్తే ఇవి 6% అధికం. ఇందులో దేశీయ ప్రయాణికుల వాహన అమ్మకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 1,66,802 యూనిట్ల నుంచి 1,73,599 యూనిట్లకు చేరాయి.విదేశాలకు ఎగుమతులు 23,921 యూనిట్లకు 27,100 యూనిట్లకు ఎగిశాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహన విక్రయాలు 3% తగ్గి 57,115 వాహనాలకు చేరాయి. ఇందులో దేశీయంగా 54,003 వాహన అమ్మకాలు జరగ్గా.., విదేశాలకు ఎగుమతులు 11,600 యూనిట్లుగా ఉన్నాయి. కాగా 2024 జనవరిలో 67,615 యూనిట్ల విక్రయాలు అమ్ముడయ్యాయి.టాటా మోటార్స్ అమ్మకాలు 86,125 యూనిట్ల నుంచి 80,304 యూనిట్లకు పరిమితమయ్యాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్ అమ్మకాలు 24,609 నుంచి 19% పెరిగి 29,371కు చేరాయి. మహీంద్రాఅండ్‌మహీంద్రా విక్రయాలు 16% పెరిగి 85,432 యూనిట్లకు చేరాయి. -
వాహనాల విక్రయాలు అదుర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా తయారీ కంపెనీల నుండి డీలర్‌షిప్‌లకు చేరిన ప్యాసింజర్ వెహికిల్స్ (పీవీ) సంఖ్య గతేడాదితో పోలిస్తే 2024 నవంబర్‌లో 4 శాతం పెరిగి 3,47,522 యూనిట్లకు చేరుకున్నాయి. భారత పీవీ రంగంలో నవంబర్ నెలలో ఇవే ఇప్పటి వరకు అత్యధికం.అక్టోబర్‌లో పండుగ తర్వాత డిమాండ్ ఊపందుకుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. సియామ్ గణాంకాల ప్రకారం.. గత ఏడాది నవంబర్‌లో మొత్తం ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ విక్రయాలు 3,33,833 యూనిట్లుగా ఉన్నాయి. మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ ఇండియా గత నెల హోల్‌సేల్ అమ్మకాలు 5 శాతం వృద్ధితో 1,41,312 యూనిట్లను తాకాయి.హ్యుందాయ్ మోటార్ ఇండియా నుంచి డీలర్లకు చేరిన వాహనాల సంఖ్య 49,451 నుంచి 48,246 యూనిట్లకు తగ్గాయి. మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 16 శాతం వృద్ధితో 46,222 యూనిట్లకు ఎగశాయి. ద్విచక్ర వాహనాల హోల్‌సేల్స్ 2023 నవంబర్‌లో 16,23,399 యూనిట్లు నమోదు కాగా, గత నెలలో 1 శాతం తగ్గి 16,04,749 యూనిట్లకు చేరుకున్నాయి.స్కూటర్ల విక్రయాలు 12 శాతం పెరిగి 5,68,580 యూనిట్లకు చేరుకున్నాయి. మోటార్‌సైకిల్స్ 7.5 శాతం తగ్గి 9,90,246 యూనిట్లకు పడిపోయాయి. గత నెలలో మోపెడ్ హోల్‌సేల్స్ 6 శాతం పెరిగి 45,923 యూనిట్లు నమోదయ్యాయి. త్రీ–వీలర్స్ 1 శాతం క్షీణించి 59,350 యూనిట్లకు వచ్చి చేరాయి. దీపావళి కాని నవంబర్‌లో మొదటిసారిగా టూవీలర్స్ హోల్‌సేల్ విక్రయాలు 16 లక్షల యూనిట్ల మార్కును దాటింది. -
భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కారు: 1.86 లక్షల మంది కొనేశారు
భారతదేశంలో లెక్కకు మించిన కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే దేశీయ విఫణిలో అమ్మకానికి ఉన్న అన్ని కార్లూ.. గొప్ప విక్రయాలను పొందలేవు. కానీ కొన్ని కార్లు మాత్రం ఊహకందని రీతిలో అమ్ముడవుతాయి. ఈ కథనంలో ఈ ఏడాది దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లను గురించి తెలుసుకుందాం.దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్.. మార్కెట్లో 2021లో 'పంచ్' పేరుతో మైక్రో ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఈ కారు ఈ ఒక్క ఏడాది ఏకంగా 1.86 లక్షల సేల్స్ పొంది.. అమ్మకాల్లో అగ్రగామిగా నిలిచింది. 2023లో 1.50 లక్షల టాటా పంచ్ కార్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో టాటా పంచ్ పెట్రోల్, ఎలక్ట్రిక్, CNG రూపాల్లో అందుబాటులో ఉంది.చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ.. టాటా పంచ్ సేఫ్టీ రేటింగులో 5 స్టార్స్ సొంతం చేసుకుని, అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. టాటా పంచ్ ధర రూ. 6.13 లక్షల నుంచి రూ. 10.15 లక్షల మధ్య ఉంటుంది. అదే సమయంలో పంచ్ ఎలక్ట్రిక్ కారు ధరలు రూ. 9.99 లక్షల నుంచి రూ. 14.29 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.2024లో (జనవరి నుంచి నవంబర్) అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు⮞టాటా పంచ్: 1,86,958 యూనిట్లు⮞హ్యుందాయ్ క్రెటా: 1,74,311 యూనిట్లు⮞మారుతి సుజుకి బ్రెజ్జా: 1,70,824 యూనిట్లు⮞మహీంద్రా స్కార్పియో: 1,54,169 యూనిట్లు⮞టాటా నెక్సాన్: 1,48,075 యూనిట్లు⮞మారుతి సుజుకి ఫ్రాంక్స్: 1,45,484 యూనిట్లు⮞మారుతి సుజుకి గ్రాండ్ విటారా: 1,15,654 యూనిట్లు⮞హ్యుందాయ్ వెన్యూ: 1,07,554 యూనిట్లు⮞కియా సోనెట్: 1,03,353 యూనిట్లు⮞మహీంద్రా బొలెరో: 91,063 యూనిట్లుఇదీ చదవండి: మరో ఖరీదైన కారు కొన్న జొమాటో సీఈఓ: ధర ఎన్ని కోట్లో తెలుసా? -
కలిసొచ్చిన పెళ్లిళ్ల సీజన్.. వాహన అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: పెళ్లిళ్ల సీజన్, ఎస్‌యూవీలకు డిమాండ్ నెలకొనడం, గ్రామీణ మార్కెట్లు మెరుగుపడుతుండటం వంటి సానుకూల అంశాలతో నవంబర్‌లో వాహన విక్రయాలు పెరిగాయి. మారుతీ సుజుకీ ఇండియా, టాటా మోటర్స్, టయోటా కిర్లోస్కర్ మోటర్స్ మొదలైన దిగ్గజాల దేశీయ అమ్మకాలు వృద్ధి చెందాయి.మారుతీ విక్రయాలు 5 శాతం, టాటా మోటర్స్ 2 శాతం, టయోటా 44 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి. అటు, కొత్తగా లిస్టయిన హ్యుందాయ్ మోటర్ ఇండియా అమ్మకాలు 2 శాతం క్షీణించాయి. గ్రామీణ మార్కెట్లు పుంజుకుంటూ ఉండటం, ఎస్‌యూవీలకు డిమాండ్ నెలకొనడం, లిమిటెడ్ ఎడిషన్లను ప్రవేశపెట్టడం తదితర అంశాలు తమకు కలిసొచ్చాయని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు.నవంబర్‌లో బ్రెజా, ఎర్టిగా, గ్రాండ్ విటారా ఎక్స్ఎల్6 వంటి యుటిలిటీ వాహనాల అమ్మకాలు గత నవంబర్‌లో నమోదైన 49,016 యూనిట్లతో పోలిస్తే 59,003 యూనిట్లకు పెరిగాయి. అయితే, ఆల్టో, ఎస్–ప్రెసోలాంటి మినీ–సెగ్మెంట్ కార్ల అమ్మకాలు 9,959 యూనిట్ల నుంచి 9,750 యూనిట్లకు తగ్గాయి. మరోవైపు, వివిధ వర్గాల అవసరాలకు అనుగుణమైన హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి ఎస్‌యూవీల వరకు వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోతో విక్రయాలు మెరుగుపర్చుకుంటున్నట్లు టయోటా వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ తెలిపారు. -
100 దేశాలు 17 కార్లు.. అగ్రరాజ్యాల్లో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి ఇండియా' ఎట్టకేలకు 30 లక్షల వాహనాలను ఎగుమతి చేసింది. భారతదేశంలో ఈ అద్భుతమైన ఫీట్ సాధించిన ఏకైక కార్ల తయారీ సంస్థగా మారుతి సుజుకి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.1986 నుంచి తమ వాహనాలను ఎగుమతి చేయడం ప్రారంభించిన మారుతి సుజుకి.. ప్రారంభంలో 500 కార్లను ఎగుమతి చేసింది. 2013 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఏకంగా 10 లక్షల యూనిట్లను విజయవంతంగా ఎగుమతి చేయగలిగింది. ఆ తరువాత తొమ్మిదేళ్లకు (FY21) మరో 10 లక్షల వాహనాలు ఎగుమతి అయ్యాయి. మరో 10 లక్షల కార్లను కంపెనీ ఎగుమతి చేయడానికి పట్టిన సమయం మూడు సంవత్సరాల తొమ్మిది నెలలు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే గ్లోబల్ మార్కెట్లో కూడా మారుతి సుజుకి కార్లకు డిమాండ్ విపరీతంగా పెరిగినట్లు స్పష్టమైంది.కంపెనీ ఎగుమతి చేసిన కార్లలో సెలెరియో, ఫ్రాంక్స్, జిమ్నీ, బాలెనో, సియాజ్, డిజైర్, ఎస్-ప్రెస్సో మొదలైన కార్లు ఉన్నాయి. నేడు భారత్ నుంచి ఎగుమతి అవుతున్న మొత్తం వాహనాల్లో మారుతి సుజుకి 40 శాతం వాటాను కలిగి ఉంది. ఇందులో ఎక్కువ భాగం ప్యాసింజర్ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది.మారుతి సుజుకి దాదాపు 100 దేశాలకు 17 మోడళ్లను ఎగుమతి చేస్తోంది. ఇందులో లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, మిడిల్ ఈస్ట్ వంటివి కంపెనీకి ముఖ్యమైన ఎగుమతి మార్కెట్లు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య తప్పకుండా పెరిగే అవకాశం ఉంది. ఎగుమతుల్లో కంపెనీ సాధించిన విజయానికి మారుతి సుజుకి ఎండీ అండ్ సీఈఓ హిసాషి టేకుచి భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. -
సీజన్ ముగిసినా.. సందడే సందడి
పండుగ సీజన్ ముగిసిపోయినా కార్ల విషయంలో మాత్రం ఆఫర్ల పర్వం కొనసాగుతూనే ఉంది. వివిధ కార్ల కంపెనీలు నగదు డిస్కౌంట్లు, ఇతరత్రా బహుమతులతో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆటో డీలర్ల అసోసియేషన్ సమాఖ్య (ఎఫ్ఏడీఏ) గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా వాహన రిటైలర్ల దగ్గర 75–80 రోజులకు సరిపోయే నిల్వలు పేరుకుపోయాయి. వీటి విలువ సుమారు రూ. 75,000 కోట్లుగా ఉంటుంది. వాహన విక్రయాల గణాంకాలకు సంబంధించిన వాహన్ పోర్టల్ ప్రకారం నవంబర్‌లో తొలి ఇరవై రోజుల్లో 1,77,362 ప్యాసింజర్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. మరోవైపు, కార్ల కంపెనీలన్నీ కలిసి నవంబర్‌లో సుమారు 3,25,000 నుంచి 3,30,000 వరకు వాహనాలను హోల్‌సేల్‌గా డీలర్లకు సరఫరా చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వాహన నిల్వలను తగ్గించుకోవడంపై కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయి. ‘‘ఏడాది చివరన పాత స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు కంపెనీలు సాధారణంగా ఆఫర్లు ఇస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. డీలర్ల దగ్గర ఏకంగా 65–70 రోజులకు సరిపడా నిల్వలు పేరుకుపోయాయి. దీంతో సంస్థలు భారీగా డిస్కౌంట్లకు తెరతీశాయి. ఇది ఒక రకంగా కార్ల కొనుగోలుదార్లకు అసాధారణ అవకాశంలాంటిదే’’ అని ఎస్అండ్పీ గ్లోబల్ మొబిలిటీ వర్గాలు తెలిపాయి.30% వరకు..కంపెనీలు అధికారికంగా రేట్ల తగ్గింపు లేదా డిస్కౌంట్లపై ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ డిసెంబర్ 31 వరకు డీలర్ల దగ్గర చాలామటుకు మోడల్స్ ధరలపై (ఎక్స్‌షోరూమ్) 20–30 శాతం డిస్కౌంటును కొనుగోలుదార్లు ఆశించవచ్చని ఎఫ్ఏడీఏ వర్గాలు తెలిపాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి డిస్కౌంట్లు ఉంటాయని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. అంతగా అమ్ముడు కాని మోడల్స్ పేరుకుపోయినా, లేక అమ్ముడవుతున్న స్థాయికి మించి ఉత్పత్తి చేసినా.. ఆ నిల్వలను వదిలించుకోవడానికి భారీ డిస్కౌంట్లు ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. మరోవైపు, పెళ్ళిళ్ల సీజన్, ప్రమోషనల్ ఆఫర్లు మొదలైనవి ప్యాసింజర్ కార్ల అమ్మకాలు పెరగడానికి దోహదపడగలవని ఆశిస్తున్నట్లు ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు. గణనీయంగా నిల్వలు పేరుకుపోయి ఉన్నందున తయారీ కంపెనీలు సరఫరాలను క్రమబద్ధీకరించుకోవాలని కోరారు. ఆఫర్ల వెల్లువ.. → ఎరీనా షోరూమ్‌లలో మారుతీ సుజుకీ ఇండియా తమ ఆల్టో కే10, వ్యాగన్ఆర్, సెలీరియో, ఎస్ప్రెసో కార్లపై రూ. 20,000–35,000 వరకు రిబేట్ ఇస్తోంది. వేరియంట్లను బట్టి స్విఫ్ట్‌పై రూ. 25,000–50,000 వరకు, బ్రెజాపై రూ. 10,000–20,000 వరకు డిస్కౌంట్ ఉంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ. 15,000 ఎక్సే్చంజ్ బోనస్, మోడల్‌ను బట్టి రూ. 2,100–2,300 వరకు కార్పొరేట్ డిస్కౌంట్లకు ఇది అదనమని పేర్కొన్నాయి. → హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ గ్రాండ్ ఐ10 నియోస్‌పై రూ. 35,000–45,000 వరకు, ఆరాపై రూ. 20,000 వరకు, ఐ20పై 20,000–45,000 వరకు, ఎక్స్టర్పై (నిర్దిష్ట వేరియంట్స్‌పై) రూ. 20,000–30,000 వరకు, వెన్యూపై 45,000–50,000 వరకు (వేరియంట్‌ను బట్టి), వెర్నాపై రూ. 70,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఇక టక్సన్పై రూ. 50,000, అయానిక్ 5 ఈ–ఎస్‌యూవీపై రూ. 2 లక్షల మేర డిస్కౌంట్లు ఇస్తోంది. → టాటా మోటార్స్ కూడా అ్రల్టోజ్పై రూ. 25,000, పంచ్‌పై (ఐసీఈ వెర్షన్) రూ. 20,000 నగదు డిస్కౌంట్ ఇస్తోంది. అటు టియాగో హ్యాచ్‌బ్యాక్, టిగోర్ సెడాన్, నెక్సాన్ ఎస్‌యూవీల ధరలు (ఐసీఈ మోడల్స్) వరుసగా రూ. 4.99 లక్షలు, రూ. 5.99 లక్షలు, రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. → మహీంద్రా అండ్ మహీంద్రా కూడా కొన్ని మోడల్స్‌లో నిర్దిష్ట వేరియంట్లపై, లభ్యతను బట్టి, పరిమిత కాలంపాటు ఆఫర్లు అందిస్తోంది. బొలెరో నియోపై రూ. 70,000 వరకు, స్కారి్పయో ఎన్‌పై రూ. 50,000, థార్ 4 ్ఠ4పై రూ. 1.25 లక్షలు క్యాష్ డిస్కౌంటు ఇస్తోంది. ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్‌పై ఏకంగా రూ. 3 లక్షల నగదు డిస్కౌంట్ ఉంటోంది. → హోండా కార్స్ ఇండియా, జీప్ ఇండియా, స్కోడా ఆటో ఇండియా, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తదితర కార్ల కంపెనీలు కూడా ఏడాది ఆఖరు నాటికి నిల్వలను తగ్గించుకునేందుకు భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
భారత్‌లో 6 లక్షల మంది కొన్న కారు ఇదే..
అత్యంత ప్రజాదరణ పొందిన 'హ్యుందాయ్ వెన్యూ' కారును దేశీయ విఫణిలో ఆరు లక్షల మంది కొనుగోలు చేశారు. 2019లో ప్రారంభమైన ఈ ఎస్యూవీ ఐదున్నర సంవత్సరాల్లో ఈ మైలురాయిని చేరుకుంది. అత్యధికంగా 2024 ఆర్ధిక సంవత్సరంలో 1,28,897 యూనిట్లు అమ్ముడయ్యాయి.హ్యుందాయ్ వెన్యూ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత.. మొదటి ఆరు నెలల్లో 50,000 యూనిట్ల మైలురాయిని చేరుకుంది. ఆ తరువాత 15 నెలల్లో లక్ష యూనిట్లు, 25 నెలల్లో రెండు లక్షల యూనిట్లు, 36 నెలల్లో మూడు లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. 2023 నవంబర్ నాటికి వెన్యూ సేల్స్ ఐదు లక్షల యూనిట్లు కావడం గమనార్హం. ఆ తరువాత లక్ష యూనిట్లు అమ్ముడు కావడానికి 12 నెలల సమయం పట్టింది.ఇదీ చదవండి: పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఇవే!.. రేంజ్ కూడా ఎక్కువే..హ్యుందాయ్ వెన్యూ మొత్తం 26 వేరియంట్లు, 3 ఇంజన్లు, 3 గేర్‌బాక్స్ ఎంపికలలో లభిస్తుంది. దీని ధరలు రూ. 7.94 లక్షల నుంచి రూ. 13.44 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. కాగా కంపెనీ 2025 వెన్యూ కారును వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కారు పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. రాబోయే 2025 వెన్యూ మోడల్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది. -
రెండు లక్షల మంది కొన్న టయోటా కారు ఇదే..
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ అమ్మకాలు భారతదేశంలో లక్ష యూనిట్లు దాటేశాయి. సెప్టెంబర్ 2022లో మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి అక్టోబర్ చివరి నాటికి హైరైడర్ మొత్తం సేల్స్ 1,07,975 యూనిట్లుగా నమోదయ్యాయి.2023 ఆర్ధిక సంవత్సరంలో 22,839 యూనిట్లు, 2024 ఆర్ధిక సంవత్సరంలో 48,916 యూనిట్లు, 2025 ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 36,220 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసిన హైరైడర్.. టయోటా గ్లాంజా హ్యాచ్‌బ్యాక్, మారుతి బాలెనో నుంచి పుట్టిన రీబ్యాడ్జ్ మోడల్.ఇదీ చదవండి: ఖరీదైన కారులో సమస్య!.. కంపెనీ కీలక నిర్ణయంటయోటా కంపెనీ అక్టోబర్ చివరి నాటికి మొత్తం 1,91,029 యూనిట్ల హైరైడర్ కార్లను డీలర్‌షిప్‌లకు పంపించినట్లు సమాచారం. ఈ ఏడాది అక్టోబర్ వరకు హైరైడర్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. దీనికి పండుగ సీజన్ చాలా దోహదపడింది. టయోటా కంపెనీ మరింత మంది కస్టమర్లను చేరుకునే ఉద్దేశ్యంతో పండుగ సీజన్లో హైరైడర్ ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్‌ను కూడా లాంచ్ చేసింది. -
కాంపాక్ట్ ఎస్‌యూవీలు.. టాప్‌గేర్‌లో అమ్మకాలు..
ఒకపక్క కార్ల కంపెనీలు బంపీ రైడ్‌తో సతమతమవుతున్నప్పటికీ... స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీలు) తగ్గేదేలే అంటున్నాయి. భారతీయులకు తొలి చాయిస్‌గా మారుతున్నాయి. నిన్నమొన్నటిదాకా అమ్మకాల్లో పైచేయి సాధించిన హ్యాచ్బ్యాక్స్, సెడాన్స్ ఆధిపత్యానికి తెరపడింది. ఇప్పుడు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల విభాగంగా కాంప్టాక్ట్ ఎస్‌యూవీలు కేక పుట్టిస్తున్నాయి!! దేశంలో కారు ప్రియుల కొనుగోలు ట్రెండ్ శరవేగంగా మారిపోతోంది. 4 మీటర్ల లోపు పొడవైన హ్యాచ్బ్యాక్స్, సెడాన్ల (కాంపాక్ట్ ప్యాసింజర్ కార్లు) హవాకు బ్రేక్‌లు పడుతున్నాయి. ఎస్‌యూవీలు రాజ్యమేలుతున్న కాలంలో కూడా అమ్మకాల్లో టాప్‌లేపిన ఈ సెగ్మెంట్‌ను తొలిసారిగా కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఓవర్టేక్ చేశాయి. భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సొసైటీ (సియామ్) తాజా లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం (2024–25, ఏప్రిల్–సెప్టెంబర్)లో 4 మీటర్ల లోపు కాంపాక్ట్ ఎస్‌యూవీలు దుమ్మురేపాయి. ఈ సెగ్మెంట్లో 6,71,674 వాహనాలు అమ్ముడయ్యాయి. ఇదే తరుణంలో కాంపాక్ట్ ప్యాసింజర్ కార్ల సేల్స్ 5,58,173 యూనిట్లకు పరిమితమయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంతో పోలిస్తే ఈ రెండు విభాగాల అమ్మకాలు రివర్స్ కావడం విశేషం. రివర్స్ గేర్...గతేడాది వరకు దేశంలో కాంపాక్ట్ ప్యాసింజర్ కార్ల జోరుకు తిరుగేలేదు. అమ్మకాల్లో ఈ విభాగానికిదే టాప్ ర్యాంక్. నాలుగేళ్ల క్రితమైతే కాంపాక్ట్ ఎస్‌యూవీలతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో సేల్స్ నమోదయ్యాయి. ఐదేళ్లకు ముందు చూస్తే, కాంపాక్ట్ ఎస్యూవీ 1 అమ్ముడైతే కాంపాక్ట్ ప్యాసింజర్ కార్లు 3 హాట్ కేకుల్లా రోడ్డెక్కేవి. ఇదంతా గతం. దేశంలో నవతరం దూకుడు... ఆటోమొబైల్ రంగం ముఖచిత్రాన్ని మలుపుతిప్పుతోంది. మరోపక్క, ఎంట్రీ లెవెల్ మైక్రో ఎస్‌యూవీలు అందుబాటుల ధరల్లో లభిస్తుండటంతో గ్రామీణ కార్ లవర్స్ సైతం వీటికే సై అంటున్నారు. దీంతో చిన్న ఎస్‌యూవీలకు డిమాండ్ ఓ రేంజ్లో ఉంటోందనేది నిపుణుల మాట. టాటా పంచ్, నెక్సాన్, మారుతీ ఫ్రాంక్స్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, హ్యుందాయ్ వెన్యూ, ఎక్స్టర్, కియా సోనెట్, మారుతీ బ్రెజా, నిస్సాన్ మాగ్నైట్, రెనో కైగర్, సిట్రాన్ సీ3, ఎయిర్‌క్రాస్ వంటివి కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో బాగా అమ్ముడవుతున్న మోడల్స్. వీటిలో కొన్ని కార్లు నెలకు 10,000 అమ్మకాల మార్కును కూడా అధిగమిస్తుండటం విశేషం! ఇక కాంపాక్ట్ ప్యాసింజర్ కార్ల విషయానికొస్తే, మారుతీదే పూర్తి ఆధిపత్యం. స్విఫ్ట్, వ్యాగన్ ఆర్, బాలెనో, డిజైర్ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ఇతర కార్లలో టాటా టిగోర్, ఆ్రల్టోజ్, టియాగో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, ఐ20 వంటివి అంతంతమాత్రంగానే అమ్ముడవుతుండటం గమనార్హం. హ్యాచ్‌బ్యాక్, సెడాన్ మోడల్స్ డౌన్... కారణాలేవైనప్పటికీ గత కొంతకాలంగా కాంపాక్ట్ పాసింజర్ కారు మోడల్స్ కనుమరుగవుతున్నాయి. ఫోర్డ్ మోటార్స్ 2022లో ఇండియా నుండి దుకాణం సర్దేయడంతో ఫిగో, ఫిగో యాస్పైర్, ఫ్రీస్టయిల్, ఫియస్టా వంటి బాగా పాపులర్ మోడల్స్ అందుబాటులో లేకుండా పోయాయి. ఫోర్డ్ నిర్ణయంతో హాట్ ఫేవరెట్ ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్యూవీ సైతం మార్కెట్‌కు దూరం కావడం గమనార్హం. హోండా సైతం జాజ్, బ్రియో వంటి హ్యాచ్‌బ్యాక్‌ల అమ్మకాలను అపేసింది. హోండా సిటీ సేల్స్ కూడా నేలచూపులు చూస్తున్నాయి. మరోపక్క, డాట్సన్ కూడా 2022లో గుడ్‌బై చెప్పడంతో గో, రెడీగో వెళ్లిపోయాయి. టయోటా లివా, ఫోక్స్‌వ్యాగన్ అమియో, పోలో సైతం సెలవు తీసుకున్నాయి. ఐదేళ్ల క్రితం దాదాపు 30 వరకు ప్యాసింజర్ కారు మోడల్స్ కస్టమర్లకు విభిన్న ఆప్షన్లతో కనువిందు చేయగా.. ఇప్పుడీ సంఖ్య 15కు పడిపోవడం విశేషం. ఒకపక్క మోడల్స్ తగ్గిపోవడంతో పాటు కస్టమర్ల కొనుగోలు ధోరణి మారుతుండం కూడా కాంపాక్ట్ ప్యాసింజర్ కార్లకు గండికొడుతోంది!!ఆకట్టుకుంటున్న ఫీచర్లు... కాస్త ధరెక్కువున్నప్పటికీ, మరిన్ని ఫీచర్లు లభిస్తుండటంతో చాలా మంది కస్టమర్లు కాంపాక్ట్ ఎస్‌యూవీలకు అప్‌గ్రేడ్ అవుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. హ్యాచ్బ్యాక్స్, సెడాన్ కార్లతో పోలిస్తే విశాలమైన స్పేస్, బలిష్టమైన రూపంతో పాటు మెరుగైన డ్రైవింగ్ అనుభవం వల్ల కూడా కస్టమర్లు వీటికి జై కొడుతున్నారని మారుతీ మాజీ సేల్స్, మార్కెటింగ్ హెడ్ అభిప్రాయపడ్డారు. ‘ఎస్‌యూవీల సీటింగ్ పొజిషన్ ఎత్తు గా ఉండటం వల్ల కేబిన్ నుండి రోడ్డు వ్యూ బాగుంటుంది. అంతేకాకుండా, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల మన దగ్గరు న్న గతుకుల రోడ్లపై డ్రైవింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే వీటికి మంచి ఆదరణ లభిస్తోంది’ అని చెప్పారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఆఫర్లు పెట్టినా.. కార్ల అమ్మకాలు డౌన్!
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ ఈ ఏడాది ఆటోమొబైల్ రంగాన్ని కొంతమేర నిరాశకు గురిచేసింది. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ద్విచక్ర వాహన విక్రయాలు ఆశాజనకంగానే ఉన్నా కార్ల అమ్మకాలు తగ్గాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం అమ్మకాలు పెరగాల్సి ఉండగా, అందుకు భిన్నంగా ఉన్నట్లు రవాణాశాఖ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది పాటు అమ్మకాలు ఉన్నా, లేకున్నా అక్టోబర్‌పైనే ఆశలు పెంచుకొనే డీలర్లు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మార్కెట్ కార్యకపాలు నెమ్మదించడం, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోవడం వల్ల కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాల విక్రయాలు తగ్గినట్లు చెబుతున్నారు. గతేడాది కంటే ఈసారి 15 నుంచి 20 శాతం తగ్గుదల ఉన్నట్లు చెప్పారు. మరోవైపు ద్విచక్ర వాహనాల అమ్మకాలు బాగానే ఉన్నప్పటికీ గతేడాదితో పోలిస్తే పెద్దగా వ్యత్యాసం కనిపించడం లేదని పేర్కొంటున్నారు. ఆదాయంలో బైక్‌లపైనే ఎక్కువ.. మొత్తంగా వాహనాల అమ్మకాలు తగ్గుముఖం పట్టినప్పటికీ జీవితకాలపన్ను రూపంలో ఆర్టీఏకు వచ్చే ఆదాయంలో బైక్‌లపైనే ఎక్కువగా వచ్చింది. కార్లపై దాదాపు స్థిరంగానే ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతీయ రవాణా కార్యాలయాల పరిధిలో సుమారు 150 ఆటోమొబైల్ షోరూమ్‌లు ఉన్నాయి. వాటితో పాటు మరో 50కి పైగా అనుబంధ షోరూమ్‌లు ఉన్నాయి. సాధారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 10 ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ప్రతిరోజు 1500 నుంచి 2,000 వరకు కొత్త వాహనాలు నమోదవుతాయి. దసరా, దీపావళి వంటి పండుగ రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేయాలని భావించే ప్రతిఒక్కరూ దసరా రోజులను శుభప్రదంగా భావిస్తారు. మరోవైపు దసరా సందర్భంగా ప్రకటించే ఆఫర్లు కూడా వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటాయి. కానీ ఈసారి కార్లపైన గరిష్టంగా రూ.లక్ష వరకు తగ్గింపు ఇచ్చినా ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేవని పలువురు డీలర్లు అన్నారు.బైక్ ఓకే.. బైక్‌ల అమ్మకాలు మాత్రం గతేడాది కంటే పెరిగాయి. గత సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ నుంచి 24 వరకు 32,306 ద్విచక్ర వాహనాలను విక్రయించగా, ఈ అక్టోబర్ 3వ తేదీ నుంచి 13 వరకు 35,475 బైక్‌లు అమ్ముడయ్యాయి. సుమారు 3,169 ద్విచక్రవాహనాలను అదనంగా విక్రయించారు. ‘ఆటోమొబైల్ రంగానికి దసరా లైఫ్ వంటిది. అలాంటి దసరా ఈ సారి తీవ్రంగా నిరాశపర్చింద’ని తెలంగాణ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్కోటేశ్వర్రావు చెప్పారు.చదవండి: ఓలాపై ఫిర్యాదుల వెల్లువ.. తగ్గుతున్న ఈవీల విక్రయాలు..ఆటోమొబైల్‌పై ప్రభావం ఆటోమొబైల్‌పై కూడా ఈ ప్రభావం ఈసారి స్పష్టంగా ఉంది. గత సంవత్సరం దసరా సందర్భంగా 10 రోజుల్లో 10,878 కార్ల అమ్మకాలు జరిగాయి. ఈ సంవత్సరం అదే కాలానికి 10,139 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఏటేటా రెట్టింపు చొప్పున పెరగాల్సిన అమ్మకాలు ఈసారి తగ్గుముఖం పట్టాయి. పైగా ఒకేసారి స్టాక్ తెచ్చి పెట్టుకోవడం వల్ల నష్టంగానే భావిస్తున్నాం’ అని సికింద్రాబాద్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ షోరూమ్ డీలర్ ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ వాహనాల్లోనూ చాలా వరకు రూ.20 లక్షలలోపు వాహనాలే ఎక్కువ. హైఎండ్ కేటగిరికి చెందినవి తక్కువే. వివిధ రకాల బ్రాండ్లకు చెందిన కార్లపైన రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు ప్రోత్సాహకాలను ఇచ్చారు. గరిష్టంగా కొన్నింటిపైన రూ.లక్ష వరకు రాయితీ లభించింది. అలాగే రెండేళ్ల బీమా డబ్బులను కూడా డీలర్లే భరించారు. అయినప్పటికీ అమ్మకాలు పెరగలేదు. -
కార్ల విక్రయాలకు బ్రేకులు
ముంబై: దేశీయ కార్ల విక్రయాలు వరుసగా మూడో నెలా నెమ్మదించాయి. డిమాండ్ క్షీణతతో వాహన నిల్వలు పెరిగాయి. వీటిని తగ్గించుకునేందుకు వీలుగా ఆటో కంపెనీలు డీలర్లకు వాహన పంపిణీ (డిస్పాచ్) తగ్గించాయి. దీంతో ఈ సెప్టెంబర్‌లోనూ ఆటో అమ్మకాలు అంతంత మాత్రంగా జరిగాయి.కార్ల దిగ్గజ సంస్థలు మారుతీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, ఎంజీ మోటార్స్ విక్రయాలు తగ్గాయి. ఇక ద్విచక్ర వాహనాలకొస్తే... ఈ విభాగంలోని అగ్ర కంపెనీలైన టీవీఎస్ మోటోకార్ప్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్ విక్రయాల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. వాణిజ్య, ట్రాకర్ల అమ్మకాలూ పెరిగాయి. పండుగ సీజన్ ప్రారంభం కావడంతో వాహన విక్రయాలు అమ్మకాలు పుంజుకునే వీలుందని ఆటో తయారీ సంస్థలు ఆశాభావం వ్యక్తం చేశాయి. -
ఈ కార్లపై భారీ తగ్గింపులు: రూ. లక్ష నుంచి రూ.12 లక్షలు
పండుగ సీజన్ మొదలైపోయింది. కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. కంపెనీలు కూడా తమ వాహనాల సేల్స్ పెంచుకోవడానికి ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ వంటివి ప్రకటిస్తాయి. ఈ కథనంలో రూ. 1 లక్ష కంటే ఎక్కువ తగ్గింపు ధర వద్ద లభించే కార్లు ఏవో తెలుసుకుందాం.కార్లు, వాటిపై లభించే తగ్గింపులు ● హోండా సిటీ: రూ. 1.14 లక్షలు ● టాటా నెక్సాన్: రూ. 1.25 లక్షలు ● మారుతి గ్రాండ్ వితారా: రూ. 1.28 లక్షలు ● కియా సెల్టోస్: రూ. 1.30 లక్షలు ● సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్: రూ. 1.50 లక్షలు ● టాటా సఫారీ: రూ. 1.65 లక్షలు ● ఎంజీ హెక్టర్: రూ. 2.0 లక్షలు ● మారుతి జిమ్నీ: రూ. 2.50 లక్షలు ● మహీంద్రా ఎక్స్‌యూవీ400: రూ. 3 లక్షలు ● మెర్సిడెస్ ఏ-క్లాస్ లిమోసిన్: రూ. 3 లక్షలు ● మెర్సిడెస్ సీ-క్లాస్: రూ. 3 లక్షలు ● టయోటా క్యామ్రీ: రూ. 3 లక్షలు ● ఫోక్స్‌వ్యాగన్ టైగన్: రూ. 3.07 లక్షలు ● జీప్ కంపాస్: రూ. 3.15 లక్షలు ● ఎంజీ గ్లోస్టర్: రూ. 6 లక్షలు ● టయోటా హైలక్స్: రూ. 10 లక్షలు ● కియా ఈవీ6: రూ. 10 లక్షలు ● జీప్ గ్రాండ్ చెరోకీ: రూ. 12 లక్షలుఇదీ చదవండి: ఉద్యోగులను తొలగించేందుకు ట్రైనింగ్: టెక్ సీఈఓ పోస్ట్ వైరల్కార్లపైన కంపెనీలు ఇస్తున్న ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ తగ్గింపులు ఎంచుకునే మోడల్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్లను పొందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైన తగ్గింపులను గురించి తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
పేరుకుపోతున్న ప్యాసింజర్ కార్లు!
భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ప్యాసింజర్ కార్ల విక్రయాలు తగ్గుతున్నాయి. దాంతో రిటైల్ డీలర్ల వద్ద అధిక సంఖ్యలో వాహనాలు పేరుకుపోతున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశీయంగా డీలర్ల వద్ద పోగైన వాహనాలు ఏకంగా 7 లక్షల యూనిట్లు. వీటి విలువ సుమారు రూ.73,000 కోట్లు ఉంటుందని అంచనా. పండగల సీజన్ రాబోతుండడంతో వీటిలో కొంతమేర విక్రయాలు జరిగే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. అయినా క్షేత్రస్థాయిలో ఈ కార్లకు భారీగా డిమాండ్ తగ్గినట్లు పేర్కొంది.ఫాడా తెలిపిన వివరాల ప్రకారం.. రిటైల్ డీలర్ల వద్ద విక్రయానికి సిద్ధంగా ఉన్న(ఇన్వెంటరీ) ప్యాసింజర్ కార్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇన్వెంటరీను అమ్మే సమయం అధికమైంది. జులై 2024 ప్రారంభంలో 65-67 రోజులుగా ఉన్న ఇన్వెంటరీ క్లియరెన్స్ సమయం, ప్రస్తుతం 70-75 రోజులకు పెరిగింది. దాంతో అమ్ముడవని వాహనాల సంఖ్య అధికమవుతోంది. ఈ వ్యవహారం డీలర్లలో ఆందోళన కలిగిస్తోంది. ఇన్వెంటరీ నిర్వహణ భారంగా మారుతోంది. దాంతో కొన్ని కంపెనీలు వాటి ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికే దాదాపు రెండు నెలల విక్రయాలకు సమానమైన సుమారు 7 లక్షల యూనిట్ల వాహనాలు పోగయ్యాయి. ఇదిలాఉండగా, రానున్న పండగల సీజన్‌ల్లో విక్రయాలు పెరిగి కొంత ఊరట లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పెరుగుతున్న వాహనాల ఇన్వెంటరీ నేపథ్యంలో మారుతీసుజుకీ కంపెనీ ఇండియా లిమిటెడ్ ఇప్పటికే ఉత్పత్తిని తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి కంపెనీ అంచనాలకు తగిన అమ్మకాలు నమోదు కావడంలేదు. దాంతో ఇన్వెంటరీ నిర్వహణ భారమవుతుందని ఊహించి ఉత్పత్తిని తగ్గించింది. జులై 2024లో మారుతీ సుజుకీ విక్రయాల్లో ఏడాది ప్రాతిపదికన 9.65% క్షీణత నమోదైంది.రిటైల్ మార్కెట్లో కార్ల ధరలో రాయితీ ఇచ్చి ప్రముఖ కంపెనీలు వాటి ఇన్వెంటరీని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే మునుపెన్నడూ లేనంతగా కార్ల ధర తగ్గిస్తున్నాయి. 2023 ఆగస్ట్‌తో పోలిస్తే ఈ సారి డిస్కౌంట్లు రెండింతలు అయ్యాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ వరకు ఈ తగ్గింపులు కొనసాగే అవకాశం ఉందని అంటున్నాయి. మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ మొదలుకుని హ్యుందాయ్, టాటా మోటార్స్, స్కోడా, హోండా..వంటి ప్రముఖ కంపెనీలు డిస్కౌంట్లు ఇస్తున్నాయి.ఇదీ చదవండి: కొత్త పెన్షన్ విధానం.. కీలకాంశాలు..నగదు తగ్గింపు, ఎక్స్చేంజ్ బోనస్, అదనపు ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. పాపులర్ మోడళ్లకూ వీటిని వర్తింపజేస్తుండడం విశేషం. ఆఫర్స్, ప్రయోజనాలు మారుతీ సుజుకీ బ్రెజ్జా రూ.25,000, గ్రాండ్ విటారాపై రూ.1,28,000 వరకు అందిస్తోంది. హ్యుండై ఎక్స్టర్పై రూ.40,000, ఆల్కజార్‌పై రూ.90,000 వరకు, టాటా మోటార్స్ నెక్సన్ రూ.16,000–1,00,000, హ్యారియర్‌పై రూ.1,20,000 వరకు ఆఫర్ చేస్తున్నాయి. హోండా ఎలివేట్‌పై రూ.80,000 వరకు ఆఫర్స్, ప్రయోజనాలు ఉన్నాయి. -
కార్ల ధరపై భారీ డిస్కౌంట్లు
న్యూఢిల్లీ: కార్ల రిటైల్ మార్కెట్లో డిస్కౌంట్ల పండగ నడుస్తోంది. మునుపెన్నడూ లేనంతగా కార్లపై తగ్గింపు ఉండడం గమనార్హం. 2023 ఆగస్ట్‌తో పోలిస్తే డిస్కౌంట్లు రెండింతలు అయ్యాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ వరకు ఈ తగ్గింపులు కొనసాగే అవకాశం ఉందని అంటున్నాయి. విక్రయాలు మందగించడంతో కంపెనీలు, డీలర్షిప్ కేంద్రాల వద్ద నిల్వలు పేరుకుపోయాయి. వీటిని క్లియర్ చేసుకోవడంలో భాగంగా కంపెనీలు, డీలర్లు డిస్కౌంట్ల బాట పట్టారు. మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ మొదలుకుని హ్యుండై, టాటా మోటార్స్, స్కోడా, హోండా డిస్కౌంట్ల పోటీలో నిలిచాయి.నగదు తగ్గింపు, ఎక్స్చేంజ్ బోనస్, అదనపు ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. పాపులర్ మోడళ్లకూ వీటిని వర్తింపజేస్తుండడం విశేషం. ఆఫర్స్, ప్రయోజనాలు మారుతీ సుజుకీ బ్రెజ్జా రూ.25,000, గ్రాండ్ విటారాపై రూ.1,28,000 వరకు అందిస్తోంది. హ్యుండై ఎక్స్టర్పై రూ.40,000, ఆల్కజార్‌పై రూ.90,000 వరకు, టాటా మోటార్స్ నెక్సన్ రూ.16,000–1,00,000, హ్యారియర్‌పై రూ.1,20,000 వరకు ఆఫర్ చేస్తున్నాయి. హోండా ఎలివేట్‌పై రూ.80,000 వరకు ఆఫర్స్, ప్రయోజనాలు ఉన్నాయి.భారీగా కార్ల నిల్వలు..2019–20 తర్వాత అధిక డిస్కౌంట్లు ప్రస్తుతం ఉన్నాయని పరిశ్రమ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. భారత్ స్టేజ్–6 ఉద్గార ప్రమాణాలు 2020 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నిల్వలను క్లియర్ చేసుకోవడానికి 2019–20లో మార్కెట్లో డిస్కౌంట్ల జోరు కొనసాగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కార్ల నిల్వలు సుమారు 3,00,000 యూనిట్ల స్థాయిలో నమోదయ్యాయి. 30 రోజుల డిమాండ్‌కు ఇవి సరిపోతాయి. అయితే అమ్మకాలు మందగించడంతో కొద్దిరోజుల్లోనే నిల్వలకు మరో 1,00,000 యూనిట్లు తోడయ్యాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కార్ల తయారీ కంపెనీలు, డీలర్లు డిస్కౌంట్లకు తెరలేపారు. 2019–20 స్థాయిలో తగ్గింపులు ఉన్నాయని పరిశ్రమ చెబుతోంది. 2023–24లో దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు అత్యధిక స్థాయిలో 42.3 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. సెమికండక్టర్ల కొరత ప్రభావం తగ్గడం, డిమాండ్ కొనసాగడం ఈ జోరుకు కారణమైంది. మూడేళ్లు పరుగుపెట్టిన ప్యాసింజర్ వెహికిల్స్ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయాలు మందగించడం ప్రారంభమైంది. -
కొత్త కార్ల పండగ!
సార్వత్రిక ఎన్నికలు.. మండుటెండలు.. కుండపోత వర్షాలు.. కార్ల కంపెనీల అమ్మకాలను గత మూడు నాలుగు నెలలూ గట్టిగానే దెబ్బకొట్టాయి. గ్రామీణ డిమాండ్‌తో జూలైలో మాత్రం కాస్త పుంజుకుని ఊరటనిచ్చాయి. నిండు కుండలా కార్ల నిల్వలు పేరుకుపోవడంతో డీలర్లు పండగ సీజన్ కోసం అవురావురుమని ఎదురుచూస్తున్నారు. మరోపక్క, అమ్మకాలు మందగించడంతో.. కార్ల కంపెనీలు గేరు మారుస్తున్నాయి. కొంగొత్త వాహన మోడళ్లను కారు ప్రియుల కోసం రెడీ చేస్తున్నాయి. ఆటోమొబైల్ సంస్థలు సేల్స్ పెంపుతో పండుగ చేసుకోవాలని చూస్తుండగా.. కస్టమర్లకు కూడా కొత్త కార్ల జాతర కనువిందు చేయనుంది. రాబోయే పండుగ సీజన్ కోసం కార్ల కంపెనీలన్నీ ‘కొత్త’ వ్యూహంతో సిద్ధమవుతున్నాయి. దాదాపు 20 కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు అంచనా. ఇందులో 12 కార్లు పూర్తిగా కొత్తవి కావడం విశేషం. ప్రస్తుతం దేశంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్యూవీ)పైనే కంపెనీలన్నీ ఎక్కువగా గురి పెట్టాయి. కొత్తగా విడుదలయ్యే వాటిలో 13 ఎస్యూవీ మోడల్స్ ఉండటం దీనికి నిదర్శనం. టాటా మోటార్స్, నిస్సాన్, సిట్రాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎంజీ మోటార్స్, కియా, హ్యుందాయ్, ఫోక్స్వ్యాగన్తో పాటు లగ్జరీ కార్ దిగ్గజాలు మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ తదితర కంపెనీలు వచ్చే మూడు నెలల్లో కొత్త ఎస్‌యూవీలతో మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. ఇక మారుతీ సుజుకీ, మెర్సిడెస్ నయా సెడాన్లతో అలరించనుండగా.. కియా, ఎంజీ మల్టీ పర్పస్ వాహనాలను (ఎంపీవీ) రంగంలోకి దించుతున్నాయి. సేల్స్ తగ్గినా.. నిల్వల పెంపు.. ఈ ఆరి్థక సంవత్సరం మొదలు (ఏప్రిల్ నుంచి) వాహన అమ్మకాలు మందకొడిగానే సాగుతున్నాయి. ఎన్నికలతో పాటు మండుటెండలు కూడా వాహన విక్రయాలపై ప్రభావం చూపాయి. కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కుమ్మేయడం కంపెనీల ఆశలపై నీళ్లు చల్లింది. అయితే, గ్రా మీణ డిమాండ్ మళ్లీ పుంజుకోవడంతో జూలైలో ప్యాసింజర్ వాహన విక్రయాలు 10% పెరగ డం విశేషం. కస్టమర్లు కొనుగోళ్లను వాయిదా వేయడం.. పండుగల్లో భారీ డిమాండ్ ఆశలతో వాహన కంపెనీలు భారీగా నిల్వలు పెంచుకున్నాయి. డీలర్ల వద్ద సగటున 25–30 రోజుల నిల్వలు ఉంటాయని, ప్రస్తుతం 60–65 రోజుల నిల్వలు ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వీటి విలువ రూ.73,000 కోట్లుగా అంచనా. సెపె్టంబర్‌తో షురూ... దక్షిణాదిన కేరళ ‘ఓనమ్’ తో పండుగ సేల్స్ మొదలవుతాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరుపుకునే వినాయకచవితి, దుర్గాపూజ, దసరా, దీపావళి ఇలా వరుసగా అటు జనాలకు ఇటు కంపెనీలకూ పండుగే. మూడు నెలలుగా పేరుకున్న నిల్వలను పండుగల్లో విక్రయించడంతో పాటు కొత్త మోడళ్లతో కస్టమర్లను షోరూమ్‌లకు క్యూ కట్టించాలనేది వాహన సంస్థల వ్యూహం. మహీంద్రా సక్సెస్ఫుల్ ఎస్యూవీ ‘థార్’లో (ప్రస్తుతం మూడు డోర్ల మోడల్ ఉంది) కొత్తగా ఐదు డోర్ల థార్ ‘రాక్స్’ను తీసుకొస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున దీన్ని ఆవిష్కరించి.. పండుగ సీజన్లో మార్కెట్లోకి తీసుకొచ్చేలా కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ‘ఐదు డోర్ల థార్ కోసం మేము ముందుగా ప్లాన్ చేసిన ఉత్పత్తికి మరో 3,000–4,000 అదనంగా తయారీ సామర్థ్యాన్ని పెంచుతున్నాం’ అని ఎంఅండ్ఎం సీఈఓ (ఆటో, ట్రాక్టర్ల విభాగం) రాజేష్ జెజూరికర్ క్యూ1 ఆరి్థక ఫలితాల సందర్భంగా వెల్లడించారు.ఈవీలు, హైబ్రిడ్లు కూడా... కొత్తగా లైన్ కడుతున్న వాహన మోడల్స్ కస్టమర్ల ప్రాధాన్యతలకు అనుగుణంగా రకరకాల ఇంజిన్ ఆప్షన్లతో లభించనున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ (ఈవీ) హైబ్రిడ్ (సీఎన్జీ+పెట్రోల్ వంటివి) ఇంజిన్లు సైతం వీటిలో ఉన్నాయి. ఈవీ విభాగాన్ని శాసిస్తున్న టాటా మోటార్స్ సరికొత్త ఎస్యూవీ కూప్ ‘కర్వ్’తో పండగ చేసుకోవాలనుకుంటోంది. ఈ మోడల్లో పెట్రోల్, డీజిల్ వెర్షన్లతో పాటు ఈవీ వేరియంట్‌ను కూడా తీసుకొస్తోంది. ముందుగా ఈవీ ‘కర్వ్’ను ప్రవేశపెట్టడం విశేషం. గత నెలలో నిస్సాన్ ఆవిష్కరించిన ప్రీమియం ఎస్యూవీ ఎక్స్–ట్రెయిల్ కూడా పండుగల్లో రోడ్డెక్కనుంది.పండుగ రేసు గుర్రాలు (అంచనా ధర రూ.లలో).. → టాటా మోటార్స్–కర్వ్ ఈవీ (18–25 లక్షలు), → కర్వ్ (రూ.10.5–20 లక్షలు), → మారుతీ–స్విఫ్ట్ హైబ్రిడ్ (10 లక్షలు), డిజైర్–2024 (7–10 లక్షలు) → మహీంద్రా–థార్ రాక్స్ (13–23 లక్షలు) → నిస్సాన్ – ఎక్స్ట్రెయిల్ (49 లక్షల నుంచి)→ టయోటా బెల్టా – (9.5–12 లక్షలు) → మెర్సిడెజ్–బెంజ్ – ఈక్యూఎస్ ఎస్యూవీ (2 కోట్లు) → బీఎండబ్ల్యూ–ఎం3 (1.47 కోట్లు) → రెనో–కార్డియన్ (10–12 లక్షలు) → ఎంజీ–క్లౌడ్ ఈవీ (29–30 లక్షలు), → గ్లోస్టర్–2024 (40 లక్షలు) → స్కోడా–కొడియాక్–2024 (40–50 లక్షలు) → బీవైడీ–సీగల్ ఈవీ (10 లక్షలు) → కియా–ఈవీ9 (75–82 లక్షలు)→ ఆడి–క్యూ8 ఫేస్‌లిఫ్ట్ (రూ.1.17 కోట్లు) → సిట్రాన్ – సీ3ఎక్స్ (రూ.11.5 –15 లక్షలు), బసాల్ట్ (రూ.8 లక్షలు) – సాక్షి, బిజినెస్ డెస్క్ -
అమ్మకాల్లో దేశీయ దిగ్గజం అరుదైన రికార్డ్.. 20 లక్షల యూనిట్లు
భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్.. దేశంలో ఇప్పటికి 20 లక్షల ఎస్‌యూవీలను విక్రయించి అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇందులో అత్యధికంగా అమ్ముడైన ఎస్యూవీలుగా టాటా సఫారీ, హారియర్, నెక్సాన్, పంచ్ ఉన్నాయి. వీటితో పాటు పాత మోడల్ సియెర్రా, సఫారీ కూడా ఉన్నాయి.కంపెనీ సాధించిన ఈ విజయాన్ని సంస్థ 'కింగ్ ఆఫ్ ఎస్యూవీస్' పేరిట ఆఫర్స్ కూడా ప్రకటించింది. దీంతో హారియర్, సఫారీ, పంచ్ వంటి వాటిని కొంత తగ్గింపుతో కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో అడిషినల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. టాటా మోటార్స్ గత నెలలో (2024 జూన్) ఎక్కువ సంఖ్యలో విక్రయించిన ఎస్యూవీ పంచ్ కావడం గమనించదగ్గ విషయం. కాగా కంపెనీ ఇప్పుడు తన నెక్సాన్ కార్టూను CNG రూపంలో కూడా లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది త్వరలో మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుంది. -
కొత్త కార్ల పరుగు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2023లో ప్యాసింజర్ వాహన విక్రయాలు 41.08 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. 2022తో పోలిస్తే ఇది 8.3 శాతం అధికం. గతేడాది నమోదైన రికార్డుతో 2024లోనూ అదే ఊపును కొనసాగించాలని ప్యాసింజర్ వాహన తయారీ సంస్థలు ఉవి్వళ్లూరుతున్నాయి. ఈ ఏడాది 100కుపైగా కొత్త మోడళ్లు, వేరియంట్లు రోడ్డెక్కనున్నట్టు మార్కెట్ వర్గాల సమాచారం. వీటిలో అత్యధికంగా ఎస్‌యూవీలు ఉండనున్నాయి. దీనికి కారణం ఏమంటే 2023లో అమ్ముడైన మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో ఎస్‌యూవీల వాటా ఏకంగా 49 శాతం ఉండడమే. అంతకుముందు ఏడాది వీటి వాటా 42 శాతం నమోదు కావడం గమనార్హం. 2024 కోసం తయారీ కంపెనీలు పోటాపోటీగా కొత్త మోడళ్ల రూపకల్పనలో ఇప్పటికే నిమగ్నమయ్యాయి. మరోవైపు దేశీయ మార్కెట్లో విజయవంతం అయిన మోడళ్లకు మరిన్ని హంగులు జోడించి ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల విడుదలకు సన్నాహాలు చేస్తున్నాయి. మెర్సిడెస్‌తో బోణీ.. ఈ ఏడాది మెర్సిడెస్ బెంజ్ తొలుత బోణీ చేయబోతోంది. జనవరి 8న ఈ కంపెనీ జీఎల్ఎస్ లగ్జరీ ఎస్‌యూవీని ప్రవేశపెడుతోంది. కియా ఇండియా నుంచి నూతన సోనెట్ కాంపాక్ట్ ఎస్యూవీ జనవరి 15న రాబోతోంది. ఆధునీకరించిన క్రెటా వేరియంట్‌ను జనవరి 16న విడుదలకు హ్యుందాయ్ రెడీ అయింది. మారుతీ సుజుకీ నుంచి కొత్త తరం స్విఫ్ట్ ఫిబ్రవరిలో అడుగుపెడుతోంది. మార్చిలో స్విఫ్ట్ డిజైర్ రోడ్డెక్కనుంది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ కాంపాక్ట్ ఎస్యూవీ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఏడు సీట్ల ఎస్యూవీ టైసర్ మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు టయోటా కసరత్తు ప్రారంభించింది. కొత్త ఫార్చూనర్ సైతం దూసుకుపోనుంది. హ్యుందాయ్ నుంచి క్రెటా ఎన్ లైన్, ఫేస్‌లిఫ్ట్ టక్సన్, ఆల్కజార్ సైతం రానున్నాయి. కొత్తతరం అమేజ్ విడుదలకు హోండా కార్స్ సన్నద్ధం అయింది. ఫోక్స్‌వేగన్, స్కోడా, నిస్సాన్, రెనో, సిట్రోయెన్ ఫేస్‌లిఫ్ట్ మోడళ్లను తేనున్నాయి. ఈవీలు సైతం మార్కెట్లోకి.. ఎలక్ట్రిక్ కార్లకు క్రమంగా ఆదరణ పెరుగుతుండడంతో కొన్ని కంపెనీలు ఈ విభాగంలో నూతన మోడళ్లను తెచ్చే పనిలో ఉన్నాయి. హ్యారియర్ ఈవీని ఏప్రిల్‌లో తీసుకొచ్చేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక చేస్తోంది. 2024 చివరికల్లా టాటా కర్వ్ ఈవీ రానుంది. అలాగే టాటా పంచ్ ఈవీ సైతం పరుగుతీయనుంది. మారుతీ సుజుకీ నుంచి తొలి ఈవీ ఈ ఏడాది భారత రోడ్లపై అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతోంది. కియా ఈవీ9 పండుగల సీజన్లో రానుందని సమాచారం. -
2023లో భారీగా పెరిగిన కార్ సేల్స్ - ఆ కంపెనీ కార్లకే డిమాండ్!
భారతదేశంలో రోజు రోజుకి వాహన విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. 2022 కంటే కూడా 2023లో కార్ల అమ్మకాలు 8.3 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనల్లో వివరంగా తెలుసుకుందాం. 2023 లో చిన్న కార్ల అమ్మకాలతో పోలిస్తే ఎస్‌యూవీల అమ్మకాలు బాగా పెరిగాయి. మారుతి సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్ వంటి కంపెనీలు మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగాయి. 2022లో సగటున కారు ధర రూ.10.58 లక్షలు పలికితే 2023లో సరాసరి రూ.11.5 లక్షలకు పెరిగింది. మొత్తం అమ్మకాల్లో మారుతి సుజుకి హవా జోరుగా సాగింది. భారతీయ ప్యాసింజర్ వాహనాల పరిశ్రమ చరిత్రలో ఇదొక పెద్ద మైలురాయిగా భావిస్తున్నట్లు.. మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవస్తవ వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: ఈవీ రంగంలో అద్భుతం.. 1000 కిమీ రేంజ్ అందించే బ్యాటరీ కార్ల అమ్మకాల్లో ఎస్‌యూవీల సేల్స్ 26 శాతం వృద్ధి చెందినట్లు సమాచారం. మొత్తం కార్ల విక్రయాల్లో ఎస్‌యూవీల వాటా 2022లో 42 శాతం ఉంటే.. 2023లో ఈ సంఖ్య 48.7 శాతానికి పెరిగింది. హ్యాచ్‌బ్యాక్ మోడల్ కార్ల అమ్మకాలు 34.8 శాతం నుంచి 30 శాతానికి పెరిగింది. 2023లో సెడాన్స్ విక్రయాలు 11 శాతం నుంచి 9.4 శాతానికి పతనం కాగా, మల్టీ పర్పస్ యుటిలిటీ వెహికల్స్ విక్రయాలు యధాతథంగా 8.7 శాతం వద్ద కొనసాగాయి. దేశీయ విక్రయాలు మాత్రమే కాకుండా ఎగుమతుల సంఖ్య కూడా బాగా పెరిగింది. గత ఏడాది 2,69,046 యూనిట్లను ఎగుమతైనట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో 7.76 లక్షల కార్లు, ప్రీ-ఓన్డ్ కార్ల విక్రయాలు 4.68 లక్షల యూనిట్లుగా నిలిచాయి. -
భారత్ ఒక్కరోజు అమ్మకాలను చేరుకోలేకపోయిన పాకిస్తాన్ - కారణం ఇదే!
Pakistan Car Sales: భారతీయ మార్కెట్లో ప్రతి నెలా మంచి అమ్మకాలతో దూసుకెళ్లిన ఆటోమొబైల్ మార్కెట్.. పాకిస్తాన్లో బాగా క్షీణించి.. గత నెలలో కేవలం 4875 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయని పీఏఎమ్ఏ (PAMA) వెల్లడించింది. అక్కడ కార్ల అమ్మకాలు తగ్గడానికి కారణం ఏంటి? ఈ నెలలో అమ్మకాలు పెరిగే అవకాశం ఉందా.. లేదా? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. పాకిస్తాన్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (PAMA) ప్రకారం.. పాకిస్తాన్లో నవంబర్ 2023లో కేవలం 4875 కార్లు మాత్రమే అమ్ముడైనట్లు తెలుస్తోంది. గత ఏడాది ఇదే నెలలో అక్కడి అమ్మకాలు 15,432 కావడం గమనార్హం. పాకిస్తాన్లో కార్ల అమ్మకాలు భారీగా తగ్గడానికి కారణం 'పెరిగిన ఆర్థిక సంక్షోభం, తారా స్థాయికి చేరిన కార్ల ధరలు, సగటు వ్యక్తి సంపాదన క్షీణించడం' మాత్రమే కాకుండా పరిశ్రమ డిమాండ్ పడిపోవడం, కరెన్సీ తరుగుదల, అధిక పన్నులు, ఆటో ఫైనాన్సింగ్ వంటివి ఖరీదైనవి కావడం కూడా ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. నిత్యావసర వస్తువులే కొనలేని పరిస్థితిలో ఉన్న ఆ దేశ ప్రజలకు కార్ల కొనుగోలు అసాధ్యమైపోయింది. ఈ కారణంగానే పాకిస్తాన్లో ఆటోమొబైల్ మార్కెట్ బాగా క్షీణించింది. పాక్ సుజుకి, ఇండస్ మోటార్ కంపెనీ లిమిటెడ్, హోండా అట్లాస్ కార్ వంటి ప్రధాన వాహన తయారీదారుల అమ్మకాలు వరుసగా 72 శాతం, 71 శాతం, 49 శాతం క్షీణించాయి. మరి కొన్ని సంస్థలు పూర్తిగా ఉత్పత్తి నిలిపివేసి ప్లాంట్స్ కూడా మూసివేసాయి. 2023 జులై నుంచి అక్టోబర్ వరకు పాకిస్తాన్లో అమ్ముడైన మొత్తం కార్ల సంఖ్య 20,871. అంటే నాలుగు నెలల కాలంలో అమ్ముడైన వాహనాల సంఖ్య సగటున ఐదు వేలు మాత్రమే అని స్పష్టమవుతోంది. టూ వీలర్స్, త్రీ వీలర్స్ అమ్మకాలు కూడా బాగా తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నెలలో కూడా అమ్మకాలు ఇదేవిధంగా ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. ఇదీ చదవండి: బాలీవుడ్ రిచ్ మ్యాన్.. స్టార్ హీరోల కన్నా ఈయన సంపాదనే ఎక్కువ! భారతీయ మార్కెట్లో అమ్మకాలు పాకిస్తాన్లో కార్ల అమ్మకాలను పక్కన పెడితే.. భారతదేశంలో కార్ల విక్రయాలు గత నెలలో జోరుగా సాగాయి. నవంబర్ 2023లో మారుతి సుజుకి ఇండియా సేల్స్ 1,64,439 యూనిట్లు, టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు 17,818 యూనిట్లుగా నమోదయ్యాయి. గత నెలలో దేశంలో జరిగిన మొత్తం కార్ల అమ్మకాలు 3.60 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ. పాకిస్తాన్లో అమ్ముడైన కార్ల సంఖ్య.. భారతదేశంలో సగం రోజులో అమ్ముడైన కార్ల సంఖ్య కంటే తక్కువని తెలుస్తోంది. భారతదేశంలోని ద్విచక్ర వాహన తయారీదారులు నవంబర్‌లో తమ ఫోర్ వీలర్ కౌంటర్‌పార్ట్‌లను అధిగమించారు. 'ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్' (FADA) గణాంకాల ప్రకారం నవంబర్‌లో ద్విచక్ర వాహనాల మొత్తం అమ్మకాలు ఏకంగా 21 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. -
వాహనదారులకు మారుతి సుజుకీ ప్రత్యేక డిస్కౌంట్లు
ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ దసరా, దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అక్టోబర్ 31 వరకు కార్లపై డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఎస్యూవీ మోడల్ జిమ్నీపై రూ.లక్ష వరకు రాయితీని ఇస్తున్నట్టు ప్రకటించింది. జిమ్నీ ఎస్‌యూవీపై రూ.50 వేల వరకు రాయితీ ఇస్తున్న సంస్థ..ఎక్సేంజ్ లేదా లాయల్టీ బోనస్ కింద రూ.50 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నది. ఈ ఆఫర్ మాన్యువల్, పెట్రోల్ రకం మాడళ్లకు వర్తించనున్నది. ప్రస్తుతం జెటా రకం రూ.12.74 లక్షల ప్రారంభ ధరతో లభించనున్నది. -
దుమ్మురేపుతున్న ఎలక్ట్రిక్ వాహనాలు.. తయారీలో సరికొత్త రికార్డ్‌లు
జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు దుమ్మురేపుతున్నాయి. రోజుకీ రోజుకీ ఇందన ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రపంచ దేశాలకు చెందిన ఆటోమొబైల్ కంపెనీలు పోటీ పడి మరీ కొత్త కొత్త ఫీచర్లు, సరికొత్త డిజైన్లతో కార్లను తయారు చేస్తున్నాయి. వాటిని మార్కెట్‌కి పరిచయం చేస్తున్నాయి. కస్టమర్ల డిమాండ్‌కు అనుగుణంగా కార్ల తయారీ సంస్థలు ఈవీ కార్ల తయారీ సంఖ్యను ఏయేటికాయేడు పెంచుకుంటూ పోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈవీ వ్యాల్యూమ్ నివేదిక ప్రకారం.. 2021లో ఈవీ కార్ల విభాగంలో తొలి 15 స్థానాల్లో ఉన్న ఆయా కంపెనీల వృద్దిరేట్లు గణనీయంగా పెరిగింది. 2021లో పైన పేర్కొన్నట్లు 15 కంపెనీలు మొత్తం ఏడాది కాలంలో 6.7 మిలియన్ల కార్లను తయారు చేయగా.. వాటి సంఖ్య 2022 తొలిసారి 10 మిలియన్లకు చేరింది. ఇక కార్ల తయారీ, వృద్దిలో చైనాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ బీవైడీ తొలిస్థానంలో ఉంది. టెస్లా రెండో స్థానంలో కొనసాగుతుండగా.. తొలి 15 సంస్థలు తయారు చేసిన కార్ల వివరాలు ఇలా ఉన్నాయి. వాటిల్లో బీవైడీ 2021లో 598,019 కార్లను తయారు చేయగా.. ఆ సంఖ్య 1,858,364 చేరింది. వృద్ది రేటు 211శాతంగా ఉంది. -
జోరందుకున్న సీఎన్జీ వాహనాల అమ్మకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఆటోమొబైల్ రంగంలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ఆధారిత వాహనాలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. 2023 జనవరి–సెప్టెంబర్ మధ్య 6,66,384 యూనిట్ల సీఎన్జీ వాహనాలు రోడ్డెక్కాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది ఏకంగా 32 శాతం పెరుగుదల. 2022 జనవరి–సెప్టెంబర్ కాలంలో దేశవ్యాప్తంగా 5,04,003 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల్లో సీఎన్జీతో నడిచే త్రిచక్ర వాహనాల విక్రయాలు 81 శాతం అధికమై 2,48,541 యూనిట్లు నమోదయ్యాయి. ప్యాసింజర్ వాహనాలు 9 శాతం పెరిగి 2,65,815 యూనిట్లకు చేరుకున్నాయి. సరుకు రవాణా వాహనాలు 26 శాతం క్షీణించి 60,531 యూనిట్లకు వచ్చి చేరాయి. బస్‌లు, వ్యాన్స్ 125 శాతం ఎగసి 91,497 యూనిట్లను తాకాయి. తక్కువ వ్యయం కాబట్టే.. సీఎన్జీ కేజీ ధర ప్రస్తుతం రూ.76 పలుకుతోంది. హైదరాబాద్ మార్కెట్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.109.66, డీజిల్ రూ.97.82 ఉంది. డీజిల్, పెట్రోల్‌తో పోలిస్తే సీఎన్జీ చవకగా దొరుకుతుంది కాబట్టే కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. సీఎన్జీ ఆధారిత త్రీవీలర్లు, ప్యాసింజర్ వెహికిల్స్, సరుకు రవాణా వాహనాలతోపాటు బస్‌లు, వ్యాన్స్ అన్నీ కలిపి 2022–23లో తొలిసారిగా పరిశ్రమలో 6,50,000 యూనిట్ల అమ్మకాలను దాటాయి. 2021–22తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో సీఎన్జీ వెహికిల్స్ విక్రయాల్లో 46 శాతం వృద్ధి నమోదైంది. 2023 జనవరి–సెప్టెంబర్‌లో దేశీయ ప్యాసింజర్ వెహికిల్స్ పరిశ్రమలో సీఎన్జీ ఆధారిత వాహనాల వాటా 8.8 శాతం ఉంది. ఇక సీఎన్జీ విభాగంలో ప్యాసింజర్ వెహికిల్స్ వాటా 40 శాతం, త్రిచక్ర వాహనాలు 37 శాతం కైవసం చేసుకున్నాయి. తొలి స్థానంలో మారుతీ.. సీఎన్జీ ప్యాసింజర్ వెహికిల్స్ పరిశ్రమలో 72 శాతం వాటాతో మారుతీ సుజుకీ ఇండియా హవా కొనసాగుతోంది. 15 మోడళ్లలో ఈ కంపెనీ సీఎన్జీ వేరియంట్లను ప్రవేశపెట్టింది. భారత్‌లో ఈ స్థాయిలో సీఎన్జీ వేరియంట్లు కలిగిన కంపెనీ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. మారుతీ సుజుకీ 2023 జనవరి–సెప్టెంబర్‌లో 10.85 శాతం వృద్ధితో 1,91,013 యూనిట్ల అమ్మకాలతో దూసుకుపోతోంది. 2020 ఏప్రిల్‌లో డీజిల్ నుంచి నిష్క్రమించిన తర్వాత ఈ సంస్థ సీఎన్జీని ప్రధాన్యతగా తీసుకుంది. సెప్టెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల్లో హుందాయ్ మోటార్ సీఎన్జీ విక్రయాలు 10.67 శాతం క్షీణించి 35,513 యూనిట్లకు పరిమితమైంది. టాటా మోటార్స్ 13.77 శాతం ఎగసి 34,224 యూనిట్లను సాధించింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ 52 యూనిట్ల నుంచి ఏకంగా 4,679 యూనిట్ల అమ్మకాలను అందుకుంది. సీఎన్జీ త్రిచక్ర వాహనాల్లో బజాజ్ ఆటో 87 శాతం వాటాతో అగ్ర స్థానంలో ఉంది. పియాజియో, టీవీఎస్ మోటార్ కో, అతుల్ ఆటో, మహీంద్రా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సీఎన్జీ గూడ్స్ క్యారియర్స్ విభాగంలో టాటా మోటార్స్, మారుతీ సుజుకీ ఇండియా, మహీంద్రా, వీఈ కమర్షియల్ వెహికిల్స్, అశోక్ లేలాండ్, ఎస్ఎంఎల్ సుజుకీ వరుసగా పోటీపడుతున్నాయి. -
హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మారుతీ గ్రాండ్ విటారా కార్లు!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజికి విడుదల చేసిన కార్లు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఆ సంస్థ మార్కెట్‌కి పరిచయం చేసిన మారుతీ గ్రాండ్ విటారా ఏడాదిలోనే లక్ష కార్లు అమ్ముడు పోయాయి. అంచనా ప్రకారం.. నెలకు సుమారు 8,333 కార్లను విక్రయాలు జరిగాయి. తద్వారా దేశీయంగా మిడ్ సైజ్ ఎస్యూవీ విభాగంలో వేగంగా వేగంగా సేల్స్ జరిగిన కార్ల జాబితాలో గ్రాండ్ విటారా చోటు దక్కించుకోవడం గమనార్హం. ప్రత్యర్ధులకు పోటీగా ఇతర ఆటోమొబైల్ సంస్థలకు పోటీగా మారుతి మిడ్ సైజ్ ఎస్యూవీ కార్లను డిజైన్ చేసింది. ఈ వేరియంట్లో టయోటా అర్బన్ క్రూయిజర్ హైరిడర్, హోందయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, వోక్స్‌వేగన్ టైగన్, సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్, ఎంజీ ఆస్టర్లు ఉన్నాయి. అయితే, బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను అందించిన ఎస్‌యూవీలలో హైరైడర్, గ్రాండ్ విటారాలు మాత్రమే ఉన్నాయి. ఇ-సీవీటీ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన గ్రాండ్ విటారా ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రీడ్ వేరియంట్ లీటరుకు 27.97 కి.మీల మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ సందర్భంగా, మారుతీ సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ,‘గత ఏడాది విడుదలైన గ్రాండ్ విటారా ఎస్యూవీ ఔత్సాహికులకు కొత్త డ్రైవింగ్ అనుభూతిని అందిస్తూ కొత్త శకానికి నాంది పలికింది. ఎస్యూవీ వేరియంట్లో 22 శాతం వాటాతో మారుతి సుజికి వేగంగా వృద్ది సాధించిందని అన్నారు. గ్రాండ్ విటారా ధర గ్రాండ్ విటారా ధర ప్రస్తుతం రూ. 10.70 లక్షల నుండి రూ. 19.99 లక్షల వరకు ఉంది (రెండు ధరలు, ఎక్స్-షోరూమ్). -
పండుగల సీజన్లో కార్ల జోరు
న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగల సీజన్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు ఉంటాయని మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా అంచనా వేస్తున్నాయి. పరిశ్రమ వార్షిక అమ్మకాల్లో పండుగల సీజన్ వాటా సగటున 23–26 శాతంగా ఉందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ మంగళవారం జరిగిన సియామ్ సదస్సులో తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా అన్ని కంపెనీలవి కలిపి 40.5–41 లక్షల యూనిట్లు అమ్ముడవుతాయని చెప్పారు. ఇందులో పండుగల సీజన్ వాటా 10 లక్షల యూనిట్లు ఉంటుందన్నారు. ప్యాసింజర్ వెహికిల్స్ పరిశ్రమ తొలిసారిగా 10 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంటుందని వెల్లడించారు. ఇప్పటి వరకు దేశంలో 2021లో అత్యధికంగా పండుగల సీజన్లో 9.34 లక్షల యూనిట్లు నమోదయ్యాయని వివరించారు. ఆ రెండూ జరగకపోతేనే.. ఓనమ్ విక్రయాల్లో 24 శాతం వృద్ధి సాధించామని శ్రీవాస్తవ పేర్కొన్నారు. గతేడాది 3.55 లక్షల యూనిట్లతో పోలిస్తే 2023 సెపె్టంబరులో 3.61 లక్షల యూనిట్ల హోల్‌సేల్ అమ్మకాలు ఆశిస్తున్నట్టు చెప్పారు. గ్రామీణ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే అధిక వడ్డీ రేట్లు, రుతుపవనాల లోటు వృద్ధికి అడ్డుకట్ట అని తెలిపారు. ఇవి రెండూ జరగకపోతే ఉపశమనం లభిస్తుందని అన్నారు. ‘వడ్డీ రేట్లు పెరగకూడదు. ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే అవి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మైనస్ 8 శాతంగా నమోదవుతున్న వర్షపాతం కారణంగా గ్రామీణుల మనోభావాలు దెబ్బతినకూడదు’ అని ఆయన పేర్కొన్నారు. హుందాయ్ వృద్ధి 9 శాతం.. గతేడాదితో పోలిస్తే పండుగల సీజన్లో 9 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు హుందాయ్ మోటార్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ తెలిపారు. ఈ ఏడాది అర్ధ భాగం విక్రయాల్లో ఎస్‌యూవీల వాటా 54 శాతం నమోదైందన్నారు. ఎక్స్టర్ రాకతో జూలై, ఆగస్ట్‌లో ఇది 64 శాతానికి ఎగసిందని చెప్పారు. వెయిటింగ్ పీరియడ్ తగ్గిందని, తద్వారా సమయానికి డెలివరీలు అందించేందుకు వీలవుతోందని చెప్పారు. బలమైన తాజా డిమాండ్ రాబోయే కాలానికి మంచి సూచిక అన్నారు. పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని వివరించారు. -
మార్కెట్లో పెరిగిన ప్యాసింజర్ వెహికల్ సేల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు ఆగస్ట్‌లో 3,59,228 యూనిట్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 9% వృద్ధి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రకారం.. తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన త్రిచక్ర వాహనాల సంఖ్య 2022 ఆగస్ట్‌తో పోలిస్తే గత నెలలో 38,369 నుంచి 64,763 యూనిట్లకు ఎగశాయి. టూ–వీలర్లు 15,57,429 నుంచి 15,66,594 యూనిట్లను తాకాయి. ప్యాసింజర్ వాహన విభాగంలో 16% వృద్ధితో మారుతీ సుజుకీ 1,56,114 యూనిట్ల విక్రయాలను సాధించింది. హుందాయ్ అమ్మకాలు 49,510 నుంచి 53,830 యూనిట్లకు చేరాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఏడీఏ) ప్రకారం గత నెల రిటైల్‌లో ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయాలు 7 శాతం దూసుకెళ్లి 3,15,153 యూనిట్లు నమోదయ్యాయి. ద్విచక్ర వాహనాల సేల్స్ 11,80,230 నుంచి 12,54,444 యూనిట్లకు, త్రిచక్ర వాహనాలు 66% ఎగసి 99,907 యూనిట్లుగా ఉన్నాయి. -
అమ్మకాల్లో పెరిగిన మారుతి జోరు.. తగ్గిన టాటా మోటార్స్ సేల్స్
Car Sales 2023 August: 2023 ఆగష్టు నెల ముగియగానే దాదాపు అన్ని వాహన తయారీ సంస్థలు తమ అమ్మకాల నివేదికలను విడుదల చేశాయి. ఈ డేటా ప్రకారం దాదాపు మిశ్రమ ఫలితాలు వచ్చినట్లు తెలుస్తున్నాయి. గత నెలలో ఎక్కువ కార్లు విక్రయించిన సంస్థ ఏది? ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కార్ల అమ్మకాలలో 2022 ఆగష్టు నెల కంటే 2023 ఆగష్టు నెలలో మారుతి సుజుకి 16.4 శాతం (165402 యూనిట్లు), మహీంద్రా అండ్ మహీంద్రా 19 శాతం వృద్ధి పొందినట్లు తెలుస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా గత నెలలో మొత్తం 70350 యూనిట్లను విక్రయించింది. ఇందులో 37270 యూనిట్లు దేశీయ విక్రయాలు కాగా.. మిగిలినవి విదేశీ ఎగుమతులు. మొత్తం మీద మహీంద్రా 26 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ గత ఏడాది కంటే ఈ సంవత్సరం 3.5 శాతం తగ్గుదలను నమోదు చేసింది. కంపెనీ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో 78,010 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఆగష్టు నెలలో 78,843 యూనిట్లను విక్రయించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఒక్క రూపాయి అక్కడ వందలతో సమానం.. చీపెస్ట్ కరెన్సీ కలిగిన దేశాలు! ఇక టూ వీలర్ విభాగంలో టీవీఎస్ మోటార్స్ 5 శాతం వృద్ధిని నమోదు చేసి అగ్ర స్థానంలో నిలిచింది. కాగా బజాజ్ ఆటో 31 శాతం తగ్గుదలను నమోదు చేసింది. మొత్తం మీద అమ్మకాల పరంగా మిశ్రమ ఫలితాలు వచ్చినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. -
కార్ల అమ్మకాలు రయ్ రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, ఆటోల విక్రయాల్లోనూ వృద్ధి నెలకొంది. తద్వారా గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు పోల్చి చూస్తే.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో రవాణా రంగం ద్వారా వచ్చే ఆదాయంలో 8.40 శాతం వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా తగ్గగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు చూస్తే జాతీయ సగటును మించి రాష్ట్రంలో వృద్ధి చోటు చేసుకుంది. అలాగే ఇదే కాలానికి జాతీయ సగటును మించి రాష్ట్రంలో కార్ల విక్రయాల్లో వృద్ధి నమోదైంది. ఇక ఆటోల అమ్మకాల్లో ఏకంగా 795.28 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు రవాణా ఆదాయం రూ.1,448.35 కోట్లు రాగా ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.1,570.07 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక దేశవ్యాప్తంగా గూడ్స్ వాహనాల అమ్మకాలు పడిపోగా రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇతర రాష్ట్రాల్లో విధానాలపై అధ్యయనం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రవాణా రంగం ద్వారా ఆదాయం పెంచుకోవడానికి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో బాగుంటే వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. వాహనాల పన్నుల విషయంలో కొత్త విధానాలను అన్వేíÙస్తున్నాం. కొనుగోలుదారులను ప్రోత్సహించేలా సంస్కరణలపై దృష్టి సారించాం. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల కొనుగోళ్లు పెరిగాయి. రవాణా ఆదాయంలోనూ వృద్ధి నమోదవుతోంది. – ప్రసాదరావు, అదనపు కమిషనర్, రవాణా శాఖ -
పండుగ సీజన్లో 10 లక్షల కార్లు కొంటారు! పరిశ్రమ అంచనా
న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగ సీజన్లో దేశీయంగా ప్యాసింజర్ వాహనాల (కార్లు మొదలైనవి) అమ్మకాలు 10 లక్షల మార్కును దాటేయవచ్చని ఆటోమొబైల్ పరిశ్రమ అంచనా వేస్తోంది. వీటిలో యుటిలిటీ వాహనాల విక్రయాలు అత్యధికంగా ఉండొచ్చని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఈసారి ఆగస్టు 17న మొద లయ్యే పండుగల సీజన్ నవంబర్ 14 వరకు 68 రోజుల పాటు కొనసాగనుంది. సాధారణంగా వాహన విక్రయాల్లో దాదాపు 22–26 శాతం వాటా పండుగ సీజన్‌దే ఉంటుందని శ్రీవాస్తవ చెప్పారు. ఈ ఏడాది ప్యాసింజర్ వాహన విక్రయాలు 40 లక్షల స్థాయిలో ఉండొచ్చని, అందులో 10 లక్షల యూనిట్లు పండుగ సీజన్వి ఉండగలవని ఆయన పేర్కొన్నారు. -
లగ్జరీ కార్ల సేల్స్ బీభత్సం.. ఏ వెహికల్‌ను ఎక్కువగా కొన్నారంటే
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల పరిశ్రమ భారత్‌లో కొత్త పుంతలు తొక్కుతోంది. అమ్మకాల పరంగా ఈ ఏడాది ఆల్ టైమ్ హై దిశగా పరిశ్రమ దూసుకెళుతోంది. లగ్జరీ కార్ల విక్రయాల్లో దేశంలో తొలి మూడు స్థానాల్లో ఉన్న జర్మనీ సంస్థలు మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ , ఆడి 2023 జనవరి–జూన్ కాలంలో రికార్డు స్థాయిలో వ్యాపారం చేశాయి. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో మెర్సిడెస్ బెంజ్ దేశవ్యాప్తంగా అత్యధికంగా 8,528 యూనిట్లు విక్రయించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 13 శాతం అధికం. బీఎండబ్ల్యూ గ్రూప్ అత్యధికంగా 5,867 యూ నిట్ల అమ్మకాలను సాధించింది. ఇందులో 391 మి నీ బ్రాండ్ కార్లున్నాయి. గతేడాదితో పోలిస్తే బీఎండబ్లు్య గ్రూప్ 5 శాతం వృద్ధి సాధించింది. ఆడి నుంచి 3,474 యూనిట్ల కార్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లా యి. 2022 జనవరి–జూన్‌తో పోలిస్తే 97% ఎక్కువ. సుమారు 47,000 యూనిట్లు.. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి–జూన్‌లో సుమారు 21,000 యూనిట్ల లగ్జరీ కార్లు రోడ్డెక్కాయి. తొలి అర్ధ భాగంతో పోలిస్తే జూలై–డిసెంబర్ పీరియడ్ మెరుగ్గా ఉంటుందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్ తెలిపారు. 2023లో భారత్‌లో సుమారు 46,000–47,000 యూనిట్ల లగ్జరీ కార్లు అమ్ముడవుతాయన్న అంచనాలు ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకు భారత్‌లో అత్యధికంగా 2018లో సుమారు 40,000 యూనిట్ల లగ్జరీ కార్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయని చెప్పారు. ‘లగ్జరీ విభాగం 2019లో అప్పటి ఆర్థిక పరిస్థితుల కారణంగా నష్టపోయింది. మహమ్మారి రాకతో 2020 నుంచి వృద్ధికి ఆటంకం కలిగింది. 2023 పునరుజ్జీవన సంవత్సరం. ప్రతి కంపెనీ వృద్ధి సాధిస్తోంది. ఏదో ఒక కంపెనీ మరో సంస్థ కంటే బలంగా ఎదుగుతోంది. ఇదే వాస్తవికత. ఇది కొనసాగుతూ ఉంటుంది’ అని తెలిపారు. రికార్డులు బ్రేక్ అవుతాయి.. ఈ ఏడాది రెండవ అర్ధ భాగంలో రికార్డులు బద్దలు అవుతాయని బీఎండబ్లు్య గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా తెలిపారు. ‘2023 జనవరి–జూన్ కంటే జూలై–డిసెంబర్ మెరుగ్గా ఉంటుంది. సరఫరా సాధారణ స్థితికి వస్తుంది. ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంటే బీఎండబ్లు్యకు 2023 రికార్డు సంవత్సరం అవుతుంది. డిమాండ్, ఉత్పత్తులు బలంగా ఉన్నాయి. ఎక్స్5 రాక కలిసి వస్తోంది. కస్టమర్ల నుంచి స్పందన బాగుంది. కొత్త మోడళ్ల రాక, ఇప్పటికే ఉన్న కార్లతోపాటు బలమైన భారత ఆర్థిక వ్యవస్థ పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తోంది. సెంటిమెంట్ సానుకూలంగా ఉంది. ప్రజల ఆర్జన పెరుగుతోంది. ప్రస్తుతం కొన్ని పాశ్చాత్య దేశాల మాదిరిగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను మనం ఎదుర్కోవడం లేదు. మాకు ఇక్కడ ఇది ఇప్పటికీ సహేతుక స్థాయి. భారత ఆర్థిక వ్యవస్థలో బలమైన పునాది ఉంది. ఇది వృద్ధికి అవకాశం ఇస్తుంది’ అని వివరించారు. 2030 నాటికి రెండింతలు.. స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. కార్పొరేట్ ఇండియా ఆదాయాలు కూడా బలమైన వృద్ధిని నమోదు చేయడం వంటి ఇతర అంశాలు, మెరుగైన బోనస్‌లు, చెల్లింపులు ఉన్నాయి. చాలా కంపెనీలు కూడా కార్లను కొనుగోలు చేస్తున్నాయి అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. ‘ప్రస్తుతం పరిశ్రమ బలంగా ఊపందుకుంటోంది. వినియోగదార్లు లగ్జరీ కార్ల వైపు చాలా స్పృహతో మళ్లుతున్నారు. కాబట్టి డిమాండ్ కొనసాగుతోంది’ అని సంతోష్ చెప్పారు. మొత్తం కార్ల విభాగం మాత్రమే కాకుండా లగ్జరీ సెగ్మెంట్ కూడా వృద్ధి చెందుతుందని నమ్ముతున్నామని బల్బీర్ సింగ్ థిల్లాన్ తెలిపారు. ‘మధ్య, దీర్ఘకాలిక వృద్ధి కథనం చెక్కుచెదరకుండా ఉంది. మొత్తం కార్ల విభాగంలో ప్రస్తుతం లగ్జరీ విభాగం వాటా కేవలం 1 శాతం మాత్రమే. 2030 నాటికి ఇది 2 శాతానికి చేరుతుంది. పరిశ్రమ సరైన దిశలో పయనిస్తోంది’ అని తెలిపారు. -
అమ్మకాల్లో అదరగొట్టిన ఎంజీ మోటార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా 2023 జనవరి–జూన్‌లో దేశవ్యాప్తంగా 29,000 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 21 శాతం వృద్ధి సాధించినట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో రంగ ప్రవేశం చేసిన హెక్టర్ తదుపరి తరం వేరియంట్‌తోపాటు జడ్ఎస్ ఈవీకి భారీ డిమాండ్ ఈ వృద్ధికి దోహదం చేసిందని వెల్లడించింది. కంపెనీ నుంచి అత్యధికంగా 2023 మార్చిలో 6,051 యూనిట్లు రోడ్డెక్కాయి. ఎంజీ మోటార్ ఇండియా భారత్‌లో మరో ప్లాంటును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 1.8 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. గుజరాత్‌లోని హలోల్ వద్ద 1.2 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యంతో కంపెనీకి ఇప్పటికే ప్లాంటు ఉంది. జనరల్ మోటార్స్ నుంచి ఈ కేంద్రాన్ని కొనుగోలు చేసింది. హలోల్ ప్లాంటు వార్షిక సామర్థ్యాన్ని ఈ ఏడాది 1.5 లక్షల యూనిట్లను చేర్చనుంది. ఈ ప్లాంటు విస్తరణకు రూ.820 కోట్లు వెచ్చిస్తోంది. భారత్‌లో అయిదేళ్ల వ్యాపార ప్రణాళికలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ 4–5 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని సంస్థ నిర్ణయించింది. 2028 నాటికి దేశంలో కార్యకలాపాల విస్తరణకు రూ.5,000 కోట్లు ఖర్చు చేస్తోంది. -
ఎలక్ట్రిక్ వాహనాల హవా.. అమ్మకాల్లో టాటా టాప్ & మెర్సిడెస్ బెంజ్ లాస్ట్!
2023 ఏప్రిల్ నెల ఎలక్ట్రిక్ అమ్మకాల్లో 'టాటా మోటార్స్' అగ్రస్థానంలో నిలిచింది. టాప్ 10 కంపెనీల జాబితాలో జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' చివరి స్థానంలో నిలిచింది. గత నెలలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఏప్రిల్ 2023లో టాటా మోటార్ మొత్తం 4,392 యూనిట్ల కార్లను విక్రయించి టాప్ 10లో మొదటి స్థానంలో నిలిచింది. ఇదే నెల గత ఏడాది కంపెనీ అమ్మకాలు 1,817 కావడం గమనార్హం. 2022 కంటే 2023లో ఈ అమ్మకాలు ఏకంగా 141.72 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. మహీంద్రా కంపెనీ గత నెలలో 505 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించి జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. ఈ అమ్మకాలు 2022 ఏప్రిల్ కంటే 3784.62 శాతం ఎక్కువ. అంటే 2022 ఏప్రిల్ నెలలో కంపెనీ మార్కెట్లో కేవలం 13 యూనిట్లను మాత్రమే విక్రయించింది. సౌత్ కొరియా బ్రాండ్ అయిన ఎంజి మోటార్ విషయానికి వస్తే, ఇది 2023 ఏప్రిల్ నెలలో 335 యూనిట్లను విక్రయించింది. 2022 ఏప్రిల్ నెలలో ఈ అమ్మకాలు 245 యూనిట్లు. అమ్మకాల పరంగా కంపెనీ మునుపటి ఏడాది కంటే 36.73% ఎక్కువ. ఇక ఫ్రెంచ్ కార్ బ్రాండ్ సిట్రోయెన్ గత నెలలో మార్కెట్లో మొత్తం 229 యూనిట్లను విక్రయించింది. అంతకు ముందు కంపెనీ ఎలక్ట్రిక్ విభాగంలో కారుని విడుదల చేయలేదు. చైనా బ్రాండ్ అయిన BYD, జర్మన్ బ్రాండ్ అయిన BMW గత నెల అమ్మకాల్లో వరుసగా 154 యూనిట్లు, 60 యూనిట్లను విక్రయించాయి. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో వీటి అమ్మకాలు వరుసగా 21 యూనిట్లు, 17 యూనిట్లు. 2022 అమ్మకాల కంటే 2023లో అమ్మకాలు బాగా వృద్ధి చెందినట్లు నివేదికలు చెబుతున్నాయి. 51 యూనిట్ల అమ్మకాలతో హ్యుందాయ్ 7వ స్థానంలో నిలువగా, వోల్వో 8వ స్థానంలో నిలిచింది. వోల్వో కంపెనీ గత నెల అమ్మకాలు 34 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక కియా కంపెనీ 34 యూనిట్ల అమ్మకాలతో ఈ జాబితాలో 9వ స్థానంలో నిలిచింది. ఇక చివరగా 10వ స్థానంలో జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ నిలిచింది. 2023 ఏప్రిల్ నెల అమ్మకాలు 27 యూనిట్లు కాగా, 2022 ఏప్రిల్ నెలలో 11 యూనిట్లుగా నమోదయ్యాయి. అమ్మకాల్లో కంపెనీ 145.45 శాతం పెరిగాయి. అయితే మొత్తం అమ్మకాలు 5834 యూనిట్లు (2023 ఏప్రిల్). ఇదే నెల గత ఏడాది అమ్మకాలు 2252 యూనిట్లు మాత్రమే. అంటే అమ్మకాల వృద్ధి 100శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. -
ఆటో ఎల్పీజీ కథ ముగిసినట్టే!
న్యూఢిల్లీ: దేశ ఆటోమొబైల్ మార్కెట్ క్రమంగా పర్యావరణ అనుకూల పరిష్కారాల వైపు అడుగులు వేస్తోంది. ఎక్కువ మంది పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహనాలు, సీఎన్జీ కార్లకు ప్రాధాన్యం ఇస్తుండడంతో.. ఆటోమొబైల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ తర్వాత సీఎన్జీ వాహనాలకే ఎక్కువ డిమాండ్ నెలకొంది. దీంతో ఎల్పీజీ కార్ల విక్రయాలు ఐదేళ్ల కాలంలో (2018–19 నుంచి చూస్తే) 82 శాతం తగ్గిపోయాయి. 2022–23లో కేవలం 23,618 ఎల్పీజీ కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. కానీ, 2018–19లో 1,28,144 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. కేంద్ర రవాణా శాఖ పరిధిలోని వాహన్ పోర్టల్ గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం మీద 2,22,24,702 యూనిట్ల వాహనాలు అమ్ముడుపోతే, ఇందులో ఎల్పీజీ వాహనాలు కేవలం 0.11 శాతంగా ఉండడం వినియోగదారులు వీటి పట్ల ఆసక్తిగా లేరని తెలుస్తోంది. అదే సమయంలో సీఎన్జీ వాహన విక్రయాలు ఇందులో 3 శాతంగా ఉంటే, ఎలక్ట్రిక్ వాహనాలు 5 శాతంగా ఉండడం, కస్టమర్లు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నట్టు తెలియజేస్తోంది. ఎగసి పడిన డిమాండ్ ఎల్పీజీ పుష్కలంగా అందుబాటులో ఉండడమే కాదు, ఎక్కువ ఆక్టేన్ కలిగి, చాలా తక్కువ ఉద్గారాలను విడుదల చేసే ఇంధనం కావడంతో.. ఆటోమొబైల్ పరిశ్రమకు ప్రత్యామ్నాయ ఇంధనంగా లోగడ భావించారు. దీంతో ఎల్పీజీ కార్లు, ఎల్పీజీ త్రిచక్ర వాహనాలు 2019లో ఎక్కువగా అమ్ముడుపోయాయి. కానీ, దేశంలో ఎల్పీజీ వాహనాల వినియోగం చట్టబద్ధంగా అమల్లోకి వచ్చిం ది మాత్రం 2020 ఏప్రిల్ నుంచి కావడం గమనార్హం. నాలుగు చక్రాల ప్యాసింజర్ వాహనాలకుతోడు, ఎల్పీజీ త్రిచక్ర వాహనాలు (80 శాతానికి పైగా) 2019లో రికార్డు స్థాయి ఎల్పీజీ వాహన అమ్మకాలకు దోహదపడినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కానీ, 2022–23 సంవత్సరంలో ఎల్పీజీ వాహనాల డిమాండ్ 14 శాతానికి పరిమితమైంది. 2018–19లో ఇది 18 శాతంగా ఉంది. 2022–23లో కేవలం 3,495 ఎల్పీజీ నాలుగు చక్రాల వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. 2018–19లో ఇలా రిజిస్టర్ అయిన నాలుగు చక్రాల వాహనాలు 23,965 యూనిట్లుగా ఉండడం గమనించాలి. ‘‘విక్రయానంతరం ప్యాసింజర్ వాహనాలకు ఉన్న డిమాండ్ ఇది. 2018 నుంచి 2020 వరకు ప్యాసింజర్ వాహన విభాగమే ఎల్పీజీకి పెద్ద మద్దతుగా నిలిచింది. నిబంధనలు అనుకూలంగా లేకపోవడం, కిట్ ఆధారిత అనుమతులకు అధిక వ్యయాలు చేయాల్సి రావడం, ప్రతి మూడేళ్లకోసారి తిరిగి సరి్టఫై చేయించుకోవాల్సి రావడం, ఎల్పీజీ మోడళ్లు పెద్దగా అందుబాటులో లేకపోవడం వినియోగదారుల్లో ఆసక్తి ఆవిరైపోవడానికి కారణం’’అని ఇండియన్ ఆటో ఎల్పీజీ కొయిలిషన్ డైరెక్టర్ జనరల్ సుయాష్ గుప్తా వివరించారు. వసతులు కూడా తక్కువే.. 2023 మార్చి నాటికి దేశవ్యాప్తంగా కేవలం 1,177 ఎల్పీజీ స్టేషన్లే ఉన్నాయి. అదే సీఎన్జీ స్టేషన్లు అయితే 4,600 ఉంటే, ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు 5,200 ఉన్నాయి. పెట్రోల్ పంపులు 80,000 పైగా ఉన్నాయి. అంటే ఎల్పీజీ విషయంలో సరైన రీఫిల్లింగ్ వసతులు కూడా లేవని తెలుస్తోంది. మరోవైపు ధరలు కూడా అనుకూలంగా లేని పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో కిలో ఎల్పీజీ ధర లీటర్‌కు రూ.68కి చేరుకోగా, 2019లో రూ.40 మాత్రమే ఉంది. ఇతర రాష్ట్రాల్లో దీని ధర ఇంకా ఎక్కువే. ‘‘ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం కొరవడడంతో వాహన తయారీదారులు ఎల్పీజీ మోడళ్లను తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. నేడు దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా అయితే ఎల్పీజీ కార్ల తయారీని నిలిపివేసింది. ప్రజలు సీఎన్జీ, ఈవీల పట్ల ఆసక్తి చూపిస్తుండడం దేశంలో ఎల్పీజీ వాహన రంగానికి గొడ్డలి పెట్టుగా మారింది’’అని పరిశ్రమకు చెందిన నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. ఈవీ, సీఎన్జీ వాహనాలను కేంద్రం సబ్సిడీలతో ప్రోత్సాహిస్తుండడాన్ని పరిశ్రమ ప్రస్తావిస్తోంది. -
అమ్మకాల్లో దుమ్మురేపిన టాటా మోటార్స్: ఆ నాలుగు కార్లకు భలే డిమాండ్..
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) 2023 మార్చి నెల అమ్మకాల గణాంకాల నివేదికలను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం కంపెనీ గత నెలలో ఏకంగా 44,044 యూనిట్ల కార్లను విక్రయించినట్లు తెలిసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో టాటా మోటార్స్ గొప్ప రికార్డ్ సృష్టించింది. 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి నాటికి కంపెనీ 5,38,640 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. 2022 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ అమ్మకాలు 45.43 శాతం పెరిగాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో కరోనా మహమ్మారి కారణంగా టాటా మోటార్స్ 3,70,372 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ప్యాసింజర్ వెహికల్స్ విభాగంలో మారుతి సుజుకీ, హ్యుందాయ్ తరువాత టాటా మోటార్స్ అతి పెద్ద సంస్థ. గత నెలలో కంపెనీ ఎక్కువగా నెక్సాన్, పంచ్, హారియార్, సఫారీ వంటి కార్లను విక్రయించింది. మొత్తం అమ్మకాల్లో ఈ ఎస్‌యూవీల వాటా 66శాతం. మొత్తం అమ్మకాల్లో (44,044 యూనిట్లు) ఎలక్ట్రిక్ వెహికల్స్ (6,509 యూనిట్లు) కూడా ఉన్నాయి. 2022 మార్చితో పోలిస్తే ఈ అమ్మకాలు నాలుగు శాతం వృద్ధిని నమోదు చేసినట్లు తెలుస్తోంది. అంటే 2022 మార్చిలో కంపెనీ అమ్మకాలు 42,293 యూనిట్లు. ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాల్లో కంపెనీ వృద్ధి 89 శాతం ఉండటం గమనార్హం. 2022లో ఈవీల అమ్మకాలు 19,668 యూనిట్లు. (ఇదీ చదవండి: మార్కెట్లో కొత్త నాయిస్ స్మార్ట్‌వాచ్ లాంచ్: ధర తక్కువ & బోలెడన్ని ఫీచర్స్..) ఇక కమర్షియల్ వెహికల్స్ సేల్స్ విషయానికి వస్తే, 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 3,93,317 యూనిట్లను విక్రయించింది. అదే సమయంలో 2022లో ఈ అమ్మకాలు 3,22,182 యూనిట్లు. కమర్షియల్ వెహికల్స్ అమ్మకాల్లో కూడా 22 శాతం పెరుగుదల ఉంది. ఎగుమతుల విషయంలో కంపెనీ భారీ తగ్గుదలను నమోదు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. -
దుమ్మురేపిన బాలెనొ.. అమ్మకాల్లో మారుతి సుజుకి కొత్త రికార్డ్
భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి' గత నెలలో (2023 ఫిబ్రవరి) మంచి అమ్మకాలను పొందింది. అమ్మకాల పరంగా కంపెనీ 2022 ఫిబ్రవరి కంటే కూడా 10 శాతం పెరుగుదలను నమోదు చేసింది. మారుతి సుజుకి అమ్మకాల్లో బాలెనొ 18,592 యూనిట్లను విక్రయించి మునుపటి ఏడాది ఇదే నెలకంటే 47.91 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2022 ఫిబ్రవరిలో దీని అమ్మకాలు 12,570 యూనిట్లు. తరువాత వరుసలో 18,114 యూనిట్ల అమ్మకాలతో స్విఫ్ట్ నిలిచింది. అయితే స్విఫ్ట్ అమ్మకాలు మునుపటి సంవత్సరం కంటే 4.11 శాతం తగ్గాయి. 56.82 శాతం పెరుగుదలతో మారుతి ఆల్టో మూడవ స్థానంలో నిలిచింది. ఆల్టో అమ్మకాలు గత నెలలో 18,114 యూనిట్లు. వ్యాగన్-ఆర్ అమ్మకాలు 16,889 యూనిట్లు కాగా, డిజైర్ సేల్స్ 16,798 యూనిట్లతో ఐదవ స్థానంలో నిలిచింది. డిజైర్ అమ్మకాలు 2022లో 3.67 శాతం తగ్గాయి. (ఇదీ చదవండి: SBI: మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి.. బ్యాంకుకి వెళ్లకుండా!) బ్రెజ్జా, ఈకో అమ్మకాలు వరుసగా 15,787 & 11,352 యూనిట్లు. ఈ ఏడాది దేశీయ మార్కెట్లో విడుదలైన గ్రాండ్ విటారా ఏకంగా 9,183 యూనిట్ల అమ్మకాలతో టాప్ 10లో ఒకటిగా నిలిచింది. ఎర్టిగా, ఇగ్నిస్ రెండూ 6472 యూనిట్లు, 4749 యూనిట్లను విక్రయించి తొమ్మిది, పదవ స్థానాల్లో నిలిచాయి. -
SIAM Report: కనీవినీ ఎరుగని రీతిలో కార్ల అమ్మకాలు
భారతదేశంలో కార్లను వినియోగించేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది, ఈ కారణంగా రోడ్డుపైన తిరిగే కార్ల సంఖ్య కూడా తారా స్థాయికి చేరుకుంటోంది. మునుపటితో పోలిస్తే సొంతంగా కార్లను కలిగి ఉన్న వారు ఇప్పుడు చాలానే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) అందించిన నివేదికల ప్రకారం, 2023 ఫిబ్రవరిలో మాత్రం సుమారు 2.92 లక్షల ప్యాసింజర్ వాహనాలు విక్రయించారని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ప్యాసింజర్ వాహనాలకున్న డిమాండ్ ఇట్టే అర్దమైపోతోంది. నిజానికి గత నెలలో మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2,91,928 యూనిట్లు. 2022లో విక్రయించబడ్డ 2,62,984 యూనిట్లతో పోలిస్తే ఈ అమ్మకాలు 11 శాతం పెరిగాయి. ఇందులో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (SUV) కూడా ఉన్నాయి. వ్యాన్ల అమ్మకాలు గత ఫిబ్రవరిలో 11,489 యూనిట్లు. మొత్తం అమ్మకాలలో మారుతి సుజుకి సేల్స్ 1,02,565 యూనిట్లు. గత సంవత్సరం ఇదే నెలలో కంపెనీ 99,398 యూనిట్లను విక్రయించి, 3 శాతం తగ్గుదలను నమోదు చేసింది. హ్యుందాయ్ కంపెనీ 24,493 యూనిట్లను విక్రయించి భారీ వృద్ధిని కైవసం చేసుకుంది. (ఇదీ చదవండి: టాటా కార్లు కొనేవారికి శుభవార్త.. ఆకర్షణీయమైన డిస్కౌంట్స్, అంతకుమించిన బెనిఫీట్స్) ద్విచక్ర వాహనాల అమ్మకాలు 2022లో 10,50,079 యూనిట్లు, కాగా 2023 ఫిబ్రవరిలో ఈ అమ్మకాలు 8 శాతం పెరిగి 11,29,661 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీ వీలర్ సేల్స్ కూడా 86 శాతం పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. మొత్తం మీద దేశీయ మార్కెట్లో వాహన అమ్మకాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. -
మెరిసిన మారుతి.. పడిపోయిన ఎమ్‌జి మోటార్: సేల్స్‌లో టాటా స్థానం ఎంతంటే?
ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) ఇటీవల గత నెల కార్ల విక్రయాల నివేదికలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం వాహన అమ్మకాలు మునుపటికంటే కొంత పురోగతిని కనపరిచినట్లు తెలుస్తోంది. టాప్ 10 జాబితాలో మారుతి సుజుకి మొదటి స్థానంలో నిలిచింది, చివరి స్థానంలో ఎంజి మోటార్స్ చోటు సంపాదించింది. 2023 ఫిబ్రవరిలో 2,82,799 యూనిట్ల వాహనాలను విక్రయించి మునుపటి ఏడాది ఫిబ్రవరి (2,58,736 యూనిట్లు) నెలకంటే 13.05 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ జాబితాలో 1,18,892 యూనిట్ల కార్లను విక్రయించిన మారుతి మొదటి స్థానంలో నిలిచి, అమ్మకాల పరంగా 2022 ఫిబ్రవరి కంటే 8.47 శాతం వృద్ధిని పొందింది. రెండవ స్థానంలో నిలిచిన హ్యుందాయ్ ఫిబ్రవరి 2022 కంటే 1.08 శాతం పెరుగుదలను నమోదు చేసింది. కంపెనీ అమ్మకాలు గత నెలలో 39,106 యూనిట్లు. టాటా మోటార్స్ 38,965 యూనిట్లు విక్రయించి మూడవ స్థానంలో నిలిచింది. (ఇదీ చదవండి: నయా కారు విడుదలకు సిద్దమవుతున్న కియా మోటార్స్.. ఒక్క ఛార్జ్‌తో 450 కి.మీ రేంజ్!) దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా 2022 ఫిబ్రవరి కంటే 11,092 యూనిట్లను ఎక్కువ విక్రయించి నాలుగవ స్థానంలో నిలిచింది. గత నెలలో కంపెనీ అమ్మకాలు 29,356 యూనిట్లు. కియా మోటార్స్ ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచి, మునుపటి ఏడాది ఫిబ్రవరి కంటే 43.54 శాతం పెరుగుదలను పొందింది. ఇక తరువాత స్థానాల్లో టయోట, స్కోడా, హోండా, రెనాల్ట్, ఎంజి మోటార్స్, నిస్సాన్ వంటివి ఉన్నాయి. మొత్తం మీద కార్ల అమ్మకాలు 2022 ఫిబ్రవరి కంటే కూడా ఉత్తమంగా ఉన్నట్లు ఫాడా నివేదికలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని సంబంధిత వారాగాలు ఆశిస్తున్నాయి. -
కొత్త ఏడాది.. 18 లక్షల కొత్త వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2023 జనవరిలో అన్ని విభాగాల్లో కలిపి రిటైల్‌లో 18,26,669 వాహనాలు అమ్ముడయ్యాయి. 2022 జనవరితో పోలిస్తే ఈ సంఖ్య 14 శాతం అధికమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. 2022 జనవరితో పోలిస్తే గత నెలలో ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయాలు 22 శాతం అధికమై 3,40,220 యూనిట్లకు చేరుకున్నాయి. ద్విచక్ర వాహనాలు 10 శాతం ఎగసి 12,65,069 యూనిట్లుగా ఉంది. త్రీవీలర్లు 59 శాతం పెరిగి 65,796 యూనిట్లు, వాణిజ్య వాహనాలు 16 శాతం వృద్ధి చెంది 82,428, ట్రాక్టర్లు 8 శాతం దూసుకెళ్లి 73,853 యూనిట్లకు చేరుకున్నాయి. 2020 జనవరితో పోలిస్తే గత నెల విక్రయాలు 8 శాతం తక్కువ అని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. గ్రామీణ మార్కెట్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని, యాజమాన్య ఖర్చు గణనీయంగా పెరగడమే ఇందుకు కారణమని అన్నారు. పునర్వినియోగపరచదగిన ఆదాయం అదే నిష్పత్తిలో పెరగలేదని చెప్పారు. పాత వాహనాల భర్తీ, సరకు రవాణా పెరుగుదల, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం నుంచి స్థిర మద్ధతు కారణంగా.. మార్కెట్లో డిమాండ్ కొనసాగి వాణిజ్య వాహనాల విభాగం కోవిడ్ ముందస్తు కంటే పెరగడానికి సహాయపడింది అని వివరించారు. (ఇదీ చదవండి: సూపర్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న అల్ట్రా లగ్జరీ కార్లు!) -
దూసుకెళ్తున్న కార్లు.. ఆ జిల్లాలో నెలకు 400 కార్ల విక్రయాలు
సాక్షి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కార్ల అమ్మకాలు దూసుకెళ్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పుడు నాలుగు చక్రాల వాహనాలకు డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు కారు హోదాగా భావించే సగటు కుటుంబాలు.. ఇప్పుడు నిత్యావసరంగా భావిస్తున్నాయి. సొంత ఇల్లు ఎంత ముఖ్యమో కారు ఉండటమూ అంతేననే ఆలోచన ఏర్పడింది. ముఖ్యంగా కోవిడ్ అనంతరం చిన్న చిన్న ఉద్యోగులు కూడా కారు వైపు మొగ్గు చూపుతున్నారు. కుటుంబంతో కలిసి సొంతకారులో ప్రయాణించాలన్న ఆలోచన బలంగా ఏర్పడింది. కార్లకు భారీ డిమాండ్.. ఐదేళ్ల క్రితం అనంతపురం జిల్లా కేంద్రంగా మహా అంటే నెలకు 80 నుంచి 100 కార్లు అమ్ముడయ్యేవి. తాజా గణాంకాలు చూస్తే నెలకు 400కు పైగా అమ్ముడవుతున్నాయి. దీన్నిబట్టి కార్ల డిమాండ్ ఎలా ఉందో అంచనా వేయచ్చు. కియా, మహీంద్రా, హ్యుందాయ్, మారుతి, టాటా వంటి కార్లకు బాగా డిమాండ్ ఉంది. కారు బుక్ చేసుకున్న తర్వాత కనీసం మూడు మాసాలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నట్టు షోరూం నిర్వాహకులు చెబుతున్నారు. కొన్ని కార్లకు 6 మాసాలు కూడా పడుతోంది. పండుగలు, ప్రత్యేక పర్వదినాల వేళ 500 కార్లు అమ్ముడైన సందర్భాలున్నాయి. కుటుంబ ప్రయాణాలపై మొగ్గు.. ఒకప్పుడు బస్సు, రైలు ప్రయాణాలు ఎక్కువ. ఇప్పుడు రూ.40 వేలు వేతనం తీసుకునే ఉద్యోగి కూడా కుటుంబంతో కలిసి కారులో ప్రయాణం చేయాలనుకుంటున్నారు. దీంతోపాటు సులభతర వాయిదాల్లో లోన్లు లభిస్తున్నాయి. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో కార్లలో ప్రయాణమే మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారు. కొత్త కార్లకే కాదు సెకండ్ హ్యాండ్ కార్లకూ ఇప్పుడు మంచి మార్కెట్ ఉన్నట్టు ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. కొనుగోలు శక్తి పెరిగింది ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. చిన్న చిన్న ఉద్యోగులు కూడా కారు కొనుక్కోవాలనే ఆలోచనలో ఉన్నారు. గతంతో పోల్చితే ఇప్పుడు చాలా ఎక్కువ మార్కెట్ ఉంది. ముఖ్యంగా కోవిడ్ అనంతరం జిల్లాలో కార్ల అమ్మకాల మార్కెట్ పెరిగింది. – వంశీ, జనరల్ మేనేజర్, మహీంద్రా కంపెనీ అక్కడ జాప్యం జరుగుతోందని.. మాది కృష్ణా జిల్లా కలిదిండి. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కొనాలనుకున్నా. కానీ విజయవాడలో 7 మాసాలు వెయిటింగ్ అని చెప్పారు. తెలిసిన వాళ్లుంటే అనంతపురంలో కొన్నా. ఈ వారంలో డెలివరీ ఇస్తున్నారు. ఆ వాహనం నాకు బాగా ఇష్టం. – ఎం.నాగరాజు, కలిదిండి ఆదాయం గణనీయంగా పెరిగింది రవాణాశాఖకు ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 206.42 కోట్లు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. డిసెంబర్ నాటికి రూ.154 కోట్లు టార్గెట్ కాగా రూ. 132 కోట్లు వసూలైంది. ఇందుకు కారణం వాహనాల కొనుగోలు పెరగడమే. ముఖ్యంగా కార్ల కొనుగోలు శాతం భారీగా పెరిగింది. మధ్యతరగతి వారు సైతం కార్లను కొనుగోలు చేస్తున్నారు. – శివరామప్రసాద్, ఉపరవాణా కమిషనర్, అనంతపురం -
న్యూఇయర్‌కి ముందే.. ఈ కార్ల కొనుగోలుపై కళ్లు చెదిరేలా భారీ డిస్కౌంట్లు
న్యూఢిల్లీ: సరఫరా వ్యవస్థలు మెరుగుపడి కార్ల ఉత్పత్తి పెరిగే కొద్దీ నాలుగేళ్లుగా పేరుకున్న డిమాండ్ క్రమంగా తగ్గుతోంది. దీనికి సంవత్సరాంతం కూడా తోడు కావడంతో కొన్ని విభాగాల్లో అమ్మకాలు పెంచుకునేందుకు కార్ల కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. చాలా మటుకు సంస్థలు డిసెంబర్లో 4.5 శాతం నుంచి 5 శాతం వరకూ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం ప్రకటించిన 2 – 2.5 శాతంతో పోలిస్తే ఇది రెట్టింపు కావడం గమనార్హం. డీలర్లు రూ. 25,000 నుంచి రూ. 1,00,000 దాకా విలువ చేసే ప్రయోజనాలు అందిస్తామంటూ కొనుగోలుదార్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కువగా ఎంట్రీ–లెవెల్ కార్ల సెగ్మెంట్లోనూ, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు సంబంధించి పెట్రోల్ సెగ్మెంట్లోనూ ఇలాంటి డిస్కౌంట్లు లభిస్తున్నాయి. నగదు డిస్కౌంట్లు, ఎక్సే్చంజ్ బోనస్ ప్రయోజనాలు, బీమా కంపెనీలు ఓన్ డ్యామేజీ ప్రీమియంను తగ్గించడం, డీలర్లు నిర్వహించే స్కీములు మొదలైన వాటి రూపాల్లో ఇవి ఉంటున్నాయి. మారుతీ సుజుకీ ఇండియా 2018–19 స్థాయిలోనే రూ. 17,000 – రూ. 18,000 వరకూ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీఎన్జీకి, సాంప్రదాయ ఇంధనాల రేట్లకు మధ్య వ్యత్యాసం తగ్గిపోతుండటంతో సీఎన్జీ మోడల్స్ వైపు కొనుగోలుదారులు దృష్టి పెట్టడం తగ్గుతోంది. దీంతో సీఎన్జీ మోడల్స్‌ను విక్రయించేందుకు కంపెనీలు అత్యధికంగా రూ. 60,000 వరకూ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. డిసెంబర్లో రిటైల్ విక్రయాలు పటిష్టంగా ఉన్నాయని, నవంబర్‌తో పోలిస్తే 20 శాతం ఎక్కువగా విక్రయాలు ఉండొచ్చని భావిస్తున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా వర్గాలు తెలిపాయి. పెరుగుతున్న నిల్వలతో ఒత్తిడి.. డీలర్ల దగ్గర నిల్వలు మళ్లీ కోవిడ్ పూర్వ స్థాయికి చేరినట్లు ఎస్అండ్పీ మొబిలిటీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 45–50 రోజుల వరకు సరిపడా నిల్వలు ఉంటున్నాయని పేర్కొన్నాయి. దీంతో డిస్కౌంట్లు ఇచ్చి అయినా వాహనాలను అమ్మేసేందుకు డీలర్లు మొగ్గుచూపుతున్నారని తెలిపాయి. వడ్డీ రేట్లు పెరుగుతుండటం కూడా సమస్యాత్మకంగా మారుతోంది. అటు ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. టాటా మోటార్ ఈ–నెక్సాన్‌కి ఇటీవలి వరకూ కొద్ది నెలల పాటు వెయిటింగ్ పీరియడ్ ఉండేది. కానీ ప్రస్తుతం డీలర్‌షిప్‌లో బుక్ చేసుకుని అప్పటికప్పుడే కారుతో బైటికి వచ్చే పరిస్థితి ఉంటోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. భవిష్యత్‌పై ఆచి తూచి.. ప్రస్తుతం దాదాపు 4,17,000 వాహనాల ఆర్డర్లతో కార్ల కంపెనీల ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉంది. దీంతో కొంత ఎక్కువగా డిస్కౌంట్లు ఇచ్చేందుకు కంపెనీలు వెనుకాడటం లేదు. అయితే, భవిష్యత్‌లో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొంత అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, మార్కెట్ సెంటిమెంట్ మొదలైన వాటిని బట్టి డిమాండ్ పరిస్థితి ఉంటుందని హ్యుందాయ్ మోటార్ ఇండియా వర్గాలు తెలిపాయి. 2018–19కి భిన్నంగా ప్రస్తుతం సంవత్సరాంతపు డిస్కౌంట్లు కొన్ని సెగ్మెంట్లకు మాత్రమే పరిమితంగా ఉంటున్నాయని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. -
కార్ల కొనుగోలు దారులకు భారీ షాక్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా కార్ల ధరలను జనవరి 23 నుంచి పెంచుతోంది. మోడల్‌నుబట్టి ధర రూ.30,000 వరకు అధికం కానుంది. ముడిసరుకు వ్యయాలు దూసుకెళ్లడం, నూతన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారీ చేపడుతుండడం ఇందుకు కారణమని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. కాలుష్యం ఏ మేరకు విడుదల అవుతుందో తెలుసుకునే పరికరాన్ని కార్లలో ఏర్పాటు చేయాలన్న నిబంధన 2023 ఏప్రిల్ నుంచి అమలులోకి వస్తోంది. ధరలను సవరిస్తున్నట్టు మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, రెనో, కియా ఇండియా, ఎంజీ మోటార్ ఇప్పటికే ప్రకటించాయి. -
ఈ కార్లకు యమ క్రేజ్.. జనాలు ఎగబడి కొనేస్తున్నారు!
ముంబై: దేశీయంగా వ్యక్తిగత రవాణా గిరాకీ పుంజుకోవడంతో నవంబర్‌లో వాహన విక్రయాలు దూసుకెళ్లాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని నమోదుచేశాయి. కియా ఇండియా, హోండా కార్స్, స్కోడా, ఎంజీ మోటార్స్ సంస్థలు సైతం చెప్పుకోదగిన స్థాయిలో అమ్మకాలు జరిపాయి. దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మొత్తం 1,59,044 వాహనాలు విక్రయించింది. గతేడాది నవంబర్ నాటి 1,39,184 అమ్మకాలతో పోలిస్తే ఇవి 14 శాతం అధికం. డిసెంబర్‌తో కలుపుకొని ఈ ఏడాదిలో మొత్తం 38 లక్షల కార్ల విక్రయాలను అంచనా వేస్తున్నట్లు కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ శ్రీవాస్తవ తెలిపారు. హ్యుందాయ్ మోటార్ ఇండియా నవంబర్ విక్రయాలు 36 శాతం పెరిగి 64,004 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో కంపెనీ 46,910 వాహనాలను అమ్మింది. టాటా మోటార్స్ మొత్తం విక్రయాలు 62,192 నుంచి 21 శాతం పెరిగి 75,478కు చేరాయి. కియా ఇండియా మొత్తం అమ్మకాలు 69 శాతం పెరిగి 24,025 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక ద్విచక్ర వాహనాల గణాంకాలను పరిశీలిస్తే.., హీరో మోటోకార్ప్ అమ్మకాలు నవంబర్‌లో 12 శాతం పెరిగి మొత్తం 3.90 లక్షల యూనిట్లను విక్రయించిట్లు ఆ కంపెనీ తెలిపింది. బజాజ్ ఆటో విక్రయాలు 19 శాతం మేర క్షీణించాయి. -
ఊహించని షాక్.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్ డిమాండ్, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు!
ఇటీవల ప్రజలు కారు కొనుగోలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో కంపెనీ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఫీచర్లతో కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. వాటి సేల్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. అయితే హ్యుందాయ్ కంపెనీలోని ఓ మోడల్ కారుని ప్రజలు ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేదు. గతంలో ఈ కారుకి ఫుల్ డిమాండ్. మధ్యతరగతి ప్రజలు ఈ కార్లే కావాలని కొనేవాళ్లు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. ఒక్క కారు కూడా కొనలేదు హ్యుందాయ్ కంపెనీలోని శాంత్రో (Santro) మోడల్ కారు మంచి గుర్తింపే తెచ్చుకుంది. అయితే పలు కారణాల వల్ల సంస్థ ఈ కారు ఉత్పత్తిని మే 2022లో కంపెనీ నిలిపివేసినప్పటికీ, దాని మూసివేత ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. ఈ కారు స్టాక్‌ను క్లియర్ చేయాలనుకోవడం దీనికి కారణం. వాస్తవానికి, ఇప్పటికీ కంపెనీ అధికారిక వెబ్సైట్లో ఈ కారు జాబితా ఉంచి ఆన్లైన్లో విక్రయిస్తోంది. అయినా స్టాక్ క్లియర్ చేయలేకపోతోంది. మరోవైపు ఈ కారు సేల్స్ క్రమక్రమంగా పడిపోతూ వస్తోంది. అలా ఏకంగా గత అక్టోబర్ నెలలో దీన్ని అమ్మకాలు జీరోగా ఉంది. ఇది కంపెనీకి భారీ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఫ్యామిలీ కారుగా గుర్తింపు సాధించింది శాంత్రో ప్రస్తుతం దాని సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం చాలా నిరాశపరిచింది. ఏడాది కిందట చూస్తే.. శాంట్రో అమ్మకాలు 2877 యూనిట్లుగా ఉన్నాయి. కంపెనీ 2018లో శాంత్రో కారును రీలాంచ్ చేసి దీని ప్రారంభ ధర రూ. 3.9 లక్షలుగా నిర్ణయించింది. అయితే నాలుగేళ్ల కాలంలో ఈ కారు ప్రారంభ ధర రూ. 5.7 లక్షలకు చేరింది. ఇక ధర పెరగడంలో కొనే వారు కరువైనట్లు తెలుస్తోంది. చదవండి: గుడ్‌న్యూస్: కొత్త సేవలు వచ్చాయ్.. ఇలా చేస్తే ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ పేమెంట్స్! -
టాప్ గేర్ లో కార్ల అమ్మకాలు.. కారణం ఇదే..
-
సెప్టెంబర్.. టాప్ గేర్
న్యూఢిల్లీ: సెమీ కండక్టర్ల సరఫరా మెరుగుపడిన నేపథ్యంలో ఉత్పత్తి పెరగడం, పండుగల డిమాండ్ తోడు కావడంతో దేశీయంగా కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ప్యాసింజర్ వాహనాల (పీవీ) అమ్మకాలు సెప్టెంబర్‌లో 3,55,946 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 91 శాతం అధికం. చిప్‌ల కొరత సమస్య తగ్గి ఉత్పత్తి మెరుగుపడటంతో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్ మొదలైన ఆటోమొబైల్ దిగ్గజాలు తమ డీలర్లకు మరిన్ని కార్లను సమకూర్చగలిగాయి. సెప్టెంబర్‌లో మారుతీ సుజుకీ అమ్మకాలు 63,111 యూనిట్ల నుంచి 1,48,380 యూనిట్లకు పెరిగాయి. గత 42 నెలల్లో అమ్మకాలపరంగా ఇది తమకు అత్యుత్తమమైన రెండో నెల అని సంస్థ సీనియర్ ఈడీ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. చివరిగా 2020 అక్టోబర్‌లో మారుతీ సుజుకీ దేశీ మార్కెట్లో ఏకంగా 1,63,000 వాహనాలు విక్రయించింది. కంపెనీ మార్కెట్ వాటా తాజాగా సెప్టెంబర్‌లో దాదాపు 8 శాతం పెరిగి 42 శాతానికి చేరింది. జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో పరిశ్రమ తొలిసారిగా 10 లక్షల వాహనాల విక్రయాల మార్కును దాటిందని శ్రీవాస్తవ చెప్పారు. మరోవైపు, హ్యుందాయ్ అమ్మకాలు 50 శాతం పెరిగి 49,700గా నమోదయ్యాయి. టాటా మోటార్స్ 47,654 కార్లను, కియా ఇండియా 25,857, టయోటా కిర్లోస్కర్ మోటార్ 15,378, హోండా కార్స్ 8,714 వాహనాలను విక్రయించాయి. ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో మోటోకార్ప్ 5,07,690, టీవీఎస్ మోటర్ కంపెనీ 2,83,878 యూనిట్లను విక్రయించాయి. -
కియా మరోసారి అదరగొట్టింది: సెల్టోస్ కొత్త రికార్డు
అనంతపురం: కియా మధ్యస్థాయి ఎస్యూవీ సెల్టోస్ దేశీయంగా ఇప్పటి వరకు 3 లక్షల యూనిట్లు అమ్ముడై కొత్త రికార్డు సృష్టించింది. అలాగే భారత్ నుంచి 1,03,033 యూనిట్లు ఎగుమతి చేసినట్టు కంపెనీ వెల్లడించింది. భారత్‌లో కియా విక్రయాలు మొదలైన నాటి నుంచి దేశంలో 5 లక్షల యూనిట్ల కీలక మైలురాయిని ఇటీవల దాటేసింది. ఇందులో 60 శాతం వాటా సెల్టోస్ కార్లదే కావడం విశేషం. చదవండి: Maruti Suzuki Swift S-CNG వచ్చేసింది, ఫీచర్లు చూసి వావ్ అనాల్సిందే! కియా బ్రాండ్ భారతదేశంలోకి ప్రవేశించిన తరువాతి తొలి ప్రొడక్షన్ సెల్టోస్. డిజైన్, ఫీచర్లు, భద్రత, ఇతర అంశాల కారణంగా ఈ కారుకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈసెగ్మెంట్లో ఆరు-ఎయిర్‌బ్యాగ్‌లను వేరియంట్లలో ప్రామాణికంగా అందిస్తున్న ఏకైక కారు. సెల్టోస్ కియా సెల్టోస్ ఎగుమతి మార్కెట్ కూడా బలంగా ఉంది. ఈ కారు 91 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి అవుతోంది. చదవండి: ఇన్‌స్టాలో కొత్త అవతార్, స్నాప్‌చాట్‌లో స్పెషల్ ఫీచర్లు -
సరికొత్త రికార్డ్..దుమ్మురేపుతున్న కియా కార్ల అమ్మకాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా గడిచిన మూడేళ్లలో దేశీయంగా 5 లక్షల యూనిట్ల అమ్మకాలతో కొత్త మైలురాయిని అధిగమించింది. తక్కువ కాలంలో ఈ ఘనతను సాధించిన కార్ల తయారీ కంపెనీ తామేనని కియా వెల్లడించింది. అలాగే గడిచిన నాలుగున్నర నెలల్లోనే ఒక లక్ష కార్లను విక్రయించినట్టు తెలిపింది. ఎగుమతులతో కలిపి ఈ మూడేళ్లలో కంపెనీ 6,34,224 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. సెల్టోస్ మోడల్‌దే ప్రధాన వాటాగా ఉంది. అంతర్జాతీయంగా కియా మొత్తం అమ్మకాల్లో భారత వాటా 6 శాతానికి పైగా ఎగసింది. ‘భారత్‌లో మూడేళ్లలో ట్రెండ్ సృష్టించాం. స్పూర్తిదాయక బ్రాండ్‌గా స్థిరపడటమేగాక నూతన సాంకేతికతలను స్వీకరించడంలో సైతం నాయకత్వం వహించాం’ అని కియా ఇండియా తెలిపింది. ప్రస్తుతం ఉన్న టచ్ పాయింట్ల సంఖ్య 339 నుంచి డిసెంబర్ నాటికి 400లకు చేర్చనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ జిల్లాలో కియా తయారీ కేంద్రం ఉంది. -
ముందుగా అమ్మకాలకు అనుమతిస్తేనే భారత్‌లో తయారీ
న్యూఢిల్లీ: ముందుగా తమ కార్ల అమ్మకాలు, సర్వీసింగ్‌కు అనుమతినిస్తే తప్ప భారత్‌లో తయారీ ప్లాంటు ఏర్పాటు చేయబోమని ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ఒక యూజర్ వేసిన ప్రశ్నకు ఈ మేరకు స మాధానమిచ్చారు. ‘ముందుగా తన కార్లను అమ్ముకోవడానికి, సర్వీసింగ్ చేయడానికి అను మతి ఇవ్వని ఏ ప్రాం తంలోనూ టెస్లా తన తయా రీ ప్లాంటు ఏర్పాటు చేయదు‘ అని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాం డ్ నెలకొన్న నేపథ్యంలో భారీ భారత మార్కెట్లో తమ కార్లను దిగుమతి చేసుకుని, అమ్మాలని టెస్లా యోచిస్తోంది. అయితే, ఇందుకు ప్రతిబంధకంగా ఉంటున్న భారీ స్థాయి దిగుమతి సుంకాలను తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. -
అమ్మకాల్లో ఔరా! ఈ కార్ల అమ్మకాలు అప్పుడే మూడు లక్షలు దాటాయట!
ఆటోమొబైల్ సెక్టార్లో దేశంలో రెండో అతి పెద్ద కంపెనీగా ఉన్న హ్యుందాయ్ మార్కెట్లో పాగా వేస్తోంది. ఈ సంస్థ నుంచి వస్తున్న మోడల్స్ క్రమంగా మార్కెట్లో పాతుకుపోతున్నాయి. ఇప్పటికే క్రెటా మోడల్ అమ్మకాల్లో దుమ్ము లేపుతుండగా ఇప్పుడు దాని సరసన వెన్యూ కూడా చేరింది. హ్యుందాయ్ వెన్యూ అమ్మకాలు దేశీయంగా మూడు లక్షల మార్క్‌ని క్రాస్ చేశాయి. సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా 2019లో మార్కెట్లో రిలీజ్ అయ్యింది వెన్యూ. ఏడాది గడిచేప్పటికే లక్ష కార్ల మైలు రాయిని చేరుకుంది. అయితే తర్వాత ఏడాదికే కరోనా రావడంతో అమ్మకాలు మందగించాయి. కానీ కరోనా ముగిసిన తర్వాత అమ్మకాల్లో వెన్యూ దూసుకుపోతోంది. కియా వెన్యూ ఈ, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ (ఓ) వేరియంట్లలో లభిస్తోంది. సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ కావడంతో సిటీల్లో తిరగడానికి బయట ప్రయాణాలకు అనుకూలంగా ఉండటం ఈ కార్ల అమ్మకాలు పెరగడానికి దోహాదం చేసింది. వచ్చే నెలలో వెన్యూ అప్డేటెడ్ వెర్షన్ మార్కెట్లోకి రాబోతుంది. చదవండి: అవును నిజం.. త్వరలో ఎలక్ట్రిక్ ‘అంబాసిడర్’ కారు! -
వాహనాల అమ్మకాల జోరు, ఎక్కువగా కొనుగోలు చేస్తున్న వెహికల్స్ ఇవే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అన్ని రకాల వాహనాల రిటైల్ అమ్మకాలు 2022 ఏప్రిల్‌లో 16,27,975 యూనిట్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 37 శాతం అధికం. 2021 ఏప్రిల్‌తో పోలిస్తే గత నెలలో ప్యాసింజర్ వెహికిల్స్ 25 శాతం పెరిగి 2,64,342 యూనిట్లు రోడ్డెక్కాయి. ద్విచక్ర వాహనాలు 38 శాతం ఎగసి 11,94,520 యూనిట్లు అమ్ముడయ్యాయి. వాణిజ్య వాహనాలు 52 శాతం దూసుకెళ్లి 78,398 యూనిట్లు, త్రిచక్ర వాహనాలు 96 శాతం, ట్రాక్టర్లు 26 శాతం విక్రయాలు పెరిగాయి. 2019 ఏప్రిల్‌తో పోలిస్తే అన్ని రకాల వాహనాల మొత్తం విక్రయాలు గత నెలలో 6 శాతం తగ్గుదల నమోదైంది. ‘రష్యా– ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడం, చైనా లాక్డౌన్లో ఉన్నందున ఆటో పరిశ్రమ సెమీకండక్టర్ కొరతను ఎదుర్కొంటోంది. మెటల్ అధిక ధరలు, కంటైనర్ కొరత ఈ రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దీంతో సరఫరా సంక్షోభం కొనసాగుతోంది’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ వింకేశ్ గులాటీ తెలిపారు. -
కార్లలో వరల్డ్ నంబర్ 1...జస్ట్ వన్ ఇయర్లో కోటి అమ్మకాలు..!
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలను చిప్ కొరత, సప్లై చైన్ రంగం తీవ్రంగా దెబ్బ తీశాయి. గత ఏడాది ఆయా కంపెనీల ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. కాగా 2021లో జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా మాత్రం రికార్డు స్థాయిలో అమ్మకాలను జరిపింది. కోటికి పైగా..! జపాన్‌కు చెందిన టయోటా మోటార్ కో శుక్రవారం తన వాహన విక్రయాలు 2021లో గణనీయంగా 10.1 శాతం పెరిగాయని ఒక ప్రకటనలో పేర్కొంది. వరుసగా రెండో ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించి టయోటా రికార్డులు క్రియేట్ చేసింది. సమీప ప్రత్యర్థి జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ AG కంటే మరింత ముందుందని టయోటా తెలిపింది. అనుబంధ సంస్థలైన డైహట్సు మోటార్స్ , హినో మోటార్స్‌తో సహా 2021లో 10.5 మిలియన్(కోటీకిపైగా) వాహనాల అమ్మకాలు జరిపినట్లు టయోటా వెల్లడించింది. ఫోక్స్ వ్యాగన్ అంతంతే..! 2020తో పోల్చితే గత ఏడాదిలో ఫోక్స్ వ్యాగన్ అమ్మకాల సంఖ్య భారీగా పడిపోయింది. 2020 కంటే 5 శాతం తక్కువ అమ్మకాలను 2021లో నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఫోక్స్‌వ్యాగన్ కేవలం 8.9 మిలియన్ల కార్ల అమ్మకాలను జరిపింది. గత 10 సంవత్సరాల్లో ఇదే అత్యల్పం. అమెరికన్ కంపెనీలకు భారీ షాక్..! 90 సంవత్సరాల తరువాత అమెరికాలో అత్యధికంగా అమ్ముడైన కార్ల బ్రాండ్‌గా టయోటా నిలిచింది. 2021గాను యుఎస్ ఆటోమొబైల్ మార్కెట్లలో అత్యధికంగా కార్లను విక్రయించిన కిరీటాన్ని టయోటా మోటార్స్ సొంతం చేసుకుంది. స్థానిక ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ షాకిస్తూ టయోటా మోటార్స్ గత ఏడాది అమెరికాలో అత్యధిక కార్లను సేల్ చేసింది. 2021లో సుమారు 2.332 మిలియన్ వాహనాలను టయోటా విక్రయించింది. ఇక జనరల్ మోటార్స్ గత ఏడాదిలో 2.218 మిలియన్ యూనిట్ల అమ్మకాలను జరిపింది. చదవండి: Toyota: 90 ఏళ్ల తరువాత సంచలనం సృష్టించిన టయోటా మోటార్స్..! చదవండి: నానో కారు కంటే చిన్న కారును లాంచ్ చేసిన టయోటా..! ధర ఎంతంటే..? -
ఆటో అమ్మకాలపై చిప్ ఎఫెక్ట్
ముంబై: దేశీయ ఆటో తయారీ కంపెనీల డిసెంబర్ వాహన విక్రయ గణాంకాలు మిశ్రమంగా నమోదయ్యాయి. గతేడాది చివరి నెలలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, హోండా కార్స్, ఎంజీ మోటార్స్ విక్రయాలు క్షీణించాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, నిస్సాన్, స్కోడా అమ్మకాలు మెరుగుపడ్డాయి. ఇదే డిసెంబర్లో ద్విచక్ర వాహన కంపెనీలైన హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు స్వల్పంగా క్షీణించాయి. ఆర్థిక రికవరీతో వాణిజ్య వాహనాలకు డిమాండ్ నెలకొంది. ఫలితంగా ఈ విభాగానికి చెందిన వోల్వో ఐషర్, అశోక్ లేలాండ్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం వాహన అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. ► మారుతీ గతేడాది డిసెంబర్లో దేశీయంగా 1,23,016 వాహనాలను అమ్మింది. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో (2020) లో విక్రయించిన 1,40,754 యూనిట్లతో పోలిస్తే 13 % తక్కువ గా ఉంది. 2021లో 12.14 లక్షల యూనిట్లను విక్రయించింది. ► ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో టాటా మోటార్స్ 50% వృద్ధిని నమోదు చేసింది. గతేడాది డిసెంబర్లో ఈ సంస్థ 23,545 కార్లను అమ్మగా.. 2021లో 35,299 యూనిట్లను అమ్మింది. దేశీయ ఆటో పరిశ్రమపై డిసెంబర్నూ సెమికండెక్టర్ల కొరత ప్రభావం కొనసాగింది. ప్రతికూలతల కంటే సానుకూలతలు ఎక్కువగా ఉండటంతో కొత్త ఏడాది అమ్మకాలపై ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉన్నాము. అయితే ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, సెమికండెక్టర్ల కొరత సమస్యలు పరిశ్రమకు ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలాయి. శశాంక్ శ్రీవాస్తవ మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
Festive Offer: కొత్త కారు కొనాలనుకుంటున్నారా?
పండుగ సీజన్ నడుస్తోంది. కొత్తగా కారు కొనుగోలు చేయాలని అనుకునేవాళ్లకు కొన్ని కార్ల కంపెనీలు శుభవార్త సైతం అందించాయి. కొన్ని కంపెనీ కార్ల కొనుగోలుపై భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే దసరా సీజన్ ముగియడంతో అక్టోబర్ 16 వరకే ఆఫర్లు ప్రకటించాయి కంపెనీలు. అవేంటో ఓ లుక్కేద్దాం. ►మారుతీ అల్టో కారుపై రూ.43 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. ►ఎస్ ప్రెసో కారుపై కూడా ఆఫర్ ఉంది. దీనిపై రూ.48 వేల వరకు తగ్గింపు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ►ఈకో వెహికల్‌పై కూడా తగ్గింపు పొందొచ్చు. రూ.12500 బెనిఫిట్ లభిస్తోంది. ►వేగనార్ కారుపై రూ.17500 తగ్గింపు ప్రయోజనాలు ఉన్నాయి. ►మారుతీ స్విఫ్ట్ కారుపై రూ.24,500 వరకు తగ్గింపు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ►అదే డిజైర్ కొనుగోలు చేయాలని భావిస్తే.. రూ.19,500 తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. ►వితారా బ్రెజా కారుపై రూ.17,500 తగ్గింపు బెనిఫిట్స్ ఉన్నాయి. గమనిక: ఆఫర్లో కన్సూమర్ ఆఫర్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి కలిసి ఉంటాయి. ఇకపోతే కార్లపై ఆఫర్లు అక్టోబర్ 16 వరకే అందుబాటులో ఉంటాయి. ఇంకా ప్రాంతం, కారు మోడల్, డీలర్షిప్ ప్రాతిపదికన డిస్కౌంట్ ఆఫర్లు కూడా మారతాయి. అందువల్ల కారు కొనుగోలు చేయడానికి ముందే ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. చదవండి: బయ్ వన్ గెట్ వన్ ఫ్రీ ! ఈ పాఠం తెలుసా? -
కార్ల అమ్మకాలు గప్'చిప్'
సాక్షి, అమరావతి: పండగ వేళ కొత్త కారు కొందామనుకుంటున్నారా.. ఆ కారును మీరు నడపాలంటే కనీసం 6 నుంచి 20 నెలల పాటు ఎదురు చూడాల్సిందే. ఇప్పుడు కొత్త కారు బుక్ చేస్తే కనీసం ఆరు నెలలు దాటితే కానీ డెలివరీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. గతేడాది కోవిడ్ కారణంగా దెబ్బతిన్న ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో చైనాలో తలెత్తిన సెమీ కండక్టర్ చిప్‌ల కొరత ప్రపంచ ఆటోమొబైల్ రంగాన్ని కుదిపేస్తోంది. దీంతో దసరా–దీపావళి సీజన్ అమ్మకాలపై భారీగా అంచనాలు పెట్టుకున్న రాష్ట్ర ఆటోమొబైల్ డీలర్ల ఆశలు అడియాసలయ్యాయి. ఆటోమొబైల్ అమ్మకాల్లో దసరా–దీపావళి సీజన్ అత్యంత కీలకమైనది. ఏడాది మొత్తం మీద జరిగే అమ్మకాల్లో 40 శాతం ఈ సీజన్లో జరుగుతాయి. 50 శాతం అమ్మకాలూ కష్టమే.. గతేడాది జరిగిన కార్ల విక్రయాల్లో కనీసం 50 శాతం కూడా చేరుకోలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని డీలర్లు చెబుతున్నారు. గతేడాది దసరా–దీపావళి పండుగ సీజన్లో కుశలవ హ్యూందాయ్ నాలుగు జిల్లాల్లో 570 కార్లను విక్రయించగా.. ఈ ఏడాది 400 మార్కును అందుకోవడం కూడా కష్టంగా కనిపిస్తోందని ఆ సంస్థ డైరెక్టర్ బి.వెంకటరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. చిప్‌ల కొరత కారణంగా కార్ల తయారీ సంస్థలు ఉత్పత్తిని తగ్గించేయడంతో సరఫరా నిలిపోయిందని, దీంతో ఈ సీజన్‌కు 200 కార్లను మించి సరఫరా చేయలేమని హ్యూందాయ్ సంస్థ చెబుతోందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. హ్యూందాయ్‌లో మంచి డిమాండ్ ఉన్న క్రెటా వంటి మోడల్స్‌కు వెయిటింగ్ పీరియడ్ 9–10 నెలలకు పెరిగిపోయిందన్నారు. అలాగే క్రెటా డీజిల్ వెర్షన్‌తో పాటు కొన్ని మోడల్స్‌పై బుకింగ్‌ను నిలిపివేసినట్టు తెలిపారు. గతేడాది వరుణ్ మారుతి దసరా సీజన్లో 578 కార్లను విక్రయించగా ఈ ఏడాది ఇప్పటివరకు 50 కార్లను కూడా విక్రయించలేకపోయామని ఆ సంస్థ జనరల్ మేనేజర్ రామకృష్ణ తెలిపారు. మారుతి డిజైర్, బ్రెజా, స్విఫ్ట్ వంటి మోడల్స్ సరఫరా ఆగిపోవడంతో అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని, గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 50 శాతం క్షీణిస్తాయని అంచనా వేస్తున్నట్టు వివరించారు. వచ్చే ఏడాది జనవరి వరకు సెమీ కండక్టర్ చిప్‌ల కొరత సమస్య ఉంటుందని డీలర్లు అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రూ.15.54 లక్షల కోట్ల నష్టం సెమీ కండక్టర్స్ కొరత వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమ రూ.15.54 లక్షల కోట్లు (210 బిలియన్ డాలర్లు) నష్టపోతుందని అంతర్జాతీయ సంస్థ అలెక్స్ పార్టనర్ అంచనా వేసింది. చిప్‌ల కొరత వల్ల ప్రపంచవ్యాప్తంగా 77 లక్షల యూనిట్ల ఉత్పత్తి నష్టపోనున్నట్టు తెలిపింది. మన దేశంలో కూడా కార్ల తయారీ సంస్థలు ఉత్పత్తిని 40 నుంచి 50 శాతం వరకు తగ్గించుకోవడంతో ఆ మేరకు అమ్మకాలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. దసరా–దీపావళి సీజన్లో దేశవ్యాప్తంగా 4.5 లక్షల యూనిట్ల కార్లను అమ్ముతుండగా.. అది ఈ ఏడాది 3.5 లక్షల మార్కును దాటకపోవచ్చని అంచనా వేస్తున్నారు. దేశ ఆటోమొబైల్ రంగం విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోందని, కార్లకు భారీగా డిమాండ్ ఉంటే ఉత్పత్తి లేదని చెబుతున్నారు. ఇదే సమయంలో పూర్తిస్థాయిలో ఉత్పత్తి ఉన్న ద్విచక్ర వాహనాలకు వినియోగదారుల నుంచి డిమాండ్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటోందంటూ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పండుగ సెంటిమెంట్, కార్లను తెగకొనేస్తున్నారు
ముంబై: పండుగ సీజన్ సెంటిమెంట్ కలిసిరావడంతో ఆగస్టులో వాహన విక్రయాలు పెరిగాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం,హోండా కంపెనీలు అమ్మకాల్లో స్థిరమైన వృద్ధిని కనబరిచాయి. చదవండి : ఫెస్టివల్ బొనాంజా ఆఫర్..సర్వీస్, ప్రాసెసింగ్ చార్జీల ఎత్తివేత మారుతీ సుజుకీ మొత్తం అమ్మకాలు ఐదు శాతం పెరిగి 1,30,699 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే ఆగస్ట్‌లో 1,24,624 వాహనాలను విక్రయించింది. అయితే దేశీయ విక్రయాలు 6% తగ్గి 1,10,080 యూనిట్లకు పరిమితమైంది. అంతర్జాతీయంగా సెమికండెక్టర్ల కొరత ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని కంపెనీ తెలిపింది. ఇదే నెలలో హ్యుందాయ్ మోటార్ 12 శాతం వృద్ధిని సాధించి మొత్తం 59,068 వాహనాలను విక్రయించింది. గతేడాది ఆగస్టులో 35,420 యూనిట్లు అమ్మిన టాటా మోటార్స్.., ఈ ఆగస్టులో 53 శాతం వృద్ధిని సాధించి 54,190 వాహనాలను విక్రయించింది. మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 17 శాతం పెరిగి 15,973 యూనిట్లు అమ్ముడైనట్లు కంపెనీ ప్రకటించింది. థార్, ఎక్స్‌యూవీ 300, బోలెరో నియో, బొలెరో పిక్–అప్ కార్ల బుకింగ్స్ కలిసొచ్చాయని ఎంఅండ్ఎం కంపెనీ సీఈఓ విజయ్ నాక్రా తెలిపారు. కియా మోటార్స్ ఇండియా వాహన విక్రయాలు 55 శాతం వృద్ధిని సాధించి మొత్తం 16,750 యూనిట్ల అమ్మింది. గతేడాదిలో ఇదే నెలలో విక్రయాలు 10,845 యూనిట్లు. ‘‘ఆటో కంపెనీలు పండుగ సీజన్‌ను స్థిరమైన విక్రయాలతో ప్రారంభించాయి. రానున్న రోజుల్లో కస్టమర్ల నుంచి బుక్సింగ్ మరింత పెరగవచ్చు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమికండక్టర్ల కొరత ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపుతున్న వేళ డిమాండ్‌కు తగ్గట్లు వాహనాలను అందుబాటులో ఉంచడం ఆటో పరిశ్రమకు సవాలుగా మారవచ్చు’’ అని నిస్సాన్ మోటార్ ఎండీ రాకేష్ శ్రీవాస్తవ తెలిపారు. -
2 లక్షల కార్ల సేల్, ఎక్కువగా అమ్ముడైన కార్ ఇదే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న దక్షిణ కొరియా కంపెనీ కియా భారత్‌లో రెండు లక్షల సెల్టోస్ కార్లను విక్రయించినట్టు ప్రకటించింది. కార్యకలాపాలు ప్రారంభించిన రెండేళ్లలో 1.5 లక్షల యూనిట్ల కనెక్టెడ్ కార్లను అమ్మినట్టు వివరించింది. ఇప్పటి వరకు మొత్తం 3 లక్షల పైచిలుకు కార్లు దేశంలోని కస్టమర్లకు చేరాయని తెలిపింది. సెల్టోస్ ఎస్యూవీ అమ్మకాల్లో టాప్ వేరియంట్ల వాటా 58%, ఆటోమేటిక్ ఆప్షన్ 35% ఉంది. డీజిల్ పవర్‌ట్రెయిన్ 45% వాటా కైవసం చేసుకుంది. -
ఆ..!ఇలా అయితే కార్ల ధరల్ని ఇంకా పెంచాల్సి వస్తుంది
న్యూఢిల్లీ: వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఉద్ధేశించిన తదుపరి దశ ఉద్గార నిబంధనలు వచ్చే ఏడాది నుంచి అమలులోకి వస్తే.. తయారీ కంపెనీలు వాహనాల ధరలను పెంచాల్సి వస్తుందని మారుతి సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి.భార్గవ స్పష్టం చేశారు.ఇదే జరిగితే అమ్మకాలు మరింత పడిపోతాయని,పరిశ్రమ ఇప్పటికే తీవ్ర మందగమనంలో కొట్టుమిట్టాడుతోందని గుర్తుచేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ధరలు గణనీయంగా పెరగడంతో ప్రజలు కొత్త కార్లను కొనడం కష్టంగా ఉందని అన్నారు. ‘కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫీషియెన్సీ (సీఏఎఫ్ఈ) ప్రమాణాల అమలుకు ఇది సరైన సమయం కాదని నా అభిప్రాయం. పరిశ్రమ వృద్ధి సున్నా స్థాయికి వచ్చింది. కరోనా మహమ్మారి వేళ ప్రజల ఆదాయం పెరగలేదు. ఈ నేపథ్యంలో కార్ల ధర ఇంకాస్త అధికమైతే పరిశ్రమ మరింత దిగజారుతుంది. ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే ప్రజలకు కార్లను కొనే స్తోమత తగ్గింది’ అని పేర్కొన్నారు. బీఎస్–6 ఉద్గార నిబంధనలలో పొందుపరిచిన సీఏఎఫ్ఈ రెండవ దశ ప్రమాణాలు వచ్చే ఏడాది నుంచి అమలులోకి రానున్నాయి. అమలు తేదీని 2024 ఏప్రిల్ 1 తేదీకి వాయిదా వేయాల్సిందిగా సియామ్ సైతం ప్రభుత్వానికి ఇప్పటికే విన్నవించింది. సీఏఎఫ్ఈ లక్ష్యాలను చేరుకోవడానికి వాహన సంస్థలు సమర్థవంతమైన పవర్‌ట్రెయిన్స్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చించాల్సిందే. చదవండి: గుజరాత్లో జర్మన్ బ్యాంక్, పెట్టుబడి ఎన్నివేల కోట్లంటే?! -
దూసుకెళ్తున్న వాహన విక్రయాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వాహన విక్రయాలు దూసుకెళ్తున్నాయి. గత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో కోవిడ్ లాక్డౌన్, ఆంక్షలతో వాహన విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. అయితే, ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) లాక్డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో వాహన విక్రయాలు జోరుగా జరిగాయి. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో ఏకంగా 1.60 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు జరిగాయి. ఇదే గత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో చూస్తే 1.09 లక్షల ద్విచక్ర వాహనాలు కొనుగోళ్లు జరిగాయి. అంటే 47.09 శాతం వృద్ధి నమోదైంది. కార్ల కొనుగోళ్లలో గత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంతో పోల్చితే ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో 303.20 శాతం వృద్ధి నమోదైంది. అలాగే గూడ్స్, ప్యాసింజర్ వాహనాలు, ఆటోల కొనుగోళ్లు కూడా గత ఆర్థిక ఏడాదితో పోల్చితే ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో భారీ వృద్ది నమోదైంది. ఈ ఏడాది మెరుగు గత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో కోవిడ్ లాక్‌డౌన్‌తో రవాణా రంగం ద్వారా సగానికిపైగా ఆదాయం పడిపోయింది. అయితే, ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో గత ఏడాది తొలి త్రైమాసికంతో పోల్చి చూస్తే రవాణా రంగం ఆదాయంలో 77.50 శాతం వృద్ధి నమోదైందని రవాణా శాఖ అదనపు కమిషనర్ ప్రసాదరావు తొలిపారు. గత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో రవాణా రంగం ద్వారా కేవలం రూ.367.13 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ.651.68 కోట్లు ఆదాయం వచ్చింది. కోవిడ్ తగ్గుముఖం పడితే మరింత ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు ప్రసాదరావు పేర్కొన్నారు. వ్యక్తిగత వాహనాల కొనుగోళ్లు ఇంకా పెరుగుతాయన్నారు. -
కారు.. పల్లె‘టూరు’!
కరోనా వైరస్ వాహన విక్రయాలను కాటేసింది. అమ్మకాలు దారుణంగా పడిపోవడంతో దిక్కు తోచని వాహన కంపెనీలు పల్లెబాట పట్టాయి. కరోనా కల్లోలం, ఆర్థిక మందగమనం సెగ పెద్దగా తాకని గ్రామీణ మార్కెట్లు తమను గట్టెక్కిస్తాయని వాహన కంపెనీలు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఆ ఆశలను గ్రామీణ మార్కెట్లు నెరవేర్చాయి. భవిష్యత్తుపై భరోసానిచ్చాయి. పల్లె మార్కెట్ల దన్నుతో వాహన రంగం పుంజుకుంది. గ్రామీణ మార్కెట్లలో మరింత పుంజుకోవడానికి కంపెనీలు చేసిన, చేస్తున్న ప్రయత్నాలపై ‘సాక్షి బిజినెస్’ స్పెషల్ స్టోరీ.... కరోనా మహమ్మారి వాహన రంగంపై తీవ్రమైన ప్రభావాన్నే చూపింది. లాక్డౌన్ కారణంగా టూ వీలర్లు, కార్ల అమ్మకాలు అసలే జరగలేదు. మే నెలలో ఒక్క యూనిట్ కూడా అమ్ముడవ్వలేదు. గత పదేళ్లలో వాహన విక్రయాలకు సంబంధించి అత్యంత అధ్వానమైన నెల ఇదే. లాక్డౌన్ ఆంక్షలు పాక్షికంగా సడలించిన తర్వాత అమ్మకాలు పెంచుకోవడానికి వాహన కంపెనీలు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించాయి. కరోనా కల్లోలం కారణంగా పట్టణ మార్కెట్, పట్టణాల ఆర్థిక స్థితిగతులు అస్తవ్యస్తమయ్యాయి. అయితే గ్రామాల్లో కరోనా కల్లోలం పెద్దగా లేకపోవడం, గ్రామీణ ఆర్థిక స్థితిగతులపై కరోనా కల్లోలం ప్రభావం స్వల్పంగానే ఉండటంతో వాహన కంపెనీలు అమ్మకాలు పెంచుకోవడానికి పల్లెబాట పట్టాయి. గ్రామీణులను ఆకర్షించడానికి మొబైల్ షోరూమ్స్ ఏర్పాటు చేశాయి. రూరల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకున్నాయి. ఫలించిన ప్రయత్నాలు... ఆరు నెలల కాలంలో ఈ ప్రయత్నాలు ఫలించాయి. వాహన విక్రయాలు మెల్లమెల్లగా రికవరీ అయ్యాయి. పండుగల సీజన్లో బాగా పుంజుకున్నాయి. గ్రామీణ మార్కెట్ల దన్నుతోనే వాహన విక్రయాలు కళకళలాడాయి. వాహన కంపెనీలకు భవిష్యత్తుపై భరోసాను కూడా గ్రామీణ మార్కెట్లే ఇచ్చాయి. ఇక ఇప్పుడు పట్టణ మార్కెట్లు కూడా మెల్లమెల్లగా పుంజుకుంటున్నాయి. వెయ్యి కొత్త షోరూమ్‌లు... ఆర్థిక మందగమనం కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉండటంతో దాదాపు 300కు పైగా వాహన షోరూమ్‌లు మూతపడ్డాయి. పులి మీద పుట్రలా ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా కల్లోలం కూడా జత అయింది. దీనికి లాక్డౌన్ ఆంక్షలు తోడయ్యాయి. ఫలితంగా పరిస్థితులు మరింత అస్తవ్యస్తం కావాలి. అంటే మరిన్ని షోరూమ్‌లు మూతపడాల్సి ఉంది. కానీ లాక్డౌన్ ఆంక్షలు సడలిన తర్వాత వాహన కంపెనీలు కొత్తగా వెయ్యికి పైగా రిటైల్ అవుట్‌లెట్స్‌ను ప్రారంభించాయి. వీటిల్లో అధిక భాగం గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటు కావడం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు పెంచుకోవడానికి, కొత్త కొత్త మార్కెటింగ్ వ్యూహాలు అమలు చేయడానికి టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీలకు ఆయా గ్రూప్కంపెనీల తోడ్పాటు ఇతోధికంగా ఉపయోగపడింది. టాటా మోటార్స్ కంపెనీ తన ఇతర గ్రూప్ కంపెనీలతో కలిసి జాయింట్ మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు చేసింది. వీటన్నిటి ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో టాటా మోటార్స్ వాటా 5% పెరిగి 43 శాతానికి, మహీంద్రా వాటా 6% పెరిగి 53 శాతానికి చేరాయి. మొబైల్, చిన్న షోరూమ్‌లు... టాటా మోటార్స్ కంపెనీ మొబైల్ షోరూమ్స్‌ను ఏర్పాటు చేసింది. తక్కువ వ్యయాలతోనే వీటిని ఏర్పాటు చేసి, గ్రామీణులకు టెస్ట్ డ్రైవ్ అవకాశాన్ని కల్పించింది. గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు వేగంగా విక్రయానంతర సేవలందించే నిమిత్తం వాహన కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. టాటా మోటార్స్ కంపెనీ ఒకడుగు ముందుకు వేసి జిప్ సర్వీస్ పేరుతో బైక్‌ల ద్వారా ఈ సేవలందిస్తోంది. పట్టణాల్లోని షోరూమ్‌ల్లో నాలుగో వంతు ఉండేలా చిన్న చిన్న షోరూమ్స్‌ను వాహన కంపెనీలు గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నాయి. అమ్మకాలు పుంజుకోవడానికి ఇవి బాగానే తోడ్పడ్డాయి. వాహన కంపెనీలు స్టూడియో స్టోర్స్, షోరూమ్ లైట్, ఎమర్జింగ్ మార్కెట్ అవుట్‌లెట్స్, స్మార్ట్ షోరూమ్ పేర్లతో చిన్న షోరూమ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. కియా కంపెనీ స్మార్ట్ అవుట్లెట్ పేరుతో చిన్ని చిన్న కార్ల షోరూమ్‌లను ఏర్పాటు చేస్తోంది. డిజిటల్ జోరు... కరోనా కల్లోలం కారణంగా ప్రజలు బయటకు రావడం తగ్గింది. దీంతో కార్ల కంపెనీల షోరూమ్స్ వెలవెలపోతున్నాయి. దీనిని అధిగమించడానికి హ్యుందాయ్ కంపెనీ ‘క్లిక్ టు బై’ పేరుతో డిజిటల్ షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. కారు కొనుగోలు చేయాలనుకున్న వినియోగదారుడు షోరూమ్‌కు వెళ్లకుండానే క్లిక్ టు బై డిజిటల్ షోరూమ్‌లో నచ్చిన కారును ఎంచుకొని హోమ్ డెలివరీ పొందవచ్చు. కొత్తగా మన మార్కెట్లోకి వచ్చిన కియా మోటార్స్, ఎమ్జీ మోటార్ కంపెనీలు డిజిటల్ షోరూమ్‌ల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నాయి. వినూత్నమైన స్కీమ్‌లు... ఆర్థిక మందగమనం, కరోనా కల్లోలం కారణంగా పట్టణాల్లో వాహన విక్రయాలు కుదేలయ్యాయి. చాలా మంది ఆదాయాలు తగ్గడంతో అమ్మకాల కోసం వాహన కంపెనీలు కొత్త దారులు వెదుకుతున్నాయి. ఆదాయాలు పడిపోవడంతో చాలామంది వాహనాలు కొనలేకపోతున్నారు. దీన్ని అధిగమించడానికి సబ్స్క్రిప్షన్, లేదా లీజు ద్వారా వాహన వాడకం తదితర ఆకర్షణీయ స్కీమ్‌లను వాహన కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఉద్యోగం పోయిన పక్షంలో ఈఎమ్ఐల చెల్లింపుల్లో వెసులుబాటును ఇవ్వడం వంటి వినూత్నమైన స్కీమ్‌లను వాహన కంపెనీలు అందిస్తున్నాయి. వాహన కంపెనీల పల్లెబాట ఇలా ► మహీంద్రా: ఫార్మ్ ఎక్విప్మెంట్ డివిజన్‌తో కలసి 475 కొత్త అవుట్‌లెట్స్ ఏర్పాటు. ► టాటా మోటార్స్: గ్రూప్ కంపెనీలతో కలిసి జాయింట్ మార్కెటింగ్ వ్యూహం అమలు. ► మారుతీ సుజుకీ: 12,500 రెసిడెంట్ డీలర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌ల నియామకం. ► హ్యుందాయ్: కొత్త విధానంలో షోరూమ్‌ల ఏర్పాటు, బైక్‌ల ద్వారా విక్రయానంతర సేవలు అందిస్తోంది. ► కియా మోటార్స్, ఎమ్జీ మోటార్: డిజిటల్ షోరూమ్‌ల ఏర్పాటు, సర్వీసింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యత. ► టయోటా కిర్లోస్కర్: కొత్తగా వంద సర్వీసింగ్ సెంటర్ల ఏర్పాటు. కొత్త ఏడాదిలో ధరలకు రెక్కలు..! ముంబై: కొత్త ఏడాదిలో కారు కొనడానికి సిద్ధంగా ఉన్న వినియోగదారులకు ఏడాది ప్రారంభంలోనే నిరాశ ఎదురుకానుంది. పలు కార్ల కంపెనీలు జనవరి 1 నుంచి తమ మోడళ్లపై ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించడం ఇందుకు కారణం. ఆటో రంగంలో తలెత్తిన సంక్షోభంతో పాటు కోవిడ్ ప్రేరేపిత లాక్‌డౌన్‌తో 2020లో కార్ల అమ్మకాలు, ఎగుమతులు భారీగా తగ్గిపోవడంతో వాహన కంపెనీలు తప్పనిసరిగా ధరలను పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. మారుతీ సుజుకీ...: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ‘‘గత ఏడాది కాలంగా కార్ల తయారీ వ్యయాలు పెరుగుతూ వచ్చాయి. అందుకే ఇప్పుడు ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. కస్టమర్లు ఈ భారాన్ని మోయాల్సి వస్తోంది’’ అని కంపెనీ ఎక్చ్సేంజీలకు వివరణ ఇచ్చింది. ధరల పెంపు నిర్ణయం మోడల్ ప్రాతిపదికన మారుతుందని మారుతీ సుజుకీ పేర్కొంది. అదే దారిలో ఫోర్డ్ ఇండియా కూడా... మారుతీ సుజుకీ దారిలోనే ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా కూడా వచ్చే జనవరి 1 నుంచి తన అన్ని రకాల మోడళ్లపై ధరలను ఒకశాతం నుంచి 3% వరకు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. ఆయా మోడళ్లను బట్టి ఈ పెంపు రూ.5వేల నుంచి రూ. 35 వేలు దాకా ఉండొచ్చని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ రైనా తెలిపారు. ఇన్పుట్ వ్యయాల కారణం ధరలను పెంచక తప్పడం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే 2020 ఏడాది ముగిసే లోపు బుకింగ్ చేసుకున్న వారికి ఈ ధరల సెగలు తగలవని వినయ్ వివరించారు. -
కొత్తగా కార్లు కొంటున్నవారే అధికం!
చెన్పై, సాక్షి: రుతుపవనాలు, రబీ పంటలు, చౌక రుణాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల నుంచి కార్ల విక్రయాలు పెరిగినట్లు ఆటో పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. పండుగల సందర్భంగా ఇటీవల కార్ల విక్రయాలు 10-15 శాతం స్థాయిలో్ పుంజుకున్నట్లు తెలియజేశాయి. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల నుంచి డిమాండ్ అధికంగా కనిపిస్తున్నట్లు వెల్లడించాయి. అక్టోబర్ 16న మొదలైన పండుగల సీజన్ నవంబర్ చివరి వారం వరకూ కొనసాగినట్లు తెలియజేశారు. గతేడాదితో పోలిస్తే.. ఈ పండుగల సీజన్లో 10-11 శాతం అధికంగా 2.33 లక్షల కార్లను విక్రయించినట్లు మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఇది గత 4-5 ఏళ్లలో అధికమని చెప్పారు. వీటిలో 40 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే నమోదైనట్లు వెల్లడించారు. గ్రామ ప్రాంతాల నుంచి తొలిసారి కార్లు కొంటున్నవారి వాటా 5 శాతం పెరిగి 54 శాతాన్ని తాకినట్లు తెలియజేశారు. పట్టణాలలో అయితే ఈ సంఖ్య 48 శాతానికి చేరినట్లు చెప్పారు. ప్రధానంగా ఈకో వ్యాన్లు, ఆల్టో, వ్యాగన్ ఆర్ వంటి చిన్న కార్లకు డిమాండ్ పెరిగినట్లు పేర్కొన్నారు. రేనాల్ట్ సైతం నవరాత్రి రోజులలో 5,000 కార్లు, ధన్‌తేరాస్, దీపావళిలలో 3,000 కార్లు చొప్పున విక్రయించినట్లు రేనాల్ట్ ఇండియా ప్రతినిధులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కోవిడ్-19కు ముందు స్థాయితో పోలిస్తే 50 శాతం డిమాండ్ కనిపించినట్లు తెలియజేశారు. గ్రామీణవాసులు, రైతులకు ప్రత్యేక పథకాలు ప్రకటించడంతో ఇది సాధ్యపడినట్లు వెల్లడించారు. తొలిసారి కారు కొనుగోలుదారులు, ఇతరులతో కలిపి క్విడ్, ట్రైబర్లకు డిమాండ్ పెరిగినట్లు పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే 7 శాతం పెరిగిన వర్షపాతంతో రబీ పంటల దిగుబడి 6 శాతం అధికంగా 152 మిలియన్ టన్నులకు చేరినట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీనికితోడు ప్రభుత్వం రబీ పంటలకు మద్దతు ధరను పెంచడంతో ఖరీఫలోనూ పంటలసాగు 95 మిలియన్లు పెరిగి 1100 మిలియన్ హెక్టార్లకు చేరినట్లు వివరించారు. -
కరోనా భయం.. కారే నయం!
సాక్షి, హైదరాబాద్: కరోనా పుణ్యమాని జీవనశైలిని దాని కి అనుగుణంగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలో విలాస వస్తువు ల జాబితాలో ఉన్న కారు ఇ ప్పుడు ‘అవసరం’గా మారే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ఎగువ మధ్య తరగతి ఇళ్ల ముందు తళుక్కున మెరుస్తు న్న కార్లు, ఇప్పుడు సగటు మ ధ్య తరగతి ఇళ్ల ముందూ కనిపించబోతున్నాయి. ప్రజా రవాణా, ఇతరత్రా ప్రైవేట్ వా హనాల్లో ప్రయాణం భద్రం కాదని భావిస్తున్న జనం.. కార్ల కొనుగోలుపై మోజు చూపుతున్నారు. తమ ప్రయాణ అవసరాలతో పాటు పిల్లలను ఆటోలు, బస్సుల్లో బడికి పంపడం సురక్షితం కాదని యోచిస్తున్న పలువు రు కారు కొనాలని ఫిక్స్ అయిపోతున్నారు. పది రోజుల క్రితం తెరుచుకున్న కార్ల షోరూంలకు వస్తున్న వారిని చూస్తే ఇది ఇట్టే అర్థమవుతుంది. ఇప్పుడు కార్ల కోసం ఎంక్వైరీ చేస్తున్న వారి జాబి తాలో 90% చిన్నకార్లే ఉంటున్నాయి. వీరంతా ఇంతకాలం కారును తమ పరిధిలోని వస్తువు కాదని భావించినవారే కావటం విశేషం. ఇక, ఇప్పటికే కారు ఉన్న వారు ఇంటి, ఇతర అవసరాలకు మరొకటి కొనే యోచనలో ఉన్నారు. అంతా ఆన్లైన్లోనే.. కరోనా భయంతో షో రూంలకు వెళ్లే వారి సంఖ్య బాగా తగ్గింది. దీంతో ఆయా షోరూంలు పూర్తి వివరాలను ఆన్లైన్లో ఉంచుతున్నాయి. ఈ–కొటేషన్, ఈ–బ్రోచర్, డిజిటల్ డెమో, ఈ–ఫైనాన్స్ ప్రాసెస్.. ఇలా అన్నీ వెబ్సైట్ ద్వారా చూసుకునే వీలు కల్పించాయి. కొనుగోలుదారులు ముందుగా ఆన్లైన్లోనే వాటిని పరిశీలించి.. కారు ఎంపిక చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక డిజిటల్ టెస్ట్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంది. ఆ కారు నడిపితే ఎలా ఉంటుందో ఆన్లైన్ స్క్రీన్ ముందు కూర్చుని ఆస్వాదించొచ్చు. ఆన్లైన్లో ఎప్పటికప్పుడు ఇలాంటి వాటిని కొత్త ఫీచర్లతో అం దించేందుకు వీలుగా కార్ల కంపెనీలు ప్రచార బడ్జెట్‌ను రెట్టింపు చేశాయి. ఇక ఎవరైనా కారు కొనేందుకు ఆన్లైన్లో సెర్చ్ చేయగానే, ఆ సమాచారం కార్ల కంపెనీ సిబ్బందికి చేరిపోతోంది. దీంతో కొనుగోలుదారులు సెర్చ్ చేస్తున్న చోట తమ కార్లకు సంబంధించి ఫీచర్లతో కూడిన పాపప్ కనిపించేలా చేస్తున్నారు. దాన్ని క్లిక్ చేయగానే సమగ్ర సమాచారం స్క్రీన్‌పై వస్తోంది. ఏవైనా సందేహాలుంటే అప్పటికప్పుడు నివృత్తిచేసే ఏర్పాటూ ఉంది. ఈ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటున్నాయి. ఇక కొందరు కొ నుగోలుదారులు నేరుగా షోరూంలకు వెళ్తున్నా రు. అయితే, అక్కడి నమూనా కార్లలో కూర్చుని పరిశీలించడానికి జంకుతున్నారు. అదే కారును అంతకుముందు ఎవరైనా పరిశీలించి ఉంటారనే దే ఇందుకు కారణం. దీంతో షోరూం నిర్వాహకులు కార్ల స్టీరింగులు, సీట్లు, డోర్ హ్యాండిల్స్, ఇతర ముఖ్యమైన చోట్ల తిరిగి తొలగించగలిగే పారదర్శక తొడుగులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక కొనుగోలుదారు దాన్ని పరిశీలించగానే వాటిని తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. టాప్‌గేర్‌లో బుకింగ్‌లు ► మారుతి సుజుకీ కార్లు తెలంగాణలో గత వారం రోజుల్లో దాదాపు 400 బుక్ అయ్యాయి. వీటిలో ఈనెలాఖరు వరకు 250 కార్లు డెలివరీ అవుతాయని కంపెనీ చెబుతోంది. నిత్యం సగటున 50 కార్లు బుక్ అవుతున్నట్టు చెబుతోంది. ► హ్యుందాయ్ కార్లు లాక్డౌన్ తర్వాత 250 వరకు బుక్ అయ్యాయట. రోజూ రాష్ట్రవ్యాప్తంగా 150 వరకు ఎంక్వైరీలు వస్తున్నాయనేది నిర్వాహకుల మాట. ► నేరుగా షోరూమ్‌లకు వచ్చి కార్లను పరిశీలించే వారి సంఖ్య 60 శాతానికి పడిపోయింది. ఆన్లైన్లో ఎంక్వైరీల సంఖ్య రెట్టింపైంది. ► కారును పరిశీలించిన వారిలో కొంతమందే ఫైనల్‌గా కొంటారు. అదిప్పుడు 40 శాతం అదనంగా పెరిగింది. కొత్త మార్పుకు శ్రీకారం కార్లు కొనాలనుకునే వారి సం ఖ్య పెరగబోతోంది. షోరూం లకు వచ్చేవారి తో డిస్కషన్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. టెస్ట్ కార్లలో ముఖ్యమైన చోట్ల ప్రత్యేక కవర్లు ఏర్పాటుచేస్తున్నాం. కరోనా నిబంధనలన్నీ పాటిస్తున్నాం. షో రూంలను శానిటైజ్ చేస్తున్నాం. – డీకే రాజా, డైరెక్టర్, వరుణ్ మోటార్స్ ఫైనాన్స్తోనే తంటా ప్రజా రవాణాలో ప్రయాణానికి భయపడే చాలామంది సొంత కారుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఫైనాన్స్ సంస్థలు తటపటాయిస్తుండటం సమస్యగా మారింది. త్వరలో అదీ పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం. ఫైనాన్స్‌కు క్లియరెన్స్ రాగానే ఎక్కువమంది కార్లు బుక్ చేసుకుంటారు. – అశోక్, సీఈఓ, కున్ హ్యుందాయ్ -
మారుతి కార్లు మరింత భారం..
సాక్షి, న్యూఢిల్లీ : ఆటోమొబైల్ సేల్స్ తగ్గుముఖం పడుతూ ఆర్థిక మందగమనంపై భయాలను పెంచుతుంటే వచ్చే ఏడాది జనవరి నుంచి వివిధ కార్ల మోడల్స్‌పై ధరలను పెంచనున్నట్టు మారుతి సుజుకి ప్రకటించింది. ముడిపదార్ధాల ధరలు పెరగడంతో కార్ల ధరలను పెంచడం అనివార్యమైందని వివరణ ఇచ్చిన కంపెనీ ఏ వాహనాలపై ధరలను పెంచుతుందనే వివరాలు వెల్లడించలేదు. పలు ముడిపదార్ధాల ధరలు పెరగడంతో గత ఏడాదిగా తమ వాహనాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని కార్ల ధరలు పెంచాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ మారుతి సుజుకి సెబీకి సమాచారం అందించింది. ముడిపదార్ధాల ధరలు పెరగడంతో వాహన ధరల పెంపు ద్వారా కొంత భారాన్ని వినియోగదారులపై మోపడం తప్పడం లేదని, జనవరి 2020 నుంచి వివిధ మోడల్స్‌పై పన్ను భారం విభిన్నంగా ఉంటుందని మారుతి పేర్కొంది.కాగా అక్టోబర్ మినహా ఇటీవల పలు మాసాల్లో ఆటోమొబైల్ సేల్స్ గణనీయంగా పడిపోవడం ఆటోమొబైల్ పరిశ్రమలో సంక్షోభానికి దారితీసిన సంగతి తెలిసిందే. అమ్మకాలు పడిపోవడంతో పలు దిగ్గజ కంపెనీలు కొన్ని ప్రాంతాల్లో తమ ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేసిన పరిస్థితీ ఎదురైంది. -
కారు.. పల్లె‘టూరు’
అమ్మకాలు పడిపోయి... ఆపసోపాలు పడుతున్న వాహన కంపెనీలకు వరుణుడు కరుణచూపాడు. ఈ ఏడాది వానలు కాస్త లేటయినా... దండిగానే కురవడంతో ఇప్పుడు ఆటోమొబైల్ దిగ్గజాలు ‘వర్షా’తిరేకాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పల్లెకు పోదాం.. మందగమనాన్ని తట్టుకుందాం.. అమ్మకాలు పెంచుకుందాం అని పాట పాడుతున్నాయి. గ్రామీణులను ఆకర్షించడానికి గ్రామ మహోత్సవాలను నిర్వహిస్తున్నాయి. తక్కువ వడ్డీరేట్లకు వాహన రుణాలిస్తున్నాయి. ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్లను అందిస్తున్నాయి. సర్వీసింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. వాహన కంపెనీల పల్లెబాటపై సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ... వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్‌పై మరింతగా దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఆర్థిక మందగమనం కారణంగా డిమాండ్ తగ్గి అమ్మకాలు కుదేలవడంతో వాహన కంపెనీలు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వాహన విక్రయాలు గత ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దిగజారిపోయాయి. దీంతో మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్, మహీంద్రా, టయోటా తదితర వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్లలో అమ్మకాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇక మొత్తం అమ్మకాల్లో గ్రామీణ అమ్మకాలు దాదాపు సగంగా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ 3,000కు పైగా తాలుకాల్లో సేల్స్, సర్వీసింగ్ అవుట్లెట్లను అందుబాటులోకి తెచ్చింది. అమ్మకాలు పెంచుకోవడానికి టీచర్లు, గ్రామాల్లో కుల వృత్తులు చేసే వ్యక్తులపై దృష్టి పెట్టింది. సమృద్ధిగా వర్షాలు.... గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులను ఆకర్షించడానికి వాహన కంపెనీలు గ్రామ మహోత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఈ ఉత్సవాల్లో ఆకర్షణీయమైన ఎక్సే్ఛంజ్ డీల్స్‌ను, తక్కువ వడ్డీరేట్ల ఫైనాన్స్ స్కీమ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ వర్షాకాలంలో వర్షాలు పుష్కలంగా కురియడంతో పంటలు సమృద్ధిగా పండి ఆర్థిక వ్యవస్థ త్వరితంగా రికవరీ కాగలదన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్ బాట పడుతున్నాయి. ఖరీఫ్‌లో పంటలు బాగా పండుతాయనే అంచనాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి బడ్జెట్ ప్రోత్సాహాన్నివ్వడం తదితర అంశాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వాహనాలకు డిమాండ్ పెరగగలదని కంపెనీలు భావిస్తున్నాయి. భవిష్యత్తు గ్రామీణ మార్కెట్లదే... కాగా మందగమనం కారణంగా వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్ బాట పట్టాయనడం పూర్తిగా సరైనది కాదని కొందరు నిపుణలంటున్నారు. పెద్ద నగరాల్లో కాకుండా ఇతర మార్కెట్లలో భవిష్యత్తులో అమ్మకాలు పెరుగుతాయనే అంచనాలు కూడా దీనికి కారణమని వారంటున్నారు. భవిష్యత్తు గ్రామీణ మార్కెట్లదేనని రెనో ఇండియా ఎండీ మామిళ్లపల్లి వెంకట్రామ్ అంటున్నారు. గ్రామీణ ప్రాంతాలే ముందుగా మందగమన పరిస్థితులను అధిగమిస్తాయని, ఆ తర్వాత పట్టణాలు పుంజుకుంటాయన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు రియల్టీ కుదేలైందని, ముందుగా గ్రామీణ ప్రాంతాల్లోనే రియల్టీకి డిమాండ్ పెరిగిందని, ఆ తర్వాత పట్టణాల్లో రియల్టీ రంగం పుంజుకుందని ఆయన ఉదహరించారు. ఎంక్వైరీలు పెరుగుతున్నాయి. ఇప్పటికే గ్రామీణ ప్రాంత వినియోగదారుల నుంచి ఎంౖMð్వరీలు పెరుగుతున్నాయని మారుతీ సుజుకీ ఈడీ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ కార్లకు సంబంధించి అధికంగా వివరాలు అడుగుతున్నారని, ఎంక్వైరీలు పెరగడం మార్కెట్ పునరుజ్జీవనం పొందుతుందనడానికి ఆరంభ సంకేతమని పేర్కొన్నారు. మొత్తం మారుతీ అమ్మకాల్లో గ్రామీణ ప్రాంత అమ్మకాలు 38 శాతంగా ఉంటాయి. మందగమనం కారణంగా మారుతీ సుజుకీ కంపెనీ పట్టణ అమ్మకాలు ఈ ఏడాది ఏప్రిల్–జూలై కాలంలో భారీగా తగ్గగా, గ్రామీణ ప్రాంత అమ్మకాలు 16 శాతం తగ్గాయి. గ్రామీణ మార్కెటే మెరుగు మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, పట్టణ ప్రాంతాల వ్యాపారంతో పోల్చితే గ్రామీణ వ్యాపారం ఒకింత మెరుగ్గా ఉందని హ్యుందాయ్ సేల్స్ హెడ్ వికాస్ జైన్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఈ కంపెనీ గ్రామీణ ప్రాంత అమ్మకాలు 5 శాతం మేర మాత్రమే తగ్గాయి. త్వరలోనే ఈ మార్కెట్లు పుంజుకుంటాయని, పూర్తి ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు సానుకూల వృద్ధిని సాధించగలవని ఈ కంపెనీ భావిస్తోంది. -
మోఠారెత్తిస్తున్న మాంద్యం..
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్థిక మాంద్యం తీవ్ర ప్రభావం చూపు తున్న ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి రావడానికి చింతిస్తున్నాను’ – ఇవీ సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో సీఎం కేసీఆర్ అన్న మాటలు. మాంద్యంతో పాటు జీఎస్టీ, వర్షాలతో కలిగిన నష్టం వంటి కారణాలతో కొను గోలుదారులు బెంబేలెత్తారు. ఫలితంగా వాహన విక్రయాలు మందగించడంతో పన్నుల రూపంలో రావాల్సిన మొత్తానికి గండి పడింది. దీంతో బడ్జెట్ సైతం ఆ మేరకు తగ్గిపోవడంతో సీఎం కేసీఆర్ అలా ఆవేదన వ్యక్తంచేశారు. అయితే, రాష్ట్ర రాబడి తగ్గడానికి కారణమైన అంశాల్లో వాహన పన్ను కూడా ఉంది. వాహనాల విక్రయం వల్ల వచ్చే పన్నుకు సంబంధించి కేవలం ఐదు నెలలకే ఏకంగా రూ.420 కోట్ల మేర తగ్గిపోయింది. ఇక మిగిలిన ఆర్థిక సంవత్సరంలో కూడా ఇందులో పెద్దగా మెరుగుదల ఉండే అవకాశం లేదన్న అంచనాల నేపథ్యంలో ఆ మొత్తం రూ.వేయి కోట్లకు చేరడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వల్ల వాహనాల ఉత్పత్తి భారీగా తగ్గిపోవడమే కాకుండా.. సిద్ధంగా ఉన్న వాహనాలు అమ్ముడు కాకపోవడంతో ఆ రంగం బాగా నష్టపోయిందని సీఎం కేసీఆర్ తన బడ్జెట్ ప్రసంగంలో కూడా ప్రస్తావించారు. ఫలితంగా ప్రభుత్వానికి వాహనాల విక్రయ రూపంలో రావాల్సిన పన్నుల్లో కోత పడటంతోపాటు పెట్రోలు, డీజిల్, టైర్లు, ఇతర వాహనాల విడిభాగాల అమ్మకాలు తగ్గి వాటి ద్వారా రావాల్సిన పన్ను కూడా తగ్గిపోయిందని వివరించారు. తగ్గిన అమ్మకాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు పరిస్థితి గమనిస్తే.. వాహనాల విక్రయానికి సంబంధించి ఒక్క త్రైమాసిక పన్ను తప్ప మిగిలినవన్నీ భారీగా పడిపోయాయి. గతేడాది ఇదే కాలానికి నమోదైన అంకెలతో బేరీజు వేసుకుంటే.. జీవిత పన్ను, అమ్మకపు ఫీజు, సర్వీస్ చార్జీ, తనిఖీ ఫీజు(డిటెక్షన్)ల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. ఈ ఐదు కేటగిరీల్లో గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.1,448 కోట్ల ఆదాయం సమకూరింది. సాధారణంగా ఈ మొత్తం ప్రతి ఏటా 12 శాతం నుంచి 15 శాతం మేర పెరుగుతుంది. కానీ ఈసారి మాత్రం గతేడాది కంటే 2.02 శాతం తగ్గిపోయింది. ఈ ఏడాది అదే ఐదు నెలల కాలానికి రూ.1,418 కోట్లు మాత్రమే వచ్చింది. వాస్తవానికి ఆ మొత్తం రూ.1,868 కోట్ల మేర ఉంటుందని సర్కారు అంచనా వేసింది. కానీ అనూహ్యంగా తగ్గిపోవడంతో ఆ మేరకు బడ్జెట్ ప్రభావితమైంది. ద్విచక్రవాహనాలపైనే ఎక్కువ ప్రభావం.... కార్లతో పోలిస్తే ద్విచక్ర వాహనాల రూపంలో పడ్డ ప్రభావమే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఐదు నెలల కాలానికి సంబంధించి గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 3.28 లక్షల ద్విచక్ర వాహనాలు అమ్ముడుకాగా, ఈ ఏడాది అదే కాలంలో 2.88 లక్షలకు తగ్గిపోయింది. దీంతో ఆ మేరకు ఆదాయానికి కూడా గండి పడింది. వీటిద్వారా జీవితపన్ను రూపేణా గతేడాది ఐదు నెలల కాలానికి రూ.313 కోట్లు వసూలు కాగా, ఈసారి కేవలం రూ.174 కోట్లకే పరిమితమైంది. కార్ల విషయంలో మాత్రం పెద్దగా మార్పు చోటుచేసుకోలేదు. -
సేల్స్ డౌన్ : రెండు ప్లాంట్లను మూసివేసిన మారుతి
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ విక్రయాలు పడిపోవడంతో దేశంలోనే అతిపెద్ద కారు తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 7, 9 తేదీల్లో ప్రయాణీకుల వాహనాలను రూపొందించే గురుగ్రామ్, మనేసర్ ప్లాంట్లను మూసివేయాలని మారుతి సుజుకి నిర్ణయించింది. ఈ రెండు రోజుల్లో ఉత్పత్తి కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తామని కంపెనీ బుధవారం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్కు సమాచారం అందించింది. మారుతి సుజుకి నిర్ణయంతో కంపెనీ షేర్లు 2.36 శాతం మేర నష్టపోయాయి. కాగా గత ఏడాది ఆగస్ట్‌లో మొత్తం వాహన విక్రయాలు 1,68,725 కాగా ఈ ఏడాది ఆగస్ట్‌లో అమ్మకాలు 32.7 శాతం పతనమై 1,11,370 వాహనాలకే పరిమితమయ్యాయి. మరోవైపు ఆగస్ట్‌లోనూ అన్ని కంపెనీల ఆటోమొబైల్ విక్రయాలు తగ్గడంతో ఆర్థిక మందగమనంపై ఆందోళనలు రెట్టింపయ్యాయి. -
కారు.. బేజారు!
న్యూఢిల్లీ: దేశీ వాహన రంగం ప్రతికూల వాతావరణంలో ప్రయాణిస్తోంది. వరుసగా పదో నెలలోనూ కార్ల విక్రయాలు క్షీణతను నమోదుచేశాయి. ఈ విభాగంలోనే మార్కెట్ లీడరైన మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) జూన్ దేశీ అమ్మకాలు ఏకంగా 15.3% తగ్గిపోయాయి. కంపెనీ మినీ సెగ్మెంట్ 36.2% క్షీణించింది. వినియోగదారుల సెంటిమెంట్ బలహీనపడిన నేపథ్యంలో దేశీ ఆటో పరిశ్రమ అమ్మకాల్లో తగ్గుదల నమోదవుతూనే ఉందని టయోటా కిర్లోస్కర్ మోటార్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రాజా అన్నారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం, రుతుపవనాలపై అనిశ్చితి, అధిక వడ్డీ, ద్రవ్య లభ్యత సమస్య, బీఎస్–సిక్స్ అమలు వంటి ప్రతికూల అంశాలు సెంటిమెంట్‌ను బలహీనపర్చాయన్నారు. మొత్తం ఆటో ఇండస్ట్రీ కంటే పీవీ అమ్మకాల పరంగా సెంటిమెంట్ మరింత బలహీనంగా ఉందని ఎం అండ్ ఎం ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ సెక్టార్) రాజన్ వాధేరా అన్నారు. పరిశ్రమ ఇప్పటికీ ఒత్తిడిలోనే కొనసాగుతుండగా.. మార్కెట్ మాత్రం త్వరలోనే కోలుకోవచ్చని చెప్పారు. -
కార్ల విక్రయాలు 8 శాతం డౌన్
న్యూఢిల్లీ: కస్టమర్ల నుంచి అంతగా డిమాండ్ లేకపోవడంతో ఫిబ్రవరిలో వాహనాల అమ్మకాలు తగ్గాయి. గతేడాది ఫిబ్రవరిలో 15,79,349 యూనిట్లు అమ్ముడవగా గత నెలలో 8.06 శాతం క్షీణించి 14,52,078 యూనిట్లకు తగ్గాయి. ఇక కార్ల అమ్మకాలు..గతేడాది ఫిబ్రవరిలో 2,34,632 యూనిట్లు అమ్ముడు కాగా ఈసారి 8.25 శాతం క్షీణించి 2,15,276 యూనిట్లకు పరిమితమయ్యాయి. మరోవైపు ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా 7.97 శాతం క్షీణించి 12,22,883 యూనిట్స్ నుంచి 11,25,405 యూనిట్స్‌కు తగ్గాయి. ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ సమాఖ్య ఎఫ్ఏడీఏ బుధవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ‘సంవత్సరాంతపు క్లియరెన్స్ సేల్, కొత్త మోడల్స్ లాంచింగ్‌తో జనవరిలో గణనీయంగా అమ్మకాలు జరిగాయి. కానీ నెల తిరిగేసరికి ఫిబ్రవరిలో మళ్లీ పడిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో గతనెలలోనే విక్రయాలు గణనీయంగా తగ్గాయి‘ అని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ ఆశిష్ హర్షరాజ్ కాలె తెలిపారు. సమీప భవిష్యత్‌లో ఆశావహ సూచనలేమీ కనిపించకపోతుండటంతో.. గత ఆరు నెలల నుంచి దేశీయంగా ఆటోమొబైల్స్ విక్రయాలు క్షీణ బాటలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో బీమాపరమైన వ్యయాలు భారీగా పెరిగిన దగ్గర్నుంచి ఒకదానితర్వాత మరొకటిగా అన్నీ ప్రతికూల పరిణామాలే చోటు చేసుకుంటూ ఉండటంతో వినియోగదారులు కార్ల కొనుగోలు ఆలోచనలను వాయిదా వేసుకుంటూ వస్తున్నారని ఆశిష్ చెప్పారు. మొత్తం మీద వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగా మారిందని పేర్కొన్నారు. పేరుకుపోతున్న నిల్వలు.. దేశవ్యాప్తంగా డీలర్లందరి దగ్గర వాహనాల నిల్వలు గణనీయంగా పేరుకుపోయాయని ఆశిష్ చెప్పారు. గత రెండు నెలల్లో కొంత తగ్గినప్పటికీ.. పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందని ఆయన పేర్కొన్నారు. ‘కొందరు ద్విచక్ర వాహనాల డీలర్ల దగ్గర ఆందోళనకర స్థాయిలో, కనీవినీ ఎరుగనంతగా ఏకంగా 100 రోజులకు సరిపడే స్టాక్ పేరుకుపోయింది. ఈ అంశం గురించి మేం పదే పదే చెబుతూనే ఉన్నాం. ఇక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు మొదలైనవి పెరగడంతో డీలర్ల నిర్వహణ వ్యయాలూ భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో డీలర్లు అర్జంటుగా నిల్వలను తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నారు‘ అని ఆశిష్ చెప్పారు. పరిశోధన సంస్థలకూ వాహనాల బల్క్ డేటా విక్రయం ఆటోపరిశ్రమ వృద్ధికి కొత్త విధానం ఆటోమొబైల్ రంగానికి తోడ్పాటునిచ్చే దిశగా కేంద్రం కొత్త విధానాన్ని ఆవిష్కరించింది. దీనితో ఇకపై అర్హత కలిగిన వ్యాపార సంస్థలు, వ్యక్తులు, పరిశోధకులు వాహన రిజిస్ట్రేషన్ డేటాను బల్క్‌గా కొనుగోలు చేసేందుకు వెసులుబాటు లభించనుంది. ఇందుకోసం ఏడాదికి రూ. 3 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. ‘బల్క్ డేటా అవసరమైన వ్యాపార సంస్థలు, ఇతరత్రా వ్యక్తులు 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ. 3 కోట్లు కట్టాల్సి ఉంటుంది. పరిశోధన అవసరాల కోసం విద్యా సంస్థలు తీసుకునేట్లయితే రూ. 5 లక్షలు మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. అయితే, ఆయా సంస్థలు ఈ డేటాను కచ్చితంగా అంతర్గతంగానే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది’ అని ‘బల్క్ డేటా షేరింగ్ విధానం, ప్రక్రియ’ నిబంధనల్లో పేర్కొన్నారు. డేటాను అన్ని వర్గాలకు అందుబాటులోకి తేవడంతో సర్వీసులు మెరుగుపడేందుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
టాప్ గేర్‌లో మారుతీ డిజైర్
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) ఏడాదిన్నర కిందట విడుదల చేసిన డిజైర్ అప్డేటెడ్ వెర్షన్ అమ్మకాల్లో మరో మైలురాయిని అధిగమించింది. సరిగ్గా 17 నెలల కిందట మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన ఈ సబ్ కాంపాక్ట్ సెడాన్ కారు అమ్మకాలు 3 లక్షలు మించినట్లు కంపెనీ ప్రకటించింది. గతేడాది మే నెలలో మూడవ జనరేషన్ డిజైర్‌గా మార్కెట్లో విడుదలైన ఈ కారు.. అంతకుముందు వెర్షన్ కంటే 28 శాతం అధిక అమ్మకాలతో దూసుకుపోతున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (మార్కెటింగ్, సేల్స్) ఆర్.ఎస్. కల్సి చెప్పారు. మొత్తం సేల్స్‌లో 25 శాతం అమ్మకాలు నూతన ఫీచర్లు కలిగిన హైఎండ్ కార్లు కాగా.. దాదాపు 20 శాతం అమ్మకాలు ఆటోమేటిక్ వేరియంట్‌వి ఉన్నట్లు వెల్లడించారు. -
పాతదే.. అయినా కొత్తగా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : రోజుకో కొత్త మోడల్ కారు.. ఆకట్టుకునే టెక్నాలజీ.. అబ్బురపరిచే డిజైన్.. ఇలాంటివి చూస్తే సహజంగానే కుర్రకారు ఏం చేస్తారు? తమ చేతుల్లోకీ ఆ కారు రావాలని కోరుకుంటారు. ఈ కారణంగానే తక్కువ కాలం వినియోగానికే కార్లు చేతులు మారుతున్నాయి. ఈ ట్రెండ్ కొత్తగా కారు కొనేవారికి కలిసివస్తోంది. ఎంచక్కా తక్కువ ధరకే కారును సొంతం చేసుకుంటున్నారు. కొత్త కార్లు ఏటా 30 లక్షల యూనిట్లు రోడ్డెక్కితే, పాతవి ఏకంగా 37 లక్షల యూనిట్లు అమ్ముడవుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. కొత్తవారే ఎక్కువ.. పాత కార్లను కొంటున్న వారిలో 65 శాతం మంది కొత్త కస్టమర్లే. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకోవడం, తక్కువ ధరలో వాహనం రావడంతోపాటు తమ బడ్జెట్లో మరింత మెరుగైన మోడల్, పెద్ద కారు వస్తుందని కస్టమర్లు భావిస్తున్నారు. ప్యాసింజర్ వాహన విపణిలో 70–75 శాతం మంది ఫైనాన్స్ ద్వారానే కొనుగోళ్లు జరుపుతున్నారు. అవ్యవస్థీకృత రంగంలో సెకండ్ హ్యాండ్ కారుకు రుణం రావడం చాలా క్లిష్టమైంది. అదే బ్రాండెడ్ ప్రీ–ఓన్డ్ షోరూంలలో రుణం చాలా సులువు. అలాగే పాత కారుకు 100–120 రకాల నాణ్యతా పరీక్షలు చేసి కొత్త రూపు తీసుకొస్తారు. ఆర్గనైజ్డ్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందడానికి ఈ అంశాలే కారణం. త్వరగా మార్చేస్తున్నారు.. నాలుగైదేళ్ల క్రితం వరకు సగటున ఆరేళ్లకు వాహనాన్ని మార్చేసి కొత్తది తీసుకునేవారు. ఇప్పుడు నాలుగు/నాలుగున్నరేళ్లకే మారుస్తున్నారని మహీంద్రా ఫస్ట్‌చాయిస్ ఎండీ నాగేంద్ర పల్లె సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ప్రీమియం కార్ల విషయంలో ఇంకా తక్కువ కాలానికే కారుకు గుడ్‌బై చెప్పేస్తున్నారని అన్నారు. అమ్ముడవుతున్న 10 పాత కార్లలో ఏడు రూ.4 లక్షల లోపు ధరవే ఉంటే, కొత్త కార్ల విషయంలో 10లో ఎనిమిది రూ.8 లక్షలలోపు ధరలో ఉంటున్నాయట. పెద్ద, ఖరీదైన కార్లవైపు కస్టమర్లకు ఆసక్తి పెరిగిందని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ అరుణ్ మల్హోత్రా తెలిపారు. వీరిని కొత్త టెక్నాలజీ ఊరిస్తోందని, నూతనతరం మోడళ్ల ప్రయోజనాలను అందుకోవాలన్న ఆసక్తి ఉంటోందని గుర్తుచేశారు. హైస్ట్రీట్‌లో సైతం.. ఒకప్పుడు గల్లీలు, చిన్నరోడ్లలో పాత కార్ల విక్రయ కేం ద్రాలు, పార్కింగ్ సెంటర్లు ఉండేవి. ఇప్పుడు బ్రాండెడ్ కార్ల షోరూంలకు దీటుగా అద్దెలు అధికంగా ఉండే హైస్ట్రీట్లకూ ఇవి విస్తరించాయి. హైదరాబాద్‌లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో కొత్త కొత్త కేం ద్రాలు వెలుస్తుండటం ఇందుకు నిదర్శనం. కస్టమర్‌తో నేరు గా బేరమాడేందుకు వీలవడం, ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉండటంతో పార్కింగ్‌కు మొగ్గుచూపేవారూ ఉన్నారు. ఇదీ వాహన మార్కెట్.. దేశవ్యాప్తంగా ఏటా 30 లక్షల కొత్త కార్లు అమ్ముడవుతున్నాయి. పాత కార్ల విక్రయాలు 37 లక్షల యూనిట్లు దాటాయి. అయిదేళ్లలో ప్రీ–ఓన్డ్ మార్కెట్ 70 లక్షల యూనిట్లకు చేరుకుంటుందని మహీంద్రా ఫస్ట్ చాయిస్ చెబుతోంది. యూజ్డ్ కార్ల విపణిలోకి దాదాపు అన్ని వాహన తయారీ కంపెనీలు ప్రవేశించాయి. వ్యవస్థీకృత రంగం వాటా 15 శాతం ఉంది. మొత్తం పరిశ్రమ వృద్ధి 15 శాతం ఉంటే, ఆర్గనైజ్డ్ మార్కెట్ ఏకంగా 25–30 శాతం వృద్ధి చెందుతోంది. వారంటీ, ఉత్తమ సర్వీస్ ఉన్న కారణంగా కస్టమర్లు బ్రాండెడ్ యూజ్డ్ కార్ల షోరూంలకు రావడం పెరిగిందని వరుణ్ మోటార్స్ ఎండీ వరుణ్‌దేవ్ తెలిపారు. వ్యవస్థీకృత రంగానికి జీఎస్టీ దెబ్బ.. పాత కారు చేయి మారితే ఎటువంటి పన్ను పడటం లేదు. ఇది అవ్యవస్థీకృత రంగంలో ఉన్న విక్రేతలకు కలిసి వస్తోంది. అదే బ్రాండెడ్ ప్రీ–ఓన్డ్ కార్ల వ్యాపారంలో ఉన్న కంపెనీలు మాత్రం వాహనాన్నిబట్టి మార్జిన్ మీద 29–51 శాతం జీఎస్టీ కట్టాల్సి వస్తోంది. జీఎస్టీకి పూర్వం ఉన్నట్టుగానే మార్జిన్ మీద 10–12 శాతం మాత్రమే పన్ను వ్యాట్ ఉండాలని పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరుతోంది. -
ఓఎల్ఎక్స్లో ప్రకటనే పెట్టుబడి!
సాక్షి, సిటీబ్యూరో: తేలికపాటి వాహనాలను విక్రయిస్తానంటూ ఈ–కామర్స్ సైట్ ఓఎల్ఎక్స్లో తప్పుడు ప్రకటనలు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్న రాజమహేంద్రవరం వాసిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతగాడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక మందిని మోసం చేసినట్లు డీసీపీ అవినాష్ మహంతి మంగళవారం వెల్లడించారు. ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన ఎం.వినోద్ కొన్నాళ్ల క్రితం ఓఎల్ఎక్స్లో ఓ నకిలీ ప్రకటన పెట్టాడు. వివిధ రకాల తేలికపాటి వాహనాలకు తక్కువ రేటుకు అమ్ముతానంటూ అందులో పొందుపరిచాడు. ఆసక్తి చూపి ఎవరైనా సంప్రదిస్తే బేరసారాల తర్వాత ఓ రేటు ఖరారు చేసేవాడు. ఆపై అడ్వాన్స్‌గా కొంత మొత్తం తన బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయించుకుని మోసం చేసేవాడు. నగరంలోని ఫిల్మ్‌నగర్ ప్రాంతానికి చెందిన జ్యోతి ప్రకాష్ ఇటీవల సెకండ్ హ్యాండ్ ఫోర్ వీలర్ ఖరీదు చేయాలని భావించారు. దీనికోసం ఆయన ఓఎల్‌ఎక్స్‌ను ఆశ్రయించారు. అందులో 2014 మోడల్‌కు చెందిన మారుతి స్విఫ్ట్ కారును రూ.3.6 లక్షలకు విక్రయిస్తానంటూ ఉన్న ప్రకటన ప్రకాష్‌ను ఆకర్షించింది. అందులో పేర్కొన్న ఫోన్ నంబర్‌ను సంప్రదించగా.. సూరిబాబు పేరుతో వినోద్ మాట్లాడాడు. బేరసారాల తర్వాత రూ.3 లక్షలకు కారు అమ్మేందుకు అంగీకరించాడు. అడ్వాన్స్‌గా రూ.60 వేలు చెల్లించాలని, కారు డెలివరీ అయిన తర్వాత మిగిలిన మొత్తం ఇవ్వాలని చెప్పాడు. దీనికి అంగీరించిన ప్రకాష్ ఆ మొత్తాన్ని వినోద్ చెప్పిన బ్యాంకు ఖాతాలో రెండు దఫాల్లో డిపాజిట్ చేశారు. ఈ ఖాతాలు సీహెచ్ శ్రావణి పేరుతో ఉన్నాయి. అడ్వాన్స్ డబ్బు చెల్లించిన తర్వాత వాహనం డెలివరీ విషయానికి సంబంధించి ప్రకాష్ అనేకసార్లు సూరిబాబుగా చెప్పుకొన్న వినోద్‌తో సంప్రదించే ప్రయత్నం చేశారు. వినోద్ అతడి కాల్స్‌ను నిర్లక్ష్యం చేయడంతో పాటు తన ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు.. ఈ నెల 2న సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ టీమ్ ఇన్స్పెక్టర్ జి.శంకర్రాజు నేతృత్వంలో ఎస్సైలు రమేష్, మధుసూదన్ దర్యాప్తు చేశారు. బ్యాంకు ఖాతా వివరాలతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి రాజమహేంద్రవరానికి చెందిన వినోద్ నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. విచారణ నేపథ్యంలో వినోద్‌పై తెలుగు రాష్ట్రాల్లోని ధవళేశ్వరం, ఏలూరు, పడమటిలంక, ఆలేరు ఠాణాల్లోనూ ఇదే తరహా మోసాలకు సంబంధించి కేసులు ఉన్నట్లు గుర్తించారు. తరచు సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలు మార్చే అలవాటున్న ఇతగాడు ఇంకా అనేక మందికి మోసం చేసినట్లు అనుమానిస్తున్నారు. -
సంతకాలు ఫోర్జరీ చేసి కారు అమ్మేశాడు
గుంటూరు : నమ్మి మోసపోయాం...మోసగాళ్లపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ అర్బన్ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన బాధితులు ఎస్పీ విజయారావును వేడుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని అర్బన్‌ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ జరిగింది. ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయం జరిగేలా చూస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు. బాధితుల సమస్యలు కొన్ని వారి మాటల్లోనే..... బోర్డు తిప్పేసిన కోచింగ్ సెంటర్ బ్రాడీపేట 4వలైనులో 9నెలల క్రితం ఓ కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. నిర్వాహకుడు ఉదయభానుకు కోచింగ్ నిమిత్తం రూ.20 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాం. నా మాదిరిగానే మరో 19 మంది విద్యార్థులు డబ్బు చెల్లించారు. రాత్రికి రాత్రి బోర్డు తిప్పి పరారయ్యాడు. ఫోన్ చేస్తే సమాధానం లేదు. విచారించి న్యాయం చేయాలి. – తల్లిదండ్రులతో విష్ణుప్రియ, అరండల్‌పేట, గుంటూరు సంతకాలు ఫోర్జరీ చేసి కారు అమ్మేశాడు నరసరావుపేటకు చెందిన కాళంగి నాగేశ్వరరావుకు మారుతీ కారును కంటిన్యూ ఫైనాన్స్ పద్ధతిపై ఫైనాన్స్ చెల్లించేలా మాట్లాడుకొని కారును తొమ్మిది నెలల క్రితం విక్రయించాం. ఫైనాన్స్ చెల్లించపోగా, ఫోర్జరీ సంతకాలతో మా ప్రమేయం లేకుండానే కారును అమ్మినట్టు తెలిసింది. గట్టిగా నిలదీస్తే మీకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నాడు. ఫైనాన్స్ వారు డబ్బు చెల్లించాలంటూ మాపై వత్తిడి చేస్తున్నారు. విచారించి నారాయణపై చర్యలు తీసుకోండి. – మేడిపల్లి వెంకటేష్, సునీత దంపతులు, చుట్టుగుంట, గుంటూరు -
వాహనాలకు బ్రేకులు
న్యూఢిల్లీ: ఈ పండుగ సీజన్ ఓ మోస్తరు అమ్మకాలతో.. ప్యాసింజర్ వాహనాల కంపెనీలకు పెద్దగా కలిసిరాలేదు. గతేడాది అక్టోబర్‌తో 2,89,677 వాహనాల విక్రయాలతో పోలిస్తే.. ఈసారి అక్టోబర్‌లో అమ్మకాలు స్వల్పంగా క్షీణించి 2,79,837కి పరిమితమయ్యాయి. కంపెనీలన్నీ నిల్వలను సర్దుబాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉండటమే ఇందుకు కారణం. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫాక్చరర్స్ (సియామ్) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కార్ల అమ్మకాలు గత అక్టోబర్‌లో 1,95,036 యూనిట్లతో పోలిస్తే ఈసారి 5.32 శాతం క్షీణించి 1,84,666 యూనిట్లకే పరిమితమయ్యాయి. ఈ ఏడాది జూన్‌లో నమోదైన 11.24 శాతం తగ్గుదల అనంతరం.. మళ్లీ క్షీణత నమోదు కావడం నాలుగు నెలల తర్వాత ఇదే తొలిసారి. ‘పండుగ సీజన్ ఇంకా కాస్త మెరుగ్గా ఉండేదేమో.. అయితే ప్రస్తుత పరిస్థితి మార్కెట్ సెంటిమెంటును ప్రతిబింబిస్తుందని అనుకోవడానికి లేదు. ఇది తాత్కాలికమైన తగ్గుదల మాత్రమే. తయారీ సంస్థలు తమ దగ్గరున్న స్టాక్‌ను సర్దుబాటు చేసుకుంటూ ఉండటమే అమ్మకాలు తగ్గడానికి కారణం‘ అని సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్ చెప్పారు. జూలై నుంచి సెప్టెంబర్ దాకా పండుగల సీజన్ కోసం తయారీ కంపెనీలు.. డీలర్ల దగ్గర స్టాకును గణనీయంగా ఉంచిన నేపథ్యంలో అక్టోబర్‌లో వాహనాల డిస్పాచ్‌ను తగ్గించాయన్నారు. తగ్గిన మొత్తం విక్రయాలు.. మిగతా కేటగిరీల్లో సైతం అమ్మకాలు తగ్గడంతో మొత్తం విక్రయాలు 22,01,489 యూనిట్ల నుంచి 21,62,164 యూనిట్లకు పడిపోయింది. ఇది 1.79 శాతం క్షీణత. ఈ ఏడాది జనవరి తర్వాత అన్ని వాహనాల అమ్మకాలు క్షీణించడం ఇదే ప్రథమం. అక్టోబర్‌లో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 3.5 శాతం క్షీణించి 11,44,512 నుంచి 11,04,498కి తగ్గాయి. వాణిజ్య వాహనాల మొత్తం అమ్మకాలు మాత్రం 6 శాతం పెరిగి 69,793 యూనిట్లుగా నమోదయ్యాయి. -
వాహన విక్రయాలు జంప్
న్యూఢిల్లీ : దేశీయ ప్యాసెంజర్ వాహన విక్రయాలు 11.32 శాతం పైకి జంప్ చేశాయి. గతేడాది సెప్టెంబర్ నెలలో 2,78,428 యూనిట్లుగా ఉన్న ఈ విక్రయాలు, ఈ ఏడాది ఇదే నెలలో 3,09,955 యూనిట్లుగా నమోదయ్యాయి. కారు అమ్మకాలు కూడా 6.86 శాతం పెరిగాయి. 1,95,259 యూనిట్ల నుంచి 2,08,656 యూనిట్లకు పెరిగినట్టు సియామ్ డేటాలో వెల్లడైంది. మోటార్ సైకిల్ విక్రయాలు కూడా గత నెలలో 6.98 శాతం పెరిగాయని, 2016 సెప్టెంబర్‌లో 11,86,759 యూనిట్లుగా ఉన్న ఈ విక్రయాలు 12,69,612 యూనిట్లకు పెరిగినట్టు తెలిసింది. మొత్తం టూ-వీలర్ అమ్మకాలు 9.05 శాతం వృద్ధి సాధించి 20,41,024 యూనిట్లగా నమోదయ్యాయి. కమర్షియల్ వాహనాల విక్రయాలు భారీగా 25.27 శాతం పెరిగి 77,195 యూనిట్లగా నమోదైనట్టు సియామ్ డేటాలో తెలిసింది. -
టాప్ గేర్‌లో వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి పలు వాహన కంపెనీల వార్షిక వాహన విక్రయాలు మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జోరుగా నమోదయ్యాయి. మారుతీ మొత్తం వాహన విక్రయాలు 9.8 శాతం వృద్ధితో 15,68,603 యూనిట్లకు చేరాయి. దేశీ అమ్మకాలు 10.7 శాతం వృద్ధితో14,44,541 యూనిట్లకు పెరిగాయి. హ్యుందాయ్ వాహన విక్రయాల్లో 5.2 శాతం వృద్ధి నమోదైంది. నిస్సాన్ వాహన అమ్మకాలు ఏకంగా 45 శాతం వృద్ధితో 57,315 యూనిట్లకు పెరిగాయి. టాటా మోటార్స్ వాహన విక్రయాల్లో 6 శాతం వృద్ధి నమోదైంది. రెనో వాహన అమ్మకాలు ఏకంగా 88.4 శాతం వృద్ధితో 1,35,123 యూనిట్లకు పెరిగాయి. కాగా కేవలం మార్చి నెలలో మారుతీ దేశీ వాహన అమ్మకాలు 7.7 శాతం వృద్ధితో 1,27,999 యూనిట్లకు పెరిగాయి. ఇదే నెలలో హోండా కార్స్ దేశీ వాహన విక్రయాల్లో 8.7 శాతం వృద్ధి నమోదైంది. ఫోర్డ్ ఇండియా దేశీ వాహన విక్రయాలు 15 శాతం వృద్ధితో 8,700 యూనిట్లకు చేరుకున్నాయి. -
కార్లకు శుభకాలం.. టూవీలర్స్‌కు గడ్డుకాలం
న్యూఢిల్లీ : డీమానిటైజేషన్ కాలంలో కార్ల విక్రయాలు పెరిగాయని, టూవీలర్స్ అమ్మకాలు తగ్గాయని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభకు తెలిపారు. నవంబర్, డిసెంబర్లు చాలా కఠినమైన నెలలని, కానీ డిసెంబర్ నెలలో ప్రత్యక్ష, పరోక్ష పన్నులు విపరీతంగా పెరిగినట్టు అరుణ్ జైట్లీ చెప్పారు. డీమానిటైజేషన్ తర్వాత లక్షల, కోట్ల నగదు, ఆర్బీఐకు తిరిగి వచ్చిందని పేర్కొన్నారు. ఎక్కువ క్యాష్ ఉన్న ఆర్థికవ్యవస్థలో మనం ఉన్నామని, ఇది పన్ను ఎగవేతకు, అవినీతికి, సమాంతర ఆర్థికవ్యవస్థకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. జీఎస్టీ అమలు తర్వాత దేశంలో మంచి, సమర్థవంతమైన పన్ను వ్యవస్థను రూపొందించవచ్చని అభిప్రాయం వ్యక్తంచేశారు. మౌలిక సదుపాయాలకు రూ.3,96,000 కోట్లను, రైల్వే భద్రతా ఫండ్‌గా రూ.1,00,000 కోట్లను వెచ్చించినట్టు తెలిపారు. ద్రవ్యోల్బణం టార్గెట్ 4 శాతంగా ఆర్బీఐ నిర్దేశించుకుందని, ప్రస్తుతం మనం 3.6 శాతంలో ఉన్నట్టు లోక్‌సభలో చెప్పారు. -
అగ్రస్థానం నుంచి దిగిన టయోటా
గత ఏడాది ఫోక్స్ వ్యాగన్దే టోక్యో: ప్రపంచవ్యాప్తంగా అధికంగా కార్ల విక్రయిస్తున్న కంపెనీ ఖ్యాతిని జపాన్‌కు చెందిన టయోటా కోల్పోయింది. గత ఏడాది కార్ల విక్రయాల్లో అగ్ర స్థానాన్ని ఫోక్స్‌వ్యాగన్ చేజిక్కించుకుంది. పర్యావరణ నిబంధనలకు సంబంధించి మోసానికి పాల్పడి అపఖ్యాతి పాలయినప్పటికీ, జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్‌కు ఈ అగ్రస్థానం దక్కడం విశేషం. గత ఏడాది తమ కార్ల అమ్మకాలు 3.8 శాతం పెరిగాయని ఫోక్స్‌వ్యాగన్ తెలిపింది. 2015లో 99.3 లక్షలకు పడిపోయిన తమ అమ్మకాలు గత ఏడాది 1.03 కోట్లకు పెరిగాయని, చైనాలో విక్రయాలు జోరుగా ఉన్నాయని వివరించింది. కాగా టయోటా కంపెనీ గత ఏడాది తమ అమ్మకాలు 0.2 శాతం వృద్ధితో 1.01 కోట్లకు పెరిగాయని పేర్కొంది. -
డిసెంబర్లో వాహన విక్రయాలు డౌన్
న్యూఢిల్లీ : డిసెంబర్ నెలలో వాహన విక్రయాలు డౌన్ అయ్యాయి. 2015 డిసెంబర్ కంటే 2016 డిసెంబర్ నెలలో దేశీయంగా ప్యాసెంజర్ వెహికిల్ విక్రయాలు 1.36 శాతం పడిపోయి 2,27,824 యూనిట్లుగా నమోదయ్యాయి. గత కాలంలో ఇవి 2,30,959 యూనిట్లగా ఉన్నాయి. అదేవిధంగా దేశీయ కార్ల విక్రయాలు కూడా 8.14 శాతం పడిపోయి డిసెంబర్ నెలలో 1,58,617 యూనిట్లు అమ్ముడుపోయినట్టు దేశీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం సియామ్ తెలిపింది. మోటార్ సైకిల్ విక్రయాలు 22.5 శాతం క్షీణించి 5,61,690 యూనిట్లగా నమోదైనట్టు, టూవీలర్ వాహన అమ్మకాలు 22.04 శాతం పడిపోయి 9,10,235 యూనిట్లని పేర్కొంది. 2015 డిసెంబర్ నెలలో మోటార్ సైకిల్ విక్రయాలు 7,24,795 యూనిట్లగా, టూవీలర్ విక్రయాలు 11,67,621 యూనిట్లగా ఉన్నట్టు సియామ్ వెల్లడించింది. వాణిజ్య వాహనాల అమ్మకాలు కూడా పడిపోయినట్టు సియామ్ తెలిపింది. -
డిసెంబర్లో వాహన విక్రయాలు మిశ్రమం
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత రెండో నెల గతేడాది డిసెంబర్లో వాహన విక్రయాలు మిశ్రమంగా ఉన్నాయి. దేశీయ అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి విక్రయాలు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనట్టుగా డిసెంబర్లో ఒక శాతం క్షీణించాయి. అదే సమయంలో నిస్సాన్ కార్ల అమ్మకాలు 21 శాతం పెరిగాయి. ఐషర్ మోటార్స్‌కు చెందిన ద్విచక్ర వాహన బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయాలు సైతం 42 శాతం వృద్ధి చెందాయి. మారుతీ దేశీయ విక్రయాలు 4.4 శాతం క్షీణత 2016 డిసెంబర్ నెలలో మారుతి సుజుకి ఇండియా ఎగుమతులతో కలుపుకొని 1,17,908 వాహనాలను విక్రయించింది. అంతకుముందు సంవత్సరం ఇదే నెలలో విక్రయాలు 1,19,149తో పోలిస్తే 1% తగ్గాయి. దేశీయ విక్రయాలను చూస్తే 4.4% తగ్గాయి. 1,06,414 వాహనాలు అమ్ముడుపోయా యి. చిన్న కార్ల శ్రేణిలో ఆల్టో, వ్యాగన్ ఆర్ మోడళ్లు 15.3% తక్కువగా 37,234 అమ్ముడుపోయాయి. నిస్సాన్ విక్రయాలు ఆశాజనకం: గత డిసెంబర్ నెలలో నిస్సార్ మోటార్ ఇండియా 21% అధికంగా 3,711 వాహనాలను విక్రయించింది. రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు... 57,398 డీమోనిటైజేషన్ ప్రభావం ఉన్నప్పటికీ ఐషర్ మోటార్స్‌కు చెందిన ద్విచక్ర వాహన విభాగం రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయాలు మెరుగ్గా నమోదయ్యాయి. డిసెంబర్లో 42 శాతం అధికంగా 57,398 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2015 డిసెంబర్లో విక్రయాలు 40,453గానే ఉన్నాయి. ఎగుమతులు సైతం భారీగా పుంజుకున్నాయి. 160 శాతం అధికంగా 1,082 వాహనాలను కంపెనీ ఎగుమతి చేసింది. ఏప్రిల్–డిసెంబర్ కాలంలో విక్రయాలు 36 శాతం అధికంగా 4,88,262గా నమోదైనట్టు కంపెనీ తెలిపింది. -
దెబ్బకొట్టినా.. పొగుడుతున్న మెర్సిడెస్ బెంజ్
గౌహతి : లగ్జరీ కార్ల తయారీదారి మెర్సిడెస్ బెంజ్‌కు పెద్ద నోట్ల రద్దు భారీగానే దెబ్బకొట్టినప్పటికీ, ఈ ప్రక్రియను తాము అభినందిస్తున్నామని వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ఉన్న షోరూంలకు విచ్చేసే కస్టమర్ల సంఖ్యపై ప్రభావం చూపిందని, నవంబర్ నెలలో ఈ సంఖ్య దాదాపు 60 శాతం పడిపోయిందని ఈ కంపెనీ తెలిపింది. అయితే తాము పెద్ద నోట్ల రద్దు ప్రక్రియను స్వాగతిస్తున్నామని, నగదుకు కార్లను విక్రయించడం తమ పాలసీ కాదని ఆ కంపెనీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ రోలాండ్ ఫోల్గర్ చెప్పారు. పెద్ద నోట్లను ప్రభుత్వం రద్దుచేయడం తమ షోరూంలకు వచ్చే కస్టమర్ల సంఖ్యపై స్వల్పకాలంలోనే ప్రభావం చూపుతుందని, వచ్చే నెల లేదా రెండు నెలలో పరిస్థితి కుదుటపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కేంద్రప్రభుత్వం పాలసీ నిర్ణయం ప్రజలపై భావోద్వేగ ప్రభావాన్ని చూపిందని, దీంతో వారు కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేశారని చెప్పారు. 99 శాతం మెర్సిడెస్ బెంజ్ ఇండియా కార్ల అమ్మకాలు ఫైనాన్స్ ద్వారానే జరుగుతున్నట్టు పేర్కొన్నారు. డీలర్ లెవల్లో కొంతశాతంలో మాత్రమే నగదు లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. పెద్ద నోట్లను రద్దైన రాత్రి చాలామంది కస్టమర్లు పెద్దపెద్ద నగదు బ్యాగులతో షోరూంలకు వచ్చినట్టు డీలర్స్ ద్వారా తమకు సమాచారం అందిందని, అయితే డీలర్స్ అమ్మకాలు నిర్వహించవద్దని ఆదేశించినట్టు తెలిపారు. దేశ రాజధాని పరిధిలో పెద్ద డీజిల్ వాహనాలపై నిషేధం విధించడం తమ కంపెనీ అమ్మకాలు ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో పడిపోతాయని అంచనావేస్తున్నట్టు పేర్కొన్నారు. జర్మన్ ఆటో దిగ్గజం మెర్సిడెస్ బెంజ్‌కు సబ్సిడరీగా భారత్‌లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
కార్ల విక్రయాల్లో స్వల్ప వృద్ధి
• ప్యాసెంజర్ వాహన అమ్మకాలు 4% అప్ • సియామ్ గణాంకాల వెల్లడి న్యూఢిల్లీ: దేశీ కార్ల విక్రయాలు అక్టోబర్ నెలలో స్వల్ప వృద్ధితో 1,94,158 యూనిట్ల నుంచి 1,95,036 యూనిట్లకు పెరిగారుు. దేశీ ప్యాసెంజర్ వాహన విక్రయాలు 4 శాతం పెరిగారుు. సియామ్ గణాంకాల ప్రకారం.. ప్యాసెంజర్ వాహన అమ్మకాలు గత నెలలో 2,80,766 యూనిట్లుగా నమోదయ్యారుు. గతేడాది ఇదే నెలలో వీటి విక్రయాలు 2,68,630 యూనిట్లుగా ఉన్నారుు. ‘పండుగ సీజన్ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో కార్ల కంపెనీలు వినియోగదారుల కోసం అధిక స్టాక్‌ను అందుబాటులో ఉంచారుు. అక్టోబర్‌లో ఇలాంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా గత నెలలో కంపెనీల వద్ద ఉన్న స్టాక్‌ను సర్దుబాటు చేశారుు. దీని ఫలితం తాజా విక్రయాలపై కనిపించింది’ అని సియామ్ డెరైక్టర్ జనరల్ విష్ణు మాథుర్ తెలిపారు. ⇔ మారుతీ సుజుకీ కార్ల విక్రయాలు 5 శాతం క్షీణతతో 97,951 యూనిట్ల నుంచి 92,886 యూనిట్లకు తగ్గారుు. ⇔ హ్యుందాయ్ దేశీ కార్ల విక్రయాల్లో 4 శాతం వృద్ధి నమోదరుు్యంది. ఇవి 39,709 యూనిట్ల నుంచి 41,126 యూనిట్లకు పెరిగారుు. ⇔ మహీంద్రా అమ్మకాలు 3 శాతం వృద్ధితో 22,664 యూనిట్ల నుంచి 23,399 యూనిట్లకు ఎగశారుు. ⇔ మొత్తం టూవీలర్ విక్రయాలు 18,00,672 యూనిట్లుగా నమోదయ్యారుు. వార్షిక ప్రాతిపదికన చూస్తే 9 శాతం వృద్ధి నమోదరుు్యంది. ⇔ హీరో మోటొకార్ప్ బైక్ విక్రయాలు 8 శాతం వృద్ధితో 5,21,118 యూనిట్ల నుంచి 5,61,427 యూనిట్లకు పెరిగారుు. దీని స్కూటర్ల అమ్మకాలు 88,790 యూనిట్లుగా ఉన్నారుు. ⇔ బజాజ్ ఆటో మోటార్‌సైకిల్ అమ్మకాలు 5 శాతం ఎగశారుు. ఇవి 2,02,042 యూనిట్ల నుంచి 2,12,997 యూనిట్లకు చేరారుు. ⇔ హోండా బైక్స్ విక్రయాలు 4 శాతం వృద్ధితో 1,67,496 యూనిట్లకు పెరిగారుు. దీని స్కూటర్ల అమ్మకాలు 3,02,862 యూనిట్లుగా ఉన్నారుు. ⇔ వాణిజ్య వాహన విక్రయాలు 11 శాతం వృద్ధితో 65,569 యూనిట్లకు చేరారుు. -
దేశంలో వాహన విక్రయాల జోరు
న్యూఢిల్లీ: భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ వాహన అమ్మకాలలో గణనీయ వృద్ధిని సాధించింది. దేశీయ కార్ల అమ్మకాల్లో 10 శాతం వృద్ధిని, ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో 17 శాతం వృద్ధిని సాధించాయి. కార్ల అమ్మకాల్లో మారుతి, హ్యుందాయ్, బైక్స్ అమ్మకాల్లో హీరోమోటో కార్ప్, హోండా మోటార్ సైకిల్ , స్కూటర్ ఇండియా అగ్రభాగంలో నిలిచాయి. కార్ల అమ్మకాలు 9.62 శాతం ఎగబాకాయి. ముఖ్యంగా మార్కెట్ లీడర్‌గా గుర్తింపు పొందిన మారుతి సుజుకి విటారా బ్రెజా, హ్యుందాయ్ క్రెటా లాంటి యుటిలిటీ వాహనాలఅమ్మకాలు జోరు కొనసాగింది. దీంతో గతనెలలో పాసింజర్ వాహనాల అమ్మకాలు 16.78శాతానికి పెరిగాయి. భారత ఆటోమొబైల్ తయారీ సొసైటీ(ఎస్ఐఏఎం) ప్రకటించిన వివరాల ప్రకారం డొమెస్టిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2,59,685 గా నమెదయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో 2,22,368 యూనిట్లుగా ఉంది. వివిధ కేటగిరీల్లో మొత్తం వాహనాల అమ్మకాలు 18,33,976 యూనిట్లు. గత యేడాది 16,19,771 యూనిట్లతో పోల్చుకుంటే జూలైలో 13.22 శాతం పెరుగుదల నమోదయ్యింది. యూవీ సెగ్మెంట్ లో మహీంద్ర అండ్ మహీంద్రా 15,962 యూనిట్ల అమ్మకాలతో 21 శాతం పెరిగాయి. టాటా మెటార్స్ 12,209 యూనిట్ల అమ్మకాలతో 43.29 గ్రోత్ సాధించింది. ద్విచక్రవాహనాల అమ్మకాలు 11 శాతం పెరిగాయి. 8,97,092 యూనిట్లు అమ్ముడుబోయాయి. గత జులైలో ఈ సంఖ్య 8,08,332 .అయితే టూవీల్ మార్కెట్ లీడర్ హీరో మోటో కార్ప్ 6.7 శాతం వృద్ధిని నమోదుచేసింది. గత ఏడాది 4,19,950 గా వున్న అమ్మకాల సంఖ్య 4,48,119 యూనిట్లు కు పెరిగింది. కమర్షియల్ వాహనాల అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి. గత ఏడాది 51,795 యూనిట్లుగా ఉండగా ప్రస్తుతం 51,853 గా నమోదయ్యాయి. 7వ వేతన సంఘం సిఫారసుల ఆమోదం, మంచి వర్షపాతం అంచనాలు సెంటిమెంట్ ను బలపర్చాయని ఎస్ఐఏఎం డిప్యూటీ సెక్రటరీ జనరల్ సుగాతో సేన్ మీడియాకు తెలిపారు.