మూడో నెలా తగ్గుముఖం
పెరిగిన ద్విచక్ర వాహన అమ్మకాలు
వాణిజ్య వాహనాలకు కొనసాగిన డిమాండ్
ముంబై: దేశీయ కార్ల విక్రయాలు వరుసగా మూడో నెలా నెమ్మదించాయి. డిమాండ్ క్షీణతతో వాహన నిల్వలు పెరిగాయి. వీటిని తగ్గించుకునేందుకు వీలుగా ఆటో కంపెనీలు డీలర్లకు వాహన పంపిణీ (డిస్పాచ్) తగ్గించాయి. దీంతో ఈ సెప్టెంబర్‌లోనూ ఆటో అమ్మకాలు అంతంత మాత్రంగా జరిగాయి.
కార్ల దిగ్గజ సంస్థలు మారుతీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, ఎంజీ మోటార్స్ విక్రయాలు తగ్గాయి. ఇక ద్విచక్ర వాహనాలకొస్తే... ఈ విభాగంలోని అగ్ర కంపెనీలైన టీవీఎస్ మోటోకార్ప్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్ విక్రయాల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. వాణిజ్య, ట్రాకర్ల అమ్మకాలూ పెరిగాయి. పండుగ సీజన్ ప్రారంభం కావడంతో వాహన విక్రయాలు అమ్మకాలు పుంజుకునే వీలుందని ఆటో తయారీ సంస్థలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment