భారతదేశంలో రోజు రోజుకి వాహన విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. 2022 కంటే కూడా 2023లో కార్ల అమ్మకాలు 8.3 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనల్లో వివరంగా తెలుసుకుందాం.
2023 లో చిన్న కార్ల అమ్మకాలతో పోలిస్తే ఎస్‌యూవీల అమ్మకాలు బాగా పెరిగాయి. మారుతి సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్ వంటి కంపెనీలు మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగాయి. 2022లో సగటున కారు ధర రూ.10.58 లక్షలు పలికితే 2023లో సరాసరి రూ.11.5 లక్షలకు పెరిగింది.
మొత్తం అమ్మకాల్లో మారుతి సుజుకి హవా జోరుగా సాగింది. భారతీయ ప్యాసింజర్ వాహనాల పరిశ్రమ చరిత్రలో ఇదొక పెద్ద మైలురాయిగా భావిస్తున్నట్లు.. మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవస్తవ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: ఈవీ రంగంలో అద్భుతం.. 1000 కిమీ రేంజ్ అందించే బ్యాటరీ
కార్ల అమ్మకాల్లో ఎస్‌యూవీల సేల్స్ 26 శాతం వృద్ధి చెందినట్లు సమాచారం. మొత్తం కార్ల విక్రయాల్లో ఎస్‌యూవీల వాటా 2022లో 42 శాతం ఉంటే.. 2023లో ఈ సంఖ్య 48.7 శాతానికి పెరిగింది. హ్యాచ్‌బ్యాక్ మోడల్ కార్ల అమ్మకాలు 34.8 శాతం నుంచి 30 శాతానికి పెరిగింది.
2023లో సెడాన్స్ విక్రయాలు 11 శాతం నుంచి 9.4 శాతానికి పతనం కాగా, మల్టీ పర్పస్ యుటిలిటీ వెహికల్స్ విక్రయాలు యధాతథంగా 8.7 శాతం వద్ద కొనసాగాయి. దేశీయ విక్రయాలు మాత్రమే కాకుండా ఎగుమతుల సంఖ్య కూడా బాగా పెరిగింది. గత ఏడాది 2,69,046 యూనిట్లను ఎగుమతైనట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో 7.76 లక్షల కార్లు, ప్రీ-ఓన్డ్ కార్ల విక్రయాలు 4.68 లక్షల యూనిట్లుగా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment