భారతదేశంలో లెక్కకు మించిన కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే దేశీయ విఫణిలో అమ్మకానికి ఉన్న అన్ని కార్లూ.. గొప్ప విక్రయాలను పొందలేవు. కానీ కొన్ని కార్లు మాత్రం ఊహకందని రీతిలో అమ్ముడవుతాయి. ఈ కథనంలో ఈ ఏడాది దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లను గురించి తెలుసుకుందాం.
దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్.. మార్కెట్లో 2021లో 'పంచ్' పేరుతో మైక్రో ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఈ కారు ఈ ఒక్క ఏడాది ఏకంగా 1.86 లక్షల సేల్స్ పొంది.. అమ్మకాల్లో అగ్రగామిగా నిలిచింది. 2023లో 1.50 లక్షల టాటా పంచ్ కార్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో టాటా పంచ్ పెట్రోల్, ఎలక్ట్రిక్, CNG రూపాల్లో అందుబాటులో ఉంది.
చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ.. టాటా పంచ్ సేఫ్టీ రేటింగులో 5 స్టార్స్ సొంతం చేసుకుని, అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. టాటా పంచ్ ధర రూ. 6.13 లక్షల నుంచి రూ. 10.15 లక్షల మధ్య ఉంటుంది. అదే సమయంలో పంచ్ ఎలక్ట్రిక్ కారు ధరలు రూ. 9.99 లక్షల నుంచి రూ. 14.29 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.
2024లో (జనవరి నుంచి నవంబర్) అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు
⮞టాటా పంచ్: 1,86,958 యూనిట్లు
⮞హ్యుందాయ్ క్రెటా: 1,74,311 యూనిట్లు
⮞మారుతి సుజుకి బ్రెజ్జా: 1,70,824 యూనిట్లు
⮞మహీంద్రా స్కార్పియో: 1,54,169 యూనిట్లు
⮞టాటా నెక్సాన్: 1,48,075 యూనిట్లు
⮞మారుతి సుజుకి ఫ్రాంక్స్: 1,45,484 యూనిట్లు
⮞మారుతి సుజుకి గ్రాండ్ విటారా: 1,15,654 యూనిట్లు
⮞హ్యుందాయ్ వెన్యూ: 1,07,554 యూనిట్లు
⮞కియా సోనెట్: 1,03,353 యూనిట్లు
⮞మహీంద్రా బొలెరో: 91,063 యూనిట్లు
ఇదీ చదవండి: మరో ఖరీదైన కారు కొన్న జొమాటో సీఈఓ: ధర ఎన్ని కోట్లో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment