Punch
-
భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కారు: 1.86 లక్షల మంది కొనేశారు
భారతదేశంలో లెక్కకు మించిన కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే దేశీయ విఫణిలో అమ్మకానికి ఉన్న అన్ని కార్లూ.. గొప్ప విక్రయాలను పొందలేవు. కానీ కొన్ని కార్లు మాత్రం ఊహకందని రీతిలో అమ్ముడవుతాయి. ఈ కథనంలో ఈ ఏడాది దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లను గురించి తెలుసుకుందాం.దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్.. మార్కెట్లో 2021లో 'పంచ్' పేరుతో మైక్రో ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఈ కారు ఈ ఒక్క ఏడాది ఏకంగా 1.86 లక్షల సేల్స్ పొంది.. అమ్మకాల్లో అగ్రగామిగా నిలిచింది. 2023లో 1.50 లక్షల టాటా పంచ్ కార్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో టాటా పంచ్ పెట్రోల్, ఎలక్ట్రిక్, CNG రూపాల్లో అందుబాటులో ఉంది.చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ.. టాటా పంచ్ సేఫ్టీ రేటింగులో 5 స్టార్స్ సొంతం చేసుకుని, అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. టాటా పంచ్ ధర రూ. 6.13 లక్షల నుంచి రూ. 10.15 లక్షల మధ్య ఉంటుంది. అదే సమయంలో పంచ్ ఎలక్ట్రిక్ కారు ధరలు రూ. 9.99 లక్షల నుంచి రూ. 14.29 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.2024లో (జనవరి నుంచి నవంబర్) అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు⮞టాటా పంచ్: 1,86,958 యూనిట్లు⮞హ్యుందాయ్ క్రెటా: 1,74,311 యూనిట్లు⮞మారుతి సుజుకి బ్రెజ్జా: 1,70,824 యూనిట్లు⮞మహీంద్రా స్కార్పియో: 1,54,169 యూనిట్లు⮞టాటా నెక్సాన్: 1,48,075 యూనిట్లు⮞మారుతి సుజుకి ఫ్రాంక్స్: 1,45,484 యూనిట్లు⮞మారుతి సుజుకి గ్రాండ్ విటారా: 1,15,654 యూనిట్లు⮞హ్యుందాయ్ వెన్యూ: 1,07,554 యూనిట్లు⮞కియా సోనెట్: 1,03,353 యూనిట్లు⮞మహీంద్రా బొలెరో: 91,063 యూనిట్లుఇదీ చదవండి: మరో ఖరీదైన కారు కొన్న జొమాటో సీఈఓ: ధర ఎన్ని కోట్లో తెలుసా? -
బంపర్ డిస్కౌంట్.. ఈ ఎలక్ట్రిక్ కారుపై రూ.2 లక్షల తగ్గింపు!
ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకుంటున్నవారికి ఇది నిజంగా భారీ శుభవార్త. ప్రముఖ దేశీయ కార్ మేకర్ టాటా మోటర్స్ '2 మిలియన్ ఎస్యూవీ వేడుక'లో భాగంగా తమ ఈవీ పోర్ట్‌ఫోలియోలోని పలు వాహనాలపై బంపర్ డిస్కౌంట్లు ప్రకటించింది. పాపులర్ టాటా నెక్సాన్ ఈవీపై గరిష్టంగా రూ. 2.05 లక్షల వరకూ తగ్గింపు అందిస్తోంది.ఈ సెప్టెంబర్ నెలలో టాటా ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి భారీగా డబ్బు ఆదా కానుంది. టాటా మోటర్స్ ఈవీ పోర్ట్‌ఫోలియోలోని టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV), పంచ్ ఈవీ (Punch EV), టియాగో ఈవీ (Tiago EV)లపై గ్రీన్ బోనస్‌లో భాగంగా క్యాష్ డిస్కౌంట్లు అందిస్తోంది. 2023 మోడల్లను ఎంచుకునే వారికి అదనపు తగ్గింపు లభిస్తుంది.టాటా నెక్సాన్ ఈవీపై భారీ డిస్కౌంట్టాప్ స్పెక్స్ ఉండే టాటా నెక్సాన్ ఈవీ ఎంపవర్డ్+ లాంగ్ రేంజ్ వేరియంట్లపై ఈ నెలలో రూ. 1.80 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది టాటా మోటర్స్. రూ. 20,000 తగ్గింపుతో లభించే ఎంట్రీ-లెవల్ క్రియేటివ్ + ఎంఆర్ వేరియంట్ తప్ప మిగిలిన అన్ని వేరియంట్లు రూ. 1 లక్ష నుండి రూ. 1.2 లక్షల వరకూ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.2023లో తయారైన అన్ని మోడల్‌లపై అయితే రూ. 25,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. టాటా నెక్సాన్ ఈవీ ధర రూ. 14.49 లక్షల నుండి రూ. 19.49 లక్షల మధ్య ఉంటుంది. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. కంపెనీ పేర్కొన్నదాని ప్రకారం.. 30kWh వేరియంట్ 275 కి.మీ, 40.5kWh యూనిట్ 390 కి.మీ. రేంజ్ ఇస్తాయి.ఇతర ఈవీలపైనా..ఇక టాటా మోటర్స్ డిస్కౌంట్ అందిస్తున్న ఇతర ఈవీలలో టాటా టియాగో ఈవీ, టాటా పంచ్ ఈవీ ఉన్నాయి. వీటిలో టాటా టియాగో ఈవీలపై గరిష్టంగా రూ.65,000, అలాగే టాటా పంచ్ ఈవీలపై రూ.30,000 వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. -
క్రాష్ టెస్ట్‌లో తడాఖా.. ప్రముఖ ఈవీలకు 5 స్టార్ రేటింగ్
క్రాష్ టెస్ట్‌లో దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటాకు చెందిన ఎలక్ట్రిక్ కార్లు తడాఖా చూపించాయి. టాటా పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ 5 స్టార్ భారత్-ఎన్సీఏపీ సేఫ్టీ రేటింగ్ సాధించాయని టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (టీపీఈఎం) ప్రకటించింది.అడల్ట్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ (ఏఓపీ)లో 31.46/32 పాయింట్లు, చైల్డ్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ (సీఓపీ)లో 45/49 పాయింట్లు సాధించడం ద్వారా పంచ్ ఈవీ ఇప్పటివరకు ఏ వాహనం సాధించని అత్యధిక స్కోర్లను అందుకోవడం ద్వారా ఒక ప్రధాన మైలురాయిని నిర్దేశించింది. ఇక నెక్సాన్ ఈవీ కేఓపీలో 29.86/32 పాయింట్లు, సీఓపీలో 44.95/49 పాయింట్లను సాధించింది. దీంతో టాటా మోటార్స్ ఇప్పుడు భారత్-ఎన్సీఏపీ, గ్లోబల్-ఎన్సీఏపీ పరీక్షలలో 5-స్టార్ స్కోర్ చేసిన సురక్షితమైన శ్రేణి ఎస్యూవీ పోర్ట్‌ఫోలియో కలిగిన ఏకైక ఓఈఎంగా నిలిచింది.'భారత్-ఎన్సీఏపీ కింద నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీలకు 5 స్టార్ రేటింగ్ లభించడంపై టాటా మోటార్స్‌కు నా హృదయపూర్వక అభినందనలు. ఈ సర్టిఫికేషన్ దేశంలో సురక్షితమైన వాహనాల పట్ల భారత ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమను 'ఆత్మనిర్భర్'గా మార్చడంలో భారత్-ఎన్సీఏపీ పాత్రను నొక్కి చెబుతుంది" అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.పంచ్ ఈవీ లాంచ్ అయినప్పటి నుంచి విశేష ఆదరణను సొంతం చేసుకుంది. గ్రామీణ మార్కెట్ల నుంచి 35 శాతానికి పైగా కస్టమర్లు ఉన్నారు. పంచ్ ఈవీని 10,000 మందికి పైగా కొనుగోలు చేశారు. భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి నాంది పలికిన నెక్సాన్ ఈవీ 2020 లో లాంచ్ అయినప్పటి నుంచి 68,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఈ ఎస్‌యూవీని అప్డేటెడ్ వర్షన్‌ను 2023లో ఆవిష్కరించారు. -
టాటా పంచ్ ఈవీ వచ్చేసింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ పంచ్ ఎలక్ట్రిక్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూం ధర రూ.10.99 లక్షలతో మొదలై రూ.14.49 లక్షల వరకు ఉంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 9.5 సెకన్లలో చేరుకుంటుంది. రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. ఒకసారి చార్జింగ్‌తో 25 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 315 కిలోమీటర్లు, 35 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 421 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. 190 ఎన్ఎం టార్క్‌తో 120 బీహెచ్పీ, అలాగే 114 ఎన్ఎం టార్క్‌తో 80 బీహెచ్పీ వర్షన్స్‌లో తయారైంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, ఏబీఎస్, ఈఎస్సీ, ఈఎస్పీ, క్రూజ్ కంట్రోల్, 360 లీటర్ల బూట్ స్పేస్ వంటి హంగులు ఉన్నాయి. ఎనిమిదేళ్లు లేదా 1,60,000 కిలోమీటర్ల వరకు వ్యారంటీ ఉంది. డెలివరీలు జనవరి 22 నుంచి ప్రారంభం. -
పండగ సందడి షురూ: టాటా సీఎన్జీ కార్లు వచ్చేశాయ్!
Tata CNG Cars: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ పండుగ సీజన్ సందడిని స్టార్ట్ చేసింది. కొత్త కార్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమై పోయింది. టాటా ఒకటి కాదు ఏకంగా మూడు సీఎన్జీ కార్లను లాంచ్ చేసింది. పంచ్ i-CNG లాంచ్తోపాటు, ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో టిగోర్, టియాగో సీఎన్జీని కూడా అప్డేట్ చేసింది. టాటా పంచ్ ఐ-సీఎన్జీ మైక్రో ఎస్యూవీ పంచ్ సీఎన్జీ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.7,09,900 మొదలకుని రూ.9,67,900 వరకు ఉంది. ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో 1.2 లీటర్ రివొట్రాన్ సీఎన్జీ ఇంజన్‌తో రూపుదిద్దుకుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుపరిచారు. పెట్రోల్, సీఎన్జీతో నడుస్తుంది. 37 లీటర్ల పెట్రోల్, 60 లీటర్ల సీఎన్జీ ఫ్యూయల్ ట్యాంక్ ఏర్పాటు ఉంది. సీఎన్జీ కేజీకి 26.99 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 7 అంగుళాల హర్మాన్ ఇన్ఫోటైన్మెంట్, 16 అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వంటి హంగులు ఉన్నాయి. కొత్త టాటా సీఎన్జీ కార్లు టాటా ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో టియాగో ఐ-సీఎన్జీని విడుదల చేసింది. ధరల వారీగా, కొత్త టియాగో సిఎన్జి రూ. 7.46 లక్షలలు- రూ. 9.32 లక్షల మధ్య ఉంటుంది. ఆశ్చర్యకరంగా, టాటా మునుపటి సీఎన్జీ మోడల్‌తో పోలిస్తే కేవలం 5వేలు మాత్రమే ధరను పెంచింది. -
ఉత్పత్తిలో కనీవినీ ఎరుగని రికార్డ్.. ప్రత్యర్థులకు గట్టి పంచ్ ఇచ్చిన 'టాటా పంచ్'
Tata Motors: ఎక్కువమంది ప్రజలకు నమ్మికైన భారతీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' ఇప్పటికే అనేక ఆధునిక ఉత్పత్తులు ప్రవేశపెట్టి తిరుగులేని అమ్మకాలను పొందుతూ.. ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ టాటా పంచ్ మైక్రో SUV ఉత్పత్తిలో కొత్త రికార్డ్ సృష్టించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా పంచ్ న్యూ రికార్డ్.. మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగి సేఫ్టీలో కూడా అత్యుత్తమ ఫీచర్స్ కలిగిన టాటా పంచ్ ఉత్తమ అమ్మకాలు పొందటంలో విజయం సాధించింది. ఈ కారణంగానే ఈ కారు అమ్మకాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం కంపెనీ ఈ కారు ఉత్పత్తిలో 'రెండు లక్షల' యూనిట్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వారియర్ అవుతోంది. 2021 అక్టోబర్ నెలలో భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన టాటా పంచ్ కేవలం 20 నెలల కాలంలో ఉత్పత్తిలో ఏకంగా 2,00,000 మైలురాయిని చేరుకుంది. ఇందులో కంపెనీ 2023 మార్చి వరకు 1,86,535 యూనిట్లను దేశీయ మార్కెట్లో విక్రయించింది. ఆ తరువాత ఏప్రిల్ నెలలో 10,930 యూనిట్లను విక్రయించింది. మొత్తానికి ఇప్పుడు ఉత్పత్తిలో అరుదైన మైలురాయిని చేరుకుంది. టాటా పంచ్ కొత్త ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్డ్ (ALFA) ఆర్కిటెక్చర్ మీద రూపొందించారు. కావున ఇది అద్భుతమైన డిజైన్ అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇందులో ఆటోమాటిక్ ప్రొజెక్టర్ హెడ్లాంప్, LED DRL, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, 16 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, రియర్ వ్యూ కెమరా, 4 స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టం, స్టీరింగ్ మోంటెడ్ కంట్రోల్స్, USB ఛార్జింగ్ సాకేట్, రియర్ పవర్ విండోస్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్ వింగ్ మిర్రర్స్ వంటివి ఉన్నాయి. సేఫ్టీ విషయంలో కూడా ఇది 5 స్టార్ రేటింగ్ పొంది దేశంలో అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. (ఇదీ చదవండి: రూ. 1.30 కోట్ల ప్యాకేజీ, నెలకు 20 రోజులు సెలవు - ఇది కదా ఉద్యోగమంటే..!!) టాటా పంచ్ సిఎన్జి (Tata Punch CNG) ఇదిలా ఉండగా.. టాటా మోటార్స్ త్వరలో టాటా పంచ్ CNG వెర్షన్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కారు 2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించింది. ఇది మార్కెట్లో విడుదలైతే టాటా సిఎన్జి విభాగంలో నాల్గవ మోడల్ అవుతుంది. ఇది 1.2 లీటర్ త్రీ సిలిండర్ ఇంజిన్ కలిగి 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో సిఎన్జి ట్యాంకుల కోసం కంపెనీ కొత్త టెక్నాలజీ ఉపయోగించనున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: భారత్‌లో అరంగేట్రం చేయనున్న ఎక్స్ఎల్7 - ఫీచర్స్‌కి ఫిదా అవ్వాల్సిందే!) టాటా పంచ్ ఎలక్ట్రిక్ (Tata Punch EV) ఇక టాటా పంచ్ ఎలక్ట్రిక్ వెర్షన్లో విడుదలకావడానికి కూడా సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఇటీవల వెలువడ్డాయి. ఇది కూడా మార్కెట్లో త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. టాటా పంచ్ గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
రష్యా ప్రతినిధి కవ్వింపు.. ఉక్రెయిన్ ఎంపీ పంచ్‌ల వర్షం
-
సల్మాన్ ముఖంపై పంచ్ ఇచ్చిన మాజీ ప్రేయసి
-
' ప్రశాంత అత్త ' ఎవరు లోకేషం.. నారాలోకేష్ పై అంబటి మార్క్ పంచ్ లు
-
విమానంలో ప్యాసింజర్ వీరంగం.. కొట్టి, ఉమ్మి వేసి..
విమానంలో ప్రయాణికుల వికృత ప్రవర్తనలకు సంబంధించన పలు ఘటల గురించి విన్నాం. ఇటీవలే సహ ప్రయాణకురాలిపై మూత్ర విసర్జన ఘటన మరువుకే మునుపే అదే తరహ ఘటనలు వరసగా వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడొక ప్రయాణికురాలు అంతకు మించి అన్నట్టుగా.. చాలా ఘోరంగా ప్రవర్తించింది. ఆమె చేసిన హంగామా...ఆ విమానంలోని సిబ్బందిని హడలెత్తించేలా వికృతంగా ప్రవర్తించింది. తనది కాని సీటులో కూర్చొన్నదే గాక సిబ్బందిని దుర్భాషలాడుతూ..వారిపైనే దాడికి దిగింది. ఈ ఘటన ముంబై ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...విస్తారా అబుదాబి అనే ముంబై విమానంలో 45 ఏళ్ల ఇటాలియన్ ప్రయాణికురాలు నానా బీభత్సం సృష్టిచింది. ఆమె ఎకనామీ టిక్కెట్టు కొనుక్కుని బిజినెస్ సీటులో కూర్చొంటానని పట్టుబట్టింది. ఆ సీటు తనది కాదని విమాన సిబ్బంది చెప్పేందుకు యత్నించగా.. వారిని దుర్భాషలాడుతూ దాడికి దిగింది. ఆ సిబ్బందిలో ఒకర్నీ కొట్టి, మరొకరిపై ఉమ్మి వేసి భయానకంగా ప్రవర్తించింది. అక్కడితో ఆగక అర్థనగ్నంగా నడిచి ప్రయాణికులను, సిబ్బందిని భయబ్రాంతులకు లోను చేసింది. దీంతో కెప్టెన్ ఆమె అనుచిత ప్రవర్తన దృష్ట్యా హెచ్చరిక కార్డ్‌ను జారీ చేసి ప్రయాణికురాలిని నిరోధించాలని నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగానే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి..సదరు ప్రయాణకురాలిపై చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రౌండ్ సెక్యూరిటీ ఏజెన్సీలను అలర్ట్ చేశాడు. ఈ మేరకు భద్రతా సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: 13 గంటలు గగన ప్రయాణం.. చివరికి ఊహించని ల్యాండింగ్.. ప్రయాణికుల షాక్) -
టాటా మోటార్స్ దూకుడు.. ఇక ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ తగ్గేదె లే!
ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల విషయంలో మరింత దూకుడు ప్రదర్శించేందుకు సిద్దం అవుతుంది. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల్లో ఎంతో ఆసక్తి రేపి ఆ తర్వాత వివాదాల్లో చిక్కుకున్న నెక్సాన్ మోడల్‌కి సంబంధించి టాటా తీపి కబురు చెప్పబోతుంది. ఈ మోడల్‌కి సంబంధించిన రేంజ్ విషయంలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అంతర్జాతీయ ఈవీలకు దీటుగా ఈ నెక్సాన్ కారును రూపొందిస్తుంది. రేంజ్ వినియోగదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని బ్యాటరీ సామర్థ్యం పెంచాలని టాటా నిర్ణయించింది. ప్రస్తుతం టాటా నెక్సాన్‌లో 30.2 కిలోవాట్ల బ్యాటరీని 40 కిలోవాట్లకు పెంచాలని నిర్ణయించారు. దీంతో కనీసం ప్రయాణ రేంజ్ కనీసం 30 శాతం పెరుగుతుందని కంపెనీ చెబుతోంది. బ్యాటరీ సామర్థ్యం పెంచిన తర్వాత టాటా మోటార్స్ చేపట్టిన ఇంటర్నల్ టెస్ట్‌లో కారు సింగిల్ రేంజ్ కెపాసిటీ 400 కిలోమీటర్ల వరకు ఉన్నట్టు అంచనా. అయితే రియల్‌టైంలో ఆన్‌రోడ్ మీద కనీసం 300 కిలోమీటర్ల నుంచి 320 కిలోమీటర్ల వరకు రేంజ్ రావచ్చని తెలుస్తోంది. ఈ మార్పులు చేసిన కొత్త కారు ఈ ఏడాది ద్వితియార్థంలో మార్కెట్లోకి రావచ్చని అంచనా. సేల్స్ రాబోయే ఆర్థిక సంవత్సరంలో 50,000కు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయాలని సంస్థ యోచిస్తోంది. కంపెనీ తన ఈవీ కార్ల ఉత్పత్తిని రాబోయే రెండు సంవత్సరాలలో వార్షికంగా 1,25,000-150,000 యూనిట్లకు పెంచుకోవాలని చూస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లక్ష్య కార్లను విక్రయించగలిగితే కంపెనీ మొత్తం రూ.5,000 కోట్ల ఆదాయాన్ని సంపాదించనుంది. అలాగే, రాబోయే కాలంలో టాటా మోటార్స్ దేశంలో మరో మూడు సరసమైనఎలక్ట్రిక్ కార్లను ప్రారంభించాలని యోచిస్తుంది. రూ.10 లక్షల లోపు ధరలో ఎలక్ట్రిక్ కార్లను తీసుకొని రావాలని చూస్తున్నట్లు సమాచారం. టియాగో ఈవీ, పంచ్ స్మాల్ ఎస్యువీ, ఆల్ట్రోజ్ హ్యాచ్ బ్యాక్ ఎలక్ట్రిక్ కార్లు రూ.10 లక్షల లోపు ఉండే అవకాశం ఉంది. అలాగే, ఈ ఎలక్ట్రిక్ కార్ల కనీస రియల్ రేంజ్ అనేది 200 కిలోమీటర్ల మార్కుకు తగ్గకుండా ఉండాలని చూస్తోంది. ఏడాదికి కనీసం 1 లేదా 2 కార్లను లాంచ్ చేయలని చూస్తోన్నట్లు సంస్థ పేర్కొంది. (చదవండి: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..!) -
టాటా మోటార్స్ చిన్న ఎస్యూవీ పంచ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ పంచ్ పేరుతో దేశంలో తొలి సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. రూ.21,000 చెల్లించి వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌లో ప్రవేశపెట్టారు. డైనా ప్రో టెక్నాలజీతో 1.2 లీటర్ రెవొట్రాన్ ఇంజన్‌తో తయారైంది. పరిశ్రమలో తొలిసారిగా ఆధునిక ఏఎంటీతో ట్రాక్షన్ ప్రో మోడ్, బ్రేక్ స్వే కంట్రోల్ పొందుపరిచారు. 90 డిగ్రీల కోణంలో తెరుచుకునే డోర్లు, ఆర్16 డైమండ్ కట్ అలాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ రూఫ్ ఆప్షన్స్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీ, కార్నర్ సేఫ్టీ కంట్రోల్‌తో ఏబీఎస్, క్రూయిజ్ కంట్రోల్, టిల్ట్ స్టీరింగ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి హంగులు ఉన్నాయి. ఏడు రంగుల్లో లభిస్తుంది. పంచ్ అభివృద్ధికి 150 నమూనా కార్లను వాడారు. ఇవి 20 లక్షలకుపైగా కిలోమీటర్లు ప్రయాణించాయని కంపెనీ తెలిపింది. భారత్, యూకే, ఇటలీలోని డిజైన్ స్టూడియోలు ఈ కారు అభివృద్ధిలో పాలుపంచుకున్నాయి. -
అదిరిపోయే ఫీచర్స్‌తో విడుదలైన టాటా మైక్రో ఎస్యూవీ
టాటా మోటార్స్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టాటా మైక్రో ఎస్యూవీ పంచ్ కారును సంస్థ నేడు(అక్టోబర్ 4) విడుదల చేసింది. ఇది ఆల్ఫా-ఎఆర్ సీ(ఎజిల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్) ఫ్లాట్ ఫారంపై ఆధారపడి పనిచేస్తుంది. టాటా మోటార్స్ కారులలో చాలా పాపులర్ మోడల్ ఆల్ట్రోజ్ తరహాలోనే దీనిని అభివృద్ధి చేశారు. ఆసక్తి గల కొనుగోలుదారులు టాటా మోటార్స్ డీలర్ షిప్‌లు లేదా కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో రూ.21,000 చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చు. అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్ టాటా మోటార్స్ పంచ్ కోసం వర్చువల్ షోరూమ్ కూడా ప్రారంభించింది. మైక్రో ఎస్యూవీ పంచ్ కారు ధరలను సంస్థ ఇంకా వెల్లడించలేదు. టాటా పంచ్ వేరియంట్ బట్టి 15 లేదా 16 అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్ పై నడుస్తుంది. దీనిలో కమాండింగ్ డ్రైవింగ్ పొజిషన్, 187మి.మి గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. టాటా పంచ్ 1.2-లీటర్ రీవోట్రాన్ ఇంజిన్ డైనా-ప్రో టెక్నాలజీతో వస్తుంది. ఇది 86 పిఎస్ పవర్, 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. దీని ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. (చదవండి: వారెవ్వా.. అంతరిక్షంలోకి సమంత!) ఎఎమ్‌టి గేర్ బాక్స్ బురద లేదా తక్కువ ట్రాక్షన్ ఉపరితలాల గుండా సులభంగా డ్రైవింగ్ చేయడం కోసం ఎఎమ్‌టి గేర్ బాక్స్ తో వస్తుంది. ఇంధన సామర్థ్యాన్ని మరింత పెంపొందించడం కోసం సిగ్నల్స్, ట్రాఫిక్ వద్ద ఇంజిన్ ని ఆటోమేటిక్ గా ఆఫ్ చేయడం కోసం ఐడిల్ స్టార్ట్ స్టాప్, క్రూయిజ్ కంట్రోల్ ఆప్షన్లు ఉన్నాయి. టాటా పంచ్ ఇంటీరియర్స్ చాలా విశాలమైన ఫీల్ ఇచ్చేవిధంగా డిజైన్ చేశారు. డ్యాష్ బోర్డ్ 4 అంగుళాల లేదా 7 అంగుళాల హర్మన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ తో వస్తుంది. టాటా పంచ్ వెనుక సీట్లు చాలా సౌకర్యవంతమైన అనుభూతిని కలిగిస్తాయి. మైక్రో ఎస్ యువి 366 లీటర్ల బూట్ స్పేస్ తో వస్తుంది.(చదవండి: సెప్టెంబరులో బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీ ఇదే!) టాటా పంచ్ నాలుగు వేరియెంట్లలో లభ్యం అవుతుంది. ఇందులో రెండు ఎయిర్ బ్యాగులు, ఈబిడితో గల ఎబిఎస్, కార్నర్ సేఫ్టీ కంట్రోల్, ఐసోఫీక్స్, బ్రేక్ స్వే కంట్రోల్ వంటి అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. టాటా పంచ్ ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వీటిలో ఓర్కస్ వైట్, అటామిక్ ఆరెంజ్, డేటోనా గ్రే, ఉల్కా కాంస్యం, కాలిప్సో రెడ్, ట్రాపికల్ మిస్ట్, టోర్నడో బ్లూ ఉన్నాయి. -
అక్టోబర్ 4న టాటా మైక్రో ఎస్యూవీ కారు బుకింగ్స్ ఓపెన్
ప్రముఖ ఆటో మొబైల్ తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తన మైక్రో ఎస్యూవీ పంచ్ కారు బుకింగ్స్ కోసం అక్టోబర్ 4 నుంచి అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. ఈ మైక్రో ఎస్‌యూవీని 2021 అదే రోజున లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. అయితే, బుకింగ్ మొత్తం ఎంత అనేది టాటా మోటార్స్ ఇంకా వెల్లడించలేదు. త్వరలో రాబోయే మైక్రో ఎస్యూవీ ఫీచర్లను ఆటపట్టించింది. ఇండియన్ మార్కెట్లో గత కొంత కాలంగా ఎస్యూవీ వెహికల్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. సెడాన్లకు ధీటుగా ఎస్యూవీ వెహికల్స్ అమ్మకాలు సాగుతున్నాయి. అందుకే ఈ కారును మార్కెట్లోకి తీసుకొస్తుంది. టాటా మోడల్ కార్లలో అందించే 7 అంగుళాల ఫ్రీ స్టాండింగ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఇందులో కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎస్యూవీ ప్రమాణాలతో, పట్టణాలు, నగరాల్లో ప్రయాణించేందుకు అనువైన చిన్న వాహనంగా దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. స్పోర్టీ త్రీ స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, ఆల్ట్రోజ్ నుండి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్విచ్ గేర్ వంటి ఫీచర్లతో రానుంది. పంచ్ తన కీలక ప్రత్యర్థుల్లో ఒకరైన మారుతి సుజుకి ఇగ్నిస్ కంటే పెద్దదిగా ఉంటుందని తెలుస్తుంది. ఇగ్నిస్ కారుతో పోలిస్తే దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.(చదవండి: రిలయన్స్ డిజిటల్లో ఎలక్ట్రానిక్స్‌పై భారీ ఆఫర్లు) 'Right' from all the angles. ;) I Pack A PUNCH Bookings open on 4th October#TataPUNCH #TataMotors pic.twitter.com/MQRc1JjV97 — Tata Motors Cars (@TataMotors_Cars) September 30, 2021 -
హీరోయిన్ కడుపులో ట్రైనర్ పిడిగుద్దులు.. వీడియో వైరల్
ముంబై: సినిమాలో నటించేవాళ్లు కొందరైతే,జీవించేవాళ్లు మరికొందరు ఉంటారు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏం చెయ్యడానికైనా వెనుకాడరు. కొన్ని పాత్రల కోసం ముందే రోజుల తరబడి శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా(యూనివర్స్) ఊర్వశి రౌటేలా మరో అడుగు ముందుకేసింది. తన తదుపరి చిత్రం కోసం ఏకంగా బాక్సింగ్ పంచులను సైతం భరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఓ యాక్షన్ ఫిల్మ్ కోసం ఊర్వశీ ట్రైనింగ్ తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఆమె ట్రైనర్ కడుపులో పిడి గుద్దులు కురిపిస్తుంటే, ఆ నొప్పిని భరిస్తూ ట్రైనర్ పనితనాన్ని దగ్గరినుంచి గమనిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..నో పెయిన్.. నో గెయిన్ అనే క్యాప్షన్‌ను జోడించింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఊర్వశీ డెడికేషన్‌ను మెచ్చుకుంటున్నారు. సినిమా కోసం ఇంత కష్టపడుతున్న ఊర్వశీకి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఊర్వశి ప్రస్తుతం "ద బ్లాక్ రోజ్"లో నటిస్తోంది. అలాగే తమిళ చిత్రం "తిరుట్టు పాయలే 2" హిందీ రీమేక్‌లోనూ నటించనుంది. హీరో శరవణన్ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తూ తమిళంలోనూ ఎంట్రీకి రెడీ అవుతోంది. బాలీవుడ్ హీరో రణ్‌దీప్ హుడాతో "ఇన్స్పెక్టర్ అవినాష్" అనే వెబ్ సిరీస్ చేస్తోంది. "మర్ జాయేంగే" మ్యూజిక్ వీడియోలో గురు రంధవాతో ఆడిపాడనుంది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) చదవండి : సంచలన నిర్ణయం తీసుకున్న 'నువ్వు నేను' హీరోయిన్ అనిత క్రికెట్ చూడను కానీ సచిన్, కోహ్లి అంటే.. -
అతడి చెంప పగలకోడితే.. తిరిగి నన్ను కొట్టాడు: హీరోయిన్
ఆమిర్ ఖాన్ స్టోర్స్ డ్రామా ‘దంగల్’తో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు నటి ఫాతిమా సనా షేక్. తాజాగా తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత చెత్త అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు ఫాతిమా సన. ఓ సారి తాను ఓ ఆగంతకుడి చెంప పగలకొట్టాని.. అయితే అతడు తిరిగి తనను కొట్టాడని తెలిపారు సన. దీని గురించి సనా మాట్లాడుతూ.. ‘‘ఓ సారి జిమ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. ఓ వ్యక్తి నా వైపు రావడం గమనించాను. అప్పటికే అతడు కాస్త తేడాగా అనిపించాడు. నేను నడుచుకుంటూ వెళ్తుండగా.. అతడు వెంటే వచ్చాడు’’ అని తెలిపారు. ‘‘నేను ఆగి ‘ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు’ అని అతడిని ప్రశ్నించాను. అందుకతడు ‘అది నా ఇష్టం’ అన్నాడు. వెంటనే నేను కోపంతో ‘తన్నులు తినాలని ఉందా ఏంటి’ అన్నాను. దానికతడు ‘కొట్టు’ అన్నాడు. అప్పటికే నా ఓపిక నశించింది. దాంతో అతడిని కొట్టాను. వెంటనే అతడు తిరిగి నన్ను కొట్టాడు. నేను మా నాన్నని పిలిచాను. ఆయన నా సోదరుడితో పాటు అతడి ఫ్రెండ్స్‌ని కూడా తీసుకుని వచ్చాడు. ఏమైంది అని అడిగాడు. నేను జరిగిన విషయం చెప్పాను. వెంటనే మా నాన్న, మిగతవారు నన్ను కొట్టిన అతడిని పట్టుకునేందుకు పరిగెత్తారు. కానీ అతడు దొరకలేదు’’ అని తెలిపారు. ఇక ఇండస్ట్రీలో తాను ఎన్నో చేదు అనుభవాలని ఎరదొర్కాన్నాని.. చాలా మంది దర్శకులు తమతో గడిపితేనే అవకాశాలు ఇస్తామన్నారని తెలిపారు ఫాతిమా సన. చాలా సార్లు తనకు వచ్చిన అవకాశాలను తిరిగి తీసుకున్నారని వెల్లడించారు. ఎవరు ఎన్ని విధాలుగా ట్రై చేసినా తను తాను నిరూపించుకున్నాను అన్నారు ఫాతిమా సన. చదవండి: ‘మా స్నేహన్ని తప్పుగా చూస్తున్నారు’ -
పులికి మిమిక్రీ చేయడం తెలుసు
పుట్టిన తర్వాత ఓ వారం రోజుల వరకూ పులులకు కళ్లు కనిపించవు. ఆ తర్వాతే మెల్లగా అన్నీ కనిపిస్తాయి. చూపు స్పష్టమ వడానికి కాస్త సమయం పడుతుంది! పులికి ఎంత బలముంటుందంటే... అది తనకంటే రెండు రెట్లు పెద్దదైన జీవిని కూడా తేలికగా చంపేయగలదు! తమ ఆహారం విషయంలో పులులు చాలా స్వార్థంగా ఉంటాయి. ఒక జంతువును చంపి తిన్న తర్వాత ఇంకా మిగిలితే... దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి, ఆకులతో కప్పి మరీ దాచిపెడతాయి. ఆ తర్వాత మళ్లీ ఆకలేసినప్పుడు వెళ్లి తింటాయి! పులి పిల్లలు రెండేళ్ల వరకూ తల్లిని అంటిపెట్టుకునే ఉంటాయి. ఎందుకంటే అవి పద్దెనిమిది నెలల వరకూ వేటాడలేవు. అందుకే వేటలో నైపుణ్యం సంపాదించాక గానీ తల్లిని వదిలి వెళ్లవు! ఇవి ఒంటరిగా వేటాడటానికి ఇష్టపడతాయి. పైగా రాత్రిపూటే వేటాడతాయి! ఎంత ఒంటరిగా ఉండటానికి ఇష్టపడినా, సాటి పులి విషయంలో ఇవి చాలా స్నేహంగా మెలగుతాయి. తాను ఆహారాన్ని తింటున్నప్పుడు అక్కడికి మరో పులి వస్తే, దానికి తమ ఆహారాన్ని పంచుతాయివి! ఎందుకంటే, పులి ఆహారం కోసం, తనను తాను రక్షించుకోవడం కోసం తప్ప ఏ ప్రాణినీ చంపదు. పరిశీలిస్తుందంతే. అందుకే ఎప్పుడైనా పులి ఎదురుపడితే కంగారుపడి దాన్ని రెచ్చగొట్టకుండా... దాని కళ్లలోకే చూస్తూ, మెల్లగా వెనక్కి నడుస్తూ పోవాలని జీవ శాస్త్రవేత్తలు చెబుతుంటారు! పులులకు మిమిక్రీ చేయడం తెలుసు. ఒక్కోసారి వేటాడబోయే జంతువుని మోసగించడానికి, ఆ జంతువులాగే శబ్దాలు చేయడానికి ప్రయత్నిస్తాయి! పులుల జ్ఞాపకశక్తి మనుషుల కంటే ముప్ఫైరెట్లు ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి అవి దేనినైనా గుర్తు పెట్టుకున్నాయంటే... చనిపోయేవరకూ మర్చిపోవు! -
నా కూతుర్ని అలా అగిడితే.. ఒక్క పంచ్ ఇస్తా జాగ్రత్త!
‘‘పనికోసం వచ్చే అమ్మాయిలను తమ పలుకుబడి ఉపయోగించి తప్పుగా ప్రవర్తించడం చాలా దారుణం’’ అన్నారు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్. పని ప్రదేశాల్లో వేధింపుల గురించి సైఫ్ మాట్లాడుతూ– ‘‘వాళ్లకు రక్షణగా ఎవరూ లేరని అసభ్యంగా ప్రవర్తించడం తప్పు. ఒకవేళ నా కూతుర్ని (సారా అలీఖాన్) ఎవరైనా అక్కడికి వచ్చి కలువు.. ఇక్కడికి రా.. అని అడిగితే నేనూ తనతో కలిసి వెళ్లి వాళ్ల మొహం మీద ఒక్క పంచ్ ఇస్తా. ఎవరైనా తనని ఏదైనా అన్నా కూడా వాళ్లు నన్ను కోర్ట్‌లో కలవాల్సి ఉంటుంది. తప్పదు, కానీ నా రియాక్షన్ ఇలానే ఉంటుంది. అలా చేస్తేనే మళ్లీ అలా చేయకుండా ఉంటారు. ప్రతి అమ్మాయికీ ఇలాంటి రక్షణ ఉండాలని కోరుకుంటా’’ అని పేర్కొన్నారు. ఇక సినిమా విషయానికొస్తే.. సారా అలీఖాన్ ప్రస్తుతం ‘టెంపర్’ హిందీ రీమేక్ ‘సింబా’ షూటింగ్ కోసం స్విట్జర్ల్యాండ్లో ఉన్నారు. అజయ్ దేవగన్ హీరోగా చేయనున్న ‘తానాజీ’లో సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపిస్తారట. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘సాక్రెడ్ గేమ్స్’ సీజన్ 2 షూటింగ్‌లోనూ బిజీగా ఉన్నారు సైఫ్. -
బాలిక ముఖంపై గుద్దిన కోతి..వైరల్!
-
గట్టి పంచ్ ఇచ్చిన కోతి..!!
సాక్షి, వెబ్ డెస్క్ : ఆహారాన్ని అందిస్తూ మరీ దగ్గరకు వెళ్లిన బాలిక ముఖంపై గుద్దిన కోతి వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన చైనాలోని ఓ జూలో జరిగింది. ఓ మహిళతో పాటు ఆహారం తినిపించడానికి బాలిక కూడా కోతి వద్దకు వెళ్లింది. మహిళ ఇస్తున్న ఆహారాన్ని కోతి తీసుకుంటుండగా, మధ్యలో బాలిక దానికి మరింత దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేసింది. అప్పటివరకూ శాంతంగా కనిపించిన కోతి బాలిక చర్యతో తన చేతిని విసిరింది. అంతే ఆ పంచ్ బాలిక ముఖాన్ని బలంగా తాకడంతో ఆమె వెనక్కు పడిపోయింది. -
14 వేల బంకర్లు
జమ్మూ: పాకిస్తాన్‌తో అంతర్జాతీయ, పాక్ ఆక్రమిత కశ్మీర్ సరిహద్దుల వద్ద 14,460 బంకర్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాకిస్తాన్ తరచూ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ మోర్టార్లతో దాడు లు చేస్తున్నందున సరిహద్దు గ్రామాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ బంకర్లను నిర్మించనున్నారు. కాగా, ఈ బంకర్ల నిర్మాణానికి కేంద్రం రూ.415.73 కోట్లను ఇటీవలే విడుదల చేసింది. ఈ భూగర్భ బంకర్లలో ఎల్వోసీ వెంట పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో 7,298, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, కథువా, సాంబా జిల్లాల్లో 7,162 బంకర్లను నిర్మించనున్నారు. ఇందులో 13,029 వ్యక్తిగతమైనవి కాగా, 1,431 సామాజిక బంకర్లున్నాయి. వ్యక్తిగత భూగర్భ బంకర్లు 160 చదరపు అడుగులు (ఎనిమిది మంది ఉండేందు కు వీలుగా), సామాజిక బంకర్లు 800 చదరపు అడుగులు (40 మంది ఉండేందుకు వీలుగా) ఉంటాయి. గతేడాది పాకిస్తాన్ కవ్వింపు చర్యల కారణంగా 35 మంది (23 మంది సైనికులు, 12 మంది పౌరులు) మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం బంకర్ల నిర్మాణానికి చొరవతీసుకుందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. -
అభిమానిని రక్తం వచ్చేలా కొట్టిన స్టార్
జస్టిన్ బీబర్ యువతను ఉర్రూతలూగించే పాప్ స్టార్. గత కొద్ది కాలంగా పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన బీబర్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. బార్సిలోనాలో షో చేయడానికి వెళ్లిన బీబర్ తనను తాకడానికి యత్నించిన అభిమాని ముఖం పగులగొట్టాడు. కారులో షో కోసం బయల్దేరి వెళ్తున్న బీబర్ ను చూసిన ఓ అభిమాని దాన్ని వెంబడించి ఆయన్ను తాకబోయాడు. చిర్రెత్తుకొచ్చిన బీబర్ సదరు అభిమాని ముఖంపై పిడిగుద్దు విసిరాడు. దీంతో ఆ అభిమానితో పాటు రోడ్డు పక్కనే బీబర్ కోసం నిల్చున్నవారు షాక్ కు గురయ్యారు. బీబర్ విసిరిన పంచ్ అభిమాని పెదాలకు బలంగా తాకడంతో అతని నోటి నుంచి రక్తం కారింది. కాగా ఈ సంఘటన మొత్తాన్ని అక్కడ ఉన్న మీడియా చిత్రించింది. 2014లో నటుడు ఓర్లాండోతో కూడా బీబర్ కొట్లాటకు దిగాడు. ఘటనపై బీబర్ ప్రతినిధిని సంప్రదించగా.. షోకు వెళ్లే ముందు అభిమానులతో బీబర్ మాట్లాడినట్లు చెప్పారు. ఫోటో, ఆటోగ్రాఫ్ ల కోసం అభిమానులు కోరగా.. అవి తనకు నచ్చవని బీబర్ చెప్పినట్లు పేర్కొన్నారు. అభిమానులు బీబర్ మాటలు వినకపోవడంతో అక్కడినుంచి బయల్దేరగా ఓ అభిమాని కారును వెంబడించినట్లు చెప్పారు. -
'టీఆర్ఎస్' ఓడితే రాజీనామా చేస్తా
-
మొక్కే కదా అని పీకేస్తే...
పంచ్ శాస్త్ర ‘నువ్వు నాకో హీరోను చూపెట్టు. నీకు క్షణాల్లో... ట్రాజెడి రాసిస్తా’ అన్నాడొక అమెరికన్ రచయిత. హీరో అంటే... కొండంత ధైర్యం. కొండను పిండి చేసే సాహసం. కళ్లతో శత్రువును దెబ్బతీసే నైపుణ్యం. మరి అలాంటి హీరోను పట్టుకొని ‘ట్రాజెడి రాస్తానంటాడేమిటి? కామెడీ కాకపోతే!’ అనుకోవద్దు. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ట్రాజెడి ఎంత పండితే, హీరో ధీరత్వం, శూరత్వం అంతగా పండుతాయి. పంచ్లైన్లు అంతగా పండుతాయి. అటు చూడండి తన అనుచరులతో ఇంద్రసేనారెడ్డి సునామీలా వీరశంకర్రెడ్డి ఇంటివైపుకు దూసుకొస్తున్నాడు. ఈ వీరశంకర్రెడ్డి విషకుట్రలో... ఇంద్రసేనారెడ్డి తన కుటుంబాన్ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలా మిగిలాడు. రగులుతున్న అగ్నిపర్వతంలా మిగిలాడు. ఇప్పుడు ఆ అగ్నిశిఖ శత్రువు ఇంటి ముందుకు వచ్చింది. శత్రువు ఇంటి ముందుకు ఇంద్రసేనారెడ్డి ఎందుకు వచ్చాడు? చంపేయడానికా? కాదు... ‘కన్న కొడుకును ఎందుకు చంపేశావురా?’ అని నిలదీసి నిప్పుల వర్షం కురిపించడానికి వచ్చాడు. వీరశంకర్రెడ్డి తన కన్నకొడుకును ఎందుకు చంపుకున్నాడు? తన కొడుకును... శత్రువైన ఇంద్రసేనారెడ్డి రక్షించినందుకు!! ఇంద్రసేనారెడ్డి గర్జిస్తున్నాడు... ‘వీర శంకర్ రెడ్డీ.... ఏం చూసి పెట్టాడురా నీకు నీ అయ్య ఆ పేరు? పసిబిడ్డను చంపుతావనా? నా మీద కనురెప్ప ఎత్తే ధైర్యమైనా లేక పసిబిడ్డ మీద కత్తి దూస్తావా?’ ఇంద్రసేనారెడ్డి భుజం మీద రక్తసిక్తదేహంతో శవమై పోయిన పసిబిడ్డ- ‘‘నాన్నా నేనేం పాపం చేశానని... చంపేశావు?’’ అని వీరశంకర్రెడ్డిని మౌనంగా అడుగుతున్నాడు. ఆ పసిబిడ్డ తల్లి దుఃఖసముద్రమై రోదిస్తోంది. భుజం మీద ఉన్న పసిబిడ్డ శవాన్ని రెండు చేతుల్లోకి తీసుకుంటూ ఇంద్రసేనారెడ్డి ఆ బిడ్డ తల్లితో అంటాడు ‘అమ్మా... ఈ చేతులు కాపాడడం వల్ల నీ బిడ్డ దూరమైతే.... నన్ను క్షమించమ్మా...’ వీరశంకర్రెడ్డి అరుస్తున్నాడు... ‘నా బిడ్డను నేను చంపుకున్నా...మీకేంది రా బాధ?’ వీరశంకర్రెడ్డి చెంప చెళ్లుమనలేదుగానీ, అంతకంటే ఎక్కువ శక్తి ఉన్న ఒక డైలాగ్ అతని చెంప చెళ్లుమనిపించలా ఇంద్రసేనారెడ్డి నోటి నుంచి దూసుకొచ్చింది... ‘నీ బిడ్డా... నువ్వు కన్నావా మోశావా?పెంచావా? రేయ్... నిన్ను పొడిస్తే అమ్మా అంటావు. ఇప్పుడు ఆ అమ్మ కడుపులోనే పొడిచావు. నీకు, నీ తమ్ముళ్లకు కత్తిగాయం ఎలా ఉంటుందో తెలుసు. ఓ తల్లికి గుండెగాయం అయితే, ఆ తల్లి పేగులకు గాయమైతే ఎలా ఉంటుందో తెలియదు. భర్త పోతే తన పసుపుకుంకుమలను పోగొట్టుకునే స్త్రీ తన బిడ్డ పోతే తన సర్వస్వం కోల్పోయి కుమిలి కుమిలి ఏడుస్తుంది చూడరా’’ ఆవేశస్థాయిని ఆర్ద్రత స్థాయికి తీసుకెళ్లి ఆ తల్లి వైపు తిరిగి ఇంద్రసేనారెడ్డి అంటాడు- ‘చూడమ్మా-నీకు నీ కొడుకు ఆకారం దూరమైందేగానీ, ఆత్మ ఈ తులసి మొక్కలో ఉంది.బాగా నీళ్లు పోసి పెంచు... పెరిగే ఈ మొక్కను చూస్తే ఎదుగుతున్న నీ కొడుకు గుర్తుకు రావాలి. అతనికి తను చేసిన పాపం గుర్తుకు రావాలి. నిద్ర పోయే ముందు... నిద్ర లేచే ముందు... అన్నం తినే ముందు ఆరు బయకు పోయే ముందు.... ఆ మొక్కకు మొక్కాలి. కాదని అడ్డంగా వాదించి ఎండ బెడితే మీ అందరికీ పాడె కడతా’ ఈ మాటలతో శత్రువుల గుండెలు వణికాయి. ఆ వణుకును తారస్థాయికి తీసుకెళ్లడానికి అన్నట్లు... ఇంద్రసేనారెడ్డి వెళుతూ వెళుతూ అంటాడు - ‘వీర శంకర్ రెడ్డి మొక్కే కదాని పీకేస్తే పీక కోస్తా!’ పంచ్శాస్త్రను పరాకాష్ఠకు తీసుకెళ్లిన ఈ డైలాగు ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంది. -
‘‘నేనే వస్తాను’’
పంచ్ శాస్త్ర దర్శకులే రచయితలయ్యాక పంచ్‌లు పవర్ఫుల్ అయ్యాయి. త్రివిక్రమ్దైతే వెరీమచ్ కార్డియల్ పంచ్. తొడ కొట్టించడు. మీసం మెలి తిప్పించడు. వెనుక గుండ్లు, సౌండ్లు పెట్టడు. వింజామరలా పంచ్‌లు విసురుతాడు. ఉద్వేగపు అగ్నిపర్వతానికి సెలైన్సర్ అమర్చి పేల్చినట్లు కూల్‌గా స్పిల్ అవుతుందా పంచ్! ‘అతడు’ సినిమానే తీస్కోండి. మహేశ్‌బాబు ‘యుద్ధానికి’ బయల్దేరి వెళ్లబోయే ముందు త్రిష పరుగున వచ్చి ‘‘నేనూ వస్తాను’’ అని అతడిని అల్లేసుకుంటుంది. మహేశ్‌బాబు మృదువుగా త్రిషను విడిపించుకుని ‘‘నేనే వస్తాను’’ అని చెప్పి వెళ్లిపోతాడు. ప్రేక్షకుల హృదయాన్ని కదిలించిన పంచ్ ఇది. అసలు పంచ్‌కి అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సన్నివేశం నుంచే! ఎంత మామూలు డైలాగునైనా సన్నివేశం పంచ్ డైలాగ్‌గా మార్చేయగలదు. అందుకు చక్కటి ఉదాహరణే ‘‘నేనే వస్తాను’’ అనే డైలాగ్. అలా సన్నివేశం, పంచ్ డైలాగ్ ఒకదాన్ని ఒకటి హిట్ చేసుకుంటాయి. ‘అతడు’ సినిమాలో ‘నేనే వస్తాను’’ అనే డైలాగ్ పంచ్ డైలాగ్‌గా ఎస్టాబ్లిష్ అవడానికి సన్నివేశం ఎలా తోడ్పడిందో మీరే చూడండి. సీన్: సీబీఐ ఆఫీసర్ ప్రకాష్ రాజ్ అండ్ టీమ్ మహేశ్‌బాబును వెతుక్కుంటూ నాజర్ ఇంట్లోకి చొరబడి గాలిస్తుంటారు. ‘‘ఆ... బై ది బై మూర్తిగారూ మీ ఇంట్లో ఉన్నాడే ఆ కుర్రాడు. వాడు మీ మనవడు కాదు. వాడి పేరు నందు. హి ఈజ్ ఎ ప్రొఫెషనల్ కిల్లర్. అపోజిషన్ లీడర్ శివారెడ్డి హత్య కేసులో వాడికోసం వెతుకుతున్నాం’’ అని చెప్తాడు. నాజర్ బ్లాంక్‌గా ఉండిపోతాడు. సీబీఐ వాళ్లు వెళ్లిపోయాక మహేశ్‌బాబు ఇంట్లోకి వస్తాడు. ఇంట్లో అందరూ అతడిని దోషిలా చూస్తుంటారు. నానా మాటలు అంటారు. మహేశ్‌బాబు నేరుగా నాజర్ దగ్గరికి వెళతాడు. ఆయన ఎదురుగా మోకాళ్లపై కూర్చొని మెల్లిగా చెప్పడం మొదలుపెడతాడు. ‘‘నిజం చెప్పే ధైర్యం లేనోడికి అబద్ధం చెప్పే హక్కు లేదు. నాకు ధైర్యం ఉంది. అందుకే పార్థు లేడనే నిజం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. కానీ ఆవిణ్ణి చూశాక (పార్థు తల్లిని చూపిస్తూ) పార్థు రాలేడని చెప్పాలనుకున్నాను. మిమ్మల్ని చూశాక ఆ మాట కూడా చెప్పలేక పోయాను. అబద్ధం ఆడాను. అబద్ధం మాత్రమే ఆడాను. మోసం చేయలేదు’’ అంటాడు మహేశ్‌బాబు. (‘‘రెంటికీ పెద్ద తేడా ఏంటో’’ అంటాడు అక్కడే ఉన్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం వ్యంగ్యంగా...) ‘‘నిజం చెప్పకపోవడం అబద్ధం. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. నేను పార్థు అని అబద్ధం చెప్పాను. నేనే పార్థు అవ్వాలని మోసం చేయలేదు. పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నా వెనక్కి తిరిగి రాటానికి కారణం ఒకటే... ఈ ఇంట్లో నేను సమాధానం చెప్పాల్సిన మనుషులు ఇద్దరున్నారు. ఒకళ్లు మీరు. ఇంకొళ్లు... (పాజ్)... అని ఆగినప్పుడు త్రిష వైపు కెమెరా తిరుగుతుంది. ‘‘వచ్చాను. చెప్పాను. ఇంక మీ ఇష్టం’’ అంటాడు (నాజర్ వైపు చేతులు చాస్తూ) మహేశ్‌బాబు. కనెక్టింగ్ సీన్: నాజర్ మహేశ్‌బాబుని చెయ్యి పట్టుకుని పై గదిలోకి తీసుకెళతాడు. ‘‘నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. సమాధానం చెప్తావా?’’ అంటాడు. ‘‘ఎవడో రైల్లో పోలీస్ కాల్పుల్లో చనిపోతే నీ దారిన నువ్వు పారిపోకుండా, వాడి ఇల్లు వెతుక్కుంటూ ఇంత దూరం ఎందుకు వచ్చావు? వాళ్ల పొలం సమస్యల్లో ఉంటే నువ్వెందుకు తీర్చావ్? వాళ్ల పిల్ల పెళ్లంటే నువ్వెందుకు డబ్బులిచ్చావ్? వాళ్లు తిడితే ఎందుకు పడ్డావ్? ఏమీ చెయ్యలేని నాలాంటి ముసలాడి ముందు తలొంచుకుని మోకాళ్ల మీద ఎందుకు కూర్చున్నావ్? ఆ.. అందుకే నువ్వే పార్థు. నువ్వే నా పార్థువి’’ అంటాడు. ‘‘నేను నిన్నేమీ అడగను. అడిగితే, నాయుడు లాంటి మనిషిని ఎలా ఒప్పించావని పొలంలోంచి కంచె తీయించేసిన రోజే నిన్ను అడిగుండాల్సింది. పాతికేళ్ల వయసులో పది లక్షలు చెక్కిచ్చావంటే, ‘ఏం చేస్తున్నావు నువ్వు’ అని ఆరోజే నేను అడిగుండాల్సింది. అప్పుడడగలేదు. ఇప్పుడు అడిగే అర్హత లేదు’’ అంటాడు. గోడపై తుపాకీని అందుకుని - ‘‘ఇది నా కొడుక్కు నేను కొనిచ్చాను. అప్పుడు వాడి ప్రాణాలు తీసింది. ఇప్పుడు నీ ప్రాణాలు కాపాడుతుంది. నువ్వు నేరం చేశావని వాడెవడో అన్నాడు. ఇప్పుడు యుద్ధం చెయ్యమని నేను చెప్తున్నాను’’ అంటాడు.. తుపాకీని మహేశ్‌బాబు చేతికి అందిస్తూ. ‘‘వెళ్లు. గెలిస్తే రా. గెలవక పోతే నువ్వేమైపోయావో అనే నిజం నాకు తెలియనివ్వకు. ఈ వయసులో నాక్కావలసింది అబద్ధాలు, నిజాలు కావు. జ్ఞాపకాలు’’ అంటాడు. మహేశ్‌బాబు వంగి నాజర్ కాళ్లకు దండం పెడతాడు. ‘‘జాగ్రత్త’’ అని ఆశీర్వదిస్తాడు నాజర్. ఇదంతా వింటున్న త్రిష, మహేశ్‌బాబు గదిలోంచి బయటికి రాగానే ఉద్వేగంతో ఒక్కసారిగా పరుగున వెళ్లి మహేశ్ బాబుని చుట్టేసుకుంటుంది. గట్టిగా పట్టుకుని వదలిపెట్టేది లేదన్నట్లు ఏడుస్తుంది. ‘‘నేనూ వస్తాను’’ అంటుంది.మహేష్‌బాబు త్రిషను మెల్లగా విడిపించుకుని తల అడ్డంగా ఊపుతూ ‘‘నేనే వస్తాను’’ అంటాడు. అని వెళ్లిపోతాడు. సన్నివేశం మలిచిన పంచ్ ఇది. పదాలను మార్చకుండా భావాలను మలిచారు త్రివిక్రమ్. అందుకే అంత పెద్ద హిట్ అయింది. - మాధవ్ శింగరాజు -
పేదరికంపై పవర్ పంచ్
లక్ష్యం వారి కుటుంబాల నేపథ్యం సాధారణం.. అమ్మానాన్నలది కాయకష్టం.. కుటుంబ పోషణ కూడా వారికి కనాకష్టం... అయినా ఆ ఇద్దరమ్మాయిలు కష్టాలనే ఇష్టాలుగా మలుచుకుని పవర్ లిఫ్టింగ్‌లో ప్రతిభ చూపిస్తున్నారు. పతకాలు సాధిస్తున్నారు. ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడే బీజం పడ్డ వారి ఉన్నత లక్ష్యాన్ని ఏమాత్రం నిరుత్సాహ పరచకుండా తమకు చేతనైనంతగా ప్రోత్సాహం అందించారు అమ్మానాన్నలు. పవర్ లిఫ్టింగ్‌లో శిక్షణ పొందేందుకు నడుంకట్టిన ఈ అమ్మాయిలు ఎనిమిదేళ్లుగా కఠోర సాధన చేస్తూ జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ఆ అమ్మాయిలే మంగళగిరికి చెందిన నగీనా, సలోమీలు. స్నేహితులైన ఈ ఇద్దరూ పవర్ లిఫ్టింగ్వైపు ఎలా అడుగులు వేశారంటే... నగీనా తండ్రి సుభాని మెకానిక్. అమ్మ అమీరున్నీసా గృహిణి. ముగ్గురు ఆడపిల్లల్లో రెండో అమ్మాయి నగీనా. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న నగీనాకు పవర్ లిఫ్టింగ్‌పై ఆసక్తి ఎలా కలిగిందో ఆమె మాటల్లోనే... సీకే గరల్స్ హైస్కూల్లో నా సీనియర్ మట్టుకొయ్య సలోమి, మరికొందరు... అంతర్జాతీయ పవర్ లిఫ్టర్, కోచ్ షేక్ సందాని వద్ద శిక్షణ పొందుతున్నారు. వారిని చూసి నాకు కూడా వెళ్లాలనిపించింది. ఇదే విషయం ఇంట్లో చెప్పా! అమ్మ ప్రోత్సహించడంతో ఎనిమిదో తరగతి (2006)లో ఉండగా పవర్ లిఫ్టింగ్ కోచింగ్‌కు వెళ్లడం మొదలుపెట్టా. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మధ్యలో కొన్నాళ్లు మానుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాలలో బీకాం (2010-13) చదువుతూ శిక్షణను కొనసాగించాను. ఏమి సాధించిందంటే... కృష్ణా యూనివర్సిటీ తరపున గుడివాడలో, విజయవాడ లయోల కళాశాలలో జరిగిన అంతర్ కళాశాలల పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 63 కేజీల కేటగిరీలో స్వర్ణపతకం, వర్సిటీ స్ట్రాంగ్ ఉమెన్ అవార్డు; గత జనవరిలో నిమ్రా కాలేజ్‌లో జరిగిన జేఎన్టీయూకే పరిధిలోని అంతర్ కళాశాలల పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్లోనూ గోల్డ్‌మెడల్; సౌత్ ఇండియా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో సీనియర్స్ విభాగం 63 కేజీల కేటగిరీలో గోల్డ్‌మెడల్. ఇక మట్టుకొయ్య సలోమీది మంగళగిరి మండలం మక్కెవారిపేట. తండ్రి చిన్నవెంకయ్య రాడ్ బెడ్డింగ్ పనిచేస్తారు. అమ్మ వరదానం గృహిణి. ఇబ్రహీంపట్నం నిమ్రా కాలేజీలోనే ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న సలోమి సీకే గరల్స్ హైస్కూల్లో చదివేటప్పుడు పీఈటీ ప్రోత్సాహంతో కోచ్ సందాని వద్ద చేరింది. అక్కడ తీసుకున్న శిక్షణతో 2008లో మిజోరాంలో జరిగిన జాతీయస్థాయి గ్రామీణ వెయిట్ లిఫ్టింగ్ టోర్నమెంట్లో కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత పవర్ లిఫ్టింగ్‌పై ఆసక్తి కలగడంతో ఆ దిశగా సాధన చేస్తోంది. సలోమీ ఏమి సాధించిందంటే... ఏఎన్‌యూ అంతర కళాశాలల పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్లలో 72 కేజీల కేటగిరీలో మూడేళ్లు వరుసగా బంగారు పతకాలు; సౌత్ ఇండియా స్థాయిలో కోయంబత్తూరు (2011)లో జరిగిన పవర్ లిఫ్టింగ్ టోర్నీలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్, హైదరాబాద్ (2012), కేరళ రాష్ట్రం (2013)లలో జరిగిన టోర్నమెంట్స్‌లో జూనియర్స్ విభాగంలో గోల్డ్ మెడల్స్, సీనియర్స్ విభాగంలో సిల్వర్ మెడల్స్. గత జనవరిలో నిమ్రా కాలేజ్‌లో జరిగిన జేఎన్టీయూకే పరిధిలోని అంతర కళాశాలల పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్లో గోల్డ్‌మెడల్. ఇటువంటి మట్టిలో మాణిక్యాలు రాష్ర్టంలో మరెందరో ఉన్నారు. వీరికి ప్రభుత్వ ప్రోత్సాహం, పెద్దల సహాయసహకారాలు లభిస్తే, ఎన్నో సంచలనాలు సృష్టించి, రాష్ట్రానికి వన్నె తెస్తారనడంలో సందేహం లేదు. - అవ్వారు శ్రీనివాసరావు, సాక్షి, గుంటూరు - ఫొటో: నందం బుజ్జి, మంగళగిరి -
నవ్వింత: పంచ్ పడింది!
పరీక్ష ఫెయిలైన కొడుకును తిడుతూ ఓ తండ్రి ‘‘ఇంకోసారి ఫెయిలైతే ఇక నువ్వు నన్ను మరిచిపోవాల్సిందే!’’ అన్నాడు కోపంగా. (ఏడాది తర్వాత) తండ్రి: ఏరా రిజల్ట్స్ వచ్చాయా? కొడుకు: ఎవరు నువ్వు? పచ్చి నిజం హిస్టరీ లెక్చరర్: మూడో ప్రపంచం యుద్ధం వస్తే ఏం జరుగుతుంది? స్టూడెంట్: ఇంకో చాప్టర్ పెరుగుతుంది!! ఏం చెప్పిందండీ! ఫ్రెండ్ 1: ఏరా కార్తీకను రెస్టారెంట్‌కు తీసుకెళ్లావు, ఏం మాట్లాడుకున్నారు. ఫ్రెండ్ 2: ఏం మాట్లాడుకోలేదు, కళ్లలోకి చూసుకుంటూ గడిపాం. ఫ్రెండ్ 1: తను కూడా ఏమీ మాట్లాడలేదా? ఫ్రెండ్ 2: మూడు పదాలు మాత్రం చెప్పింది! ఫ్రెండ్ 1: ఐ లవ్ యూ... అనా? ఫ్రెండ్ 2: కాదు... పే ద బిల్... అని -
దీపావళి పంచ్.