- పుట్టిన తర్వాత ఓ వారం రోజుల వరకూ పులులకు కళ్లు కనిపించవు. ఆ తర్వాతే మెల్లగా అన్నీ కనిపిస్తాయి. చూపు స్పష్టమ వడానికి కాస్త సమయం పడుతుంది!
- పులికి ఎంత బలముంటుందంటే... అది తనకంటే రెండు రెట్లు పెద్దదైన జీవిని కూడా తేలికగా చంపేయగలదు!
- తమ ఆహారం విషయంలో పులులు చాలా స్వార్థంగా ఉంటాయి. ఒక జంతువును చంపి తిన్న తర్వాత ఇంకా మిగిలితే... దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి, ఆకులతో కప్పి మరీ దాచిపెడతాయి. ఆ తర్వాత మళ్లీ ఆకలేసినప్పుడు వెళ్లి తింటాయి!
- పులి పిల్లలు రెండేళ్ల వరకూ తల్లిని అంటిపెట్టుకునే ఉంటాయి. ఎందుకంటే అవి పద్దెనిమిది నెలల వరకూ వేటాడలేవు. అందుకే వేటలో నైపుణ్యం సంపాదించాక గానీ తల్లిని వదిలి వెళ్లవు!
- ఇవి ఒంటరిగా వేటాడటానికి ఇష్టపడతాయి. పైగా రాత్రిపూటే వేటాడతాయి!
- ఎంత ఒంటరిగా ఉండటానికి ఇష్టపడినా, సాటి పులి విషయంలో ఇవి చాలా స్నేహంగా మెలగుతాయి. తాను ఆహారాన్ని తింటున్నప్పుడు అక్కడికి మరో పులి వస్తే, దానికి తమ ఆహారాన్ని పంచుతాయివి!
- ఎందుకంటే, పులి ఆహారం కోసం, తనను తాను రక్షించుకోవడం కోసం తప్ప ఏ ప్రాణినీ చంపదు. పరిశీలిస్తుందంతే. అందుకే ఎప్పుడైనా పులి ఎదురుపడితే కంగారుపడి దాన్ని రెచ్చగొట్టకుండా... దాని కళ్లలోకే చూస్తూ, మెల్లగా వెనక్కి నడుస్తూ పోవాలని జీవ శాస్త్రవేత్తలు చెబుతుంటారు!
- పులులకు మిమిక్రీ చేయడం తెలుసు. ఒక్కోసారి వేటాడబోయే జంతువుని మోసగించడానికి, ఆ జంతువులాగే శబ్దాలు చేయడానికి ప్రయత్నిస్తాయి!
- పులుల జ్ఞాపకశక్తి మనుషుల కంటే ముప్ఫైరెట్లు ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి అవి దేనినైనా గుర్తు పెట్టుకున్నాయంటే... చనిపోయేవరకూ మర్చిపోవు!
పులికి మిమిక్రీ చేయడం తెలుసు
Published Sat, Nov 30 2019 12:27 PM | Last Updated on Sat, Nov 30 2019 12:31 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment