పులిని ఫాలో చేసిన ఎలుగు, అది వెనక్కి తిరిగినంతనే శరణుకోరుతూ.. | bear follows tiger animal turn and sit | Sakshi
Sakshi News home page

Bear followsTiger: పులిని శరణుకోరిన ఎలుగు

Published Wed, Sep 6 2023 1:51 PM | Last Updated on Wed, Sep 6 2023 2:29 PM

bear follows tiger animal turn and sit - Sakshi

ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియో చాలా మందిని షాక్‌కు గురిచేసింది. పులి, ఎలుగుబంటి మధ్య  చోటుచేసుకున్న విచిత్రమైన సీన్‌ ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుశాంత నందా ఎక్స్‌ (ట్విట్టర్)లో పోస్ట్‌ చేశారు. 

ఈ వీడియోలో ఒక ఎలుగుబంటి పులి వెనుకగా  వెళుతున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆ ఎలుగుబంటి.. పులికి దూరంగా వెళ్లేందుకు బదులు.. వెనుక కాళ్లపై దానిముందు నిలబడి శరణాగతి వేడుతున్నట్లు చూస్తుంది. కొంతసేపటి తరువాత ఆ ఎలుగుబంటి పక్కకు వెళ్లిపోతుంది. 

ఈ వీడియోను షేర్‌ చేసిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి రమేష్ పాండే .. ‘ఈ పులి సన్యాసి అయివుండాలి లేదా ఆ ఎలుగుబంటికి కంటి చూపు తక్కువగా అయినా ఉంటుందని’ రాశారు. ఈ వీడియోను చూసిన  ఒక యూజర్‌ ‘ఇది చాలా ఆసక్తికరమైన వీడియో. అడవిలో ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పుతున్నది’ అని రాశారు. మరో యూజర్‌.. ‘ఎలుగుబంటి  ఆ పులి దృష్టిని మళించడానికి ప్రయత్నించింది. తనకు తానుగా లొంగిపోతున్నట్లు తెలియజేసిందని’ పేర్కొన్నారు. 
ఇది కూడా చదవండి: ‘... అయితే ఇండిగో ‘భాగో’ కానుందా?’... ‘ఇండియా vs భారత్‌’ తెగ నవ్విస్తున్న మీమ్స్‌!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement