bear
-
ఎనిమిదేళ్లలో తొలిసారి కనిపించిన ధ్రువ ఎలుగుబంటి.. పోలీసులు ఏం చేశారంటే!
ఐస్లాండ్లోని ఒక మారుమూల గ్రామంలోని కనిపించిన అరుదైన ధ్రువ ఎలుగుబంటిని స్థానిక ప్రజలకు ముప్పుగా భావించి పోలీసులు కాల్చి చంపారు. అయితే ముందుగా ఎలుగుబంటిని తరలించడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ విఫలం కావడంతో చంపాల్సి వచ్చందని వెస్ట్ఫ్జోర్డ్స్ పోలీస్ చీఫ్ హెల్గి జెన్సన్ తెలిపారు.ఆ ఎలుగుబంటి ఓ ఇంటికి సమీపంలోకి వచ్చిందని చెప్పారు. ఆ ఇంట్లో ఓ వృద్ధురాలు ఉందని, ఎలుగుబంటినిచూసి ఆమె భయంతో మేడపైకి వెళ్లి దాక్కుందని పేర్కొన్నారు. సాయం కోసం తన కుమార్తెకు చెప్పగా.. పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఎలుగుబంటి ద్వారా వృద్ధురాలి ప్రాణాలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందో అని దాన్ని కాల్చినట్లు పోలీసులు తెలిపారు.ధృవపు ఎలుగుబంట్లు ఐస్లాండ్కు చెందినవి కావు, అయితే కొన్నిసార్లు మంచు గడ్డలపై గ్రీన్లాండ్ నుంచి ఒడ్డుకు చేరుకుంటాయి. 2016లో ఐస్‌ల్యాండ్‌లో మొదటిసారి కనిపించింది ఇవి 150 నుంచి 200 కిలోల బరువు ఉంటాయి. ధృవపు ఎలుగుబంట్లు మానవులపై దాడి చేయడం చాలా అరుదు. 2017లో వైల్డ్‌లైఫ్ సొసైటీ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. వాతావరణ మార్పుల కారణంగా సముద్రపు మంచు కోల్పోవడం వల్ల ఆకలితో ఉన్న ఎలుగుబంట్లు జనావాసాల్లోకి రావడం ప్రారంభించాయని తెలిపింది. దీని వల్ల మానకులకు ప్రమాదం పెరిగిందని పేర్కొంది. వీటి వల్ల, మానవులకు లేదా పశువులకు ముప్పు కలిగిస్తే అధికారులు వాటిపై చర్యలు తీసుకునే అధికారం ఉంటుది. -
కరెంటు షాక్‌తో ఎలుగుబంటి మృతి
మల్కన్‌గిరి: జిల్లాలోని మల్కన్‌గిరి సమితి సీక్‌పల్లి పంచాయతీ ఎంవీ 17 గ్రామం వద్ద మంగళవారం రాత్రి అంగన్వాడీ కేంద్రం వద్దనున్న ట్రాన్స్ఫార్మర్ వైరు తగిలి ఒక ఎలుగుబంటి మృతి చెందింది. బుధవారం ఉదయం అటుగా వెళ్లిన రైతులు చూసి మల్కన్‌గిరి అటవీ శాఖ వారికి సమాచారం ఇవ్వగా, వారు వెళ్లి చూసేసరికి మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని అటవీ శాఖ అడవిలో పూడ్చివేశారు. -
ఎలుగుబంట్లలో రకాలెన్ని? ఏ ఎలుగుబంటి ప్రమాదకరం?
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 23న ‘వరల్డ్ బేర్ డే’ అంటే ప్రపంచ ఎలుగుబంటి దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎలుగుబంట్ల జీవన విధానంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు. ఎలుగుబంటి దినోత్సవాన్ని తొలిసారిగా 1992లో నిర్వహించారు. ఎలుగుబంట్ల దుస్థితిపై అవగాహన కల్పించేందుకు దీనిని ప్రారంభించారు. ప్రపంచ ఎలుగుబంటి దినోత్సవాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఎలుగుబంట్ల అభయారణ్యాన్ని సందర్శించడం, ఎలుగుబంటి పాత్ర ఉన్న సినిమా చూడటం, ఎలుగుబంటి వివరాలు కలిగిన పుస్తకాన్ని చదవడం లాంటి కార్యకలాపాలు చేస్తారు. ఎలుగుబంట్లు క్షీరద జాతికి చెందినవి. ఇవి మాంసాహార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఎలుగుబంటి జాతులు ప్రధానంగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా ఐరోపాలలో కనిపిస్తాయి. గోధుమ లేదా నలుపు రంగులో ఇవి ఉంటాయి. స్వచ్ఛమైన తెలుపు రంగులో పోలార్ ఎలుగుబంట్లు ఉంటాయి. ఎలుగుబంటి ఒంటరి జంతువు. ఎలుగుబంట్లు శీతాకాలంలో ఎక్కువసేపు నిద్రావస్థలో ఉంటాయి. ఈ కాలంలో అవి గుహలలో ఆశ్రయం పొందుతాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎనిమిది రకాల ఎలుగుబంట్లు ఉన్నాయి. అమెరికన్ బ్లాక్ బేర్ అమెరికన్ బ్లాక్ బేర్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా కనిపించే ఎలుగుబంటి జాతి. ఈ రకమైన ఎలుగుబంటి ఎక్కువగా ఉత్తర అమెరికాలోని అటవీ, పర్వత ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది మధ్యస్థ పరిమాణంతో ఉంటుంది. దట్టమైన నల్లని బొచ్చుతో శారీరకంగా చాలా బలంగా ఉంటుంది. ఆసియన్ బ్లాక్ బేర్ దాని పేరులో సూచించినట్లుగా ఇది ఆసియాలో కనిపించే ఎలుగుబంటి జాతి. ఇది భారతదేశం, కొరియా, ఈశాన్య చైనా, రష్యా, జపాన్, తైవాన్లలో కనిపిస్తుంది. దీనిని మూన్ బేర్ అని కూడా అంటారు. స్పెక్టాక్లెడ్ బేర్ ఇది ఛాతీ పైభాగంలో లేత గోధుమరంగు రంగును కలిగి ఉంటుంది. దీని ఆకారంలో కళ్లకు అద్దాలు పెట్టుకున్నట్లు కనిపిస్తున్నందున దీనిని స్పెక్టాక్లెడ్ బేర్ అని అంటారు. దీనిని ఆండియన్ బేర్, పర్వత ప్రాంత ఎలుగుబంటి అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ట్రెమార్క్టోస్ ఆర్నాటస్. ఇది దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. మధ్యస్థ పరిమాణంలో ఉంటుంది. ఇవి చెట్లపై ఎక్కువ సమయం గడుపుతాయి. ఇవి ఒంటరిగా తిరుగుతాయి. జెయింట్ పాండా జెయింట్ పాండా ఎలుగుబంటికి కళ్ళ చుట్టూ నల్లటి గుర్తులు కనిపిస్తాయి. నలుపు, తెలుపు రంగుల మృదువైన బొచ్చుతో కూడిన శరీరంతో విభిన్నంగా కనిపిస్తాయి. జెయింట్ పాండా బేర్ దక్షిణ మధ్య చైనాలో కనిపిస్తుంది. జెయింట్ పాండాకు రెండు ఉపజాతులు ఉన్నాయి. సన్ బేర్ ఎలుగుబంటి జాతులలో సన్ బేర్ చిన్నగా కనిపిస్తుంది. ఇది ఆగ్నేయాసియాలోని ఉష్ణమండల వర్షారణ్యాలలో ఉంటుంది. తేనెను విపరీతంగా ఇష్టపడే దీనిని హనీ బేర్ అని కూడా పిలుస్తారు. దాని మెడపై ప్రత్యేకమైన గుర్రపుడెక్క ఆకారంలో ఆరెంజ్ రంగు గుర్తు ఉంటుంది. సన్ ఎలుగుబంటికి రెండు ఉపజాతులు ఉన్నాయి. ఇవి అన్ని రకాల ఎలుగుబంట్లలో అత్యంత ప్రమాదకరమైనవని చెబుతారు. స్లాత్ బేర్ స్లాత్ బేర్ శాస్త్రీయ నామం మెలుర్సస్ ఉర్సినస్. ఇది ప్రధానంగా భారతదేశం, నేపాల్, శ్రీలంకలో కనిపిస్తుంది. దీని పొడవాటి దిగువ పెదవి కారణంగా దీనిని లాబియేట్ బేర్ అని కూడా అంటారు. ఈ రకమైన ఎలుగుబంట్ల చెవులు పొడవాటి జుట్టును కలిగి ఉంటాయి. ఈ ఎలుగుబంట్లు జంటగా తిరుగుతాయి. బ్రౌన్ బేర్ బ్రౌన్ బేర్ భారీ పరిమాణం కలిగిన ఎలుగుబంటి జాతి. దీనిని గ్రిజ్లీ బేర్ అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ఉర్సస్ ఆర్క్టోస్. ఉత్తర యురేషియా, ఉత్తర అమెరికాలో ఇవి కనిపిస్తాయి. బ్రౌన్ బేర్ ఉపజాతులు అనేకం ఉన్నాయి. వీటి మెడ వెనుక భాగంలో పొడవైన మందపాటి బొచ్చు ఉంటుంది. బ్రౌన్ బేర్ అనేక యూరోపియన్ దేశాలకు జాతీయ జంతువు. పోలార్ బేర్ పోలార్ బేర్ అనేది భారీ పరిమాణం కలిగిన ఎలుగుబంటి జాతి. దీని శాస్త్రీయ నామం ఉర్సస్ మారిటిమస్. ఇది ప్రధానంగా ఆర్కిటిక్ సర్కిల్ చుట్టూ కనిపిస్తుంది. దీనికి తెల్లటి బొచ్చు కింద నల్లని చర్మం ఉంటుంది. దీనికి రెండు ఉపజాతులు. అవి అమెరికన్ పోలార్ బేర్, సైబీరియన్ పోలార్ బేర్. సముద్రపు మంచు ఘనీభవించిన శీతాకాలంలో ఈ ధృవపు ఎలుగుబంట్లు మరింత చురుకుగా ఉంటాయి. ప్రాణాలు తీస్తున్న ఎలుగుబంట్లు గత రెండు దశాబ్దాలో స్లాత్ ఎలుగుబంట్లు వేలాది మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఇవి మన దేశంలో వందల మందిని చంపాయి. భారత ప్రభుత్వం అధికారికంగా ఎలుగుబంట్ల దాడులను లెక్కించనప్పటికీ, స్లాత్ ఎలుగుబంటి మన దేశంలోని అత్యంత ప్రాణాంతక జంతువులలో ఒకటని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇతర రకాల ఎలుగుబంటి కంటే ఈ స్లాత్ ఎలుగుబంటి మనుషులపై అధికంగా దాడులు చేస్తోంది. మరోవైపు మనదేశంలో ఈ రకపు ఎలుగుబంట్ల సంఖ్య పెరుగుతున్న కారణంగా అవి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మన దేశంలోని అడవులలో కేవలం 10 శాతం మాత్రమే ఎలుగుబంట్లకు అనువైనవిగా ఉన్నాయి. ఎవరైనా ఈ అడవుల్లోకి ప్రవేశించినప్పుడు లేదా అవి (ఎలుగుబంట్లు) ఆహారం, నీటి కోసం మానవ నివాసాలలోకి ప్రవేశించినప్పుడు అవి మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఆగ్రాలో ఎలుగుబంట్ల రక్షిత కేంద్రం యూపీలోని ఆగ్రాలో ప్రపంచంలోనే అతిపెద్ద రక్షిత బేర్ సెంటర్ ఉంది. ఇక్కడ 100 ఎలుగుబంట్లు ఉన్నాయి. 20 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో వీటి సంఖ్య 500కు పైగానే ఉండేది. వైల్డ్‌లైఫ్ ఎస్ఏఓస్కు చెందినప్రత్యేక బృందం ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్లో ఎలుగుబంట్లను సంరక్షిస్తోంది. తాజ్ సిటీలోని సుర్ సరోవర్ ప్రాంతంలో ఈ బేర్ కన్జర్వేషన్ సెంటర్ ఉంది. 1995లో స్థాపితమైన వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్.. ఎలుగుబంట్లతో కొందరు ఫీట్స్ చేయించడాన్ని అరికట్టేందుకు ఉద్యమించింది. యూపీలోని ‘కలందర్’ తెగ ప్రజలు ఎలుగుబంటి పిల్లలను వేటాడి, వాటి చేత గారడీ చేయించేవారు. ఈ వ్యవహారాలను వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్ అరికట్టింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం జంతువులను హింసించడం చట్టవిరుద్ధం. వైల్డ్‌లైఫ్ సంస్థ ఇప్పటివరకూ 628 ఎలుగుబంట్లను రక్షించింది. ఈ సంస్థ నాలుగు ఎలుగుబంట్ల పునరావాస కేంద్రాలను నిర్వహిస్తోంది. వీటిలో ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్ ప్రముఖమైనది. ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్ సహ వ్యవస్థాపకుడు కార్తీక్ సత్యనారాయణ మాట్లాడుతూ ఎలుగుబంట్లకు తాము ఉదయం వేళ పండ్లు, సాయంత్రం గంజి అందిస్తామన్నారు. వాటికి పలువిధాలుగా ఉపయోగపడేలా ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశామన్నారు. -
జనారణ్యంలోకి ఎలుగుబంటి
మానకొండూర్ రూరల్: జనారణ్యంలోకి చొరబడిన ఎలుగుబంటి ఎనిమిది గంటలు హైరానా చేసి ఎట్టకేలకు బోనులో చిక్కింది. కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లోని చెరువుకట్ట సమీపంలో కరీంనగర్–వరంగల్ రహదారి పక్కన ఉన్న ఓ ఇంట్లోకి దూరేందుకు యత్నించింది. కుక్కలు అరవడంతో ఇంటి పక్కనున్న వేపచెట్టు ఎక్కింది. ఇంటి యజమాని ఉదయం ఎలుగుబంటి అరుపులు విని, భయపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఎలుగుబంటి ఉన్న ప్రాంతానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెటర్నరీ వైద్యుడు మత్తు ఇంజక్షన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. గ్రామస్తుల సందడితో ఎలుగుబంటి చెట్టుదిగి చెరువు పక్కనున్న పొదల్లోకి దూరింది. పొదల్లో ఎలుగుబంటి కనిపించడంతో టపాసులు పేల్చి బయటకు రప్పించారు. అక్కడి నుంచి అది పంటపొలాల వెంట పరుగెత్తి సమీప ముంజంపల్లి గ్రామం వైపు వెళ్లింది. అటవీ అధికారులు మత్తు ఇంజక్షన్‌ను ఫైర్ చేయడంతో కిలోమీటర్ దూరం పరుగెత్తి పొలాల్లో సొమ్మసిల్లి పడిపోయింది. స్పృహ తప్పిన ఎలుగుబంటిని వలలో బంధించి వ్యాన్‌లో ఎక్కించి వరంగల్‌కు తరలించారు. -
తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంటి కలకలం
-
తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంట్ల కలకలం
సాక్షి, తిరుమల: తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంట్లు సంచారం కలకలం రేపాయి. ట్రాప్ కెమెరాల్లో చిరుత, ఎలుగుబంట్ల కదలికలు నమోదయ్యాయి. గడచిన నెల రోజుల్లో రెండు రోజులు ట్రాప్ కెమెరాలో కదలికలు నమోదయ్యాయి. డిసెంబర్ 13, 29 తేదీల్లో ట్రాప్ కెమెరాకు చిరుత చిక్కింది. చిరుతతో పాటు ఎలుగుబంట్లు కదలికలు అధికారులు గుర్తించారు. ఎలిఫెంట్ ఆర్చ్ వద్ద చిరుత, ఎలుగుబంటి తిరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. నడకమార్గంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని, గుంపులు గుంపులుగా రావాలంటూ టీటీడీ హెచ్చరికలు జారీ చేసింది. నడకమార్గం పక్కనున్న అటవీ ప్రాంతంలో చిరుత సంచరించడంతో భక్తులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. అవి తిరుగుతున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు పేర్కొన్నారు. టీటీడీ ఈవోకు ఫారెస్ట్ అధికారులు సమాచారం అందించారు. ఇదీ చదవండి: కృష్ణానది ఒడ్డున కలకలం.. అర్ధరాత్రి క్షుద్ర పూజలు! -
తల్లీకొడుకులను భయపెట్టి వారి ఆహారం తిసేసిన ఎలుగు
మెక్సికోలోని చిపింక్యూ ఎకోలాజికల్ పార్క్‌లో చోటుచేసుకున్న ఒక ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పిక్నిక్ పార్టీలోకి చొరబడిన ఒక ఎలుగుబంటి అక్కడి ఆహార పదార్థాలన్నింటినీ ఆనందంగా ఆరగించింది. ఆ ఎలుగుబంటి ఎటువంటి బెరుకు లేకుండా, టేబుల్‌పైకి ఎక్కి అక్కడి ఆహారాలను ఆనందంగా ఆస్వాదించింది. పిక్నిక్ చేసుకునేందుకు వచ్చిన తల్లీకొడుకులు ఆ సీన్ చూసి భయంతో నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. ఎలుగుబంటి నుండి తన కుమారుడిని రక్షించడానికి ఆ మహిళ ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వైరల్ వీడియో టిక్‌టాక్‌లో 10 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. అటవీ జంతువుల చేష్టలను చూసేందుకు ఇష్టడేవారు ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం చిపింక్ ఎకోలాజికల్ పార్క్ నిర్వాహకులు మాంటెర్రీ మెట్రోపాలిటన్ ప్రాంతంలో పెరుగుతున్న ఎలుగుబంటి దాడుల గురించి ఇటీవల హెచ్చరికను జారీ చేశారు. పార్క్ సందర్శకుల కోసం పలు సూచనలు చేశారు. ఫొటోలు, వీడియోల కోసం ఈ జంతువులకు దగ్గరగా వెళ్లవద్దని హెచ్చరించారు. పార్క్‌లో ఇలాంటి దాడి జరగడం ఇదేమీ తొలిసారి కాదు. 2020లో ఒక ఎలుగుబంటి సందర్శకునిపై దాడి చేసింది. అప్పుడు కూడా ఇలాంటి వీడియో వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి: ‘జో నెహ్రూ’ ఎవరు? ఇందిర, సోనియా, ప్రియాంకలకు ఏమి బహూకరించారు? A family was stunned when an intruding bear hopped onto their table to devour their food. The eldest daughter captured the scene as the bear continued munching away in Parque Ecológico Chipinque in San Pedro, Mexico 🇲🇽. The mother, as seen in the video, remained calm, shielding… pic.twitter.com/o47OkJQsNr — Voyage Feelings (@VoyageFeelings) September 27, 2023 -
పులిని ఫాలో చేసిన ఎలుగు, అది వెనక్కి తిరిగినంతనే శరణుకోరుతూ..
ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఒక వీడియో చాలా మందిని షాక్‌కు గురిచేసింది. పులి, ఎలుగుబంటి మధ్య చోటుచేసుకున్న విచిత్రమైన సీన్ ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఒక ఎలుగుబంటి పులి వెనుకగా వెళుతున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆ ఎలుగుబంటి.. పులికి దూరంగా వెళ్లేందుకు బదులు.. వెనుక కాళ్లపై దానిముందు నిలబడి శరణాగతి వేడుతున్నట్లు చూస్తుంది. కొంతసేపటి తరువాత ఆ ఎలుగుబంటి పక్కకు వెళ్లిపోతుంది. ఈ వీడియోను షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి రమేష్ పాండే .. ‘ఈ పులి సన్యాసి అయివుండాలి లేదా ఆ ఎలుగుబంటికి కంటి చూపు తక్కువగా అయినా ఉంటుందని’ రాశారు. ఈ వీడియోను చూసిన ఒక యూజర్ ‘ఇది చాలా ఆసక్తికరమైన వీడియో. అడవిలో ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పుతున్నది’ అని రాశారు. మరో యూజర్.. ‘ఎలుగుబంటి ఆ పులి దృష్టిని మళించడానికి ప్రయత్నించింది. తనకు తానుగా లొంగిపోతున్నట్లు తెలియజేసిందని’ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ‘... అయితే ఇండిగో ‘భాగో’ కానుందా?’... ‘ఇండియా vs భారత్’ తెగ నవ్విస్తున్న మీమ్స్! While people in safari wanted- fight hone de- it was an affable interaction… Tiger use their tails to communicate with each other. An upright, slowly wagging tail indicates friendliness. Bear understood the language☺️ pic.twitter.com/huDRjStLot — Susanta Nanda (@susantananda3) September 3, 2023 -
శిఖరేశ్వరంలో ఏర్పాటు చేసిన బోనులో చిక్కిన ఎలుగుబంటి
-
శ్రీవారి మెట్టు నడకదారిలో ఎలుగుబంటి సమాచారం
-
అందమైన భామలను తడిమి చూసి వదిలేసిన ఎలుగు.. తెలివితో తప్పించుకున్నారిలా!
ఎలుగుబంటి ఎంతో శాంతస్వభావం కలిగినదని చెబుతుంటారు. అయితే అది ఒక్కోసారి రెచ్చిపోయినప్పుడు దానిని ఆపడం ఎవరితరమూ కాదని కూడా అంటుంటారు. అయితే మీరు ఎప్పుడైనా అడవిమార్గం గుండా వెళ్లినప్పుడు ఎలుగుబంటి ఎదురైతే ఏం చేయాలో తెలుసా? దాని నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసా? సోషల్ మీడియాతో తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో అందమైన భామలు తాము ఎలుగుబంటి నుంచి ఎలా తప్పంచుకున్నదీ ఒక వీడియోలో చూపించారు. ఎలుగు ముంగిట చిక్కి, ఆపదలో ఉన్నవారికి ఈ వీడియో ఎంతో ఉపయోగపడేలా ఉంది. వైరల్ అవుతున్న వీడియోలో ముగ్గురు యువతులు రోడ్డుపక్కన ఉండటాన్ని గమనించవచ్చు. ఇంతలోనే వారి దగ్గరకు ఒక నల్లని ఎలుగుబంటి రావడాన్ని చూడవచ్చు. అది వారి దగ్గరకు వచ్చి, వారిని పట్టుకుంటుంది. అయితే ఆ యువతులు ఏ మాత్రం కంగారు పడకుండా కదలకుండా నిలుచునే ప్రయత్నం చేస్తుంటారు. దీంతో ఆ ఎలుగుబంటి ఆ అందమైన యువతుల నుంచి ఎటువంటి ప్రమాదం లేదని భావించి, అక్కడి నుంచి కామ్‌గా వెళ్లిపోతుంది. ఈ వీడియోను ట్విట్టర్లో @CCTV IDIOTS పేరుతో షేర్ చేశారు. ఈ వీడియోకు క్యాప్షన్‌గా ‘ఎలుగుబంటి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకోండి.. శాంతంగా, స్థిరంగా నిలుచోండి’ అని రాశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 269.4కేకు పైగా వీక్షణలు దక్కాయి. 3వేలకు పైగా లైక్స్ దక్కాయి. ఒక యూజర్ తన కామెంట్లో ఒకవేళ ఆ ఎలుగుబంటికి ఆ యువతుల స్మెల్ నచ్చకపోయి ఉంటే ఏమయ్యేదోనని అనగా, మరొకరు ఆ ఎలుగుబంటి వారిని కావలించాలనుకుంటోంది అని రాశారు. ఇది కూడా చూడండి: పట్టుతప్పి పట్టాలపై పిల్లాడు.. క్షణాల్లో స్పందించిన కార్మికుడు.. కన్నార్పనీయని వీడియో! How to survive a bear attack… stand still and stay silent pic.twitter.com/zyE17dTbSv — CCTV IDIOTS (@cctvidiots) August 13, 2023 -
భల్లూకాన్ని చూసి..బెంబేలెత్తిపోయారు..
కొత్తపల్లి (కరీంనగర్): కరీంనగర్ శివారు రేకుర్తి, సీతారాంపూర్, సూర్యనగర్ ప్రాంతాల్లో భల్లూకం హడలెత్తించింది. సుమారు 14 గంటల పాటు స్థానికులను బెంబేలెత్తించిన గుడ్డెలుగు.. ఎట్టకేలకు వరంగల్ నుంచి వచ్చిన రెస్క్యూ టీంకు పట్టుబడింది. సుమారు రెండు గంటల పాటు రెస్క్యూ టీంను ముప్పుతిప్పలు పెట్టింది. శనివారం వేకువజామున 4.30 గంటల ప్రాంతంలో కుక్కతో బయటకు వెళ్లిన సూర్యనగర్ వాసికి ఎలుగు కనిపించింది. కుక్క మొరగడంతో వెనక్కి తగ్గిన ఎలుగుబంటి.. అక్కడి నుంచి రేకుర్తి వైపు వెళ్లింది. ఎస్సారెస్పీ కెనాల్ మార్గం గుండా ప్రధాన రహదారిపై సంచరిస్తుండటం గమనించిన స్థానికులు పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. శనివారం ఉదయం వరంగల్ నుంచి వచ్చిన ఫారెస్ట్ రెస్క్యూ టీం రేకుర్తి సబ్‌స్టేషన్ ప్రాంతంలోని సమ్మక్క గుట్ట పొదల్లో దాగిన ఎలుగుబంటిని పట్టుకునేందుకు వలలు ఏర్పాటు చేసింది. ఎలుగుబంటికి మత్తు ఇంజక్షన్ ఇచ్చే క్రమంలో టీం సభ్యుడిపైకి దూసుకొచ్చింది. ఎట్టకేలకు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వలకు చిక్కిన ఎలుగుబంటిని చికిత్స నిమిత్తం వెటర్నరీ హాస్పిటల్‌కు తరలించారు. కాగా, మరో రెండు ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. -
కరీంనగర్ జిల్లాలో ఎలుగుబంటిని బంధించిన అధికారులు
-
రోడ్లపై తిరుగుతూ హల్చల్ చేసిన ఎలుగు బంటి
-
కరీంనగర్: ముప్పుతిప్పలు పెట్టి.. ఎట్టకేలకు చిక్కిన ఎలుగుబంటి
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతూ సంచరిస్తున్న ఎలుగుబంటి ఎట్టకేలకు అధికారులు పట్టుకున్నారు. దాన్ని పట్టుకునేందుకు అధికారులు వలలు ఏర్పాటు చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా ఎయిర్ గన్‌తో అటవీశాఖ అధికారులు మత్తు ఇంజక్షన్ ఇవ్వగా.. అనంతరం రేకుర్తి సమ్మక్క గద్దెల్లోకి భల్లూకం పారిపోయింది. దీంతో అటవీశాఖ అధికారుల గాలింపు ప్రక్రియ ముమ్మరం చేసి చివరికి పట్టుకున్నారు. కాసేపట్లో అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటిని అడవిలో విడిచిపెట్టనున్నారు. నడిరోడ్డు పై హల్చల్ కాగా నడిరోడ్డుపై సంచరిస్తూ నగర వాసులను పరుగులు పెట్టిస్తోంది. శుక్రవారం రాత్రి బొమ్మకల్ పంచాయతీ పరిధిలోని రజ్వీ చమాన్ ప్రాంతంలో ఓ కాలనీలోకి ప్రత్యక్షమైన ఎలుగుబంటి.. శనివారం ఉదయం రేకుర్తిలో నడిరోడ్డుపై సంచరిస్తూ ప్రజలకు కనిపించింది. దీంతో ఎలుగు బంటిని చూసిన గ్రామస్థులు భయంతో పరుగులు పెట్టారు. ఎలుగుబంటి సంచరిస్తుండగా దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ కాగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. మరో వైపు ఎలుగుబంటి కోసం అటవీశాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఎలుగుబంటి కోసం హన్మకొండ నుంచి ప్రత్యేకంగా వలలు, ఎయిర్ గన్స్, ఇతర ఎక్విప్ మెంట్ తో వచ్చారు. చదవండి: హైదరాబాద్ మెట్రో రైల్ మరో బంపర్ ఆఫర్.. -
ఎరక్కపోయి వచ్చి ఎలుగుబంటి కంట్లో పడ్డాం.. పరుగో పరుగు
ఇటీవల అమెరికాలోనిలోని మోంటానాలో గల గ్లేసియర్ నేషనల్ పార్క్‌లో పర్యాటకులకు ఒక పెద్ద ఎలుగుబంటి ఎదురుపడటంతో వారు నిలువునా వణికిపోయారు. అప్పుడు వారికి గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఈ ఉదంతాన్ని వీడియోలో బంధించారు. వన్యప్రాణుల స్వభావానికి ఆ ఎలుగుబంటి ప్రవర్తించిన తీరు ఉదాహరణగా నిలిచింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. పర్యాటకులు అవుట్‌డోర్‌లో చేసే అన్వేషణల వల్ల కలిగే ప్రమాదాలను గుర్తు చేసేలా ఈ వీడియో ఉంది. స్టీవ్ ఫ్రాంక్లిన్.. ఆ ఎలుగుబంటి హిడెన్ లేక్ ట్రయిల్‌లో హైకర్ల వైపుగా ఇరుకైన మార్గంలో కొండ నుంచి దిగుతున్న వీడియోను బంధించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆ ఎలుగుబంటి సియెహ్ బెండ్ సమీపంలోని వాలు పైభాగంలో ఉన్న చెట్ల మధ్య కనిపించింది. కాలిబాట నిటారుగా రాతితో ఉండటాన్ని వీడియోలో గమనించవచ్చు. దీని వలన హైకర్లు పక్కకు వెళ్లినా ఎలుగుబంటిని తప్పించుకోలేకపోయారు. అయితే ఆ ఎలుగుబంటికి దూరంగా ఆ హైకర్లు మెల్లగా సమీపంలోని కాలిబాట నుంచి వెళ్లడం వీడియోలో చూడవచ్చు. ఆ గ్రిజ్లీ మీ వెనుకే ఉందంటూ హైకర్లను ఎవరో హెచ్చరించడం వీడియోలో వినిపిస్తుంది. దాని నుంచి తప్పించుకునేందుకు కాలిబాటలో నడవడం శ్రేయస్కరంగా అనిపించిదని ఫ్రాంక్లిన్ పేర్కొన్నారు. నేషనల్ పార్క్ సర్వీస్ (ఎన్సీఎస్) తెలిపిన వివరాల ప్రకారం గ్లేసియర్ నేషనల్ పార్క్‌లో సుమారు వెయ్యి గ్రిజ్లీ, నల్ల ఎలుగుబంట్లు ఉన్నాయి. అవి అప్పుడప్పుడు మనుషులపై దాడులు చేస్తుంటాయి. ఎలుగుబంట్లు మనుషుల విషయంలో హింసాత్మకంగా ఉంటాయని స్పష్టంగా చెప్పలేనప్పటికీ, ఎలుగుబంట్లు ఎదురైనప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను నేషనల్ పార్క్ సర్వీస్ సూచించింది. గ్లేసియర్ నేషనల్ పార్క్‌లోని హైకర్లను సమీపిస్తున్న గ్రిజ్లీ ఎలుగుబంటి దృశ్యాలు పర్యాటకుల మదిలో నిలిచిపోతాయి. ఈ ఎలుగుబంటి తమ జాతులను, వాటి ఆవాసాలను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ఈ సంఘటన హైలైట్ చేస్తుంది. వన్యప్రాణులు ఎదురుపడినప్పుడు ఎదురయ్యే అనుభవం, వాటిని తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. సోషల్ మీడియాలో షేర్ అయిన ఈ వీడియోకు లెక్కకు మించిన వ్యూస్వస్తుండగా, కామెంట్లు కూడా అదే రీతిన వస్తున్నాయి. ఇది కూడా చదవండి: మహిళ ఆర్తనాదాలపై ఫిర్యాదు.. సంఘటనా స్థలంలో డంగైన పోలీసులు! -
Viral Video: హఠాత్తుగా ఓ నది ఎరుపు రంగులోకి మారిపోయింది
ఏమైందో ఏమో ఒక్కసారిగా ఓ నది ఎరుపు రంగులోకి మారిపోయింది. ఈ షాకింగ్ ఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఓరియన్ బ్రూవరీస్ అనే బీర్ ప్యాక్టరీ లీక్ కారణంగా జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఈ షాకింగ్ ఘటన ఒకినావాలోని నాగో సిటీలోని ఓడరేవు వద్ద జరిగింది. కర్మాగారాన్ని చల్లబరిచే ప్రక్రియలో భాగంగా వినియోగించే ఒక రసాయనం కారణంగా ఇది జరిగిందని వివరణ ఇచ్చారు. ఇది సురక్షితమైనదేనని, ఈ రసాయనాన్ని కాస్మెటిక్ పరిశ్రమలో వియోగిస్తారని చెప్పారు. సదరు ఓరియన్ బ్రూవరీ కంపెనీ ఫుడ్ కలరింగ్ రసాయనం వల్లే ఇది ఈ రంగులోకి మారిందని. దీని వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని తెలిపింది. తమ ఫ్యాక్టరీని చల్లబరిచే ప్రక్రియకు సంబంధించి ఆహార భద్రత చట్టాల నిబంధనలో జాబితాలో ఉందని వివరణ ఇచ్చింది. ప్రొపైలిన్ గ్లైకాల్ అనే రసాయంన లీకేజ్ కారణంగా ఇలా నది ఎరుపురంగులోకి మారిందని తెలిపింది. నిజానికి లీకైన శీతలీకరణ నీరు వర్షం ద్వారా నదిలోకి ప్రవహించడంతో ఇలా మారిందని, అది కాస్త సముద్రంలోకి చేరడంతో ఓడరేవు ఈ రంగులోకి మారిందని వెల్లడించింది ఓరియన్ బ్రూవరీస్ బీర్ కంపెనీ. ఈ మేరకు బీర్ కంపెనీ ప్రెసిడెంట్ హజిమ్ మురానో మాట్లాడుతూ..ఈ అసౌకర్యానికి క్షమాపణలు చెప్పడమే గాక ఈ లీక్ ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. Orion beer factory leak turns Japanese port red. pic.twitter.com/uyw3JC02S2 — Project TABS (@ProjectTabs) June 29, 2023 (చదవండి: రెండు వేల ఏళ్ల క్రితమే పిజ్జా వంటకం ఉందంటా!) -
ఊరిలోకి వచ్చిన ఎలుగుబంటి
-
జస్ట్ మిస్.. చెట్టు ఎక్కి షాకిచ్చిన ఎలుగుబంటి
-
ఆస్కార్ వేదికపై ఎలుగుబంటి.. అసలు విషయమిదే..!
అమెరికాలోని లాస్ ఎంజిల్స్ వేదికగా 95వ ఆస్కార్ అవార్డ్ వేడుక ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు వీక్షించారు. ఈ వేడుకలో సినీరంగంలో అత్యుత్తమ ప్రతిభ చాటిన ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన సినిమాలకు అవార్డులు ప్రకటిస్తారు. ఈ వేడుక కోసం ఆస్కార్ అకాడమీ నిర్వాహకులు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈవెంట్లో అందరి దృష్టిని ఆకర్షించింది ఏంటో తెలుసా? వేదికపై అందరినీ అలరిస్తూ సందడి చేసిన ఓ ఎలుగుబంటి. ఇంతకీ ఆ వేదికపై ఎలుగుబంటి ఎందుకొచ్చిందా అని సందేహం మీకు వచ్చి ఉండొచ్చు. పదండి ఆ ఎలుగుబంటి కథేంటో తెలుసుకుందాం. ఆస్కార్ వేదికపై అందరి దృష్టిని ఆకర్షించిన ఆ ఎలుగుబంటి ఓ సినిమాలోని పాత్ర. ఎలిజబెత్ బ్యాంక్స్ కామెడీ థ్రిల్లర్ మూవీలో ఎలుగుబంటి అలరించింది. ఈ ఏడాది ఆస్కార్ వేడుకపై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈవెంట్లో పాల్గొన్న సినీ దిగ్గజాలను పలకరిస్తూ సందడి చేసింది. దీంతో నెటిజన్స్ దీనిపై ఆరా తీస్తున్నారు. ఆస్కార్ వేదికపై మెరిసిన ఆ ఎలుగుబంటి గురించి ఆసక్తి కనబరుస్తున్నారు. -
3,500 ఏళ్ల నాటి ఎలుగు కళేబరం...
మాస్కో: దాదాపుగా 3,500 ఏళ్ల నాటి ఎలుగుబంటి కళేబరం ఏమాత్రం చెక్కుచెదరని స్థితిలో దొరికి సైంటిస్టులను సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. అది పూర్తిగా అతిశీతల వాతావరణంలో మంచులో కూరుకుపోవడమే ఇందుకు కారణం. రష్యాలో మాస్కోకు 4,600 కిలోమీటర్ల దూరంలో న్యూ సైబీరియన్ ఆర్చిపెలాగోలో భాగమైన బొల్షోయ్ ల్యాక్షోవ్స్కీ ద్వీపంలో జింకల వేటగాళ్లు దీన్ని 2020లో గుర్తించారు. ‘‘అది ఆడ ఎలుగుబంటి. గోధుమ రంగుతో, 1.55 మీటర్ల ఎత్తు, దాదాపు 78 కిలోల బరువుంది. చనిపోయేనాటికి బహుశా మూడేళ్ల వయసుంటుంది’’ అని తూర్పు సైబీరియాలోని లజరేవ్ మామూత్ మ్యూజియం లేబొరేటరీ చీఫ్ మాక్సిం చెప్రసోవ్ అంచనా వేశారు. ఆయన సారథ్యంలోని సైంటిస్టుల బృందం దానికి శవపరీక్ష జరిపింది. ‘‘దాని ఒంట్లోని అతి మృదువైన కణజాలం కూడా గులాబి రంగులో ఇప్పటికీ ఏమాత్రం పాడవకుండా ఉండటం నిజంగా అద్భుతం. అలాగే పసుపు రంగులోని కొవ్వు కూడా. అంతేగాక దాని చివరి తిండి తాలూకు పక్షి ఈకలు, మొక్కలు కూడా పొట్టలో అలాగే ఉన్నాయి. అంత పురాతన కాలపు జంతువు తాలూకు కళేబరం ఇంత చక్కని స్థితిలో పరిపూర్ణంగా దొరకడం ఇదే తొలిసారి’’ అని పేర్కొంది. దాని మెదడు, అంతర్గత అవయవాలను కోసి లోతుగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా కణజాల, సూక్ష్మజీవ, జన్యుపరమైన పరీక్షల్లో తలమునకలుగా ఉన్నారట. -
జూలో జంతువులకు ఆయుషు ఎక్కువ.. ఎందుకంటే..?
సాక్షి, హైదరాబాద్: వేళకు తిండి..సేద తీరేందుకు ఆవాసం ఉంటే ఏ జీవి అయినా పదికాలాలు బాగా ఉంటుందనే సామెత మన జూ పార్కులోని జంతువులకు సరిగ్గా సరిపోతుంది. అడవి జంతువులకంటే.. జంతు ప్రదర్శనశాలలోనే పుట్టి.. ఇక్కడే పెరిగిన ఆనేక జంతువులు తమ జీవితకాలంటే ఎక్కువగా జీవిస్తున్నాయి. పోషకాహారం.. అలనాపాలన బాగుండడంతో ఈ జీవులు సంపూర్ణ ఆరోగ్యంతో జీవితాన్ని గడుపుతున్నాయి. అడవుల్లో స్వేచ్ఛగా పెరిగే జంతువులు వయోభారంతో వేటను కొనసాగించలేవు. ఒంట్లో సత్తువ తగ్గడం.. ఇతర ప్రాణులతో పోటీపడలేక ఆకలితో అలమటిస్తాయి. నీరసంతో కన్నుమూస్తాయి. అదే జూలో అయితే.. సహజసిద్ధమైన ఆహారానికి కొరత ఉండదు. బలవర్ధకమైన ఆహారం.. సప్లిమెంట్లు, ఆనారోగ్యానికి గురైతే ఔషధాలు అందిస్తుండడంతో ఈ ప్రాణుల జీవనకాలం పెరుగుతుందని జూ క్యూరేటర్ రాజశేఖర్ ‘సాక్షి’కి తెలిపారు. జూలో వేట లేదు, ఇతర జంతువులతో పోరాటాలు ఉండకపోవడం కూడా వీటి జీవితకాలం పెరగడానికి కారణమని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అడవిలో పెరిగే జంతువులకంటే అధికకాలం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న కొ న్ని జంతువుల వివరాలు మీ కోసం... ఆహార ఆవసరాలకు అనుగుణంగా డైట్ జూలో వివిధ రకాల వన్యప్రాణులు ఉన్నాయి. వాటి ఆహార అవసరాలకు అనుగుణంగా పోషకాలతో కూడిన ఆహారం అందిస్తాం. ఆహారంలో నాణ్యత ప్రమాణాలు తప్పక పాటిస్తాం. ఒక్కో వన్యప్రాణి ఒక్కోతీరుగా ఆహారం తీసుకుటుంది. సమయం, సరిపడా మోతాదులో ఆహారం అందజేస్తాం.ఆడవుల్లో ఉండే వన్యప్రాణుల కంటే జూలో ఉంటున్న వన్యప్రాణుల వయో పరిమితి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటికి ఆహారం సమయానికి అందుతుంది. రోగాల బారినపడకుండా చూసుకుంటాం. – డాక్టర్ మహ్మద్ అబ్దుల్ హకీం, జూ డిప్యూటీ డైరెకర్ట్ (వెటర్నరీ) ఆపర్ణ (బెంగాల్ టైగర్) పుట్టినరోజు : డిసెంబర్ 3, 2001 వయసు : 20 ఏళ్లు సగటు జీవితకాలం : 15 ఏళ్లు జిరాఫీ ( సునామీ బసంత్) పుట్టినరోజు : ఫిబ్రవరి 13, 2005 వయసు : 17 ఏళ్లు సగటు జీవితకాలం : 15 ఏళ్లు కునాల్, సమీరా (తెల్లపులులు) పుట్టినరోజు : సెప్టెంబర్ 9, 2006 వయసు : 16 ఏళ్లు సగటు జీవితకాలం : 12–15 ఏళ్లు సులేమాన్ (జాగ్వార్) పుట్టినరోజు : ఏప్రిల్ 5, 1998 వయసు : 24 ఏళ్లు సగటు జీవితకాలం : 20 ఏళ్లు బారసింగా (చిత్తడి జింక) పుట్టినరోజు : 27, ఏప్రిల్ 2005 వయసు : 17 ఏళ్లు సగటు జీవితకాలం : 12 ఏళ్లు ఎలుగుబంటి పుట్టినరోజు : ఫిబ్రవరి 18, 2001 వయసు : 20 ఏళ్లు సగటు జీవితకాలం : 15 ఏళ్లు 30 ఏళ్ల నుంచి పక్షుల్లో కూడా హరన్బెల్ పక్షి, తెల్ల కొకాటో పక్షి వయస్సు కూడా దాదాపు 30 ఏళ్లు ఉంటుందని జూ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా 20–25 ఏళ్లు వరకు ఈ సంతతి పక్షులు జీవిస్తాయి. (క్లిక్ చేయండి: డాక్టర్ల ఫొటోలే వైద్యం చేస్తుంటాయ్!) -
గుడిలోకెళ్లి గంట కొట్టిన ఎలుగుబంటి!.. 105 కిలోల బరువైన..
సాక్షి, సత్యసాయి జిల్లా (రొళ్ల): అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడిన ఎలుగుబంటి ఆలయంలోని గంటను మోగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సీసీకెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమైన ఈ సమాచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వివరాలు... శ్రీసత్యసాయి జిల్లా రొళ్ల మండలంలోని జీరిగేపల్లిలో వెలసిన అమ్మాజీ ఆలయంలో సోమవారం రాత్రి పూజాదికాలు ముగించుకున్న తర్వాత అర్చకులు తాళం వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయంలోకి రెండు ఎలుగు బంట్లు ప్రవేశించాయి. అందులో ఒకటి నేరుగా గరుడ స్తంభం వద్ద ఏర్పాటు చేసిన 105 కిలోల బరువైన గంటకు కట్టిన తాడును నోటితో లాగేందుకు ప్రయత్నించింది. సాధ్యం కాకపోవడంతో ముందరి కాళ్లతో దానిని పట్టుకుని లాగి గంట మోగించి పక్కకు వైదొలిగింది. మంగళవారం ఉదయం ఆలయం తలుపులు తీసిన అర్చకులు సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమైన దృశ్యాలను చూసి అవాక్కయ్యారు. చదవండి: (ఇక కుప్పం పోలీసు సబ్‌డివిజన్.. విడుదలైన రాజపత్రం) -
అయ్యో.. కనిపించిన కాసేపటికే కన్నుమూత!
అరే.. ఏంటిది.. అడవుల్లో నల్ల ఎలుగుబంట్లు లేదంటే గోధుమ రంగు ఎలుగుబంట్లు ఉంటాయని తెలుసు. కానీ ఇదేంటి ధ్రువ ప్రాంతాల్లో సంచరించే తెల్ల ఎలుగుబంటి ఇలా దట్టమైన అడవిలోకి ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరు పొరబడ్డట్లే..! ఎందుకంటే మీరనుకుంటున్నట్లు ఇది పోలార్ బేర్(ధృవపు ఎలుగుబంటి) కాదు! ప్రపంచంలోనే అత్యంత అరుదైన తెల్ల ‘స్పిరిట్ బేర్’ ఇది. దీన్నే కీర్మోడ్ బేర్ అని కూడా పిలుస్తారు. అమెరికాలోని అడవుల్లో కనిపించే ఈ తెల్ల ఎలుగు.. వాస్తవానికి నల్ల ఎలుగుబంటి ఉపజాతికి చెందినది కావడం విశేషం! జన్యు మార్పుల కారణంగా నల్ల ఎలుగులకు ఇలా తెల్ల ఎలుగు పుడుతుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఈ పరిణామం ప్రతి 10 లక్షలసార్లలో కేవలం ఒక్కసారే సంభవించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. అత్యంత అరుదుగా పుట్టే ఈ రకమైన ఎలుగుబంట్లను అడవుల్లో గుర్తించడం దాదాపు అసాధ్యమని అటవీ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా కెనడాలోని బ్రిటిష్ కొలంబియా మధ్య, ఉత్తర తీర ప్రాంతాల్లో స్పిరిట్ బేర్స్ జీవిస్తాయని వారు వివరించారు. కానీ అనూహ్యంగా.. ఈ తెల్ల ఎలుగుబంటి ఇటీవల అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో ఉన్న పశ్చిమ ఎగువ ద్వీపకల్ప ప్రాంతంలో కనిపించి యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. ఓ వేటగాడు అమర్చిన ఎరవైపు వచ్చి అక్కడ అటవీ అధికారులు అమర్చిన ఓ ఆటోమెటిక్ మోషన్ సెన్సర్ కెమెరాకు చిక్కింది. ఈ ఎలుగు ముఖం, మెడ భాగం తప్ప మిగతా శరీరమంతా ధవళవర్ణంలో ఉంది. దీని వయసు సుమారు రెండేళ్లు ఉండొచ్చని, అది మగదని అధికారులు వివరించారు. కానీ, విషాదం ఏంటంటే.. కనిపించిన కాసేపటికే అది తోడేళ్ల దాడిలో మృతి చెందిందని అధికారులు చెప్తున్నారు. ఇలాంటిది మళ్లీ ఎప్పుడు కనిపిస్తుందో అనే బెంగ ఇప్పుడు పరిశోధకుల్లో నెలకొంది. ఇది తెల్ల ఎలుగేనని అమెరికా సహజ వనరుల శాఖ ఇంకా నిర్ధారించనప్పటికీ ఓ ట్రెక్కింగ్ గైడ్ మాత్రం దీన్ని స్పిరిట్ బేర్‌గా పేర్కొంటూ ఫేస్బుక్లో ఫొటోలు షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. -
పిల్లల కథ: ఎలుగుబంటి పిసినారితనం
చింతలవనంలో పెద్ద ఎలుగుబంటి ఒకటి కాపురముండేది. కూతురుని ఆమడ దూరంలో ఉన్న నేరేడుకోనలోని ఎలుగుకిచ్చి వివాహం చేసింది. పిల్లాడు బంటి బాల్యదశలోనే ఉన్నాడు. మగ ఎలుగుబంటి పగలంతా కష్టపడి చెట్లూ, పుట్టలూ వెదికి తేనెని సేకరించేది. దానితో ఆడ ఎలుగుబంటి వ్యాపారం చేసేది. ఆ అడవిలోని ఏ జంతువైనా తేనె అవసరమైతే వీరి దుకాణానికి రావలిసిందే. అయితే ఆడ ఎలుగు పరమ లోభి. పైగా నోటి దురుసు జాస్తి. కనీస జాలి లేకుండా అధిక ధరలతో ముక్కుపిండి ఖరీదు రాబట్టేది. ఇంట్లో భర్త, పిల్లాడిని కూడా తేనె ముట్టనిచ్చేది కాదు. ఒకరోజు ఆడ ఎలుగు ‘నేరేడుకోనకీ పోయి కూతురిని చూసివద్దాం’ అని అడిగింది. ‘నాకు పనుంది. పిల్లాడిని తీసుకుని నువ్వెళ్లు. అమ్మాయి కోసం వేరే కుండలో మంచి తేనె దాచాను. పట్టుకెళ్ళు’ అంది మగ ఎలుగు. ‘ఎందుకూ దండగా?ఎలాగూ అల్లుడు తెస్తాడుగా ’ అంటూ తిరస్కరించింది ఆడఎలుగు. ఇంటి ముందున్న కొబ్బరి చెట్టు నుంచి ఐదు కాయలు దింపింది. వాటి పీచు ఒలిచి, సంచీలో వేసుకుని ప్రయాణమైంది ఆడఎలుగు కొడుకు బంటితో. కొంతదూరం సాగాక బంటిగాడికి దప్పిక కలిగింది. ‘అమ్మా! దాహమేస్తోంది. మంచినీళ్ళు కావాలి’ అన్నాడు. ఆడ ఎలుగు నీళ్ళతిత్తిని వెదకబోయి నాలుక కరుచుకుంది. మంచినీరు మరిచి పోయింది. దెయ్యాలగుట్ట దాటితేగాని, నీటికుంట దొరకదు. ఇప్పుడెలా? అనుకుని ‘కాస్త ఓర్చుకో నాయనా! మరో రెండు మలుపులు తిరిగితే గుట్ట వస్తుంది. అక్కడ తాగుదువుగాని’ అంది అనునయంగా. బంటిగాడు బుద్ధిగా తలూపటంతో నడక సాగింది. మొదటి మలుపు దాటగానే మళ్ళీ అడిగాడు బంటిగాడు. ‘వచ్చేశాం! మరొక్క మలుపు’ అంటూ సముదాయించింది. కానీ విపరీతమైన దాహం వేయటంతో బంటిగాడు తట్టుకోలేక పోయాడు. సమీపంలో మరే నీటి తావూ లేదు. ‘పోనీ ఒక కొబ్బరికాయ కొట్టివ్వమ్మా!’ దీనంగా అడిగాడు. వాడలా అడగడంతో వాడి దాహం.. కేవలం కొబ్బరి నీళ్ల కోసం ఎత్తుగడ అనుకుంది. అసలు కాయలు దింపినపుడే నీరు తాగుతానని మంకుపట్టు పట్టాడు. అప్పుడు ఎలాగోలా గదిమి ఆపింది. ఇప్పుడు దాహం వంకతో కొబ్బరి నీళ్లకు పథకం వేశాడని నవ్వుకుంది. ‘ఇంకాసేపట్లో గమ్యం చేరతాం. అప్పటి వరకూ నిశ్శబ్దంగా ఉండు. లేకపోతే వీపు బద్దలవుతుంది’ అని హెచ్చరిస్తూ ముందుకు నడిపించింది. బంటిగాడిది నిజమైన దాహమని గుర్తించలేక పోయింది. నాలుగడుగులు వేశాక ‘దబ్బు’ మని కూలి,కళ్ళు తేలవేశాడు బంటిగాడు. ఆసరికి బిడ్డది నటన కాదు. నిజమైన దాహమని అర్థమైంది ఆడ ఎలుగుకి. వెంటనే సంచీలోంచి నాలుగు కొబ్బరి కాయలు తీసి వెంట వెంటనే కొట్టి, నీళ్ళు తాగించింది. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే బంటిగాడి నేల కూలాడు. బిడ్డను చూస్తూ ‘సకాలంలో కొబ్బరినీళ్ళు పట్టించుంటే, నువ్వు దక్కి ఉండేవాడివిరా! నా పిసినారితనంతో నిన్ను చంపుకున్నాను’ అంటూ భోరున ఏడ్వసాగింది. దాని ఏడుపు విని సమీపంలోని పక్షులు, జంతువులూ వచ్చాయి. ఏమీ చేయలేక జాలిగా చూస్తుండి పోయాయి. అంతలో చింతలవనానికే చెందిన కోతి ఒకటి మూలికలను అన్వేషిస్తూ అటుగా వచ్చింది. అది హస్తవాసిగల వైద్యుడిగా పేరు గాంచింది. ఆడ ఎలుగుని గుర్తు పట్టి దగ్గరకు వచ్చింది. బంటిగాడి నాడిని పరీక్షించింది. అదృష్టవశాత్తు అది కొట్టుకుంటోంది. కానీ చాలా బలహీనంగా ఉంది. స్పృహ తప్పిందే గాని, చావలేదని గ్రహించింది. వెంటనే ఆడ ఎలుగుతో ‘ఏడ్వకు. నీ బిడ్డను బతికిస్తాను’ అంది. దాంతో కోతి కాళ్ళు పట్టుకుంది ఆడ ఎలుగు.. ‘నా దగ్గరున్న సమస్త తేనెని నీకు ధార పోస్తాను. నా బిడ్డని దక్కించు’ అంటూ. తన భుజాన వేలాడుతున్న సంచిలోంచి కొన్ని ఆకులు తీసి, నలిపి, బంటిగాడి ముక్కుల్లో పిండింది కోతి. తక్షణమే బంటిగాడు ‘హాఛ్’ అంటూ మూడుసార్లు తుమ్మి, పైకి లేచాడు. సంచీలోని చివరి కాయని కొట్టి, తాగించమని ఆడ ఎలుగుకు సూచించింది కోతి. ఆడఎలుగు కొబ్బరి నీళ్లు తాగించగానే బంటిగాడు తెప్పరిల్లాడు. ఇంతలో ఒక పక్షి పండును తెచ్చిచ్చింది. అది తిన్నాక బంటిగాడికి సత్తువ కలిగి కోలుకున్నాడు. అప్పుడు కోతి ‘మన నిత్యావసరాలు తీరగా మిగిలినది దాచుకుంటే దాన్ని ‘పొదుపు’ అంటారు. కడుపు మాడ్చుకుని కూడబెడితే అది‘పిసినారితనం’ అవుతుంది. నీ లోభత్వంతో కుటుంబాన్ని వేధించావు. ఇరుగు పొరుగుని సాధించావు. దానివల్ల చెడ్డపేరు మూటగట్టుకున్నావు తప్ప చిటికడెంత గౌరవం పొందలేక పోయావు. ‘నా ’ అనే వాళ్ళు నలుగురు లేని ఒంటరి జీవితం వ్యర్థం’ అని హితవు పలికింది. బుద్ధి తెచ్చుకున్న ఆడ ఎలుగు లెంపలేసుకుంది. ‘ఇకపై నా ప్రవర్తన మార్చుకుంటాను’ అంటూ బిడ్డపై ప్రమాణం చేసింది. మరిన్ని పిల్లల కథల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
శ్రీకాకుళం జిల్లా: అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించిన ఎలుగుబంటి
-
వైరల్ వీడియో: అద్దంలో చూసుకుని ఖంగుతిన్న ఎలుగుబంటి
-
అద్దంలో చూసుకుని ఖంగుతిన్న ఎలుగుబంటి: వీడియో వైరల్
చిన్నప్పటి కథలలో విని ఉంటాం. జంతువులు తమ ప్రతిబింబాన్ని చూసుకుని దడుచుకుని పారిపోతాయని. గానీ అవి తమను తాము చూసుకుని ఏం చేస్తాయో నిజంగా ఐతే తెలియదు కదా. ఇప్పడు నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ద్వారా అవి ఏం చేస్తాయో చూస్తే నవ్వాగదు. వివరాల్లెకెళ్తే...ఎవరో కొంతమంది ఒక చెట్టుకి పెద్ద అద్దాన్ని కట్టి ఉంచారు. ఇంతలో అటుగా ఒక ఎలుగు బంటి వచ్చింది. అది ఆహారం కోసం అటు ఇటూ చూస్తూ...ఈ అద్దం వైపు చూసింది. అంతే ఒక్కసారిగా అద్దంలో తన ముఖాన్ని అది చూసుకుని కంగారుపడిపోతుంది. ఇంకో ఎలుగుబండి ఉందనుకుని ఒక్కసారిగా పరుగెత్తేందుకు ప్రయత్నిస్తుంది. ఇంతలో అద్దం కాస్త కిందపడిపోతుంది. ఈ ఘటనకు సంబందించిన వీడియోను టైమ్స్ నౌ' వార్త సంస్థం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. సరదాగా మీరు కూడా ఓ లుక్కేయండి. -
శ్రీకాకుళంలో ఎట్టకేలకు చిక్కిన ఎలుగుబంటి
-
ఎట్టకేలకు చిక్కిన ఎలుగుబంటి
శ్రీకాకుళం: జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి లో నిన్న పలువురిపై దాడి చేసిన ఎలుగుబంటి ఎట్టకేలకు చిక్కింది. ఆ ఎలుగబంటిని అధికారులు ప్రాణాలతో పట్టుకున్నారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చిన రెస్క్యూ టీమ్.. చివరకు దానిని సజీవంగా పట్టుకుంది. ఆ ఎలుగుబంటిని యానిమల్ రెస్క్యూ సెంటర్‌కి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. నిన్నటి నుంచి కిడిసింగి శారదా పురం తోటలో నివసిస్తున్న ప్రజల్ని ఎలుగుబంటి భయభ్రాంతులకు గురిచేసింది. ఆ క్రమంలోనే పలువురిపై దాడి చేసి గాయపర్చింది. దాంతో సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. రెస్క్యూ టీమ్ సహాయంతో చివరకు దాన్ని పట్టుకున్నారు. ముందుగా ఓ ఇంట్లో ఎలుగుబంటి ఉన్నట్టు గుర్తించిన అటవీశాఖ అధికారులు.. అందుకోసం స్పెషల్ టీమ్‌ను రప్పించారు. ఆ తోటలో నివసిస్తు వారిని అప్రమత్తం చేసి వారి చేత ఇళ్లు ఖాళీ చేయించారు. అనంతరం ఆ ఎలుగుబంటిని ప్రాణాలతో పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఎలుగుబంటి.. అధికారులు కనిపించరేంటి?
తిరుమలగిరి (తుంగతుర్తి): సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని తిరుమలహిల్స్ సమీపంలోని మామిడి తోటలో మంగళవారం ఉదయం ఎలుగుబంటి హడలెత్తించింది. తోటలో ఎలుగుబంటిని గమనించిన స్థానికులు ఆందోళనతో పోలీసులు, అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ ఖదీర్, బీట్ ఆఫీసర్ అచ్చయ్యలు తోట వద్దకు వచ్చి ఎలుగుబంటి సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. దాన్ని తరలించేందుకు జూపార్కు నుంచి సిబ్బంది వస్తున్నట్లు తెలిపినా.. సాయంత్రం వరకు ఎవరూ రాలేదు. మరోవైపు ఎలుగుబంటి తోటలో దూరంగా వెళ్లిపోయింది. జూపార్కు నుంచి ఎవరూ రాకపోవడంతో.. అటవీ శాఖ అధికారులు కూడా వెనుదిరిగారు. దీంతో ఎలుగుబంటి ఎప్పుడు వచ్చి ఎవరిపై దాడి చేస్తుందోనని స్థానికులు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటున్నారు. -
వినూత్నం.. కోతులు ‘బేర్’మన్నాయి!
కోహెడ రూరల్ (హుస్నాబాద్): ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు వన్య ప్రాణుల దాడులు. రైతు తమ పంటను కాపాడుకోడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇలాగే కోతులు, అడవి పందుల నుంచి తన పంటను కాపాడు కోవడానికి ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. ఎలుగుబంటి వేషధారణ ద్వారా పంటలను కాపాడుకోవచ్చని గుర్తించాడు. కోహెడ మండలం నాగసముద్రాల గ్రామానికి చెందిన రైతు భాస్కర్‌రెడ్డి కోతుల బెడద ఎక్కువ కావడంతో హైదరాబాద్‌లో రూ.10 వేలు వెచ్చించి ఎలుగుబంటి వేషధారణను తయారు చేయించాడు. పంట రక్షణగా ఉదయం, సాయంత్రం కోతుల గుంపు, అడవి పందులు రాకుండా ఎలుగుబంటి వేషధారణ కోసం కూలీని పెట్టుకుని రోజుకు అతనికి రూ.500 చెల్లిస్తూ పంటకు కాపలా కాయిస్తున్నాడు. ఒకసారి ఎలుగుబంటి వేషధారణతో కోతులను తరిమితే పది రోజుల వరకు పంటల వైపు రావడం లేదని రైతులు చెబుతున్నారు. (చదవండి: అకాల వర్షంతో పంట నష్టం) -
ఎలుగుబంట్ల సంచారంతో సున్ని పెంటలో భయాందోళనలు
-
ఎలుగుబంటి బోనులోకి బిడ్డను విసిరేసిన తల్లి!!
కన్నపేగు మమకారం మరిచిన ఆ తల్లి.. కర్కకశంగా వ్యవహరించింది. మూడేళ్ల బిడ్డను నిర్దాక్షిణ్యంగా ఎలుగుబంటి బోనులోకి విసిరేసింది. పదహారు అడుగుల లోపలికి పడిపోయిన ఆ బిడ్డ తలకు గాయమై.. స్పృహ కోల్పోయింది. అందరూ అరుస్తుండగా.. ఆ బిడ్డ వైపు వెళ్లింది ఓ ఎలుగుబంటి. మరి ఆపై ఏం జరిగిందంటే.. కన్నబిడ్డను చేజేతులారా చంపాలని ప్రయత్నించింది ఓ తల్లి. తాష్కెంట్ జూలో ఎలుగు బంటి ఎన్‌క్లోజర్ దగ్గరికి వెళ్లి.. తన బిడ్డను అందులోకి విసిరేసింది. అప్పటికే ఆమె చేష్టలు అనుమానంగా ఉండడంతో పక్కనే ఉన్న సందర్శకులు, జూ సిబ్బంది ఆమెను ఆపే ప్రయత్నం చేశారు. కానీ, హఠాత్తుగా ఆమె ఆ చిన్నారిని విసిరేసింది. ఆ ఎన్‌క్లోజర్ పదహారు అడుగుల లోతు ఉండడంతో.. కింద పడ్డ బిడ్డ తలకు గాయమైంది. ఇంతలో జూజూ అనే ఎలుగుబంటి ఆ బిడ్డ దగ్గరికి వెళ్లి వాసన చూసింది. కానీ, అదృష్టవశాత్తూ ఏం చేయకుండా దూరంగా వెళ్లిపోయింది. ఇంతలో ఆరుగురు జూ సిబ్బంది ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లారు. ఆ ఎలుగు బంటిని మళ్లీ బిడ్డ దగ్గరికి వెళ్లనీయకుండా.. దారి మళ్లించారు. ఆపై బిడ్డను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ఆ వెంటనే ఆమెను అరెస్ట్ చేయగా.. బిడ్డ ప్రాణం తీసేంత కారణం ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. హత్యాయత్నం కింద నేరం రుజువైతే ఆమెకు పదిహేనేళ్ల శిక్ష పడుతుంది. తలకు గాయం కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి నిలకడగానే ఉంది. Have You Seen This?#Tashkent, #Uzbekistan A girl survives after her mom recklessly placed her child over the security fence and she fell into a bear sanctuary at #TashkentZoo. The brown bear #Zuzu, slowly approached the girl, sniffed and walked away. pic.twitter.com/dXCZwo8YVa — Geovanni Villafañe (@RezZureKtedPoeT) January 31, 2022 -
వరంగల్ జూ పార్క్ లో వన్యప్రాణుల పోషణ భారం
-
ఆ స్టార్ 'ఎలుగుబంటి' ఇకలేదు..
Bart The Bear 2 Is Dead In Utah: సినిమాల్లో అప్పుడప్పుడు అలరించే జంతువులపై చిన్న పిల్లలకు, పెద్దవారికి ఒకరకమైన ఇష్టం ఏర్పడుతుంది. తెలుగు చిత్రం 'సిసింద్రీ'లో కనపడే జంతువులు ప్రేక్షకులకు ఎంత నచ్చాయో అందరికీ తెలిసిందే. కీలక పాత్రల్లో నటించే ఈ యానిమల్స్ అంటే పిల్లలకు మహాసరదా. హాలీవుడ్లో అయితే ఏకంగా వాటినే హీరోలుగా పెట్టి సినిమాలు తీసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది ఆ ఎలుగుబంటి. తనదైన యాక్టింగ్‌తో ఎంతగానో ఆకట్టుకుంది. అనేకమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. ఇప్పుడు ఆ ఎలుగు ఇకలేదు. అనారోగ్య సమస్యలతో 'బార్ట్ ది బేర్ 2' మరణించింది. 2000 సంవత్సరంలో అలాస్కాలోని అడవుల్లో ఈ ఎలుగు చిన్న వయసులోనే అధికారులకు దొరికింది. వేటగాడికి బలైన తన తల్లిపక్కన ఉన్న ఈ చిన్న ఎలుగును తీసుకొచ్చి సంరంక్షించారు. దీంతోపాటు 'బార్ట్ ది బేర్ 2' సిస్టర్ ఎలుగు 'హనీ బంప్' కూడా ఉంది. 'బార్ట్ ది బేర్ 2' పెరిగాక అనేక సినిమా ఆఫర్లు వచ్చాయి. చిత్రాల్లోనే కాకుండా అనేక టీవీ షోలు, ప్రకటనల్లో తళుక్కుమంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షాధరణ పొందిన హాలీవుడ్ మెగా వెబ్ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్ (జీవోటీ)'తో ఎంతోమంది అభిమానులను కూడగట్టుకుంది. అంతకుముందు కూడా చాలా సినిమాల్లో నటించిందీ ఎలుగు. యాన్ అన్ఫినిష్డ్ లైన్, విత్ఔవుట్ ఏ ప్యాడిల్, డాక్టర్ డూ లిటిల్ 2, ఇంటూ ది గ్రిజ్లీ మేజ్, హార్స్ క్రేజీ టూ, ఇంటూ ది వెస్ట్, ఇంటూ ది వైల్డ్, ఈవాన్ ఆల్మైటీ, జూకీపర్, హేవ్ యూ హియర్డ్ అబౌట్ మోర్గాన్స్, పీట్స్ డ్రాగన్, వీ బాట్ ఏ జూ వంటి చిత్రాల్లో మెరిసింది. 'బార్ట్ ది బేర్ 2' మరణంపై జీవోటీలో దానితో యాక్షన్ సీన్ చేసిన గ్వైండాలీన్ క్రిస్టీ విచారం వ్యక్తం చేసింది. ఎలుగు ఆత్మకు శాంతి కలగాలని కోరింది. తన సినీ కెరీర్లో అత్యుత్తమ కో-స్టార్ అని తెలిపింది. షూటింగ్లో ఎలుగుని శాంతింపజేయడానికి అది నటించిన సినిమా ట్రైలర్లు, పాశ్చాత్య సంగీతాన్ని సెట్స్‌లో ప్లే చేస్తుండేవారని గుర్తు చేసుకుంది. దాంతో నటించిన ప్రతీ క్షణాన్ని ఆస్వాదించానని, జీవోటీలో బార్ట్‌తో ఫైట్ చేసిన ఫొటోను షేర్ చేసింది. 'బార్ట్ ది బేర్ 2' ఒక గొప్ప ఎలుగని, దాంతో ఇన్నాళ్లు కలిసి ఉన్నందుకు చాలా గౌరవంగా భావిస్తున్నామని 'ది వైటల్ గ్రౌండ్ ఫౌండేషన్' తెలిపింది. ఎలుగు సంరక్షణ బాధ్యతలు చేపట్టిన ఈ సంస్థ యూటాలోని డేనియల్ క్రీక్ ఒడ్డున ప్రశాంతంగా బార్ట్ కన్నుమూసిందని వెల్లడించారు. -
‘ప్రవేశం లేదు’ బోర్డు.. ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి!
మనం సరదాగా అడువులు దగ్గరగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ జనసంచారం లేని సమయంలో వచ్చే జంతువులను చూస్తే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అలానే అవి చేసే పనులు చాలా ఫన్నీగా అనిపిస్తాయి. అదీకాక కొన్ని క్రూర మృగాలను చూస్తే చాలా భయంగా అనిపిస్తుంది. (చదవండి: అబ్బా ఏం ఆడుతుంది...ఇది కదా ఆటంటే) కానీ కొన్ని జంతువుల చేసే పనులు వాటి చేష్టలు మనల్ని భలే ఆకట్టుకుంటాయి. అచ్చం అలానే ఇక్కడొక ఎలుగుబంటి భలే అందంగా డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. నిజానికి అది డ్యాన్స్ చేయడం లేదు ఆ ఎలుగుబంటికి తన వీపు దురద పుట్టి అలా ఒక పోల్కి జారబడి తన వీపుని గోక్కుంటుంది. కానీ మనకు మొదట చూడగానే అబ్బా భలే డ్యాన్స్ చేస్తుందనిపిస్తుంది. అది కూడా " ప్రవేశం లేదు’ అనే బోర్డు ఉన్న పోల్కి జారబడి అలాచేయడం చాలా హాస్యస్పదంగా ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇది జంగిల్ బుక్‌లో ఉండే జంతువుల్లా ఉంది అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ఆమె గుండె చప్పుడు వినిపించడమే కాదు.. కనిపిస్తోంది కూడా!) View this post on Instagram A post shared by EARTH FOCUS (@earthfocus) -
ఛీ నా ఇల్లంతా పాడుచేసి....మొత్తం తినేసింది
యూఎస్:మన ఇళ్లల్లో కుక్కలు, పిల్లులు చోరబడి పాలు, బ్రెడ్ వంటి తినుబండరాలను తినేసి చిందరవందరంగా పడేయటం మన చూసి ఉంటాం. కానీ ఇక్కడ ఒక ఎలుగ బండి కేఎఫ్‌సీ చికెన్ తినేందుకు మాటు వేసి మరి అర్థరాత్రి వచ్చి తింటుంది. అసలు విషయంలోకి వెళ్లితే....కాలిఫోర్నియాలోని సియెర్రా మాడ్రే పట్టణానికి చెందిన ఒక వ్యక్తి తన ఇంట్లో నిద్రపోతుండగా వింత వింత శబ్దాలు వస్తుంటాయి. (చదవండి: అతనే గనుక ఆ సమయంలో అక్కడ లేకపోతే !) దీంతో ఆ వ్యక్తి వెంటనే తలుపు తెరిచి హాల్లోకి వచ్చి చూడగా వంటగది వైపు నుంచి వింత వింత శబ్దాలు వస్తున్నట్లు గుర్తిస్తాడు. అంతే మెల్లిగా భయపడుతూ వచ్చి చూస్తాడు. అక్కడ ఒక గోధమ రంగులో ఉన్న ఒక ఎలుగుబంటి కెఎఫ్సి చికెన్‌ని పరపర తింటుంది. అంతేకాదు వంటగది మొత్తం చిందరవందర చేస్తుంది. కానీ అది ఒక్కటే కాదని ఇంటి బయట ఇంకో ఎలుగుబంటి కూడా ఉందని ఆ తర్వాత గ్రహిస్తాడు. ఈ మేరకు ఆ వ్యక్తి ఆ ఎలుగుబంటిని ఏదోరకంగా బయటికి పంపించేస్తాడు. ఏదిఏమైన ఎటువంటి జంతువులు జోరబడకుండా మన ఇళ్లను జాగ్రత్తగా పరివేక్షించుకోవల్సిందే తప్పదు. (చదవండి: కాప్ 26 సదస్సులో జోబైడెన్ కునికిపాట్లు) -
పెళ్లి వేడుకలో ఎలుగుబంటి.. జనం హడల్!
మెక్సికో: వేడుకల్లో లేదా ఏదైనా ఉత్సవంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగితే అది మనకు ఎప్పటి మర్చిపోని జ్ఞాపకంలా ఉంటుంది. పైగా ఆ ఘటనకు కారణమైన మనుష్యులను చూసినప్పుడు వెంటనే ఆ సంఘటన గుర్తకు వచ్చి నవ్వుతుంటాం. అచ్చం అలాంటి ఘటన మెక్సికో వివాహ వేడుకలో చేటుచేసుకుంది. (చదవండి: రబ్బరు ష్యూస్ వల్లే బ్రతికాను) వివరాల్లోకెళ్లితే.....మెక్సికోలోని వన్యప్రాణులు సంచరించే పర్వత ప్రాంతమైన న్యూవో లియోన్ వేడుడకగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ తర్వాత అతిథులంతా భోజనం చేసే రిసెప్షన్ హాలులో భోజనం చేస్తుండగా అనుకోని అతిథలా ఒక ఎలుగుబంటి పిల్ల వస్తుంది. దీంతో పెళ్లికి వచ్చిన జనంలో ఒకటే ఆందోళన. అయితే ఆ ఎలుగుబంటి పిల్ల మాత్రం అక్కడ ఉన్న ఆహారపదార్థాలను వాసన చూస్తూ అక్కడ ఉన్న టేబుల్‌పై ఉన్న వాటిన్నంటిని పడేస్తు దానికి కావలసిని ఆహారం కోసం వెతుకుతుంది. కానీ అక్కడ ఉన్న ఒక అతిథి మాత్రం ఇది ఏమి పట్టనట్టు ఉంటాడు. ఆ తర్వాత కాసేపటికి తనదారిని తన నివాసానికి వెళ్లిపోతుంది. అయితే అదృష్టమేమిటంటే ఆ పెళ్లిలో అతిథులను ఎవర్నీ గాయపర్చలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు పెళ్లివేడుకల్లో ఉండే రకరకాల ఆహార పదార్థాల వాసనకు ఆగలేక వచ్చి ఉంటుందంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: కోవిడ్ పేరు చెప్పి రుణం తీసుకున్నాడు...కటకటాల పాలయ్యాడు) -
Viral: పులికి ధమ్కీ ఇచ్చిన ఎలుగుబంటి.. ట్విస్టు మామూలుగా లేదుగా..
సాధారణంగా పులులు అడవిలో పలు జంతువులను వేటాతూ, భయపెడతాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఎంత పులి అయినా.. ఎదురుపడ్డ జంతువును సరిగా అంచనా వేయకపోతే ఏం చేయాలో తోచదు. అటువంటి పరిస్థితిని ఓ పులి ఎదుర్కొంది. అడవి దారిలో ఉన్న పులి.. వెకన ఓ ఎలుగుబంటి వస్తుంది. పులిని చూడటంతో ఎలుగుబంటి ఒక్కసాగి పులిపైకి లేస్తుంది. ఎలుగుబంటిని చూసిన పులికి ఏం చేయాలో తెలియక.. భయంలో కింద కూర్చుండిపోయింది. అనంతరం మరోసారి పులిపైకి లేచిన ఎలుగుబంటి తన వెనకువైపునకు తిరిగి చూస్తుంది. వీడియో తీస్తున్న వ్యక్తిని చూసి వెంటనే ఎలుగుబంటి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను సందీప్ త్రిపాఠి అనే ఐఏఎఫ్ అధికారి ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను వేలమంది వీక్షించగా.. పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘పులిని బెదిరిస్తూ.. మనిషిని చూసి పరిగెత్తిన ఎలుగుబంటి’ అని ఒకరు... ‘పులికి ధమ్కీ ఇచ్చిన ఎలుగుబంటి మనిషిని చూసి జడుసుకోవడం నిజంగా ట్విస్టే’ అని మరో నెటిజన్ చేసిన కామెంట్లు హైలైట్ అయ్యాయి. Close encounter!!! A close shave... For whom...even the tiger seems confused!!!! pic.twitter.com/HD268nTKbQ — Sandeep Tripathi, IFS (@sandeepifs) October 14, 2021 -
Viral Video: అలా కాదు ఇలా.. ఇలా జారాలి.. జర్రుమని..
పిల్లల్ని ఆటస్థలంలో వదిలేస్తే వాళ్ల ఆటలకి హద్దే ఉండదు. ఎగరడాలు, దూకడాలు, జారడాలు.. ఒకటేమిటి అన్నీ చేస్తారు. అయితే పిల్లలే కాదు మాకు ఆటలంటే సరదానే అని ఒక ఎలుగుబంటి దానిపిల్ల ఆడి మరీ నిరూపించాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అవి ఎలా ఆడుకున్నాయో మీరే చూడండి. ఈ వీడియోలో అమ్మ ఎలుగుబంటి, పిల్ల ఎలుగుబంటి ఎలా వచ్చాయోగానీ స్కూల్ ప్లే గ్రౌండ్లోకి రావడం కనిపిస్తుంది. వాటికి అక్కడి ఆట స్థలంలో స్లైడ్ కనిపించింది. ఇంకేముంది. తల్లి ఎలుగుబంటి ఎక్కి కూర్చుంది. పాపం ఎలుగుబంటి పిల్లకు మాత్రం ఏం చేయాలో ఎలా ఆడాలో తెలియక తికమక పడిపోతూ అటూఇటూ తిరుగుతుంటే పైన కూర్చున్న అమ్మ ఎలుగుబంటి పెద్ద స్లైడ్‌లో నుంచి సర్రుమని జారి కిందికి వచ్చింది. ఇదిగో ఇలా జారాలని చెప్పినట్టు పిల్ల ఎలుగుబంటికి అర్థమైంది. వెంటనే తను కూడా చిన్న స్లైడ్‌లో నుంచి జారి కిందికి వచ్చింది. ఇక తల్లి పిల్ల ఒకదానిపై ఒకటి పడి సరదాగా ఆడుకుంటున్న దృశ్యం ఈ వీడియోలో కనిపిస్తుంది. దీనిని నార్త్ కరొలినాలోని ఇస్సాక్ డెక్సన్ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ బెట్సీ స్టాక్ స్లేగర్ ఫేస్ బుక్‌లో ‘దిస్ మేడ్ మై డే - ప్లే గ్రౌండ్ ఎట్ స్కూల్.. వాచ్ ది హోల్ థింగ్!! క్యప్షన్‌తో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో విపరీతంగా షేర్ కావడమేకాకుండా వందల్లో కామెంట్లు వచ్చాయి. ఈ కొంటె ఎలుగుబంట్లను ప్రేమిస్తున్నానని ఒకరు, ఇవి రెండూ సరదాగా ఆడుకుంటున్న దృశ్యం చూడటానికి చాలా బాగుందని మరొకరు కామెంట్ చేశారు. దీంతో పలువురు నెటిజన్లు ఈ వీడియోను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. చదవండి: నటి పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి... కొంచెమైతే ఏమయ్యేదో.. -
వైరల్: భల్లుకాల బంతాట.. భలే ఆట అంటున్న నెటిజన్స్
భువనేశ్వర్: ఎలుగుబంట్లు గ్రామాల్లోకి ప్రవేశిస్తే.. ప్రజలు భయంతో పరుగులు తీయడం పరిపాటి. అంతేకాకుండా అవి మనుషులపై దాడులు చేస్తూ ప్రాణాలను తీస్తున్న ఘటనలు కూడా అనేకం. అయితే రెండు భల్లూకాలు క్రీడా మైదానానికి వచ్చి, క్రీడాకారులు ఆడుతున్న ఫుట్‌బాల్ బంతిని తీసుకుపోవడంతో పాటు దానితో ఆడుకోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నవరంగపూర్ జిల్లా ఉమ్మరకోట్ సమితి మృత్తిమా పంచాయతీ శుఖిగాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం శుఖిగాం గ్రామానికి చెందిన చిన్నారులు స్థానిక క్రీడా మైదానంలో ఎప్పటిలాగే ఫుట్‌బాల్ ఆడేందుకు వెళ్లారు. వారంతా ఆటలో నిమగ్నమై ఉండగా.. సమపంలోని అడవిలో నుంచి అకస్మాత్తుగా రెండు ఎలుగుబంట్లు మైదానంలోకి ప్రవేశించాయి. వాటిని చూసిన చిన్నారులు భయంతో కేకలు వేస్తూ పారిపోయారు. అయితే రెండు భల్లూకాలు మాత్రం బంతితో ఫుట్‌బాల్ ఆడటం ప్రారంభించాయి. ఇదంతా గమనించిన స్థానికులు.. ఈ దృష్టాలను సెల్ఫోన్లలో బంధించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటి ఆటను చూసిన వారంతా ఫుట్‌బాల్ ఆటకు ఎవరైనా అభిమానులు కావాల్సిందే అనుకొంటూ మజా చేస్తున్నారు. చదవండి: వెరైటీ ఆహ్వానం: గిఫ్ట్ విలువను బట్టే పెళ్లి భోజనం -
Viral: ఊహించని పరిణామం.. పెద్దపులి పరుగో పరుగు!
జైపూర్: పెద్దపులి అంటే అడవిలో పలు జంతువులు భయంతో పరుగులు తీస్తాయి. కొన్ని జంతువులు పులి విసిరే పంజాలకు ప్రాణాలు కోల్పోయి వాటికి ఆహారంగా మారుతాయి. పులులు సైతం తనకు ఎవరైనా భయపడాల్సిందే! అని గాంభీరంగా జంతువులపై దాడి చేస్తుంటాయి. అయితే పులి పంజాకు భయపడక కొన్ని జంతువులు వాటిని ప్రతిఘటిస్తే.. పులి సైతం పరుగులు తీయక తప్పదు. అయితే అచ్చం అటువంటి ఓ ఘటన రాజస్థాన్‌లోని రణతంబోర్ నేషనల్ పార్క్‌లో చోటు చేసుంది. చదవండి: Anand Mahindra: ‘ఇదొక భావోద్వేగం’ ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై నెటిజన్ల కామెంట్స్ ఆకలితో ఉన్న ఓ పెద్దపులి వెనక నుంచి పంజా విసిరి ఓ ఎలుగుబంటిని చంపి తినాలనుకుంది. అయితే చడీ చప్పుడు కాకుండా పులి.. ఎలుగుబంటి వద్దకు వెళ్లి పంజా విసిరి దానిపై పడుతుంది. అయితే అంతే వేగంగా పులి దాడిని పసిగట్టిన ఎలుగుబంటి ఒక్కసారిగా వెనక్కు తిరిగి గట్టిగా అరుస్తూ తిరగబడుతుంది. ఊహించని ఈ పరిణామనికి ఖంగు తిన్నపెద్దపులి.. ప్రాణ భయంతో ఎలుగుబంటి నుంచి తప్పించుకోవాడనికి పరుగులు తీస్తుంది. చదవండి: అమ్మ కళ్లల్లో ఆనందం: డీఎస్పీ కుమారుడికి సెల్యూట్ చేసిన ఏఎస్సై తల్లి దీనికి సంబంధించిన వీడియోను సుశాంత నందా అనే ఐఎఫ్ఎస్ అధికారి ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటన మూడేళ్ల క్రితం జరిగింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘ పిల్లిలా వెనక నుంచి వచ్చిన పులి.. చివరకు పిల్లిలా పరుగులు తీసింది’.. ‘ఎలుగుబంటి కోపానికి పులి భయంతో పరుగో.. పరుగో..’ అని కామెంట్లు చేస్తున్నారు. -
హృదయ విదారకం.. కళ్లు పీకేసిన ఎలుగుబంటి
-
భారీ నష్టాల నుంచి బయటపడ్డ స్టాక్ మార్కెట్
ముంబై: ప్రారంభమైంది మొదలు వరసుగా పాయింట్లు కోల్పోతూ భారీ నష్టాల దిశగా పయణించిన స్టాక్ మార్కెట్ చివరకు తేరుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి ఇన్వెస్టర్ల నమ్మకాని పొంది భారీ నష్టాల నుంచి బయట పడింది. అంతర్జాతీయ మార్కెట్ సూచీల ప్రభావానికి తోడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇండియా జీడీపీని తగ్గిస్తూ అంచనాలు వెలువరించడం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించింది. మార్కెట్ ప్రారంమైననప్పటి నుంచే ఇన్వెస్టర్లు అమ్మకాలు జరిపేందుకు ఆసక్తి చూపించారు. దీంతో ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సెక్సెక్స్, నిఫ్టీలు ఊగిసలాడుతూనే ఉన్నాయి. మధ్యాహ్నం వరకు అమ్మకాలు జోరు కనిపించినా... ఆ తర్వాత క్రమంగా మార్కెట్ పుంజుకుని భారీ నష్టాల నుంచి బయట పడింది. కోలుకుంది బీఎస్ఈ సెక్సెక్స్ ఈ రోజు ఉదయం 52,673 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే వరుసగా పాయింట్లూ కోల్పోతూ వచ్చింది. ఓ దశలో 51,802 పాయింట్ల కనిష్టానికి చేరుకుని 641 పాయింట్లను కోల్పోయి ఇన్వెస్టర్లను బెంబేలెత్తించింది. ఆ తర్వాత క్రమంగా కోలుకుంటూ మార్కెట్ ముగిసే సమయానికి 135 పాయింట్లు నష్టపోయి 52,443 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం ఈ రోజు ఉదయం 15,761 పాయింట్ల వద్ద ట్రేడ్ ప్రారంభమైంది. ఓ దశలో 15,513 పాయింట్లకు పడిపోయింది..మధ్యాహ్నం నుంచి క్రమంగా మార్కెట్ కోలుకుంది. చివరకు 37 పాయింట్లు నష్టపోయి 15,709 పాయింట్ల వద్ద ముగిసింది. ఎయిర్టెల్ కంపెనీ ప్లాన్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో కంపెనీ షేర్లు లాభాల బాట పట్టాయి. -
ఎలుగుబంటి కర్రసాము చూస్తే.. నవ్వు ఆపుకోలేరు!
యానిమేషన్ కామిక్ సిరిస్‌లలో కుంగ్ఫు పాండాకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చైనా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సిరీస్‌లో మార్షల్ ఆర్ట్స్‌లో పాండా చేసే విన్యాసాలు ఆకట్టుకుంటాయి, నవ్విస్తాయి. అయితే చైనీయుల క్రియేషన్ పాండాతో పోటీ పడుతోంది ఇండియన్ ఎలుగుబంటి. ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంతనంద తాజాగా కుంగ్ ఫూ బేర్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో కర్రను చేతబట్టిన గుడ్డెలుగు కర్రసాము, మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు అలవోకగా చేసింది. రూరల్ ఇండియాలో తీసిన కుంగ్ ఫూ బేర్ వీడియో చూసిన వాళ్ల మోముళ్లో నవ్వులు పూయిస్తోంది. Kung fu bear😧 pic.twitter.com/QmcpEvkjXx — Susanta Nanda IFS (@susantananda3) June 25, 2021 చదవండి : పాపం ప్యాంటు తడిసిపోయి ఉంటుంది; వీడియో వైరల్ -
వైరల్: ఎలుగుబంటి చేజ్.. దెబ్బకు వీడియో ఆపేసి పారిపోయాడు..
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా తన ట్విటర్లో ఓ ఫన్నీ వీడియోను పోస్టు చేశారు. బైక్‌పై వెళుతున్న వ్యక్తిని ఎలుగుబంటి వెంటాడుతున్న ఈ వీడియో తమిళనాడులోని నీలగిరి పర్వతాల ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇది నెట్టింటా వైరల్‌గా మారింది. కొండల నడుమ టీ గార్డెన్లో బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తి తన ప్రయాణాన్ని వీడియో తీశాడు. చుట్టు పక్కల మొత్తం పచ్చటి ప్రకృతి నిండిన ఆ దారిలో వెళతుండగా ఆ వ్యక్తికి అనుకోని అతిథి ఎదురయ్యింది. రోడ్డు మీద మూడు ఎలుగుబంట్లు కనిపించాయి. ఆ దారిలో ఎవరూ వెళ్లకుండా అవి రోడ్డును ఆక్రమించినట్లు కనిపిస్తోంది. వాటిని చూడగానే ఆ వ్యక్తి వెంటనే బైక్ ఆపాడు. ఎలుగుబంట్లను రికార్డ్ చేస్తూ అక్కడే ఉండిపోయాడు. అయితే అలా కాసేపు అంతా ప్రశాంతంగా ఉన్నా.. ఇందులో ఓ ఎలుగుబంటి బైకర్‌ను గమనించింది. కొద్ది సెకన్లు గడిచాక ఆ ఎలుగుబంటి వ్యక్తి వైపు పరిగెత్తుకు రావడం మొదలైంది. అయితే ఒక్కసారిగా అతనివైపు పరుగులు తీయడంతో వీడియో పూర్తి అయింది. ఈ వీడియోను పోస్టు చేసిన ఆనంద్ మహీంద్రా.. ‘నీలగిరి పర్వతాల్లో ఏదో ఒక ప్రదేశంలో ఇది జరిగింది. థ్రిల్ కావాలంటే క్లిప్ చివరి వరకూ చూడండి. జావా మోటార్ సైకిల్స్ టీం ఎలుగుబంట్లు వార్నింగ్ ఇస్తే జాగ్రత్తగా ఉండాలనే దానిని ఇంట్రడ్యూస్ చేయాలి’ అని కామెంట్ పెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. పైగా వీడియోను జావా మోటార్ సైకిల్స్ టీంకు ట్యాగ్ చేసి సలహా కూడా ఇచ్చారు. చదవండి: వైరల్: రెప్పపాటులో ఎంత పద్ధతిగా కూలిందో చూడండి! Somewhere in the Nilgiris... Wait till the end of the clip if you want to feel an adrenaline rush...To the @jawamotorcycles team: We need to introduce a ‘Bear Charge’ warning on our bikes... pic.twitter.com/Zy24TuBroF — anand mahindra (@anandmahindra) June 24, 2021 -
బాబోయ్ ఎలుగుబంటి.. భయపెట్టేసింది
జఫర్‌గఢ్/న్యూశాయంపేట: జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం హిమ్మత్‌నగర్ గ్రామంలో శుక్రవారం ఎలుగుబంటి కనిపించింది. గ్రామంలో అకుల నర్సయ్య ఇంటి వద్ద ఉన్న చిం త చెట్టు పైకి ఎక్కి అరుస్తోంది. దీనిని గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమా చారం ఇచ్చారు. రెస్క్యూ టీం సభ్యులు దూరం నుంచి మత్తు ఇంజక్షన్ వదలగా.. ఎలుగు బంటి చెట్టుపైనే స్పృహ తప్పింది. వెంటనే వల సాయంతో కిందకు దించి.. వాహనంలో హన్మకొండలోని జూ పార్కుకు తరలించారు. చదవండి: ధరల మంట.. బతుకు తంటా! -
స్తంభం ఎక్కిన ఎలుగు, తనవారికోసం ఎదురుచూపులు!
వాషింగ్టన్: సాధారణంగా ఎలుగు బంట్లు అడవిలో ఉంటాయి. ఒక్కోసారి అడవిలో వాటికి ఆహారం దొరక్కగానీ లేదా దారి తప్పిగానీ మానవ ఆవాసాలలోకి ప్రవేశిస్తాయి. ఈక్రమంలో ఎలుగుబంట్లు మనుషులపైన దాడిచేసిన ఘటనలు కూడా కోకొల్లలు. అయితే, ఇక్కడ ఒక ఎలుగు బంటి అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతంలోని ఒక విద్యుత్ స్తంభంపైకి ఎక్కి కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. అమెరికాలోని దక్షిణ అరిజోనా, విల్కాక్స్ పట్టణం కేంద్రంగా సల్ఫర్ స్పింగ్ వ్యాలీ ఎలక్ట్రిక్ కో ఆపరేటివ్ అనే సంస్థ ఉంది. ఇది ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా చేస్తుంది. ఈ సంస్థ కార్మికులు ఒక ఎలుగు బంటి విద్యుత్ స్తంభం మీద ఉండటాన్ని గమనించారు. ఈ క్రమంలో ఆ సంస్థ కార్మికులు వెంటనే ఆ స్తంభానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆ తర్వాత ఒక పెద్ద క్రేన్‌ను తెప్పించారు. ఒక ఫైబర్ గ్లాస్ స్టిక్‌తో దాన్ని అదిలించే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆ ఎలుగు బంటి మెల్లగా స్తంభం కిందకు దిగి, సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్లిపోవడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘ పాపం.. ఎలుగుబంటి తన వారికోసం పైకెక్కి చూస్తుంది..’, ‘అయ్యో.. ఎంత పెద్ద ఆపద తప్పిపోయింది..’, ‘ హయ్.. మిత్రమా.. జాగ్రత్తగా దిగి నీ ఇంటికి వెళ్లిపో.. ’ ‘విద్యుత్ కార్మికుల చేసిన పనికి హ్యట్సాఫ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: వైరల్: చావు నుంచి తప్పించుకున్న మహిళలు “Alright, little bear. Time to get off this pole.” After being called to the scene, utility workers immediately cut the power and then helped coax this bear off a power pole in Arizona. The bear eventually climbed down safely and ran off into the desert. https://t.co/N3YkuSiGgg pic.twitter.com/FJSe51UEXD — ABC News (@ABC) June 10, 2021 -
కారులో ఎలుగుబంటి.. ప్రాణాలు కాపాడిన కుక్క!
హ్యూస్టన్ కౌంటీ: సాధారణంగా కార్‌ను పార్కింగ్ చేసే తొందరలో.. ఒక్కొసారి దాని డోర్‌ని లాక్‌చేయడం మరిచిపోవడం లేదా లాక్ వేసిన కూడా సరిగ్గా పడక పోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొన్ని ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటాయి. అయితే, జార్జియాలోని హ్యూస్టన్ కౌంటీలో ఒక మహిళకు ఇలాగే అనుకోని వింత సంఘటన ఎదురైంది. వివరాలు.. హ్యూస్టన్ కౌంటీకి చెందిన మేరీజేన్ అనే మహిళ వార్నర్ రాబిన్స్ స్కూల్లో ఆర్ట్ టీచర్‌గా పని చేస్తుంది. ఆ స్కూల్ గాట్టిన్బర్గ్లోని టెనస్సీలో ఉంది. ప్రతిరోజు కార్లో అక్కడికి వెళ్లి క్లాస్‌లు తీసుకొని రాత్రి వరకు తన గమ్యస్థలానికి చేరుకుంటుంది. అయితే, ఆ టీచర్ ఉన్న అపార్ట్మెంట్ అడవికి దగ్గరగా ఉంటుంది. అక్కడ జన సంచారం కూడ తక్కువగా ఉంటుంది. అందుకే ఆమె రక్షణ కోసం ఒక కుక్కను కూడా పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఒకరోజు క్లాసులు పూర్తిచేసుకొని అర్ధరాత్రి హ్యూస్టన్ కౌంటీకి చేరుకుంది. అయితే, ఆరోజు రాత్రి ఒక నల్లని ఎలుగు బంటి ఆమె కారు డోరును తెరిచి దానిలో ప్రవేశించింది. అంతటితో ఆగకుండా, సీట్లను , ఆక్సిజన్ బెలూన్ను చింపేసింది. కార్లోపలి భాగాలను, ఇతర వస్తువులను చిందర వందర చేసేసింది. పాపం.. కార్లోపలికి వెళ్లిన ఎలుగు బంటికి , బయటకు వెళ్లటానికి డోర్లు తెరుచుకోలేదు. దాంతో అలాగే కార్లో ఉండిపోయింది. మేరీజేన్ ప్రతిరోజులాగే ఉదయాన్నే 6 గంటలకు స్కూల్‌కు వెళదామని కార్ దగ్గరకు వెళ్లింది. అయితే, తన పెంపుడు కుక్క .. కారును చూసి భయంతో వణికిపోతూ.. వింతగా అరవడాన్ని మేరీ గమనించింది. దీంతో , ఆమె కార్‌ను పరీక్షించి చూసింది. మొదట కార్లో ఏవరో వ్యక్తి ఉన్నట్లు భావించింది. కాస్త దగ్గరకు వెళ్లి చూడగానే ఆమె నోటి వెంట మాట రాలేదు. కార్లో ఉంది మనిషికాదు... ఎలుగు బంటి అని షాక్‌కు గురయ్యింది. వెంటనే.. అక్కడి పోలీసు అధికారులకు సమాచారం అందించింది. కాసేపటికి వారు అక్కడికి చేరుకున్న పోలీసులు కార్ దగ్గరకు వెళ్లి పెద్ద శబ్దాలు చేశారు. దీంతో కారు లోపల ఉన్న ఎలుగు బంటి అద్దాలను పగలకొట్టుకుని అక్కడి నుంచి అడవిలోకి పారిపోయింది. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ పాపం.. ఎలుగు బంటికి మీ కారులో తినడానికి ఏం దోరకలేదు’, ‘ ఇంకా నయ్యం మీపై దాడిచేయలేదు’, ‘ మీ అదృష్టం బావుంది ’ , ‘ మీ పెంపుడు కుక్కే మీ ప్రాణాలను కాపాడింది ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల ఒక మహిళ తన ఇంటి గోడపై వచ్చిన ఒక ఎలుగు.. తన పెంపుడు కుక్కలపై దాడి చేస్తుందని వట్టి చేతులతోనే ఎలుగుతో పోరాడిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. చదవండి: బ్రేవ్‌గర్ల్ వర్సెస్ బియర్ : ఎలుగుబంటికే ఎదురెళ్లి -
పెరట్లోకి వచ్చిన ఎలుగుబంటిని ధైర్యంగా ఎదుర్కొన్న మహిళ
-
బ్రేవ్‌గర్ల్ వర్సెస్ బియర్ : ఎలుగుబంటికే ఎదురెళ్లి
పెంపుడు జంతువులంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా పెట్స్‌ని పిల్లలు ప్రాణంగా చూసుకుంటారు. వాటి ఆలనా పాలనా అంతా తామే చూస్తారు. ఇంట్లో వాళ్లయినా సరే వాటిని ఏమన్నా అంటే చూస్తూ ఊరుకోరు. మరోవైపు వైల్డ్ అనిమల్స్ని జూలో చూడటానికి ఓకే కానీ ఇంటికి వస్తే హడలిపోతాం. అవెక్కడ దాడి చేస్తాయో అని వాటికి దూరంగా వెళ్తాం, పరిస్థితులు అనుకూలిస్తే దాక్కుంటాం. కానీ దీనికి రివర్స్‌లో జరిగింది ఓ చోట. అడవి ఎలుగుబంటి ఇంట్లోకి వచ్చి పెంపుడు జంతువుల మీద దాడికి సిద్ధమైతే ఓ పాప ధైర్యంగా ఆ ఎలుగుతో పోరాడింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. ఎంత ధైర్యమో ఇండియాలోనే ఈ ఘటన జరిగినప్పటికీ ఎక్కడ జరిగిందనే వివరాలపై స్పష్టత లేదు. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద తన ట్విట్టర్ అకౌంట్లో ఈ వీడియో షేర్ చేశారు. పెంపుడు జంతువులను కాపాడేందుకు ఆ చిన్నారి చేసిన సాహాసం చూసి, ఆ పాపను మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. చదవండి : హంసనావ -
అటు ఏనుగు, ఇటు ఎలుగు బంటి
బెంగళూరు: నాగరికత పెరిగిపోవడంతో రానురాను అడవులు, మనుషులకు మధ్య దూరం తగ్గిపోతోంది. దీంతో జనావాసల్లోకి వస్తున్న అడవి జంతువులు ఇబ్బందులు పడుతున్నాయి. మనుషుల మనుగడ కోసం చేసుకున్న ఏర్పాట్లలో చిక్కకుని విలవిలాడుతున్నాయి. ఉపయోగంలో లేని వాటర్ ట్యాంక్‌లో చిక్కకుని ఒక గున్న ఏనుగు బయట పడేందుకు ఇబ్బంది పడింది. వెంటనే గమనించిన ఫారెస్టు సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి ఆ ఏనుగును కాపాడారు. ఏనుగు రెస్క్యూ ఆపరేషన్ వీడియోని కర్నాటకకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కస్వాన్ షేర్ చేశారు. మరోవైపు ఓ గ్రామానికి సమీపంలోకి వచ్చిన ఎలుగుబంటి అక్కడున్న టబ్‌లో ఏంచక్కా ఎంజాయ్ చేసింది. తనివితీరా బాత్‌టబ్ చేసింది. ఈ రెండు వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. Kiddo fell into reservoir from where water was being supplied to village. Territorial team, wildlife squad II & vet team reached on time. Was rescued & happily united with family. Mother was watching from safe. Our team. pic.twitter.com/NqSnhH94Rs — Parveen Kaswan, IFS (@ParveenKaswan) May 23, 2021 Oh, my my, but great all is well when it ends well 👏😀 ,Our Mr.Bear wants to bath on a jacuzzi but unfortunately could get only this tub in the End. As this is being lock down time he decided not to make a fuss of it 😀 pic.twitter.com/ghyNPJSmJt — ncsukumar (@ncsukumar1) May 23, 2021 -
కామారెడ్డి జిల్లా: చిట్యాలలో ఎలుగుబంటి హల్చల్
-
చిట్యాలలో ఎలుగుబంటి హల్చల్
సాక్షి, కామారెడ్డి జిల్లా: తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. అటవీ ప్రాంతం నుంచి ఎలుగుబంటి నీటి కోసం గ్రామ శివారులోకి రాగా గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. గ్రామస్తులు ఎలుగుబంటిని తరిమికొట్టగా గ్రామ శివారులో గల నీళ్లు లేని బావిలో పడింది. దాంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారమివ్వగా వలల సహాయంతో ఎలుగుబంటిని పట్టుకోవడానికి అధికారులు ప్రయత్నించారు. గ్రామస్తుల అరుపులు కేకలతో ఓ సందర్బంలో దాడి చేయడానికి ఎలుగుబంటి ప్రయత్నించి అడవిలోకి పారిపోయింది. చదవండి: విచిత్ర సంఘటన.. డ్రైవర్‌గా మారిన పెళ్లికొడుకు మంచె మీదే బీటెక్ విద్యార్థి ఐసోలేషన్.. చెట్టుమీదే -
ఎన్నికల ప్రచారంలో 500 కేజీల ఎలుగు బంటి
కాలిఫోర్నియా : ఎన్నికల ప్రచారాలు కొత్త పుంతలు తొక్కుతున్న రోజులివి. తమకంటూ జనాల్లో ఓ గుర్తింపు రావాలన్న కసితో కొత్త కొత్త దార్లు వెతుక్కుంటున్నారు అభ్యర్థులు. తాజాగా, అమెరికాలో ఓ గవర్నర్ అభ్యర్థి ఎన్నికల ప్రచారానికి ఏకంగా ఎలుగు బంటిని తీసుకువచ్చాడు. వివరాలు.. జాన్ కాక్స్.. కాలిఫోర్నియా గవర్నర్‌కు పోటీ చేస్తున్న అభ్యర్థి. మంగళవారం ‘బ్యూటీ అండ్ ది బీస్ట్’ అనే అంశం మీద ఆయన ప్రచారం నిర్వహించాడు. ప్రస్తుత డెమోక్రటిక్ పార్టీ గవర్నర్ గేవిన్ న్యూసమ్‌ను బ్యూటీగా.. తనను తాను ఓ బీస్ట్‌గా చెప్పుకొచ్చాడు. తన ఎన్నికల ప్రచార జెండాపై కూడా ఎలుగు బంటి బొమ్మను ముద్రించాడు. అందుకే అందరికీ తన గుర్తు గుర్తుండిపోయేలా కొడియక్ జాతికి చెందిన ఓ పేద్ద గోధుమ రంగు ఎలుగు బంటిని ప్రచారానికి తెచ్చాడు. దాని పేరు ‘ట్యాగ్’. అది దాదాపు 500 కిలోల బరువుంది. ఎలుగు బంట్ల జాతిలో అదే పెద్దది. అది సినిమాలకోసం, టీవీ సిరీస్ కోసం ట్రైనింగ్ ఇచ్చినది కావటంతో ప్రచారంలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రచారం సందర్భంగా జాన్ కాక్స్ మాట్లాడుతూ.. ‘‘ కాలిఫోర్నియాను అభివృద్ధి చేయటంలో అందగాళ్లైన రాజకీయనాయకులు ఓడిపోయారు. కాలిఫోర్నియాను రక్షించుకోవటానికి పెద్ద మార్పులు అవసరం. టాక్సులు కట్ చేస్తా.. కాలిపోర్నియాను అభివృద్ధి పథంలో నడిపిస్తా’’ నని అన్నారు. చదవండి, చదివించండి : వైరల్: ఆ రెండిటికీ తేడా తెలియకపోతే ఇలానే ఉంటుంది -
వైరల్: పాపం ఈ భల్లూకం కష్టం చూడండి.. పిల్లల కోసం..
ఓ భల్లూకం(ఎలుగు బంటి) తన పిల్లలను రోడ్డు దాటించడానికి కష్టపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దిగా ఉండే ఆ రోడ్డు నుంచి తన పిల్లలను జాగ్రత్తగా తీసుకుళ్లేందుకు ఆ ఎలుగు పడుతున్న పాట్లు చూసి పలువురు నెటిజన్లు చలిస్తున్నారు. యుకే జరిగిన ఈ సంఘటన అక్కడి పోలీసులు పోలీసులు తమ ఫేస్బుక్ పేజీలో షేర్ చేశారు. నాలుగు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో.. ఎలుగు బంటి తన పిల్ల భల్లూకాన్ని నోట కరుచుకుని రోడ్డు దాటే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో రోడ్డుపై కొన్ని వాహనాలు నిలిచి ఉన్నాయి. వాటిని చూసి కంగారు పడ్డ ఆ ఎలుగు వెంటనే వెనక్కి తిరిగి తన మిగతా పిల్లల దగ్గరికి వెళ్లింది. వాటిని కూడా తనతోపాటు రమ్మని సైగ చేస్తూ మరోసారి ఒక పిల్ల ఎలుగును నోట కరుచుకుంది. అలా రోడ్డు దాటుతూ మళ్లీ వెనక్కి తిరిగింది. అలా ఆ తల్లి ఎలుగు తన పిల్లల రక్షణపై ఆందోళన చెందుతూ తడబడుతున్న తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘అందరి తల్లుల కష్టాలు ఇలాగే ఉంటాయి, పాపం తల్లి ఎలుగు’, ‘ఇదే తల్లి ప్రేమ అంటే తన పిల్లల రక్షణ కోసం ఈ ఎలుగు ఎంత అందోళన చెందుతుందో చూడండి’ అంటూ కొందరూ స్పందిస్తుండగా.. మరికొందరూ అంతసేపు ఓపికగా రోడ్డుపై ఎదురు చూస్తున్న వాహనాదారులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేగాక పోలీసులు సైతం ఎలుగు సంరక్షణ గురించి ఆలోచించి అంతసేపు ఓపిగ్గా వాహనాలు నిలిపిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. -
ఎలుగుబంటి విత్ పింఛం
కొన్ని చాలా సడెన్‌గా జరుగుతాయి.. కన్నార్పేలోపే మాయమైపోతుంటాయి కూడా.. ఇక్కడ కనిపించే చిత్రం కూడా అలాంటిదే.. బైజూపాటిల్ అనే ఫొటోగ్రాఫర్ కాస్త చురుకు కాబట్టి.. వెంటనే ఇలా క్లిక్మనిపించేశాడు.. చూశారుగా.. ఎలుగుబంటి విత్ పింఛం.. రాజస్తాన్‌లోని రణతంబోర్ జాతీయ పార్కులో పర్యాటకులు జీప్‌లో వెళ్తుండగా.. నెమలి పింఛం విప్పి ఆడటం మొదలుపెట్టింది.. వారు చూస్తున్నారు.. అంతలో ఒక ఎలుగుబంటి అలా వచ్చి.. నిల్చుని చూడటం.. బైజూపాటిల్ తన కెమెరా కంటిలో దీన్ని బంధించేయడం చకచకా జరిగిపోయాయి. -
ఈ అన్నా చెల్లెలి బంధం చాలా వెరైటీ!
లూబా తొమ్మిది నెలల వయసుకు వచ్చింది. నెలనాళ్ల పిల్లగా ఉండగా వెయ్యి రూపాయలు పెట్టి లూబాను కొని ఇంటికి తెచ్చుకున్నాడు టెర్డే యోమ్చా. సొంత చెల్లిలా చూసుకున్నాడు. లూబా అందమైన ఆడ ఎలుగు పిల్ల. గౌన్లు కుట్టించాడు. వెంటపెట్టుకుని ఊళ్లో తిప్పాడు. అరుణాచల్ ప్రదేశ్‌లోని లిపు ఈ అన్నా చెల్లెళ్లది. చెల్లికి తనే స్నానం చేయించేవాడు టెర్డే. చెల్లిని పూర్తి శాకాహారిగా పెంచాడు. పప్పన్నం, క్యాబేజీ, మొక్కజొన్న, టమాటా, చెరకుగడలు, పండ్లు ప్రేమగా తినిపించేవాడు. పాలు తాగించేవాడు. లూబా కూడా ఎప్పుడూ టెర్డే అన్నయ్య వెంటే ఉండేది. అన్నయ్య ఏం చేస్తుంటే అది చెయ్యాలని చూసేది. అన్నయ్య పాఠ్యపుస్తకాలు చదువుతుంటే తనూ చదవడానికి తయారయ్యేది! మనిషి, ఎలుగు తోడబుట్టినట్లు ఉండేవారు. ఇన్ని చెబుతుంటే.. ‘అయ్యో భగవంతుడా లూబాకు ఏమైనా అయిందా?’ అనిపిస్తుంది. పాత సినిమాల్లో అంతే కదా. హీరో చెల్లెలు పుట్టినరోజు ఫంక్షన్ లో ’అన్నయ్య సన్నిధి.. అదే నాకు పెన్నిధి’ అనో, ’అన్నా నీ అనురాగం.. ఎన్నో జన్మల పుణ్యఫలం’ అనో పాట పూర్తి అవగానే ఎక్కడినుంచో దోపిడీ దొంగలు వచ్చి ఆమెను కిడ్నాప్ చేసేవారు. లేదంటే తుపాకీతో కాల్చేసి వెళ్లేవారు. లూబాకు అలాంటిదేమీ కాలేదులెండి. అన్న టెర్డే కే అయింది. లూబాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లకు ఇచ్చేశాడు! వాళ్లు లూబాను అడవిలో వదిలేయబోతుంటే.. ‘వద్దొద్దు. అడవిలో ఎలా పెరుగుతుందో ఏమో పిచ్చిపిల్ల‘ అని వెనక్కు తీసుకుని వాళ్ల చేతే ఇటానగర్ లోని ‘జూ’ లో చేర్పించాడు. రాజధాని నగరం అది. అక్కడైతే తన చెల్లి కంఫర్ట్‌గా పెరుగుతుందని అన్న మనసు తలచింది. చెల్లిని చూడాలనిపించినప్పుడు వెళ్లి చూసే ఒప్పందం కూడా జూ అధికారులతో చేసుకున్నాడు. చెల్లిని వదిలేసి వస్తున్నప్పుడు అన్నని, ‘ఇప్పటివరకు అన్నయ్య నాతోనే ఉన్నాడు కదా, ఇంతలోనే ఏమయ్యాడు!’ అని బోను లోపలి నుంచి అన్నయ్యను వెతుక్కుంటున్న చెల్లినీ చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాలేదంటే వాళ్లు మనుషులు గానీ, ఎలుగులు కానీ అయి ఉండరు. అయినా టెర్డే అన్నయ్య మనసు చంపుకుని ఇంత పని ఎందుకు చేసినట్లు? స్కూల్ చదువు పూర్తయి, కాలేజ్‌కి వచ్చాడు. కాలేజ్‌లో చేరేందుకు వేరే ఊరు వెళ్లిపోతున్నాడు. చదువులెంత కనికరం లేనివి! -
పోలీస్ స్టేషన్‌కు అనుకోని అతిథి
పెన్సిల్వేనియా: ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్‌కు వెళ్తారు. కానీ ఎలుగుబంటి సైతం తన సమస్యను చెప్పుకునేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? విషయం ఏమిటంటే... పెన్సిల్వేనియాలోని 'కార్బన్ కౌంటీ' ప్రాంతంలో చెత్తను తరలించే వాహనంపై ఎలుగుబంటి ఎక్కి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. వాహనంపై ఉన్న ఎలుగుబంటి ఫోటోను 'కిడ్డర్ టౌన్షిప్' పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే 1400 మంది షేర్ చేయడంతో ఆ చిత్రం ఫేస్బుక్లో వైరల్‌గా మారింది. కార్బన్ కౌంటీ ప్రాంతంలో ఎలుగుబంట్ల సమస్యపై తరుచుగా ఫిర్యాదులు వచ్చేవని అక్కడి పోలీసు అధికారి అన్నారు. కానీ ఇప్పుడు వాటిని పట్టుకునేందుకు కష్టపడాల్సిన అవసరం లేకుండా ఎలుగుబంటే పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. కాసేపటికే ఎలుగుబంటి సురక్షితంగా అడవుల్లోకి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. -
తిరుమలలో ఎలుగుబంటి హల్చల్
-
హుస్నాబాద్‌లో ఎలుగుబంటి సంచారం
హుస్నాబాద్: అటవీ ప్రాంతంలో తిరగాల్సిన ఎలుగుబంటి జనావాసాల్లో సంచరించడంతో పట్టణ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మంగళవారం తెల్లవారు జామున పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, మల్లెచెట్టు చౌరస్తాలో సంచరించడాన్ని స్థానికులు చూసి బెంబెలెత్తిపోయారు. తెల్లవారుజామున కోళ్ల వ్యర్థ పదర్థాలను తరలిస్తున్న వారు చూసి 100 డయల్‌కు చేయగా బ్లూకోడ్ సిబ్బంది వచ్చారు. మల్లెచెట్టు చౌరస్తా నుంచి ఎల్లమ్మ చెరువు కట్ట వైపునకు ఎలుగుబంటి వెళ్తుండటంతో దాని వెంట బ్లూకోడ్ సిబ్బంది వెళ్లారు. పోలీస్ స్టేషన్‌లోని సీసీ కెమెరా కంట్రోల్ రూంలో సీసీ ఫుటేజీలో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించారు. మంగళవారం తెల్లవారు జామున 3.47 గంటలకు అంబేడ్కర్ చౌరస్తా నుంచి మల్లెచెట్టు చౌరస్తాకు చేరుకుంది. అక్కడి నుంచి ఎల్లమ్మ చెరువు కట్ట వైపు వెళ్లినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయింది. తెల్లవారు జామున రోడ్లపై జనం లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. -
వైరల్: ఎలుగుబంటికి ఎంత కష్టం!
-
పెద్ద సీసాలో ఇరుక్కుపోయిన ఎలుగుబంటి తల
వాషింగ్టన్: ఓ కుటుంబం సరదాగా విహారయాత్రకు వెళ్లింది. నదిలో పడవ ప్రయాణం చేస్తుండగా ఓ ఎలుగుబంటి తల పెద్ద సీసాలో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతూ కనిపించింది. దాని పరిస్థితి చూసిన కుటుంబ సభ్యులు ఎలాగైనా ఆ ఎలుగు బంటికి సాయం చేయాలనుకున్నారు. దాన్ని పట్టుకుని నానా తంటాలు పడి తలకు ఉన్న సీసాను తొలగించారు. ఈ ఘటన అమెరికాలోని విస్కాన్సిన్లో చోటు చేసుకుంది. దీని తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (ఎలుగుబంటి కారు ఎక్కడం చూశారా? వీడియో వైరల్) వివరాల్లోకి వెళితే.. ట్రిసియా, తన భర్త, కొడుకుతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. అందులో భాగంగా అందరూ కలిసి మార్ష్మిల్లర్ నదిలో బోటింగ్ చేశారు. ఈ క్రమంలో అదే నదిలో పెద్ద సీసాలో తల ఇరుక్కుపోయి తెగ ఇబ్బంది పడుతూ ఓ పిల్ల ఎలుగుబంటి కనిపించింది. ఎంతో కష్టంగా అది స్విమ్మింగ్ చేస్తుండటం చూసి వారి గుండె తరుక్కుపోయింది. వెంటనే దాని దగ్గరకు పడవను పోనిచ్చారు. దాన్ని వెంబడించి పట్టుకున్నారు. ట్రిసియా భర్త ఎలుగుబంటి తలకు ఉన్న క్యాన్‌ను గట్టిగా పైకి లాగడంతో దానికి విముక్తి లభించింది. పిల్ల ఎలుగుకు స్వేచ్ఛ లభించడంతో ట్రిసియా ఎగిరి గంతేసినంత పని చేసింది. "మేము దాన్ని కాపాడాం. ఇప్పుడిక సంతోషంగా ఈదుకుంటూ వెళ్లు" అని ఆమె మాట్లాడటం వీడియోలో స్పష్టమవుతోంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారు చేసిన ఉపకారానికి పొగడకుండా ఉండలేకపోతున్నారు. (ఎలుగుబంటి దాడి: వీడియో వైరల్) -
పిల్ల బంట్లు.. న్యాయపోరాటం
‘దిస్ ఈజ్ యాన్ ఆర్డర్’ అని పై అధికారి చెప్పినప్పుడు ఇక మాట్లాడేందుకు ఏమీ ఉండదు. చెప్పింది చేసేయడమే. కానీ బ్రైస్ కసావెంట్ ‘ఐకాంట్’ అనేశాడు గన్ తీసి లోపల పెట్టేసుకుంటూ! బ్రైస్ కెనడాలో అటవీ సంరక్షణ అధికారి. అప్పటికీ ఒకసారి తన పైఅధికారి ఆర్డర్ మీద తల్లి ఎలుగుబంటిని షూట్ చేసేశాడు. తల్లిని అంటి పెట్టుకుని ఉన్న ఆ రెండు ఎలుగు పిల్లల్ని కూడా షూట్ చేసేయమన్నాడు పై ఆఫీసర్. ‘పాపం పోనివ్వండి’ అన్నాడు బ్రైస్. మాంసం, చేపలు ఉన్న ఫ్రీజర్ డోర్లను బద్దలు కొట్టేసి లోపలంతా చెల్లాచెదురు చేసింది తల్లే గానీ పిల్లలు కాదు. పైగా వాటి ఒంటి మీద చిన్న చిన్న గాయాలు కూడా ఏవో ఉన్నాయి. ఆ పిల్లబంట్లను పశువైద్యశాలకు తరలించాడు బ్రైస్. పై అధికారికి ఇదంతా కోపం తెప్పించింది. ముఖ్యంగా తన ఆర్డర్‌ని లెక్కచెయ్యకపోవడం! వెంటనే బ్రైస్ని ఉద్యోగంలోంచి ఫైర్ చేసేశాడు. ఐదేళ్ల క్రితం మాట ఇది. ఐదేళ్లుగా బ్రైస్ తన ఉద్యోగం కోసం న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాడు. చివరికి కోర్టు బ్రైస్కి అనుకూలంగా శుక్రవారం తీర్పు ఇచ్చింది. ‘ఆదేశాలను, విధానాలను ఎవరైనా శిరసావహించవలసిందే. కానీ జీవకారుణ్య దృష్టితో చూసినప్పుడు కొన్ని కొన్నిసార్లు అంతరాత్మ ఇచ్చిన ఆర్డర్‌ని పాటించక పోవడమే నేరం అవుతుంది’ అని జడ్జి తీర్పు చెప్పారు. -
గట్టిగట్టిగా అరుస్తూ...
-
ఎలుగుబంటి కారు ఎక్కడం చూశారా? వీడియో వైరల్
సరదాగా ప్రకృతి ఒడిలో సరదాగా సేద తీరుతూ ఆహ్లాదంగా గడుపుదామని క్యాంపింగ్‌కు వెళ్తున్న ఓ కుటుంబానికి ఊహించని పరిణామం ఎదురైంది. మధ్యలో చిన్న బ్రేక్ తీసుకుందామని ఆ అటవీ ప్రాంత అందాలను కెమెరాలో బంధిస్తున్న వారి కారును ఎవరో అకస్మాత్తుగా హైజాక్ చేశారు. అనుకోని అతిథి కనిపించడంతో అందరూ షాక్‌కి గురయ్యారు. ఇంతకీ ఆ అతిథి ఎవరో తెలుసా ఎలుగుబంటి. ఇంతకీ ఏం జరిగిందంటే...జోస్ లూయిస్ ఫ్యామిలీతో సహా అటవీ ప్రాంతానికి విహారయాత్రకు బయలుదేరారు. అక్కడ కారు దిగి ప్రకృతి అందాలను ఫోన్లో బంధిస్తుంటే..అకస్మాత్తుగా ఓ పెద్ద ఎలుగుబంటి చేరుకొని అక్కడ ఎవరూ లేకపోవడంతో దర్జాగా కారు తెరిచి లోపలికి ఎక్కే ప్రయత్నం చేసింది. ఈ మొత్తం వ్యవహరాన్ని కొంత దూరం నుంచి చూస్తున్న వారికి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక గట్టిగట్టిగా అరుస్తూ కేకలు వేశారు. దీంతో ఒకింత ఆందోళనకు గురైన ఎలుగుబంటి కారు లోపలికి ఎక్కకుండానే కాస్త వెనక్కి తగ్గి అట్నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాల పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయ్యింది. ఇప్పటికే ఈ వీడియోను 28,300 మంది చూశారు. నాకు కూడా మీ కారులో లిఫ్ట్ ఇస్తారా?? వద్దు లేండీ నా నిర్ణయాన్ని మార్చుకున్నా అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. (వైరల్.. ఆకతాయిలపై గేదె ప్రతీకారం! ) -
ప్రయాణ ఖర్చులన్నీ ప్రభుత్వానివే..
సాక్షి, హైదరాబాద్: ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్‌ను గుర్తించడమే కాదు, వాళ్లనెంత గౌరవంగా చూస్తున్నామన్నది కూడా ముఖ్యమే’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములైన వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు రోజుకు 40 చొప్పున వారం రోజుల పాటు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ మార్గం సుగమం చేస్తున్నారని పేర్కొన్నారు. వారి ప్రయాణానికి అయ్యే ఖర్చులన్నీ తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని కేటీఆర్ వెల్లడించారు. -
వైన్ షాపుల బంద్ : క్యారెట్ బీరు తయారీ
సాక్షి, చెన్నై : దేశ వ్యాప్త లాక్డౌన్ కారణంగా వైన్ షాపులు మూతపడటంతో మద్యంప్రియులు అల్లాడుతున్నారు. ఆల్కహాల్ దొరకకపోవడంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే సొంతంగా మద్యం తయారు చేసుకోవడానికి అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. మద్యం దుకాణాలు మూసి వేసి ఉండడంతో సారా, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. యూట్యూబ్‌లో చూసి క్యారెట్ బీర్‌ను తయారు చేసి విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ముఖ్యంగా చెన్నైలో క్యారెట్‌తో బీర్ తయారు చేసి విక్రస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుచ్చినాంకుప్పం ప్రాంతంలో క్యారెట్ బీర్ తయారు చేస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు శుక్రవారం ఆ ప్రాంతంలో గస్తీ చేపట్టారు. అదే ప్రాంతానికి చెందిన సుకుమార్ (25) అనే వ్యక్తి క్యారెట్ బీర్‌ను తయారు చేసి విక్రయించినట్టు తెలిసింది. వెంటనే అతడిని పోలీసులు అరెస్టు చేసి విక్రయానికి సిద్ధంగా ఉంచిన రెండు లీటర్ల క్యారెట్ బీర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ అనే రసాయ పౌడర్‌ను చేర్చి రెండు రోజులు ఊరించి తర్వాత దాన్ని తాగితే మత్తు ఏర్పడుతుందని యూట్యూబ్‌లో చూశానని , దాన్ని చూసి క్యారెట్ బీర్ తయారు చేసినట్టు పోలీసుల విచారణలో తెలిపాడు. -
జగన్నాథుని ఆలయంలో ‘ఎలుగు’ హల్చల్
ఒడిశా, జయపురం: ఆహార అన్వేషణ కోసం ఈ మధ్య కాలంలో వన్య జంతువులు కొన్ని జనారణ్యంలోకి ప్రవేశిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం జయపురంలోని పలుచోట్ల ఏనుగులు, ఎలుగుబంట్లు పంటపొలాలు, కల్లాల్లోకి చొరబడి అక్కడి పంటను తినివేశాయి. దీంతో పాటు వాటిని తరిమేందుకు ప్రయత్నించిన వారిపై కూడా అవి దాడులకు పాల్పడ్డాయి. నవరంగపూర్ జిల్లాలోని తెంతులికుంటి సమితిలో ఉన్న అంచలగుమ్మ గ్రామ జగన్నాథుని ఆలయం లోపలికి ఓ ఎలుగుబంటి ఆదివారం ఉదయం ప్రవేశించింది. ఈ క్రమంలో దేవుని కోసం భక్తులు పెట్టిన అక్కడి ప్రసాదాన్ని చక్కగా ఆరగించింది. అయితే ఆ ఎలుగు ఆలయంలోకి ప్రవేశించేందుకు ఆలయ తలుపులను విరగ్గొట్టింది. ఇవే దృశ్యాలను చిత్రీకరించిన అక్కడి యువకులు ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలను చూస్తున్న ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
ట్రైనర్ పై దాడి చేసిన ఎలుగుబంటి
-
ఎలుగుబంటి దాడి: వీడియో వైరల్
-
ఎలుగుబంటి దాడి: వీడియో వైరల్
న్యూఢిల్లీ : ఒకప్పుడే కాదు, ఇప్పుడు కూడా రష్యాలో సర్కస్‌కు మంచి ప్రజాదరణ ఉందన్న విషయం తెల్సిందే. జంతు కారుణ్యకారుల ఆందోళనల మేరకు ప్రపంచంలోని పలు దేశాల్లో సర్కసుల్లో జంతువుల విన్యాసాలు నిషేధించగా, రష్యా సర్కసుల్లో ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి. రష్యాలోని కరేలియా ప్రాంతంలో అలాంటి సర్కస్ ఒకటి ప్రదర్శన ఇస్తుండగా ఊహించని ప్రమాదం జరిగింది. దాదాపు 275 కిలోల బరువున్న ఓ గుడ్డేలుగుతో విన్యాసాలు చేయించేందుకు శిక్షకుడు దాన్ని ముందు కాళ్లును పట్టుకోగా అది హఠాత్తుగా ఎదురు తిరిగి సదరు శిక్షకుడి కింద పడేసి, మీదెక్కంది. పక్కనే ఉన్న మరో సర్కస్ ఉద్యోగి దాని కాలితో తంతు దూరం కొట్టేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాంతో లోపలి నుంచి కరెంట్ షాక్ యంత్రం తీసుకొచ్చి షాకివ్వడంతో అది శిక్షకుడిని వదిలేసింది. ఈ సంఘటనలో గాయాలైన శిక్షకుడి ఆరోగ్యం ఎలా ఉందో తెలియరాలేదు. అయితే ఈ సంఘటనను వీడియో తీసిన 27 ఏళ్ల గాలినా గురియేవా ఇప్పటికి తన రెండు కాళ్లు వణుకుతున్నాయని చెప్పారు. గుడ్డేలుగు దాడి చేయడం చూసి ప్రేక్షకుల గ్యాలరీలో అతి సమీపంలో ఉన్న పిల్లలు, పెద్దలు భయంతో పరుగులు తీశారని ఆమె తెలిపారు. సర్కస్ విన్యాసాల వేదికకు, ప్రేక్షకుల గ్యాలరీకి మధ్య ఎలాంటి ఫెన్సింగ్ లేదని ఆమె చెప్పారు. ఇలాంటి సంఘటన తాను చూడడం ఇదే మొదటి సారని ఆమె చెప్పారు. మొదట్లో ఇదీ విన్యాసాల్లో భాగమేనని అనుకున్నామని, తోటి సర్కస్ ఉద్యోగి గుడ్డేలుగును తన్నడం మొదలు పెట్టడంతో అప్పుడు అది దాడిగా భావించి, భయపడ్డామని పలువురు ప్రేక్షకులు తెలిపారు. గతంలో ఇలాంటి జంతు విన్యాసాల సందర్భంగా శిక్షకులు మరణించిన సంఘటనలు లేకపోలేదు. ఇప్పుడు గురియేవా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
అనంతపురంలో ఎలుగుబంటి కలకలం..
సాక్షి, అనంతపురం : జిల్లాలోని బ్రహ్మసముద్రం మండలం రాయలదొడ్డి గ్రామ సమీపంలో ఎలుగుబంటి సంచరించడం కలకలం రేపింది. ఎలుగుబంటి దారితప్పి జనావాసాల్లో రావడంతో గ్రామస్తులు భయాందోళనతో పరుగులు తీశారు. ఎలుగుబంటి ఎక్కడ దాడి చేస్తుందో అని భయపడ్డారు. తర్వాత గ్రామస్తులు మూకుమ్మడిగా ఎలుగుబంటిపై దాడికి దిగారు. దీంతో ఎలుగుబంటి సమీపంలోని కొండల్లోకి పరుగులు తీసింది. అనంతరం గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. -
మొలంగూర్‌లో ఎలుగుబంటి హల్చల్
సాక్షి, మానకొండూర్ : శంకరపట్నం మండలం మొలంగూర్‌లో ఓ ఎలుగుబంటి చెట్టు ఎక్కి హల్చల్ చేసింది. చెట్టు ఎక్కిన ఎలుగుబంటిని మంగళవారం తెల్లవారుజామున గ్రామస్తులు గుర్తించి కేశవపట్నం పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది, అటవీశాఖ రేంజర్ ముంతాజ్‌అలీ, సెక్షన్ ఆఫీసర్లు సరిత, సురేందర్, బీట్ ఆఫీసర్లు లావణ్య, అనంతరాములు, రెస్క్యూ టీం పశువైద్యాధికారి ప్రవీణ్‌కుమార్ మొలంగూర్ చేరుకున్నారు. ఎలుగుబంటిని చెట్టుపై నుంచి కిందకు దించేందుకు ప్రయత్నించారు. పశువైద్యాధికారి దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి చెట్టు కింద వల ఏర్పాటు చేసి, ఆరు గంటలు శ్రమించి, వలలో బంధించారు. అయినా ఆ ఎలుగుబంటి వల నుంచి తప్పించుకొని, సమీపంలోని గుట్టవైపు పరుగు తీసింది. అటవీశాఖ అధికారులు దాన్ని పట్టుకొని మరోసారి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. అనంతరం అటవీశాఖ వాహనంలో తాడ్వాయి ఫారెస్ట్‌లో వదిలిపెట్టేందుకు తీసుకెళ్లారు. -
తోబుట్టువు కోసం బుజ్జి ఎలుగు తంటాలు!
-
తోబుట్టువు కోసం బుజ్జి ఎలుగు తంటాలు!
డంప్‌స్టర్‌లో చిక్కుకున్న తోబుట్టువును బయటికి తీసేందుకు ఓ బుజ్జి ఎలుగుబంటి విశ్వప్రయత్నం చేసింది. తల్లితో కలిసి డంప్‌స్టర్ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఇంతలో పోలీసుల జీపు రావడంతో తల్లీ పిల్లా అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాయి. ఇక అప్పటిదాకా బుజ్జి ఎలుగుబంటి పాట్లు చూసిన పోలీసులు ఓ నిచ్చెన తెచ్చి డంప్స్టరులో ఉంచి అక్కడి నుంచి దూరంగా వెళ్లారు. ఈ క్రమంలో నిచ్చెన సహాయంతో లోపల ఉన్న ఎలుగుబంటి పైకి ఎక్కింది. ఈ తతంగాన్నంతా దూరంగా ఉండి గమనిస్తున్న తల్లి, సోదరుడి వద్దకు పరిగెత్తింది. ఆ తర్వాత మూడూ కలిసి అడవిలోకి పారిపోయాయి. కాలిఫోర్నియాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియెను ప్లేసర్ కంట్రీ షెరిఫ్ ఆఫీసు ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. తోబుట్టువును కాపాడుకునేందుకు బుజ్జి ఎలుగు పడిన తంటాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘మనుషులకే కాదు జంతువులకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. సూపర్ క్యూట్ బేర్’ అని కామెంట్లు చేస్తున్నారు. అదే విధంగా ఎలుగుబంట్లు తరచుగా జనావాసాల్లోకి రావడంపై స్పందిస్తూ... మనుషులకు, జంతువులకు ఎటువంటి హాని కలగకుండా అటవీ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. -
బాబోయ్ భల్లూకం
సాక్షి, వజ్రపుకొత్తూరు రూరల్: జనావాసంలోకి ఎరక్కపోయి వచ్చిన భారీ భల్లూకం అమ్మవారి గుడిలో ఇరుక్కుపోయింది. గ్రామస్తులు తాళం వేయడంతో రోజంతా ఆలయంలోనే గడిపింది. ఆఖరికి విశాఖ నుంచి జూ అధికారులు వచ్చి మత్తు ఇంజక్షన్ ఇచ్చి బోనులోకి తరలించారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. చినవంక గ్రామ పరిసర ప్రాంత జీడి తోటలో ఉన్న వంక పో లమ్మ గుడిలోకి గురువారం ఉదయం ఎలు గు బంటి ప్రవేశించింది. జీడి తోట పనులకు కోసం వెళ్లిన రైతులు ఈ విషయాన్ని గమనించారు. అప్రమత్తమై గుడి తలుపులు వేసి గొళ్లెం పెట్టి అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఈ విషయం సోషల్ మాధ్యమాలలో హల్చల్ చేయడంతో ఎలుగును చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు బారులు తీరారు. అయితే సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించి విశాఖపట్నం జూ అధికారులకు సమాచారం అందించారు. ఉద్దాన తీర ప్రాంతంలో గత కొంత కాలంగా ఎలుగులు హల్చల్ చేస్తూ ఈ ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక భారీ ఎలుగు ఎప్పటిలాగే సంచరిస్తూ గుడిలో చిక్కింది. ఎలుగుతో సెల్ఫీ.. గుడిలో చిక్కుకున్న ఎలుగు బంటిని చూసేం దుకు వచ్చిన ప్రజలు ఆసక్తిగా సెల్ఫీలు దిగా రు. మరికొందరు దగ్గరగా ఎలుగును చూసి ఫొటోలకు పోజులు ఇచ్చారు. అలాగే ఎలుగుకు కొంతమంది యువకులు, మహిళలు బిస్కెట్లు, రొట్టెలు, బెల్లం, నూనె లాంటి ఆహార పదార్ధాలు అందిస్తూ వీడియోలు, ఫోటోలు తీస్తూ సెల్ఫోన్లో ఈ చిత్రాలు బంధించారు. అధికారుల తీరుకు స్థానికుల మండిపాటు.. గుడిలో ఎలుగు ఉన్నట్లు అటవీ శాఖాధికారులకు ఉదయం సమాచారం అందిస్తే సంఘటన స్థలానికి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకున్నారు. పరిస్థితి పరిశీలించిన అధికారులు అప్పటికే ఎలుగును చూసేందుకు వచ్చిన ప్రజలను వెళ్లిపోవాలని సూచించారు. ఇప్పుడు ఏమి చేయలేమని గుడి తలుపులు తీసి ఎలుగును బయటకు పంపించే ప్రయత్నం చేశారు. అయితే దీనిని స్థానికులు అడ్డుకొని అధికారుల తీరును వ్యతిరేకించారు. నిత్యం జీడి సాగులో గడిపే తమపై ఎలుగులు దాడి చేస్తే ఎవరు బా ధ్యత వహిస్తారని నిలదీశారు. దీంతో అధికారులు అక్కడ నుండి వెనుదిరిగి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. విశాఖపట్నం జూ అధికారులకు సమాచారం అందించామని, వారు వచ్చే వరకు ఎలుగును రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయరాదని అధికారులు సూచించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖాధికారులు మీనా బాబు, రజనీకాంత్, రమేష్, తిరుపతి పరిస్థితిని సమీక్షించారు. ఉత్కంఠకు తెర.. విశాఖపట్నం జూ నుంచి 8 మంది సభ్యులతో రెస్క్యూ టీం రాత్రికి ఘటనా స్థలానికి చేరుకొని, ఎలుగును బంధించే ప్రయత్నం చేశారు. సుమారు 3 గంటల పాటు శ్రమించి బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వైద్యులు శ్రీనివాస్ గన్‌తో మత్తు ఇంజెక్షన్ వేయడంతో ఎలుగు స్పృహ తప్పి, బోనులో చిక్కింది. అనంతరం దానిని బంధించి విశాఖ జూకి తరలించారు. కార్యక్రమంలో డీఎఫ్ లక్ష్మణ్, ఫారెస్టు రేంజర్ అమ్మనాయుడు, డిప్యూటీ రేంజర్ వీఎసఎన్ రాజు, ఎఫెస్‌ఓ రజనీకాంత్ పాల్గొన్నారు. -
ఎలుగుబంటికి వార్నింగ్ ఇచ్చిన కుక్క
-
ఎలుగుబంటికి వార్నింగ్ ఇచ్చిన కుక్క
న్యూజెర్సీ: విశ్వాసానికి మారుపేరు శునకం. అది ఇంటిని కాపలా కాయడమే కాదు.. ఇంటి చుట్టుపక్కల ఎవరు కాస్త అనుమానంగా కనిపించినా పిక్క పట్టుకోడానికి కూడా వెనుకాడదు. ఇపుడు చెప్పుకునే కుక్క కూడా అలాంటిదే... దాని పేరు రియో. అది నివాసముండే ఇంటికి అనుకోని అతిథి వచ్చింది. ఆ అతిథి దర్జాగా ఇంటి పెరట్లోకి వెళ్లి పక్షులకు ఆహారం వేసే పంజరాన్ని పట్టి లాగింది. ఇంతకీ ఆ ఇంటికి వచ్చిన అతిథి ఏ పక్షో, పామో కాదు.. ఎలుగుబంటి. పంజరాన్ని కిందపడేసి అందులోని ఆహారాన్ని ఆవురావురుమంటూ తింటోంది. ఇంతలో అక్కడికి వచ్చిన రియో.. నా ఇంటికే వస్తావా అనుకుందో ఏమో..? దాని వెంటపడి మరీ పరిగెత్తించింది. ఎలుగుబంటి తిరుగుదాడి చేయడానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వకుండా దాన్ని బెదరగొట్టింది. దీంతో హడలిపోయిన ఎలుగుబంటి ఎలాగోలా కుక్క బారి నుంచి తప్పించుకుని బతుకుజీవుడా అనుకుంటూ వెళ్లిపోయింది. న్యూజెర్సీలో జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డ్ కాగా ఆ వీడియోను మార్క్ స్టింజియానా అనే వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అది చూసిన జనాలు శునక ధీరత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.