![Transport Charges Will Bear By The Government Says KTR - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/6/KTR.jpg.webp?itok=0VBb37Wc)
సాక్షి, హైదరాబాద్: ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్‌ను గుర్తించడమే కాదు, వాళ్లనెంత గౌరవంగా చూస్తున్నామన్నది కూడా ముఖ్యమే’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములైన వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు రోజుకు 40 చొప్పున వారం రోజుల పాటు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ మార్గం సుగమం చేస్తున్నారని పేర్కొన్నారు. వారి ప్రయాణానికి అయ్యే ఖర్చులన్నీ తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని కేటీఆర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment