transport Charges
-
రాజకీయ పాలనే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇక రాజకీయ పాలనే ఉంటుందని, అధికార యంత్రాంగం అందుకనుగుణంగా పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇసుక రవాణా వ్యయం ఐదు రెట్లు పెరిగిందని, రవాణా చార్జీలు పెరిగినా తామే పెంచామనుకుంటారని చెప్పారు. సచివాలయాల్లోనే ఇసుక బుక్ చేసుకుని రవాణా చార్జీలు సైతం చెల్లించవచ్చన్నారు. వినియోగదారుడికి ఇసుక అందినట్లు నిర్థారించుకున్నాకే రవాణా ఛార్జీలు ట్రక్కు యజమానికి విడుదలయ్యే పద్ధతి తెస్తామన్నారు. ఇసుక తరలించే ట్రక్కులను ప్రీపెయిడ్ ట్యాక్సీల తరహాలో ఊబరైజేషన్ చేస్తామన్నారు.లారీలు ఇసుక రీచ్‌ల దగ్గరకు వచ్చి రెండేసి రోజులు ఉండకూడదన్నారు. బడి మానేసిన పిల్లలను తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లోనే కాకుండా ప్రైవేట్ స్కూళ్లలోనూ చేర్పించాలని నిర్దేశించారు. రోడ్లు అన్నీ పీపీపీ విధానంలోనే నిర్మాణం చేపట్టాలన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్నకు ఆకాశమే హద్దని, అమరావతిలో ప్రత్యేకంగా ఒక పీపీపీ విభాగం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.రోడ్ల నిర్వహణను 50 కి.మీ. చొప్పున అవుట్ సోర్సింగ్‌కు ఇవ్వాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలనూ అవుట్ సోర్సింగ్‌కు అప్పగించాలన్నారు. ఉద్యోగాల కల్పనకు ప్రైవేట్ రంగంలో వర్చువల్ వర్కింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో చేపట్టిన 4 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని కొనసాగించాలని ఆదేశించారు. సోమవారం సచివాలయంలో కలెక్టర్లు, మంత్రులు, ఉన్నతాధికారులతో శాఖల వారీగా సీఎం సమీక్షించారు. సమావేశం ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకు కొనసాగింది. అనంతరం సచివాలయం గార్డెన్లో కలెక్టర్లకు విందు ఏర్పాటు చేశారు. ఉచిత ఇసుక విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే చర్యలుసహజ వనరులైన ఇసుక, మైనింగ్ వ్యవహారాల్లో ఇబ్బందులను తొలగించాలని అంతకుముందు సమావేశంలో సీఎం సూచించారు. ఉచిత ఇసుకపై సరైన నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రవాణా చార్జీలు పెరగకుండా రీచ్‌లను దగ్గరగా ఏర్పాటు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా సహజ వనరుల దోపిడీ జరిగిందని ఆరోపించారు.ఇసుక రీచ్‌లో ఏం జరిగిందో సుప్రీంకోర్టుకు వాస్తవాలు చెప్పాలని, లేదంటే మీకు ఇబ్బందులు వస్తాయని కలెక్టర్లకు స్పష్టం చేశారు. గత సర్కారు పాలనలో ఇసుక దోపీడీపై సీఐడీతో విచారణ జరిపి తప్పుచేసిన వారిని శిక్షిస్తామన్నారు. వరదను ఒడిసిపట్టి తక్షణమే రిజర్వాయర్లను నింపాలని జలవనరులపై సమీక్షలో ఆదేశించారు. ఎక్కడైనా గేట్లు కొట్టుకుపోతే ఏఈ, డీఈని డీమ్డ్ సస్పెన్షన్ చేస్తామని హెచ్చరించారు. డ్రాప్ అవుట్స్ సున్నాకు రావాలిబడికి వెళ్లే పిల్లలకు కిట్స్ ఇవ్వడం ఇప్పటికే మూడు నెలలు జాప్యమైందని, వీలైనంత త్వరగా అనంతపురం, కర్నూలు జిల్లాలకు పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. సకాలంలో పంపిణీ చేయడంలో విఫలమైన ఏజెన్సీని పక్కనబెట్టాలని ఆదేశించారు. డ్రాప్ అవుట్స్ సున్నాకు రావాలన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పామని, అందుకోసం ప్రైవేట్‌లో వర్చువల్ వర్కింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తద్వారా 5–10 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రోడ్లు అన్నీ పీపీపీలోనేరహదారులన్నీ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపట్టాలని, రాష్ట్ర హైవేలన్నీ కూడా పీపీపీలోనే ఉండాలని సీఎం చెప్పారు. పీపీపీలో విధానంలో చేపట్టేందుకు 14 ప్రాజెక్టులను గుర్తించామని అధికారులు పేర్కొనగా ఇంకా పాత మూసలోనే ఉన్నారని సీఎం వ్యాఖ్యానించారు. టోల్ గేట్లు ఏర్పాటు ద్వారా వ్యయం రాబట్టాలన్నారు. నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారులకు సంబంధించి ఒక్క ఫిర్యాదు రాకూడదన్నారు.వైద్య సేవలు అవుట్ సోర్సింగ్ప్రభుత్వ ఆస్పత్రుల్లో గతంలో 20 సేవలకు పైగా అవుట్ సోర్సింగ్‌కు ఇచ్చామని, ఇప్పుడు కూడా అవుట్ సోర్సింగ్‌కు వైద్య సేవలను అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వం నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను పీపీపీ విధానంలో కాకుండా ఈపీసీ విధానంలో చేపట్టిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈపీసీ విధానంలో పోర్టుల నిర్మాణానికి డబ్బులు, గ్యారెంటీ ప్రభుత్వం ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. దీనిపై ఇప్పుడు తాను వెనక్కు వెళితే చెడ్డపేరు వస్తుందని, అందువల్ల వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు.డ్రోన్లతో డ్రైనేజీల పూడికల గుర్తింపుసోలార్ పవర్‌కు భూములిచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని, మడకశిర ప్రాంతంలో నాలుగైదు వేల ఎకరాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారని సీఎం చెప్పారు. దీన్ని ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాన్నింటిపై సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 1,000 నుంచి 2,000 ఫీడర్లలో సోలార్ పవర్ ద్వారా వ్యవసాయానికి పగటి పూట విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల విధానాన్ని తెస్తామన్నారు. గతంలో దోమల నివారణకు డ్రోన్స్ వినియోగించామని, ఇప్పుడు డ్రైనేజీల పూడికలు, రహదారుల మరమ్మతులను డ్రోన్స్ ద్వారా గుర్తించాలని సీఎం సూచించారు. జిల్లాకో జాయింట్ కలెక్టర్‌ను అదనంగా నియమించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు సూచించారు. ఉపాధి పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం..రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ నిర్మించి ఇస్తామని సీఎం చెప్పారు. పీఎంఏవై–అర్బన్, రూరల్, ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ తదితర పథకాల కింద 9,11,594 గృహాలు పెండింగ్‌లో ఉండగా, 5,74,710 ఇళ్ల నిర్మాణం అసలు చేపట్టలేదన్నారు. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత తీసుకుంటామన్నారు. 25 లక్షల ఇళ్లు కడతానని గొప్పగా చెప్పి కేవలం 7 లక్షలు మాత్రమే చేపట్టారన్నారు. నీరు – చెట్టు, ఉపాధి హామీ పెండింగు బిల్లులు కూడా త్వరలో చెల్లిస్తామని తెలిపారు. సంపద సృష్టించండి.. వంద రోజుల్లో మార్పుకలెక్టర్లు, అధికారులు వినూత్న ఆలోచనతో సంపద సృష్టించాలని సీఎం సూచించారు. అక్టోబర్ 2న రాష్ట్ర విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తామన్నారు. జిల్లాల్లోనూ కలెక్టర్లు విజన్ డాక్యుమెంట్లు తయారు చేయాలన్నారు. సెప్టెంబర్ 20న ప్రభుత్వ పాలన వంద రోజులు పూర్తయ్యేనాటికి మార్పు కనిపించాలని చెప్పారు. సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నామని, ఎన్నికల మేనిఫెస్టో అందరి దగ్గరా ఉంటుందని తెలిపారు. సమర్థులైన అధికారులు గత ఐదేళ్లలో నిర్వీర్యమైపోయారని చెప్పారు. తాను కూడా మళ్లీ ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతానని, గతంలో స్పీడు మళ్లీ చూపిస్తానని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే చాలా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. మూడు నెలలకు ఒకసారి కాన్ఫరెన్స్ ఉంటుందని చెప్పారు. తనకు వచ్చిన ఐదు వేల పిటిషన్లలో సగం భూమికి సంబంధించిన సమస్యలే ఉన్నాయని చెప్పారు. ప్రతి శనివారం సీఎంవో పనితీరుపై సమీక్ష గత ప్రభుత్వంలో బటన్ నొక్కడం మినహా ప్రజలను పరామర్శించలేదన్నారు. పేదరికాన్ని సున్నాకి తీసుకురావడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి శనివారం సీఎంవో పనితీరుపై సమీక్ష చేస్తానని తెలిపారు. ప్రజా ప్రతినిధులు చెప్పే అంశాలను కలెక్టర్లు, అధికారులు వినాలని స్పష్టం చేశారు. త్వరలో పరిపాలనకు సంబంధించి ఒక యాప్ తెస్తామని తెలిపారు. ఢిల్లీ వెళ్లి ధర్నాలు చేసి ఏపీలో 36 మందిని చంపామని ఆరోపణలు చేశారని, నిజంగా అలా జరిగి ఉంటే ఎఫ్ఐఆర్లు ఇవ్వాలని చంద్రబాబు పేర్కొన్నారు. అడవులంటే పవన్‌కు ఇష్టం.. 2014–19 మధ్య ఉచితంగా నిర్వహించిన భూసార పరీక్షలను మళ్లీ మొదలు పెట్టాలని వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం పేర్కొన్నారు. అడవులంటే పవన్ కల్యాణ్‌కు చాలా ఇష్టమని, వాటి విస్తీర్ణం పెంచాలని సూచించారు. ఈ నెల 7వ తేదీన చేనేత దినోత్సవాన్ని చీరాలలో నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో ఏ మున్సిపాల్టీలోనూ చెత్త కనపడటానికి వీల్లేదన్నారు. గత ఐదేళ్లుగా స్వచ్ఛ భారత్ నిధుల యూసీలు ఇవ్వలేదని కేంద్ర అధికారులు తనకు ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు. కొత్త లిక్కర్ పాలసీ..రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం, భవిష్యత్ గురించి ఆలోచించి కొత్త లిక్కర్ పాలసీ తీసుకొస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లతో ఏపీలోకి లిక్కర్‌ను అనుమతిస్తామన్నారు. తద్వారా మద్యం అక్రమ రవాణాను అరికడతామన్నారు. కొత్తగా ఇండస్ట్రియల్ పాలసీ, ఎంటర్ ప్రెన్యూర్ పాలసీ, ఎఫ్‌డీఐ, ఎంఎస్ఎంఈ, హార్డ్ వేర్ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్, స్టార్టప్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎనర్జీ, పీపీపీ మోడల్లో పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్లు, వయబులిటీ గ్యాప్ ఫండింగ్, వాటర్, లాజిస్టిక్, యూత్, స్పోర్ట్స్ పాలసీలు తెస్తున్నట్లు ప్రకటించారు.జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీలు సమన్వయంతో పని చేయాలన్నారు. అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి తాను సిద్ధంగా లేనన్నారు. శాంతి భద్రతల నిర్వహణపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ఐదేళ్ల కిందట రూ.వందల కోట్లు ఖర్చు చేసి 15వేల కెమెరాలు ఏర్పాటు చేస్తే అవి ఏమయ్యాయో తెలియడం లేదన్నారు. గత ప్రభుత్వంలో అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేసి కొట్టేసే పరిస్థితికి వచ్చారన్నారు. ఐదేళ్లలో జరిగిన తప్పులను వెలికితీసి శిక్షిస్తామన్నారు. ‘ఇంటింటికీ రేషన్ పంపిణీ’ అంటూ వాహనాలు తెచ్చి రూ.2వేల కోట్లు ఖర్చు పెట్టారు. రేషన్ పంపిణీకి 15రోజుల పాటు ఇద్దరిని నియమించి వారికి జీతాలు ఇచ్చారు. పంపిణీ పూర్తయ్యాక ఆ వాహనాలను మళ్లీ వేరే పనులకు ఉపయోగించుకుంటున్నారు. రేషన్ దుకాణాలకు రాలేని వారి ఇంటికి వెళ్లి ఇవ్వాలి. కాకినాడలో ఒకే ఫ్యామిలీ నుంచి సివిల్ సప్లై శాఖకు సంబంధించి మూడు పదవులు నిర్వహిస్తున్నారు. దీంతో దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్లయింది. ఇలాంటి వాటిని నియంత్రించాలి’ అని సీఎం పేర్కొన్నారు.రాజధానిలో పేదలకిచ్చిన 50,800 ఇళ్ల స్థలాలు రద్దు!వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ, గుంటూరు వాసులకు రాజధాని అమరావతిలో ఇచ్చిన ఇళ్ల స్థలాల స్థానంలో ప్రత్యామ్నాయంగా మరోచోట ఇవ్వాలని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గత ప్రభుత్వం రాజధాని మాస్టర్ ప్లాన్‌లోని ఆర్–5 జోన్లో లేఅవుట్లు వేసి సుమారు 50,800 మందికి ఇచ్చిన ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకోవాలని అధికారులకు సూచించారు. అక్కడి లబ్ధిదారులకు వారి ప్రాంతాల్లోనే ఇళ్లు కేటాయించాలన్నారు. అవసరమైతే టిడ్కో తరహా ఇళ్లను నిర్మించి, ప్రథమ ప్రాధాన్యం వారికే ఇవ్వాలని పేర్కొన్నారు.సార్.. హామీలు నెరవేర్చండిసీఎం చంద్రబాబు సమావేశం సందర్భంగా లైవ్‌లో విన్నపాలు వెల్లువెత్తాయి. ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన సమావేశాన్ని సమాచార శాఖ యూట్యూబ్ లింక్ ద్వారా లైవ్ ఇచ్చింది. దీన్ని ప్రత్యక్షంగా చూసిన పలువురు పలు సమస్యలను వివరిస్తూ కామెంట్లు పెట్టారు. సీఎం సార్.. హామీలు నెరవేర్చండంటూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. వలంటీర్లను విధుల్లోకి తీసుకుని చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ ‘వీజీఎన్’ అనే పేరుతో కామెంట్ చేశారు.ఎంఎల్‌హెచ్‌పీలకు జీతాలు రాలేదంటూ విజయ్‌కుమార్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. పేదలకు స్థలాలు, ఇళ్లు ఇచ్చి ఆదుకోవాలని గౌరి నాయుడు కోరాడు. ప్రతి ఇంటికి ఉచిత విద్య, వైద్యం అందించే దిశగా విద్యా సంస్థలు, ఆసుపత్రులను సన్నద్ధం చేయాలని చంద్రధర్ అనే వ్యక్తి సూచించాడు. కేజీబీవీ టీచర్ల క్రమబద్ధీకరణ, నిరుద్యోగ సమస్యలను కొందరు ప్రస్తావించారు.వ్యవస్థల బలోపేతంగత ప్రభుత్వం వ్యవస్థలను ఆటబొమ్మలుగా మార్చింది. వ్యవస్థలను బలోపేతం చేయాలని రాజకీయాల్లోకి వచ్చా. పంచాయతీల బలోపేతానికి అందరూ సహకరించాలి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం. పిఠాపురంలో ద్రవ వ్యర్థాల నిర్వహణను పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాం. – పవన్ కళ్యాణ్, ఉపముఖ్యమంత్రిత్వరలో ల్యాండ్ గ్రాబింగ్ చట్ట సవరణప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని సవరిస్తాం. గత ప్రభుత్వ పాలనలో 9 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించగా అందులో దాదాపు 25 వేల ఎకరాల రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. మాకు అందే విజ్ఞప్తుల్లో 80 శాతం రెవెన్యూకు సంబంధించినవే ఉన్నాయి. – అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ మంత్రికలెక్టర్లకు వంద రోజుల ప్రణాళికరాబోయే 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి రూపొందించిన ప్రణాళికను కలెక్టర్లు సమర్థంగా అమలు చేయాలి. ప్రజా సమస్యలకు అత్యంత ప్రాధాన్యమివ్వాలి. కలెక్టర్ల స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకుంటే ఆయా విభాగాల ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించేలా చొరవ చూపాలి. – నీరభ్ కుమార్ ప్రసాద్, సీఎస్ -
Fact Check: వాస్తవాలకు మసిపూసి ‘ఈనాడు’ విష ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి రైతుకు విత్తు నుంచి విక్రయం వరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోంది. వారు పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు దక్కేలా కృషి చేస్తోంది. ఏ సీజన్‌కు ఆ సీజన్ ముందుగానే విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను గ్రామ స్థాయిలోనే రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ద్వారా అందిస్తోంది. దీంతో రైతులపై రవాణా చార్జీల భారం తప్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కామన్ వెరైటీ, గ్రేడ్–ఏ రకాల ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తూ బాసటగా నిలుస్తోంది. ఇలా ప్రతి దశలోనూ రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంటే వాస్తవాలకు ముసుగేసి ‘ఈనాడు’ తనదైన శైలిలో విషం చిమ్ముతోంది. ప్రభుత్వ సహకారాన్ని ప్రస్తావించకుండా, ఇతర రాష్ట్రాల్లో బోనస్ అంటూ రైతులను తప్పుదోవ పట్టించేలా ‘వరి రైతుకు మిగిలేదేంటి?’ శీర్షికన ఓ కథనాన్ని వండివార్చింది. ఇందులో నిజానిజాల్లోకి వెళితే.. ఆరోపణ: 2022–23లో 9 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గింది. వాస్తవం: రాష్ట్రంలో వరి సాధారణ విస్తీర్ణం ఖరీఫ్‌లో 38.8 లక్షల ఎకరాలు, రబీలో 19.92 లక్షల ఎకరాలు.. అంటే మొత్తం విస్తీర్ణం 58.72 లక్షల ఎకరాలు. కాగా 55.52 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అంటే వ్యత్యాసం 3.20 లక్షల ఎకరాలు. రబీలో బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలను ప్రభుత్వం ప్రోత్సహించడంతో 1.15 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు, 50 వేల ఎకరాల్లో చిరుధాన్యాలు, మొక్కజొన్న, నూనెగింజల సాగు విస్తీర్ణం పెరిగింది. మరో 35 వేల ఎకరాల్లో మత్స్య సాగు విస్తరించింది. మిగిలిన భూమిని ఇళ్ల స్థలాల కోసం సేకరించారు. వాస్తవం ఇలా ఉంటే ఏకంగా 9 లక్షల ఎకరాలు తగ్గిపోయిందంటూ ‘ఈనాడు’ వక్రభాష్యం చెప్పింది. ఆరోపణ: క్వింటా రూ.3,126 ప్రతిపాదిస్తే ఎందుకు తగ్గించారు? వాస్తవం: పెట్టుబడి ఖర్చుల ఆధారంగా దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు పంటల వారీగా కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని ప్రతిపాదిస్తాయి. ఇలా మన రాష్ట్రంలో ఖరీఫ్‌లో ఎకరాకు రూ.32 వేలు, రబీలో రూ.41 వేలు ఖర్చవుతుందన్న అంచనాతో క్వింటా రూ.3,126గా ఎంఎస్పీ నిర్ణయించాలని కేంద్రానికి నివేదిక పంపింది. ఇదే రీతిలో పంటల వారీగా ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో రీతిలో వచ్చే ప్రతిపాదనలన్నీ క్రోడీకరించుకొని పంట కాలానికయ్యే సాగు ఖర్చును సరాసరి లెక్కించి పంటల వారీగా అన్ని రాష్ట్రాలకు ఒకే రకమైన మద్దతు ధరను కేంద్రం ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అదే రీతిలో 2023–24 సీజన్‌కు సాధారణ రకానికి క్వింటాకు రూ.2,183, గ్రేడ్–ఏ రకానికి రూ.2,203గా కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ విధి ప్రతిపాదనలు పంపించడం వరకే. నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదేనన్న విషయం రామోజీకి తెలియనట్లుంది కాబోలు. ఆరోపణ: బోనస్ ఇవ్వాలన్న ఆలోచనే మరిచారు వాస్తవం: కేరళ, తమిళనాడు, జార్ఖండ్ వరికి బోనస్ ఇస్తున్నాయంటూ ‘ఈనాడు’ కొత్త వాదన తీసుకొ చ్చింది. మరి బోనస్ ఇస్తున్నా ఆయా రాష్ట్రాల్లో వరి సాగు ఎందుకు పెరగడం లేదు? ఏపీలో 24 లక్షల హెక్టార్లలో వరి సాగవుతుంటే కేరళలో 1.98 లక్షల హెక్టార్లు, జార్ఖండ్‌లో 13.57 లక్షల హెక్టార్లు, తమిళనాడులో 19 లక్షల హెక్టార్లలో మాత్రమే వరిసాగవుతోంది. ఇక దిగుబడిని పరిశీలిస్తే ఏపీలో ఎకరాకు 23.24 క్వింటాళ్ల్ల దిగుబడి (2022–23) వస్తుంటే, తమిళనాడులో 17, జార్ఖండ్‌లో 9, కేరళలో 13 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. ఆయా రాష్ట్రాల్లో ఎంతగా ప్రోత్సహిస్తున్నా, వరిసాగు కంటే ఎక్కువ ఆదాయం వచ్చే పంటల వైపు అక్కడి రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగానే కేరళ.. ఏటా మన గోదావరి జిల్లాల్లో సాగయ్యే బోండాల కోసం క్యూ కడుతుంటే, తమిళనాడు.. రాయలసీమ జిల్లాల్లో సాగయ్యే ఫైన్ వెరైటీ, జార్ఖండ్.. ఉత్తరాంధ్రలో సాగయ్యే ఫైన్ వెరైటీ ధాన్యం కొనుగోలుకు ఎగబడుతున్నాయి. సాధారణంగా డిమాండ్ కంటే తక్కువ ఉత్పత్తి ఉన్న పంటల సాగును ప్రోత్సహించాలన్న సంకల్పంతోనే బోనస్ ప్రకటిస్తుంటారు. మన రాష్ట్రంలో డిమాండ్‌కు మించి ఉత్పత్తి జరుగుతోంది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క సీజన్లో కూడా ఒక్క రూపాయి బోనస్ ప్రకటించిన పాపాన పోలేదు. అయినా ఇదేంటని రామోజీ అప్పట్లో ఏనాడైనా ప్రశ్నించారా? ఆరోపణ: మిల్లర్లకు ఎదురు సొమ్ము ఇవ్వాల్సి వస్తోంది వాస్తవం: గత ప్రభుత్వ హయాంలో మిల్లర్లు, దళారీల కనుసన్నల్లోనే ఎమ్మెస్పీ కంటే తక్కువ ధరకే ధాన్యం సేకరణ జరిగేది. ఏనాడూ ఏ ఒక్క రైతుకు కూడా ఎమ్మెస్పీ దక్కిన దాఖలాలు లేవు. కానీ నేడు దళారీలు, మిల్లర్ల ప్రమేయం కూడా లేకుండా ప్రతి గింజను కనీస మద్దతు ధరకే ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం ఆర్బీకేలన్నింటిని ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా గుర్తించింది. నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తోంది. కొనుగోలు చేసిన ధాన్యంలో మంచి రకాలను ఎంపిక చేసి అదనపు ఖర్చుల కింద క్వింటాకు రూ.110 వెచ్చించి నాణ్యమైన బియ్యంగా మార్చి కార్డుదారులకు ఇంటి వద్దే అందిస్తోంది. ఇవేమీ ‘ఈనాడు’కు కనిపించడం లేదు. ఆరోపణ: వరి రైతుకు కనీస మద్దతు ధర దక్కడం లేదు వాస్తవం: చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 17,94,279 మంది రైతుల నుంచి రూ.40,237 కోట్ల విలువైన 2,65,10,747 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. బాబు హయాంలో తక్కువ మంది రైతుల వద్ద నుంచి ఎక్కువ మొత్తం ధాన్యం సేకరించేవారు. ఉదాహరణకు 2014–15లో 1.18 లక్షల మంది రైతుల నుంచి రూ.5,583 కోట్ల విలువైన 40.62 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. నూటికి 90 శాతం సన్న, చిన్నకారు రైతులున్న ఈ రాష్ట్రంలో ఈ స్థాయిలో ధాన్యం అమ్మారంటే వార్ని ఏమంటారో అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు రాష్ట్రంలో గత నాలుగేళ్లలో ఏకంగా 32,76,354 మంది రైతుల నుంచి రూ.58,739 కోట్ల విలువైన 3,10,56,117 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. గతంతో పోలిస్తే ధాన్యం అమ్ముకున్న రైతుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. ఆరోపణ: అమ్మాలంటే అగచాట్లు వాస్తవం: గత ప్రభుత్వ హయాంలో రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని బస్తా (75 కిలోలు)కు మద్దతు ధర కంటే రూ.200 నుంచి రూ.500 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరాకు తక్కువలో తక్కువ 30–33 బస్తాల దిగుబడి వేసుకున్నా రూ.6 వేలకు పైగా రైతులు నష్టపోయేవారు. అంతేకాకుండా దళారులు, వ్యాపారులు తేమ శాతం పేరిట ఇష్టమొచ్చినట్టు కోత పెట్టేవారు. కానీ ప్రస్తుతం జిల్లాకో మొబైల్ మిల్లును పంపి రైతుల ఎదుటే శాంపిల్స్ పరీక్షించి మరీ కొనుగోలు చేశారు. ముక్క విరుగుడు ధాన్యాన్ని బాయిల్డ్ రకంగా పరిగణించి మరీ కొన్నారు. గత ఖరీఫ్ సీజన్లో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను తేమ, నూక శాతాలతో సంబంధం లేకుండా కొనుగోలు చేసి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. బోనస్‌కు మించి జీఎల్టీ రైతు ప్రయోజనార్థం రైతు భరోసా కేంద్రాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రంగా గుర్తించింది. అంతటితో ఆగకుండా రైతు పొలం నుంచే నేరుగా కొనుగోలు చేసేందుకు అదనపు ఖర్చులు భరించింది. మునుపెన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలులో గోనె సంచులు, హమాలి.. రవాణా చార్జీలు మద్దతు ధరతో పాటు కలిపి చెల్లిస్తోంది. ఒక్కో గోనె సంచి ఖరీదు రూ.70. ఈ లెక్కన ఒక టన్ను ధాన్యం నిల్వ చేసేందుకు గోనె సంచుల కోసం రూ.1,750 ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది. హమాలి ఖర్చు టన్నుకు రూ.220, రవాణాకు రూ.468 (25 కి.మీ పరిధిలో) చొప్పున.. మొత్తంగా టన్నుకు రూ.2,523 చొప్పున ప్రభుత్వం జీఎల్టీ (గన్నీ బాగులు, లేబర్, ట్రాన్స్పోర్ట్) రూపంలో ఖర్చు చేస్తోంది. ఈ మొత్తం ధాన్యం కొనుగోలు సొమ్ముతో కలిపి రైతు ఖాతాల్లో జమ చేస్తోంది. చదవండి: Fact Check: అసత్యాల్లో నిండా మునిగిన ‘ఈనాడు’ ఇది ఆయా రాష్ట్రాల్లో ఇచ్చే బోనస్‌తో పోల్చుకుంటే చాలా ఎక్కువ. పైగా పక్క రాష్ట్రాల్లో పరిమితికి లోబడే కొనుగోలు చేస్తారు. మన రాష్ట్రంలో మాత్రం ఆర్బీకే వద్దకు వచ్చిన ప్రతి రైతు నుంచి ఈ–క్రాప్ ఆధారంగా ధాన్యం కొనుగోలు చేస్తుండటం బహిరంగ రహస్యం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోని ఈనాడు ప్రభుత్వంపై పనిగట్టుకుని బురద చల్లడమే లక్ష్యంగా అర్ధసత్య కథనాలు ఎవరి కోసం రాస్తోంది? -
బడికి రప్పించేలా రవాణా చార్జీలు
సాక్షి, అమరావతి: బడి వయసు పిల్లలెవరూ చదువులకు దూరం కాకుండా స్కూళ్లలో చేరేలా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ పాఠశాల విద్యాశాఖ పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. అమ్మ ఒడి కింద ఏటా రూ.15వేల చొప్పున మూడేళ్లుగా రూ.19,617 కోట్లను నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన, బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తున్నారు. దీనికోసం మూడేళ్లలో రూ.3,117 కోట్లను వెచ్చించింది. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల కోసం సంపూర్ణ పోషణ కింద రూ.48.92 కోట్లతో పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. జగనన్న విద్యాకానుక ద్వారా రూ.2,324 కోట్లతో కుట్టుకూలీతో 3 జతల యూనిఫారం దుస్తులు, బ్యాగు, బెల్టు, షూ, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్సులు, వర్కుబుక్కులు, డిక్షనరీతో కూడిన స్టూడెంట్ కిట్లు అందిస్తున్నారు. వీటన్నిటితోపాటు స్కూళ్లు అందుబాటులో లేనివారికి, దూర ప్రాంతాల్లో నివసించే పిల్లలు నడవాల్సిన అవసరం లేకుండా రవాణా చార్జీలను సైతం ప్రభుత్వం చెల్లిస్తోంది. ట్రాన్స్పోర్ట్ చార్జీల కింద నెలకు రూ.600 చొప్పున 10 నెలల పాటు అందిస్తోంది. 2022–23కిగాను 40 వేల మందికిపైగా రవాణా చార్జీల కింద రూ.24.25 కోట్లు చెల్లించనున్నారు. ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు 32,569 మందికి రూ.19.54 కోట్లు, సెకండరీ స్కూలు విద్యార్థులు 7852 మందికి రూ.4.71 కోట్లు రవాణా చార్జీలుగా అందించనున్నారు. మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో బడిబయట ఉన్న పిల్లలకోసం రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వలస వెళ్లిన వారి పిల్లలు, ఇతర ప్రాంతాలనుంచి ఉపాధి కోసం వచ్చిన వారి చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పేందుకు సీజనల్ హాస్టళ్లను విద్యాశాఖ నెలకొల్పింది. అనాథలు, ఆర్థిక పరిస్థితి సరిగాలేని పిల్లల కోసం సమగ్ర శిక్ష (ఎస్ఎస్ఏ) ద్వారా సమీప ప్రాంతాల్లో ప్రత్యేక వసతి గృహాలను ఏర్పాటు చేశారు. -
ప్రయాణ ఖర్చులన్నీ ప్రభుత్వానివే..
సాక్షి, హైదరాబాద్: ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్‌ను గుర్తించడమే కాదు, వాళ్లనెంత గౌరవంగా చూస్తున్నామన్నది కూడా ముఖ్యమే’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములైన వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు రోజుకు 40 చొప్పున వారం రోజుల పాటు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ మార్గం సుగమం చేస్తున్నారని పేర్కొన్నారు. వారి ప్రయాణానికి అయ్యే ఖర్చులన్నీ తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని కేటీఆర్ వెల్లడించారు. -
‘భవిత’కు భరోసా ఏదీ?
సాక్షి, నల్లగొండ: భవిత కేంద్రాలకు ప్రభుత్వంనుంచి భరోసా కరువైంది. రెండేళ్లుగా భవిత కేంద్రాలకు నిధులు అందకపోవడంతో కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయి. బుద్ధిమాంద్యం, అంగవైకల్యం కలిగి ఉండి సొంతంగా పనులు చేసుకోలేని వారి కోసం ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా దివ్యాంగ పిల్లలను గుర్తించి వారిని పాఠశాలకు (భవితకేంద్రాలు) రప్పించాలి. విద్యాబుద్ధులు నేర్పు తూ మాట్లాడేది అర్థం చేసుకునే విధంగా వారిని తీర్చిదిద్దాలి. చివరికి సాధారణ విద్యార్థులుగా మార్చాలి. ప్రభుత్వం సౌకర్యాలు కల్పించకపోవడంతో భవిత కేంద్రాలు ఉపయోగపడుతున్నట్లు కనిపించడం లేదు. ఒక్కో మండలానికి రెండు కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 16 మండలాల పరిధిలో ఒక్కో మండలానికి రెండు భవిత కేంద్రాలను ఏర్పా టు చేసింది. ఒక్కో కేంద్రంలో ఇద్దరు ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్(ఐఈపీఆర్)లను నియమించారు. వీరంతా వారి మండలాల పరిధిలో తిరిగి సరిగా మాటలు రాని బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలతోపాటు అంగవైకల్యం కలిగిన వారిని గుర్తించాలి. వారి తల్లిదండ్రులను ఒప్పించి పాఠశాలకు రప్పించాల్సి ఉంది. ఇక్కడ బోధన ఉచితంగా చేస్తారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 487 మంది 10 నుంచి 15 సంవత్సరాల దివ్యాంగ పిల్లలు ఉన్నారు. ఆగిన వైద్యశిబిరాలు భవిత కేంద్రాల్లో చదివే దివ్యాంగ విద్యార్థుల కోసం మండల స్థాయిలో ప్రతి జనవరి, ఫిబ్రవరి మాసాల్లో వైద్యశిబిరాలను నిర్వహించాలి. వారికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఎలాం టి ఉపకరణాలు అవసరమనేది గుర్తిం చాలి. గ్రహణమొర్రి వంటి వారికి కూడా శస్త్రచికిత్సలకు ప్రణాళికలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తారు. అదే సంవత్సరం నవంబర్, డిసెంబర్ మాసాల్లో పరికరాలు అందించడంతోపాటు శస్త్ర చికిత్సలు కూడా చేయించాలి. కానీ గత ఏడాది నిర్వహించిన పరీక్షలకు ఇంతవరకు పరికరాలు అందలేదు. ఈ సంవత్సరం జనవరిలో అసలు పరీక్షలే నిర్వహించలేదు. అంటే రెండేళ్లుగా వైద్యశిబిరాలు లేవన్నమాట. ఆగిన ట్రాన్స్‌పోర్టు చార్జీలు భవిత కేంద్రాలకు వచ్చే పిల్లలకు నెలకు రూ.250 ట్రాన్స్‌పోర్టు చార్జీలు ఇవ్వాల్సి ఉంది. గత సంవత్సరంనుంచి ట్రాన్స్‌పోర్టు చార్జీలు విడుదల కాలేదు. అసలే దివ్యాంగత్వం కారణంగా ఆర్థిక భారంతో బాధపడుతున్న కుటుం బాలు పిల్లలను భవిత కేంద్రాలకు పంపించేం దుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. రానురాను కేంద్రాల్లో పిల్లల సంఖ్య కూడా తగ్గిపోతుంది. ప్రధానంగా పిల్లలకు వీల్‌చైర్స్, ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలతో పాటు చంక కర్రలు, మానసిక బుద్ధిమాంద్యత కిట్లు, బ్రెయిలీ బుక్స్, తదితరాలు కూడా అందుబాటులో ఉం చాలి. ఆ పరిస్థితి కూడా లేకపోవడంతో పిల్లలు భవిత కేంద్రాలకు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి శుక్రవారం ఫిజియోథెరపీ చేయాలి వారంలో ప్రతి శుక్రవారం పిల్లలకు ఫిజియోథెరపిస్ట్‌తో ఫిజియోథెరపీ (ఎక్సర్సైజ్) చేయాలి. పిల్లలు ఎవరైనా పాఠశాలకు రాలేని వారు ఉంటే వారి ఇళ్లకే వెళ్లి చేయించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి కూడా ఎలాంటి నిధులూ విడుదల కాకపోవడంతో వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైతే పిల్లలు పాఠశాలకు రాలేని పరిస్థితిలో మంచానికే పరిమితమై ఉంటారో అలాంటి పిల్లల ఇంటికి వెళ్లి ఒక గంటన్నరసేపు బోధించాల్సి ఉంది. ఇలాంటి విషయంలో కూడా పెద్దగా స్పందిస్తున్నట్లు కనిపించడం లేదు. నిధులు లేకనే నీరసం భవిత కేంద్రాలకు నిధులు అందని కారణంగా అవి నీరస పడిపోతున్నాయి. ఈ కేంద్రాల్లో రెండేళ్లు మాత్రమే చదువుతారు. ఈ సమయంలో పిల్లలు బుద్ధిమాంద్యం నుంచి మాట్లాడగలిగే స్థితి వచ్చిందంటే వారిని రెగ్యులర్ పాఠశాలకు పంపాలి. కానీ భవిత కేంద్రాలే సక్రమంగా నడవకపోవడంతో రెగ్యులర్ పాఠశాలలకు కూడా వెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. నల్లగొండ పట్టణంలోని భవిత కేంద్రాన్ని 'సాక్షి' సందర్శనకు వెళ్లగా 10మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. వాస్తవంగా అక్కడ 21 మంది పిల్లలు ఉండాలి. కానీ ట్రాన్స్‌పోర్టు చార్జీలు ఇవ్వని కారణంగా పిల్లల సంఖ్య తగ్గిపోతుందని చెబుతున్నారు. మధ్యాహ్న భోజనం కూడా పెడుతున్నామని, కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను భవిత కేంద్రంలో తోలిపోతుండగా, మరికొందరు ఆటోలో సొంత డబ్బులతో పంపిస్తున్నారని, కొందరు పంపించడం లేదని భవిత కేంద్రం ఐఈఆర్పీ శైలజ తెలిపారు. -
గ్రామాల్లో వలస ఓటర్ల సందడేదీ?
సాక్షి, అడ్డాకుల: లోక్‌సభ ఎన్నికలు గురువారం జరుగనున్న నేపథ్యంలో ఈసారి వలస ఓటర్లపై నాయకులు పెద్దగా దృష్టి సారించలేదు. గత శాసనసభ, సర్పంచ్ ఎన్నికలప్పుడు గ్రామాల్లో వలస ఓటర్లతో సందడి వాతావరణం నెలకొంది. అయితే ఈసారి ఆ సందడి కనిపించడం లేదు. దూర ప్రాంతాల నుంచి ఓట్లు వేయడానికి గ్రామాలకు వచ్చే ఓటర్లు పదుల సంఖ్యలో కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. ప్రతి ఎన్నికలప్పుడు నేతలు దూర ప్రాంతాల్లో ఉండే ఓటర్లకు రవాణా ఖర్చులు అందజేసి ఓట్లు వేయడానికి ఊర్లకు రావాలని వలస ఓటర్ల వద్దకు వెళ్లి కలిసేవారు. లోక్‌సభ ఎన్నికలు కావడం, వరుస ఎన్నికలు రావడంతో వలస ఓటర్లను రప్పించడానికి నేతలెవరు పెద్దగా ప్రయత్నం చేసిన దాఖలాలు కనిపించడం లేదు. వలస ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించడానికి అయ్యే ఖర్చును ఎవరు భరిస్తారని కొందరు నాయకులు నిర్మోహమాటంగా చెబుతుండటం విశేషం. అలాగే రానున్న పరిషత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజాప్రతినిధులు పార్లమెంట్ ఎన్నికలకు వస్తే పరిషత్ ఎన్నికలకు రారేమోనని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారిని గ్రామాల్లోని నాయకులు పట్టించుకోవడం లేదు. -
భర్త శవాన్ని తరలించేందుకు భిక్షాటన..
చిత్తూరు , మదనపల్లె క్రైం: చికిత్స పొందుతూ భర్త చనిపోవడంతో ఆ శవన్ని ఇంటికి తరలించడానికి డబ్బులు లేక ఓ పేద మహిళ ఆస్పత్రిలోని రోగుల చెంత భిక్షాటన చేసింది. వారు ఆర్థిక సాయం అందించడంతో ఆటోలో భర్త మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లింది. మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం వెలుగుచూసిన ఈ విషాదకర ఘటనకు సంబం ధించి వివరాలు ఇలా ఉన్నాయి. పుంగనూరు మండలం బారాడపల్లె పంచాయతీ ఈడిగపల్లెకు చెందిన బాబుసాహేబ్(45) భవన నిర్మాణ కార్మి కుడు. ఇతడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో అతని భార్య దౌలత్‌బీ ఆదివారం 108లో భర్తను చికిత్స కోసం మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చింది. అత్యవసర విభాగంలో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు బాబుసాహేబ్ పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించాలని సూచించారు. అయితే దౌలత్‌బీ తన చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని డాక్టర్ల వద్ద కన్నీరు పెట్టుకుంది. చేసేది లేక డాక్టర్లు వెంటనే అతన్ని వార్డులో అడ్మిట్ చేసి చికిత్స అందించారు. అప్పటికే గొం తు బిగుసుకుపోయిన బాబు సాహేబ్ ఊపిరి ఆడ క శ్వాసకోస వ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురైæ చని పోయాడు. భర్త మరణించాడని తెలియడంతో దౌలత్‌బీ కన్నీరు మున్నీరైంది. ఇక తనకూ, తన బిడ్డలిద్దరికి దిక్కెవరంటూ రోదించింది. చివరకు 20 కిలోమీటర్ల దూరంలోని తన ఇంటికి భర్త శవాన్ని తీసుకెళ్లడానికి కూడా ఆమె వద్ద డబ్బులు కూడా లేకుండా పోయాయి. దీంతో ఆస్పత్రిలో కనిపించిన వారందరినీ ఆర్థికసాయం అందించామని వేడుకుంది. కరుణించిన కొందరు ఆమెకు కొంత నగదును ఇవ్వడంతో ఆ డబ్బుతో బాడుగ ఆటోలో తన భర్త శవాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లింది. ఆటో డ్రైవర్ కూడా ఉదారంగా వ్యవహరించి తక్కువ మొత్తంతో బాబుసాహేబ్ మృతదేహాన్ని ఇంటికి తరలించాడు. ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది. -
రవాణా చార్జీలు భరిస్తే పేదలకు ఇసుక ఫ్రీ
సూత్రప్రాయంగా నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం సాక్షి, విజయవాడ బ్యూరో: పేదలకు ఇసుకను ఉచితంగా ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అందరి అభిప్రాయాలు తీసుకుని రెండు, మూడు రోజుల్లో దీనిపై విధివిధానాలు రూపొందించనుంది. ఇసుక విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం కలెక్టర్లు, మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇసుకపై వచ్చే ఆదాయం రూ.200 కోట్లే అయినా చెడ్డపేరు ఎక్కువ వస్తోందన్నారు. అందుకే పేదల నిర్మాణ అవసరాలకు ఇసుకను ఉచితంగా ఇస్తామని తెలిపారు. రవాణా చార్జీలు భరిస్తే చాలన్నారు. సోమవారం బిల్డర్లు, ఇతర వర్గాలవారితో దీనిపై సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకుందామని చెప్పారు. ఇసుక అందక సామాన్యుడు బాధపడే పరిస్థితి రాకూడదన్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార నదులన్నీ మన రాష్ట్రంలోనే సముద్రంలో కలుస్తాయని, పర్యావరణానికి హాని లేని రీతిలో ఎంతో ఇసుకను ఏటా తవ్వి తీయొచ్చని, అయినా అధికారులు అధిక ఆదాయం సాధించలేకపోయారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్నింటిల్లోనూ తనను మెచ్చుకునేవారు ఇసుక విధానం మాత్రం సరిగా లేదని వ్యాఖ్యానిస్తున్నారన్నారు. కాగా ఇసుకను ఎక్కువగా నిల్వ చేయడం, కృత్రిమ కొరత సృష్టించడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. దీనికి చెక్ పెడతామని, చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచుతామని చెప్పారు. ఇసుక విధానంలో డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూర్చాలని, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకోవాలని ప్రయత్నించినా కుదరలేదని చెప్పుకొచ్చారు. సమావేశానంతరం మంత్రులు పుల్లారావు, నారాయణలు మీడియాతో మాట్లాడుతూ సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే భావనతోనే ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇకపై ఇసుక రీచ్‌ల వేలం, ఆన్లైన్ అమ్మకాలు ఉండవన్నారు. -
సిమెంటుకు తయారీ మంట!
భారంగా విద్యుత్, బొగ్గు, రవాణా చార్జీలు - తప్పనిసరి పరిస్థితుల్లో ధర పెంపు - ధర పెంచకపోతే ప్లాంట్ల మూసివేతే - రైల్వే చార్జీలతో మరోసారి పెంచాల్సివస్తోంది - ‘సాక్షి’తో సిమెంటు కంపెనీల ప్రతినిధులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తయారీ వ్యయం అంతకంతకూ పెరుగుతుండడంతో సిమెంటు కంపెనీలకు పాలుపోవడం లేదు. ముడి పదార్థాలు, విద్యుత్, బొగ్గు, రవాణా వ్యయాలు, బ్యాంకు వడ్డీలు ఏడాదికేడాది భారంగా పరిణమిస్తున్నాయి. దీంతో సిమెంటు తయారీ వ్యయం అదే స్థాయిలో దూసుకెళ్తోందని కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పటికే రెండు ప్లాంట్లు మూతపడ్డాయి. ఈ పరిస్థితుల్లో ధర పెంచకపోతే మరిన్ని ప్లాంట్ల మూసివేత తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేస్తున్నాయి. నష్టాల నుంచి గట్టెక్కాలంటే ధర పెంచక తప్పలేదని పేర్కొంటున్నాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టు రైల్వే సరుకు రవాణా చార్జీలు తాజాగా 6.5 శాతం పెరిగాయి. పరిశ్రమకు మరింత భారం పడ్డట్టేనని, దీని ప్రభావంతో మరోసారి ధర పెంచక తప్పదని కంపెనీలు అంటున్నాయి. దూసుకెళ్తున్న వ్యయం.. సిమెంటు తయారీకి రూ.155-165, ఎక్సైజ్ పన్ను రూ.41, వ్యాట్ రూ.46, రవాణా రూ.55-80 కలుపుకుంటే మొత్తం వ్యయం ఒక్కో బస్తాకు రూ.297-332 అవుతోంది. దీనికి హ్యాండ్లింగ్ చార్జీలు, డీలర్/ఏజెంట్ కమిషన్ అదనం. భారీ పెట్టుబడితో కూడుకున్న రంగం కాబట్టి బస్తా అమ్మకం ధర రూ.300 లోపు ఉంటే కంపెనీలకు నష్టమేనని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. డిమాండ్ తక్కువగా ఉండడంతో కంపెనీలు ఉత్పత్తి తగ్గించి వేశాయి. అయితే స్థిర వ్యయాలైన తరుగుదల, వడ్డీ, పరిపాలన తదితర వ్యయాలు మిగిలిన ఉత్పత్తిపై ప్రభావం చూపడంతో సిమెంటు ధర పెరిగేందుకు ఒక కారణమవుతోంది. మూడేళ్లలో విద్యుత్ చార్జీలు 70% దాకా పెరిగాయి. ఇక నాణ్యమైన బొగ్గు కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇండోనేసియా నుంచి దిగుమతైన బొగ్గు టన్నుకు నాలుగేళ్ల క్రితం రూ.4 వేలుంటే, నేడు రూ.5 వేలకు చేరుకుంది. దేశీయ బొగ్గు కొరత కారణంగా టన్నుకు రూ.3,750 నుంచి రూ.5,500లకు చేరిం ది. డీజిల్ లీటరుకు రూ.44 నుంచి రూ.61కి చేరింది. దీంతో సిమెంటు ధర కూడా హెచ్చించాల్సివస్తోందని కంపెనీలు వాపోతున్నాయి. పొరుగు రాష్ట్రాల కంటే తక్కువే.. సమైక్య రాష్ట్రంలో గతేడాది జూలై ప్రాంతంలో సిమెంటు ధర బస్తాకు (50 కిలోలు) రకాన్నిబట్టి రూ.320 దాకా వెళ్లింది. అది కాస్తా తర్వాతి నెలల్లో రూ.200-235కు వచ్చి చేరింది. సిమెంటుకు గిరాకీ లేకపోవడమే ధర క్షీణతకు కారణం. 2014 మే నుంచి ధరల్లో పెరుగుదల వచ్చింది. సీమాంధ్ర, తెలంగాణలో ఒక దశలో బస్తా ధర రూ.340 దాకా వెళ్లినప్పటికీ తిరిగి రూ.300-325 మధ్య ప్రస్తుతం నిలకడగా ఉంది. ఉత్తరాదితోపాటు ఇతర రాష్ట్రాల్లో ఒక్కో బస్తాకు రూ.380 వరకు ధర ఉందని ఓ కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. తమిళనాడులో రూ.370-380, కేరళలో రూ.370, కర్ణాటకలో రూ.350 వరకు ఉందని పేర్కొన్నారు. అటు మహారాష్ట్రలోనూ ధరలు పెరిగాయి. ఈ రాష్ట్రాల కంటే ఇక్కడే ధర తక్కువగా ఉందని ఆయన తెలిపారు. తయారీ వ్యయాలు ఎగుస్తున్నందునే ధరల్ని వాటికి అనుగుణంగా స్థిరీకరణ చేయాల్సి వచ్చిందని చెప్పారు. తాజాగా పెరిగిన రైల్వే సరుకు చార్జీల ప్రభావంతో సిమెంటు ధర ఒక్కో బస్తాకు రూ.10 వరకు పెరగనుందని పేర్కొన్నారు. 2014 జనవరి-మార్చి త్రైమాసికంలో చాలా కంపెనీలు నష్టాలను చవిచూడడాన్నిబట్టి చూస్తే ప్రస్తుత పరిస్థితి అద్ధం పడుతుందని ప్రముఖ కంపెనీ ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. అనిశ్చితి కారణంగా.. గత మూడేళ్లుగా సమైక్య రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం తెలిసిందే. ఈ కారణంగా సిమెంటుకు ఆయువు పట్టు అయిన నిర్మాణ రంగం కుదేలైంది. రాజధాని నగరమైన హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లోనూ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులే దని చెప్పారు. అటు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలూ ఏవీ జరగలేదు. దీంతో సిమెంటుకు గిరాకీ లేకుండా పోయిందని ఓ కంపెనీ ఉన్నతాధికారి వెల్లడించారు.