బావిలో పడ్డ ఎలుగుబంటి | bear falls into well | Sakshi
Sakshi News home page

బావిలో పడ్డ ఎలుగుబంటి

Published Mon, Jun 12 2017 11:08 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM

బావిలో పడ్డ ఎలుగుబంటి

బావిలో పడ్డ ఎలుగుబంటి

బెళుగుప్ప (ఉరవకొండ) : బెళుగుప్ప మండలం గంగవరంలో ఓ ఎలుగుబంటి ప్రాణభయంతో పరుగెడుతూ బావిలో పడిపోయింది. అటవీ అధికారులు నిచ్చెన సాయంతో దాన్ని బయటకు తీశారు. వివరాలిలా ఉన్నాయి. ఓ ఎలుగుబంటి ఆహారం కోసం సోమవారం తెల్లవారుజామున గంగవరం గ్రామంలోకి చొరబడింది. దీన్ని గమనించిన కుక్కలు దానిపై దాడికి యత్నించాయి బెదిరిపోయిన ఎలుగుబంటి æఅకస్మాత్తుగా ఒక ఇంట్లోకి దూరి మాధవి అనే మహిళ వీపుపై గాయపరిచింది.

గ్రామంలో కలకలం రేగడంతో జనం పోగయ్యారు. దాన్ని తరిమివేసేందుకు ప్రయత్నం చేశారు. బెంబేలెత్తిపోయిన ఎలుగుబంటి వారి నుంచి తప్పించుకునేందుకు పరుగు  తీస్తూ గ్రామ శివారులోని నీరులేని పాడుబడిన బావిలోకి పడిపోయింది. లోతు ఎక్కువగా ఉండటంతో బయటకు రాలేకపోయింది.  సమాచారం అందుకున్న పోలీసులు,అటవీ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.  బావిలోకి నిచ్చెన వేయగా..దాని సాయంతో ఎలుగుబంటి పైకి వచ్చి అటవీప్రాంతంలోకి పరుగులు తీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement