ఐస్‌లాండ్‌లోని ఒక మారుమూల గ్రామంలోని కనిపించిన అరుదైన ధ్రువ ఎలుగుబంటిని స్థానిక ప్రజలకు ముప్పుగా భావించి పోలీసులు కాల్చి చంపారు. అయితే ముందుగా ఎలుగుబంటిని తరలించడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ విఫలం కావడంతో చంపాల్సి వచ్చందని వెస్ట్‌ఫ్జోర్డ్స్ పోలీస్ చీఫ్ హెల్గి జెన్సన్ తెలిపారు.
ఆ ఎలుగుబంటి ఓ ఇంటికి సమీపంలోకి వచ్చిందని చెప్పారు. ఆ ఇంట్లో ఓ వృద్ధురాలు ఉందని, ఎలుగుబంటినిచూసి ఆమె భయంతో మేడపైకి వెళ్లి దాక్కుందని పేర్కొన్నారు. సాయం కోసం తన కుమార్తెకు చెప్పగా.. పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఎలుగుబంటి ద్వారా వృద్ధురాలి ప్రాణాలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందో అని దాన్ని కాల్చినట్లు పోలీసులు తెలిపారు.
ధృవపు ఎలుగుబంట్లు ఐస్‌లాండ్‌కు చెందినవి కావు, అయితే కొన్నిసార్లు మంచు గడ్డలపై గ్రీన్‌లాండ్ నుంచి ఒడ్డుకు చేరుకుంటాయి. 2016లో ఐస్‌ల్యాండ్‌లో మొదటిసారి కనిపించింది ఇవి 150 నుంచి 200 కిలోల బరువు ఉంటాయి.
ధృవపు ఎలుగుబంట్లు మానవులపై దాడి చేయడం చాలా అరుదు.
2017లో వైల్డ్‌లైఫ్ సొసైటీ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. వాతావరణ మార్పుల కారణంగా సముద్రపు మంచు కోల్పోవడం వల్ల ఆకలితో ఉన్న ఎలుగుబంట్లు జనావాసాల్లోకి రావడం ప్రారంభించాయని తెలిపింది. దీని వల్ల మానకులకు ప్రమాదం పెరిగిందని పేర్కొంది. వీటి వల్ల, మానవులకు లేదా పశువులకు ముప్పు కలిగిస్తే అధికారులు వాటిపై చర్యలు తీసుకునే అధికారం ఉంటుది.
Comments
Please login to add a commentAdd a comment