ఒట్టావా: భారత సంతతికి చెందిని ఓ యువకుడు కెనడాలోని సర్రే ప్రాంతంలో హత్యకు గురుయ్యాడు. జూన్ 7 (శుక్రవారం) ఉదయం అతనిపై కాల్పులు జరగటంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన యువకుడిని భారత సంతతికి చెందిన యువరాజ్ గోయల్‌గా గుర్తించారు. బ్రిటిష్ కోలంబియాలోని సర్రే నుంచి హత్య జరిగినట్లు సమాచారం అందటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే యువరాజ్ గోయల్ మృతి చెంది ఉన్నాడు.
ఈ కేసులో పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న మన్వీబాస్రామ్ (23), సాహిబ్ బాస్రా (20), హర్కిరత్ ఝుట్టీ (23), ఓంటారియోకు చెందిన కీలాన్ ఫ్రాంకాయిస్ (20)లను అదుపులోకి తీసుకున్నారు. యువరాజ్‌పై ఎటువంటి నేరపూర్తి రికార్డు లేదు. అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అతన్ని టార్గెట్ చేసి కొందరు కాల్పులు జరిపినట్లు తేలింది. ఈ హత్య ఎందుకు జరిగిందనే కారణాల కోసం పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.
యువరాజ్ గోయాల్ స్టూడెంట్ వీసాపై 2019లో పంజాల్‌లోని లూథీయానా నుంచి కెనడా వెళ్లారు. 28 ఏళ్ల యువరాజ్ కెనడాలో సెల్స్ ఎగ్జిక్యూటీవ్‌గా ఉద్యోగం చేస్తున్నారు. యువరాజ్ తండ్రి రాజేశ్ గోయెల్ ఫైర్‌వుడ్ వ్యాపారవేత్త. యువరాజ్ మృతిపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment