British Columbia
-
బ్రిటిష్ కొలంబియా డిప్యూటీ ప్రీమియర్‌గా తొలి ఇండో–కెనడియన్
భారత సంతతికి చెందిన నికీ శర్మ బ్రిటిష్ కొలంబియా(బీసీ) డిప్యూటీ ప్రీమియర్‌గా నియామకం అయింది. ఈ పదవి చేపట్టిన తొలి ఇండో–కెనడియన్‌గా చరిత్ర సృష్టించింది. కెనడాలోని లేత్బ్రిడ్జ్లో పుట్టిన నికీ శర్మ బ్రిటీష్ కొలంబియాలోని స్పార్వుడ్లో పెరిగింది. ఆమె తల్లిదండ్రులు ఇండియా నుంచి వలస వచ్చారు. తండ్రి పాల్ చిన్న వ్యాపారవేత్త. తల్లి రోజ్ సైంటిస్ట్. ‘యూనివర్శిటీ ఆఫ్ ఆల్బెర్టా ఫ్యాకల్టీ ఆఫ్ లా’ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్న నికీ శర్మ ఆ తరువాత లా ఫర్మ్ ‘డోనోవన్ అండ్ కంపెనీ’లో చేరింది.పర్యావరణ సంస్థ ‘స్టాండ్ ఎర్త్’ కోసం క్యాంపెయినర్‌గా పనిచేసింది. 2014లో వాంకూవర్ సిటీ మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయింది. ఈ ఓటమి మాట ఎలా ఉన్నా ఆ తరువాతి కాలంలో ఎన్నో ఉన్నత పదవులను చేపట్టింది. అటార్నీ జనరల్‌గా జాతివివక్ష నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆన్లైన్ భద్రతకు సంబంధించి ఎంతో కృషి చేసింది. గత పదిహేనేళ్లుగా ఈస్ట్ వాంకూవర్‌లో నివసిస్తున్న శర్మ ఇద్దరు పిల్లల తల్లి. ఎప్పుడూ చురుగ్గా ఉండే శర్మను పాదరసం’ అని పిలుస్తుంటారు. (చదవండి: నాడు బెదిరింపులు, నిషేధానికి గురైన అమ్మాయి..నేడు ప్రపంచమే..!) -
కెనడాలో భారత సంతతి యువకుడి హత్య!
ఒట్టావా: భారత సంతతికి చెందిని ఓ యువకుడు కెనడాలోని సర్రే ప్రాంతంలో హత్యకు గురుయ్యాడు. జూన్ 7 (శుక్రవారం) ఉదయం అతనిపై కాల్పులు జరగటంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన యువకుడిని భారత సంతతికి చెందిన యువరాజ్ గోయల్‌గా గుర్తించారు. బ్రిటిష్ కోలంబియాలోని సర్రే నుంచి హత్య జరిగినట్లు సమాచారం అందటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే యువరాజ్ గోయల్ మృతి చెంది ఉన్నాడు. ఈ కేసులో పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న మన్వీబాస్రామ్ (23), సాహిబ్ బాస్రా (20), హర్కిరత్ ఝుట్టీ (23), ఓంటారియోకు చెందిన కీలాన్ ఫ్రాంకాయిస్ (20)లను అదుపులోకి తీసుకున్నారు. యువరాజ్‌పై ఎటువంటి నేరపూర్తి రికార్డు లేదు. అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అతన్ని టార్గెట్ చేసి కొందరు కాల్పులు జరిపినట్లు తేలింది. ఈ హత్య ఎందుకు జరిగిందనే కారణాల కోసం పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. యువరాజ్ గోయాల్ స్టూడెంట్ వీసాపై 2019లో పంజాల్‌లోని లూథీయానా నుంచి కెనడా వెళ్లారు. 28 ఏళ్ల యువరాజ్ కెనడాలో సెల్స్ ఎగ్జిక్యూటీవ్‌గా ఉద్యోగం చేస్తున్నారు. యువరాజ్ తండ్రి రాజేశ్ గోయెల్ ఫైర్‌వుడ్ వ్యాపారవేత్త. యువరాజ్ మృతిపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
క్యూబ్ హైవేస్ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: బ్రిటిష్ కొలంబియా ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్, అబుధాబి సావరిన్ సంస్థ ముబడాల ఇన్వెస్ట్మెంట్ కంపెనీ తదితరాల నుంచి క్యూబ్ హైవేస్ ట్రస్ట్ 63 కోట్ల డాలర్లు(దాదాపు రూ. 5,226 కోట్లు) సమీకరించింది. ఇన్విట్కు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ అయిన క్యూబ్ హైవేస్ ఫండ్ అడ్వయిజర్స్ ప్రయివేట్ లిమిటెడ్ నిధుల సమీకరణ అంశాన్ని వెల్లడించింది. ప్రయివేట్ ప్లేస్మెంట్ కింద జారీ చేసిన ఇన్విట్ సాధారణ యూనిట్లను లిస్టింగ్ చేసినట్లు పేర్కొంది. దేశీయంగా లిస్టయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇన్విట్).. క్యూబ్ హైవేస్ ట్రస్ట్‌లో కెనడియన్ పెన్షన్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ బీసీఐ, ముబడాలతోపాటు మరికొన్ని దేశీ సంస్థలు కొత్త యాంకర్ ఇన్వెస్టర్లుగా నమోదైనట్లు తెలియజేసింది. 18 ఆస్తులు క్యూబ్ హైవేస్ ఇన్విట్ దాదాపు 1,424 కిలోమీటర్ల పొడవైన 18 టోల్, యాన్యుటీ రోడ్ ఆస్తులను కలిగి ఉంది. వీటిలో 17 ఎన్హెచ్ఏఐ టోల్ రోడ్ ఆస్తులుకాగా.. ఒకటి ఎన్హెచ్ఏఐ యాన్యుటీ రోడ్ ప్రాజెక్టుగా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, హర్యానా తదితర 11 రాష్టాలలో రోడ్ ప్రాజెక్టులు విస్తరించినట్లు తెలియజేసింది. పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ నుంచి రూ. 10,000 కోట్ల రుణ సౌకర్యాలను పొందేందుకు సంతకాలు జరిగినట్లు క్యూబ్ హైవేస్ ఇన్విట్ పేర్కొంది. ప్రస్తుత రుణాల రీఫైనాన్సింగ్‌కు నిధులను వినియోగించనున్నట్లు తెలియజేసింది. -
Travel: మచ్చల సరస్సు.. అతి విచిత్రమైన జలాశయం.. ఎక్కడ ఉందంటే!
ప్రపంచంలోని అతి విచిత్రమైన జలాశయాల్లో ఇదొకటి. నీటిపైన ఏదో డిజైన్ ఏర్పడినట్లు కనిపిస్తోంది కదూ! ఇందులోని ఖనిజాల వల్ల ఈ సరస్సు ఇలా మచ్చలు మచ్చలుగా కనిపిస్తుంది. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో ఓసోయూస్ పట్టణానికి చేరువలో ఉందిది. నీటిపై నిండా మచ్చలతో కనిపిస్తూ ఉండటం వల్ల దీనికి ‘స్పాటెడ్ లేక్’ (మచ్చల సరస్సు) అనే పేరు వచ్చింది. ఈ సరస్సులో మెగ్నీషియం సల్ఫేట్, సోడియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్ ఖనిజాలు అధిక సాంద్రతతో నిండి ఉన్నట్లు శాస్త్రవేత్తల పరీక్షల్లో తేలింది. అలాగే ఈ సరస్సు నీటిలో వెండి, టిటానియం లోహాలు కూడా స్వల్ప పరిమాణంలో ఉన్నట్లు తేలింది. మొదటి ప్రపంచయుద్ధ కాలంలో ఈ సరస్సులోని ఖనిజాలను ఆయుధాల తయారీకి వాడేవారు. ఇదివరకు ఈ సరస్సు నీటితో వివిధ వ్యాధులకు సంప్రదాయ వైద్యం చేసేవారు కూడా. ఈ వింత సరస్సును చూడటానికి పర్యాటకులు ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుంటారు. చదవండి: Horned Orb Spider: ఈ కొమ్ముల సాలీడు చాలా సాధుజీవి తెలుసా? ప్రపంచంలోనే అత్యంత ఒంటరి వృక్షం.. 125 ఏళ్లుగా -
కరోనా.. ప్రజలకు వందనం చేస్తుండగా ప్రమాదం
టోరంటో : కెనడా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ విమానం ఆదివారం కుప్పకూలింది. కరోనా వైరస్‌పై పోరాటంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న ప్రజలకు అ తెలిపే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరోనాపై పోరాటంలో కెనడా ప్రజల సహాకారాన్ని అభినందించడానికి బ్రిటీష్ కొలంబియాపై స్నో బర్డ్స్ టీమ్ కు చెందిన ఏరోబెటిక్స్ టీమ్ విన్యాసాలు చేపట్టేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా కామ్లూప్స్ విమానాశ్రయం నుంచి రెండు విమానాలు టేకాఫ్ అయ్యాయి. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, అందులో ఒక విమానం అదుపుతప్పి ఓ ఇంటిముందు కుప్పకూలింది. ఈ ఘటనతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గరయ్యారు. ఏం జరుగుతుంతో తెలుసుకోవడానికి పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకున్నారు.(చదవండి : వదల బొమ్మాళీ..!) ఈ ఘటనకు సంబంధించి ఆ ప్రావిన్స్ ఆరోగ్య శాఖ మంత్రి అడ్రియన్ డిక్స్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడగా, అతన్ని ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ‘విమానం అదుపు తప్పిన సమయంలో అది రెండు అంతస్థుల ఎత్తులో ఉంది. ప్రమాదాన్ని గుర్తించిన పైలట్ ప్యారాచూట్ సాయంతో ఓ ఇంటి పై కప్పుపై దిగాడు. ఈ సమయంలో అతని మెడకు, వీపు వెనకాల గాయాలు అయ్యాయి’ అని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదం చాలా బాధకరమని రాయల్ కెనడియన్ ఎయిర్‌ఫోర్స్ ట్వీట్ చేసింది. (చదవండి : మోదీపై విషం కక్కిన అఫ్రిది: పెను దుమారం) -
వైరల్ : ఎలుగుల కొట్లాట.. చివరికి ఏమైంది..!
విక్టోరియా : గ్రే కలర్ ఎలుగు బంట్లు భీకరంగా తలపడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ‘అరుదైన ఎలుగుల పంచాయితీ చూడండి. మునివేళ్లపై నిల్చుని పరస్పరం ముష్టిఘాతాలు కురిపించుకుంటున్నాయి. గుర్రుగుర్రుమంటూ ఒకదాన్ని మరొకటి నెట్టేసుకుంటూ ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఇక రెండు ఎలుగుల్లో ఏదైనా చస్తే బాగుండు. ఫుడ్డుకు ఢోకా ఉండదు అన్నట్టు నక్కినక్కి చూస్తున్న గుంటనక్కను పరిశీలించండి’అని క్యారీ మెక్ గిల్వ్రే అనే మహిళ ఓ వీడియోను ఫేస్బుక్లో పోస్టు చేశారు. నిముషానికి పైగా ఉన్న ఈ వీడియో 1.6 మిలియన్ వ్యూస్ సాధించి వైరల్ అయింది. బ్రిటీష్ కొలంబియాలోని ఓ హైవేపై ఈ దృశ్యం వెలుగు చూసింది. వీడియో ఆసక్తిగా ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి గొడవ సద్దుమణిగిందా లేదా అని ప్రశ్నిస్తున్నారు. వీడియో ఆసక్తిగా ఉన్నా.. ఎలుగులకు ఏమౌతుందోనని ఆందోళన చెందానని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ గొడవనంతా గమనిస్తున్న నక్కను తొలుత గమనించలేకపోయానని మరో యూజర్ చెప్పుకొచ్చాడు. -
జాగింగ్ చేస్తూ.. అనుకోకుండా ‘హద్దులు’ దాటింది!
అందమైన సముద్రతీరం.. అక్కడక్కడ బీచ్‌లు.. సీఫుడ్ రెస్టారెంట్లు.. ఎటు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం.. జాగింగ్ చేయాలనుకునేవారికి ఇంతకన్నా భూతలస్వర్గం ఇంకొటి ఉండదేమో.. హాయిగా జాగింగ్ చేస్తూ ముందుకు సాగిన 19 ఏళ్ల సెడెల్లా రోమన్ కూడా ఇలాగే భావించి ఉంటుంది. కెనడా బ్రిటిష్ కొలంబియాలోని వైట్‌రాక్ తీరం మీదుగా ఆమె జాగింగ్ చేసుకుంటూ దక్షిణ దిశగా సాగిపోయింది. అందమైన సెమియామూ తీరం అందాలను చూస్తూ.. నెమ్మదిగా పరిగెత్తుతూ వెళ్లిన ఆమె అనుకోకుండా సరిహద్దులు దాటి అమెరికాలోకి అడుగుపెట్టింది. ఆ సమయంలో తన వద్ద సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో సెడెల్లా చిక్కుల్లో పడింది. అసలే కెనడా సరిహద్దుల నుంచి వచ్చే అక్రమ వలసదారులపై ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. మామూలుగా అయితే.. హెచ్చరికలతో వదిలిపెట్టే అధికారులు.. గత నెల 21న అనుకోకుండా సరిహద్దులు దాటిన సెడెల్లాను కస్టడీలోకి తీసుకున్నారు. 22న ఆమెను అరెస్టు చేసి.. వాషింగ్టన్ టకోమాలోని నార్త్‌వెస్ట్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. దీంతో డిటెన్షన్ సెంటర్లో జూన్ 5 వరకు రెండువారాలపాటు ఆమె మగ్గాల్సి వచ్చింది. ఫ్రాన్స్‌లో నివాసముండే సెడాల్లా రొమన్.. బ్రిటిష్ కొలంబియాలోని నార్త్ డెల్టాలో ఉండే తన తల్లిని చూడటానికి వచ్చింది. వైట్‌రాక్ తీరం వద్ద అందాలను వీక్షిస్తూ ఆమె అనుకోకుండా సరిహద్దులు దాటింది. ఇక్కడ నుంచి అమెరికా-కెనడా మధ్య సరిహద్దు మార్క్ మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. అప్పుడప్పుడు పర్యాటకులు ఇక్కడ సరిహద్దులు దాటి అందాలు వీక్షించడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వారిని ఇమ్మిగ్రేషన్ అధికారులు మందలించి వదిలేస్తూ ఉంటారు. కానీ సెడెల్లా రుమన్ మాత్రం అక్రమంగా సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించిందని, ఆమె అక్రమ వలసదారు అంటూ అమెరికా అధికారులు నానా హంగామా చేసి.. ఆమెను అరెస్టు చేశారు. ఇప్పుడు ఆమెను విడుదల చేసిన అధికారులు తమ చర్యను సమర్థించుకునే కారణాలు చెప్తున్నారు. సెడెల్లా రొమన్ (ఫేస్బుక్ ఫొటోలు) -
మట్టి మహత్యం... బ్యాక్టీరియా నాశనం
బురదమట్టిని ఒళ్లంతా పూసుకోవడం ఓ చికిత్స పద్ధతన్నది మీకు తెలుసు. ఇలా చేస్తే చర్మరోగాలు పోతాయంటారు. దీని సంగతి ఏమోగానీ... ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న సూపర్‌బగ్ బ్యాక్టీరియాను కిసమీత్ బంకమట్టితో నాశనం చేయవచ్చునని యూనివర్శిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు అంటున్నారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో సహజసిద్ధంగా లభించే ఈ మట్టి నిమోనియా, స్కెప్టెసీమిమా వంటి వ్యాధులకు కారణమవుతున్న బ్యాక్టీరియాతోపాటు యాంటీబయాటిక్‌లకు లొంగని ఎంఆర్ఎస్ఏ బ్యాక్టీరియా చంపేస్తుందని, మొత్తం 16 రకాల బ్యాక్టీరియాలకు ఇది విరుగుడుగా పనిచేస్తుందని తేల్చారు. కెనడాలోని వాంకోవర్ ప్రాంతంలోని స్థానిక తెగల ప్రజలు ఈ బంకమట్టిని యుగాలుగా కొన్ని వ్యాధుల చికిత్సలో వాడుతున్నారు. 1940 నుంచి వైద్యులు ఈ మట్టిని కాలిన గాయాలు, అల్సర్ల చికిత్సకు వాడినట్లు రికార్డులు చెబుతున్నాయి. యాంటీబయాటిక్‌ల రాకతో మరుగున పడిన ఈ వైద్యవిధానం తాజా పరిశోధనలతో మళ్లీ ప్రాముఖ్యత సంతరించుకుంది. అనేక ఖనిజాలు, బ్యాక్టీరియాలతో కూడిన కిసమీత్ మట్టిపై మరిన్ని పరిశోధనలు జరిపి సరికొత్త యాంటీ బయాటిక్‌లను అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు.