భారత సంతతికి చెందిన నికీ శర్మ బ్రిటిష్ కొలంబియా(బీసీ) డిప్యూటీ ప్రీమియర్‌గా నియామకం అయింది. ఈ పదవి చేపట్టిన తొలి ఇండో–కెనడియన్‌గా చరిత్ర సృష్టించింది. కెనడాలోని లేత్‌బ్రిడ్జ్‌లో పుట్టిన నికీ శర్మ బ్రిటీష్ కొలంబియాలోని స్పార్‌వుడ్‌లో పెరిగింది. ఆమె తల్లిదండ్రులు ఇండియా నుంచి వలస వచ్చారు. తండ్రి పాల్ చిన్న వ్యాపారవేత్త. తల్లి రోజ్ సైంటిస్ట్. ‘యూనివర్శిటీ ఆఫ్ ఆల్బెర్టా ఫ్యాకల్టీ ఆఫ్ లా’ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్న నికీ శర్మ ఆ తరువాత లా ఫర్మ్ ‘డోనోవన్ అండ్ కంపెనీ’లో చేరింది.
పర్యావరణ సంస్థ ‘స్టాండ్ ఎర్త్’ కోసం క్యాంపెయినర్‌గా పనిచేసింది. 2014లో వాంకూవర్ సిటీ మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయింది. ఈ ఓటమి మాట ఎలా ఉన్నా ఆ తరువాతి కాలంలో ఎన్నో ఉన్నత పదవులను చేపట్టింది. అటార్నీ జనరల్‌గా జాతివివక్ష నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్ భద్రతకు సంబంధించి ఎంతో కృషి చేసింది. గత పదిహేనేళ్లుగా ఈస్ట్ వాంకూవర్‌లో నివసిస్తున్న శర్మ ఇద్దరు పిల్లల తల్లి. ఎప్పుడూ చురుగ్గా ఉండే శర్మను పాదరసం’ అని పిలుస్తుంటారు.
(చదవండి: నాడు బెదిరింపులు, నిషేధానికి గురైన అమ్మాయి..నేడు ప్రపంచమే..!)
Comments
Please login to add a commentAdd a comment