
యశవంతపుర(కర్ణాటక): వృద్ధురాలిని మోసం చేసిన గిరినగరకు చెందిన ప్రైవేటు బ్యాంకు మేనేజర్ మేఘన, ఆమె భర్త శివప్రసాద్, స్నేహితులు వరదరాజు, అన్వర్‌ఘోష్‌లను గిరినగర పోలీసులు అరెస్ట్ చేశారు. గిరినగరలోని ఒక ప్రైవేట్ బ్యాంక్‌లో వృద్ధ దంపతులు జాయింట్ అకౌంట్ తెరిచారు.
కొంతమొత్తం డిపాజిట్ చేశారు. బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ మేఘనా పరిచయం ఉండటంతో వృద్ధ దంపతులు తమ కష్టాలు ఆమె వద్ద చెప్పుకునేవారు. ఇటీవల ఇంటిని కూడా విక్రయిం కోటి రూపాయిలు బ్యాంకులో జమా చేశారు. ఆ నగదుపై మేఘనా కన్ను పడింది. బాండ్ అవధి ముగిసిందని, కొత్తగా డిపాజిట్ చేసేందుకు చెక్ అవసరమని మభ్య పెట్టి కొన్నిపత్రాలపై సంతకాలు చేయించుకుంది.
అనంతరం రూ.50 లక్షలను తన అకౌంట్‌కు బదిలీ చేయించుకుంది. వృద్ధ దంపతుల కుమారుడు బ్యాంకు లావాదేవీలను పరిశీలించగా నగదు తక్కువగా కనిపించింది. బ్యాంకుకు వెళ్లి మేఘనాను ప్రశ్నించారు.మీరు చెప్పిన ఖాతాకు నగదు బదిలీ చేసినట్లు మేఘనా దబాయించింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా మేఘనా వంచన బయట పడింది. మేఘనతోపాటు ఆమె భర్త శివప్రసాద్, స్నేహితులు వరదరాజు, అన్వర్‌ఘోష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment