deputy
-
పవన్ కళ్యాణ్ కీలుబొమ్మ పవన్ పై కేతిరెడ్డి కీలక వ్యాఖ్యలు
-
బ్రిటిష్ కొలంబియా డిప్యూటీ ప్రీమియర్‌గా తొలి ఇండో–కెనడియన్
భారత సంతతికి చెందిన నికీ శర్మ బ్రిటిష్ కొలంబియా(బీసీ) డిప్యూటీ ప్రీమియర్‌గా నియామకం అయింది. ఈ పదవి చేపట్టిన తొలి ఇండో–కెనడియన్‌గా చరిత్ర సృష్టించింది. కెనడాలోని లేత్బ్రిడ్జ్లో పుట్టిన నికీ శర్మ బ్రిటీష్ కొలంబియాలోని స్పార్వుడ్లో పెరిగింది. ఆమె తల్లిదండ్రులు ఇండియా నుంచి వలస వచ్చారు. తండ్రి పాల్ చిన్న వ్యాపారవేత్త. తల్లి రోజ్ సైంటిస్ట్. ‘యూనివర్శిటీ ఆఫ్ ఆల్బెర్టా ఫ్యాకల్టీ ఆఫ్ లా’ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్న నికీ శర్మ ఆ తరువాత లా ఫర్మ్ ‘డోనోవన్ అండ్ కంపెనీ’లో చేరింది.పర్యావరణ సంస్థ ‘స్టాండ్ ఎర్త్’ కోసం క్యాంపెయినర్‌గా పనిచేసింది. 2014లో వాంకూవర్ సిటీ మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయింది. ఈ ఓటమి మాట ఎలా ఉన్నా ఆ తరువాతి కాలంలో ఎన్నో ఉన్నత పదవులను చేపట్టింది. అటార్నీ జనరల్‌గా జాతివివక్ష నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆన్లైన్ భద్రతకు సంబంధించి ఎంతో కృషి చేసింది. గత పదిహేనేళ్లుగా ఈస్ట్ వాంకూవర్‌లో నివసిస్తున్న శర్మ ఇద్దరు పిల్లల తల్లి. ఎప్పుడూ చురుగ్గా ఉండే శర్మను పాదరసం’ అని పిలుస్తుంటారు. (చదవండి: నాడు బెదిరింపులు, నిషేధానికి గురైన అమ్మాయి..నేడు ప్రపంచమే..!) -
లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, విప్ నియామకం.. ఎవరంటే?
న్యూఢిల్లీ: లోక్‌సభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎంపీ గౌరవ్ గొగొయ్‌ను తిరిగి నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఎక్స్(ట్విటర్)లో ఆదివారం(జులై14) వెల్లడించారు.గతంలోనూ గౌరవ్ గొగొయ్ పార్టీ లోక్‌సభపక్ష ఉపనేతగా బాధ్యతలు నిర్వహించారు. లోక్‌సభలో పార్టీ చీఫ్‌విప్‌గా 8సార్లు ఎంపీగా గెలిచిన సీనియర్ మెంబర్ కొడికున్నిల్ సురేశ్‌ను నియమించారు. వీరికి తోడు సీనియర్‌నేతలు మాణిక్యం ఠాగూర్, ఎండీ జావెద్‌లకు లోక్‌సభలో విప్ బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాలకు సంబంధించి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ లోక్‌సభ స్పీకర్‌కు ఒక లేఖ రాశారు. లోక్‌సభలో పార్టీ కొత్తగా నియమించిన ఉపనేత, చీఫ్‌విప్, విప్ల పేర్లను లేఖలో తెలిపారు. ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ మార్గదర్శకత్వంలో లోక్‌సభలో ప్రజావాణిని బలంగా వినిపిస్తామని కేసీవేణుగోపాల్ ట్వీట్లో పేర్కొన్నారు. -
‘అయోధ్య ఎంపీకే లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఇవ్వండి!’
ఢిల్లీ: 18వ లోక్‌సభ స్పీకర్ పదవికి 48 ఏళ్ల తర్వాత ఎన్నిక జరగ్గా అధికార ఎన్డీయే కోటా ఎంపీ ఓం బిర్లా తిరిగి ఎన్నిక అయ్యారు. అయితే అధికార ఎన్డీయే ఏకగ్రీవానికి ప్రయత్నించినా.. ఆనవాయితీ ప్రకారం డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇవ్వాలని ప్రతిపక్ష ఇండియా కూటమి పట్టుపట్టడంతో స్పీకర్ ఎన్నిక అనివార్యం అయింది. స్పీకర్ ఎన్నిక పూర్తికావడంతో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందో అనే చర్చ మొదలైంది.అయితే తాజాగా లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిపై ఇండియా కూటమి భాగస్వామ్య పక్షం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. డిప్యూటీ స్పీకర్ పదవిని ఉత్తర ప్రదేశ్‌లోని ఫైజాబాద్ ఎస్పీ ఎంపీ అవధేష్ ప్రసాద్‌కు కేటాయించాలని టీఎంసీ కేంద్రాన్ని కోరుతోంది. ఆయోధ్య ఉన్న ఫైజాబాద్ సెగ్మెంట్లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి పోటీ చేసిన అవధేష్ ప్రసాద్ గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఎటువంటి షెడ్యూల్ విడుదలచేయలేదు. గతంలో 17వ లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఎన్డీయేలోని ఏ మిత్రక్షానికి కూడా ఇవ్వకుండా బీజేపీ ఖాళీగా ఉంచిన ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవికి బలమైన నాయకున్ని ఇండియా కూటమి పోటీలోకి దింపాలనుకుంటున్న నేపథ్యంలో ఎంపీ అవధేష్ ప్రసాద్‌ను ఎన్నుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అవధేష్ ప్రసాద్ దళిత సమాజిక వర్గానికి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ. ఫైజాబాద్‌లో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌పై 50వేల మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరం నేపథ్యంలో ఇక్కడ బీజేపీ అభ్యర్థే గెలుస్తారని అంతా భావించారు. అదే విధంగా జనరల్ స్థానమైన ఫైజాబాద్‌లో అవధేష్ ప్రసాద్ గెలిచి అందిరనీ ఆశ్చర్యపరిచారు.ఇక.. డిప్యూటీ స్పీకర్‌సైతం లోక్స్పీకర్కు ఉండే అన్ని అధికారాలు ఉంటాయి. స్పీకర్ అందుబాటులో లేని సమయంలో డిప్యూటీ స్పీకర్ లోక్‌సభ సమావేశాలను నడిస్తారు. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని ఆనవాయితీగా ఉన్న విషయం తెలిసిందే. రెండు రోజులగ్యాప్ తర్వాత.. ఇవాళ పార్లమెంట్ సమావేశాలు తిరిగి ప్రారంభం కానుంది. -
విదేశాంగ కార్యదర్శిగా విక్రం మిశ్రి నియామకం
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా డిప్యూటీ సలహాదారు విక్రమ్ మిశ్రి (59) విదేశాంగ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. వినయ్ క్వాట్రా స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. క్వాట్రాను అమెరికాలో భారత రాయబారిగా నియమించొచ్చని సమాచారం. 1989 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సరీ్వస్‌కు చెందిన మిశ్రి నియామకం జులై 15 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ రూపంలో ఏకంగా ముగ్గురు ప్రధానులకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన అరుదైన రికార్డు మిశ్రి సొంతం. చైనాతో సంబంధాలు దిగజారిన వేళ ఆ దేశ వ్యవహారాల నిపుణుడిగా పేరున్న మిశ్రి నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. 2019–21 మధ్య ఆయన చైనాలో భారత రాయబారిగా పని చేశారు. -
ఫూల్స్‌ని చేయడం ఆపేయండి! వీడియో కాల్లో పుతిన్ ఫైర్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వీడియో కాల్లో ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్‌పై సీరియస్ అయ్యారు. దేశ పౌర సైనిక విమాన ఒప్పందం విషయంలో జాప్యం చేస్తున్నందుకు మంటురోవ్‌పై పుతిన్ మాటల తుటాలు పేల్చారు. ఈ మేరకు బుధవారం రష్యా ప్రభుత్వ టెలివిజన్ ప్రసారంలో.. ప్రభుత్వాధికారల సమావేశంలో జరిగిన ఒక వీడియో కాల్లో పుతిన్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి, ఉప ప్రధాని మంటురోవ్‌పై విరుచుకుపడ్డారు. 2023 ఏడాదికి సంబంధించి పౌర సైనిక విమాన ఒప్పందాలను ఒక నెలలోపు పూర్తి చేయాలని గట్టిగా హెచ్చరించారు. వాస్తవానికి రష్యా విమానాయన సంస్థ ఏరోప్లాట్తో దాదాపు 175 బిలియన్ల రూబిళ్లు(రూ. 21 వేల కోట్లు) విలువైన ఒప్పందాలు ఏర్పాటు చేసే బాధ్యత మంటురోవ్‌పై ఉంది. ఐతే సైనిక విమాన కాంట్రాక్ట్‌లు ఏవి సిద్ధంగా లేకపోవడంతోనే పుతిన్ తీవ్ర అసహనానికి గురైనట్లు అధికారికి వర్గాల సమాచారం. దీనికి మీరు చాలా వ్యవధి తీసుకుంటున్నారంటూ తిట్టిపోశారు. సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని గట్టిగా నొక్కిచెప్పారు. అయినా మీరు ఇప్పటివరకు ఏ ఎంటర్‌ప్రైజెస్‌తో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదన్న విషయం తనకు తెలసునంటూ సీరియస్ అయ్యారు. ఒకవేళ ఒప్పందాలు పూర్తి అయితే గనుక ఎప్పుడూ సంతకాలు చేశారో చెప్పగలరా! అని గట్టిగా నిలదీశారు. ముందు మీరు అందర్నీ ఫూల్స్‌ని చేయడం ఆపేయండి అంటూ ఉపప్రధాని మంటురోవ్కి గట్టిగా చురకలంటించారు. బాగా ఉత్తమంగా ప్రయత్నించాలని చూడొద్దు, ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని సాధ్యమైనంత తొందరగా.. కేవలం ఒకనెలలోపే ఈ ఒప్పందాలను పూర్తి చేసేలా ప్రయత్నించండి అంటూ పుతిన్ డిప్యూటి ప్రధాన మంత్రి మంటురోవ్కి గడువు కూడా ఇచ్చారు. దీనికి ఉప ప్రధాని మంటూరోవ్ పుతిన్‌కి సమాధానం ఇస్తూ..అందుకు సంబంధించిన ఆర్డర్లు సిద్ధంగానే ఉన్నాయని, తొందరగా పూర్తి చేసేందుకు తనవంతుగా ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఐతే రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాత్రం అధ్యక్షుడి పుతిన్‌కి మంటురోవ్ పనితీరుపై ఎలాంటి ఫిర్యాదుల లేవని క్రెమ్లిన్ మీడియాకి చెప్పాడం గమనార్హం. Russian aviation industry didn't receive a single contract to produce a passenger plane in 2022. pic.twitter.com/9xwHYTBC3X — Anton Gerashchenko (@Gerashchenko_en) January 11, 2023 (చదవండి: క్రిమియాకు ఎందుకంత క్రేజ్? ) -
Gita Gopinath: అనూహ్య పరిణామం.. అంతర్జాతీయ వేదికపై మన ‘గీత’
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)లో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన గీతా గోపినాథ్‌కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు గురువారం ప్రకటించారు. అంతర్జాతీయ సంస్థ ఐఎంఎఫ్‌కు ఇంతకుముందు తొలి ఉమెన్ ఛీఫ్ ఎకనమిస్ట్‌గా చరిత్ర సృష్టించిన గీతా గోపినాథ్.. ఇప్పుడు మరో ఘనత దక్కించుకున్నారు. ఏకంగా ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టబోతున్నారామె. ప్రస్తుతం ఈ అంతర్జాతీయ ఆర్థిక సంస్థకు నెంబర్ 2గా ఉన్నజియోఫ్రె విలియమ్ సెయిజి ఒకమోటో( ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్).. వచ్చే ఏడాది మొదట్లో బాధత్యల నుంచి తప్పుకోనున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ స్థానాన్ని గీతా గోపినాథ్‌తో భర్త చేయనుంది ఐఎంఎఫ్. నిజానికి ఆమె వచ్చే ఏడాది జనవరిలో ఐఎంఎఫ్‌ను వీడి.. హర్వార్డ్ యూనివర్సిటీలో చేరతానని ప్రకటించుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించింది ఐఎంఎఫ్. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌కు మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో 68 ఏళ్ల క్రిస్టలీనా జార్జియేవా(బల్గేరియా) కొనసాగుతోంది. ఇక ఇప్పుడు రెండో పొజిషన్లో గీతా గోపినాథ్(49) నియమితురాలయ్యింది. దీంతో కీలకమైన ఒక అంతర్జాతీయ ఆర్థిక విభాగపు కీలక బాధ్యతల్ని ఇద్దరు మహిళలు చూసుకోబోతున్నారన్నమాట. మైసూర్ టు వాషింగ్టన్ గీతా గోపినాథ్.. పుట్టింది డిసెంబర్ 8, 1971 కోల్‌కతా(కలకత్తా)లో. అయితే ఆమె చదువు మొత్తం మైసూర్ (కర్ణాటక)లో సాగింది. చిన్నతనంలో గీతాకు చదువంటే ఆసక్తే ఉండేది కాదట. ముఖ్యంగా ఎక్కాల్లో ఆమె సుద్దమొద్దుగా ఉండేదని గీత తల్లి విజయలక్క్క్ష్మి ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కూడా. ఇక ఏడో తరగతి నుంచి చదువులో మెరుగైన ప్రతిభ కనబరుస్తూ వచ్చిన గీత.. ఫ్లస్ టు సైన్స్‌లో విద్యను పూర్తి చేసింది. అయితే డిగ్రీకొచ్చేసరికి తనకు ఏమాత్రం సంబంధం లేని ఎకనమిక్స్‌ను ఎంచుకుని పేరెంట్స్‌ను సైతం ఆశ్చర్యపరిచిందామె. ఢిల్లీలోనే బీఏ, ఎంఏ ఎకనమిక్స్ పూర్తి చేసి.. ఆపై వాషింగ్టన్లో మరో పీజీ, ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకుంది. ఈ రీసెర్చ్‌కి గానూ ఆమెకు ప్రిన్స్టన్ వుడ్రో విల్సన్ ఫెలోషిప్ రీసెర్చ్ అవార్డు అందుకుంది. ఆపై చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారామె. కీలక బాధ్యతలెన్నో.. 2018, అక్టోబర్‌లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌కు ఛీఫ్ ఎకనమిస్ట్‌గా గీతా గోపీనాథ్ నియమించబడింది. అంతేకాదు ఐఎంఎఫ్‌లో కీలక బాధ్యతలు చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తి కూడా ఆమెనే!. ఇక ఆ పదవిలో కొనసాగుతూనే.. ఇంటర్నేషనల్ ఫైనాన్స్‌కు కో డైరెక్టర్‌గా, నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ రీసెర్చ్‌లో మాక్రోఎకనమిక్స్ ప్రొగ్రామ్‌ను నిర్వహించారామె. ఇంతేకాదు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్‌లో ఎకనమిక్ అడ్వైజరీ ప్యానెల్లో సభ్యురాలిగా, కేరళ ముఖ్యమంత్రికి ఆర్థిక సలహాదారుగా, ఈ ఏడాది జూన్‌లో వరల్డ్ బ్యాంక్-ఐఎంఎఫ్ హైలెవల్ అడ్వైజరీ గ్రూపులో కీలక సభ్యురాలిగా వ్యవహరించారు. గౌరవాలు 2011లో యంగ్ గ్లోబల్ లీడర్‌గా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నుంచి అవార్డుతో పాటు 2019లో భారత సంతతి వ్యక్తి హోదాలో ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారం అందుకున్నారామె. కరోనా సంక్షోభంలో ఐఎంఎఫ్ తరపున ఆమె అందించిన సలహాలు, కార్యనిర్వహణ తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. వ్యక్తిగత జీవితం గీతా గోపీనాథ్ భర్త ఇక్బాల్ సింగ్ ధాలివాల్.. మాజీ ఐఏఎస్ ఈయన. 1995 ఏడాది సివిల్స్ పరీక్షల్లో ఫస్ట్ ర్యాంకర్ ఆయన. కొంతకాలం విధులు నిర్వహించి.. ఆపై ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈయన కూడా ఆర్థిక మేధావే. ప్రస్తుతం మస్సాచుషెట్స్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్, జే-పాల్లో ఎకనమిక్స్ విభాగంలో గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ జంటకు ఒక బాబు.. పేరు రోహిల్. గీతా గోపినాథ్‌కు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాతో పాటు అమెరికన్ పౌరసత్వం కూడా ఉంది. -సాక్షి, వెబ్‌స్పెషల్ -
ఆ దిశగా మరో ముందడుగు.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన మండలి చరిత్రలో మొట్ట మొదటిసారిగా మైనార్టీ మహిళ జకియా ఖానంను డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘సోదరి జకియా ఖానంకు అభినందనలు. అక్క చెల్లెమ్మలకు అండగా నిలిచి.. మహిళా సాధికారత దిశగా ఈ ప్రభుత్వం వేసిన మరో ముందడుగు ఇది’ అని శనివారం ట్వీట్ చేశారు. చదవండి: పెద్ద కష్టమే.. వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన, సాయంపై హామీ -
AP: శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా జకియా
సాక్షి, అమరావతి/రాయచోటి: శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ పదవి తొలిసారి మైనారిటీ మహిళకు దక్కింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమెను స్వయంగా కూర్చీ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జకియా మాట్లాడుతూ.. ఈ గౌరవప్రదమైన స్థానానికి తనను అర్హురాలుగా గుర్తించి మంచి ఉద్దేశంతో పదవి ఇచ్చినందుకు సీఎం జగన్‌కు రుణపడి ఉంటానన్నారు. సీఎం జగన్ మహిళా పక్షపతి మహిళల సంక్షేమ కోసం అనే పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్ మహిళా పక్షపతి అని నిరూపించుకున్నారని ఆమె కొనియాడారు. దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా ఉందన్నారు. ఒక సాధారణ గృహిణిగా ఉన్న తనకు సముచిత స్థానాన్ని కల్పించినందుకు మైనార్టీలందరూ హర్షించారని ఆమె పేర్కొన్నారు. మైనార్టీల సామాజిక, ఆర్టిక, రాజకీయ ఎదుగుదలకు తోడ్పడుతానని ఆమె భరోసా ఇచ్చారు. కాగా వైఎస్సార్ జిల్లా రాయచోటిలో మైనార్టీ వర్గాలకు ఎమ్మెల్సీ స్థానం ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ తన మాట నిలబెట్టుకున్నారు. ఈక్రమంలో రాయచోటికి చెందిన జకియా ఖాన్మ్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మరో అడుగు ముందుకు వేసి ఆమెకు శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు. జకియా ఖానమ్ నేపథ్యమిది.. పేరు: మయాన జకియా ఖానమ్ భర్త: దివంగత ఎం.అఫ్జల్ ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంతానం: ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు చదువు: ఇంటర్మీడియెట్ పుట్టిన తేది: జనవరి 01, 1971 స్వస్థలం: రాయచోటి, వైఎస్సార్ జిల్లా రాజకీయ నేపథ్యం: ఎమ్మెల్సీ (ఆగస్టు 20, 2020 నుంచి) -
ఏపీ: మున్సిపల్ పదవుల్లోనూ సామాజిక న్యాయం
సాక్షి, అమరావతి: సామాజిక న్యాయ సాధనలో స్వర్ణయుగాన్ని తీసుకువస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం జగన్ మరోసారి సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం సామాజిక న్యాయం పాటించింది. రెండో డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎంపికలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అగ్రస్థానం వేసింది. 85 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రెండో డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నికల్లో 56 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ అవకాశం ఇచ్చారు. బీసీలు 24 మందికి, ఎస్సీలు 22 మందికి, ఓసీలు 37, ఎస్టీలు ఇద్దరికి అవకాశం ఇచ్చారు. అన్ని వర్గాలు, కులాలకు వైఎస్ జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. కాగా, మేయర్,మున్సిపల్ చైర్పర్సన్ల పదవుల్లోనూ సామాజిక న్యాయానికి, మహిళా సాధికారతకు వైఎస్సార్సీపీ పెద్దపీట వేసి సరికొత్త చరిత్రను లిఖించిన సంగతి తెలిసిందే. చర్రితలో తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ వర్గాలకు 78 శాతం పదవులు లభించాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో కూడా బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు అగ్రాసనం వేశారు. మహిళలకు సమున్నత స్థానం కల్పించారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఏకంగా 58 శాతం నామినేటెడ్ పదవులు ఇచ్చారు. మహిళలకు ఏకంగా 50.40 శాతం పదవులు దక్కాయి. -
అనుచరుల పచ్చం!
స్వయం ఉపాధితో జీవితాన్ని చక్కబెట్టుకోవాలనుకున్న నిరుద్యోగుల ఆశలపై టీడీపీ నేతలు నీళ్లు చల్లారు. పార్టీ వర్గీయులు, అనుచరులకే పెద్దపీట వేయడం.. అధికారులను పక్కనపెట్టి స్వయంగా నాయకులే రుణమేళా నిర్వహించడంతో అర్హులకు నిరాశ మిగిలింది. గుత్తి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీ, కాపు సబ్సిడీ రుణాలకు సంబంధించి 470 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే ఇంటర్వ్యూ ప్రారంభమైన పది నిముషాలకే టీడీపీ నేతలు బ్యాంకు, మండల పరిషత్ అధికారుల స్థానంలో కూర్చొని పెత్తనం చెలాయించారు. ఆ పార్టీ కార్యకర్తల దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ముగించేశారు. - గుత్తి: -
విద్యార్ధులతో కలిసి 'పద్మ' ప్లాష్మబ్
-
ఇమాం బుఖారీకి ఢిల్లీ హైకోర్టులో ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ : జామా మసీదు షాహీ ఇమాం సయ్యద అహ్మద్ బుఖారీకి ఢిల్లీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తన కుమారుడిని డిప్యూటీగా ప్రకటిస్తూ చేసిన ప్రకటనకు చట్టబద్ధత లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. మరోవైపు జామా మసీదు డిప్యూటీ షాహీ ఇమాంగా బుఖారీ కుమారుడు షాబాన్ బుఖారీ ప్రమాణస్వీకారోత్సవంపై హైకోర్టు శుక్రవారం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డులు జనవరి 28లోగా నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. కాగా ఇమాం పదవిని 400 సవత్సరాలుగా బుఖారీ కుటుంబమే నిర్వహిస్తోంది. ఆనువంశికంగా దీనిని చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో బుఖారీ తనయుడు షాబాన్ బుఖారీ...డిప్యూటీగా ఈనెల 22న ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందు కోసం ఇమాం బుఖారీ దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖులు, ప్రపంచవ్యాప్తంగా వెయ్యిమంది మత పెద్దలను ఆహ్వానించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, మన హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితరులను ఆహ్వానించారు. అయితే తన కుమారుడిని నయీబ్ షాహీ ఇమాం (ఉప ఇమాం)గా ప్రకటించే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించలేదు.