
న్యూఢిల్లీ: లోక్‌సభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎంపీ గౌరవ్ గొగొయ్‌ను తిరిగి నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఎక్స్(ట్విటర్)లో ఆదివారం(జులై14) వెల్లడించారు.
గతంలోనూ గౌరవ్ గొగొయ్ పార్టీ లోక్‌సభపక్ష ఉపనేతగా బాధ్యతలు నిర్వహించారు. లోక్‌సభలో పార్టీ చీఫ్‌విప్‌గా 8సార్లు ఎంపీగా గెలిచిన సీనియర్ మెంబర్ కొడికున్నిల్ సురేశ్‌ను నియమించారు.
వీరికి తోడు సీనియర్‌నేతలు మాణిక్యం ఠాగూర్, ఎండీ జావెద్‌లకు లోక్‌సభలో విప్ బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాలకు సంబంధించి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ లోక్‌సభ స్పీకర్‌కు ఒక లేఖ రాశారు.
లోక్‌సభలో పార్టీ కొత్తగా నియమించిన ఉపనేత, చీఫ్‌విప్, విప్‌ల పేర్లను లేఖలో తెలిపారు. ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ మార్గదర్శకత్వంలో లోక్‌సభలో ప్రజావాణిని బలంగా వినిపిస్తామని కేసీవేణుగోపాల్ ట్వీట్‌లో పేర్కొన్నారు.