whip
-
లోక్‌సభకు ‘జమిలి’ బిల్లు? బీజేపీ ఎంపీలకు విప్!
సాక్షి, న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. మంగళవారం(డిసెంబర్17) లోక్‌సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లోక్‌సభలోని తమ పార్టీ ఎంపీలందరికి బీజేపీ విప్ జారీ చేసింది. జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ(129వ సవరణ) బిల్లు–2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల(సవరణ) బిల్లు–2024ను లోక్‌సభలో సోమవారమే ప్రవేశపెట్టాలని తొలుత నిర్ణయించారు. ఈ మేరకు లోక్‌సభ బిజినెస్ జాబితాలో సైతం వీటిని చేర్చారు. కానీ, తర్వాత బిజినెస్ నుంచి తొలగించారు.ఇప్పటికే జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. దీంతో బిల్లును పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టేందుకు లైన్ క్లియరైంది. దీంతో బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టగానే చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి రిఫర్ చేయాల్సిందిగా విపక్షాలు పట్టుపట్టే అవకాశం ఉంది. దీంతో స్పీకర్ జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.జమిలి ఎన్నికల బిల్లు గనుక పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందితే లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. దీనికి ఉభయసభల్లోని మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర క్యాబినెట్ గతంలోనే ఆమోదించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఇది ముమ్మాటికీ పాన్ ఇండియా సమస్యే -
లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, విప్ నియామకం.. ఎవరంటే?
న్యూఢిల్లీ: లోక్‌సభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎంపీ గౌరవ్ గొగొయ్‌ను తిరిగి నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఎక్స్(ట్విటర్)లో ఆదివారం(జులై14) వెల్లడించారు.గతంలోనూ గౌరవ్ గొగొయ్ పార్టీ లోక్‌సభపక్ష ఉపనేతగా బాధ్యతలు నిర్వహించారు. లోక్‌సభలో పార్టీ చీఫ్‌విప్‌గా 8సార్లు ఎంపీగా గెలిచిన సీనియర్ మెంబర్ కొడికున్నిల్ సురేశ్‌ను నియమించారు. వీరికి తోడు సీనియర్‌నేతలు మాణిక్యం ఠాగూర్, ఎండీ జావెద్‌లకు లోక్‌సభలో విప్ బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాలకు సంబంధించి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ లోక్‌సభ స్పీకర్‌కు ఒక లేఖ రాశారు. లోక్‌సభలో పార్టీ కొత్తగా నియమించిన ఉపనేత, చీఫ్‌విప్, విప్ల పేర్లను లేఖలో తెలిపారు. ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ మార్గదర్శకత్వంలో లోక్‌సభలో ప్రజావాణిని బలంగా వినిపిస్తామని కేసీవేణుగోపాల్ ట్వీట్లో పేర్కొన్నారు. -
ఏపీ మండలిలో ప్రభుత్వ విప్ ల నియామకం
-
Special Parliament Session: ఎంపీలకు బీజేపీ విప్ జారీ
ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఈ నెల 18-22 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ తమ లోక్‌సభ ఎంపీలకు విప్ జారీ చేసింది. తప్పనిసరిగా అందరూ హాజరై ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు తెలపాలని తెలిపింది. ఈ పార్లమెంట్ ప్రత్యేక సెషన్లో ప్రభుత్వం ప్రధానంగా నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులను ఆమోదం తెలిపేందుకు అందరు ఎంపీలు రావాలని విప్ జారీ చేసింది. BJP issues a line whip to all party MPs of Lok Sabha to be present in the house from 18th to 22nd September to discuss very important legislative business and support the government's stand. pic.twitter.com/lgtB98KrWb — ANI (@ANI) September 14, 2023 పార్లమెంట్ ప్రత్యేక సెషన్లో భాగంగా ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఇందులో మొదటి రోజు గత 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశ ప్రయాణంపై చర్చించనున్నారు. అనంతరం రాజ్యసభలో.. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు, ది పోస్ట్ ఆఫీస్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభలో అడ్వకేట్స్ యాక్ట్ సవరణ బిల్లు, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ బిల్లులపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అజెండా విడుదల -
ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పై టీడీపీ నేత దాడి
-
AP: శాసన మండలిలో ఇద్దరు విప్ల నియామకం
సాక్షి, అమరావతి: శాసన మండలిలో ఇద్దరు విప్‌లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. శాసన మండలిలో ప్రభుత్వ విప్‌లుగా ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను నియమిస్తూ సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి ముత్యాలరాజు ఉత్తర్వులిచ్చారు. ఈ నియామకాలు వెంటనే అమల్లోకి వచ్చాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రతిష్ట పెంచేలా పనిచేస్తా: జంగా కృష్ణమూర్తి దాచేపల్లి: శాసన మండలిలో ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా పని చేస్తానని మండలిలో ప్రభుత్వ విప్‌గా నియమితులైన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చెప్పారు. గామాలపాడు సచివాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసన మండలిలో ప్రభుత్వ విప్‌గా తనను నియమించటంపై కృతజ్ఞతలు తెలిపారు. తనపై బాధ్యత మరింతగా పెరిగిందని చెప్పారు. (క్లిక్: గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3,000 కోట్లు) తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా డొక్కా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాకు చెందిన శాసనమండలి సభ్యుడు డొక్కా మాణిక్య వరప్రసాదరావును తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా నియమించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. (క్లిక్: గుంటూరులో బీజేపీకి బిగ్ షాక్) -
'విప్ ధికరణ'పై షిండే, థాక్రే వర్గాల ఢీ.. ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు
ముంబై: మహారాష్ట్రలో శివసేనపై తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ షిండే.. బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయినా.. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వేడి ఇంకా తగ్గటం లేదు. రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. తాజాగా.. విప్ ధిక్కరణపై 55 మంది శివసేన ఎమ్మెల్యేల్లో 53 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు శాసనసభ సెక్రెటరీ. అందులో షిండే వర్గం ఎమ్మెల్యేలు 39 మంది ఉండగా.. ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన 14 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఉద్ధవ్ వర్గంలోని ఎమ్మెల్యే సంతోష్ బంగర్.. జులై 4న బలపరీక్ష రోజే షిండేతో చేతులు కలిపారు. తమకు షోకాజ్ నోటీసులు అందినట్లు ఇరువర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ధ్రువీకరించారు. మహారాష్ట్ర శాసనసభ సభ్యుల (ఫిరాయింపుల ఆధారంగా అనర్హత) నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేశారు సెక్రెటరీ. ఏడురోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. స్పీకర్ ఎన్నిక, విశ్వాస పరీక్ష సందర్భంగా పార్టీ విప్‌ను ధిక్కరించారని ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నాయి. విప్ ధిక్కరించిన వారిని అనర్హులుగా వేటు వేయాలని డిమాండ్ చేశాయి. అయితే.. అనర్హత వేటు వేయాలన్న ఎమ్మెల్యేల జాబితాలో ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే పేరును షిండే వర్గం మినహాయింటం గమనార్హం. 288 స్థానాలు కలిగిన అసెంబ్లీలో శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే.. అందులోంచి షిండే వర్గం తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. బలపరీక్షలో 164 మంది మద్దతు తెలిపారు. కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా 99 ఓట్లు మాత్రమే వచ్చాయి. జులై నాలుగున జరిగిన విశ్వాస పరీక్ష అనంతరం.. ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలకు విప్ ధిక్కరించారంటూ నోటీసులు ఇచ్చింది షిండే వర్గం. ఇదీ చదవండి: ఉద్ధవ్‌కు దెబ్బ మీద దెబ్బ .. ప్రశ్నార్థకంగా మారిన శివసేన పార్టీ మనుగడ -
‘అమరావతి పేరు చెప్పి.. గ్రాఫిక్స్‌తో గడిపారు’
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరుతో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకుండా చంద్రబాబు గ్రాఫిక్స్‌తో కాలయాపన చేశారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. నిజంగా విజన్ ఉంటే ఐదేళ్లలో ఆయన అమరావతిలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఐటీ బూమ్‌లో ఉన్నప్పుడు చంద్రబాబు కాదు కదా ఆయన బావమరిది బాలకృష్ణ సీఎంగా ఉన్నా హైదరాబాద్ ఐటీ పరంగా అదే జరిగి ఉండేదన్నారు. సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలపై నారావారిపల్లెలో చర్చించేందుకు చంద్రబాబుకు దమ్ముందా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించే సత్తా ఆయనకు ఉందా అని నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గడికోట మంగళవారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు చెబుతున్న అమరావతి అనేది అక్కడ లేదని, అది ఒక పాడుపడిన రియల్ ఎస్టేట్ వెంచర్ అని పేర్కొన్నారు. అందుకే ఆ పార్టీ నేత చింతమనేని ప్రభాకర్ శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో పశువులను తెచ్చి కట్టేశారని చెప్పారు. అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జిలు లేవు, ఇడ్లీ పాత్ర లాంటి స్ట్రక్చర్లూ లేవన్నారు. కనీసం డ్రైనేజీ, తాగునీరు కూడా లేదన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లకు నిర్మిస్తామన్న క్వార్టర్స్‌ను కనీస దశకు కూడా తీసుకు రాలేదన్నారు. అమరావతిలో ఖర్చు చేసిన రూ.10 వేల కోట్లకు చంద్రబాబు లెక్కలు చెప్పాలన్నారు. అక్కడ చంద్రబాబుకు సొంతిల్లు కూడా లేదని, ప్రస్తుతం ఆయన నివాసముంటున్న ఇంటి డ్రైనేజీ నీటిని కూడా కృష్ణా నదిలోకి వదులుతున్నారన్నారు. సీమ, ఉత్తరాంధ్ర వెనుకబాటు కనపడదా? రాష్ట్ర ప్రయోజనాలే అజెండాగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీలో పర్యటించి ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి చర్చించారని గడికోట తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనపై చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం సంపద సృష్టించారని నిలదీశారు. ఆయనకు విజన్ ఉంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనకబాటుతనం కనిపించదా? అని ప్రశ్నించారు. స్వార్థం, బినామీల కోసం రాష్ట్రాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని మండిపడ్డారు. హోదాను చంపేసి అర్ధరాత్రి ప్యాకేజీ చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు పెట్టుబడులు వస్తే సీఎం జగన్ పాలనలో రెండున్నరేళ్లలో గ్రౌండ్ అయిన ప్రాజెక్టుల విలువ రూ.40 వేల కోట్లు అని గడికోట స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో చేసిన అప్పులకు ఇప్పుడు ప్రతి నెలా రూ.3 వేల కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక హోదాను చంపేసి అర్థరాత్రి ప్యాకేజీకి స్వాగతం పలికింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. నేతల విగ్రహాలపై తమ ప్రభుత్వానికి ద్వేషం ఉండదని చెప్పారు. ఓ తాగుబోతు చేసిన పనికి పోలీసులు అతడిని వెంటనే అరెస్టు చేశారని తెలిపారు. కులమతాల పేరుతో రెచ్చగొడుతోంది చంద్రబాబేనని స్పష్టం చేశారు. -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి
సాక్షి,తాడేపల్లి: ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు స్వీకరించిన తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిర్ల జగ్గిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం క్యాంపు కార్యాలయం గురువారం కలిశారు. తనను చీఫ్ విప్‌గా నియమించినందుకు సీఎం జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ విప్‌గా చిర్ల జగ్గిరెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
మాయావతి విప్ : గహ్లోత్ సర్కార్‌కు షాక్
జైపూర్ : రాజస్తాన్‌లో రాజకీయ సంక్షోభం రోజుకో మలుపుతిరుగుతోంది. రాజస్తాన్ అసెంబ్లీలో అశోక్ గహ్లోత్ సర్కార్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని బీఎస్పీ ఎమ్మెల్యేలను కోరుతూ పార్టీ అధినేత్రి మాయావతి జారీ చేసిన విప్ ఆసక్తికరంగా మారింది. బీఎస్పీ తరపున ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్యేలతో కూడిన ఆ పార్టీ శాసనసభాపక్షం 2019 సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌లో విలీనమైంది. ఈ విలీనానికి రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ ఆమోదముద్ర వేశారు. బీఎస్పీ ఎమ్మెల్యేలు లఖన్ సింగ్, దీప్ చంద్, ఆర్ గుడా, వాజిబ్ అలీ, జేఎస్ అవానా, సందీప్ కుమార్‌లకు ఆ పార్టీ విప్ జారీ చేసింది. విప్‌ను ధిక్కరిస్తే వారు అనర్హత వేటుకు గురవుతారని బీఎస్పీ నేత సతీష్ చంద్ర మిశ్రా హెచ్చరించారు. బీఎస్పీ జాతీయ పార్టీ అని, జాతీయస్ధాయిలో బీఎస్పీ కాంగ్రెస్‌లో విలీనం అయితే మినహా రాష్ట్రస్ధాయిలో ఆరుగురు ఎమ్మెల్యేల విలీనం చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. చదవండి : రాజస్తాన్ హైడ్రామా : స్పీకర్ పిటిషన్ వెనక్కి.. అందుకే రాష్ట్రస్ధాయిలో తమ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ శాసనసభాపక్షంలో విలీనం కావడం చెల్లుబాటుకాదని వివరించారు. 2016లో పాలక టీఆర్ఎస్లో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 12 మంది పాలక పార్టీలో విలీనమైన కేసు తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే మిశ్రా వాదనను కాంగ్రెస్ నేతలు తోసిపుచ్చారు. వారు సాంకేతికంగా బీఎస్పీ ఎమ్మెల్యేలు కానందున వారికి విప్ వర్తించదని గహ్లోత్ శిబిరం వాదిస్తోంది. మరోవైపు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో విలీనానికి స్పీకర్ ఆమోదాన్ని సవాల్ చేస్తూ బీజేపీ, బీఎస్పీలు ఇప్పటికే న్యాయస్ధానాలను ఆశ్రయించాయి . ఇక సచిన్ పైలట్ తిరుగుబాటుతో 19 మంది ఎమ్మెల్యేలు దూరమవడంతో గహ్లాత్ సర్కార్ మైనారిటీలో పడిందని రెబల్ నేతలు చెబుతుండగా 200 మంది సభ్యులు కలిగిన రాజస్తాన్ అసెంబ్లీలో తమకు 103 మంది ఎమ్మెల్యేల బలముందని గహ్లోత్ శిబిరం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ 103 మందిలో బీఎస్పీ నుంచి చేరిన 6 ఎమ్మెల్యేలున్నారు. -
పౌరసత్వ బిల్లు: విప్ జారీచేసిన టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పౌరసత్వ (సవరణ) బిల్లును నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మత వివక్ష కారణంగా వలసవచ్చిన ముస్లిమేతరు లకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ బిల్లును హోం మంత్రి అమిత్ షా దిగువ సభలో ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం సభలో ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ, అనంతరం ఓటింగ్ జరగనుందని లోక్‌సభ వర్గాలు తెలిపాయి. అయితే ఈ కీలక బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) ఎంపీలకు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు పార్లమెంట్ సభ్యులకు విప్ జారీచేసింది. బిల్లుపై చర్చ సందర్భంగా ఈ రోజు, రేపు (సోమ, మంగళవారం) పార్లమెంట్‌కు తప్పకుండా హాజరుకావాలని పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలకు సూచించారు. కాగా వివాదస్పద పౌరసత్వ బిల్లును కాంగ్రెస్, వామపక్షలు, టీఆర్ఎస్తో పాటు ఎన్డీయేతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే లోక్‌సభలో అధికార బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఓటింగ్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండకపోచ్చని తెలుస్తోంది. ఎగువ సభలో మిత్రపక్షాల మద్దతును బీజేపీ కూడగొట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ తమ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులకు విప్ జారీ చేసింది. సోమవారం నుంచి మూడు రోజులపాటు సభకు తప్పని సరిగా హాజరు కావాలని ఆదేశించింది. -
ఆర్టికల్ 370 రద్దు; కాంగ్రెస్‌కు భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై తమ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యసభలో కాంగ్రెస్ విప్ భువనేశ్వర్ కలిత రాజీనామా చేశారు. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆర్టికల్ 370పై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఆత్మహత్యాసదృశ్యంగా ఉందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సైతం ఆర్టికల్ 370 ఏదో ఒకరోజు రద్దవుతుందని అభిప్రాయపడ్డారని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వం పార్టీ సిద్ధాంతాలను మర్చిపోయిందని విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లును వ్యతిరేకిస్తూ ఎంపీలందరికీ విప్ జారీ చేయాలని తనను ఆదేశించారని, ఈ విప్ దేశ మనోభావాలను దెబ్బతీసినట్టు అవుతుందన్న ఉద్దేశంతో విప్ జారీ చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేక రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. భువనేశ్వర్ కలిత అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వారం వ్యవధిలో కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయడం గమనార్హం. ట్రిపుల్ తలాక్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ పదవికి సంజయ్ సింగ్ జూలై 30న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: ఆర్టికల్ 35ఏ కూడా రద్దైందా?) -
ఎంపీలకు విప్ జారీచేసిన బీజేపీ
న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాల నేపథ్యంలో శుక్రవారం, సోమవారం సభకు తప్పనిసరిగా హాజరుకావాలని తమ ఎంపీలకు బీజేపీ మూడు లైన్ల విప్ జారీచేసింది. కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలోనే ఈ విప్ జారీచేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పార్టీ నియమనిబంధనలు, ఆదేశాలకనుగుణంగా ఓటేయాలని కోరుతూ మూడు లైన్ల విప్‌ను జారీచేస్తారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 542 లోక్‌సభ స్థానాలకుగానూ బీజేపీ 303 సీట్లు గెలుచుకుంది. (చదవండి: ‘మూకదాడుల’ బిల్లు జాడేది?) -
ప్రభుత్వ చీఫ్ విప్, విప్ హోదాలు రద్దు
సాక్షి, అమరావతి : ప్రభుత్వ చీఫ్ విప్, విప్ హోదాలను ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయడంతో.. మే 25 నుంచి ప్రభుత్వ విప్ హోదాలు కోల్పోయినట్లు చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈ ప్రకటనతో తొమ్మిది మంది సభ్యులు శాసన మండలిలో పదవులను కోల్పోయారు. వీరిలో పయ్యావుల కేశవ్, డొక్కా మాణిక్యవరప్రసాద్, బుద్దా వెంకన్న తదితరులు ఉన్నారు. -
‘అవిశ్వాసం ఏపాటిదో తేల్చేసిన జేసీ’
సాక్షి, అనంతపురం : కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సభలో వీగిపోవటం ఖాయమని స్పష్టం చేశారు. రాజకీయ వాతావరణం బాగాలేదంటూ టీడీపీ వైఖరిపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అందుకే పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావడంలేదని జేసీ తెలిపారు. అవిశ్వాస తీర్మానం వల్ల చర్చ మాత్రమే జరుగుతుందన్నారు. విప్ జారీపై.. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ జరగునున్న నేపథ్యంలో టీడీపీ, ఆ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విప్‌పై జేసీ స్పందిస్తూ.. విప్ జారీ చేసినా పార్లమెంటుకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. అవిశ్వాసంపై చర్చలో ఇద్దరు లేదా ముగ్గురు టీడీపీ ఎంపీలు మాట్లాడతారని పేర్కొన్నారు. నాకంటే ఇంగ్లిష్, హిందీ బాగా మాట్లాడేవారు ఉన్నారని జేసీ వ్యంగ్యంగా స్పందించారు. ఓ వైపు కేంద్రంపై పోరాటం చేస్తున్నామని బీరాలు పలుకుతున్న టీడీపీ.. సొంత పార్టీ ఎంపీ వ్యాఖ్యలతో ఇబ్బందుల్లో పడింది. ఇతర పార్టీల మద్దతు కూడగడతామంటూ పైకిచెబుతున్నా.. అవిశ్వాసానికి సొంత నేతల మద్దతే టీడీపీకి లేదని జేసీ వ్యవహారం చాటుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఐదుగురు వైద్యులపై కొరడా
మెమో జారీకి కలెక్టర్ ఆదేశాలు విధులకు ఎగనామం పెట్టిన ఐదుగురు వైద్యాధికారులపై జిల్లా కలెక్టర్ కోన శశిధర్ కొరడా ఝుళిపించారు. ఆదివారం స్థానిక మెడికల్ కళాశాలలో వైద్యాధికారులతో సమీక్షించిన కలెక్టర్.. ఆస్పత్రుల్లో వంద శాతం హాజరు ఉండాలని ఆదేశించారు. సోమవారం స్వయాన∙ ఆన్లైన్లో హాజరును పర్యవేక్షిస్తానన్నారు. చెప్పినట్టుగానే జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారుల హాజరును పరిశీలించారు. సాయంత్రం డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణను పిలిపించుకుని హాజరుపై ఆరా తీశారు. మొత్తం 19 మంది డాక్టర్లు విధులకు గైర్హాజరైనట్లు బయోమెట్రిక్‌లో తేలింది. వీరిలో నలుగురు ప్రసూతి సెలవులో ఉండగా.. ముగ్గురు క్యాజువల్ లీవ్ (సీఎల్)లో ఉన్నట్లు నిర్ధారించారు. బయోమెట్రిక్ పని చేయకపోవడం.. నెట్ కనెక్షన్ లేకపోవడంతో ఏడుగురు విధుల్లో ఉన్నా హాజరు నమోదుకాలేదు. అయితే.. కనగానపల్లి, అగళి, యాడికి, రాకెట్ల, బ్రహ్మసముద్రం వైద్యులు విధులకు డుమ్మా కొట్టినట్లు తేలింది. ఈ ఐదుగురికి చార్్జమెమోలు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో రాత్రి 8.30 గంటలకు కార్యాలయానికి చేరుకున్న డీఎంహెచ్ఓ మెమోలు సిద్ధం చేశారు. మంగళవారం వీటిని జారీ చేయనున్నారు. -
ఖాళీగా వున్న విప్, ఛీఫ్‌విప్ పదవులు
-
అలా విప్ ధిక్కరిస్తే తప్పుకాదు
- తామూ పోటీ చేయాలనుకునే అభ్యర్థులను తప్పుపట్టలేమన్న హైకోర్టు - అది సభ్యుల కొనుగోళ్ల వ్యవహారం పరిధిలోకి రాదు - పోటీ చేయకుండా విప్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తేనే ధిక్కరించినట్లని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: వివిధ ఎన్నికల సందర్భంగా ఆయా రాజకీయ పార్టీలు జారీ చేసే విప్ల విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక పార్టీ నుంచి ఎన్నికైన అభ్యర్థి తానే సంబంధిత పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకుని.. పార్టీ జారీ చేసిన విప్‌ను ధిక్కరిస్తే అది సభ్యుల కొనుగోళ్ల వ్యవహారం (హార్స్ ట్రేడింగ్) పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. ఏదైనా పదవికి పోటీ చేయాలని ఓ అభ్యర్థి నిర్ణయించుకున్నప్పుడు, ఆ అభ్యర్థికి పార్టీ విప్ జారీ చేసి మరో అభ్యర్థికి ఓటు వేయాలనడం హక్కులను హరించడమే అవుతుందని తేల్చి చెప్పింది. అయితే పదవికి పోటీలో ఉండని సందర్భంలో.. పార్టీ విప్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తే అది విప్ ధిక్కరణ కిందకు వస్తుందని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ అనిస్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. అయితే అధ్యక్ష, ఉపాధ్యక్ష పోస్టులకు పోటీ చేయాలనుకున్న ప్రజా ప్రతినిధులను విప్ ద్వారా నియంత్రించడం రాజ్యాంగ నిర్మాణాన్ని నాశనం చేస్తుందా అన్నది విస్తృతమైన అంశమని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘ఓ పార్టీ నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు క్రమశిక్షణతో మెలిగేందుకు, హార్స్ ట్రేడింగ్‌ను నిరోధించేందుకే రాజకీయ పార్టీకు విప్ జారీ చేసే అధికారాన్ని కల్పిస్తూ చట్టం తీసుకొచ్చారు. విప్ ఉల్లంఘన వల్ల నష్టపోయిన సందర్భాల్లో నాయకులు, అభ్యర్థుల్లో క్రమశిక్షణ లోపించిందని అంటుంటారు. అదే సమయంలో ఉల్లంఘన వల్ల లబ్ధి పొందిన వారు మాత్రం అంతరాత్మను అనుసరించే నడుచుకున్నామని చెబుతారు..’’ అని వ్యాఖ్యానించింది. 2014లో జరిగిన నిజామాబాద్ జిల్లా బిక్నూర్ మండల ప్రజా పరిషత్ ఎన్నికల్లో... డి.రాణి అనే ఎంపీటీసీ సభ్యురాలు పార్టీ అభ్యర్థికి ఓటు వేయకుండా విప్‌ను ఉల్లంఘించారని, ఆమెపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల అధికారికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. రాణి విప్‌ను ధిక్కరించారని నిర్ధారించిన ఎన్నికల అధికారి ఆమెపై అనర్హత వేటు వేశారు. దీనిపై ఆమె జిల్లా కోర్టును ఆశ్రయించగా.. ఎన్నికల అధికారి ఉత్తర్వులను నిలిపి వేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ విప్ హైకోర్టులో అప్పీలు చేశారు. దానిపై జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి మంగళవారం తీర్పు వెలువరించింది. -
పన్ను ఎగవేతదారులపై కొరడా
18 కంపెనీల పేర్లు సీబీడీటీ బహిర్గతం న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) 18 పన్ను ఎగవేత కంపెనీల పేర్ల జాబితాను విడుదల చేసింది. ఈ కంపెనీలు చెల్లించాల్సిన మొత్తం రూ. 500 కోట్లు. ఇలా పన్ను ఎగవేత కంపెనీల పేర్లను ప్రకటించడం ఇదే తొలిసారి. పన్ను వసూళ్ల పెంపుపై దృష్టి పెట్టిన కేంద్రం ఈ దిశలో చేసిన ప్రయత్నమే ఇదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సీబీడీటీ వెబ్సైట్లో ఈ జాబితాను పోస్ట్ చేశారు. 18 కంపెనీల్లో 11 గుజరాత్‌కు చెందినవి కావడం విశేషం. వీటిలో పలు కేసుల్లో అసెస్సీల (పన్ను చెల్లించాల్సిన వారు) జాడ కూడా తెలియడం లేదని వివరించారు. కంపెనీలు ఇవీ...: సోమానీ సిమెంట్ (రూ.27.47 కోట్లు), బ్లూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (రూ.75.11 కోట్లు), ఆపిల్‌టెక్ సొల్యూషన్స్ (రూ.27.07కోట్లు), జూపిటర్ బిజినెస్ (రూ.21.31 కోట్లు), హిరక్ బయోటెక్ (రూ.18.54 కోట్లు), ఐకాన్ బయోఫార్మా అండ్ హెల్త్‌కేర్ (రూ.17.69 కోట్లు), బన్యాన్ అండ్ బెర్రీ అలయ్స్ (రూ.17.48 కోట్లు), లక్ష్మీనారాయన్ టీ థాకర్ (రూ.12.49 కోట్లు), విరాగ్ డయ్యింగ్ అండ్ ప్రింటింగ్ (రూ.18.57 కోట్లు), పూనమ్ ఇండస్ట్రీస్ (రూ.15.84 కోట్లు), కున్వర్ అజయ్ ఫుడ్ (రూ.15 కోట్లు), గోల్డ్సుక్ ట్రేడ్ ఇండియా (రూ.75.47 కోట్లు), విక్టర్ క్రెడిట్ అండ్ కన్స్ట్రక్షన్ (రూ.13.81 కోట్లు), నోబెల్ మర్చండైస్ (రూ.11.93 కోట్లు) జాబితాలో ఉన్న కొన్ని కంపెనీలు. రూ.38.31 కోట్ల బకాయిల విషయమై పుణేకు చెందిన జీకే ధరణి పేరూ జాబితాలో ఉంది. -
ఎంపీటీసీ టు విప్
14 ఏళ్ల ఉద్యమ ఫలితంగా గొంగిడి సునీతకు దక్కిన పదవి భువనగిరి : ఎమ్మెల్యే గొంగిడి సునీతను శాసనసభలో విప్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఆలేరు నియోజకవర్గం నుంచి 2014లో జరిగిన శాసనసభఎన్నికల్లో ఆమె తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితురాలిగా పేరున్న సునీతకు టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. అయితే జిల్లాకు చెందిన గుంటకండ్ల జగదీష్‌రెడ్డిని మంత్రిపదవి వరించింది. తాజాగా మంత్రివర్గ విస్తరణలోనైనా సునీతకు అవకాశం వస్తుందనుకున్నారు. అనూహ్యంగానే ఆమెకు విప్ పదవి వచ్చింది. పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంటే... తెలంగాణ సాధనకోసం టీఆర్ఎస్ ఏర్పడిన నాటినుంచి గొంగిడి సునీత ఆ పార్టీలోనే ఉన్నారు. 2001లో జరిగిన స్థానిక సంస్థలఎన్నికల్లో ఆమె యాదగిరిగుట్ట-2 ఎంపీటీసీగా గెలిచి..ఎంపీపీ అయ్యారు. 2006లో స్వగ్రామమైన వంగపల్లి సర్పంచ్‌గా గెలిచి 2011 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఈ సమయంలోనే రాష్ర్టపతి నుంచి నిర్మల్ పురస్కారం అందుకున్నారు. అలాగే ప్రజాప్రతినిధుల సంఘం జనరల్‌సెక్రటరీగా, ఆల్ఇండియా లోకల్ గవర్నమెంట్ ప్రజాప్రతినిధులసంఘం జాయింట్సెక్రటరీగా ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ సెమినార్లో పాల్గొన్నారు. పార్టీపరంగా 2009లో ఆమె టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా నియమించబడ్డారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, మహిళా కార్యదర్శిగా పనిచేశారు. ఉపఎన్నికల సందర్భంగా పరకాల, లింగాల ఘణపురం, బాన్స్వాడ అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జ్గా అక్కడి అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేశారు. కేసీఆర్ కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్లారు. ఆసమయంలో సునీత చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో పలుమార్లు అరెస్ట్ కావడంతో పాటు కేసులు నమోదు అయ్యాయి. కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా ‘‘సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను. 14 సంవత్సరాల పాటు ఆయన వెంట ఉద్యమంలో నడిచిన నాకు ఆలేరు అసెంబ్లీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు పార్టీ విప్ పదవి ఇచ్చారు.ఉద్యమంలో నడిచిన వారందరికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పినట్లుగానే పదవులు ఇస్తున్నారు. కేసీఆర్‌కు నాకుటుంబం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. పార్టీ కోసం పనిచేసి పదవికి వన్నె తెస్తా. ఆలేరు ప్రజలకు మరిన్ని సేవలు చేస్తాను’’. -
పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ
హైదరాబాద్ : పార్టీ ఎమ్మెల్యేలకు టీడీపీ గురువారం విప్ జారీ చేసింది. ద్రవ్య వినిమయ బిల్లుపై రేపు అసెంబ్లీలో జరిగే ఓటింగ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని టీడీపీ విప్లో పేర్కొంది. ఈ విషయంపై తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసినట్లు చెప్పారు. పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలకు సభలో విప్ అందచేశామన్నారు. విప్‌ను ఉల్లంఘించాలనుకుంటే పదవులుకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సండ్ర వెంకట వీరయ్య సూచించారు. -
అక్రమార్కులపై కొరడా
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అక్రమ వాణిజ్య భవనాలపై కొరడా ఝళిపించేందుకు కర్నూలు నగరపాలక సంస్థ యంత్రాంగం సిద్ధమైంది. ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకుని వాణిజ్య సముదాయాన్ని(కమర్షియల్ కాంప్లెక్స్) నిర్మించుకున్న అక్రమార్కులపై చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం పక్కాగా పథక రచన చేసింది. ప్రధానంగా నగరంలోని ఐదు వాణిజ్య మార్గాల్లో సర్వే చేపట్టేందుకు నిర్ణయించింది. సర్వేలో వాణిజ్య సముదాయాల ఫొటోలను తీసి డిజిటలైజ్ చేయనున్నారు. ఆ తర్వాత విద్యుత్ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో వివరాలు సేకరించి క్రోడీకరించనున్నారు. ఈ నెలాఖరులోగా అన్ని వాణిజ్య సముదాయాల వివరాలను డిజిటలైజ్ చేసి.. భండారం బయటపెట్టేందుకు మున్సిపల్ యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఉమ్మడి నిర్ణయం అక్రమ వాణిజ్య భవనాలపై చర్యలకు విద్యుత్, వాణిజ్య పన్నుల శాఖలతో కలిసి ఉమ్మడిగా ముందుకు సాగేందుకు పురపాలకశాఖ అధికారులు నిర్ణయించారు. ప్రధానంగా సర్వే చేయనున్న ఐదు ప్రధాన మార్గాల్లోని వాణిజ్య సముదాయాలకు విద్యుత్ కనెక్షన్ ఎందుకోసం తీసుకున్నారనే వివరాలను విద్యుత్‌శాఖ నుంచి సేకరిస్తారు. అంటే.. గాయత్రి ఎస్టేట్ వద్ద ఫలానా షాపునకు గృహ విద్యుత్ కనెక్షన్ ఇచ్చారా? వాణిజ్య విద్యుత్ కనెక్షన్ ఇచ్చారా? అనే వివరాలను తీసుకుంటారు. అదేవిధంగా ఫలానా బిల్డింగ్‌లో ఏయే షాపులకు అనుమతి తీసుకున్నారనే వివరాలను వాణిజ్యపన్నులశాఖ నుంచి సేకరిస్తారు. ఆ తర్వాత సర్వే ద్వారా తీసుకున్న డిజిటల్ చిత్రాలు-విద్యుత్ కనెక్షన్ వివరాలు, వాణిజ్య పన్నుల శాఖ తీసుకున్న అనుమతి వివరాలను క్రోడీకరించి పక్కాగా నిక్షిప్తం చేయనున్నారు. తద్వారా పట్టణ ప్లానింగ్ విభాగం నుంచి అనుమతి ఎందుకు తీసుకున్నారనే వివరాలను పోల్చి... అక్రమ వాణిజ్య భవనాలను గుర్తించనున్నారు. ఈ విధంగా గుర్తించిన భవనాలపై వాస్తవంగా వాణిజ్య భవనానికి చెల్లించాల్సిన పన్ను కంటే అదనంగా 100 శాతం వసూలు చేయనున్నారు. ఎప్పటి నుంచి వాస్తవంగా పన్ను చెల్లించాలనే వివరాలను సేకరించి అంత బకాయి మొత్తాన్ని వడ్డీ సహా వసూలు చేసేందుకు మున్సిపల్ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. నగరంలో మొదటి దశగా ప్రధాన వాణిజ్య సముదాయాలున్న ఐదు మార్గాలపై మున్సిపల్ యంత్రాంగం దృష్టి సారించింది. ఆయా ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపుల ఉన్న వాణిజ్య సముదాయాల వివరాలు, ఫొటోలను తీసి క్రోడీకరిస్తారు. రెండో దశలో మునిసిపాలిటీ పరిధిలోని మొత్తం వాణిజ్య భవనాల వివరాలను సేకరించి ఆన్లైన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. తద్వారా ఎవరైనా గృహాన్ని నిర్మిస్తామని తక్కువ పన్ను చెల్లించే ప్రయత్నం చేస్తే అడ్డుకట్ట వేయాలనేది మున్సిపల్ అధికారుల ప్రణాళికగా తెలుస్తోంది. నగరంలో సర్వే నిర్వహించనున్న ఐదు ప్రధాన మార్గాలు 1. సుంకేసుల రోడ్డు నుంచి మదర్ థెరిస్సా విగ్రహం మీదుగా వాణిజ్యపన్నులశాఖ. అక్కడి నుంచి వైఎస్సార్ విగ్రహం.. రాక్‌వుడ్ పాఠశాల.. మౌర్య ఇన్.. రాజ్ విహార్.. కిడ్స్‌వరల్డ్.. రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా రాజ్ థియేటర్. 2. కింగ్ మార్కెట్ నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా కొండారెడ్డి బురుజు. అక్కడి నుంచి కోట్ల సర్కిల్ మీదుగా కిడ్స్‌వరల్డ్. 3. రైల్వే స్టేషన్ రోడ్డు-బంగారుపేట నుంచి బళ్లారి జంక్షన్ మీదుగా రేడియో స్టేషన్. 4. రాజ్‌విహార్-గౌరీ గోపాల్ ఆసుపత్రి, గాయత్రి ఎస్టేట్ మీదుగా గుత్తి పెట్రోల్ బంకు. 5. గాయత్రీ ఎస్టేట్ నుంచి నంద్యాల రోడ్డు. -
ప్రకాశం జడ్పీ ఛైర్మన్‌పై అనర్హత వేటు
-
ప్రకాశం జడ్పీ ఛైర్మన్‌పై అనర్హత వేటు
ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఈదర హరిబాబు జడ్పీటీసీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ అక్కడి జిల్లా కలెక్టర్ విజయకుమార్ నిర్ణయం తీసుకున్నారు. విప్ ధిక్కరించిన కేసులో ఆయనపై అనర్హత వేటు వేశారు. దాంతో ఆయన జడ్పీటీసీ సభ్యత్వంతో పాటు.. ఛైర్మన్ పదవి కూడా పోయినట్లు అవుతుంది. గతనెల 13వ తేదీన జరిగిన జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి వైఎస్ఆర్ సీపీ వ్యూహాత్మకంగా ఇచ్చిన మద్దతుతో చైర్మన్ గా ఈదర హరిబాబు గెలిచిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో అసలు తెలుగుదేశం పార్టీ తనకు విప్ ఇవ్వనే లేదని, అలాంటప్పుడు దాన్ని ధిక్కరించే ప్రశ్న ఎక్కడినుంచి వస్తుందని హరిబాబు అంటున్నారు. ఇంతకుముందే ప్రిసైడింగ్ అధికారి తనకు షోకాజ్ నోటీసు ఇవ్వగా దానికి ఆయన సమాధానం కూడా ఇచ్చారు. అయినా కూడా ఇప్పుడు ఆయన సభ్యత్వం రద్దు కావడం గమనార్హం. -
బైక్ రేసింగ్‌పై కొరడా
సాక్షి, చెన్నై:నగరంలో కుర్రకారు సాయంకాల వేళ బైక్‌లపై చెక్కర్లు కొడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎనిమిది, పదో తరగతి విద్యార్థులు సైతం తమ వాళ్ల బైక్ లను రోడ్డెక్కిస్తూ హుషారుగా చక్కర్లు కొడుతూ ప్రమాదం బారిన పడుతున్నారు. కళాశాలల విద్యార్థుల ఆకతాయితనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విద్యార్థులు బైక్ జోరుతో రేసింగ్‌లకు పాల్పడుతూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నగరంలో వరుస ఘటనలు పోలీసుల్ని, అటు విద్యార్థుల తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ ప్రమాదాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, విద్యార్థులు స్కూళ్లకు మోటార్ సైకిళ్ల మీద వస్తే అనుమతించొద్దంటూ విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. కళాశాల విద్యార్థులు లెసైన్సులు కలిగి ఉంటే సరి, లేకుంటే అనుమతించొద్దన్న హెచ్చరికను జారీ చేసింది. విద్యార్థులు ప్రమాదం బారిన పడ్డ పక్షంలో అందుకు ఆయా విద్యాసంస్థలే బాధ్యులవుతాయం టూ హెచ్చరికలు జారీ చేసింది. అయినా, ఈ హెచ్చరికలను పట్టించుకునే వాళ్లుంటే కదా! విద్యా సంస్థలు తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తుండడంతో విద్యార్థులు బైక్ జోరులో హుషారుగా ముందుకు సాగుతున్నారు. యువత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది.బైక్ రేసింగ్ : కొన్ని చోట్ల కుర్రకారు బైక్ రేసింగ్‌ల పేరిట పందాలు కాసుకుంటూ రోడ్డు మీద దూసుకెళ్తున్నారు. రోడ్డు మీద ఇతర వాహనాలు సైతం ప్రమాదానికి గురయ్యే విధంగా వీరి వీరంగాలు సాగుతున్నాయి. ప్రధానంగా ఉదయం, రాత్రుల్లో మెరీనా తీరం, కామరాజర్ సాలై, శాంతోమ్ రోడ్డు, అడయార్, తిరువాన్మీయూర్, ఓఎంఆర్, ఈసీఆర్ రోడ్డు, తాంబరం, వండలూరు - కేలంబాక్కం మార్గాల్లో జోరుగా ఈ రేసింగ్ సాగుతోంది. ప్రమాదం జరిగినప్పుడు రేసింగ్ వ్యవహారం బయటకు వస్తుండగా, మిగిలిన సమయాల్లో గుట్టు చప్పుడు కాకుండా పందాలు కాసుకుంటూ దూసుకెళుతున్నారు. రెండు రోజుల క్రితం బైక్ రైసింగ్ ఓ విద్యార్థిని బలిగొన్న ఘటనతో నగర పోలీసు యంత్రాంగం మేల్కొంది. ఇక బైక్ రేసింగ్‌పై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. నాన్ బెయిలబుల్ కేసులు: బైక్ రేసింగ్‌లకు క ళ్లెం వేయ డం, విద్యార్థులు, యువత బైక్ జోరుకు బ్రేక్‌లు వేయడం లక్ష్యంగా చర్యలకు నగర పోలీసు యంత్రాం గం నిర్ణయించింది. కమిషనర్ జార్జ్ ఇందుకు సంబంధించి అధికారులతో సోమవారం చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట బైక్ రేసింగ్‌లో చిక్కేవారిని నాన్ బెయిలబుల్ కేసుల కింద అరెస్టు చేయాలన్నారు. ఆదేశాలను నగరంలోని అన్ని పోలీసుస్టేషన్లు, ట్రాఫిక్ పోలీసు స్టేషన్లకు జారీ అయ్యాయి. బైక్ రేసింగ్ల్లో చిక్కే వాళ్లపై ఎలాంటి జరిమానాలు విధించొద్దని, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద తొలుత కేసులు నమోదు చేసి, బైక్‌లను స్వాధీనం చేసుకోవాలని, విద్యార్థి అయినా సరే ముందు అరెస్టు చేయాలన్న ఆదేశాలు ఇస్తూ బైక్ రేసింగ్‌పై కొరడా ఝుళి పించేందుకు రెడీ అయ్యారు. విద్యార్థులు, 18 ఏళ్లలోపు వారు మోటార్ సైకిళ్లను గానీ, కార్లనుగానీ నడుపుతూ పట్టుబడిన పక్షంలో తొలిసారిగా జరిమానాలు భారీగానే మోగించేందుకు సిద్ధం అయ్యారు. మళ్లీ పట్టుబడితే మాత్రం ఆ వాహనం రిజిస్ట్రేషన్ రద్దు దిశగా హెచ్చరికలు జారీ కావడం గమనార్హం. -
విప్ ఇవ్వలేదు... ఇంకా ధిక్కరించేదెక్కడ
ఒంగోలు : అసలు నాకు విప్ ఇవ్వలేదు. ఇంకా ధిక్కరించే ప్రశ్న ఎక్కడ ఉత్పన్నమవుతుంది. ఇదీ... విప్ ధిక్కరించినందుకు ప్రిసైడింగ్ అధికారి ఇచ్చిన షోకాజ్ నోటీస్‌కు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఈదర హరిబాబు ఇచ్చిన సమాధానం. ఈనెల 13న జరిగిన జెడ్పీ ఛైర్మన్ ఎన్నికలో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి వైఎస్ఆర్ సీపీ వ్యూహాత్మకంగా ఇచ్చిన మద్దతుతో చైర్మన్ గా ఈదర హరిబాబు గెలిచిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ సీరియస్‌గా స్పందించిన ఈదర హరిబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయటమే కాకుండా విప్ ధిక్కరించినందుకు అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ప్రిసైడింగ్ అధికారి హోదాలో కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. గడువు ముగియటంతో డీఆర్వోకు ఈదర హరిబాబు సమాధాం అందచేశారు. అందులో అసలు తెలుగుదేశం పార్టీ తనకు విప్ జారీ చేయలేదని, అందువల్ల తనకు విప్ గురించి తెలియదని సమాధానం ఇచ్చారు. విప్ ఇవ్వనపుడు దాన్ని ధిక్కరించే ప్రశ్న ఉత్పన్నం కాదని ఆయన పేర్కొన్నారు. అయితే ఈదర సమాధానంపై కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి. -
విప్ ధిక్కరించిన జెడ్పీటీసీలపై వేటు వేయించడమెలా?
టీపీసీసీ క్రమశిక్షణాసంఘంతో పొన్నాల భేటీ హైదరాబాద్: స్థానిక పీఠాల పోరులో కాంగ్రెస్ విప్‌ను ధిక్కరించిన జెడ్పీటీసీలపై అనర్హత వేటు వేయించాలని టీపీసీసీ నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ల క్ష్మయ్య మంగళవారం గాంధీభవన్‌లో పార్టీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ ఎం.కోదండరెడ్డి, సభ్యుడు డి.వి.సత్యనారాయణలతో ఇదే అంశంపై సమావేశమయ్యారు. ప్రధానంగా వరంగల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పార్టీ విప్‌ను ధిక్కరించిన వారిపై చర్య తీసుకునే విషయంపైనే ఎక్కువసేపు చర్చ జరిగింది. అనర్హత వేటు విషయంలో న్యాయపరంగా ఇబ్బందుల్లేకుండా అధ్యయనం చేసి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని పొన్నాల సూచించినట్లు తెలిసింది. రాజ్యసభ సభ్యుడు పాల్వాయిపై వచ్చిన ఫిర్యాదుపైనా సమావేశంలో చర్చించారు. -
మండలి చైర్మన్ పదవికి కాంగ్రెస్ పోటీ
-
వైఎస్సార్సీపీ విప్ వంద శాతం చెల్లుతుంది
మైసూరా, అంబటి స్పష్టీకరణ హైదరాబాద్ : జూలై 3, 4, 5 తేదీల్లో జరిగే ‘స్థానిక’ పరోక్ష ఎన్నికలు పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జారీ చేసే విప్ నూ టికి నూరు శాతం చెల్లుతుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యు డు ఎంవీ మైసూరారెడ్డి, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో టీడీపీ నేతల మాటలు, చేస్తున్న ప్రచారం అభూత కల్పనలని వారు పేర్కొన్నారు. విప్ ఉల్లంఘించే సభ్యులపై వేటు తప్పదని హెచ్చరించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద వారు మీడియాతో వేర్వేరుగా మాట్లాడారు. వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను అనైతికంగా తన వైపునకు తిప్పుకునేందుకు టీడీపీ రాజకీయ దిగజారుడుతనానికి పాల్పడుతోందని మైసూరా, అంబటి మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తన (27.06.2014) నోటిఫికేషన్లో సైతం వైఎస్సార్ సీపీని రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీగా పేర్కొన్నందున.. విప్ చెల్లుతుందని వారు తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు విప్ వర్తించదు: సోమిరెడ్డి నెల్లూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరుపున గెలుపొందిన ప్రజాప్రతినిధులకు ఆ పార్టీ జారీ చేసే విప్ వర్తించదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. స్థానిక ఎన్నికలు జరిగే నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌లో రిజిస్టర్డ్ పార్టీ మాత్రమేనని, ఎన్నికలు ముగిశాకే ఆ పార్టీకి గుర్తింపు లభించిందని తెలిపారు. -
విప్ ధిక్కరిస్తే అనర్హతే
గుర్తింపు పార్టీలు విప్ జారీ చేసుకోవచ్చు స్పష్టం చేసిన ఎన్నికల సంఘం వర్గాలు హైదరాబాద్: స్థానిక సంస్థల్లో రాజకీయ పార్టీల గుర్తులపై ఎన్నికైన అభ్యర్థులంతా ఆయా పార్టీలు జారీచేసే విప్‌కు అనుగుణంగా ఓటెయ్యాలని, ధిక్కరించే పక్షంలో వారిపై అనర్హత వేటు పడుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జూన్ 3న మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్లు, మేయర్ల ఎన్నిక జరగనుంది. వీటితోపాటు జెడ్పీ ఎన్నికల్లోనూ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు గుర్తించిన అన్ని రాజకీయ పార్టీలు విప్ జారీ చేసుకునే అవకాశం ఉందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఎన్నికల్లో విప్ జారీచేసుకునే అధికారం ఉన్న గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాను ఇదివరకే వెల్లడించామని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్ ‘సాక్షి’తో మాట్లాడుతూ వెల్లడించారు. విప్ వర్తించదంటూ కొన్ని పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని ఎన్నికల సంఘం వర్గాలు ఖండించాయి. వైఎస్సార్సీపీతో సహా గర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలకు విప్ జారీ చేసే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నత అధికారి వెల్లడించారు. -
వైసీపీ జారీ చేసే విప్ చెల్లుతుంది: మైసురారెడ్డి
-
మండలి చైర్మన్ పదవికి కాంగ్రెస్ పోటీ
హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం శాసనమండలిలో పాగా కోసం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సోమవారం గాంధీభవన్‌లో సమావేశం అయ్యారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ ఎంపికపై నేతలు ఈ భేటీలో కసరత్తు చేయనున్నారు. టీఆర్ఎస్ పార్టీని చైర్మన్ ఎన్నికలో ధీటుగా ఎదుర్కొనేందుకు మైనార్టీ, ఎస్సీ ఎమ్మెల్సీల్లో ఒకరిని చైర్మన్ అభ్యర్థిగా పోటీ పెట్టాలని యోచిస్తోంది. పలువురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో చేరడంతో చైర్మన్ ఎంపిక వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ డీ శ్రీనివాస్, ఎమ్మెల్యే జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు హాజరు అయ్యారు. మరోవైపు శాసనమండలి చైర్మన్ పదవికి పార్టీ ఎమ్మెల్సీ స్వామి గౌడ్ పేరును కెసిఆర్ పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
ఫిరాయిస్తే అనర్హత వేటే
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను {పలోభాలకు గురిచేస్తున్న అధికారపక్షం అనర్హత వేటుతోపాటు ప్రతిష్ట కోల్పోతామని భయపడుతున్న నేతలు సాక్షి, చిత్తూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక పార్టీనుంచి ఎన్నికై... వేరే పార్టీవైపు చూస్తున్నా రా? తస్మాత్ జాగ్రత్త. ఎన్నికైన పార్టీ ఆదేశాలను, విప్‌లను ధిక్కరించే వారిపై తక్షణమే అనర్హత వేటు పడుతుంది. పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు 2003లో పంచాయతీరాజ్ చట్టంలో చేసిన సవరణల వల్ల స్థానిక సంస్థల ప్రతినిధులు, ఎన్నికైన పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే ఆ మరుక్షణమే వారిపై అనర్హత వేటు ఖాయమని చట్టాలు చెబుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ప్రలోభాలు పెట్టే చర్యలు తెరవెనుక సాగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం, ఫిరాయింపు నిరోధక చట్టాలను నిపుణులు ఉటంకిస్తున్నారు. పార్టీ మారే వారికి చట్టంలోని పగడ్బందీ నిబంధనలు షాక్ కొట్టించకమానవని స్పష్టంచేస్తున్నారు. అనర్హత వేటు వల్ల అప్రతిష్ట పాలవ్వడంతోపాటు ప్రజలనుంచి వచ్చే వ్యతిరేకతతో అక్కడితోనే రాజకీయ భవిష్యత్తును కోల్పోయే ప్రమాదమూ తప్పదంటున్నారు. గతంలో ఇలా పార్టీలు మారిన వారు రాజకీయంగా తెరమరుగైన సందర్భాలు అనేకమున్నాయని గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా స్థానికసంస్థల్లో పార్టీల సిద్ధాంతాలను అనుసరించి ప్రజాభిప్రాయం మేరకు నడుచుకున్న వారే ఆ తరువాత కూడా రాజకీయంగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నత స్థానాల్లోకి వెళ్లగలిగారు. స్వల్ప కాలిక ప్రయోజనాలకోసం పార్టీలు మారితే ఆ తరువాత దీర్ఘకాలంగా రాజకీయంగా చాలా నష్టపోకతప్పదు. ఇలాంటి తరుణంలో జెడ్పీ స్థానాలను కైవసం చే సుకోవడానికి అధికార పార్టీనేతలు స్థానిక సంస్థల ప్రతినిధులను అనేకరకాల ప్రలోభాలకు గురిచేస్తున్నా నేతలు మాత్రం పునరాలోచనలో పడుతున్నారు. ప్రజల తీర్పును, పార్టీ నిర్ణయాన్ని భవిష్యత్తును పణంగా పెట్టడం పలువురు నేతలకు రుచించడం లేదు. పార్టీని ధికకరిస్తే వెంటనే వేటు పడడం, ఆపై ప్రజలు నిరాదరించడం ఇవన్నీ ఎందుకు? బంగారు భవిష్యత్తును వదులుకోవడమెందుకు? అన్న ఆలోచనలో పడుతున్నారు. అయినా కొన్ని చోట్ల కొంతమంది ఆమాయకులను ఆసరా చేసుకొని అధికారపక్షం వారు చట్టాన్ని వక్రీకరిస్తున్నారు. వారెన్ని చెప్పినా చట్టం పగడ్బందీగా ఉన్నందున అనర్హత వేటు తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఆ పార్టీ జారీ చేసే విప్‌కు అనుకూలంగా ఓటు వేయాలే తప్ప, ధిక్కరిస్తే అనర్హత వేటుకు గురవుతారని తెలియజేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం గత శుక్రవారం ప్రత్యేకంగా నోటఫికేషన్ కూడా జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఏముందంటే... రాజీవ్‌గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో అంటే 1985 కాలంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చి, దానిని రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో చేర్చారు. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. అటు తరువాత 2003లో అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ చట్టానికి కొన్ని సవరణలు జరిగాయి. చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడు ఎవరైనా కూడా తన పార్టీ స్వభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నప్పుడు అతనికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది. తను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీ సభ్వత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడానికి, ఆ పార్టీకి రాజీనామా సమర్పించడానికి తేడా ఉందని, ఈ రెండూ పదాలు కూడా సమనార్ధాకాలు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తి తన పార్టీకి రాజీనామా చేయనప్పటికీ, స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని వదులుకోవచ్చునని తెలిపింది. అదే విధంగా పార్టీ ఆదేశాలకు భిన్నంగా ఏదైనా అంశంపై ఓటింగ్ జరిగినప్పుడు అందులో పాల్గొని ఓటు వేయడం, లేదా ఓటింగ్‌కు గైర్హాజరు కావడం చేసినప్పుడు కూడా ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది. ఒకవేళ సదరు రాజకీయ పార్టీ తమ సభ్యుడి ధిక్కారాన్ని 15 రోజుల్లోపు ఖండించని పక్షంలో అతనికి ఫిరాయింపుల చట్టం వర్తించదు. అంతేకాక ఏ పార్టీ టిక్కెట్ మీద అయితే ఓ సభ్యుడు గెలిచారో, ఆ వ్యక్తి ప్రతిపక్ష నేతను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను రాతపూర్వకంగా కోరే, ఆ వ్యక్తి తన పార్టీ సభ్వత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 2003లో తీసుకువచ్చిన చట్ట సవరణ ప్రకారం పార్టీలోని మూడింట రెండు వంతుల మంది సభ్యులు వేరే పార్టీకి వెళ్లిన సందర్భాన్ని ఫిరాయింపుగా పరిగణించడానికి వీల్లేదు. చట్ట సభలకు ఎన్నికైన వెంటనే ఎవరైనా స్వతంత్ర అభ్యర్థి ఇతర రాజకీయ పార్టీలో చేరితే అతనికీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది. -
ఇక విప్ దిక్కరిస్తే అనర్హత వేటే!
-
టీఆర్ఎస్ కు చెక్ చెప్పేందుకు కాంగ్రెస్ కొత్త ఎత్తుగడ!
హైదరాబాద్: తెలంగాణ కౌన్సిల్ చైర్మన్ పదవికి పోటీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ శాసన మండలి చైర్మన్ పదవి ఎంపికపై సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్సీల సమావేశం నిర్వహించనున్నారు. చైర్మన్ ఎంపికపై విప్ జారీ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేయనున్నట్టు మీడియాకు వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీని చైర్మన్ ఎన్నికలో ధీటుగా ఎదుర్కొనేందుకు మైనార్టీ, ఎస్సీ ఎమ్మెల్సీల్లో ఒకరిని చైర్మన్ అభ్యర్థిగా పోటీ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. పలువురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో చేరడంతో చైర్మన్ ఎంపిక వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకున్నట్టు పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. -
తెలంగాణ కౌన్సిల్ చైర్మన్ పదవికి కాంగ్రెస్ పోటీ!
హైదరాబాద్: హైదరాబాద్: తెలంగాణ కౌన్సిల్ చైర్మన్ పదవికి పోటీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ శాసన మండలి చైర్మన్ పదవి ఎంపికపై సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్సీల సమావేశం నిర్వహించనున్నారు. చైర్మన్ ఎంపికపై కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేయనున్నట్టు మీడియాకు వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీని చైర్మన్ ఎన్నికలో ధీటుగా ఎదుర్కొనేందుకు మైనార్టీ, ఎస్సీ ఎమ్మెల్సీల్లో ఒకరిని చైర్మన్ అభ్యర్థిగా పోటీ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. పలువురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో చేరడంతో చైర్మన్ ఎంపిక వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకున్నట్టు పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. -
వైఎస్సార్సీపీకి విప్ అధికారం
మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు టీడీపీ ప్రలోభాల పర్వానికి కళ్లెం గుడివాడ : వైఎస్సార్సీపీకి స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికల్లో విప్ జారీ చేసే అధికారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అందించింది. ఈ మేరకు శుక్రవారం అన్ని మున్సిపాలిటీల కమిషనర్లకు, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు గాను ఎంపీడీఓలకు ఆదేశాలు అందాయి. దీంతో వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికైన అభ్యర్థులందరికీ విప్ వర్తిస్తుంది. ఇప్పటికే ప్రత్యర్థి టీడీపీ నేతలు వైఎస్సార్సీపీకి విప్ జారీ అవకాశం లేదని, కాబట్టి తమ పార్టీకి మద్దతు ప్రకటించాలని కొన్నిచోట్ల ప్రలోభాలకు తెర తీశారు. స్వల్ప ఆధిక్యత ఉన్నచోట్ల ఈ ప్రలోభాల పర్వం ఇప్పటికే కొనసాగింది. ఈ నేపథ్యంలో విప్ జారీ చేసే అవకాశం రావటంతో వీరి ప్రలోభాలకు తెరపడినట్లయింది. విప్ జారీ చేస్తే అనర్హతే.. జూలై మూడున జరగనున్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, జూలై నాలుగున జరగనున్న మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో, జూలై ఐదున జరిగే జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో పార్టీ జారీ చేసిన విప్‌కు వ్యతిరేకంగా సభ్యులు ప్రవర్తిస్తే వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశముంటుంది. విప్ జారీ చేసే పార్టీ ఆదేశాలకే కట్టుబడి ఉండాలి... ఏదైనా పార్టీ విప్ జారీ చేస్తే ఆ పార్టీ ఎన్నిక సందర్భంగా ఎవరికి ఓటు వేయమంటే ఆ అభ్యర్థికే ఓటు వేయాల్సి ఉంటుంది. పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసినా విప్‌ను వ్యతిరేకించినట్లే అవుతుంది. విప్ జారీ చేసినపుడు ఆ సమావేశానికి ఎన్నిక సందర్భంగా హాజరు కాకపోయినా విప్ ధిక్కారం కింద అనర్హత వర్తిస్తుంది. విప్ జారీ చేసినపుడు ఆ పార్టీ చెప్పిన వ్యక్తి ఓటు వేయకుండా తటస్థంగా వ్యవహరించినా విప్ ధిక్కారమే అవుతుంది. మున్సిపల్ కౌన్సిలర్లు, మండల పరిషత్‌కు చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పార్టీల విప్‌కు లోబడి ఓటింగ్‌లో పాల్గొనాల్సిందేనని ఎన్నికల కమిషన్ తన నిబంధనల్లో పొందుపర్చింది. అలా చేయని సభ్యులపై నిబంధనల ప్రకారం విప్ దిక్కారం ద్వారా అనర్హుడుగా ప్రకటించే అవకాశముంది. -
విప్ ధిక్కరించారో...
ఎల్.ఎన్.పేట, న్యూస్‌లైన్: జిల్లా, మండల పరిషత్ పాలకవర్గ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో-అప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించిన నిబంధనలు ఇప్పటికే జారీ చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జిల్లా, మండల పరిషత్ కార్యాలయాలకు ఎన్నికల కమిషన్ నుంచి అందాయి. మరో వారం రోజుల్లో పాలక వర్గాలను ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ పూర్తికావడం, ఫలితాలు వెలువడడం, పాలకవర్గం ఎంపిక వంటి ప్రక్రియలు ఆలస్యంగానే జరుగుతున్నాయి. ఈనెల 8న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత మరో మూడు నాలుగు రోజుల్లో జిల్లా, మండల పరిషత్‌ల ఎన్నికలు కూడా పూర్తిచేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఇలా... * సెక్షన్ 17 (3) (వీ)ప్రకారం మండల పరిషత్‌కు ఇద్దరు మైనార్టీ సభ్యులను కో-అప్షన్ సభ్యులుగా ఎన్నుకోవచ్చు. 21 ఏళ్లు నిండిన జిల్లాలో ఓటు హక్కు కలిగిన వారు అర్హులు. *సెక్షన్(171) (1) ప్రకారం జెడ్పీ చైర్మన్‌ను జిల్లా పరిషత్ (జెడ్పీటీసీ) సభ్యులు చేతులు ఎత్తి ఎన్నుకోవాలి. ఇక్కడ కూడా గుర్తింపు పొందిన పార్టీలు జారీ చేసిన విప్ మేరకే నడుచుకోవాలి. విప్ దిక్కరిస్తే జెడ్పీటీసీ సభ్యత్వం రద్దుచేసే అవకాశం ఆయా పార్టీలకు ఉంది. * జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్, అధ్యక్షులను ఎన్నుకునేందుకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతోపాటు కో-ఆప్షన్ సభ్యులే అర్హులు. * ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఓటు హక్కులేదు. వారు ఆయా సమావేశాలకు హాజరైతే కూర్చోనేందుకు ప్రత్యేక స్థానాలు కేటాయించాల్సి ఉంటుంది. * సమావేశ భవనం ఎలాంటి ప్రచారాలకు ఇవ్వకూడదు. సభ్యులను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకూడదు. *ఏవేని కారణాలతో కో-ఆప్షన్ సభ్యుని ఎన్నిక జరగకపోతే ఆ సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలి. *ఈఎన్నికకు సంబంధించి ప్రత్యేక సమావేశంలో ఎన్నికైన సభ్యుల్లో రెండింట మూడోవంతు కోరం తప్పనిసరిగా ఉండాలి. దీనికోసం గంట సమయాన్ని కేటాయిస్తారు. అప్పటికీ కోరం లేకపోతే మరుసటి రోజుకు సమావేశాన్ని వాయిదా వేస్తారు. ఆరోజు కూడా పరిస్థితిలో మార్పురాకపోతే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నిక నిర్వహిస్తారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక ఇలా... *పంచాయతీ రాజ్ చట్టం 1994, సెక్షన్ 149 (1) (వీ)ప్రకారం ప్రతి మండలానికి ఒక మైనార్టీని కో-ఆప్షన్ సభ్యునిగా ఎన్నుకోవాలి. కో-ఆప్షన్ సభ్యునిగా ఎన్నుకునే వ్యక్తికి 21 ఏళ్లు నిండి ఆదే మండలంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. *సెక్షన్ 153 (1)ప్రకారం మండలంలో అధ్యక్ష, ఉపాధ్యక్షుల్ని సభ్యులు చేతులెత్తే పద్దతిలో ఎన్నుకోవాలి. గుర్తింపు పొందిన పార్టీలు జారీ చేసిన విప్ మేరకే అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. విప్‌ను దిక్కరించిన వారి సభ్యత్వాన్ని రద్దుచేసే అధికారం ఆయా పార్టీలకు ఉంటుంది. -
మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కేదెవరికో!
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందో అంతు చిక్కడం లేదు. తమ పార్టీవారే చైర్మన్‌గా ఎన్నికవుతారని ఎవరికి వారు మద్ధతు కూడగట్టుకునే పనిలో బిజీ అయ్యారు. చైర్మన్ ఎన్నికకు గడువు సమీపిస్తుండడంతో నేతల్లో టెన్షన్ మొదలైంది. ఎప్పటికప్పుడు స్థానిక రాజకీయాల్లో మార్పులు వస్తుండడంతో ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారో అంతు చిక్కడం లేదు. మరోవైపు అభ్యర్థులు జారిపోకుండా ఉండేందుకుగాను చైర్మన్ స్థానాన్ని ఆశిస్తున్న నాయకులు గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తీసుకవెళ్లారు. పాలకవర్గం ఎన్నిక గడువు తేదీ పెరగడంతో క్యాంపు భారం భరించలేకపోతున్నామని కొందరు నేతలు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో స్పష్టమైన మెజార్టీ ఏ పార్టీకి రాకపోవడంతో చైర్మన్‌గా ఎవరు ఎన్నికయ్యేది అంతు చిక్కడం లేదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఫలితాలు వెల్లడించిన ఐదు రోజుల్లోనే చైర్మన్‌తో పాటు వైస్ చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. కాగా చైర్మన్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎమ్మెల్యేకు ఓటు హక్కు ఉండడంతో ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం అనంతరం ప్రభుత్వం ఏర్పాటయ్యాకనే ఎమ్మెల్యేలకు ఓటు వేసే ఆవకాశం ఉంటుంది. దీంతో వచ్చే నెల 2న కొత్త ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడనుంది. ఇందుకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సైతం అదే రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం వచ్చే నెల 5, 9 తేదీల్లో మున్సిపల్ చైర్మన్‌కు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది. కాగా 31 వార్డులకు గాను 11 వార్డుల్లోనే గెలిచిన కాంగ్రెస్ పార్టీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే మరో ఐదుగురు సభ్యుల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన నలుగురితో పాటు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు ఉందనే ధీమాతో తామే చైర్మన్ పదవిని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుండగా ఎంఐఎం సైతం టీఆర్ఎస్ మద్దతుతో తాము చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉంది. 8 స్థానాల్లో గెలిచిన ఎంఐఎం టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు సభ్యులతో పాటు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులతో పాటు కాంగ్రెస్‌లోని కొందరు తమకు మద్దతు ఇస్తున్నట్లు ఎంఐఎం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిన్నమొన్నటి వరకు బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. తాజాగా తాను బీజేపీలో చేరడం లేదని ఆయన ప్రకటించడంతో ఆ ప్రభావం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎన్నికపై పడుతుంది బీజేపీని విమర్శించిన జగ్గారెడ్డికి ఎలా మద్దతు ఇస్తారని బీజేపీ నేతలే పేర్కొం టున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థికి బీజేపీ మద్దతు ఇస్తుందో లేదో అంతు చిక్కడం లేదు. విప్ గండం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో తొలిసారిగా విప్ జారీ చేయనున్నారు. దీంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఇతరులకు మద్దతిచ్చే సమయంలో విప్ మేరకే గెలిచిన అభ్యర్థులు పార్టీ అధిష్టాన సూచన మెరకే ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ పార్టీ ఆదేశాన్ని ధిక్కరిస్తే అనర్హుడిగా ప్రకటించే ఆవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర పార్టీలకు స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో తొలిసారిగా విప్ జారీ చేయనున్నారు. ఈ విధానాన్ని అనుసరిస్తే మున్సిపాల్టీకి ఎన్నికలు అనివార్యం కావచ్చని చెప్పవచ్చు. కాంగ్రెస్, టీడీపీలతో సహా ఎంఐఎం సైతం కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజునే విప్ జారీ చేయనున్నట్లు టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇదివరలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ ఎంపిలకు విప్ జారీ
-
కాంగ్రెస్ ఎంపిలకు విప్ జారీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ లోక్‌సభ సభ్యులకు విప్ జారీ చేశారు. కాంగ్రెస్ ఎంపిలు వారం రోజులపాటు సభకు విధిగా హాజరుకావాలని తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు సభకు తప్పనిసరిగా హాజరుకావాలని మూడు లైన్లు ఉన్న ఆ విప్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)పై రేపు లోక్‌సభలో చర్చ జరుగుతుంది. యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రేపు లోక్‌సభలో మాట్లాడే అవకాశం ఉంది. -
బిల్లును గట్టెక్కించేందుకు ఎమ్మెల్యేలకు విప్ జారీ!
హైదరాబాద్ : తెలంగాణ బిల్లును అసెంబ్లీలో గట్టెక్కించేందుకు పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అవకాశం లేకపోలేదని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. ఈ సమావేశంలోనే తెలంగాణ బిల్లుకు అందరు డిమాండ్ చేస్తున్నారని, వీలు కాకపోతే ప్రత్యేక సమావేశాలు పెట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు. హైదరాబాద్‌పై జీవోఎం పెట్టిన సూచనలపై ఉన్న అభ్యంతరాలపై గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు, నాయకులతో సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ భేటీ కానున్నట్లు దానం తెలిపారు. -
కీలక బిల్లలు కోసం ఎంపీలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ
యూపీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆహారభద్రత బిల్లు సహా పలు కీలకమైన బిల్లులు ఆమోదం పొందాల్సి ఉండటం, మరోవైపు తెలంగాణ, ఇతర అంశాల కారణంగా పార్లమెంటు ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో ఎంపీలందరికీ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. సోమవారం నుంచి వరుసగా వారం రోజుల పాటు పార్టీ ఎంపీలందరూ తప్పనిసరిగా సభలోనే ఉండాలంటూ మూడు వాక్యాలతో కూడిన విప్‌ను జారీ చేసింది. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో సభలో ఉండటమే కాక, ప్రభుత్వానికి అన్ని రకాలుగా సాయపడాలని కూడా అందులో తెలిపారు. జన్మాష్టమి సందర్భంగా పార్లమెంటుకు బుధవారం సెలవు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఆహార భద్రతా బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ నానా తంటాలు పడుతోంది. ఈ బిల్లు సోమవారమే చర్చకు రానుంది. రాష్ట్రానికి చెందిన 12 మంది సీమాంధ్ర ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయడంతో, ఇక సోమవారం నుంచి రాష్ట్ర విభజన అంశం సభను ఇబ్బంది పెట్టకపోవచ్చని కాంగ్రెస్ పార్టీ ఆశాభావంలో ఉంది. శనివారం మూడు బిల్లులను ఆమోదించారు. ఈవారంలో ఆహార భద్రతా బిల్లుతో పాటు భూసేకరణ బిల్లు కూడా చర్చకు రానుంది. ఈ రెండు బిల్లలు వచ్చే ఎన్నికల్లో తమకు బాగా ఉపయోగపడతాయని కాంగ్రెస్ భావిస్తోంది. ఆహార భద్రతాబిల్లుకు పలు పార్టీలు అనేక సవరణలు సూచించడంతో ఇక మరే పార్టీ ఈ బిల్లుకు అడ్డం చెప్పబోదని కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు. ఈ సమావేశాలకు భారీ ఎజెండా ఉండటంతో, సమావేశాలను సెప్టెంబర్ ఐదో తేదీ వరకు పొడిగిస్తారని భావిస్తున్నారు.