సాక్షి, అనంతపురం : కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సభలో వీగిపోవటం ఖాయమని స్పష్టం చేశారు. రాజకీయ వాతావరణం బాగాలేదంటూ టీడీపీ వైఖరిపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అందుకే పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావడంలేదని జేసీ తెలిపారు. అవిశ్వాస తీర్మానం వల్ల చర్చ మాత్రమే జరుగుతుందన్నారు.
విప్ జారీపై..
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ జరగునున్న నేపథ్యంలో టీడీపీ, ఆ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విప్‌పై జేసీ స్పందిస్తూ.. విప్ జారీ చేసినా పార్లమెంటుకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. అవిశ్వాసంపై చర్చలో ఇద్దరు లేదా ముగ్గురు టీడీపీ ఎంపీలు మాట్లాడతారని పేర్కొన్నారు. నాకంటే ఇంగ్లిష్, హిందీ బాగా మాట్లాడేవారు ఉన్నారని జేసీ వ్యంగ్యంగా స్పందించారు. ఓ వైపు కేంద్రంపై పోరాటం చేస్తున్నామని బీరాలు పలుకుతున్న టీడీపీ.. సొంత పార్టీ ఎంపీ వ్యాఖ్యలతో ఇబ్బందుల్లో పడింది. ఇతర పార్టీల మద్దతు కూడగడతామంటూ పైకిచెబుతున్నా.. అవిశ్వాసానికి సొంత నేతల మద్దతే టీడీపీకి లేదని జేసీ వ్యవహారం చాటుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment