
గుడివాడ మున్సిపాలిటీ
సాక్షి, కృష్ణా : గుడివాడ మున్సిపాలిటీలో టీడీపీ కుట్ర రాజకీయం ఫలించింది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ అడపా బాబ్జీపై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం రేపటికి వాయిదా పడింది. శనివారం వైఎస్సార్ సీపీకి చెందిన మున్సిపల్ వైస్ ఛైర్మన్ అడపా బాబ్జీపై అవిశ్వాస తీర్మానం బెడిసికొట్టడంతో రేపటికి వాయిదా పడేలా టీడీపీ కుట్రలు రచించింది. కౌన్సిల్‌లో బలం లేకపోయిన ఇటీవల వైఎస్సార్ సీపీ నుంచి చేరిన ఛైర్మన్, కౌన్సిలర్లపై నమ్మకంతో టీడీపీ అడపా బాబ్జీపై అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఈ అవిశ్వాస తీర్మానాన్ని టీడీపీలో చేరిన కౌన్సిలర్లు వ్యతిరేకించారు.
అవిశ్వాస తీర్మానానికి గైర్హాజరు కావాలని ఫిరాయింపు కౌన్సిలర్లు నిర్ణయించుకున్నారు. ఇద్దరు కౌన్సిలర్లు టీడీపీ నేతలకు అందుబాటులో లేకుండా ఫోన్లు స్విచ్చాఫ్ చేయగా కౌన్సిలర్లు కనిపించటం లేదని వారి కుటుంబసభ్యులతో గుడివాడ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. ఇరువురు కౌన్సిలర్లు కనపడటం లేదనే ఫిర్యాదు రావటంతో ఈ రోజు జరగాల్సిన అవిశ్వాసం ఓటింగ్ సమావేశం ఆదివారానికి వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment