
తమ ఎంపీలకు బీజేపీ మూడు లైన్ల విప్ జారీచేసింది.
న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాల నేపథ్యంలో శుక్రవారం, సోమవారం సభకు తప్పనిసరిగా హాజరుకావాలని తమ ఎంపీలకు బీజేపీ మూడు లైన్ల విప్ జారీచేసింది. కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలోనే ఈ విప్ జారీచేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పార్టీ నియమనిబంధనలు, ఆదేశాలకనుగుణంగా ఓటేయాలని కోరుతూ మూడు లైన్ల విప్‌ను జారీచేస్తారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 542 లోక్‌సభ స్థానాలకుగానూ బీజేపీ 303 సీట్లు గెలుచుకుంది. (చదవండి: ‘మూకదాడుల’ బిల్లు జాడేది?)