
సాక్షి,తాడేపల్లి: ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు స్వీకరించిన తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిర్ల జగ్గిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం క్యాంపు కార్యాలయం గురువారం కలిశారు. తనను చీఫ్ విప్‌గా నియమించినందుకు సీఎం జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ విప్‌గా చిర్ల జగ్గిరెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.