chirla jaggi reddy
-
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్, కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులుగా చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా డా. పినిపే శ్రీకాంత్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్, క్రమశిక్షణా కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు.'పొలిటికల్ అడ్వైజరీ కమిటీ' పునర్వ్యవస్థీకరణవైఎస్సార్‌సీపీలో 'పొలిటికల్ అడ్వైజరీ కమిటీ' పూర్తిస్థాయి పునర్వ్యవస్థీకరణ జరిగింది. 33 మంది నాయకులను PAC మెంబర్లుగా పార్టీ నియమించింది. PAC శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, PAC కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు.PAC మెంబర్లు1. తమ్మినేని సీతారాం2. పీడిక రాజన్న దొర3. బెల్లాన చంద్రశేఖర్4. గొల్ల బాబురావు, ఎంపీ5. బూడి ముత్యాలనాయుడు6. పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ7. పినిపే విశ్వరూప్8. తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ9. ముద్రగడ పద్మనాభం10. పుప్పాల శ్రీనివాసరావు (వాసు బాబు)11. చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు12. కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని)13. వెలంపల్లి శ్రీనివాస్14. జోగి రమేష్15. కోన రఘుపతి16. విడదల రజిని17. బొల్లా బ్రహ్మనాయుడు18. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎంపీ19. నందిగం సురేష్ బాబు20. ఆదిమూలపు సురేష్21. పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్22. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి23. కళత్తూరు నారాయణ స్వామి24.ఆర్కే రోజా25. వైఎస్ అవినాష్ రెడ్డి, ఎంపీ26. షేక్ అంజాద్ బాషా27. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి28. అబ్దుల్ హఫీజ్ ఖాన్29. మాలగుండ్ల శంకర నారాయణ30. తలారి రంగయ్య31. వై.విశ్వేశ్వర రెడ్డి32. మహాలక్ష్మి శ్రీనివాస్33. సాకే శైలజానాథ్ -
చంద్రబాబు మాటలకు అర్ధాలే వేరులే... జగ్గిరెడ్డి అదిరిపోయే సెటైర్లు
-
దళిత యువకుల అరెస్టులో.. పోలీసుల తీరుపై జగ్గిరెడ్డి ఆగ్రహం
కొత్తపేట/రావులపాలెం: కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం వివాదంలో అమాయకులైన దళిత యువకుల అరెస్టులో పోలీసుల తీరుపై స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గోపాలపురం వద్ద ఒక ఫాస్ట్‌పుడ్ సెంటర్లో ఈనెల 5న డిస్పోజబుల్ ప్లేట్లపై అంబేడ్కర్ చిత్రం ఉండటంపై తలెత్తిన వివాదం కేసులో ఒక వర్గానికి చెందిన ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయగా, మరో వర్గానికి చెందిన 18 మంది దళిత యువకులపై కేసులు నమోదుచేసి రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా వైఎస్సార్సీపీ ప్లీనరీలో నిమగ్నమైన ప్రభుత్వ విప్ ఆదివారం రావులపాలెం చేరుకున్నారు. దళిత యువకుల అరెస్టుపై ఆరా తీశారు. ఈ విషయంలో పోలీసులు అత్యుత్సాహంతో అమాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారంటూ దళిత నాయకులు, పార్టీ కార్యకర్తలతో రావులపాలెం సెంటర్లోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు. తానులేని సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ వివాదాన్ని రాజకీయం చేస్తూ వైఎస్సార్సీపీకి, తనకు ఆపాదించేందుకు ప్రయత్నించారని ఆయన మండిపడ్డారు. తమ కుటుంబం ఆది నుంచీ దళిత పక్షపాతిగా సాగుతోందన్నారు. తానులేని సమయంలో జరిగిన ఘటనను కుట్రపూరితంగా గోరంతను కొండంత చేసి రాజకీయంగా బురదజల్లేందుకు ప్రయత్నించడం తగదని జగ్గిరెడ్డి ఖండించారు. అరెస్టయిన 18 మంది దళిత యువకుల్లో తమ గ్రామానికి చెందిన వారు 10 మంది ఉన్నారని.. అలాగే, పార్టీకి చెందిన వారు మొత్తం 14 మంది ఉన్నారన్నారు. కేసు విషయంలో పోలీసులు అత్యుత్సాహంగా చూపి కేసులు నమోదు చేయడాన్ని నిరసించారు. దళిత యువకుల అరెస్టులో తన ప్రమేయం ఉన్నట్లు ప్రతిపక్షాలు రుజువు చేయాలని ఆయన సవాల్ విసిరారు. అనంతరం.. రావులపాలెం పోలీస్‌స్టేషన్ వద్ద కొద్దిసేపు నిరసన వ్యక్తంచేసి ఎస్సై చాంబర్ వద్ద బైఠాయించారు. అమలాపురం డీఎస్పీ వై. మాధవరెడ్డి, సీఐ వెంకటనారాయణ స్టేషన్‌కు చేరుకుని జగ్గిరెడ్డితో చర్చలు జరిపారు. దళిత యువకులకు న్యాయం చేస్తా : విక్టర్‌ప్రసాద్ ఇక ఈ ఘటనలో అరెస్టయిన దళిత యువకులకు న్యాయం చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం. విక్టర్‌ప్రసాద్ హామీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరం నుంచి గోపాలపురం చేరుకున్న ఆయన బాధితులతో సమావేశమై వివాదంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమ కేసుల్లో అరెస్టయిన దళిత యువకులను వారం రోజుల్లో బయటకు తీసుకువచ్చేందుకు ఎస్సీ కమిషన్ ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. ఈయన వెంట రామచంద్రపురం ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యం, అమలాపురం డీఎస్పీ వై. మాధవరెడ్డి, సీఐ వెంకటనారాయణ తదితరులు రాగా వారిని స్థానిక దళితులు వ్యతిరేకిస్తూ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో విక్టర్ ప్రసాద్ ఒక్కరే దళితులతో సంప్రదింపులు జరిపారు. -
కొత్త రెవెన్యూ డివిజన్: కొత్తపేటకు పచ్చజెండా
కొత్తపేట(కోనసీమ జిల్లా): కోనసీమ జిల్లాలోని మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తపేట కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీనిపై ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డికు అభినందనలు తెలుపుతున్నారు. కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో ఇప్పటికే అమలాపురం, రామచంద్రపురం రెవెన్యూ డివిజన్లు ఉండగా కొత్తగా కొత్తపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ గత నెల 30న ప్రభుత్వం నిర్ణయించింది. చదవండి: AP: నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం.. సీఎస్ కీలక ఆదేశాలు దీంతో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యాన అధికార వైఎస్సార్ సీపీతో పాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు, స్థానికులు సంబరాలు జరుపుకొన్నారు. కొత్తపేటలో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటుకు ఎమ్మెల్యే, అమలాపురం ఆర్డీఓ వసంతరాయుడు కలిసి 31న పలు భవనాలను పరిశీలించారు. దేవదాయ, ధర్మదాయ శాఖ పరిధిలోని ఎంవీఎస్ సుబ్బరాజు కల్యాణ మంటపం అనువైనదిగా నిర్ణయించారు. వెనువెంటనే ఆ భవనానికి ‘రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కార్యాలయం, కొత్తపేట, కోనసీమ జిల్లా’ పేరుతో బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అయితే సాంకేతిక కారణాలతో కొత్తపేట డివిజన్ ప్రస్తావన లేకుండా అమలాపురం, రామచంద్రపురం డివిజన్లతోనే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంతవరకూ అమలాపురం డివిజన్లో ఉన్న కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం మండలాలతో పాటు రాజమహేంద్రవరం డివిజన్లో ఉన్న ఆలమూరు మండలాన్ని రామచంద్రపురం డివిజన్లో కలుపుతూ ఈ నెల 3న గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. దీంతో సుబ్బరాజు కల్యాణ మంటపానికి ఏర్పాటు చేసిన ‘కొత్తపేట రెవెన్యూ డివిజన్ బోర్డు’ కూడా తొలగించారు. ఇదీ.. రెవెన్యూ డివిజన్ పరిధి కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగ్గిరెడ్డి.. గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన రోజు ఉదయమే ఎమ్మెల్యే జగ్గిరెడ్డి హుటాహుటిన విజయవాడ వెళ్లారు. డివిజన్ ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని నేరుగా కలిశారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై హామీ పొందారు. చివరకు జగ్గిరెడ్డికి ఇచ్చిన మాట ప్రకారం కొత్తపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రజల ఆకాంక్ష నెరవేరింది కొత్తపేట కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ప్రజల ఆకాంక్ష నెరవేరింది. పూర్వపు తాలూకా, పంచాయతీ సమితి కేంద్రంగా ఒక వైభవం, వెలుగు వెలిగిన కొత్తపేటకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో పునర్వైభవం వస్తుంది. నేను ఎప్పుడూ నియోజకవర్గ అభివృద్ధినే కాంక్షించాను. ఇందుకు అనుగుణంగానే ముందుకు వెళుతున్నాను. కొత్తపేట రెవెన్యూ డివిజన్‌కు క్యాబినెట్లో ఆమోద ముద్ర వేసిన సీఎం జగన్మోహన్రెడ్డికి, సహకరించిన సజ్జల రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు. – చిర్ల జగ్గిరెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, కొత్తపేట -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి
సాక్షి,తాడేపల్లి: ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు స్వీకరించిన తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిర్ల జగ్గిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం క్యాంపు కార్యాలయం గురువారం కలిశారు. తనను చీఫ్ విప్‌గా నియమించినందుకు సీఎం జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ విప్‌గా చిర్ల జగ్గిరెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
కొత్తపేటలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి ప్రచారం
-
చిక్కని చిరుత
తూర్పుగోదావరి, ఆత్రేయపురం: చిరుతపులి ఆచూకీ కోసం బుధవారం మూడురోజూ వేట కొనసాగింది. అటవీ, పోలీసు శాఖ అధికారులు చిరుత పులిని పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. స్థానిక ప్రజలు పొలాల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారు. అంకంపాలెం గ్రామంలో ఈనెల 4న చిరుతపులి బీభత్సం సృష్టించి నలుగురిని గాయపరిచి చెట్టుపైకి చేరిన సంగతి పాఠకులకు విదితమే. చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికార్లు లైట్లు ఆపివేయడంతో చిరుత తప్పించుకుని పొలాల్లోకి పారిపోయింది. అప్పటి నుంచి అధికారులు చిరుతను ఎలాగైనా పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చిరుతపులి దాడిలో గాయపడిన వ్యక్తులు రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడో రోజు బుధవారం కాకినాడ అటవీ శాఖ రేంజ్ బృందం ఆపరేషన్ కొనసాగించింది. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఈ ప్రాంత ప్రజల భయాందోళనపై స్పందిస్తూ వెంటనే ప్రభుత్వం ప్రత్యేక బృందాలను పంపి చిరుత పులి ఆచూకీ పసిగట్టి పట్టుకోవాలన్నారు. మూడు రోజుల నుంచి ప్రభుత్వ ఉదాసీన వైఖరి కారణంగా కొందరు చిరుత పులి దాడికి గురయ్యారన్నారు. ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు చేపట్టకుండా కేవలం పది మందితో కంటి తుడుపు చర్యలు చేపట్టడం దురదృష్టకరం అన్నారు. ప్రజల్లో ఆందోళన.. మూడు రోజుల నుంచి అటవీ శాఖ సాంకేతిక సిబ్బందిని రంగంలోకి దించకుండా, చిరుతపులిని పట్టుకోకుండా, కాలక్షేపం చేయడంపై ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతానికి సమీపంలో గౌతమీ, వశిష్టా గోదావరి సమీపంలో ఉండడంతో చిరుతపులి పారిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అటవీ శాఖ నిపుణులు తెలియజేస్తున్నారు. చిరుత పులిని ఇప్పట్లో బంధించే అవకాశాలు లేకపోవడంతో కంటి మీద కునుకు లేకుండా ఈ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలంవెల్లదీస్తున్నారు. -
వ్యవస్థను చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నారు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు ప్రజా వ్యతిరేక విధానాలపై 8నుంచి ‘గడపగడపకూ వైఎస్సార్ సీపీ’ రావులపాలెం: రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఆయన మీడియాను నియంత్రిస్తారు, న్యాయ వ్యవస్థను లెక్కచేయరని ఆరోపించారు. జిల్లా అధ్యక్ష పదవి చేపట్టాక శనివారం తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన కన్నబాబుకు రావులపాలెంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన జరిగిన కొత్తపేట నియోజకవర్గ నాయకుల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కన్నబాబు కు నాయకులను ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పరి చయం చేశారు. అనంతరం కన్నబాబు మాట్లాడుతూ తునిలో మత్స్యకారులపై ఒక సామాజిక వర్గం దాడులు చేసి 72 మందిని గాయపరిచినప్పటికీ, దానిలో మంత్రి సోదరుడి పాత్ర ఉన్నట్టు బాధితులు చెబుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడే లేరన్నారు. ముద్రగడ దీక్ష చేసినా, రైతులుధర్నాలు చేసినా, ఏసమస్య వచ్చినా వెనుక జగన్మోహన్రెడ్డి ఉన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారన్నారు. ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలతో ఎవరు ఇబ్బందులు పడినా వారికి అండగా ఉంటానని జగన్ స్పష్టంగా చెప్పారన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొనివారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చేందుకు ఈనెల 8వ తేదీ నుంచి గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలన్నారు. అనంతరం ఆయన కొత్తపేట నియోజకవర్గంలో తలెత్తిన ప్రొటోకాల్ వివాదంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఏ పార్టీ ఎమ్మెల్యేకైనా బాధ్యతలు, హక్కులు ఒకే విధంగా ఉంటాయన్నారు. ఎమ్మెల్సీలకే ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే అన్ని చోట్లా అదే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. శిలాఫలకాలపై టీడీపీ కార్యకర్త అనే పదవి రాసుకునే స్థాయికి వ్యవస్థను ప్రభుత్వం దిగజార్చిందన్నారు. ఎమ్మెల్యేకే సభాధ్యక్షునిగా మొదటి ప్రాధాన్యత ఉంటుందనే స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని, వాటిని మార్చాలనుకుంటే జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలే పార్టీకి బలం: ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ప్రలోభాలకు లొంగి కొందరు నాయకులు పార్టీని వీడి వెళ్లినప్పటికీ కార్యకర్తలు మాత్రం పార్టీని వెన్నంటి ఉన్నారని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అన్నారు. కార్యకర్తలకు ఏం జరిగినా చూస్తు ఊరుకోబోమని వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీటీసీ సభ్యుడు సాకా ప్రసన్నకుమార్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్ రాజు, ప్రచార కార్యదర్శి మునుసూరి వెంకటేశ్వరరావు, సేవాదళ్ జాయింట్ సెక్రటరీ చల్లా ప్రభాకరరావు, జిల్లా సేవాదళ్ విభాగం కన్వీనర్ మార్గన గంగాధరరావు, ఇండస్ట్రియల్ విభాగం కన్వీనర్ మంతెన రవిరాజు పాల్గొన్నారు. -
మీకు దమ్ముంటే..
కొత్తపేట నియోజకవర్గంలోని వాడపాలెం గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలీసు జులుంను ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గట్టిగా ఖండించారు. టీడీపీ నేతల చెప్పుచేతల్లో నడుస్తూ అమాయకులపై ప్రతాపం చూపిస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే తనను అరెస్టు చేయాలని ఎస్సైని సవాల్ చేశారు. కొత్తపేట : ‘ఎస్సై గారు.. వాడపాలెంలో గొడవేంటి? గొడవకు కారణమైన వ్యక్తి ఏడీ? అతడిని అరెస్టు చేశారా? చేయరు, ఎందుకంటే అతడు టీడీపీ వ్యక్తి కాబట్టి. మీరు చేసిందేమిటి? మీ ప్రతాపం ప్రదర్శించడానికి.. ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీకి చెందిన యువకులు, అయ్యప్ప భక్తులే కనిపించారా?’ అంటూ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి.. ఎస్సై డి.విజయకుమార్‌ను నిలదీశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. వాడపాలెం గ్రామంలో ఆదివా రం కనకదుర్గాదేవి ఊరేగింపు సందర్భంగా వైఎ స్సార్ సీపీకి చెందిన యువకుడు ఉత్సవ కమిటీ అనుమతితో సౌండ్‌సిస్టం ఏర్పాటుచేశాడు. ఆ వ్యాన్‌కు అతడి పేరున ఫ్రెండ్ సర్కిల్ ఫ్లెక్సీ తగి లించారు. అది ఇష్టం లేని టీడీపీకి చెందిన వ్యక్తి దానిని చింపేయడంతో వివాదం తలెత్తింది. వైఎస్సార్ సీపీకి చెందిన యువకుడు ఫోన్ చేయగా, పోలీసులు వచ్చి అక్కడున్న వారిని చెదరగొట్టా రు. గుర్తు తెలియని వ్యక్తి విసిరిన రాయి తగిలి ఎస్సైకి స్వల్ప గాయమైంది. దాంతో పోలీసులు వారికి సమీపంలో ఉన్న ఫిర్యాదుదారుడు, వైఎ స్సార్ సీపీకి చెందిన అయ్యప్ప భక్తులపై తమ ప్ర తాపం చూపించారు. సంఘటన స్థలంలో లేనివారినీ అదుపులోకి తీసుకున్నారనేది ఆరోపణ. బాధితులకు పరామర్శ కాగా మంగళవారం హైదరాబాద్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి వాడపాలెం వెళ్లి బాధిత యువకుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాయకులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఎస్సై పక్షపాత ధోరణిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘టీడీపీకి వ్యతిరేకంగా, తనకు అనుకూలంగా ఓటు వేశారనే కక్షతో ఆ నాయకులు చెప్పిన వారిని అరెస్టు చేస్తారా? మీరు ఉద్యోగమనేది చేస్తున్నారా? మీకు, మీ పోలీస్ అధికారులకు దమ్ము, ధైర్యం ఉంటే నన్ను అరెస్టు చేయండి’ అని సవాల్ విసిరారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి తమ వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడితే.. చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు. వాడపాలెంలో తమ వారిని వదిలేది లేదంటే.. వారి తరఫున తానే వస్తానని చెప్పారు. తనపై ప్రతాపం చూపండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎప్పుడూ తప్పును సమర్ధించేది లేదని స్పష్టం చేశారు. గొడవకు కారణమైన వ్యక్తిని, మిమ్మల్ని కొట్టిన వ్యక్తిని ఎప్పుడు అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అతడికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేస్తారా అని నిలదీశారు. అతడి కోసం గాలిస్తున్నామని, ఊర్లో లేడని, ఎట్టి పరిస్థితుల్లోను రెండు రోజుల్లో అరెస్టు చేస్తామని ఎస్సై చెప్పారు. అనంతరం జగ్గిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ఇంతటితో వదలనని చెప్పారు. డీజీపీ దృష్టికి తీసుకువెళతానని, అలాగే పార్టీ రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకువెళ్లి.. కొత్తపేటలో అధికార పార్టీ ఆగడాలు, వారికి తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులపై ప్రతిఘటన కార్యక్రమం చేపడతానని హెచ్చరించారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, మండల అధ్యక్షుడు ముత్యాల వీరభద్రరావు, జిల్లా సభ్యుడు బండారు కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు -
వైఎస్ఆర్ నుంచి బాబు 'ఆ ఒక్కటి' నేర్చుకోలేదు
హైదరాబాద్: ప్రస్తుతం అధికారంలో ఉన్న వ్యక్తి... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అనుయాయుడే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మంగళవారం అసెంబ్లీలో జగ్గిరెడ్డి మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు... పాదయాత్రులు చేయడం వైఎస్ఆర్ను చూసి నేర్చుకున్నారని... అలాగే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకాలు చేయడం కూడా వైఎస్ఆర్ను చూసి నేర్చుకున్నారని గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి మహానేత వైఎస్ఆర్ అని జగ్గిరెడ్డి తెలిపారు. మాట నిలబెట్టుకోవడం వైఎస్ఆర్ను చూసి చంద్రబాబు నేర్చుకుని ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. పోలవరం కోసం వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. గతంలో రాష్ట్రాన్ని చంద్రబాబు తొమ్మిదేళ్లు పరిపాలించారు. ఆ కాలంలో డెల్టా ప్రాంతానికి చంద్రబాబు చేసిన కేటాయింపులు ఏమిటని ఈ సందర్బంగా జగ్గిరెడ్డి ప్రశ్నించారు. కరకట్టల కోసం రూ. 350 కోట్లు వైఎస్ఆర్ హయాంలో కేటాయించారని చెప్పారు. సర్ ఆర్థర్ కాటన్ తర్వాత... డెల్టాకు అంత ఖర్చు చేసింది వైఎస్ఆర్ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. పట్టిసీమ ద్వారా చేయాలనుకున్నది పోలవరం ద్వారా సాధ్యమవుతుందని వెల్లడించారు. అలాంటప్పుడు పోలవరం ప్రాజెక్టును ఎందుకు పక్కన పెడుతున్నారని జగ్గిరెడ్డి.... చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 22 శాతం అధికంగా టెండర్లు ఎందుకు ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాధనం లూటీ చేసే అధికారం ఎవరు ఇస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డెల్టా రైతులను మోసం చేసేలా ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. రిజర్వాయర్‌లో నీటిని తోడేసేలా తక్కువ ఎత్తులో మోటార్లను అమరుస్తున్నారని విమర్శించారు. 13 మీటర్ల దిగువకు మోటార్లను అమర్చడం రైతులను ఇబ్బందిపెట్టడం కాదా అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
చంద్రబాబు 'ఆ ఒక్కటి' నేర్చుకోలేదు
-
‘ఎమ్మెల్యేనైన నాకు చెప్పరా?’
ఆలమూరు :‘‘నియోజకవర్గంలో ఏం జరుగుతుంతో ముందుగా నాకు తెలియాలి... అటువంటిది నాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా అభివృద్ధి కార్యక్రమాల షెడ్యూల్‌ను ఎలా రూపొం దించారు. మీకసలు ప్రొటోకాల్ పద్ధతులు తెలుసా? తెలియకపోతే నేర్చుకోండి’’ అంటూ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధికారులపై మండిపడ్డారు. ఒకానొక దశలో ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమ షెడ్యూల్‌ను నిర్ణయించిన తర్వాత తనను సంప్రదించడాన్ని ఆయన తప్పుబట్టారు. వివరాల్లోకి వెళితే... నియోజకవర్గంలోని కొత్తపేట, ఆలమూరు మండలాల్లో మంగళవారం జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పలు గ్రామాల్లో సుమారు రూ.రెండు కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఉన్నత పాఠశాలల్లోని అదనపు భవనాలు, గ్రంథాలయాలకు శంకుస్థాపనలు చేశారు. అయితే ఈ కార్యక్రమ షెడ్యూల్‌ను రాష్ట్ర విద్య, సంక్షేమ మౌలిక వసతుల సంస్థ (ఏపీఈడబ్ల్యూఐడీ సీ) అధికారులు ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఖరారు చేశారు. దీంతో ఆయన హైదరాబాద్ ప్రయాణాన్ని వాయిదా వేసుకుని హడావుడిగా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రొటోకాల్ నిబంధనలపై అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఎవరిని అడిగి ఈ కార్యక్రమాల షెడ్యూల్‌ను రూపొందించారని ఏపీడబ్ల్యూఐడీసీ డీఈ ఎం.మంజూష, ఏఈ జి.నాగేంద్రబాబులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా అంతిమంగా నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని వ్యాఖ్యానించారు. జెడ్పీ చైర్మన్ రాంబాబు సమక్షంలో ఈ ప్రొటోకాల్ రగడ జరిగినా ఆయన స్పందించకపోవడం గమన్హారం. వైఎస్సార్సీపీ నాయకురాలు కొల్లి నిర్మలకుమారి, మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాసు, నెక్కంటి వెంకట్రాయుడు, చల్లా ప్రభాకరరావు పాల్గొన్నారు. -
'కోనసీమ గ్రామాలు గెయిల్ దత్తత తీసుకోవాలి'
తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని అన్ని గ్రామాలను గ్యాస్ అథారటీ ఆఫ్ ఇండియా (గెయిల్) సంస్థ దత్తత తీసుకునేలా చర్యలు చేపట్టాలని కొత్తపేట ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సిహెచ్. జగ్గిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కాకినాడలో రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎన్. చినరాజప్పను జగ్గిరెడ్డి కలిశారు. 'నగరం' బాధితులకు అందాల్సిన సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాని కోరారు. అలాగే గ్యాస్ పైప్‌లైన్ ఉన్న గ్రామాలలోని ప్రతి ఒక్కరికి బీమా చేయించాలని వినతి పత్రం అందజేశారు. జీసీఎస్లు, చమురు కేంద్రాలున్న ప్రాంతాలలో స్థానికులకు ఏ రకమైన భద్రత కల్పిస్తారో వివరించాలని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. -
మా వనరులు గుజరాత్‌కు తరలిస్తారు కాని, మాకు రక్షణ ఇవ్వరా?
-
అభివృద్ధిలో నేదురుమల్లి ముద్ర
జ్ఞాపకాలు సాక్షి, రాజమండ్రి: మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి శుక్రవారం మృతిచెందిన విషయాన్ని తెలుసుకొని ఈ ప్రాంతంతో ఆయనకు గల అనుబంధాన్ని జిల్లావాసులు నెమరు వేసుకున్నారు. ఆయన హయాంలో జిల్లా అభివృద్ధిలో కీలకమనదగ్గ పనులు ప్రారంభించారు. రాజమండ్రిలో 1991లో గోదావరి పుష్కరాలను ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తండ్రి చిర్ల సోమసుందరరెడ్డితో జనార్దనరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. పుష్కరాలకు వచ్చిన సందర్భంగా ఆయన గోపాలపురం వెళ్లి సోమసుందరరెడ్డిని కలుసుకున్నారు. ఇదే ఏడాది ఏలేశ్వరంలో ఏలేరు ప్రాజెక్టును ఆయన జాతికి అంకితం చేశారు. జనార్దనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 1992 జూన్ 26న పి.గన్నవరంలోని కొత్త ఆక్విడెక్టుకు శంకుస్థాపన చేశారు. నక్సలైట్ల అణచివేత 1990 డిసెంబర్ 17న ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన నేదురుమల్లి అధికారంలో ఉన్న కాలంలో నక్సలైట్ ఉద్యమంపై ఉక్కుపాదం మోపారు. 1991 సంవత్సరంలో ఏఓబీలో సుమారు 250 మంది పౌరులు, 75 మంది పోలీసు జవానులు, 102 మంది నక్సలైట్లు మరణించారు. ఈ కాలంలో వీరిపై ఉక్కుపాదం మోపి రైతు కూలీ సంఘాలను అణచివేశారు. లొంగుబాట్లకు వెసులుబాటు కల్పించారు. 1992లో సుమారు 9,000 మంది పోలీసులకు లొంగిపోయారు. వీరిలో నక్సలైట్ క్యాడర్‌తో పాటు, మిలిటెంట్లు, సానుభూతిపరులు ఉన్నారు. అప్పటి నుంచి బలం, బలగం తగ్గడంతో ఉద్యమం కూడా బలహీనపడుతూ వచ్చింది.