'కోనసీమ గ్రామాలు గెయిల్ దత్తత తీసుకోవాలి' | GAIL adoptes to konaseema villages, demands Kothapeta MLA Chirla Jaggi reddy | Sakshi
Sakshi News home page

'కోనసీమ గ్రామాలు గెయిల్ దత్తత తీసుకోవాలి'

Published Sun, Jul 6 2014 12:24 PM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM

'కోనసీమ గ్రామాలు గెయిల్ దత్తత తీసుకోవాలి'

'కోనసీమ గ్రామాలు గెయిల్ దత్తత తీసుకోవాలి'

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని అన్ని గ్రామాలను గ్యాస్ అథారటీ ఆఫ్ ఇండియా (గెయిల్) సంస్థ దత్తత తీసుకునేలా చర్యలు చేపట్టాలని కొత్తపేట ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సిహెచ్. జగ్గిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కాకినాడలో రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎన్. చినరాజప్పను జగ్గిరెడ్డి కలిశారు.

 

'నగరం' బాధితులకు అందాల్సిన సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాని కోరారు. అలాగే గ్యాస్ పైప్లైన్ ఉన్న గ్రామాలలోని ప్రతి ఒక్కరికి బీమా చేయించాలని వినతి పత్రం అందజేశారు. జీసీఎస్లు, చమురు కేంద్రాలున్న ప్రాంతాలలో స్థానికులకు ఏ రకమైన భద్రత కల్పిస్తారో వివరించాలని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement