దేశంలో స్థిరమైన ఇంధన పరిష్కారాల అభివృద్ధికి గెయిల్ (ఇండియా) లిమిటెడ్, ఏఎం గ్రీన్ బీవీ (AMG) సంస్థలు జట్టుకట్టాయి. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈమిథనాల్ ఉత్పత్తి కోసం కార్బన్ డయాక్సైడ్ (CO2) దీర్ఘకాలిక సరఫరా, దేశం అంతటా హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అన్వేషణపై భాగస్వామ్యం దృష్టి సారిస్తుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో గెయిల్ తెలిపింది.
గెయిల్ డైరెక్టర్ (బిజినెస్ డెవలప్‌మెంట్) రాజీవ్ సింఘాల్ సమక్షంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (బిజినెస్ డెవలప్‌మెంట్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ & ప్రొడక్షన్) సుమిత్ కిషోర్, ఏఎం గ్రీన్ గ్రూప్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఒప్పందంలో భాగంగా ఈమిథనాల్‌ను ఉత్పత్తి కోసం కార్బన్ డయాక్సైడ్ దీర్ఘకాలిక సరఫరా కోసం అధ్యయనాలను చేపట్టాలని రెండు కంపెనీలు భావిస్తున్నాయి. ప్రతిపాదిత ఇమిథనాల్ ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టడానికి గెయిల్‌కి కూడా ఈక్విటీ ఆప్షన్ ఉంటుంది. అలాగే దేశం అంతటా 2.5 గిగావాట్స్ వరకు సోలార్/విండ్ హైబ్రిడ్ పునరుత్పాదక ప్రాజెక్టుల ఏర్పాటును సంయుక్తంగా అన్వేషించాలని ఇరు సంస్థలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment