హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక విద్యుత్ సొల్యూషన్స్ అందించే ఆర్సెడో సిస్టమ్స్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు సైయంట్ డీఎల్‌ఎం వెల్లడించింది. దీని ప్రకారం, సైయంట్ డీఎల్‌ఎంకి చెందిన మైసూర్ యూనిట్‌లో ఆర్సెడో 500 కేడబ్ల్యూపీ సామర్ద్యం గల రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది.
ప్లాంటు డిజైన్, ఇంజినీరింగ్, ఇన్‌స్టాలేషన్, నిర్వహణ బాధ్యతలు తీసుకుంటుంది. దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రాతిపదికన ఈ ప్రాజెక్టు ఉంటుంది. ఇందులో ఉత్పత్తయ్యే సౌర విద్యుత్‌ను సైయంట్ డీఎల్‌ఎం కొనుగోలు చేస్తుంది. విద్యుత్ వ్యయాలను గణనీయంగా తగ్గించుకునేందుకు, పర్యావరణ అనుకూల విధానాల వినియోగాన్ని పెంచుకునేందుకు ఇది తోడ్పడుతుందని సైయంట్ డీఎల్‌ఎం సీఈవో ఆంథోనీ మోంటల్‌బానో, ఆర్సెడో సిస్టమ్స్ సీఈవో సందీప్ వంగపల్లి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment