partnership
-
కొఠారి ఇండస్ట్రియల్‌లో ఎఫ్జేకు వాటా
చెన్నై: నాన్‌లెదర్ ఫుట్‌వేర్, డ్రోన్ల తయారీ కంపెనీ కొఠారి ఇండస్ట్రియల్ కార్పొరేషన్లో ఖతార్ సంస్థ ఎఫ్‌జే గ్లోబల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ 10 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. కంపెనీ బోర్డు ఇందుకు ఆమోదముద్ర వేసినట్లు కొఠారి ఇండస్ట్రియల్ పేర్కొంది.వెరసి కొఠారి ఇండస్ట్రియల్‌లో దోహా బ్యాంక్, ఖతార్ ఎయిర్వేస్ సంస్థల ప్రమోటర్ ఎఫ్‌జే గ్లోబల్ 70,56,000 షేర్లను సొంతం చేసుకోనుంది. రూ. 5 ముఖ విలువగల ఒక్కో షేరునూ రూ. 25 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు కొఠారి వెల్లడించింది. మరోపక్క అధీకృత మూలధనాన్ని రూ. 25 కోట్ల నుంచి రూ. 75 కోట్లకు పెంచేందుకు సైతం బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు కంపెనీ తెలియజేసింది.అయితే ప్రమోటర్ రఫీఖ్ అహ్మద్ కంపెనీలో 47 శాతం వాటాను నిలుపుకునేందుకుగాను మరిన్ని పెట్టుబడులు చేపట్టనున్నట్లు పేర్కొంది. కాగా.. ఫుట్‌వేర్ తయారీ సంస్థ ఫీనిక్స్ కొఠారి ఫుట్‌వేర్‌లో అహ్మద్ 30 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు సైతం బోర్డు అనుమతించినట్లు కొఠారి ఇండస్ట్రియల్ వెల్లడించింది. బీఎస్ఈలో కొఠారి ఇండస్ట్రియల్ 2% బలపడి రూ. 72.5 వద్ద ముగిసింది. -
ఆర్సెడో సిస్టమ్స్‌తో సైయంట్ ఎంవోయూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక విద్యుత్ సొల్యూషన్స్ అందించే ఆర్సెడో సిస్టమ్స్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు సైయంట్ డీఎల్ఎం వెల్లడించింది. దీని ప్రకారం, సైయంట్ డీఎల్ఎంకి చెందిన మైసూర్ యూనిట్లో ఆర్సెడో 500 కేడబ్ల్యూపీ సామర్ద్యం గల రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది.ప్లాంటు డిజైన్, ఇంజినీరింగ్, ఇన్స్టాలేషన్, నిర్వహణ బాధ్యతలు తీసుకుంటుంది. దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రాతిపదికన ఈ ప్రాజెక్టు ఉంటుంది. ఇందులో ఉత్పత్తయ్యే సౌర విద్యుత్‌ను సైయంట్ డీఎల్ఎం కొనుగోలు చేస్తుంది. విద్యుత్ వ్యయాలను గణనీయంగా తగ్గించుకునేందుకు, పర్యావరణ అనుకూల విధానాల వినియోగాన్ని పెంచుకునేందుకు ఇది తోడ్పడుతుందని సైయంట్ డీఎల్ఎం సీఈవో ఆంథోనీ మోంటల్బానో, ఆర్సెడో సిస్టమ్స్ సీఈవో సందీప్ వంగపల్లి తెలిపారు. -
కార్మికశాఖ ఒప్పందం.. 5 లక్షల మందికి ప్రయోజనం
న్యూఢిల్లీ: మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ, మానవ వననరుల సేవలను అందించే టీమ్‌లీజ్ ఎడ్టెక్ చేతులు కలిపాయి. యూనివర్సిటీ విద్యార్థులకు నూతన కెరీర్ అవకాశాలు కల్పించేందుకు వీలుగా అవగాహన ఒప్పందం కుదిరింది.ఉపాధి ఆధారిత డిగ్రీ కార్యక్రమాలను ఆఫర్ చేయనున్నట్టు టీమ్‌లీజ్ ఎడ్టెక్ ప్రకటించింది. కేంద్ర ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ కెరీర్ సర్వీస్(ఎన్సీసీ) పోర్టల్‌పై 200 వరకు ఉపాధి ఆధారిత డిగ్రీ పోగ్రామ్‌లను అందించనున్నట్టు తెలిపింది. ప్రతి ప్రోగ్రామ్ విడిగా 5 లక్షల మందికి పైగా ఇంటర్న్‌షిప్ అవకాశాలతో అధ్యయన అవకాశాలు కల్పించనుంది.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాండవీయ మాట్లాడుతూ.. టీమ్‌లీజ్ సహకారంతో అందించే డిగ్రీ ప్రోగ్రామ్‌లు అభ్యాసంతోపాటు, ప్రత్యక్ష అనుభవాన్ని సమన్వయం చేస్తుందని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. -
హెచ్పీసీఎల్తో అమెజాన్ జట్టు
ముంబై: సుదూర రవాణా కోసం కర్బన ఉద్గారాలను తక్కువగా వెదజల్లే ఇంధనాల (లో కార్బన్ ఫ్యూయల్స్) అభివృద్ధి, వినియోగానికై ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకున్నట్టు ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ సోమవారం ప్రకటించింది.సుదూర రవాణాకు ఉపయోగించే వాహనాల్లో ఇంధనాలను పరీక్షించడానికి ఇరు సంస్థలు పైలట్‌ను నిర్వహిస్తాయి. కర్బన ఉద్గారాలను తక్కువగా వెదజల్లే ఇంధనాలను సులభంగా వినియోగించడానికి ఇంధన కేంద్రాలు, మొబైల్ రీఫ్యూయలింగ్ స్టేషన్ల ఏర్పాటు అవకాశాలను అన్వేíÙస్తామని అమెజాన్ ఇండియా తెలిపింది.ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, హర్యానాలోని బహదూర్‌గఢ్‌లో ఇంధన ఉత్పత్తికి వ్యవసాయ, పారిశ్రామిక వ్యర్థాలను ఉపయోగిస్తామని వివరించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇంధన కేంద్రాలు, మొబైల్ రీఫ్యూయలింగ్ స్టేషన్లను అభివృద్ధి చేయడంలో ఈ చొరవ సహాయపడుతుందని పేర్కొంది. -
బీమా విస్తరణకు టెల్కోల సాయం
ముంబై: దేశంలో బీమాను అందరికీ చేర్చేందుకు టెలికం, ఈ–కామర్స్, ఫిన్‌టెక్ కంపెనీలతో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ సీఈవో, ఎండీ సిద్ధార్థ మొహంతి అన్నారు. ‘ఏజెంట్లు, బ్రోకర్లు, బ్యాంక్–ఇన్సూరెన్స్‌తో సహా ప్రస్తుత ఛానెల్‌లు ప్రభావవంతంగా ఉన్నాయి. విస్తారమైన, మారుమూల గ్రామీణ మార్కెట్‌కు బీమాను విస్తరించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న విధానంలో పరిమితులు ఉన్నాయి. భవిష్యత్తులో సంప్రదాయేతర విధానాలను అమలు పర్చాల్సిందే. అందరికీ బీమాను చేర్చాలంటే పంపిణీ, మార్కెటింగ్ అంశాలను పునరాలోచించాలి. టెలికం, ఈ–కామర్స్, ఫిన్‌టెక్ వంటి సంప్రదాయేతర కంపెనీల సహకారంతోనే బీమా పాలసీలను పెద్ద ఎత్తున జారీ చేసేందుకు వీలవుతుంది. ఈ సంస్థలు దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకూ విస్తరించాయి. వీటితో భాగస్వామ్యం చేయడం ద్వారా సరసమైన, అందుబాటులో ఉండే కవరేజ్ అందరికీ లభిస్తుంది. కొత్త విధానాన్ని అనుసరించడం వల్ల వినియోగదారుల విభిన్న అవసరాలను తీర్చడానికి బీమా సంస్థలు పెద్ద ఎత్తున ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తాయి. 100 కోట్ల మందికిపైగా బీమా చేర్చడం అంత సులువు కాదు. గ్రామీణ, తక్కువ–ఆదాయ వర్గాలను చేరుకోవడానికి డిజిటల్ టెక్నాలజీ కీలకం. ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెరి్నంగ్, ఆటోమేషన్ వంటి సాంకేతికతలు, ప్లాట్‌ఫామ్‌లు మొత్తం బీమా రంగాన్ని విప్లవాత్మకంగా, మరింత కస్టమర్–ఫ్రెండ్లీగా మారుస్తున్నాయి’ అని సీఐఐ సదస్సులో వివరించారు. -
మైక్రోసాఫ్ట్‌తో ఇన్ఫోసిస్ పార్టనర్షిప్ విస్తరణ
గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం విస్తరిస్తున్నట్లు దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ప్రకటించింది. జనరేటివ్ ఏఐ, మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ప్లాట్ ఫామ్ అజూర్ల్లో గ్లోబల్ కస్టమర్ల దత్తత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.క్లౌడ్, ఏఐ వర్క్ లోడ్స్లో మైక్రోసాఫ్ట్ ఎంటర్ప్రైజెస్ కస్టమర్లకు వ్యూహాత్మ సరఫరాదారుగా మద్దతునిస్తామని ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఖర్చు తగ్గించడంతోపాటు చురుకుదనం, స్కేలబిలిటీని సాధించడంలో సహాయపడటానికి మైక్రోసాఫ్ట్ జనరేటివ్ ఏఐతో ఐపీ సొల్యూషన్ల పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది.ఇన్ఫోసిస్ టోపాజ్, ఇన్పోసిస్ కోబాల్ట్, ఇన్ఫోసిస్ ఆస్టర్ వంటి సొల్యూసన్స్ తో మైక్రోసాఫ్ట్ జనరేటివ్ ఏఐ ఆఫరింగ్స్ సమ్మిళితం చేస్తున్నారు. ఫైనాన్స్, హెల్త్ కేర్, సప్లయ్ చైన్, టెలీ కమ్యూనికేషన్స్ తదితర కీలక రంగాల కస్టమర్ల ఖర్చు తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ వెల్లడించాయి. -
భారత్‌తో భాగస్వామ్యం.. వైఖరి మార్చుకున్న బ్రిటన్ ప్రధాని!
లండన్: బ్రిటన్‌లో లేబర్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ ఎన్నిక అయ్యారు. అయితే గతంలో లేబర్ పార్టీ కశ్మీర్ విషయంలో తీవ్రమైన ఆరోపణలు చేయటంతో భారత్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా లేబర్ పార్టీ అధికారంలోకి రావటంతో భారత్‌తో భాగస్వాయం విషయం తెరపైకి వచ్చింది. అయితే లేబర్ పార్టీ గతంలో భారత్‌పై చేసిన ఆరోపణలు, వైఖరిని ప్రధాని కీర్ స్టార్మర్ మార్చుకున్నట్లు తెలుస్తోంది.2019లో లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్ వార్షిక సమావేశంలో భారత్‌లోని కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన చోటుచేసుకుందని, అక్కడి పరిస్థితిపై ఎమర్జెన్సీ తీర్మానం ప్రవేశపెట్టారు. జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేమయంలో లేబర్ పార్టీ చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. లేబర్ పార్టీ ఆరోపణలు సరైన సమాచారం లేని, నిరాధారమైనవి అని భారత్ మండిపడింది. అప్పట్లో జెరెమీ కార్బిన్‌పై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత సంతతి ఎంపీలు వ్యతిరేకించారు. జెరెమీపై చేసిన తీర్మానం భారత వ్యతిరేక విధానమని ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక..2020లో కొన్ని కారణాల వల్ల ఆయన్ను లేబర్ పార్టీ సస్పెండ్ చేసింది.అయితే కొత్తగా ఎన్నికైన ప్రధాని కీర్ స్టార్మర్ భారత్‌తో భాగస్యామ్యం, సంబంధాల విషయంలో తన పార్టీ వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా భారత్‌తో సంబంధాలు మెరుగుపర్చుకుంటామని తెలిపారు. గతంలో చేసిన ఆరోపణలపై తమ పార్టీ వైఖరీ మార్చుకుంటామని పేర్కొన్నారు. భారత్‌తో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగించాలనే నిబద్దతతో ఉన్నట్లు తెలిపారు. ‘‘ లేబర్ పార్టీ ఇతర దేశాలతో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాలను మెరుగుపర్చుకుంటుంది. స్వేచ్ఛా వాణిజ్యం, భద్రత, విద్య, టెక్నాలజీ, పర్యావరణ మార్పులు వంటి పలు రంగాల్లో మేము భారత్ కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాం’’ అని మేనిఫోస్ట్లో పేర్కొన్నారు. దీంతో లేబర్ పార్టీ తన భారత వ్యతిరేక వైఖరిని మార్చుకొని భాగస్వామ్య సంబంధాలు పెంచుకునే దిశగా వెళ్లుతున్నట్లు స్పష్టం అవుతోంది. -
జపాన్ ఎయిర్‌లైన్స్‌తో ఇండిగో కోడ్‌షేర్ ఒప్పందం
ముంబై: జపాన్ ఎయిర్‌లైన్స్‌తో (జేఏఎల్) కోడ్‌షేర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు దేశీ విమానయాన సంస్థ ఇండిగో వెల్లడించింది. ఇండిగో నెట్‌వర్క్‌లోని 14 ప్రాంతాలకు జేఏఎల్ సేవలు విస్తరించేందుకు ఇది ఉపయోగపడనుంది. జపాన్ ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం అది టోక్యో నుంచి ఢిల్లీ, బెంగళూరుకు ఫ్లయిట్ సరీ్వసులు అందిస్తోంది. ఈ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా పెద్ద నగరాలైన హైదరాబాద్, ముంబై, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, అమృత్సర్, కొచ్చి, కోయంబత్తూర్, తిరువనంతపురం, తిరుచిరాపల్లి, పుణె, లక్నో, వారణాసి తదితర ప్రాంతాలకు సరీ్వసులు విస్తరించేందుకు వీలవుతుంది. తదుపరి జేఏఎల్ నెట్వర్క్ రూట్లలో తమ సేవలు విస్తరించేందుకు ఇండిగో కోడ్õÙర్ కుదుర్చుకోనుంది. -
మరో గ్లోబల్ బ్రాండ్‌ను తీసుకొస్తున్న అంబానీ కంపెనీ
శ్రీలంక పురాతన పానీయాల బ్రాండ్‌ను ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కంపెనీ భారత్‌కు తీసుకొస్తోంది. శ్రీలంకకు చెందిన పానీయాల తయారీ సంస్థ ఎలిఫెంట్ హౌస్‌తో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) భాగస్వామ్యాన్ని ప్రకటించింది. నూతన ఉత్పత్తులను భారతీయులకు పరిచయం చేయనుంది. "భారతదేశం అంతటా ఎలిఫెంట్ హౌస్ బ్రాండ్ కింద పానీయాలను తయారు చేయడం, మార్కెట్ చేయడం, పంపిణీ చేయడం, విక్రయించడం" ఈ భాగస్వామ్యం లక్ష్యం అని రిలయన్స్ రిటైల్ ఒక ప్రకటనలో తెలిపింది. "ఈ భాగస్వామ్యం పెరుగుతున్న మా ఎఫ్ఎంసీజీ పోర్ట్‌ఫోలియోకు అత్యంత ఇష్టపడే పానీయాలను జోడించడమే కాకుండా నాణ్యమైన ఉత్పత్తుల ద్వారా మా భారతీయ వినియోగదారులకు గొప్ప ఎంపికను కూడా అందిస్తుంది" అని రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సీవోవో కేతన్ మోదీ పేర్కొన్నారు. ఇప్పటికే పలు ప్రఖ్యాత గ్లోబల్ బ్రాండ్లను భారత్‌కు తీసుకొచ్చిన రిలయన్స్.. 150 ఏళ్ల చరిత్ర ఉన్న పురాతన బేవరేజెస్ బ్రాండ్ ఎలిఫెంట్ హౌస్‌ను భారత్‌లో మరింత విస్తరించడానికి సన్నద్ధమైందని కేతన్ మోదీ తెలిపారు. కాగా రిలయన్స్ ఇప్పటికే క్యాంపా సొస్యో, రాస్కిక్ వంటి పానీయాల బ్రాండ్లను కలిగి ఉంది. -
మహీంద్రాతో ఎంబ్రేయర్ భాగస్వామ్యం
ముంబై: భారత వైమానిక దళం కోసం సీ–390 మిలీనియం మల్టీ మిషన్ రవాణా విమానాల కొనుగోళ్లకు సంబంధించిన మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంటీఏ) ప్రాజెక్ట్ కోసం ఎంబ్రేయర్ డిఫెన్స్, సెక్యూరిటీ తాజాగా మహీంద్రా గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలోని బ్రెజి ల్ దౌత్య కార్యాలయంలో ఈ మేరకు ఒప్పందంపై ఇరు సంస్థలు శుక్రవారం సంతకాలు చేశాయి. ఎంటీఏ ప్రాజెక్టులో భాగంగా తయారీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి దేశీయంగా ఉన్న ఏరోస్పేస్ పరిశ్రమతో ఎంబ్రేయర్, మహీంద్రా సంప్రదింపులు జరుపనుంది. సీ–390 విమానాల విషయంలో భవిష్యత్తు కేంద్రంగా భారత్‌ను మార్చగల సామర్థ్యాన్ని ఇరు సంస్థలు అన్వేషిస్తాయి. ‘సీ–390 మిలీనియం మార్కెట్లో అత్యంత అధునాతన మిలిటరీ ఎయిర్‌లిఫ్టర్. ఈ భాగస్వామ్యం ఐఏఎఫ్ కార్యాచరణ నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలతో సజావుగా సరిపోయే సమర్థవంత పారిశ్రామికీకరణ పరిష్కారాన్ని కూడా అందిస్తుందని నమ్ముతున్నాము’ అని మహీంద్రా ఏరోస్పేస్, డిఫెన్స్ బిజినెస్ ప్రెసిడెంట్ వినోద్ సహాయ్ ఈ సందర్భంగా తెలిపారు. కాగా, మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంటీఏ) కొనుగోలు ప్రాజెక్టులో భాగంగా భారత వైమానిక దళం (ఐఏఎఫ్) 40 నుంచి 80 విమానాలను కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసం భారత్‌కు సాంకేతిక బదిలీతోపాటు తయారీ వ్యవస్థ ఏర్పాటు కానుంది. 18 నుంచి 30 టన్నుల వరకు బరువు మోయగల విమానాలను ఐఏఎఫ్ సేకరించనుంది. -
అదానీ గ్రీన్‌కు టోటల్ ‘ఎనర్జీ’
న్యూఢిల్లీ: దేశీ ప్రయివేట్ రంగ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీలో ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ఎనర్జీస్ 30 కోట్ల డాలర్లు(సుమారు రూ. 2,500 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. తద్వారా పునరుత్పాదక ఇంధన భాగస్వామ్య సంస్థ(జేవీ)లో సమాన వాటా తీసుకుంది. అదానీ రెనెవబుల్ ఎనర్జీ నైన్ లిమిటెడ్(ఏఆర్ఈ9ఎల్) పేరుతో జేవీని ఏర్పాటు చేశాయి. 1,050 మెగావాట్ల ప్రాజెక్ట్ పోర్ట్‌ఫోలియోగల జేవీలో అదానీ గ్రీన్, టోటల్ఎనర్జీస్ 50:50 శాతం చొప్పున వాటాను తీసుకున్నాయి. అదానీ గ్రీన్‌కు ఏఆర్ఈ9ఎల్ అనుబంధ సంస్థకాగా.. 300 మెగావాట్ల నిర్వహణా సామర్థ్యంతోపాటు, 500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. మరో 250 మెగావాట్ల ప్రాజెక్టులు అభివృద్ధి దశలో ఉన్నట్లు అదానీ గ్రీన్ వెల్లడించింది. అదానీ గ్రీన్‌లో 19.75 శాతం వాటా కలిగిన టోటల్ఎనర్జీస్ గతంలో అదానీ గ్రీన్ ఎనర్జీ ట్వంటీ త్రీ(ఏజీఈ23) లిమిటెడ్‌లో ఇన్వెస్ట్ చేసింది. ఇది అదానీ గ్రీన్‌కు మరో అనుబంధ సంస్థ. కాగా.. నిర్మాణం, అభివృద్ధి దశలో ఉన్న ప్రాజెక్టులు వాణిజ్య ప్రాతిపదికన కార్యకలాపాలు ప్రారంభిస్తే కొన్ని ప్రమాణాలకు లోబడి టోటల్ఎనర్జీస్ తిరిగి జేవీకి అదనపు పెట్టుబడులను సమకూర్చనుంది. ఇంతక్రితం ఏజీఈ23ఎల్లో టోటల్ రూ. 4,013 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. తప్పనిసరిగా మారి్పడికి లోనయ్యే డిబెంచర్ల ద్వారా నిధులు సమకూర్చింది. టోటల్ పెట్టుబడుల నేపథ్యంలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు ఎన్ఎస్ఈలో స్వల్ప నష్టంతో రూ. 1,597 వద్ద ముగిసింది. -
Microsoft-OpenAI: రెండూ కలిస్తే ఏమవుతుంది?
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ భాగస్వామ్యాన్ని, దానికి సంబంధించిన ఇటీవల పరిణామాల్ని యూకే నియంత్రణ సంస్థ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ దిగ్గజ కంపెనీల కలయిక యూకేలోని కంపెనీ మధ్య పోటీపై ఎలాంటి ప్రభావం చూపనుందన్న అంశాన్ని గమనిస్తోంది. ఓపెన్ఏఐతో మైక్రోసాఫ్ట్ అనుబంధం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మార్కెట్‌ను ప్రభావితం చేయగలదా అని యూకేకి చెందిన కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (CMA) పరిశీలిస్తోంది. ఈమేరకు అభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది. అభిప్రాయ సేకరణ (ITC) అనేది సమాచార సేకరణ ప్రక్రియలో మొదటి భాగమని, అధికారికంగా మొదటిదశ విచారణకు ముందు చేపట్టే ప్రక్రియ అని సీఎంఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఓపెన్ఏఐలో ఇటీవల అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇందులో మైక్రోసాఫ్ట్ ప్రవేశించింది. ఈ పరిణామాల దృష్ట్యా మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ భాగస్వామ్యం, ఇటీవల పరిణామాలు కంపెనీల పోటీపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది తెలుసుకునేందుకు అభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది. ఓపెన్ఏఐలో నాటకీయ పరిణామాలు గత నెలలో ఓపెన్ఏఐ బోర్డు నాటకీయ చర్యలో సీఈవో సామ్ ఆల్ట్‌మన్‌ను తొలగించింది. తరువాత, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల తమ అధునాతన ఏఐ పరిశోధనకు నాయకత్వం వహించాలని ఆయను ఆహ్వానించారు. అయితే ఓపెన్ఏఐ పూర్తిగా కొత్త బోర్డ్‌తో ఆల్ట్‌మన్‌ను సీఈవోగా పునరుద్ధరించడంతో ఈ నాటకీయ పరిణామానికి ముగింపు పడింది. ‘ఏఐ డెవలపర్ల మధ్య నిరంతర పోటీ అవసరం. ఇది ఈ రంగంలో నూతన ఆవిష్కరణలు, వృద్ధి, బాధ్యతాయుతమైన అభ్యాసాలను అందించడంలో సహాయపడుతుంది’ సీఎంఏ అభిప్రాయపడింది. మైక్రోసాఫ్ట్-ఓపెన్ఏఐ భాగస్వామ్యం ఈ రంగంలో కంపెనీల మధ్య పోటీని దెబ్బతీసే ప్రమాదం ఉందా అని సీఎంఏ సమీక్షిస్తోంది. -
అమెజాన్ ద్వారా కారు కొనేయొచ్చు - పూర్తి వివరాలు
ఆన్లైన్ షాపింగ్ చేయాలంటే ముందుగా గుర్తొచ్చే ఫ్లాట్‌ఫామ్ అమెజాన్. ఇప్పటి వరకు ఫ్యాషన్, హోమ్ యుటిలిటీ, మొబైల్స్, టీవీలు వంటి వస్తువులను విక్రయించిన ఈ సంస్థ త్వరలో కార్లను కూడా విక్రయించడానికి సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకు ఈ కథనంలో తెలుసుకుందాం. అమెజాన్ కంపెనీ ఇప్పుడు వినియోగదారులకు వర్చువల్ షోరూం ఎక్స్పీరియన్స్ అందించడమే కాకుండా వివిధ బ్రాండ్లకు సంబంధించి కార్ల ధరలు, ఫీచర్ల వంటి వాటిని గురించి తెలియజేయడానికి హ్యుందాయ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెజాన్ ద్వారా కారు భాగాలను, ఇతర యాక్ససరీస్ కూడా కొనుగోలు చేసే సదుపాయం ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల కొనుగోలుదారులు మరింత సులభమైన షాపింగ్ అనుభూతిని పొందవచ్చు. ఈ అవకాశం వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అమెజాన్ ద్వారా లావాదేవీలు జరిగినప్పటికీ.. ఇందులో అసలు విక్రేత కంపెనీ అధికారిక డీలర్ ఉంటారు. అంటే డీలర్‌షిప్‌కి.. కస్టమర్‌కి మధ్య వారధిలా పనిచేస్తుంది. అయితే దీని ద్వారా వినియోగదారుడు కొన్ని అదనపు సౌకర్యాలను పొందవచ్చు. -
బొలీవియా కంపెనీతో చేతులు కలిపిన ఆల్ట్‌మిన్ - ఎందుకో తెలుసా?
దక్షిణ అమెరికాలో లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేయడానికి యాక్టివ్ మెటీరియల్స్ కోసం పైలట్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి బొలీవియన్ స్టేట్ కంపెనీ 'యాసిమియంటోస్ డి లిటియో బొలీవియానోస్' (YLB)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హైదరాబాద్ బేస్డ్ బ్యాటరీ యాక్టివ్ మెటీరియల్స్ తయారీ కంపెనీ ఆల్ట్‌మిన్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. ముడి పదార్థాల సరఫరాలను అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా.. లిథియం అయాన్ బ్యాటరీల కోసం కాథోడ్ యాక్టివ్ మెటీరియల్స్ (CAMs) ఉత్పత్తి కోసం ఈ ఒప్పదం జరిగినట్లు తెలుస్తోంది. స్వదేశీ లిథియం అయాన్ బ్యాటరీ తయారీలో పురోగతి కోసం ఏర్పడిన ఈ సహకారం మొదటిది. ఇది మొత్తం సరఫరా గొలుసును సానుకూలంగా ప్రభావితం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ భాగస్వామ్యం లిథియం కోసం పరిశోధన, అభివృద్ధి, పైలటింగ్ కార్యకలాపాలను మెరుగుపరచడం.. ద్వైపాక్షిక ముడి పదార్థాల సరఫరా గొలుసును ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. గత నెలలో YLB నుంచి కొంత మంది నిపుణుల బృందం హైదరాబాద్‌లోని ఆల్ట్‌మిన్ ప్రైవేట్ లిమిటెడ్ సందర్శించింది. ఆ తరువాత బొలీవియన్ ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ ఈ ఒప్పందాన్ని ఆమోదించుకోవడానికి, 'ఆల్ట్‌మిన్'ను బొలీవియాకు ఆహ్వానించింది. ఈ ఒప్పందం ఏర్పర్చుకున్న సందర్భంగా YLB ప్రెసిడెంట్ 'కార్లా కాల్డెరాన్' మాట్లాడుతూ.. ఈ సమావేశం లిథియం అయాన్ బ్యాటరీల క్రియాశీల పదార్థాల సాంకేతిక అభివృద్ధికి సహకారాన్ని అందిస్తుంది, పోటోసిలో పైలట్ ప్లాంట్‌ను అమలు చేయడం ద్వారా, పైలట్ ప్లాంట్ ఈ సంవత్సరం 3 గిగావాట్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఇదీ చదవండి: దీపావళికి నెట్లో ఎక్కువగా ఏం సర్చ్ చేసారంటే..? రివీల్ చేసిన సుందర్ పిచాయ్ ఆల్ట్‌మిన్ వ్యవస్థాపకుడు,ఎండీ 'మౌర్య సుంకవల్లి' మాట్లాడుతూ.. YLBతో చేతులు కలపడంతో ప్రపంచ బ్యాటరీ మార్కెట్లో కంపెనీ గొప్ప స్థానం పొందుతుందని భవిస్తున్నాము. 2030 నాటికి ఆల్ట్‌మిన్ 10 GWh LFPని ఉత్పత్తి చేయడానికి వీలు కల్పిస్తుందని వెల్లడిస్తూ.. ఖనిజ విభాగంలో రెండు దేశాల మధ్య ఏర్పడిన ఈ ఒప్పందం ఓ ముఖ్యమైన మైలురాయి అని తెలిపారు. -
భారత్‌లోకి దేవూ రీఎంట్రీ...
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా దిగ్గజం పోస్కో దేవూ తాజాగా భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈసారి కన్జూమర్ ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంపై దృష్టి పెట్టింది. కెల్వాన్ ఎల్రక్టానిక్స్ అండ్ అప్లయెన్సెస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. లిథియం హైబ్రిడ్ ఇన్వర్టర్లు, ఎల్ఈడీ టీవీలను విక్రయించే కెల్వాన్ .. కొత్తగా దేవూ బ్రాండ్ కింద ఇంధన, విద్యుత్ రంగానికి సంబంధించిన ఉత్పత్తులతో పాటు కన్జూమర్ ఎల్రక్టానిక్స్ను కూడా ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం విక్రయాల పరిమాణాన్ని బట్టి తాము సొంతంగా తయారీ ప్లాంటు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, మొత్తం మీద మార్కెటింగ్, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలు మొదలైన వాటిపై వచ్చే మూడేళ్లలో రూ. 300 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందని కెల్వాన్ ఎండీ హెచ్ఎస్ భాటియా తెలిపారు. భారత మార్కెట్లో వేగవంతమైన వృద్ధికి అవకాశాలు ఉన్నాయని, కెల్వాన్ ఎల్రక్టానిక్స్‌తో 10 ఏళ్ల పాటు బ్రాండ్ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నామని దేవూ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ చాన్ రియు తెలిపారు. తొలి దశలో కార్లు, ద్విచక్ర వాహనాలకు బ్యాటరీలను అందించడంతో పాటు సోలార్ బ్యాటరీలు, ఇన్వర్టర్లను కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో ఎల్ఈడీ టీవీలు, ఆడియో స్పీకర్లు, ఎయిర్ ప్యూరిఫయర్లు, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు మొదలైన గృహోపకరణాలను కూడా అందించే యోచ నలో ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ–బైక్‌లు, ఈ–సైకిల్స్నూ ఆవిష్కరించే ప్రణాళికలు ఉన్నట్లు చాన్ రియు వివరించారు. సియెలోతో ఎంట్రీ.. 1995లో దేవూ తొలిసారిగా సియెలో కారుతో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అటుపైన నెక్సియా, మ్యాటిజ్ కార్లను ప్రవేశ పెట్టింది. 2001లో దేవూకి సంబంధించిన చాలా మటుకు అసెట్స్‌ను జనరల్ మోటర్స్ కొనుగోలు చేసింది. అంతిమంగా 2003–04 నుంచి భారత్‌లో కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. రాబోయే రోజుల్లో భారత్‌లో ఎలక్ట్రిక్ టూ–వీలర్లకు గణనీయంగా డిమాండ్ పెరగవచ్చన్న అంచనాల నేపథ్యంలో, తిరిగి ఇన్నాళ్లకు మళ్లీ దేశీ మార్కెట్లోకి రావడంపై దేవూ కసరత్తు చేస్తోంది. -
ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ, కాగ్నిజెంట్ భాగస్వామ్యం
ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్, ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ విశాల్ సిక్కా జనరేటివ్ ఏఐ సేవలందించేలా భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. కాగ్నిజెంట్ సీఈవోగా రవికుమార్ నియమితులైన తర్వాత పోటీ కంపెనీలకు చెందిన ప్రముఖ ఎగ్జిక్యూటివ్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నారు. ప్రస్తుత తరుణంలో కాగ్నిజెంట్ వ్యాపారాన్ని, కస్టమర్ల సంఖ్యను వేగంగా పెంచటమే లక్ష్యంగా రవి కుమార్ పనిచేస్తున్నారు. కాగ్నిజెంట్ ఇప్పుడు ఇన్ఫోసిస్ మాజీ సీఈవో విశాల్ సిక్కాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇన్ఫోసిస్ సీఈవో పదవి నుంచి వైదొలిగిన తర్వాత విశాల్ సిక్కా వియానై సిస్టమ్స్‌ను స్థాపించారు. ఇప్పుడు కాగ్నిజెంట్, వియానై సిస్టమ్స్ వినియోగదారులకు నేరుగా జనరేటివ్ ఏఐ సేవలను అందించేందుకు జతకట్టాయి. వియానై సిస్టమ్స్ కు సంబంధించిన హిలా ఎంటర్ప్రైజ్ ప్లాట్‌ఫారమ్, కాగ్నిజెంట్ న్యూరో ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు ఏఐ సాంకేతికత ద్వారా వినియోగదారులకు సేవలను అందించనున్నాయి. -
‘ఇండియా’ కూటమిలోనే ఉంటాం: కేజ్రివాల్
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి తాము బయటకు వచ్చే ప్రసక్తే లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రివాల్ తేలి్చచెప్పారు. ఇండియా కూటమిలోనే భాగస్వామిగా ఉంటామని చెప్పారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. విపక్ష కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యరి్థగా మీ పేరును ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించగా... తామే ప్రధానమంత్రి అని దేశంలోని 140 మంది భారతీయులు భావించేలా ఒక వ్యవస్థను తయారు చేయాల్సిన అవసరం ఉందని కేజ్రివాల్ బదులిచ్చారు. కేవలం ఒక వ్యక్తిని కాదని, పౌరులందరినీ అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పారు. -
జూమ్‌కార్, టాటా పవర్ ఈవీ జోడీ
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు టాటా పవర్ ఈవీ చార్జింగ్ సొల్యూషన్స్ తాజాగా కార్ షేరింగ్ కంపెనీ జూమ్‌కార్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. జూమ్‌కార్ ప్రస్తుత, కొత్త ఈవీ కస్టమర్లు టాటా పవర్ ఈజీ చార్జ్ పాయింట్లను వినియోగించుకోవచ్చు. వచ్చే అయిదేళ్లలో దేశవ్యాప్తంగా 25,000 చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని టాటా పవర్ లక్ష్యంగా చేసుకుంది. భారత్, ఇండోనేíÙయా, ఈజిప్ట్‌లో జూమ్‌కార్‌కు 20,000 పైచిలుకు వినియోగదార్లు ఉన్నారు. -
200 ఈవీ చార్జింగ్ పాయింట్ల సూపర్ హబ్.. ఎక్కడ?
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాలకు చార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే దిశగా ఎలక్ట్రిక్ క్యాబ్ అగ్రిగేటర్ సంస్థ ప్రకృతి ఈ–మొబిలిటీ (ఎవెరా)తో చేతులు కలిపినట్లు అదానీ టోటల్ఎనర్జీస్ ఈ–మొబిలిటీ (ఏటీఈఎల్) తెలిపింది. దీనితో ఢిల్లీలో 200 ఈవీ చార్జింగ్ పాయింట్ల సూపర్ హబ్‌ను అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దేశవ్యాప్తంగా కూడా విస్తరించనున్నట్లు ఏటీఈఎల్ వివరించింది. అదానీ టోటల్ ఎనర్జీస్ ఈ-మొబిలిటీ లిమిటెడ్ అనేది అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్‌కు చెందిన విభాగం. ఇది భారతదేశంలో ఛార్జ్ పాయింట్లను నిర్వహిస్తోంది. -
స్కూఈవీతో జత కట్టిన క్వాంటమ్ ఎనర్జీ - కారణం ఇదేనా!
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన క్వాంటమ్ ఎనర్జీ.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రెంటల్ కంపెనీ (అద్దెకు ఇచ్చే) అయిన స్కూఈవీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని కింద క్వాంటమ్ ఎనర్జీ 1,000 యూనిట్ల ‘బిజినెస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను సమకూర్చనుంది. ఈ భాగస్వామ్యంపై క్వాంటమ్ ఎనర్జీ డైరెక్టర్ చేతన చుక్కపల్లి మాట్లాడుతూ.. ఈ కామర్స్ విభాగంలో పెరుగుతున్న డెలివరీ అవసరాలకు మెరుగైన పరిష్కారాలను అందించాలన్న ప్రయత్నమే స్కూఈవీతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంలో ఉద్దేశ్యమని చెప్పారు. లాస్ట్‌మైల్ డెలివరీని ఎలక్ట్రిక్‌గా మార్చడమే తమ సంయుక్త కృషి అని, ఇది బీటూబీ విభాగం మరింత బలోపేతానికి తోడ్పడుతుందన్నారు. బీటూబీ అవసరాలకు వీలుగా అత్యంత సమర్థతతో కూడిన, మన్నికైన ఈ–బైక్‌లను అందించడంలో క్వాంటమ్ ఎనర్జీ తమకు కీలక భాగస్వామి అని స్కూఈవీ రెంటల్స్ సీఈవో అమిత్ పేర్కొన్నారు. -
హౌసింగ్ డాట్ కామ్ ద్వారా వ్యక్తిగత రుణాలు
న్యూఢిల్లీ: ప్రాపర్టీ టెక్నాలజీ సంస్థ ‘హౌసింగ్ డాట్ కామ్’ ఫిన్‌బాక్స్ భాగస్వామ్యంతో వ్యక్తిగత రుణాలను ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. రూ.10 లక్షల వరకు రుణాలను తక్షణమే జారీ చేయనున్నట్టు తెలిపింది. రెంటల్ సెక్యూరిటీ డిపాజిట్, ఇంటి నవీకరణ, ఫరి్నచర్ కొనుగోలు అవసరాలను తీర్చేందుకు గాను కస్టమర్లకు రుణ సాయం అందించడమే తమ లక్ష్యమని పేర్కొంది. మరింత సౌకర్యవంతంగా డిజిటల్ రూపంలో రుణాల మంజూరుకు గాను ఈ సేవను తన యాప్, వెబ్‌సైట్‌తో అనుసంధానించనున్నట్టు ప్రకటించింది. హౌసింగ్ ఎడ్జ్ ద్వారా కస్టమర్లు ఈ సేవను పొందొచ్చని తెలిపింది. సంక్లిష్టమైన రుణ దరఖాస్తులకు కాలం చెల్లిపోయిందని, మొత్తం రుణ దరఖాస్తు ప్రక్రియను ఆన్లైన్లోనే 3 నిమిషాల్లోనే పూర్తయ్యేలా ఏర్పాటు చేసినట్టు హౌసింగ్ డాట్ కామ్ గ్రూప్ సీఈవో ధృవ్ అగర్వాల్ తెలిపారు. దరఖాస్తు ఆమోదం పొందిన 24 గంటల్లోనే రుణాన్ని మంజూరు చేయనున్నట్టు చెప్పారు. ఇళ్లకు సంబంధించి అన్ని అవసరాలను అందించే ఏకీకృత వేదికగా అవతరించడమే తమ లక్ష్యమని తెలిపారు. -
ఫోన్ పే గూగుల్ పే పేటియంల కొంపముంచిన జొమాాటో
-
బ్యాటింగ్‌లో రికార్డు భాగస్వామ్యం.. సిరీస్‌లో ఇదే తొలిసారి
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలిసారి బ్యాటింగ్‌లో ఒక రికార్డు నమోదైంది. గత మూడు టెస్టుల్లో బౌలింగ్‌లోనే రికార్డులు వచ్చాయి తప్పిస్తే బ్యాటింగ్‌లో పెద్ద సంచలనాలు నమోదు కాలేదు. తాజాగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తొలిసారి బ్యాటర్లు పరుగులు పండగ చేసుకుంటున్నారు. తొలిరోజు పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించిన ఆస్ట్రేలియా జట్టు రెండో రోజు ఆటలోనే అదే స్థిరత్వాన్ని కొనసాగిస్తుంది. ఓవర్‌నైట్ స్కోరు 255/4తో రెండోరోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ ప్రస్తుతం నాలుగు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఖవాజా 129, గ్రీన్ 65 పరుగులతో ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 126 పరుగులు అజేయంగా జోడించారు. ఈ సిరీస్‌లో ఈ భాగస్వామ్యమే ఇప్పటివరకు అత్యధికంగా ఉంది. ఇంతకముందు ఢిల్లీ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా బ్యాటర్లు అశ్విన్, అక్షర్‌లు కలిసి ఎనిమిదో వికెట్‌కు 114 పరుగులు జోడించడం బెస్ట్‌గా ఉంది. తాజాగా ఉస్మాన్ ఖవాజా, కామెరాన్ గ్రీన్‌లు దానిని బ్రేక్ చేశారు. పరిస్థితి చూస్తుంటే ఈ ఇద్దరు కలిసి డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పినా ఆశ్చర్యపోనవసరం లేదు. చదవండి: పాట్ కమిన్స్ తల్లి కన్నుమూత భారత్, ఆసీస్ నాలుగో టెస్టు.. రెండో రోజు లైవ్ అప్డేట్స్ -
స్టార్టప్‌లతో జత కలవండి, లేదంటే మీరు ఉన్న చోటే ..ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: స్టార్టప్‌లతో జత కలసి, అభివృద్ధి ప్రాజెక్టుల్లో వాటి సొల్యూషన్లు వినియోగించుకోవాలని దేశీ పరిశ్రమలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో పారిశ్రామిక వేదిక-సీఐఐ మంగళవారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక చర్చాగోష్టిలో ఆర్థికమంత్రి ప్రసంగించారు. పెట్టుబడుల ఇతోధికానికి వీలుగా సంప్రదాయానికి భిన్నమైన ఆలోచనలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. ‘‘స్టార్టప్‌లు వాటి సొల్యూషన్ల వేగాన్ని గమనిస్తే.. నిజానికి అవి మీ కోసమే. వారు సొల్యూషన్లను ఆవిష్కరించినంత వేగంగా మీరు కూడా ముందుకు కదలాలి. లేదంటే మీరు ఉన్న చోటే ఉంటారు. అప్పుడు అవి నూతన ఇండస్ట్రీ లేదా వ్యాపారాన్ని వెతుక్కుంటూ వెళతాయి. అందుకే ఉత్పత్తులు లేదా టెక్నాలజీ అవసరాల కోసం స్టార్టప్‌లతో కలసి పనిచేయాలి’’ అని ఆమె సూచించారు. ఉదయించే కొత్త రంగాలకు పీఎల్ఐ పథకం మంచి ప్రోత్సాహకంగా పేర్కొన్నారు. పీఎల్ఐ బయట ఏదైనా మంచి ఉత్ప్రేరకం ఉంటే సూచించాలని కోరారు. మూలధన వ్యయాన్ని తగ్గించే బడ్జెట్: అరవింద్ విర్మాణి ఇదిలావుండగా, 2023-24 బడ్జెట్లో ద్రవ్య స్థిరీకరణ చర్యలు తీసుకోవడం హర్షణీయ అంశమని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణి ఒక ఇంటర్వూలో పేర్కొన్నారు. భారతీయ కంపెనీలకు మూలధన వ్యయాన్ని తగ్గించడంలో బడ్జెట్ ఎంతగానో సహాయపడుతుందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 6.4శాతానికి కట్టడి చేస్తూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనిని మరింతగా 5.9 శాతానికి తగ్గించాలని బడ్జెట్లో నిర్దేశించిన సంగతి తెలిసిందే. దీనితోపాటు మౌలిక రంగం పురోగతి లక్ష్యంగా మూలధన వ్యయాలను 33 శాతం పెంచి రూ.10 లక్షల కోట్లకు చేరడం దేశ పురోభివృద్ధికి దోహదపడే అంశమని అన్నారు. కొన్ని రాష్ట్రాలు పాత పెన్షన్ విధానానికి మళ్లుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఇది సరికాదని అన్నారు. కొత్త పెన్షన్ విధానం ఒక గొప్ప సంస్కరణ అని ఆయన అన్నారు. గత నెల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 2022–23 జీడీపీ అంచనాలను 6.8 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తిరిగి దీనిని బహుళజాతి బ్యాంకింగ్ సంస్థ తిరిగి ఎగువముఖంగా సవరిస్తుందని తాను విశ్వసిస్తున్నానని తెలిపారు. -
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో చేతులు కలిపిన తనిష్క్
హైదరాబాద్: ప్రీమియం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో రిటైల్ జ్యువెలరీ బ్రాండ్ తనిష్క్ చేతులు కలిపింది. వివాహ వేడుకల వేళ ఓటీటీ వేదికగా ‘ద గ్రేట్ ఇండియన్ బ్రైడ్’ పేరుతో సరికొత్త షోను విడుదల చేయనుంది. దేశంలో భిన్న సంస్కృతి, విభిన్న ప్రాంతాలకు చెందిన ఐదుగురు వధువులు తనిష్క్ కో-బ్రాండ్ రివా రూపొందించిన వివాహ ఆభరణాలను ధరించి తమ పెళ్లి నాటి అనుభూతులను నటి శ్రియా పిల్గాంకర్తో పంచుకోనున్నారు. (దోమలను తోలేసినంత తేలిగ్గా ఉద్యోగ కోతలు, ఎన్నాళ్లీ వేట?) ప్రతి సంప్రదాయానికి ఆభరణం రివా అనే ట్యాగ్‌లైన్‌తో కంటెంట్‌ను అత్యంత సృజనాత్మకంగా డిజైన్ చేశామని టైటాన్ మార్కెటింగ్ జీఎం రంజనీ కృష్ణస్వామి తెలిపారు. ‘‘టైటాన్ వంటి సుప్రసిద్ధ బ్రాండ్‌తో కలిసి పనిచేయడంతో పాటు వినూత్న కథనం ద్వారా సబ్స్క్రైబర్లతో మా బంధం మరింత బలపడుతుంది’’ అని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. (మరో టెక్ దిగ్గజం సంచలన నిర్ణయం: ఉద్యోగులకు ఇక గడ్డుకాలమేనా?)