చెన్నై: నాన్‌లెదర్ ఫుట్‌వేర్, డ్రోన్ల తయారీ కంపెనీ కొఠారి ఇండస్ట్రియల్ కార్పొరేషన్‌లో ఖతార్ సంస్థ ఎఫ్‌జే గ్లోబల్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ 10 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. కంపెనీ బోర్డు ఇందుకు ఆమోదముద్ర వేసినట్లు కొఠారి ఇండస్ట్రియల్ పేర్కొంది.
వెరసి కొఠారి ఇండస్ట్రియల్‌లో దోహా బ్యాంక్, ఖతార్ ఎయిర్‌వేస్ సంస్థల ప్రమోటర్ ఎఫ్‌జే గ్లోబల్ 70,56,000 షేర్లను సొంతం చేసుకోనుంది. రూ. 5 ముఖ విలువగల ఒక్కో షేరునూ రూ. 25 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు కొఠారి వెల్లడించింది. మరోపక్క అధీకృత మూలధనాన్ని రూ. 25 కోట్ల నుంచి రూ. 75 కోట్లకు పెంచేందుకు సైతం బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు కంపెనీ తెలియజేసింది.
అయితే ప్రమోటర్ రఫీఖ్ అహ్మద్ కంపెనీలో 47 శాతం వాటాను నిలుపుకునేందుకుగాను మరిన్ని పెట్టుబడులు చేపట్టనున్నట్లు పేర్కొంది. కాగా.. ఫుట్‌వేర్ తయారీ సంస్థ ఫీనిక్స్ కొఠారి ఫుట్‌వేర్‌లో అహ్మద్ 30 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు సైతం బోర్డు అనుమతించినట్లు కొఠారి ఇండస్ట్రియల్ వెల్లడించింది. బీఎస్‌ఈలో కొఠారి ఇండస్ట్రియల్ 2% బలపడి రూ. 72.5 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment