అమెజాన్ ద్వారా కారు కొనేయొచ్చు - పూర్తి వివరాలు | Hyundai Becomes Amazon Official Launch Partner For Vehicle Sales In Second Half Of 2024 - Sakshi
Sakshi News home page

Amazon-Hyundai Partnership: అమెజాన్ ద్వారా కారు కొనేయొచ్చు - పూర్తి వివరాలు

Published Fri, Nov 17 2023 9:02 PM | Last Updated on Sat, Nov 18 2023 11:19 AM

Amazon Hyundai Partnership Details - Sakshi

ఆన్‌లైన్ షాపింగ్ చేయాలంటే ముందుగా గుర్తొచ్చే ఫ్లాట్‌ఫామ్ అమెజాన్. ఇప్పటి వరకు ఫ్యాషన్, హోమ్ యుటిలిటీ, మొబైల్స్, టీవీలు వంటి వస్తువులను విక్రయించిన ఈ సంస్థ త్వరలో కార్లను కూడా విక్రయించడానికి సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకు ఈ కథనంలో తెలుసుకుందాం. 

అమెజాన్ కంపెనీ ఇప్పుడు వినియోగదారులకు వర్చువల్ షోరూం ఎక్స్‌పీరియన్స్ అందించడమే కాకుండా వివిధ బ్రాండ్లకు సంబంధించి కార్ల ధరలు, ఫీచర్ల వంటి వాటిని గురించి తెలియజేయడానికి హ్యుందాయ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. 

అమెజాన్ ద్వారా కారు భాగాలను, ఇతర యాక్ససరీస్ కూడా కొనుగోలు చేసే సదుపాయం ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల కొనుగోలుదారులు మరింత సులభమైన షాపింగ్ అనుభూతిని పొందవచ్చు. ఈ అవకాశం వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడం..

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అమెజాన్ ద్వారా లావాదేవీలు జరిగినప్పటికీ.. ఇందులో అసలు విక్రేత కంపెనీ అధికారిక డీలర్ ఉంటారు. అంటే డీలర్‌షిప్‌కి.. కస్టమర్‌కి మధ్య వారధిలా పనిచేస్తుంది. అయితే దీని ద్వారా వినియోగదారుడు కొన్ని అదనపు సౌకర్యాలను పొందవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement