![Amazon ties up with HPCL](/styles/webp/s3/article_images/2024/10/29/amazon-and-hpcl.jpg.webp?itok=_IUzLWB-)
ముంబై: సుదూర రవాణా కోసం కర్బన ఉద్గారాలను తక్కువగా వెదజల్లే ఇంధనాల (లో కార్బన్ ఫ్యూయల్స్) అభివృద్ధి, వినియోగానికై ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకున్నట్టు ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ సోమవారం ప్రకటించింది.
సుదూర రవాణాకు ఉపయోగించే వాహనాల్లో ఇంధనాలను పరీక్షించడానికి ఇరు సంస్థలు పైలట్‌ను నిర్వహిస్తాయి. కర్బన ఉద్గారాలను తక్కువగా వెదజల్లే ఇంధనాలను సులభంగా వినియోగించడానికి ఇంధన కేంద్రాలు, మొబైల్ రీఫ్యూయలింగ్ స్టేషన్‌ల ఏర్పాటు అవకాశాలను అన్వేíÙస్తామని అమెజాన్ ఇండియా తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, హర్యానాలోని బహదూర్‌గఢ్‌లో ఇంధన ఉత్పత్తికి వ్యవసాయ, పారిశ్రామిక వ్యర్థాలను ఉపయోగిస్తామని వివరించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇంధన కేంద్రాలు, మొబైల్ రీఫ్యూయలింగ్ స్టేషన్లను అభివృద్ధి చేయడంలో ఈ చొరవ సహాయపడుతుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment