HPCL
-
టెర్మినల్ నుంచి బంక్ దాకా ప్రతీ చుక్కకూ లెక్క!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనంలో ఇంధనం కావాల్సి వస్తే సమీపంలోని ఫిల్లింగ్ స్టేషన్‌కు వెళతాం. పెట్రోల్ లేదా డీజిల్ కావాల్సినంత కొట్టించి డబ్బులు కట్టి బయటకు వస్తాం. ఇందులో కొత్తేమి ఉంది అనే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం.. ఎక్కడో తయారైన ఇంధనం వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి మనదాకా వస్తోంది. ఈ ప్రయాణంలో నాణ్యత, పరిమాణంలో ఎటువంటి రాజీ లేకుండా కస్టమర్‌కు కల్తీ లేని ఇంధనం చేరేందుకు చమురు కంపెనీలు, డీలర్లు నిరంతరం తీసుకుంటున్న చర్యల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? రిఫైనరీ నుంచి టెర్మినల్.. అక్కడి నుంచి ఫిల్లింగ్ స్టేషన్ (Filling Station). ఇలా వినియోగదారుడి వాహనంలోకి ఇంధనం చేరే వరకు కంపెనీల నిఘా కళ్లు వెంటాడుతూనే ఉంటాయన్న సంగతి చాలా మందికి తెలియదు. తేడా వస్తే రద్దు చేస్తారు.. చక్రం తిరిగితేనే వ్యవస్థ పరుగెడుతుంది. ఇంధన అమ్మకాలు పెరిగాయంటే ఆర్థిక వ్యవస్థ బాగున్నట్టు. అందుకే ఆయిల్ కంపెనీలు బాధ్యతగా వ్యవహరిస్తున్నాయి. సాంకేతికతను ఆసరాగా చేసుకుని దేశంలోని మారుమూలన ఉన్న పల్లెకూ నాణ్యమైన ఇంధనాన్ని చేర్చాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాయి. పరిమాణంలో తేడా రాకుండా న్యాయబద్ధంగా కస్టమర్ చెల్లించిన డబ్బులకు తగ్గట్టుగా ఇంధనం అందిస్తున్నాయి. పైగా ప్రభుత్వ నియంత్రణలోనే చమురు వ్యాపారాలు సాగుతుంటాయి. దీంతో రెవెన్యూ, పోలీసు, తూనికలు కొలతల శాఖకు చెందిన అధికారులు సైతం తనిఖీలు చేపడుతుంటారు. ఈ క్రమంలో ఏమాత్రం తప్పు జరిగినా ఆయిల్ కంపెనీలు కఠిన చర్యలకు దిగుతున్నాయి. ఫిల్లింగ్ స్టేషన్లో స్టాక్‌లో కొద్ది తేడా వచ్చినా భారీ జరిమానా లేదా డీలర్షిప్ రద్దుకు వెనుకాడడం లేదు. ఇంధనం రవాణా చేసే ఏజెన్సీలు చేతివాటం ప్రదర్శిస్తే బ్లాక్ లిస్టులో పెడతాయి. దేశవ్యాప్తంగా ఉన్న 88 వేల బంకుల్లో ఎక్క డో ఒక దగ్గర జరిగిన తప్పును మొత్తం పరిశ్రమకు ఆపాదించకూడదన్నది కంపెనీలు, డీలర్ల వాదన. ఫిల్లింగ్ స్టేషన్లలో ఇవి తప్పనిసరి → మంచి నీరు → వాష్ రూమ్స్ → ఫిర్యాదుల పుస్తకం → ఫస్ట్ ఎయిడ్ → ఫ్రీ ఎయిర్ కోసం టైర్ ఇన్‌ఫ్లేటర్ → సీసీ కెమెరాలు → ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఇసుకటెర్మినల్ నుంచి బంక్ దాకా.. అయిల్ కంపెనీకి చెందిన టెర్మినల్స్ నుంచి వివిధ ప్రాంతాల్లోని బంకులకు ఇంధనం సరఫరా అవుతుంది. ఇంధనం కేటాయించగానే సంబంధిత ఫిల్లింగ్ స్టేషన్ (బంక్) యజమానికి ఆయిల్ టెర్మినల్ నుంచి సందేశం వెళుతుంది. అలాగే ట్యాంకర్ బయలుదేరగానే, బంక్‌కు చేరిన వెంటనే మెసేజ్ వస్తుంది. టెర్మినల్ నుంచి బంక్ వరకు ట్యాంకర్ ప్రయాణాన్ని జీపీఎస్ (GPS) ఆధారంగా ట్రాక్ చేస్తారు. ఇచ్చిన రూట్ మ్యాప్‌లోనే ట్యాంకర్ వెళ్లాలి. మరో రూట్లో వెళ్లినట్టయితే తదుపరి లోడ్‌కు అవకాశం లేకుండా ఆ వాహన ఏజెన్సీని బ్లాక్ చేస్తారు. నిర్ధేశించిన ప్రాంతంలోనే డ్రైవర్లు భోజనం చేయాల్సి ఉంటుంది. మార్గ మధ్యలో వాహనం ఆపినా కారణం చెప్పాల్సిందే. ఇక బంక్ వద్దకు ట్యాంకర్ చేరగానే నిర్ధేశించిన స్థలంలో కాకుండా మరెక్కడైనా పార్క్ చేసినా ఫిల్లింగ్ స్టేషన్‌పై చర్యలుంటాయి. బంక్ యజమాని ఓటీపీ ఇస్తేనే ట్యాంకర్ తెరుచుకుంటుంది. అన్లోడ్ అయ్యాక ట్యాంకర్లో నిల్ స్టాక్ అని కంపెనీకి సమాచారం ఇవ్వాలి. ఫిల్లింగ్ స్టేషన్లో ఇలా.. బంకులోని ట్యాంకులో ఎంత ఇంధనం మిగిలి ఉంది, లోడ్ ఎంత వచ్చింది, అమ్మకాలు.. అంతా పారదర్శకం. గణాంకాలు అన్నీ ఎప్పటికప్పుడు కంపెనీ, డీలర్ వద్ద ఆన్లైన్లో దర్శనమిస్తాయి. ట్యాంకర్ తీసుకొచ్చిన స్టాక్‌లో తేడా ఉంటే ఇన్వాయిస్పైన వివరాలు పొందుపరిచి కంపెనీకి సమాచారం ఇవ్వాలి. ఇలా ప్రతీ చుక్కకూ లెక్క ఉంటుంది. మీటర్ తిరిగిన దానికి తగ్గట్టుగా బంకు ట్యాంకులో ఖాళీ కావాలి. స్టాక్‌లో తేడా 2 శాతం మించకూడదు. మించితే జవాబు చెప్పాల్సిందే. అంతేకాదు రూ.3 లక్షల వరకు పెనాల్టీ భారం తప్పదు. తరచుగా కంపెనీకి చెందిన సేల్స్ ఆఫీసర్ తనిఖీ చేస్తుంటారు. థర్డ్ పార్టీ నుంచి, అలాగే ఇతర ఆయిల్ కంపెనీల నుంచి కూడా తరచూ తనిఖీలు ఉంటాయి. ఆ మూడు సంస్థలదే.. దేశంలో మొత్తం ఇంధన రిటైల్ పరిశ్రమలో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలైన బీపీసీఎల్, ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్ వాటా ఏకంగా 90% ఉంది. కంపెనీల వెబ్‌సైట్స్ ప్రకారం ఐవోసీఎల్కు 37,500లకుపైగా, బీపీసీఎల్‌కు 22,000ల పైచిలుకు, హెచ్‌పీసీఎల్‌కు 17,000 లకుపైగా ఫ్యూయల్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రైవేటు సంస్థలు జియో–బీపీ, నయారా, షెల్ సైతం ఈ రంగంలో పోటీపడుతున్నాయి. చదవండి: రోడ్డుపై, నీటిపై నడిచే వెహికల్దేశవ్యాప్తంగా నిర్వహణ మాత్రమే బంకుల యజమానులది. మౌలిక వసతుల ఏర్పాటు, మెషినరీ, ఇంధనంపై సర్వ హక్కులూ పెట్రోలియం కంపెనీలదేనని వ్యాపారులు చెబుతున్నారు. నిర్వహణకుగాను ప్రతి నెల డీలర్‌కు వేతనం కింద కంపెనీలు రూ.27,500 చెల్లిస్తున్నాయి. డీలర్లకు లీటరు పెట్రోల్ అమ్మకంపై రూ.3.99, డీజిల్‌పై రూ.2.51 కమిషన్ ఉంటుంది.వేగానికీ పరిమితులు.. ట్యాంకర్ గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని మించకూడదు. ఒక్క వాహనం నిబంధనలు అతిక్రమించినా ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీనే రద్దు చేస్తారు. టెర్మినల్ నుంచి సుదూర ప్రాంతంలో ఫిల్లింగ్ స్టేషన్ ఉన్నట్టయితే.. డ్రైవర్లకు భోజనానికి 45 నిముషాలు, టీ తాగడానికి 15 నిముషాలు సమయం ఇస్తారు. నిర్ధేశిత సమయం మించితే కంపెనీ నుంచి ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ యజమానికి మెయిల్, ఎస్ఎంఎస్ వెళుతుంది. ఆలస్యానికి కారణం తెలపాల్సిందే. రాత్రి 12 నుంచి ఉదయం 5 మధ్య రవాణా నిషేధం. వయబిలిటీ స్టడీలో లోపాలు.. మోసాలకు తావు లేకుండా కస్టమర్లకు నాణ్యమైన ఇంధనం అందుతోందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం ఇచ్చే ప్రకటనలో సంబంధిత ప్రాంతంలో ఇంత మొత్తంలో విక్రయాలు జరుగుతాయని కంపెనీ ఇచ్చే అంకెలకు, వాస్తవ అమ్మకాలకు భారీ వ్యత్యాసం ఉంటోంది. వయబిలిటీ స్టడీ సక్రమంగా జరగడం లేదు. ప్రకటన ఆధారంగా ముందుకొచ్చి బంక్ ఏర్పాటు చేసి నష్టాలు మూటగట్టుకుంటున్న యజమానులు ఎందరో. – మర్రి అమరేందర్ రెడ్డి, తెలంగాణ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్. బంకు యజమానులే బాధ్యులా? డ్రైవర్లు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా వర్షాకాలంలో ట్యాంకర్ లోపలికి నీరు చేరే అవకాశం ఉంది. ఇథనాల్ మిశ్రమంలో తేడాలున్నా సమస్యకు దారి తీస్తుంది. బంకుల్లోని ట్యాంకులు స్టీలుతో తయారయ్యాయి. తుప్పు పడితే ట్యాంకులో చెమ్మ చేరుతుంది. ఇదే జరిగితే ఆ నీరు కాస్తా బంకులోని ట్యాంకర్‌కు, అక్కడి నుంచి కస్టమర్ వాహనంలోకి వెళ్లడం ఖాయం. ఈ సమస్యకు పరిష్కారంగా హెచ్డీపీఈతో చేసిన ట్యాంకులను బంకుల్లో ఏర్పాటు చేయాల్సిందిగా విన్నవిస్తున్నా కంపెనీల నుంచి స్పందన లేదు. రవాణా ఏజెన్సీ తప్పిదం, మౌలిక వసతుల లోపం వల్ల సమస్య తలెత్తినా బంకు యజమానిని బాధ్యులను చేస్తున్నారు. – రాజీవ్ అమరం, జాయింట్ సెక్రటరీ, కన్సార్షియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్స్. -
పెట్రోల్, డీజిల్‌కు అధిక డిమాండ్
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ వినియోగం డిసెంబర్ నెలలో గణనీయంగా పెరిగింది. క్రితం ఏడాది ఇదే నెలలోని వినియోగంతో పోల్చి చూస్తే, పెట్రోల్ అమ్మకాలు (ప్రభుత్వరంగ సంస్థల) 10 శాతం పెరిగి 2.99 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు బీపీసీఎల్, ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్ ద్వారా 90 శాతం ఇంధన విక్రయాలు నడుస్తుంటాయి. క్రితం ఏడాది డిసెంబర్ నెలలో పెట్రోల్ అమ్మకాలు 2.72 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. డీజిల్ అమ్మకాలు సైతం 4.9 శాతం పెరిగి 7.07 మిలియన్ టన్నులకు చేరాయి. నవంబర్ నెలలోనూ పెట్రోల్, డీజిల్ వినియోగం క్రితం ఏడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 8.3 శాతం, 5.9 శాతం చొప్పున పెరగడం గమనార్హం. వరుసగా రెండో నెలలోనూ వృద్ధి నమోదైంది. డిసెంబర్లో క్రిస్మస్ సెలవుల సందర్భంగా పర్యటనలు పెరగడం, ఖరీఫ్ సాగు సందర్భంగా యంత్రాలకు ఇంధన వినియోగం పెరగడం వినియోగంలో వృద్ధికి దారితీసింది. ఇక ఈ ఏడాది నవంబర్ నెల విక్రయాలతో పోల్చి చూస్తే డిసెంబర్లో పెట్రోల్ అమ్మకాలు 3.6 శాతం, డీజిల్ అమ్మకాలు 1.7 శాతం చొప్పున తక్కువగా ఉండడం గమనార్హం. దేశ ఇంధన మార్కెట్లో 40 శాతం డీజిల్ రూపంలోనే వినియోగం అవుతుంటుంది. ముఖ్యంగా 70 శాతం డీజిల్‌ను రవాణా రంగం వినియోగిస్తుంటుంది. ఆ తర్వాత వ్యవసాయ రంగంలో డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇక విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు డిసెంబర్ నెలలో క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చితే 6.8 శాతం పెరిగి 6,96,400 టన్నులుగా ఉన్నాయి. వంటగ్యాస్ (ఎల్పీజీ) వినియోగం 5 శాతానికి పైగా పెరిగి 2.87 మిలియన్ టన్నులకు చేరింది. -
హెచ్పీసీఎల్తో అమెజాన్ జట్టు
ముంబై: సుదూర రవాణా కోసం కర్బన ఉద్గారాలను తక్కువగా వెదజల్లే ఇంధనాల (లో కార్బన్ ఫ్యూయల్స్) అభివృద్ధి, వినియోగానికై ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకున్నట్టు ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ సోమవారం ప్రకటించింది.సుదూర రవాణాకు ఉపయోగించే వాహనాల్లో ఇంధనాలను పరీక్షించడానికి ఇరు సంస్థలు పైలట్‌ను నిర్వహిస్తాయి. కర్బన ఉద్గారాలను తక్కువగా వెదజల్లే ఇంధనాలను సులభంగా వినియోగించడానికి ఇంధన కేంద్రాలు, మొబైల్ రీఫ్యూయలింగ్ స్టేషన్ల ఏర్పాటు అవకాశాలను అన్వేíÙస్తామని అమెజాన్ ఇండియా తెలిపింది.ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, హర్యానాలోని బహదూర్‌గఢ్‌లో ఇంధన ఉత్పత్తికి వ్యవసాయ, పారిశ్రామిక వ్యర్థాలను ఉపయోగిస్తామని వివరించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇంధన కేంద్రాలు, మొబైల్ రీఫ్యూయలింగ్ స్టేషన్లను అభివృద్ధి చేయడంలో ఈ చొరవ సహాయపడుతుందని పేర్కొంది. -
ఇక నిశ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేయొచ్చు!.. ఎందుకో తెలుసా?
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్నప్పటికీ.. మౌలిక సదుపాయాలైన ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ కారణంగా కొంత మంది ఇప్పటికి కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేయడానికి కొంత వెనుకడుగు వేస్తున్నారు. ఈ తరుణంలో ఎంజీ మోటార్ ఇండియా.. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌తో చేతులు కలిపింది.ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయడానికి ఎంజీ మోటార్.. హెచ్పీసీఎల్లో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నట్లు తెలుస్తోంది. రెండు కంపెనీలు హైవేలపై, ప్రధాన నగరాల్లోని ఎంపిక చేసిన ప్రదేశాలలో 50 kW, 60 kW DC ఫాస్ట్ ఛార్జర్లను ఇన్స్టాల్ చేయనున్నారు. ఫలితంగా ఇకపై ఎలక్ట్రిక్ వాహనం కొనాలనుకునేవారు నిశ్చింతగా కొనేయొచ్చు.‘‘భారతదేశంలో హెచ్‌పీసీఎల్ భారీగా విస్తరిస్తోంది. ఈ సంస్థతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంతో ఛార్జింగ్ స్టేషన్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతాయి. బ్యాటరీ రీసైక్లింగ్ & బ్యాటరీల పునర్వినియోగం వంటి అంశాలపై కొత్తగా సమర్థమైన చర్యలు తీసుకోవచ్చు.’’ అని ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ గ్రోత్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా తెలిపారు.దేశమంతటా 15,000 ఛార్జింగ్ స్టేషన్స్ఇప్పటికే ఎంజీ మోటార్ కంపెనీ.. టాటా పవర్ డెల్టా ఎలక్ట్రానిక్స్, ఫోర్టమ్ వంటి సంస్థల భాగస్వామ్యంతో భారతదేశం అంతటా 15,000 పబ్లిక్, ప్రైవేట్ ఛార్జర్లను ఇన్స్టాల్ చేసింది. పబ్లిక్ EV ఛార్జర్ల ఇన్స్టాలేషన్ కోసం ఈ కార్ల తయారీ సంస్థ భారత్ పెట్రోలియం, జియో-బీపీతో భాగస్వామ్యాన్ని కూడా ప్రకటించింది.హెచ్‌పీసీఎల్ 3600 ఛార్జింగ్ స్టేషన్స్హెచ్పీసీఎల్ కంపెనీ కూడా అనేక కంపెనీలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు, ఛార్జింగ్ సర్వీస్ ప్రొవైడర్లు దేశవ్యాప్తంగా పెట్రోల్ స్టేషన్లలో ఈవీ ఛార్జీల నెట్‌వర్క్‌ను విస్తరించాయి. హెచ్‌పీసీఎల్ దేశవ్యాప్తంగా 3600 కంటే ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ కలిగి ఉంది. ఈ సంఖ్యను 2024 చివరి నాటికి 5000కు పెంచాలని సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. -
ఫోర్జరీ సాంబకు భారీ షాక్..
-
టీవీ 5 సాంబశివరావు చెప్పేవన్నీ అబద్ధాలే!
సాక్షి, హైదరాబాద్: హిందుస్తాన్ పెట్రోలియం లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)కు, సంధ్య కన్స్ట్రక్షన్కు మధ్య జరిగిన పెట్రోల్ బంక్ ఒప్పందం వివాదంలో టీవీ–5 వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు అసలు వాస్తవాలను దాచి అన్నీ అబద్ధాలే చెబుతున్నారని సంధ్య కన్స్ట్రక్షన్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత సరనాల శ్రీధర్ రావు ఆరోపించారు. స్థలం సాంబశివరావుది కాదు.. పెట్టుబడీ ఆయనది కాదు.. కానీ, పెట్రోల్ బంక్ డీలర్షిప్ మాత్రం ఆయన వాళ్ల పేరు మీద పెట్టుకుని బాగోతం నడిపారని విమర్శించారు. టీవీ–5తో తనకున్న పరిచయాలను వాడి తన కోడలు కొల్లి సౌమ్య పేరు మీద డీలర్షిప్ తీసుకొని అస లు వాస్తవాలను దాస్తూ మీడియా ముందు మాత్రం సాంబశివరావు నంగనాచి కబుర్లు చెబుతున్నాడని శ్రీధర్‌రావు ధ్వజమెత్తారు. మాదాపూర్‌లోని పెట్రోల్ బంక్‌కు సంబంధించి డాక్యుమెంట్లు అన్నీ పక్కాగా ఉంటే హెచ్‌పీసీఎల్ ఎందుకు బంక్‌ను మూసి వేసిందని ప్రశ్నించారు? ఆయనకున్న పోలీసు, రాజకీయ పలుకుబడితో తనకు టుంబ సభ్యులు, వ్యాపారాల గురించి ప్రతికూల వార్తల ను ప్రచారం చేస్తూ పరుపు నష్టాన్ని కలిగిస్తున్నారని ఆరోపించారు. ‘సాక్షి’తో శ్రీధర్‌రావు చెప్పిన వివరాల ప్రకారం.. స్థలం అసలు కథ ఇదీ.. సరనాల శ్రీధర్ భార్య సంధ్యకు శేరిలింగంపల్లిలోని మాదాపూర్ గ్రామంలో సర్వే నంబరు–64లోని హుడా టెక్నో ఎన్‌క్లేవ్‌లో సెక్టార్– 3లోని ప్లాట్ నంబరు–26లో నార్త్ఈస్ట్ దిక్కున 1,200 చదరపు మీటర్ల స్థలం ఉంది. ఇందులో 600 చ.మీ. స్థలాన్ని సంధ్య తన వ్యాపార అవసరాల కోసం ఇతరులకు విక్రయించింది. ఇంకా తన వద్ద 600 చ.మీ. స్థలం ఉంది. 2018లో కొందరు రియల్ ఎస్టేట్ మార్కెట్ మిత్రులతో కలిసి సాంబశివ రావు శ్రీధర్ రావును కలిశాడు. ‘మీది తెనాలే మాది తెనాలే’అంటూ మాట కలిపాడు. 600 చ.మీ. స్థలంలో పెట్రోల్ బంక్ పెడదామని సలహా ఇచ్చాడు. తనకు ఆయిల్ కంపెనీలతో సత్సంబంధాలు ఉన్నాయని, పోలీసు, మున్సిపల్ అనుమతులన్నీ తానే చూసుకుంటానని నమ్మించాడు. 25:75 శాతం వాటాతో సాంబశివరావు, సంధ్య కన్స్ట్రక్షన్తో ఒప్పందం చేసుకున్నాడు. నెలకు రూ.3.15 లక్షలు అద్దె చెల్లించేలా 600 చదరపు మీటర్ల స్థలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తూ హెచ్‌పీసీఎల్‌కు, సంధ్య కన్స్ట్రక్షన్కు రిజిస్టర్డ్ లీజు డీడ్ జరిగింది. పెట్రోల్ బంక్ ఏర్పాటయింది. అంతా బాగానే నడుస్తున్న క్రమంలో.. పక్కనే ఉన్న మరో 600 చదరపు మీటర్ల స్థలంలో కూడా బంక్‌ను విస్తరిద్దామని సాంబశివరావు సూచించాడు. ఇక్కడే ఫోర్జరీ చేసింది.. దీంతో అప్పటికే ఆమ్మేసిన ఈ స్థలాన్ని 2020 జనవరిలో రూ.కోట్లు వెచ్చించి తిరిగి సంధ్య కన్స్ట్రక్షన్ కొనుగోలు చేసింది. అయితే విస్తరించే ఈ బంక్‌కు నెలకు చెల్లించే అద్దె కేవలం రూ.1.15 లక్షలు మాత్రమేనని తెలిసింది. దీంతో పునరాలోచనలో పడ్డారు. కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన స్థలంలో పెట్రోల్ బంక్‌కు వచ్చే అద్దె రూ.1.15 లక్షలు అనే సరికి వెనక్కి తగ్గారు. కానీ, టీవీ–5 సాంబశివరావు హెచ్పీసీఎల్లో డీజీఎం స్థాయిలో తనకున్న పరిచయాలతో స్థలం యజమానికి తెలియకుండా ఈ రెండో భాగం 600 చదరపు మీటర్ల స్థలాన్ని ఫోర్జరీ సంతకాలతో హెచ్‌పీసీఎల్‌కు లీజుకు ఇచ్చేశాడు. కానీ, మీడియా ముందు మాత్రం తొలుత హెచ్‌పీసీఎల్‌కు, సంధ్య కన్స్ట్రక్షన్కు మధ్య 600 చ.మీ. స్థలంలో జరిగిన పెట్రోల్ బంక్ డాక్యుమెంట్లను మాత్రమే చూపిస్తూ జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. అందర్నీ మేనేజ్ చేసి..: జర్నలిస్ట్ కావడంతో తనకున్న రాజకీయ, పోలీసు పరిచయాలను టీవీ–5 సాంబశివరావు పూర్తిస్థాయిలో వినియోగించుకున్నాడు. వాస్తవానికి ఈ పెట్రోల్‌బంక్ వి స్తరణ చేసిన 600 చదరపు మీటర్ల స్థలానికి యజమానికి, హెచ్‌పీసీఎల్‌కు మధ్య ఎలాంటి రిజిస్టర్డ్ లీజు డీడ్ జరగలే దు. హెచ్పీసీఎల్లో తనకున్న పరిచయాలతో స్థల యజమాని సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ అగ్రిమెంట్‌ను సృష్టించాడు. ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లను సమర్పించే స్థానికంగా పోలీసు, మున్సిపల్ అనుమతులను తీసుకున్నాడు. దిక్కులేక ఠాణా మెట్లెక్కి.. స్థల యజమానికి విషయం తెలియడంతో.. తన వాటా 75 శాతంపై సాంబశివరావును నిలదీశారు. రూ.30 లక్షలు ఇస్తే 75 శాతం వాటా డాక్యుమెంటేషన్ ప్రక్రియ మొదలుపెడతానని మెలిక పెట్టడంతో చేసేదేం లేక చెక్ రూపంలో రూ.30 లక్షలు సాంబశివరావుకు చెల్లించారు. ఏళ్లు గడిచినా బంక్ డీలర్షిప్ తమ పేరు మీద బదలాయించకపోయే సరికి దిక్కు తోచని స్థితిలో ఈ ఏడాది జనవరి 31న స్థల యజమాని శ్రీధర్‌రావు మాదాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హెచ్‌పీసీఎల్ ఏం అంటోంది? ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ చేపట్టిన హెచ్‌పీసీఎల్.. పెట్రోల్ బంక్ విస్తరణ సమయంలో సమర్పించిన డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించకుండా నిర్ణయం తీసుకున్నట్లు స్వయంగా ఇంధన సంస్థే వెల్లడించింది. అందుకే విస్తరించిన 600 చదరపు మీటర్ల స్థలాన్ని పాక్షికంగా సీజ్ చేశామని, న్యాయబద్ధంగా ఒప్పందం చేస్తే నెలకు రూ.1.57 లక్షలు అద్దె చొప్పున 2020 నుంచి పరిహారాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కారు కొట్టేసిన సాంబశివరావు సంధ్య కన్స్ట్రక్షన్ అండ్ ఎస్టేట్స్ ప్రై.లి. (గతంలో సంధ్య హోటల్స్ ప్రై.లి.) 2019 సెప్టెంబర్ 13న మాదాపూర్‌లోని యాక్సిస్ బ్యాంక్ కరెంట్ ఖాతా నంబరు: 910020004191308 నుంచి 039927 డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ)ను తీసుకుంది. వరుణ్ మోటార్స్ ప్రై.లి. పేరు మీద మారుతీ స్విప్ట్ కారు కోనుగోలు చేసేందుకు ఈ డీడీను తీసుకుంది. అయితే యాజమాన్యం కోరిన మోడల్ కారు డెలివరీలో జాప్యం జరిగింది. ఈక్రమంలో టీవీ–5 సాంబశివరావు ఎంటరయ్యాడు. తనకున్న పరిచయాలతో త్వరగా కారు డెలివరీ అయ్యేలా చేస్తానని నమ్మించి డీడీని తీసుకున్నాడు. ఎన్ని రోజులైనా ఎలాంటి స్పందన లేదు. గట్టిగా ప్రశ్నిస్తే కొత్త అప్‌గ్రేడ్ మోడల్ వస్తోందని, పాత కారు ధరకే అప్‌గ్రేడ్ మోడల్ ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో అతని మాయమాటలు నమ్మి కొంతకాలం వేచిచూశారు. అ యినా నెలలు గడుస్తున్నా కారు డెలివరీ మాత్రం కాలే దు. డీడీ కూడా తిరిగి ఇవ్వలేదు. దీంతో డీడీ ఇవ్వమని మరోసారి అడిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయనీ, తనకు రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు బాగా తెలుసని బెదిరించడం మొదలుపెట్టాడు. తీరా అసలు విషయం ఏంటంటే.. ఆ డీడీని ఉపయోగించుకొని సాంబశివరావు తన వ్యక్తిగత అవసరాల కోసం కారును కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈమేరకు మాదాపూర్ పోలీసు స్టేషన్లో బాధితుడు శ్రీధర్ రావు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. డీడీ, బ్యాంక్ స్టేట్మెంట్ కాపీలను పోలీసులకు అందజేశారు. -
యాంకర్ సాంబశివరావు అక్రమాలకు చెక్
హైదరాబాద్, సాక్షి: టీవీ5 యాంకర్ సాంబశివ రావు అక్రమాలకు అడ్డుకట్ట పడింది. తమనే బురిడీ కొట్టించిన ప్రయత్నంపై హెచ్‌పీసీఎల్(Hindustan Petroleum Corporation Limited ) తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో.. మాదాపూర్‌లో నకిలీ ల్యాండ్ ధ్రువ పత్రాలతో నడుపుతున్న పెట్రోల్ బంక్ స్థలాన్ని హెచ్‌పీసీఎల్ అధికారులు సీజ్ చేశారు. ఈ వ్యవహారంపై మొన్నీమధ్యే కేసు నమోదైన సంగతి తెలిసిందే. ల్యాండ్ ఓనర్ ఫిర్యాదు చేయడంతో మాదాపూర్ పోలీసులు సాంబశివుడిపై, ఆయన కుటుంబ సభ్యులపై ఛీటింగ్ కేసు నమోదు చేశారు. ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా.. ఇటు భూమి యజమానిని, అటు హెచ్‌పీసీఎల్‌ను సాంబశివరావు కుటుంబం బురిడీ కొట్టించాలని చూశాడు. ఈ క్రమంలో.. ల్యాండ్ ఓనర్ కి తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో బంక్ నడుపుతున్న విషయాన్నీ హెచ్‌పీసీఎల్ గుర్తించింది. ఆక్రమిత ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ చెప్పింది కూడా. అంతేకాదు.. ఈ వివాదాన్ని పరిష్కరించాలని పలుమార్లు చెప్పినా వినకపోవడంతో ఆక్రమిత బంక్ స్థలాన్ని అధికారులు సీజ్ చేశారు. పచ్చమీడియాలో భాగమైన టీవీ5 ద్వారా తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సాంబశివరావుపై ఈ కేసులో ప్రధాన అభియోగాలు నమోదయ్యాయి. సాంబశివరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తమను మోసం చేసారంటూ బాధితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. శేరిలింగంపల్లి ప్రాంతంలో 600 చదరపు మీటర్ల స్థలం విషయంలో ఈ వివాదం నెలకొంది. పెట్రోల్ బంక్ కోసం ఈ స్థలం కూడా కలిపి సాంబ కుటుంబ సభ్యులు హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ తో లీజ్ కు ఇచ్చినట్లుగా ఒప్పందం చేసుకున్నారన్నది బాధితుల ఆరోపణ. దీని పైన తాము సాంబశివరావును, ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నించగా అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ ను వారి పేరు మీదికే బదిలీ చేస్తామని నమ్మించారని చెబుతున్నారు. ఎంత కాలం అయినా చెప్పిన విధంగా చేయకపోవటంతో అనుమానం వచ్చిన ఫిర్యాదు దారులు హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ అధికారులను కలిశారు. అక్కడ తమకు ప్రమేయం లేకుండానే తాము HPCLకు తమ స్థలం లీజుకు ఇచ్చినట్లుగా సంతకాలు చేసినట్లు.. ఈ డాక్యుమెంట్లు అన్నీ దురుద్దేశపూర్వకంగా రూపొందించినట్టు గుర్తించారు. కంపెనీ ప్రతినిధులకు బాధితులు అసలు విషయాన్ని మొర పెట్టుకున్నారు. -
జూన్ నాటికి హెచ్‌పీసీఎల్ వైజాగ్ రిఫైనరీ విస్తరణ
వారణాసి: ఈ ఏడాది జూన్ నాటికల్లా ఆంధ్రప్రదేశ్, వైజాగ్‌లోని ఆయిల్ రిఫైనరీ విస్తరణ పూర్తవుతుందని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) చైర్మన్ పుష్ప్ జోషి తెలిపారు. ఉత్పత్తికి, విక్రయాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని భర్తీ చేసుకునేందుకు హెచ్‌పీసీఎల్ వార్షికంగా 8.33 మిలియన్ టన్నులుగా (ఎంటీపీఏ) ఉన్న వైజాగ్ రిఫైనరీ సామర్థ్యాన్ని 15 ఎంటీపీఏకి పెంచుకుంటోంది. దానితో పాటు రాజస్థాన్‌లోని బాడ్మేర్లో 9 ఎంటీపీఏ సామర్థ్యంతో కొత్తది నిర్మిస్తోంది. ఇది 2024 ఆఖరు నాటికి పూర్తి కావొచ్చని అంచనా. ప్రస్తుతం హెచ్‌పీసీఎల్ తాను ఉత్పత్తి చేసే దానికన్నా 50 శాతం అధికంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీని విక్రయిస్తోంది. -
గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే!
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్(Lpg Gas Cylinder) మన ఇంట్లో ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి 2,3 నెలలకు ప్రజల వాడకం బట్టి గ్యాస్ సిలిండర్‌ను తెప్పించుకుంటాం. అయితే సిలిండర్‌ను డోర్ డెలివరీ తీసుకున్న ప్రతి సారి రూ.30 లేదా అంత కంటే ఎక్కువ అదనంగా చెల్లించడం మూములుగా మారింది. ఇకపైన అలా డబ్బులు ఇవ్వడం ఆపేయండి. ఎందుకంటే! ఐఓసీ, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) వినియోగదారులు తెలంగాణలోని డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లకు డెలివరీ ఛార్జీలు చెల్లించాలా వద్దా అనే సమాచారం కోసం ఓ వ్యక్తి దాఖలు చేసిన ఆర్టీఐ (RTI) ఈ మేరకు సమాధానం వచ్చింది. హెచ్‌పీసీఎల్ కంపెనీ డీలర్ ఒప్పందంలో పేర్కొన్న విధంగా.. ట్రేడింగ్ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు ఉచితంగా వినియోగదారుల ఇంటి వద్దకు గ్యాస్ సిలిండర్ చేర్చాల్సి ఉంటుందని, అందుకయ్యే ఛార్జీలు వారు చెల్లించే బిల్లులోనే కలిపి ఉంటాయని పేర్కొంది. డొమెస్టిక్, కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ (Lpg Gas) డెలివరీ ఛార్జీలు ఏమైనా ఉంటే తెలుసుకోవాలని ఇటీవల హైదరాబాద్‌కు చెందిన రాబిన్ జాకీస్ ఆర్టీఐ ద్వారా ఈ సమాచారాన్ని కోరాడు. చదవండి: దేశంలోని ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా? -
మొదటి సారి ఇంధన రంగంలోకి పీఏసీఎస్.. పెట్రోల్ బంకులు రాబోతున్నాయ్!
సాక్షి, అమరావతి: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్) ఆర్థిక పరిపుష్టిపై దృష్టి సారించాయి. ఇప్పటి వరకు రైతులకు వ్యవసాయ ఆర్థిక అవసరాలు తీర్చడంతో పాటు వివిధ రకాల వ్యాపారాలు కొనసాగిస్తున్నాయి. మొదటి సారి ఇంధన రంగంలోకి ప్రవేశించాయి. సహకార పెట్రోలు బంకులు ఏర్పాటు చేసి తమ ఆర్థిక పరపతిని పెంచుకునే దిశగా అడుగులేస్తున్నాయి. ఒక్కో బంకు రూ.25లక్షలతో ఏర్పాటు ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు అనుబంధంగా 1,992 పీఏసీఎస్‌లున్నాయి. వాటిలో 1,450 పీఏసీఎస్‌లు లాభాల్లో ఉన్నాయి. మిగిలిన వాటిని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ఆప్కాబ్ చేయూత నిస్తోంది. బహుళ సేవా కేంద్రాలు (ఎంఎస్సీ)గా వీటిని తీర్చిదిద్దేందుకు ఆప్కాబ్ చర్యలు చేపట్టింది. స్థలాలు అందుబాటులో ఉండి స్థానికంగా ఫీజుబులిటీ కల్గిన పీఏసీఎస్‌ల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఒక్కో బంకు రూ.25లక్షల అంచనాతో ఏర్పాటు చేస్తున్నారు. స్థలాలు చూపిస్తే చాలు ఫీజుబులిటీ రిపోర్టు ఆధారంగా పైసా ఖర్చు లేకుండా పీఏసీఎస్‌లకు డీలర్‌షిప్‌లు మంజూరు చేసేందుకు హెచ్‌పీసీఎల్ ముందు కొచ్చింది. బంకు నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ హెచ్‌పీసీఎల్ సమకూర్చనుంది. నిర్వహణ బాధ్యతలను పీఏసీఎస్‌లకు అప్పగిస్తారు. నిర్వహణ ఖర్చులు పోనూ నెలకు రూ.లక్షకు పైగా మిగులుతుందని అంచనా వేసు్తన్నారు. బంకుల ఏర్పాటుకు అనువుగా 96 పీఏసీఎస్‌లు తొలిదశలో బంకుల ఏర్పాటుకు అనువైన స్థలాలున్న 130 పీఏసీఎస్‌లను గుర్తించారు. వాటిలో 96 పీఏసీఎస్‌ల పరిధిలో బంకుల ఏర్పాటుకు ఫీజుబులిటీ ఉందని ఆయిల్ కంపెనీలు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చాయి. వాటిలో ఇప్పటికే 77 పీఏసీఎస్‌లకు ఆయిల్ కంపెనీలు లెటర్ ఆఫ్ ఇంటెంట్స్ జారీ చేశాయి. కాగా 18 పీఏసీఎస్‌ల పరిధిలో బంకుల ఏర్పాటుకు రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక తదితర శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)లు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో ఒకటి, ఏలూరు జిల్లా పరిధిలోని కె.జగ్గవరం, ముల్లకుంట పీఏసీఎస్‌ల్లో పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేయగా, మిగిలిన 15 పీఏసీఎస్‌ల్లో జనవరి నెలాఖరులోగా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫీజుబులిటీ ఆధారంగా మిగిలిన పీఏసీఎస్‌ల పరిధిలో బంకుల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. లాభాల బాట పట్టించడమే లక్ష్యం నష్టాల్లో ఉన్న పీఏసీఎస్‌లను లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేశాం. స్థలాలు అందుబాటులో ఉండి, ఫీజు బులిటీ ఉన్న పీఏసీఎస్ పరిధిలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు అనుమతినిస్తాం. బంకులే కాదు..వారు ఏ తరహా వ్యాపారం చేసేందుకు ముందుకొచ్చినా ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఆప్కాబ్ సిద్ధంగా ఉంది. –ఆర్.శ్రీనాథ్‌రెడ్డి, ఎండీ, ఆప్కాబ్ -
పెట్రోల్‌పై లాభం.. డీజిల్‌పై నష్టం
న్యూఢిల్లీ: చమురు మార్కెటింగ్ కంపెనీలు ఒక్కో లీటర్ పెట్రోల్ విక్రయంపై రూ.10 చొప్పున లాభాన్ని చూస్తున్నాయి. మరోవైపు లీటర్ డీజిల్ విక్రయంతో అవి రూ.6.5 నష్టపోతున్నాయి. పెట్రోల్‌పై లాభం వస్తున్నా కానీ అవి విక్రయ రేట్లను తగ్గించడం లేదు. ఎందుకంటే అంతకుమందు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు భారీగా పెరిగిపోయిన సమయంలో అవి రేట్లను ఒక దశ వరకు పెంచి, ఆ తర్వాత నుంచి నష్టాలను సర్దుబాటు చేసుకున్నాయి. పైగా ఇప్పుడు డీజిల్‌పైనా నష్టపోతున్నాయి. దీంతో పెట్రోల్ రేటు దిగి రావడం లేదు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) గత 15 నెలల నుంచి రేట్లను సవరించడం లేదు. ‘‘2022 జూన్ 24తో ముగిసిన వారంలో లీటర్ పెట్రోల్‌పై 17.4 నష్టపోగా, లీటర్ డీజిల్‌పై రూ.27.70 చొప్పున నష్టాన్ని ఎదుర్కొన్నాయి. అక్టోబర్–డిసెంబర్ కాలానికి వచ్చే సరికి అవి లీటర్ పెట్రోల్‌పై రూ.10 లాభం, లీటర్ డీజిల్‌పై నష్టం రూ.6.5కు తగ్గింది’’అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తన నివేదికలో తెలిపింది. 2022 ఏప్రిల్ 6 నుంచి ఈ మూడు ప్రభుత్వరంగ ఆయిల్ విక్రయ సంస్థలు రేట్లను సవరించడం నిలిపివేశాయి. చమురు బ్యారెల్ ధర 103 డాలర్ల నుంచి 116 డాలర్లకు పెరిగినప్పటికీ అవి రేట్లను యథాతథంగా కొనసాగించాయి. ఫలితంగా ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి ఈ మూడు సంస్థలు కలసి ఉమ్మడిగా రూ.21,201 కోట్ల నష్టాన్ని నమోదు చేశాయి. కానీ, ఈ నెల చమురు ధర 78 డాలర్లకు తగ్గిపోయింది. దీంతో అవి ఇక మీదట డీజిల్‌పైనా లాభాలను ఆర్జించనున్నట్టు తెలుస్తోంది. ఆపరేటింగ్ లాభాలు స్థూల రిఫైనింగ్ మార్జిన్లు బ్యారెల్‌కు 10.5–12.4 డాలర్లుగా ఉండడంతో మూడు కంపెనీలు తిరిగి ఆపరేటింగ్ లాభాల్లోకి ప్రవేశిస్తాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్‌కు ఐవోసీ రూ.2,400 కోట్ల ఎబిట్డా (వడ్డీ, పన్నులు, తరుగుదలకు ముందు), బీపీసీఎల్‌కు రూ.1,800 కోట్లు, హెచ్‌పీసీఎల్‌కు రూ.800 కోట్ల ఎబిట్డా నమోదు చేస్తాయని పేర్కొంది. కాకపోతే నికరంగా నష్టాలను నమోదు చేస్తాయని అంచనా వేసింది. ఐవోసీ రూ.1,300 కోట్లు, హెచ్‌పీసీఎల్ రూ.600 కోట్లు చొప్పున నష్టాలను నమోదు చేయవచ్చని అంచనా వేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు కరోనా ఆరంభంలో 2020లో మైనస్‌కు పడిపోవడం గమనార్హం. అక్కడి నుంచి రెండేళ్లలోనే 2022 మార్చి నాటికి బ్యారెల్ ధర 140 డాలర్లకు చేరి, 14 ఏళ్ల గరిష్టాన్ని నమోదు చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడం చమురు ధరలకు ఆజ్యం పోసిందని చెప్పుకోవాలి. అమెరికా, యూరప్‌లో మాంద్యం, చైనాలో వృద్ధి మందగమనం పరిస్థితులతో డిమాండ్ తగ్గి తిరిగి ధరలు దిగొస్తున్నాయి. ఈ మూడు ప్రభుత్వరంగ సంస్థలు కలిపి పెట్రోల్ డీజిల్ విక్రయాల్లో 90 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి. ఇవి ఇంతకాలం పాటు రేట్లను సవరించకుండా ఉండడం గత రెండు దశాబ్దాల్లో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
హెచ్పీసీఎల్తో హీరో మోటోకార్ప్ జట్టు.. గట్టి ప్లానే వేసింది!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే దిశగా హీరో మోటోకార్ప్, ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) చేతులు కలిపాయి. దీని ప్రకారం ప్రస్తుతం హెచ్‌పీసీఎల్‌కి ఉన్న బంకుల్లో ఇరు సంస్థలు కలిసి చార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తాయి. తొలి దశలో ఎంపిక చేసిన నగరాల్లో చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పనున్నట్లు, ఆ తర్వాత ఇతరత్రా మార్కెట్లకు విస్తరించనున్నట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది. చార్జింగ్ మొదలుకుని చెల్లింపుల వరకూ మొత్తం ప్రక్రియను హీరో మోటోకార్ప్ మొబైల్ యాప్ ద్వారా నిర్వహించుకోవచ్చని పేర్కొంది. దేశవ్యాప్తంగా తమకు 20,000 పైచిలుకు రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయని, ద్విచక్ర వాహనాల మార్కెట్లో దిగ్గజంగా ఉన్న హీరో మోటోకార్ప్‌తో జట్టు కట్టడం ద్వారా పెద్ద ఎత్తున చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చేందుకు సాధ్యపడుతుందని హెచ్‌పీసీఎల్ చైర్మన్ పుష్ప్ కుమార్ జోషి చెప్పారు. చదవండి: పవర్ ఆఫ్ సారీ: రూ. 6 లక్షలకు..50 కోట్లు వచ్చాయ్! -
సవరించని అమ్మకాల ధరలు, ఆయిల్ కంపెనీలకు భారీ షాక్!
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నా.. వాటి విక్రయ ధరలను సవరించకుండా నిలిపివేయడం వల్ల ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ లాభాలపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభావం పడుతుందని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. ద్రవ్యోల్బణం లక్ష్యిత స్థాయికు మించి పరుగులు తీస్తుండడంతో కేంద్ర ప్రభుత్వ పరోక్ష ఆదేశాల మేరకు.. నాలుగు నెలలుగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరించడం లేదు. కానీ, ఇదే కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో వాటి ధరలు పెరిగినందున లాభాలపై ప్రభావం పడుతుందని ఫిచ్ తెలిపింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల క్రెడిట్ మెట్రిక్స్ బలహీనపడతాయని పేర్కొంది. చదవండి👉పెట్రో లాభాలపై పన్ను పిడుగు! కేంద్ర ఖజానాకు లక్షకోట్లు! అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గే అవకాశాల నేపథ్యంలో 2023–24 నుంచి మెరుగుపడొచ్చని అంచనా వేసింది. సమీప కాలంలోచమురు ధరలు అన్నవి.. ప్రభుత్వ ద్రవ్య అవసరాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లపై ఆధారపడి ఉంటాయని పేర్కొంది. పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వ జోక్యం మరింత కాలంపాటు కొనసాగి, చమురు మార్కెటింగ్ కంపెనీల నష్టాలకు దారితీస్తే వాటి రేటింగ్‌పై ప్రభావం పడొచ్చని తెలిపింది. -
చమురు కంపెనీలకు భారీ నష్టాలు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజాలు (ఓఎంసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారీ నష్టాలు నమోదు చేసే అవకాశముంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) కలిపి రూ.10,700 కోట్ల మేర నష్టాలు ప్రకటించవచ్చని బ్రోకరేజీ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఒక నివేదికలో అంచనా వేసింది. తయారీ వ్యయం కన్నా పెట్రోల్, డీజిల్‌ను తక్కువ రేటుకు విక్రయించాల్సి రావడమే ఇందుకు కారణమని తెలిపింది. దేశీయంగా పెట్రోల్, డీజిల్ మార్కెట్లో ఈ మూడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 90 శాతం దాకా వాటా ఉంది. ముడిచమురును ఇంధనాలుగా మార్చే రిఫైనరీలు కూడా వీటికి ఉన్నాయి. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో క్రూడాయిల్ రేట్లు భారీగా ఎగియడంతో ఈ సంస్థల రిఫైనింగ్ మార్జిన్లు కూడా మెరుగుపడ్డాయి. అయితే, పెట్రోల్, డీజిల్ రేట్లలో పెద్దగా మార్పులు లేకపోవడంతో ఆయా సంస్థల మార్కెటింగ్ విభాగాలు మాత్రం నష్టాలు మూటగట్టుకున్నాయి. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 12–14 మేర నష్టపోతున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది. దీంతో రిఫైనింగ్ మార్జిన్లపరంగా వచ్చిన ప్రయోజనం దక్కకుండా పోతోందని వివరించింది. పటిష్టంగా జీఆర్ఎం.. స్థూల రిఫైనింగ్ మార్జిన్లు (జీఆర్ఎం) పటిష్టంగా బ్యారెల్‌కు 17–18 డాలర్ల స్థాయిలోనే కొనసాగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది. అలాగే రికవరీ, తక్కువ బేస్ ఎఫెక్ట్ కారణంగా అమ్మకాల పరిమాణం కూడా 17–20 శాతం పెరగవచ్చని తెలిపింది. కానీ పెట్రోల్, డీజిల్పరమైన రిటైల్ నష్టాల వల్ల ఓఎంసీలు క్యూ1లో రూ. 10,700 కోట్ల మేర నికర నష్టం నమోదు చేసే అవకాశం ఉన్నట్లు వివరించింది. గత 2–3 రోజులుగా క్రూడాయిల్ రేట్లు తగ్గుముఖం పట్టడంతో మార్జిన్లు దిగిరావచ్చని, అలాగే రాబోయే రోజుల్లో మార్కెటింగ్పరమైన నష్టాలు కూడా కాస్త తగ్గొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది. మరోవైపు, క్యూ1లో ప్రైవేట్ రంగ రిలయన్స్ ఇండస్ట్రీస్ పటిష్టమైన ఆర్థిక ఫలితాలు నమోదు చేయొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అత్యధికంగా రూ. 24,400 కోట్ల మేర నికర లాభం (77 శాతం వృద్ధి) ప్రకటించవచ్చని వివరించింది. అయితే, ఇంధనాల ఎగుమతులపై జూలై 1 నుంచి అధిక సుంకాల విధింపుతో మిగతా తొమ్మిది నెలల కాలంలో కంపెనీ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడొచ్చని తెలిపింది. -
ఇక బీఎస్–6 ఆయిల్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారత్ స్టేజ్ –6 (బీఎస్–6) వాహనాలు విన్నాం.. ఇక నుంచి బీఎస్–6 ఆయిల్ కూడా అందుబాటులోకి రానుంది. ఇందుకు విశాఖ కేంద్రంగా మారనుంది. తక్కువ కాలుష్యాన్ని మాత్రమే వదులుతూ.. వాహనాల ఇంజన్ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు బీఎస్–6 ఆయిల్ దోహదపడనుంది. దీన్ని ఉత్పత్తి చేసేందుకు విశాఖలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) రిఫైనరీ సిద్ధమవుతోంది. దేశానికి విశాఖ నుంచే బీఎస్–6 పెట్రోల్/డీజిల్ సరఫరా కానుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న రిఫైనరీ సామర్థ్యాన్ని ఏడాదికి 8.3 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీపీఏ) సామర్థ్యం నుంచి 15 ఎంఎంటీపీఏకు పెంచేందుకు విస్తరణ, ఆధునికీకరణ పనులను సంస్థ చేపడుతోంది. ఇందుకోసం ఏకంగా రూ.26,264 కోట్లను వెచ్చిస్తోంది. అన్నీ అనుకూలిస్తే 2023 మార్చి నాటికి విశాఖ కేంద్రంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు బీఎస్–6 పెట్రోల్/డీజిల్ సరఫరా కానుంది. పర్యావరణహితంగా.. బీఎస్–6 వాహనాల తయారీ నేపథ్యంలో బీఎస్–6 ఆయిల్‌ను సరఫరా చేయనున్నారు. బీఎస్–4 వాహనాల కంటే బీఎస్–6 వాహనాలు తక్కువ సల్ఫర్, నైట్రోజన్ ఆక్సైడ్‌ను వెదజల్లుతాయి. బీఎస్–4 ఆయిల్‌ను వినియోగిస్తే వాతావరణంలోకి 50 పీపీఎం సల్ఫర్ విడుదలవుతుంది. అదే బీఎస్–6 ఆయిల్ ద్వారా అయితే ఇది కేవలం 10 పీపీఎం మాత్రమే. ఇక నైట్రోజన్ ఆక్సైడ్ బీఎస్–4 ద్వారా 70 శాతం విడుదలయితే.. బీఎస్–6 ద్వారా కేవలం 25 శాతమే విడుదలవుతుందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తంగా బీఎస్–6 ఆయిల్ పర్యావరణహితంగా ఉండటమే కాకుండా ఇంజన్ సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని చెబుతున్నారు. భారీ రియాక్టర్ల ఏర్పాటు.. హెచ్‌పీసీఎల్ విస్తరణలో భాగంగా ప్రపంచంలోనే మొదటిసారిగా భారీ రియాక్టర్లను రిఫైనరీ ఏర్పాటులో ఉపయోగిస్తున్నారు. ఈ యూనిట్ కోసం మూడు భారీ రియాక్టర్లు అవసరం కాగా.. ఇప్పటికే విశాఖలోని హెచ్‌పీసీఎల్ ప్లాంటుకు రెండు రియాక్టర్లు చేరుకున్నాయి. ఎల్సీ మ్యాక్స్ (లుమ్మస్ సిటీ మ్యాక్స్) రియాక్టర్లుగా వీటిని పిలుస్తారు. ఒక్కో రియాక్టర్ 67.187 మీటర్ల పొడవు, 12.2 మీటర్ల వెడల్పుతో 2,105 టన్నుల బరువు ఉంటుంది. క్రూడ్ ఆయిల్ నుంచి సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న బీఎస్–6 ఆయిల్‌ను ఉత్పత్తి చేసేందుకు ఈ భారీ రియాక్టర్లను ఉపయోగించనున్నారు. ఎల్ అండ్ టీ సంస్థ ఈ భారీ రియాక్టర్లను సరఫరా చేస్తోంది. హెచ్‌పీసీఎల్ చరిత్రలోనే ఇంత భారీ స్థాయి పెట్టుబడితో రిఫైనరీని చేపట్టడం ఇదే మొదటిసారి. అలాగే ఇదే ప్లాంటులో సొంత విద్యుత్ అవసరాల కోసం క్యాప్టివ్ పవర్ ప్లాంటును కూడా నెలకొల్పుతున్నారు. రోజుకు 3 లక్షల బ్యారల్స్.. వాస్తవానికి.. హెచ్‌పీసీఎల్ రిఫైనరీ సామర్థ్యాన్ని 15 ఎంఎంటీపీఏకు విస్తరించే పనులు ముందస్తు ఒప్పందం ప్రకారం 2020 మధ్యనాటికే పూర్తి చేయాల్సి ఉంది. అయితే కోవిడ్ నేపథ్యంలో విస్తరణ, ఆధునికీకరణ పనులు కాస్త నెమ్మదించాయి. ఫలితంగా 2023 మార్చి నాటికి పూర్తి చేయాలని తాజాగా గడువును నిర్దేశించారు. ప్రస్తుతం ఉన్న రిఫైనరీ 8.3 ఎంఎంటీపీఏ అంటే రోజుకు 1,66,000 బ్యారళ్ల ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తోంది. విస్తరణ, ఆధునికీకరణ పనులు పూర్తయితే ఈ సామర్థ్యం (15 ఎంఎంటీపీఏ)తో రోజుకు 3 లక్షల బ్యారళ్లకు (సుమారు 4.77 కోట్ల లీటర్లు) పెరగనుంది. -
హెచ్‌పీసీఎల్ డివిడెండ్ రూ. 14
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 40 శాతం రూ. 1,795 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం(2020–21) ఇదే కాలంలో రూ. 3,018 కోట్లు ఆర్జించింది. క్యూ4లో స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) 12.44 డాలర్లకు బలపడినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ పుష్ప కుమార్ జోషి పేర్కొన్నారు. 2021 క్యూ4లో 8.11 డాలర్ల జీఆర్ఎం మాత్రమే లభించింది. అయితే చౌకగా కొనుగోలు చేసిన నిల్వల లాభాలను మినహాయిస్తే ఒక్కో బ్యారల్ చమురు శుద్ధిపై 6.42 డాలర్ల మార్జిన్లు సాధించినట్లు జోషి వెల్లడించారు. కాగా.. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ అమ్మకపు నష్టాలు మార్జిన్ల లాభాలను దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. చమురు ధరలు 14ఏళ్ల గరిష్టానికి చేరినప్పటికీ మార్చి 22 నుంచి మాత్రమే వీటి ధరలను పెంచడం ప్రభావం చూపినట్లు వివరించారు. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 14 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 3.72 లక్షల కోట్ల ఆదాయం, రూ. 6,383 కోట్ల నికర లాభం సాధించినట్లు జోషి తెలియజేశారు. 2020–21లో హెచ్‌పీసీఎల్ రూ. 2.69 లక్షల కోట్ల టర్నోవర్ సాధించగా.. రూ. 10,664 కోట్ల నికర లాభం ఆర్జించింది. క్యూ4లో దేశీయంగా 10.26 మిలియన్ టన్నులను విక్రయించగా.. అంతక్రితం 3.83 ఎంటీ అమ్మకాలు నమోదయ్యాయి. వెరసి 4 శాతం వృద్ధి సాధించింది. ఇక పూర్తి ఏడాదిలో 6 శాతం అధికంగా 37.65 ఎంటీ అమ్మకాలు నమోదయ్యాయి. ఇదే కాలంలో ఎల్పీజీ అమ్మకాలు 4.4 శాతం పుంజుకుని 7.7 ఎంటీకి చేరాయి. ఫలితాల నేపథ్యంలో హెచ్‌పీసీఎల్ షేరు ఎన్ఎస్ఈలో 1.5% నీరసించి రూ. 240 వద్ద ముగిసింది. -
బ్యాటరీ స్వాపింగ్ ఫెసిలిటీ.. దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో
దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ నగరంలో బ్యాటరీ స్వాపింగ్ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. మీ ఎలక్ట్రిక్ వెహికల్లో బ్యాటరీ ఛార్జింగ్ తక్కువగా ఉందనిపి పెట్రోలు, డీజిల్ కొట్టించినంత ఈజీగా బ్యాటరీనీ మార్చుకోవచ్చు. హెచ్పీసీఎల్తో కలిసి ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ రంగంలో ఉన్న రేస్ ఎనర్జీస్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్‌తో కలిసి బ్యాటరీ స్వాపింగ్ సెంటర్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. నగరంలో మొత్తం మూడు సెంటర్లు ఓపెన్ చేయాలని రేస్ లక్ష్యంగా పెట్టుకోగా అందులో మొదటి సెంటర్‌ని హైటెక్ సిటీ సమీపంలో ఐకియా ఎదురుగా ఉన్న పెట్రోలు బంకులో అందుబాటులో తెచ్చింది. రెండు నిమిషాల్లో రేస్ ఎనర్జీస్, హెచ్‌పీసీఎల్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన బ్యాటరీ స్వాపింగ్ సెంటర్లో డిస్ ఛార్జ్ అయిన బ్యాటరీ స్థానంలో ఛార్జ్డ్ బ్యాటరీని కేవలం రెండు నిమిషాల్లో ఫిట్ చేస్తారు. బ్యాటరీ స్వాపింగ్కి అనుగుణంగా బైకులు, ఆటోలు (త్రీ వీలర్స్) వరకు ప్రస్తుతం ఇక్కడ బ్యాటరీలు స్వాప్ చేస్తున్నారు. ముఖ్యంగా నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న ఈ ఆటలోకు ఈ స్వాపింగ్ సెంటర్ ఉపయోగకరంగా మారనుంది. అయితే బ్యాటరీ స్వాపింగ్కి ఎంత్ ఛార్జ్ చేస్తున్నారనే అంశంపై రేస్ ఎనర్జీస్ స్పష్టత ఇవ్వలేదు. చదవండి:కొత్త ఏడాదిలో మరింత పెరగనున్న కార్ల ధరలు.. ఎందుకో తెలుసా? -
హెచ్పీసీఎల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలు
హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్,ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్,కంప్యూటర్ సైన్స్(ఐటీ). ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► స్టయిపండ్: నెలకు రూ.25,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 06.12.2021 ► వెబ్సైట్: hpclcareers.com -
ఇక దేశమంతటా పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు!
ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీ పెరుగుతుండటంతో ఈవీ ఇన్ఫ్రా సెక్టార్లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. దేశమంతటా ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) చార్జింగ్ స్టేషన్ల నిర్మాణాలను మొదలుపెట్టాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీఎల్), మరో రెండు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రాబోయే 3-5 ఏళ్లలో 22,000 ఎలక్ట్రిక్ వేహికల్(ఈవి) ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి. ప్రభుత్వ రంగ ఐఓసీఎ రాబోయే మూడేళ్లలో 10,000 ఇంధన అవుట్ లెట్లలో ఈవీ ఛార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేస్తుందని చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య తెలిపారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) రాబోయే ఐదేళ్లలో 7,000 స్టేషన్లను ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఇక హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) కూడా 5,000 స్టేషన్ల కోసం ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొంది. 2021 సీఓపీ26 వాతావరణ మార్పు సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారతదేశం 2070 నాటికి ఉద్గారాలను సున్నాకు తగ్గించనున్నట్లు వివరించారు. అలాగే, భారతదేశం తన తక్కువ కార్బన్ శక్తి సామర్థ్యాన్ని 2030 నాటికి 500 గిగావాట్లకు(జిడబ్ల్యు) పెంచాలని, 2030 నాటికి తన మొత్తం శక్తి అవసరాలలో 50 శాతం తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. (చదవండి: 5జీ స్మార్ట్‌ఫోన్ ఇంత తక్కువ ధరకా!) -
ఎలక్ట్రిక్ వెహికల్ ప్రియులకు హెచ్‌పీసీఎల్ శుభవార్త!
ముంబై: ఎలక్ట్రిక్ వెహికల్ ప్రియులకు హెచ్‌పీసీఎల్ శుభవార్త తెలిపింది. రాబోయే మూడేళ్లలో 5,000 ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ యాజమాన్యంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) యోచిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 84 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. గత కొన్ని నెలలుగా హెచ్‌పీసీఎల్ తన రిటైల్ అవుట్ లెట్లలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్(సీఇఎస్ఎల్), టాటా పవర్, మెజెంటా ఈవీ సిస్టమ్స్ అనే మూడు సంస్థలతో జతకట్టింది. రూ.65,000 కోట్ల పెట్టుబడులు.. "హెచ్‌పీసీఎల్ గ్రీన్ పవర్, గ్రీన్ హైడ్రోజన్ అవకాశాలకు సంబంధించి సమీక్షిస్తోంది" అని హెచ్‌పీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎంకె సురనా కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో తెలిపారు. వివిధ ప్రాజెక్టుల కింద వచ్చే ఐదేళ్లలో సుమారు రూ.65,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో హెచ్‌పీసీఎల్ తన స్టార్ట్-అప్ అభివృద్ధి కార్యక్రమం కింద మెజెంటా ఈవీ సిస్టమ్స్ సహకారంతో మొట్టమొదటి ఈవీ(ఎలక్ట్రిక్ వేహికల్) ఛార్జర్ కేంద్రాన్ని ప్రారంభించింది. "ఛార్జ్ గ్రిడ్ ఫ్లేర్" అని పేరుతో పిలిచే ఈ ఈవీ ఛార్జర్ తక్కువ ధరకు ఛార్జింగ్ సౌకర్యాలను కలిపిస్తుంది. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన రిటైల్ అవుట్ లెట్లలో "ఛార్జ్ గ్రిడ్ ఫ్లేర్" శ్రేణి ఛార్జర్లను ఇన్ స్టాల్ చేయాలని హెచ్‌పీసీఎల్ యోచిస్తోంది.(చదవండి: అథర్ బంపర్ ఆఫర్.. ఏ స్కూటర్‌కైనా ఛార్జింగ్ ఫ్రీ) ఈ-మొబిలిటీ వాహనాల కొనుగోలుకు వినియోగదారులను ప్రోత్సహించడం కోసం, ఈవీ రంగంలో ద్విచక్ర, కార్ల వాహన యాజమానుల బ్యాటరీ ఛార్జింగ్ సమస్యలను పరిష్కరించడం కోసం హెచ్‌పీసీఎల్ మౌలిక సదుపాయాలను అప్ గ్రేడ్ చేస్తోంది. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) యాజమాన్యంలోని సబ్సిడరీ అయిన సీఇఎస్ఎల్తో హెచ్‌పీసీఎల్ ఒప్పందం చేసుకుంది. రాబోయే 10 సంవత్సరాలలో ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్ కతా, పూణేతో వంటి నగరాల్లో ఎంపిక చేసిన రిటైల్ అవుట్ లెట్లలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనుంది. -
నిత్యవసర వస్తువుల అమ్మకాల్లో హిందుస్తాన్ పెట్రోలియం
న్యూఢిల్లీ: హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) ఇంధనేతర వ్యాపారంలోకి ప్రవేశించింది. హ్యాపీ షాప్ పేరుతో తొలి ఔట్‌లెట్‌ను ముంబైలోని క్లబ్ హెచ్‌పీ పెట్రోల్ పంప్లో ప్రారంభించింది. ఆహార పదార్థాలు, సబ్బులు, ఆరోగ్య సంబంధ ఉత్పత్తులు, బేకరీ, సరుకులు, మందుల వంటివి ఇక్కడ లభిస్తాయి. రోజువారీ అవసరమయ్యే వస్తువులను కస్టమర్ల సౌకర్యార్థం 24 గంటలూ అందుబాటులోకి తేవడం కోసం స్టోర్‌ను తెరిచినట్టు కంపెనీ తెలిపింది. హెచ్‌పీ–పే యాప్ ద్వారా హోమ్ డెలివరీ సౌకర్యమూ ఉంది. ఇతర నగరాల్లోనూ ఇటువంటి కేంద్రాలను ప్రారంభిస్తామని కంపెనీ ప్రకటించింది. ఖరీదైన కార్లు, బైక్స్ కోసం 100 ఆక్టేన్ రేటింగ్‌తో అల్ట్రా ప్రీమియం గ్రేడ్ పెట్రోల్‌ను పవర్ 100 పేరుతో హెచ్‌పీసీఎల్ అందుబాటులోకి తెచ్చింది. చదవండి: స్పెషల్ ఎకనామిక్ జోన్, 2.15 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు -
HPCL: స్వల్పంగా గ్యాస్ లీకేజీ..
విశాఖ: విశాఖపట్నంలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) కంపెనీలో బుధవారం స్వల్పంగా గ్యాస్ లీకైంది అయితే, దీన్నిగుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమై గ్యాస్ లీకేజీని అదుపు చేశారు. -
భవిష్యత్తు మొత్తం ఈ వాహనాలదే!
ఒకప్పుడు రైలు బండ్లు బొగ్గుతో నడిచేవి, తర్వాత డీజిల్ ఇంజన్లు వచ్చాయి.. ఇప్పుడు ఎక్కువగా ఎలక్ట్రిక్ ఇంజన్ల ఆధారంగా నడుస్తున్నాయి. ఇక బైకులు, స్కూటర్లు, కార్లు, బస్సులు దాదాపు అన్ని వాహనాలకు పెట్రోలు, డీజిలే ఆధారం. అయితే భవిష్యత్తులో ఇవన్నీ ఎలక్ట్రిక్ బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఎలా ఉంటుంది. ఈవీలకు సంబంధించి మౌలిక సదుపాయలకు సంబంధించి రాబోతున్న మార్పులపై టాటా పవర్ సీఈవో ప్రవీర్ సిన్హా ఎకనామిక్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయలు తెలిపారు. అందులో ప్రధాన విషయాలు మీ కోసం.. విస్తరిస్తున్న ఈవీ ఇండియాలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రముఖ టూ వీలర్ తయారీ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీకి ప్రణాళికలు సిద్ధం చేశాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే మార్కెట్లో అడుగు పెట్టాయి. రెండేళ్ల కిందటి నాటి పరిస్థితులతో పోల్చి చూస్తే ఇప్పుడు ఈవీ టూవీలర్స్ అమ్మకాలు బాగా పెరిగాయి. అంతేకాదు ఒకప్పుడు ఈవీ వెహికల్స్ ధరలు లక్షకు పైగానే ఉండేవి. ఇప్పుడు వాటి ప్రారంభ ధర రూ. 60,000ల దగ్గరకు వచ్చింది. ధరలే ముఖ్యం మిగిలిన దేశాలతో పోల్చితే భారతీయుల ఆలోచణ ధోరణి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఫీచర్లు, ఆప్షన్లు ఎన్ని ఉన్నా ధర ఎంత అన్నదే ప్రధానం. వస్తువు కొనుగోలులో ధర కీలకంగా మారుతుంది. పది లక్షల రూపాయల లోపు ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురాగలిగితే పెను మార్పులు వస్తాయి. ఈవీ కార్ల అమ్మకాలు భారీ స్థాయిలో పెరుగుతాయి. ఆ దిశగా టాటా మోటార్స్ ప్రయత్నిస్తోంది. రాబోయే మూడునాలుగేళ్లలో మార్కెట్లో ఉన్న మిగిలిన కంపెనీలు కూడా ఇదే తరహాలో విభిన్న శ్రేణిల్లో ఈవీ కార్లు తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. టాటావే ఎక్కువ ఈవీ వెహికల్స్‌కి ఛార్జింగ్ అనేది ప్రధాన సమస్య. ప్రస్తుతం ఈ సమస్యపై మార్కెట్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం మన దగ్గరున్న పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లలో టాటావే అధికం. వంద నగరాలతో పాటు జాతీయ రహదారుల వెంట టాటా ఆధ్వర్యంలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు సేవలు అందిస్తున్నాయి. దీనికితోడు ప్రస్తుతం హెచ్‌పీసీఎల్ భాగస్వామ్యంలో భారీ ఎత్తున ఛార్జింగ్ స్టేషన్లు తేబోతున్నాం. అంతేకాదు షాపింగ్‌మాల్స్, కాఫీ షాప్స్, పార్కులు... తదితర జనాలు వచ్చి పోయే చోట్ల కూడా ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశాం. ఛార్జింగ్ స్టేషన్లు హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌తో కలిసి దేశవ్యాప్తంగా 18,000 పెట్రోల్ బంకులలో ఈవీ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను టాటా పవర్ నిర్మించబోతుంది. వీటికి సంబంధించిన పనులు త్వరలో మొదలవుతాయి. ఇక దేశవ్యాప్తంగా 75 వేలకు పైగా పెట్రోలు బంకులు ఉన్నాయి. మిగిలిన కంపెనీలు కూడా ఇదే దిశగా ప్రయత్నాలు చేస్తాయి. తద్వారా పబ్లిక్ ప్లేస్‌లలో ఛార్జింగ్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సమస్య రానివ్వం మన దగ్గర పవర్ కట్ సమస్య ఉంది. ముఖ్యంగా రూరల్ ఇండియాలో కరెంటో కోత సర్వసాధారణమైన సమస్య. దీనిపై అవగాహన ఉంది. పవర్ కట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల పని తీరుపై ప్రభావం పడకుండా అందుబాటులో కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తాం. పవర్ కట్ వచ్చినా ఛార్జింగ్ స్టేషన్ పని చేసేలా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తాం,. - సాక్షి, వెబ్‌డెస్క్ -
పెట్రోల్,డీజిల్ వినియోగదారులకు శుభవార్త
ముంబై: ఇంధన కొనుగోళ్లపై తగ్గింపుల ప్రయోజనాలతో కూడిన కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఐసీఐసీఐ బ్యాంకు విడుదల చేసింది. ‘ఐసీఐసీఐ బ్యాంకు హెచ్‌పీసీఎల్ సూపర్ సేవర్’ కార్డుతో హెచ్‌పీసీఎల్ పెట్రోలియం ఔట్లెట్ల వద్ద చేసే చెల్లింపులపై 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుందని.. ‘హెచ్‌పీపే’ యాప్ ద్వారా కార్డుతో చెల్లింపులు చేసినట్టయితే అదనంగా మరో 1.5 శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. వీసా భాగస్వామ్యంతో ఈ కార్డును ఆఫర్ చేస్తుండగా.. వార్షిక ఫీజు రూ.500గా ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్టాలకు చేరిన తరుణంలో తగ్గింపుల ప్రయోజనాలతో బ్యాంకు ఈ వినూత్నమైన కార్డును ఆవిష్కరించడం మార్కెట్ వాటాను పెంచుకునే వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. తరచుగా సాంకేతిక అవాంతరాలు తలెత్తుండడంతో నూతన క్రెడిట్ కార్డులు జారీ చేయవద్దంటూ హెచ్డీఎఫ్సీ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో పోటీ సంస్థలైన ఎస్బీఐ కార్డ్స్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు.. క్రెడిట్ కార్డుల్లో వాటాను పెంచుకునేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాయి. -
మార్కెట్లోకి కొత్త బంకులు.... పెట్రోలు ధర తగ్గేనా ?
న్యూఢిల్లీ: ఆటో ప్యూయల్ మార్కెట్లో కొత్త పోటీకి కేంద్రం తెర లేపింది. ఇప్పటి వరకు మార్కెట్లో గుత్తాధిపత్యం వహిస్తున్న ప్రభుత్వ కంపెనీలకు పోటీగా మరి కొన్ని సంస్థలను మార్కెట్లోకి ఆహ్వానించింది. కొత్త ప్లేయర్లు పెట్రోలు, డీజిల్ అమ్మకాలు సాగించేందుకు ప్రస్తుతం ఉన్న కంపెనీలకు తోడుగా మరో ఏడు కంపెనీలకు అనుమతులు జారీ చేసింది కేంద్రం. 2019లో మార్కెట్ ఫ్యూయల్ ట్రాన్స్‌పోర్టేషన్ నిబంధనలకు సంబంధించిన నిబంధనల సడలింపుల ఆధారంగా ఈ అనుమతులు ఇచ్చినట్టు బిజినెస్ స్టాండర్డ్ పత్రిక పేర్కొంది. అనుమతి పొందినవి పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్, ఇథనాల్ వంటి ఆటో ఫ్యూయల్స్ అమ్మేందుకు కొత్తగా అనుమతులు సాధించిన కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇండియన్ మోలాసిస్ కంపెనీ (చెన్నై బేస్డ్), అస్సాం గ్యాస్ కంపెనీ, ఆన్సైట్ ఎనర్జీ, ఎంకే ఆగ్రోటెక్, ఆర్‌బీఎంఎల్ సొల్యూషన్స్, మానస్ ఆగ్రో ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు బల్క్, రిటైల్‌గా పెట్రోలు, డీజిల్‌ను అమ్మడానికి అనుమతి ఉంటుంది. 100 బంకులు ఏడాదికి రూ. 500 కోట్ల నెట్‌వర్త్ కలిగిన కంపెనీల నుంచి కేంద్రం పరిశీలనలోకి తీసుకుంది. అనుమతులు సాధించిన కంపెనీలు ఐదేళ్లలో కనీసం వంద పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో 5 శాతం బంకులను పూర్తిగా రిమోట్ ఏరియాల్లోనే ఏర్పాటు చేయాలనే నిబంధన కేంద్రం పొందు పరిచింది. వ్యాపారం జరిగేనా ఇంధన వ్యాపారానికి సంబంధించి కొత్తగా అనుమతులు సాధించిన కంపెనీల్లో ఒక్క రిలయన్స్ ఇండస్ట్ట్రీస్‌కి తప్ప మరే కంపెనీకి దేశవ్యాప్తంగా నెట్వర్క్ లేదు. అస్సాం గ్యాస్ కంపెనీకి మౌలిక వసతులు ఉన్నా అది కేవలం ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైంది. మిగిలిన కంపెనీల్లో చాలా వరకు బల్క్ ఫ్యూయల్ సెల్లింగ్‌కే అనుకూలంగా ఉన్నాయి. ధర తగ్గేనా ప్రస్తుతం ఆటో ఫ్యూయల్ విభాగంలో పోటీ నామామత్రంగా ఉంది. హెచ్‌పీ, ఇండియన్ ఆయిల్, భారత్ వంటి కంపెనీలు ఉన్నా ధరల్లో వత్యాసం లేదు. కొత్త ప్లేయర్లు మార్కెట్లోకి రావడం వల్ల ఫ్యూయల్ ధరలు ఏమైనా కిందికి దిగుతాయోమో చూడాలి. -
హెచ్పీసీఎల్తో టాటా కీలక ఒప్పందం..!
న్యూ ఢిల్లీ: రోజురోజు పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంధన ధరలతో సతమతమవుతున్న ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిపెట్టారు. ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయడానికి ఇప్పటికే పలు కంపెనీలు రంగంలోకి దిగాయి. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తితో పాటు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి పలు కంపెనీలు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాయి. కాగా తాజాగా ప్రముఖ కార్ల తయారీదారు టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకోసం హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)తో టాటా మోటర్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకుల్లో ఛార్జింగ్ స్టేషన్లను టాటా ఏర్పాటుచేయనుంది. ఈ ఒప్పందం ప్రకారం..టాటా పవర్ దేశంలోని పలు నగరాలు, ప్రధాన రహదారులలోని హెచ్‌పీసీఎల్ బంకుల వద్ద టాటా కంపెనీ ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహన యజమానులకు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకు కల్పించడంతో ఎటువంటి ఆందోళన లేకుండా ప్రయాణించటానికి వీలుంటుందని కంపెనీ తెలిపింది. టాటా పవర్ ఈ-జెడ్ ఛార్జ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వినియోగదారులు ఛార్జింగ్‌ను పెట్టుకోవచ్చును. హెచ్‌పీసీఎల్ భాగస్వామ్యం ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి గణనీయంగా పెరుగుతుందని టాటా పవర్ ఆశాభావం వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వ జాతీయ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ (NEMMP) కు అనుగుణంగా చార్జింగ్ స్టేషన్లను టాటా ఏర్పాటుచేయనుంది. టాటా పవర్, ఈవి-ఛార్జింగ్ హెడ్ సందీప్ బాంగియా మాట్లాడుతూ.. హెచ్‌పీసీఎల్ భాగస్వామ్యంతో ఈవీ వాహనదారులకు మరింత ఛార్జింగ్ సులభతరం కానుందని పేర్కొన్నారు. -
విశాఖ: HPCLలో ప్రమాద స్థలాన్ని పరిశీలించిన విచారణ కమిటీ
-
హెచ్పీసీఎల్లో ప్రమాద స్థలాన్ని పరిశీలించిన విచారణ కమిటీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) రిఫైనరీలో జరిగిన ప్రమాద ఘటన స్థలాన్ని విచారణ కమిటీ పరిశీలించింది. క్రూడ్ డిస్టిలరీ యూనిట్ 3 వద్ద ఆర్డీఓ పెంచల కిషోర్‌తో పాటు తొమ్మిది మంది కమిటీ సభ్యలు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుతోపాటు కారణాలపై ఆరాతీశారు. మరోసారి సైతం కమిటీ సభ్యులు హెచ్‌పీసీఎల్ సందర్ఙంచే అవకాశం ఉంది. అలాగే వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని విచారణ కమిటీకి కలెక్టర్ ఆదేశించారు. కాగా విశాఖపట్నంలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) రిఫైనరీలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో రిఫైనరీలోని పాత యూనిట్లో ట్యాంకర్ నుంచి అర కిలోమీటరు దూరంలో ఉన్న ముడిచమురు శుద్ధి ప్లాంట్ (సీడీ–3 ప్లాంట్)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలముకున్నాయి. స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమీప ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన హెచ్‌పీసీఎల్ అధికారులు.. సిబ్బందిని హుటాహుటిన బయటికి తరలించారు. అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం అందించారు. ప్రమాదం జరిగినప్పుడు సీడీ–3 యూనిట్లో మేనేజర్‌తో పాటు నలుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. వీరి సమాచారంతో హెచ్‌పీసీఎల్ ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. ముడిచమురు శుద్ధిచేసే క్రమంలో కొంత పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులు కూడా ఉండటంతో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. బ్లోయర్ నుంచి రెండుసార్లు పేలుడు శబ్దాలు వినిపించాయి. 8 అగ్నిమాపక శకటాలతో పాటు, నేవల్ డాక్‌యార్డు విశాఖపట్నం బృందాలు, హెచ్‌పీసీఎల్ ఫైర్ సేఫ్టీ సిబ్బంది కలిసి గంటన్నరపాటు శ్రమించి సాయంత్రం 4.30 గంటలకు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. -
హెచ్‌పీసీఎల్ ఘటనపై ఐదుగురు సభ్యుల కమిటీతో విచారణ
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) రిఫైనరీలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై విచారణ కోసం ఐదుగురు సభ్యుల సాంకేతిక కమిటీతో కలెక్టర్ వినయ్‌చంద్ విచారణకు ఆదేశించారు. సీడీయూ-3లో ప్రమాదం, ఆయిల్ లీక్‌కు గల కారణాలపై ఈ కమిటీ విశ్లేషించనుంది. అలానే ఐఐపీఎం,ఆంధ్రా యూనివర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్ నిపుణులుతో సాంకేతిక, భద్రతా పరమైన విచారణ జరిపించనున్నారు. ఇందుకు సంబంధించి వారం రోజుల్లో నివేదిక అందుతుందని కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. 45నిముషాలు వ్యవధిలోనే మంటలను అదుపు చేయగలిగాము...సీడీయూ-3తప్ప మిగిలిన అన్ని యూనిట్లలోనూ ఉత్పత్తి యధావిధిగా కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. -
హెచ్పీసీఎల్లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, విశాఖపట్నం/గుంటూరు రూరల్: విశాఖపట్నంలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) రిఫైనరీలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో రిఫైనరీలోని పాత యూనిట్లో ట్యాంకర్ నుంచి అర కిలోమీటరు దూరంలో ఉన్న ముడిచమురు శుద్ధి ప్లాంట్ (సీడీ–3 ప్లాంట్)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలముకున్నాయి. స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమీప ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన హెచ్‌పీసీఎల్ అధికారులు.. సిబ్బందిని హుటాహుటిన బయటికి తరలించారు. అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం అందించారు. ప్రమాదం జరిగినప్పుడు సీడీ–3 యూనిట్లో మేనేజర్‌తో పాటు నలుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. వీరి సమాచారంతో హెచ్‌పీసీఎల్ ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. ముడిచమురు శుద్ధిచేసే క్రమంలో కొంత పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులు కూడా ఉండటంతో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. బ్లోయర్ నుంచి రెండుసార్లు పేలుడు శబ్దాలు వినిపించాయి. 8 అగ్నిమాపక శకటాలతో పాటు, నేవల్ డాక్‌యార్డు విశాఖపట్నం బృందాలు, హెచ్‌పీసీఎల్ ఫైర్ సేఫ్టీ సిబ్బంది కలిసి గంటన్నరపాటు శ్రమించి సాయంత్రం 4.30 గంటలకు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. తక్షణమే స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం హెచ్పీసీఎల్లో అగ్నిప్రమాదం విషయం తెలిసిన వెంటనే పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా తదితరులు హుటాహుటిన హెచ్‌పీసీఎల్‌కు చేరుకున్నారు. పోలీసులు, నౌకాదళ బృందాలు, హెచ్‌పీసీఎల్ అధికారులు.. వందలాదిమంది కార్మికుల్ని బయటికి పంపించే ఏర్పాట్లు చేశారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని కలెక్టర్ వినయ్‌చంద్ ప్రకటించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలవ్వలేదని, ఎలాంటి ప్రాణనష్టం లేదని హెచ్‌పీసీఎల్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ప్రమాదంపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆరా తీశారు. అత్యాధునిక ఏర్పాట్లతో తగ్గిన ప్రమాదతీవ్రత 1997 సెప్టెంబర్‌లో హెచ్పీసీఎల్లో ఘోర ప్రమాదం సంభవించింది. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) పైప్‌లైన్‌లో లీకేజ్ ఏర్పడటంతో 6 స్టోరేజ్ ట్యాంకర్లలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. 2013లో జరిగిన ప్రమాదంలోను పలువురు మృతిచెందారు. ఈ రెండు ప్రమాదాలు సంభవించిన తర్వాత హెచ్‌పీసీఎల్ యాజమాన్యం క్రూడాయిల్, రిఫైనరీ ఆయిల్, గ్యాస్ నిల్వలకు సంబంధించి అత్యాధునిక నియంత్రణ ఏర్పాట్లు చేసింది. ఏ ప్రమాదం సంభవించినా ఆ ట్యాంకర్‌కే పరిమితమయ్యేలా వాల్వ్ సిస్టమ్‌ని ఏర్పాటు చేశారు. ఈ ముందస్తు చర్యల కారణంగానే ప్రస్తుత ప్రమాద తీవ్రత పూర్తిగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ మొత్తం మూడు యూనిట్లోను భారీస్థాయిలో ముడిచమురు, పెట్రోల్, డీజిల్, ఇతర చమురు పదార్థాలు ఉన్నాయి. చివరి యూనిట్లో ప్రమాదం జరిగింది. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ యూనిట్‌కి సంబంధించిన మొత్తం వాల్వ్‌లను మూసివేశారు. దీంతో మంటలు మరో యూనిట్‌కు వ్యాపించకుండా నిలిచిపోయాయి. యూనిట్లో ఉన్న క్రూడాయిల్ మంటల్ని దావానలంలా వ్యాపింపజేసింది. విపత్తు నిర్వహణ బృందాలు మంటల్ని అదుపులోకి తేవడంతో స్థానికులు, ఉద్యోగులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. -
హెచ్‌పీసీఎల్ ఓల్డ్ టర్మినల్ లో అగ్ని ప్రమాదం
-
విశాఖ హెచ్పీసీఎల్లో భారీ అగ్ని ప్రమాదం
-
విశాఖ హెచ్పీసీఎల్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: హెచ్పీసీఎల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సేఫ్టీ సైరన్ మోగడంతో ఉద్యోగులు పరుగులు తీశారు. భారీ శబ్ధం రావడంతో స్థానికులు స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. హెచ్‌పీసీఎల్ నుంచి సాధారణం కంటే దట్టంగా పొగలు వ్యాపించాయి. పరిస్థితిని ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ప్రమాద స్థలాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్, సీపీ మనీష్ కుమార్ పరిశీలించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు: మంత్రి అవంతి హెచ్‌పీసీఎల్ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కూడా కాలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. పరిస్థితి పూర్తి అదుపులో ఉందని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు. పరిస్థితి అంతా అదుపులోనే ఉంది: కలెక్టర్ ఓవర్‌హెడ్ పైప్‌లైన్‌లో లీకేజి వల్ల ప్రమాదం జరిగిందని కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. సీడీయూ మూడో యూనిట్లో ప్రమాదం జరిగిందన్నారు. ఓవర్ హెడ్ పైప్‌లైన్ దెబ్బతినడం వల్ల ప్రమాదం జరిగిందని కలెక్టర్ వివరించారు. యూనిట్ మొత్తాన్ని షట్‌డౌన్ చేశారని.. పరిస్థితి అంతా అదుపులోనే ఉందన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రమాదం జరిగిన 15 నిమిషాల్లోనే సమాచారం వచ్చిందని.. వెంటనే అంతా అప్రమత్తమయ్యామని తెలిపారు. చదవండి: తిరుపతి ఎస్వీవీయూలో ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలు -
హెచ్‌పీసీఎల్‌కు చేరుకున్న భారీ రియాక్టర్
మల్కాపురం (విశాఖ పశ్చిమ): విశాఖ షిప్‌యార్డ్ నుంచి భారీ రియాక్టర్‌ను మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో హెచ్‌పీసీఎల్‌కు తరలించారు. గత రెండేళ్ల నుంచి హెచ్‌పీసీఎల్ సంస్థ విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందుకు అవసరమైన భారీ రియాక్టర్లను గుజరాత్‌లోని ఎల్అండ్టీ సంస్థ తయారుచేస్తోంది. గుజరాత్ నుంచి రియాక్టర్లు సముద్రమార్గం ద్వారా షిప్‌యార్డ్‌కు వస్తున్నాయి. అక్కడ నుంచి భారీ వాహనం సాయంతో హెచ్‌పీసీఎల్‌కు తరలిస్తున్నారు. ఇదేవిధంగా మంగళవారం షిప్‌యార్డ్‌కు వచ్చిన భారీ రియాక్టర్‌ను అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన భారీ హైడ్రాలిక్ వాహనం సాయంతో హెచ్‌పీసీఎల్‌కు చేరవేశారు. ట్రాఫిక్ సమస్యలు ఉండవని తెల్లవారుజామునే అధికారులు రియాక్టర్‌ను తరలించారు. -
విశాఖలో బీఎస్–6 ఇంధన ఉత్పత్తి
సాక్షి, విశాఖపట్నం: కాలుష్య నియంత్రణకు సంబంధించి విశాఖపట్నం ప్రముఖ పాత్ర పోషించనుంది. వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలను నియంత్రించేందుకు అవసరమైన భారత్ స్టేజ్–6 (బీఎస్–6) ఇంధనం ఉత్పత్తి చేసేందుకు విశాఖ కేంద్రంగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద రియాక్టర్లు విశాఖకు చేరుకున్నాయి. బీఎస్–6 వాహనాలు వినియోగించాలని ఏడాది కిందటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బీఎస్–4 వాహనాలతో పోలిస్తే.. బీఎస్–6 వాహనాల నుంచి వచ్చే కాలుష్యం చాలా తక్కువ. బీఎస్–6 పెట్రోల్ వాహనం నుంచి నైట్రోజన్ ఆక్సైడ్ 25 శాతం వరకు తక్కువ వెలువడుతుంది. దీనికి కారణం.. ఆయా వాహనాలకు అనువైన పెట్రోల్ తయారు చేయడమే. బీఎస్–6కి అవసరమైన ఇంధన వనరుల ఉత్పత్తికి విశాఖ కేంద్రం కానుంది. కాలుష్య ఉద్గారాల్ని తగ్గించేలా బీఎస్–6 ప్రమాణాలకు అనుగుణంగా ఇంధనాలు ఉత్పత్తి చేసే వ్యవస్థకు హెచ్‌పీసీఎల్ కొద్ది రోజుల్లో శ్రీకారం చుట్టనుంది. విశాఖలో హెచ్‌పీసీఎల్ విస్తరణలో ఆధునిక ప్రాజెక్టులో భాగంగా.. బీఎస్–6 పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి చేపట్టనుంది. ఇందుకుగాను రిఫైనరీ ప్రాజెక్టు విస్తరణలో అత్యంత కీలకమైన భారీ రియాక్టర్లు విశాఖకు చేరుకున్నాయి. అత్యంత కీలకమైన మూడు ఎల్సీ మ్యాక్స్ (లుమ్మస్ సిటీస్ మ్యాక్స్) రియాక్టర్లను విశాఖ రిఫైనరీలో ఏర్పాటు చేస్తారు. ఎల్ అండ్ టీ సంస్థ వీటిని తయారుచేసి గుజరాత్లో హెచ్‌పీసీఎల్ ప్రధాన కార్యాలయానికి అప్పగించింది. ఇప్పటికే రెండు రియాక్టర్లను సముద్రమార్గం ద్వారా విశాఖ తీసుకొచ్చారు. త్వరలో మూడో రియాక్టర్ వచ్చిన తరువాత వీటిని అమరుస్తారు. 67.817 మీటర్ల పొడవు, 12.2 మీటర్ల వెడల్పుతో ఉన్న ఒక్కో రియాక్టర్ బరువు 2,105 టన్నులు. ప్రపంచంలోనే అతిపెద్దవైన ఈ మూడు రియాక్టర్లు దేశంలో తొలిసారి ఆర్.యు.ఎఫ్. (రిసిడ్యూ అప్‌గ్రేడేషన్ ఫెసిలిటీ) క్రూడ్ ఆయిల్ నుంచి బీఎస్–6 డీజిల్‌ను తీసేందుకు ఉపయోగపడనున్నాయి. సల్ఫర్ అత్యధికంగా ఉండే ముడి చమురును కూడా.. బీఎస్–6 ప్రమాణాలకు అనువైన అధిక నాణ్యత కలిగిన పెట్రోల్, డీజిల్‌గా మార్చే ప్రక్రియను ఇక్కడ చేపడతారు. త్వరలోనే పనులు ప్రారంభం విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద రియాక్టర్లు హెచ్‌పీసీఎల్‌కు చేరుకున్నాయి. త్వరలో మూడో రియాక్టర్ కూడా రానుంది. వీటి ద్వారా బీఎస్–6 వాహనాలకు అవసరమైన ఇంధనాన్ని ఉత్పత్తి చేసి.. హెచ్‌పీసీఎల్ మరో ముందడుగు వేయనుంది. చమురు ఉత్పత్తుల్ని మెరుగుపరచడమే కాకుండా ఫీడ్ స్టాక్ పెంచేందుకు కూడా ఈ రియాక్టర్లు ఉపయోగపడతాయి. – రతన్‌రాజ్, హెచ్‌పీసీఎల్ విశాఖ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
హెచ్‌పీసీఎల్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి
ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందూస్థాన్ పెట్రోలి యం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్).. ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 200 » పోస్టుల వివరాలు: మెకానికల్ ఇంజనీర్–120, సివిల్ ఇంజనీర్– 30, ఎలక్ట్రికల్ ఇంజనీర్–25, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్–25. » మెకానికల్ ఇంజనీర్: అర్హత: కనీసం 60శాతం మార్కులతో మెకానికల్, మెకానికల్ అండ్ ప్రొడక్షన్ సబ్జెక్టుల్లో నాలుగేళ్ల ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. » వయసు: 25 ఏళ్లు మించకూడదు. » సివిల్ ఇంజనీర్: అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో నాలుగేళ్ల ఫుల్‌టైం రెగ్యులర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 25 ఏళ్లు మించకూడదు. » ఎలక్ట్రికల్ ఇంజనీర్: అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టుల్లో నాలుగేళ్ల ఫుల్‌టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. » వయసు: 25 ఏళ్లు మించకూడదు. » ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్: అర్హత: ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టుల్లో నాలుగేళ్ల ఫుల్‌టైం రెగ్యులర్ ఇంజనీర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 25 ఏళ్లు మించకూడదు. » ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. » కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో మెరిట్ సాధించిన అభ్యర్థుల్ని పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ టాస్క్‌కి పిలుస్తారు. అన్ని పరీక్షల్లో తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు సాధించాలి. ఎంపికైన అభ్యర్థులకు ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.04.2021 » వెబ్సైట్: https://www.hindustanpetroleum.com/hpcareers/current_openings -
ఆ బిల్లు పెట్రోల్ బంక్‌లో ఇచ్చింది కాదు!
ముంబై: దేశంలో లీటర్ పెట్రోలు వంద రూపాయలు దాటడంతో సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వంపై సెటైర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఫేక్ న్యూస్ నెట్టింట విహంగ వీక్షణం చేస్తోంది. దీని ప్రకారం.. పెట్రోల్ రేటు తగ్గాలంటే మోదీకి ఓటేయొద్దని ముంబైలోని సాయి బాలాజీ పెట్రోలియం బంక్ ప్రచారం నిర్వహిస్తోంది. ఈ బంకులో పెట్రోల్ కొట్టించుకున్నాక వాహనదారులకు ఇచ్చే రశీదులో మరోసారి మోదీకి ఓటేసి భంగపాటుకు గురి కావద్దని పిలుపునిస్తోంది. ఈ రశీదుకు సంబంధించిన ఫొటోలు తాజాగా ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో పలువురు వీటిని తిరిగి షేర్ చేస్తున్నారు. కానీ కంటికి కనిపించేదంతా నిజం కాదు అన్నట్లుగా పైన కనిపిస్తుంది పెట్రోల్ బంకులో ఇచ్చిన బిల్లు కానే కాదట. హెచ్‌పీసీఎల్(హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) ఈ ఫేక్ ఫొటోపై స్పందిస్తూ ఇది సరైన ఫార్మాట్లో లేదని, ఇది నకిలీ బిల్లు అని స్పష్టం చేసింది. ఇందుకోసం ఫేక్ బిల్లు పక్కన రియల్ బిల్లు ఫొటోలను పెట్టి షేర్ చేసింది. ఇక ఆ నకిలీ బిల్లు ఫొటోను తరచి చూస్తే అది 2018లోది అని తెలుస్తోంది. మరో ముఖ్య విషయమేంటంటే ఆ బిల్లు మీద హెచ్‌పీ లేదా హెచ్‌పీసీఎల్‌కు బదులుగా హెచ్పీఎల్ అని తప్పుగా రాసి ఉంది. పైగా ముంబైలోని విక్రోలి ప్రాంతంలో సాయి బాలాజీ పెట్రోలియం బంకే లేదట. కాబట్టి ఇదో శుద్ధ ఫేక్ న్యూస్. మోదీకి వ్యతిరేక ప్రచారం చేసేందుకు దీన్ని ఉద్దేశపూర్వకంగా సృష్టించారు. చదవండి: వాళ్ల కడుపు కాలుతుంటే బర్గర్లు తింటున్న గ్రెటా? ఆ రెస్టారంట్ మె‘న్యూ’ చూస్తే కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే.. -
సబ్సిడీలేని సిలిండర్లపై మళ్లీ బాదుడు
ముంబై, సాక్షి: వంట గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. సబ్సిడీ వర్తించని 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ల ధరలు తాజాగా రూ. 50 చొప్పున ఎగశాయి. దీంతో ఢిల్లీలో వీటి ధరలు ప్రస్తుతం రూ. 644ను తాకాయి. ఇక కోల్‌కతాలో అయితే రూ. 670.5కు చేరాయి. ఈ ధరలు ముంబైలో రూ. 644కాగా.. చెన్నైలో రూ. 660గా నమోదయ్యాయి. సుమారు రెండు వారాల క్రితం సైతం సబ్సిడీలేని ఎల్పీజీ సిలిండర్ల ధరలు రూ. 50 చొప్పున పెరిగిన విషయం విదితమే. సాధారణంగా విదేశాలలో ధరలు, రూపాయి మారకం తదితర అంశాల ఆధారంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వంట గ్యాస్ ధరలను నెలకోసారి సమీక్షిస్తుంటాయి. కాగా.. ప్రభుత్వం ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీపై అందించే సంగతి తెలిసిందే. ఇతర వివరాలు చూద్దాం.. ఇతర సిలిండర్లకూ తాజాగా ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఇతర వంట గ్యాస్(ఎల్పీజీ) సిలిండర్లపైనా పెంపును ప్రకటించాయి. 5 కేజీల సిలిండర్‌పై తాజాగా రూ. 18 వడ్డించగా.. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలిండర్‌పైనా రూ. 36.5 పెంపును చేపట్టాయి. ఇంతక్రితం 19 కేజీల సిలిండర్‌పై రూ. 54.5ను పెంచడంతో రెండు వారాల్లోనే వీటి ధరలు రూ. 100 పెరిగినట్లయ్యింది. వెరసి ప్రస్తుతం వీటి ధరలు రూ. 1,296కు చేరాయి. -
రెండో రోజూ పెట్రో ధరల వడ్డింపు
న్యూఢిల్లీ, సాక్షి: వరుసగా రెండో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలలో సగటున 15-25 పైసల మధ్య ధరలు ఎగశాయి. తాజాగా న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 15 పైసలు పెరిగి 81.38ను తాకింది. ఈ బాటలో డీజిల్ ధరలు సైతం లీటర్‌కు 20 పైసలు అధికమై 70.88కు చేరాయి. ఇదే విధంగా ముంబైలో పెట్రోల్ లీటర్ 17 పైసలు పెరిగి రూ. 88.09కు చేరగా.. డీజిల్ 23 పైసలు పెరిగి రూ. 77.34ను తాకింది. చెన్నైలో పెట్రోల్ ధర 15పైసలు బలపడి రూ. 84.46కాగా.. డీజిల్ 20 పైసలు పెరిగి రూ. 76.37కు చేరింది. ఇక కోల్‌కతాలో పెట్రోల్ ధర 16 పైసలు బలపడి రూ. 82.95ను తాకగా.. డీజిల్ 21 పైసలు హెచ్చి రూ. 74.45కు చేరింది. ముందు రోజు సైతం పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు 17-28 పైసల స్థాయిలో ఎగసిన విషయం విదితమే. వ్యాట్ తదితరాల నేపథ్యంలో రాష్ట్రాలవారీగా పెట్రోల్, డీజిల్ ధరలలో వ్యత్యాసాలు నమోదవుతుంటాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో వివిధ పన్నులే 70 శాతం వరకూ వాటాను ఆక్రమిస్తుంటాయని ఈ సందర్భంగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. సుమారు 48 రోజులపాటు నిలకడను ప్రదర్శించిన పెట్రోల్, డీజిల్ ధరలు తిరిగి శుక్రవారం నుంచి పెరుగుతూ వస్తున్నాయి! విదేశీ ఎఫెక్ట్ విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. కాగా.. శుక్రవారం లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ దాదాపు 2 శాతం జంప్‌చేసి 45 డాలర్ల చేరువలో ముగిసింది. ఇక న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ సైతం 1 శాతం ఎగసి 42.15 డాలర్ల వద్ద స్థిరపడింది. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. ఈ అంశాల ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు పీఎస్‌యూలు.. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ సవరిస్తుంటాయి. -
హెచ్ పీసీఎల్ బైబ్యాక్- ఎస్ఆర్ఎఫ్ జోష్
సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు అనుమతించినట్లు వెల్లడించడంతో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్ పీసీఎల్) కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో విభిన్న స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీ ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. హెచ్ పీసీఎల్ ఒక్కో షేరుకి రూ. 250 ధర మించకుండా 10 కోట్ల షేర్లవరకూ కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు హెచ్ పీసీఎల్ తాజాగా వెల్లడించింది. ఇది కంపెనీ ఈక్విటీలో 6.56 శాతం వాటాకు సమానంకాగా.. బైబ్యాక్ కోసం రూ. 2,500 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. కాగా.. ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో కంపెనీ నికర లాభం రూ. 1052 కోట్ల నుంచి రూ. 2,477 కోట్లకు ఎగసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం రూ. 66,165 కోట్ల నుంచి రూ. 61,340 కోట్లకు నీరసించింది. క్యూ2లో స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 5.11 డాలర్లకు చేరాయి. ఈ నేపథ్యంలో హెచ్ పీసీఎల్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 7.5 శాతం జంప్ చేసి రూ. 201 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 203 వరకూ లాభపడింది. ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఎస్ఆర్ఎఫ్ నికర లాభం 57 శాతం పెరిగి రూ. 316 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 21 శాతం బలపడి రూ. 1,738 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఎస్ఆర్ఎఫ్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 7.2 శాతం జంప్ చేసి రూ. 4,763 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 4,789 వరకూ లాభపడింది. ఈ కౌంటర్లో సగటు ట్రేడింగ్ పరిమాణం 4,980 షేర్లుకాగా.. తొలి రెండు గంటల్లో రెండు రెట్లు అధికంగా 11,100 షేర్లు చేతులు మారాయి. -
హెచ్‌పీసీఎల్, ఏంజెల్ బ్రోకింగ్.. భేష్
స్వల్ప ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 168 పాయింట్లు పెరిగి 39,918కు చేరగా.. నిఫ్టీ 63 పాయింట్లు బలపడి 11,734 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా ఓవైపు ఇంధన రంగ పీఎస్‌యూ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్), మరోపక్క ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కంపెనీల షేర్లూ భారీ లాభాలతో దూకుడు చూపుతున్నాయి. వివరాలు చూద్దాం.. హెచ్‌పీసీఎల్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ప్రతిపాదించినట్లు చమురు రిఫైనరీ దిగ్గజం హెచ్‌పీసీఎల్ తాజాగా పేర్కొంది. ఈ అంశంపై వచ్చే నెల 4న(బుధవారం) సమావేశంకానున్న కంపెనీ బోర్డు చర్చించనున్నట్లు తెలియజేసింది. అదేరోజు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్- జూన్)లో హెచ్‌పీసీఎల్ నికర లాభం 157 శాతం దూసుకెళ్లి రూ. 2,253 కోట్లకు చేరగా.. నికర అమ్మకాలు మాత్రం 47 శాతం క్షీణించి రూ. 37,559 కోట్లకు పరిమితమైన విషయం విదితమే. కాగా.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో హెచ్‌పీసీఎల్ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 189 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 190 వరకూ పెరిగింది. ఏంజెల్ బ్రోకింగ్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఇటీవల జోరు చూపుతున్న ఏంజెల్ బ్రోకింగ్ కౌంటర్‌కు మరోసారి డిమాండ్ నెలకొంది. కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ బల్క్‌డీల్ ద్వారా కంపెనీలో 0.53 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడం దీనికి కారణమైంది. షేరుకి రూ. 321.73 ధరలో 4.3 లక్షల ఈక్విటీ షేర్లను సొంతం చేసుకున్నట్లు ఎన్ఎస్ఈ డేటా పేర్కొంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఏంజెల్ బ్రోకింగ్ షేరు 12.5 శాతం దూసుకెళ్లి రూ. 367 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 17 జంప్‌చేసి రూ. 379ను తాకింది. గత నాలుగు రోజుల్లో ఏంజెల్ బ్రోకింగ్ షేరు 52 శాతం ర్యాలీ చేసింది. ఇందుకు క్యూ2 ఫలితాలు దోహదం చేస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. క్యూ2లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా దాదాపు రూ. 75 కోట్ల నికర లాభం ఆర్జించిన విషయం విదితమే. -
హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌కు భారీ జరిమానా
సాక్షి, ముంబై: ప్రమాదకర వాయు కాలుష్య కారకాలను వెదజల్లుతున్న కంపెనీలకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) భారీ షాకిచ్చింది. ముంబై పరిసర ప్రాంతాల్లో తీవ్ర వాయు కాలుష్యాన్ని సృష్టిస్తున్నారంటూ హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ సహా నాలుగు కంపెనీలకు భారీ జరిమానా విధించింది. తమ ఇళ్లకు కేవలం మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన యూనిట్, కాలుష్యంపై 2014 లో మహుల్, అంబపాడ గ్రామాల నివాసితులు దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఎన్జీటీ ఈ తీర్పు నిచ్చింది ముంబైలోని మహుల్, అంబపాడ, చెంబూర్ ప్రాంతాలలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉందని, గ్యాస్ చాంబర్ లాంటి పరిస్థితి ఏర్పడిందని ఎన్జీటీ అభిప్రాయపడింది. ఈ ప్రాంతంలో రానున్న ఐదేళ్లలో గాలి నాణ్యతను పునరుద్ధరించేలా 286 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలని ఈ కంపెనీలను కోరింది. హెచ్‌పీసీఎల్‌కు 76.5 కోట్లు, బీపీసీఎల్‌కు 7.5 కోట్లు, ఏఇజిఐఎస్ 142 కోట్లు, ఎస్‌ఎల్‌సిఎల్‌కు 2 0.2 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీపీబీ),సంబంధిత కంపెనీల డేటా ఆధారంగా ఉద్గారాల విలువలను అంచనా వేసినట్లు గ్రీన్ ప్యానెల్ తెలిపింది. కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు పది మంది సభ్యులతో కూడిన ఒక జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్జీటీ అధ్యక్షుడు జస్టిస్ఏకే గోయల్ వెల్లడించారు. -
హెచ్‌పీసీఎల్ లాభం 157 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) నికర లాభం 157 శాతం ఎగిసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 2,253 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఇది రూ. 877 కోట్లు. రిఫైనరీల సామర్థ్యాన్ని గణనీయంగా వినియోగించుకోవడం, పరిశ్రమతో పోలిస్తే మరింత మెరుగైన పనితీరు కనపర్చడం వల్ల కరోనా వైరస్‌పరమైన సవాళ్లు ఉన్నప్పటికీ సానుకూల ఫలితాలు సాధించగలిగినట్లు హెచ్‌పీసీఎల్ సీఎండీ ముకేశ్ కుమార్ సురానా తెలిపారు. క్యూ1లో అమ్మకాలు రూ. 45,945 కోట్లకు క్షీణించినప్పటికీ నికర లాభాలు పెరగడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అమ్మకాలు రూ. 74,596 కోట్లు. లాక్డౌన్ కారణంగా ఏప్రిల్‌లో పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాలు భారీగా పడిపోయాయని, అయితే క్రమంగా ఆంక్షల సడలింపుతో మళ్లీ పుంజుకుంటున్నాయని సురానా చెప్పారు. -
ప్రభుత్వరంగ షేర్లలో అనూహ్య ర్యాలీ ఎందుకంటే..?
బీపీసీఎల్‌తో సహా సుమారు 12 ప్రభుత్వరంగ షేర్లు శుక్రవారం 5శాతం నుంచి 13శాతం లాభపడ్డాయి. అంతర్జాతీయ ఆయిల్ దిగ్గజ కంపెనీలు బీపీసీఎల్‌లో వాటా కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇది అండర్వాల్యూ వేయబడిన పీఎస్‌యూ స్టాక్స్‌ల రీ-రేటింగ్‌కు దారీతీయవచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు పీఎస్‌యూ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా నిన్న మార్కెట్ ముగిసేసరికి బీపీఎసీఎల్ 12.50శాతం, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ 12శాతం, భారత్ డైనమిక్స్, చెన్నై పెట్రోలియం, హెచ్‌పీసీఎల్, హిందూస్థాన్ కాపర్, ఎన్బీసీసీ షేర్లు 10శాతం నుంచి 5శాతం లాభడపడ్డాయి. ఈ అంశాలూ సహకరించాయ్: వ్యూహాత్మక వాటాల ఉపసంహరణతో పాటు, మెరుగైన వాల్యుయేషన్ లిక్విడిటీ కూడా పీఎస్‌యు స్టాక్స్‌ల ర్యాలీని నడిపించాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. హెచ్‌పీసీఎల్, ఇక్రాన్ ఇంటర్నేషనల్, బీఈఎంఎల్, ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, ఎన్ఎండీసీ షేర్లు ప్రస్తుతం వాటి బుక్ వాల్యూ వద్ద లేదా బుక్‌వాల్యూ దిగువునన ట్రేడ్ అవుతున్నాయి. అన్ని ఓఎంసీలకు కలిసొస్తుంది: రిలయన్స్ సెక్యూరిటీస్ పెట్రోల్, డీజిల్‌పై అధిక నికర మార్కెటింగ్ మార్జిన్ల ద్వారా పటిష్టమైన ఫైనాన్సియల్ కొనసాగిస్తూ బీపీసీఎల్‌లో అధిక వ్యాల్యూను పొందడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రిలయన్స్ సెక్యూరిటీస్ బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. అధిక నికర మార్కెటింగ్ మార్జిన్లు కేవలం బీపీసీఎల్‌కు మాత్రమే లాభాన్ని చేకూర్చడమే కాకుండా, హెచ్‌పీసీఎల్, ఆయిల్ కార్పోరేషన్ ఇండియాతో పాటు అన్ని అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు సానుకూలమే అవుతుందని రియలన్స్ సెక్యూరిటీస్ తెలిపింది. బిడ్ల దాఖలకు చివరి తేది పొడగింపు: బీపీసీఎల్‌లో 51శాతం నియంత్రణ వాటాను దక్కించుకునేందుకు గ్లోబల్ ఇంధన సంస్థలైన సౌదీ అరేబియాకు చెందిన ఆర్కామ్కో, రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్,, ఎగ్జాన్ మొబిల్, అబుధబీ నేషనల్ ఆయిల్ తదితరాలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇటీవల బీపీసీఎల్ వాటా కోసం ముగింపు బిడ్ల తేదీని జూలై 31కు పొడిగించింది. బీపీసీఎల్ ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .96,000 కోట్లుగా ఉంది. వాటాను చేజిక్కుంచుకునేందుకు కంపెనీలు సమర్పించిన బిడ్ విలువ రూ.1.2లక్షల కోట్లుగా ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
విదేశీ ఆసక్తి: చమురు షేర్లకు డిమాండ్
ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్లో వాటా కొనుగోలుకి గ్లోబల్ దిగ్గజాలు ఆసక్తి చూపుతున్న వార్తలతో పెట్రో ఉత్పత్తుల మార్కెటింగ్ కంపెనీ కౌంటర్లు వెలుగులో నిలుస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. వెరసి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఎన్ఎస్ఈలో బీపీసీఎల్ షేరు తొలుత 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికంకావడంతో రూ. 39 ఎగసి రూ. 433 ఎగువన ఫ్రీజయ్యింది. ఈ కౌంటర్లో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరిగింది. ఉదయం 11.40 కల్లా ఈ కౌంటర్లో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో కలిపి 1.6 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీలో భాగంకావడంతో బీపీసీఎల్ కౌంటర్.. తదుపరి సర్క్యూట్ నుంచి రిలీజ్అయ్యింది. ప్రస్తుతం 11 శాతం ఎగసి రూ. 437 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో గరిష్టంగా రూ. 442ను తాకింది. 2 రోజులుగా.. వాటా విక్రయ వార్తల నేపథ్యంలో గత రెండు రోజుల్లో బీపీసీఎల్ షేరు 14 శాతం దూసుకెళ్లడం గమనార్హం! ఈ బాటలో ప్రస్తుతం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) షేరు ఎన్ఎస్ఈలో 7 శాతం జంప్‌చేసి రూ. 224 వద్ద ట్రేడవుతోంది. ఇక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) సైతం 3 శాతం లాభపడి రూ. 87 వద్ద కదులుతోంది. ఇతర వివరాలు చూద్దాం.. సౌదీ అరామ్కో.. ఇంధన రంగ పీఎస్‌యూ.. బీపీసీఎల్‌లో వాటా విక్రయానికి ప్రభుత్వం ఇటీవల ప్రణాళికలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలుకి ఆసక్తి ఉన్న కంపెనీలకు ఆహ్వానం(ఈవోఐ) పలికింది. ఇందుకు ఈవోఐలను దాఖలు చేసేందుకు ఈ నెల(జులై) 31వరకూ గడువు ఇచ్చింది. బీపీసీఎల్ కొనుగోలుకి విదేశీ ఇంధన దిగ్గజాలు సౌదీ అరామ్కో, రాస్‌నెఫ్ట్, ఎగ్జాన్ మొబిల్, అబుధబీ నేషనల్ ఆయిల్ తదితరాలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం బీపీసీఎల్‌లో ఉన్న 114.9 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టనుంది. వెరసి 52.98 శాతం వాటా విక్రయం ద్వారా కొనుగోలుదారుకు యాజమాన్య నియంత్రణను సైతం బదిలీ చేయనుంది. అయితే నుమాలిగఢ్ రిఫైనరీలో బీపీసీఎల్‌కున్న 61.65 శాతం వాటాను మరో ఆయిల్ పీఎస్యూకు ప్రభుత్వం బదిలీ చేయనుంది. -
నవీన్ ఫ్లోరిన్- హెచ్‌పీసీఎల్ జోరు
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికం(జనవరి-మార్చి)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోపక్క గత ఆర్థిక సంవత్సర పూర్తి ఫలితాలు నిరాశపరచినప్పటికీ పెట్టుబడుల బాటలో సాగనున్నట్లు తెలియజేయడంతో పీఎస్‌యూ దిగ్గజం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) కౌంటర్ సైతం జోరందుకుంది. వెరసి ఆటుపోట్ల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ నికర లాభం 705 శాతం దూసుకెళ్లి రూ. 270 కోట్లను తాకింది. రూ. 88 కోట్లమేర కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్)లభించడంతో లాభాలు హైజంప్ చేసినట్లు నిపుణులు పేర్కొన్నారు. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర అమ్మకాలు 9 శాతం పెరిగి రూ. 277 కోట్లకు చేరాయి. ఇక ఇబిటా మార్జిన్లు 20 శాతం నుంచి దాదాపు 25 శాతానికి మెరుగుపడ్డాయి. వాటాదారులకు షేరుకి రూ. 3 డివిడెండ్ చెల్లించనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నవీన్ ఫ్లోరిన్ షేరు ఎన్ఎస్ఈలో 3.5 శాతం పుంజుకుని రూ. 1615 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1655 వరకూ జంప్‌చేసింది. హిందుస్తాన్ పెట్రోలియం ఇంధన రంగ దిగ్గజం హెచ్‌పీసీఎల్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21)లో రూ. 12,000 కోట్లమేర పెట్టుబడి వ్యయాల ప్రణాళికలను అమలు చేయనున్నట్లు తాజాగా తెలియజేసింది. ముంబై, వైజాగ్‌లలోని రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టులు తుది దశకు చేరుకున్నట్లు కంపెనీ చైర్మన్ ముకేశ్ కుమార్ పేర్కొన్నారు. ఇతర పనుల కారణంగా బార్మర్ అభివృద్ధి ప్రాజెక్టుపై పెట్టుబడులను తదుపరి దశలో చేపట్టనున్నట్లు తెలియజేశారు. కాగా.. గతేడాది(2019-20)కి హెచ్‌పీసీఎల్ 50 శాతం తక్కువగా రూ. 2637 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం రూ. 6029 కోట్ల నికర లాభం నమోదైంది. తాజా ఫలితాలలో చమురు నిల్వలపై ఏర్పడిన నష్టాలు, ఫారెక్స్ హెచ్చుతగ్గులు లాభాలను ప్రభావితం చేసినట్లు కంపెనీ వెల్లడించింది. స్థూల అమ్మకాలు రూ. 2,95,713 కోట్ల నుంచి రూ. 2,86,250 కోట్లకు క్షీణించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హెచ్‌పీసీఎల్ షేరు ఎన్ఎస్ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 218 వద్ద ట్రేడవుతోంది. -
బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ జూమ్
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో లాక్‌డవున్‌ను ఎత్తివేస్తున్న నేపథ్యంలో ముడిచమురు ధరలు బలపడుతున్నాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ తాజాగా 42 డాలర్లను తాకింది. కోవిడ్-19 కట్టడికి ప్రపంచవ్యాప్తంగా లాక్‌డవున్‌కు తెరతీయడంతో ఏప్రిల్‌లో రెండు దశాబ్దాల కనిష్టం 16 డాలర్లకు పడిపోయిన విషయం విదితమే. గత రెండు వారాలలో బ్రెంట్ చమురు 109 శాతం బలపడటం గమనార్హం! కాగా.. దేశీయంగానూ ఆర్థిక కార్యకలాపాల అన్‌లాకింగ్‌ను మొదలుపెట్టడంతో పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ పెరగనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇంధన రంగ ప్రభుత్వ కంపెనీలు భారత్ పెట్రోలియం(బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం(హెచ్‌పీసీఎల్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఖుషీ ఖుషీగా ప్రస్తుతం ఎన్ఎస్ఈలో బీపీసీఎల్ షేరు 6.4 శాతం దూసుకెళ్లి రూ. 393 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 398ను అధిగమించింది. ఈ బాటలో హెచ్‌పీసీఎల్ 6.7 శాతం జంప్‌చేసి రూ. 218 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 222ను దాటింది. ఇక ఐవోసీ 4 శాతం పుంజుకుని రూ. 93 వద్ద కదులుతోంది. తొలుత రూ. 96ను అధిగమించింది. రెస్టారెంట్లు, మాల్స్, హోటళ్లతోపాటు పూర్తిస్థాయిలో దుకాణాలు, కార్యాలయాలను తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించడంతో పెట్రోల్, డీజిల్ వినియోగం ఊపందుకోనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఇదీ తీరు పెట్రోలియం ప్రొడక్టులకు మే నెలలో డిమాండ్ 65-70 శాతానికి చేరగా.. కోవిడ్‌కు ముందు స్థాయికంటే ఇది 30-35 శాతమే తక్కువని పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. ఇక ఏప్రిల్‌లో 50-60 శాతం క్షీణించిన ఆటో ఇంధన విక్రయాలు వార్షిక ప్రాతిపదికన ప్రస్తుతం 25 శాతమే తక్కువగా నమోదవుతున్నట్లు వివరించాయి. ఈ బాటలో వైమానిక ఇంధన(జెట్ ఫ్యూయల్) డిమాండ్ సైతం 50 శాతం రికవర్ అయినట్లు ఐడీబీఐ క్యాపిటల్ తెలియజేసింది. ఏప్రిల్‌లో 63 శాతం సామర్థ్యాన్ని మాత్రమే వినియోగించుకున్న బీపీసీఎల్ రిఫైనరీ మే నెలలో 77 శాతం, ప్రస్తుతం 83 శాతం ఉత్పత్తికి చేరింది. ఇదే విధంగా ఐవోసీ, హెచ్‌పీసీఎల్ సైతం 80 శాతానికిపైగా సామర్థ్య వినియోగంతో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. -
హెచ్‌పీసీఎల్ నుంచి భారీగా పొగలు, కలకలం
-
విశాఖలో భారీగా పొగలు, కలకలం
సాక్షి, విశాఖపట్నం: హిందూస్టాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) రిఫైనరీ నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడంతో విశాఖపట్నంలో కలకలం రేగింది. హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో సీడీయూ-3ని తెరిచే క్రమంలో గాలిలోకి దట్టమైన పొగలు వెలువడ్డాయి. గోధుమ రంగు పొగలు దట్టంగా గాలిలోకి వ్యాపించడంతో విశాఖ నగర వాసులు ఆందోళనకు గురయ్యారు. అయితే కొంతసేపటికి పొగలు రావడం ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించారు. దీనివల్ల ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. ఫ్లూయిడ్ క్యాటలిక్ క్రాకింగ్ సమయంలో దట్టమైన పొగలు వస్తాయని తెలిపారు. ఎల్జీ పాలీమర్స్ గ్యాస్‌లీక్ దుర్ఘటన నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంట్ను విశాఖ వాసులు హెచ్‌పీసీఎల్ రిఫైనరీ నుంచి భారీగా పొగలు రావడం చూసి భయాందోళనకు గురయ్యారు. అయితే గతంలోనూ ఇదేవిధంగా పొగలు వచ్చిన విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. కాగా, 2013, ఆగస్టు 23న హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో జరిగిన ఘోర ప్రమాదంలో 28 మంది కార్మికులు మృతి చెందగా, 18 మంది కాలిన గాయాలపాలయ్యారు. కూలింగ్ టవర్ పేలిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. (గ్యాస్‌లీక్ బాధితులకు పరిహారం సంపూర్ణం) -
హెచ్‌పీసీఎల్‌కు రిఫైనరీ మార్జిన్ల షాక్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ హెచ్‌పీసీఎల్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 3 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.1,092 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,052 కోట్లకు తగ్గిందని హెచ్‌పీసీఎల్ తెలిపింది. రిఫైనరీ మార్జిన్లు సగం తగ్గడం, ఇన్వెంటరీ లాభాలు కూడా భారీగా తగ్గడం వల్ల నికర లాభం కూడా తగ్గిందని కంపెనీ సీఎమ్‌డీ ఎమ్.కె. సురానా వివరించారు. బీఎస్–సిక్స్ పర్యావరణ నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయని చెప్పారు. అప్పటికల్లా బీఎస్–సిక్స్ నిబంధనలకు అనుగుణ్యమైన ఇంధనాన్ని సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆ మేరకు తమ రిఫైనరీలను అప్‌గ్రేడ్ చేస్తున్నామని పేర్కొన్నారు. -
బీఎస్–6 ఇంధనం రెడీ..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ స్టేజ్–6 (బీఎస్) ప్రమాణాలు దేశంలో 2020 ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో గడువులోగా బీఎస్–6 ఇంధనం దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందా లేదా అన్న ఆందోళన వాహన తయారీ కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ విషయంలో ధీమాగా ఉన్నాయి. డెడ్‌లైన్ లోగానే బీఎస్–6 ఫ్యూయెల్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందన్నది ఈ కంపెనీల మాట. అందుకు అనుగుణంగా ఈ దిగ్గజాలు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నాయి కూడా. ప్రస్తుతం ఢిల్లీలో బీఎస్–6 ఫ్యూయెల్ అందుబాటులో ఉంది. ముందు వరుసలో బీపీసీఎల్.. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) చకచకా తన ప్రణాళిక అమలును ముమ్మరం చేసింది. 2019 అక్టోబరు – 2020 జనవరి మధ్య రిటైల్ స్టేషన్లలో బీఎస్–4 స్థానంలో బీఎస్–6 ఇంధనం సిద్ధం చేయనుంది. జనవరికల్లా నూతన ప్రమాణాలతో ఫ్యూయెల్ రెడీ ఉంటుందని సంస్థ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. బీఎస్–3 నుంచి బీఎస్–4కు మళ్లిన దానికంటే ప్రస్తుతం మరింత వేగంగా పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగంలోని ఇతర ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో పోలిస్తే బీపీసీఎల్ కాస్త ముందుగా బీఎస్–6 ఫ్యూయెల్ విషయంలో పావులు కదుపుతోంది. మార్చికల్లా రెడీ.. మరో సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీఎల్) సైతం పనులను వేగిరం చేసింది. ఈ ఏడాది డిసెంబరులో మొదలై మార్చికల్లా కొత్త ఇంధనంతో రిటైల్ ఔట్లెట్లు సిద్ధమవుతాయని సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ వెల్లడించారు. డెడ్‌లైన్ కంటే నెల రోజుల ముందుగా ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. పాత ఇంధనం స్థానంలో కొత్త ఇంధనం మార్పిడికి రెండు మూడు నెలలు పడుతుందని వివరించారు. ఇదే సమయంలో ఫ్యూయెల్ నాణ్యతనూ పరీక్షిస్తామన్నారు. 2020 జనవరి రెండో వారం తర్వాతి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లకు ఫ్యూయెల్ సరఫరా ప్రారంభిస్తామని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) చైర్మన్ ముకేష్ సురానా ఇటీవల వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా తెలిపారు. వ్యయం రూ.30,000 కోట్లు.. బీఎస్–4 ప్రమాణాల నుంచి బీఎస్–6 ప్రమాణాలకు అప్‌గ్రేడ్ అయ్యేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే రిఫైనరీల అభివృద్ధికి సుమారు రూ.30,000 కోట్లు ఖర్చు చేసినట్టు పరిశ్రమ వర్గాల సమాచారం. అటు వాహన తయారీ సంస్థలు ఏకంగా రూ.70,000–80,000 కోట్లు వ్యయం చేసినట్టు తెలుస్తోంది. బీఎస్–4 నుంచి బీఎస్–5 ప్రమాణాలకు బదులుగా బీఎస్–6కు మళ్లాలని 2016లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే 2020 ఏప్రిల్ 1 నుంచి బీఎస్–6 వెహికిల్స్ విక్రయం, రిజిస్ట్రేషన్ మాత్రమే చేపడతారు. ఇప్పటికే కొత్త ప్రమాణాలకు తగ్గ వాహనాలను కంపెనీలు విడుదల చేయడం ప్రారంభించాయి. -
టగ్ ప్రమాద మృతుల కుటుంబాలకు సాయం
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): నడి సముద్రంలో ఇటీవల జాగ్వార్ టగ్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు హెచ్‌పీసీఎల్ యాజమాన్యం ఆర్థిక సాయం అందజేసింది. ఈ ఘటనలో విశాఖలోని కోటవీధి వాసి కె.భరద్వాజ్(23), కోల్‌కతాకు చెందిన అన్వర్ ఉల్హక్(40) మృతి చెందిన విషయం తెలిసిందే. వీరి కుటుంబ సభ్యులకు పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతుల మీదుగా చెరో రూ.10 లక్షల చొప్పున చెక్కులను విశాఖ విమానాశ్రయంలో మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. మృతు ల కుటుంబాలకు ఆర్థిక సాయమందించిన యాజమాన్యాన్ని ఆయన అభినందించాడు. అలాగే కంపెనీ ఇన్సూ్యరెన్స్ ద్వారా మరో రూ.15.లక్షలు త్వరలోనే అందిస్తామని చెప్పినట్టు మంత్రి తెలిపారు. మృతుని కుటుంబంలో ఒకరికి అర్హతను బట్టి ఉద్యోగం ఇస్తామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోపాలపట్నం తహశీల్దార్ బి.వి.రాణి, ప్రొటోకాల్ అధికారి జనార్దన్ పాల్గొన్నారు. -
నౌకలో భారీ పేలుడు
సాక్షి, విశాఖపట్నం, పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణం): విశాఖ తీరానికి సుమారు మూడు నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న చిన్న నౌక...టగ్‌లో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో సముద్రంలో దూకి ఒకరు మరణించగా, మరొకరు గల్లంతయ్యారు. 15మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఉన్నారు. వీరిందరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముడి చమురు నౌకలను నిలిపి ఉంచే సింగిల్ పాయింట్ మూరింగ్ (ఎస్పీఎం) టెర్మినల్ వద్ద హెచ్‌పీసీఎల్‌కు చెందిన అద్దె నౌక ‘టగ్’ కోస్టల్ జాగ్వార్లో (ఔట్ హార్బర్లో నిలిపి ఉన్న నౌకలను ఇన్నర్ హార్బర్లోకి తీసుకువచ్చే నౌకను టగ్‌గా వ్యవహరిస్తారు) ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. హెచ్‌పీసీఎల్‌కు సంబంధించిన ముడి చమురును నౌకల్లోకి తరలించే భారీ నౌకలో ఆదివారం రాత్రి గాలుల ధాటికి సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. వాటిని సరిచేసేందుకు కోస్టల్ జాగ్వార్ టగ్‌లో సోమవారం ఉదయం సిబ్బంది వెళ్లారు. టగ్‌ను భారీ నౌకకు హోస్ పైపులతో అనుసంధానించే క్రమంలో టగ్ అడుగు భాగం నుంచి ఆయిల్ లీక్ అయి రాపిడికి ఒక్కసారిగా మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. క్షణాల్లోనే టగ్ 70 శాతం వరకు తగలబడింది. ఆరుగురు సిబ్బంది మంటల్లో చిక్కుకోగా వారి శరీరం చాలావరకు కాలిపోయింది. పేలుడు సమయంలో ప్రాణాలను రక్షించుకునేందుకు ఎనిమిది మంది సముద్రంలోకి దూకేశారు. వీరిలో ఆరుగురు ఈతకొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, మిగిలిన ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఆసీస్ అనే వ్యక్తి మృతదేహం లభ్యమైందని హార్బర్ ఏసీపీ టి.మోహన్‌రావు తెలిపారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇండియన్ కోస్ట్‌గార్డ్, పోర్టుకు చెందిన ఐదు నౌకలు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల్ని రక్షించడంతో పాటు నౌకలోని మంటలను అదుపుచేశాయి. అగ్నిప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ విచారణకు ఆదేశించారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నవారు.. వనమాడి అన్నవరం (40)–తూర్పు గోదావరి జిల్లా, అన్సార్ (39)–కోల్‌కతా, తాశారపు భరధ్వాజ్ (23)–విశాఖపట్నం, జస్వీర్ సింగ్ (46)– ఉత్తరప్రదేశ్, జువిన్ జోషి (24)– కేరళ, చింతపల్లి తండేలు (48)– శ్రీకాకుళం, ఎచ్చెర్ల -
ఓయూలో పెట్రోల్ బంక్
ఉస్మానియా యూనివర్సిటీ: విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా క్యాంపస్‌లో సౌకర్యాలు కల్పించనున్నట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్ రాంచంద్రం తెలిపారు. ఆయన ఆదివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. గతంలో క్యాంపస్ విద్యార్థులకు సైకిల్ కూడా ఉండేది కాదన్నారు. అయితే ఇప్పుడు ప్రతి ఐదుగురిలో ఒకరికి బైక్, అందరికీ సెల్ఫోన్లు ఉన్నాయన్నారు. క్యాంపస్‌లోని 25 హాస్టళ్లలో సుమారు 2,500 బైక్‌లు, 8వేల స్మార్ట్ ఫోన్లు, 5వేల వరకు కంప్యూటర్లు ఉన్నాయని వివరించారు. వీటితో పాటు 300 వరకు కార్లు కూడా ఉన్నాయన్నారు. ఈ వాహనాలకు పెట్రోలు, సెల్ఫోన్లకు సిగ్నల్ సమస్య ఉందన్నారు. పెట్రోల్ కోసం విద్యార్థులు తార్నాక, విద్యానగర్ వైపు వెళ్లాల్సి వస్తోందన్నారు. యూటర్న్ కారణంగా ఎటు వెళ్లినా అర లీటర్ పెట్రోల్ అవుతుందన్నారు. అందుకే విద్యార్థులు, అధ్యాపకుల అవసరాలను గుర్తించి క్యాంపస్‌లో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థ హెచ్పీసీఎల్తో ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలిపారు. గతంలో కబ్జాకు గురై ఇటీవల ఓయూకు దక్కిన మెకాస్టార్ ఆడిటోరియం పక్కనున్న సుమారు ఎకరం స్థలంలో బంక్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో సెల్ టవర్స్, హాస్టల్ విద్యార్థుల వంటల కోసం గ్యాస్ పైప్‌లైన్, ఉచిత వైఫై, సౌర విద్యుత్తు తదితర వసతులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే వసతులతో అందరికీ ప్రయోజనం చేకూరుతుందన్నారు. విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు లేనిపోని అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. పదేళ్ల లీజు.. ఓయూలో పెట్రోల్ బంక్ కోసం కేటాయించిన ఎకరం స్థలాన్ని హెచ్‌పీసీఎల్ సంస్థకు పదేళ్లకు లీజుకు ఇచ్చిన్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి చెప్పారు. ప్రతి ఐదేళ్లకు రెన్యూవల్ చేసుకునే విధంగా ఒప్పందం చేసుకున్నామన్నారు. ఏడాదికి రూ.50 లక్షల వరకు అద్దె లభిస్తుందన్నారు. గతంలో లీజుకిచ్చిన ఓయూ భూములను ప్రతి ఐదేళ్లకు ఒకసారి రెన్యూవల్ చేసుకునేలా గత ఒప్పందాలను సవరించామన్నారు. క్యాంపస్‌లో ఏర్పాటు చేయనున్న పెట్రోల్ బంక్ ఇటు ఓయూ, అటు ఇఫ్లూ విద్యార్థులకు, ఉద్యోగులకు, మాణికేశ్వర్‌నగర్ వాసులకు ఉపయోగపడుతుందన్నారు. ఓయూ భూముల లీజు వివరాలను అందరికీ తెలిసేలా బహిరంగ పర్చాలని ఏబీవీపీ రాష్ట్ర నాయకులు శ్రీశైలంగౌడ్ డిమాండ్ చేశారు. గతంలో లీజుకు ఇచ్చిన భూముల అద్దె చెల్లింపులు, విధివిధానాలు పారదర్శకంగా ఉండాలన్నారు. -
ఆగ్రోస్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆగ్రోస్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో తమ సంస్థ భూములను లీజుకు ఇవ్వడం ద్వారా, అలాగే ప్రైవేటు వ్యక్తుల భూముల్లోనూ బంకులు ఏర్పాటు చేసుకునేలా ఆగ్రోస్ నిర్ణయించింది. ఇప్పటికే ఆగ్రోస్‌కు చెందిన భూముల్లో బంకుల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ ముగిసింది. టెండర్లలో ఎక్కువ కోట్ చేసిన వారికి బంకులను కూడా కేటాయించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో రాష్ట్రంలో గుర్తించిన ఏడు ప్రాంతాల్లో బంకులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. వీటిలో ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్ (చింతల్), జగిత్యాల, వరంగల్, భూపాలపల్లిల్లో ఉన్న ఆగ్రోస్ భూముల్లో ఏర్పాటు చేయగా, మరో బంక్ సూర్యాపేటలోని ప్రైవేటు వ్యక్తుల భూముల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ బంక్‌లకు హిందుస్తాన్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) సంస్థ పెట్రోల్ సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. రూ.50 లక్షల డిపాజిట్.. ఆగ్రోస్ ఆధ్వర్యంలో ఉన్న భూములను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడంపై ఆ సంస్థ దృష్టి సారించింది. సంస్థకు చెందిన భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడటంతోపాటు, వాటిని వినియోగంలోకి తీసుకురావడం ద్వారా సంస్థకు ఆదాయ వనరులను సమకూర్చాలని నిర్ణయించింది. ఆగ్రోస్ భూముల్లో పెట్రోల్ బంక్‌ల ఏర్పాటు హక్కులు పొందిన యజమానులు స్థల వినియోగానికి ముందుగా రూ.50 లక్షలు డిపాజిట్ చేయాలి. ఈ సొమ్ముతో పెట్రోల్ బంకు నిర్మాణం చేసి ఇస్తారు. అనంతరం 30 ఏళ్లపాటు సదరు వ్యక్తికి బంకు లీజుకు ఇస్తారు. దీంతోపాటు యజమాని పెట్టిన పెట్టుబడి, ఖర్చులు, నిర్వహణ ఖర్చులు మినహా వచ్చిన లాభంలో 40 శాతం ఆగ్రోస్‌కు వాటాగా చెల్లించాలి. 60 శాతం యజమాని తీసుకోవడానికి వీలు కల్పించారు. పెట్రోల్ బంక్ ఆగ్రోస్ పేరుతోనే ఉంటుంది. అదేవిధంగా ఆగ్రోస్ భూముల్లో కాకుండా ప్రైవేటు వ్యక్తుల భూముల్లో ఏర్పాటు చేసే పెట్రోల్ బంక్‌ల విషయంలో 20 శాతం ఆగ్రోస్‌కు వాటాగా చెల్లించేలా ఒప్పందాలు కుదుర్చుకుంది. బంక్ నిర్వహించే యజమానులు పెట్రోల్ సరఫరాకు హెచ్‌పీసీఎల్ సంస్థకు రూ.5 లక్షల డిపాజిట్ చేస్తే సరిపోతుంది. పెట్రోల్ బంక్‌లకు డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులు ముందుకు వస్తే అవకాశం కల్పిస్తామని ఆగ్రోస్ సంస్థ ఎండీ సురేందర్ తెలిపారు. -
హెచ్‌పీసీఎల్‌కు 2,970 కోట్ల లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ హెచ్‌పీసీఎల్ మార్చి త్రైమాసికానికి సంబంధించి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. ఇన్వెంటరీ లాభాలు, రూపాయి పెరుగుదల కలిసొచ్చాయి. వీటి ప్రభావంతో రిఫైనరీ మార్జిన్ల క్షీణత ప్రభావాన్ని కంపెనీ అధిగమించి మరీ మంచి లాభాలను నమోదు చేసింది. రూ.72,840 కోట్ల ఆదాయంపై రూ.2,970 కోట్ల లాభాన్ని కంపెనీ ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.66,351 కోట్ల ఆదాయంపై రూ.1,748 కోట్ల లాభాన్ని నమోదు చేయడం గమనార్హం. అమ్మకాలు పెరగడం, ఇన్వెంటరీ లాభాలు, రూపాయి బలోపేతం కావడం లాభాల వృద్ధికి దోహదపడినట్టు హెచ్‌పీసీఎల్ చైర్మన్, ఎండీ ఎంకే సురానా తెలిపారు. ఇన్వెంటరీ రూపంలో రూ.916 కోట్ల లాభం గడించింది. ముడి చమురు కొనుగోలు ధర నుంచి, విక్రయించే నాటికి ధర పరంగా పెరుగుదలే ఇన్వెంటరీ లాభం. కరెన్సీ మార్పిడి రూపంలోనూ రూ.248 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ప్రతీ బ్యారెల్ చమురుపై స్థూల మార్జిన్ 7 డాలర్ల మేర ఉంది. శుద్ధి చేసి ఇంధనంగా మార్చడంపై 4.51 డాలర్ల మార్జిన్ లభించింది. పెట్రోల్ విక్రయాలు 8.5 శాతం, డీజిల్ విక్రయాలు 3 శాతం, ఎల్పీజీ విక్రయాలు 12.9 శాతం, ఏటీఎఫ్ విక్రయాలు 17 శాతం చొప్పున పెరిగాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి... ఇక 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం రూ.6,029 కోట్లకు పరిమితం అయింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.6,357 కోట్లుగా ఉండడం గమనార్హం. స్థూల రిఫైనరీ మార్జిన్ ఒక్కో బ్యారెల్‌పై అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న 7.4 డాలర్ల నుంచి 5 డాలర్లకు పరిమితమైంది. అంతర్జాతీయంగా ధరల పెరుగుదలకుతోడు రూపాయి మారకంలో తేడాలు మార్జిన్లు తగ్గడానికి కారణంగా కంపెనీ పేర్కొంది. ఇన్వెంటరీ లాభాలు 2018–19 సంవత్సరానికి రూ.1,366 కోట్లుగా ఉన్నాయి. కరెన్సీ మారకం రూపంలో రూ.579 కోట్ల నష్టాలు వచ్చాయి. కంపెనీ రుణ భారం రూ.27,240 కోట్లకు పెరిగింది. ప్రభుత్వం నుంచి రూ.8,000 కోట్ల ఇంధన సబ్సిడీ రావాల్సి ఉంది. ఒక్కో షేరుపై రూ.9.40 చొప్పున తుది డివిడెండ్ చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది. -
మారుమూల గ్రామాల్లో గ్యాస్ ఏజెన్సీలు
న్యూఢిల్లీ: ఇకపై మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ వంట గ్యాస్ ఏజెన్సీలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వ రంగంలోని చమురు సంస్థలు, అధీకృత ఉమ్మడి సేవా కేంద్రాల(సీఎస్సీ)మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ సంస్థలు సీఎస్‌సీలతో అంగీకారానికి వచ్చాయి. దీని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో సీఎస్సీ ఫ్రాంచైజీలుగా ఏర్పాటయ్యే గ్యాస్ ఏజెన్సీలు.. కొత్తగా బుక్ చేసే ప్రతి గ్యాస్ కనెక్షన్‌పై రూ.20, ప్రతి రీ ఫిల్లింగ్ సిలిండర్‌పై రూ.2, సీఎస్సీకి సిలిండర్ చేరవేస్తే రూ.10, వినియోగదారుకు సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే రూ.19.5 చొప్పున అందుకుంటాయి. దేశవ్యాప్తంగా ఎల్పీజీ కనెక్షన్లు 25 కోట్లకు చేరుకోనుండగా అందులో ఉజ్వల కనెక్షన్లు 5.75 కోట్ల వరకు పెరగనున్నందున ఇందుకు సంబంధించి ఏర్పాట్లను విస్తృతం చేయాల్సిన అవసరం ఏర్పడిందని మంత్రులు అన్నారు. తాజా ఒప్పందంతో లక్ష వరకు మినీ గ్యాస్ ఏజెన్సీల సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ముందుగా ఈ సదుపాయాన్ని ఒడిశాలో పైలట్ ప్రాజెక్టుగా చేపడతామనీ, వచ్చే ఒకటీ రెండు నెలల్లో దేశవ్యాప్తంగా విస్తరిస్తామని వివరించారు. దేశంలో 3.1 లక్షల సీఎస్‌సీలుండగా ప్రస్తుతానికి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లక్ష కేంద్రాల్లో ఈ సేవలను అందుబాటులోకి తేనున్నారు. సీఎస్సీ ఈ–గవర్నెన్స్ సీఈవో దినేశ్ త్యాగి మాట్లాడుతూ..తాజా ఒప్పందంతో గ్రామీణ ఏజెన్సీల ఆదాయంతోపాటు సీఎస్సీల పట్ల విశ్వసనీయత పెరుగుతుందన్నారు. -
హెచ్‌పీసీఎల్ బంకుల్లో చార్జింగ్ స్టేషన్లు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) సంబంధించి వాణిజ్య ప్రాతిపదికన చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు హిందుస్తాన్ పెట్రోలియంతో (హెచ్‌పీసీఎల్) టాటా పవర్ జట్టు కట్టింది. హెచ్‌పీసీఎల్ రిటైల్ అవుట్‌లెట్స్‌తో పాటు దేశవ్యాప్తంగా ఇతరత్రా ప్రాంతాల్లో కూడా ఈవీ చార్జింగ్ స్టేషన్స్‌ను ప్రారంభించేందుకు ఇరు సంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయని టాటా పవర్ వెల్లడించింది. దీని ప్రకారం ఎలక్ట్రిక్ కార్లు, రిక్షాలు, బైక్‌లు, బస్సులు మొదలైన వాహనాల చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అనువైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం, అభివృద్ధి చేయడం, నిర్వహించడం తదితర అంశాల్లో ఇరు సంస్థలు కలిసి పనిచేస్తాయి. ప్రతిపాదిత చార్జింగ్ స్టేషన్స్ ద్వారా దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింతగా పెరిగేందుకు తోడ్పడగలమని టాటా పవర్ సీఈవో సిన్హా తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి చార్జింగ్ సమస్యలే ప్రధాన అవరోధంగా ఉంటున్నాయని, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుతో ఈ సమస్య పరిష్కారం కాగలదని హెచ్‌పీసీఎల్ ఈడీ రజనీష్ మెహతా పేర్కొన్నారు. -
హెచ్‌పీసీఎల్ లాభం 86% అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియమ్ కార్పొ(హెచ్‌పీసీఎల్) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 86 శాతం ఎగసింది. గత క్యూ1లో రూ.925 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.1,719 కోట్లకు పెరిగిందని హెచ్‌పీసీఎల్ తెలియజేసింది. అధిక రిఫైనింగ్ మార్జిన్ల కారణంగా ఈ క్యూ1లో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని హెచ్‌పీసీఎల్ సీఎమ్‌డీ ముకేష్ సురానా తెలిపారు. ఆదాయం రూ.59,891 కోట్ల నుంచి రూ.72,923 కోట్లకు పెరిగింది. ఈ క్యూ1లో 9.63 మిలియన్ టన్నుల ఇంధన విక్రయాలు జరిపామని, ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధిక త్రైమాసిక అమ్మకాలని సురానా పేర్కొన్నారు. కంపెనీ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఈ కంపెనీ రూ.1,435 కోట్ల నికర లాభం సాధించగలదని విశ్లేషకులు అంచనా వేశారు. పెరిగిన ఇన్వెంటరీ లాభాలు.. ఒక్కో బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చినందుకు ఈ క్యూ1లో 7.15 డాలర్ల రిఫైనింగ్ మార్జిన్ సాధించామని సురానా తెలిపారు. గత క్యూ1లో ఈ మార్జిన్ 5.86 డాలర్లుగా ఉంది. గత క్యూ1లో ఒక్కో బ్యారెల్ ముడి చమురుకు 2.86 డాలర్ల ఇన్వెంటరీ నష్టాలు వచ్చాయని, ఈ క్యూ1లో మాత్రం 3.43 డాలర్ల ఇన్వెంటరీ లాభాలు వచ్చాయని తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.8,400 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు సురానా తెలిపారు. -
హైదరాబాద్‌లో తొలి ఎలక్ట్రిక్ వెహికిల్ ఛార్జింగ్ స్టేషన్
సాక్షి, హైదరాబాద్ : నగరాల్లో కాలుష్యాన్ని నిర్మూలించి.. పర్యావరణ హితంగా మార్చడానికి.. కర్బన్ ఉద్గారాలను వెలువరించే వాహనాలను ప్రభుత్వాలు తగ్గించేస్తున్నాయి. వీటి స్థానంలో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నాయి. ఈ వాహనాలు నడవడం కోసం ప్రత్యేకంగా ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం తొలి ఎలక్ట్రిక్ వెహికిల్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు అయింది. నేడు హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) హైదరాబాద్‌లోని రాయదుర్గంలో మిస్సెస్ దినేష్ ఫిల్లింగ్ స్టేషన్లో ఈ ఎలక్ట్రిక్ వెహికిల్ ఛార్జింగ్ స్టేషన్‌ను లాంచ్ చేసింది. మధ్యాహ్నం ఒకటిన్నరకు ఈ లాంచింగ్ ఈవెంట్‌ను నిర్వహించింది. గ్రీన్ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు, కార్బన్ డయాక్సైడ్ను తగ్గించేందుకు దీన్ని ఏర్పాటు చేసినట్టు హెచ్‌పీసీఎల్ తెలిపింది. పైలెట్ బేసిస్‌లో తెలంగాణ వ్యాప్తంగా ఈ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు హెచ్‌పీసీఎల్ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ వెహికిల్ ఛార్జింగ్ స్టేషన్‌ను హెచ్‌పీసీఎల్ తన ఇన్-హౌజ్ నిపుణుల సహకారంతో అభివృద్ధి చేసింది. గ్రీన్ కార్యక్రమంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేసింది. మిస్సెస్ దినేష్ ఫిల్లింగ్ స్టేషన్‌ను హెచ్‌పీసీఎల్ 2015లో ఏర్పాటు చేసింది. ఈ-రసీదుల సౌకర్యంతో ఆటోమేషన్‌ను ఇది కలిగి ఉంది. ఇంధన కొనుగోలు చేసిన కస్టమర్లు వెంటనే ఎస్ఎంఎస్లు పొందేలా కూడా హెచ్‌పీసీఎల్ దీన్ని రూపొందించింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే వారికి ప్రోత్సహకాలను, మౌలిక సదుపాయాలను అందించనున్నట్టు అంతకముందే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ రంగం కోసం నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సివసరం కూడా ఉందని తెలిపింది. -
కాకినాడ ఓఎన్జీసీ క్రాకర్ యూనిట్‌పై నీలినీడలు
సాక్షి, అమరావతి : కాకినాడలో రూ.40,000 కోట్లతో హెచ్‌పీసీఎల్, గెయిల్‌తో కలసి ఏర్పాటు చేయదల్చిన క్రాకర్ యూనిట్ ఆర్థికంగా లాభసాటి కాదన్న ఆలోచనలో కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇంకా ఈ ప్రాజెక్టుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదంటున్నారు ప్రభుత్వరంగ ఓఎన్జీసీ సీఎండీ శశి శంకర్. నాగాయలంక బావుల నుంచి గ్యాస్, చమురును వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించడానికి వచ్చిన శశిశంకర్ ‘సాక్షి’తో మాట్లాడారు. కేజీ బేసిన్లో పెట్టుబడుల దగ్గర నుంచి సామాజిక కార్యక్రమాల వరకు పలు అంశాలపై ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాలు ప్రత్యేకంగా.. రాష్ట్రంలో పెట్టుబడుల విస్తరణ గురించి వివరిస్తారా? ఓఎన్జీసీ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. కేజీ బేసిన్లో ఆఫ్‌షోర్ బావి కేజీ డబ్ల్యూఎన్ 98/2 ఒక్కదానిపైనే సుమారుగా రూ. 35,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు వేగంగా నడుస్తున్నాయి. అదే విధంగా నాగాయలంక బ్లాక్‌లో రూ. 2,800 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశాం. ఇవి కాకుండా గడిచిన ఒక్క ఏడాదే 22 బావులను తవ్వాము. వచ్చే మూడేళ్లలో సహజవాయువు ఉత్పత్తిని రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ కీలకపాత్ర పోషించనుంది. మూడేళ్లలో గ్యాస్ ఉత్పత్తిని 24 బిలియన్ క్యూబిక్ మీటర్ల నుంచి 50 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కాకినాడలో క్రాకర్ ప్రాజెక్టు ప్రతిపాదన ఎంత వరకు వచ్చింది? గెయిల్, హెచ్పీసీఎల్తో కలసి రూ. 40,000 కోట్లతో క్రాకర్ యూనిట్ ఏర్పాటు చేయాలనుకున్నాం. కానీ పరిస్థితులు దీనికి అనుకూలంగా లేవు. ప్రారంభంలో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ గురించి ఆలోచించినా ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఆర్థికంగా లాభమా కాదా అన్నదానిపై ఇంకా చర్చిస్తున్నాం. ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ఓఎన్జీసీ హెచ్‌పీసీఎల్ విలీనంపై... ఓఎన్జీసీలో హెచ్‌పీసీఎల్ విలీన ప్రతిపాదనను ఆపేశాము. చమురు ఉత్పత్తికి..విక్రయించే రిటైల్ సంస్థల వ్యాపారానికి చాలా తేడా ఉంది. అందుకే మా గ్రూపునకు చెందిన రిఫైనరీ, రిటైల్ సంస్థ ఎంఆర్‌పీఎల్‌ను హెచ్పీసీఎల్లో విలీనం చేయాలనుకుంటున్నాం. అంతర్జాతీయంగా చాలా దేశాల్లో కూడా చమురు ఉత్పత్తి సంస్థలు రిటైల్ వ్యాపారాన్ని వేరే సంస్థ ద్వారా చేస్తున్నాయి. మేము కూడా ఇక్కడే అదే విధానాన్ని అమలు చేయాలనుకుంటున్నాం. రాష్ట్రంలో అమలు చేస్తున్న సామాజిక కార్యక్రమాల గురించి... రాష్ట్రం నుంచి వస్తున్న లాభాల్లో రెండు శాతం కంటే ఎక్కువగానే సామాజిక కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నాం. గతేడాది రాష్ట్రంలో సామాజిక కార్యక్రమాల కోసం రూ. 67 కోట్లు వ్యయం చేశాము. ఈ కార్యక్రమం కింద 4,500 మరుగుదొడ్లు నిర్మించాం. గతేడాది రాజమండ్రి ఆన్సైట్ నుంచి ఓఎన్జీసీకి రూ. 306 కోట్ల లాభం వచ్చింది. అయినా ఆన్సైట్ యూనిట్ ఏకంగా రూ. 18 కోట్లు సామాజిక కార్యక్రమాలకు, మరో రూ. 14 కోట్లు స్వచ్ఛ భారత్ కార్యక్రమాల కింద వినియోగించాం. ఇవన్నీ మా సైట్లు ఉన్న గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్న మౌలిక వసతులకు అదనం. ఈ మౌలిక వసుతల కల్పనను నిర్వహణ వ్యయం కిందే పరిగణిస్తున్నాం. -
హెచ్‌పీసీఎల్ కొనుగోలుకు ఓఎన్జీసీ రుణ సమీకరణ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.4,000 కోట్ల రుణాన్ని తీసుకుంది. హెచ్పీసీఎల్లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 51.11 వాటాను ఓఎన్జీసీ కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.36,915 కోట్లు ఓఎన్జీసీకి అవసరమవుతాయి. ఇప్పటికే మూడు బ్యాంకుల నుంచి రూ.18,060 కోట్లను ఓఎన్జీసీ రుణాలుగా తీసుకునేందుకు ఒప్పందాలు చేసుకుంది. పీఎన్బీ నుంచి రూ.10,600 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 4,460 కోట్లు తీసుకుంటుండగా, యాక్సిస్ బ్యాంకు మరో రూ.3,000 కోట్ల మేర సమకూర్చనుంది. రూ.25,000 కోట్ల నుంచి రూ.35,000 కోట్ల వరకు రుణాలు తీసుకునేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపినట్టు ఓఎన్జీసీ చైర్మన్, ఎండీ శశి శేఖర్ రెండు రోజుల క్రితమే తెలిపారు. తమ దగ్గరున్న రూ.12,000–13,000 కోట్ల నగదు నిల్వల్ని వినియోగించిన తర్వాత లిక్విడ్ ఆస్తుల గురించి ఆలోచిస్తామని, ఆ తర్వాతే రుణం రూపంలో అవసరమైన మేర తీసుకోవడం ఉంటుందన్నారు. హెచ్‌పీసీఎల్ కొనుగోలుతో ఓఎన్జీసీ సమగ్ర చమురు కంపెనీగా అవతరించనుంది. అంతేకాదు, ఈ సంస్థకు ఇదే అతిపెద్ద కొనుగోలు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్‌కు కేజీ బేసిన్లో ఉన్న 80 శాతం వాటాను ఓఎన్జీసీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఓఎన్జీసీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో 13.77 శాతం వాటా ఉండగా, దీని మార్కెట్ విలువ రూ.26,000 కోట్లు. గెయిల్ ఇండియాలోనూ 4.86 శాతం వాటా ఉంది. దీని మార్కెట్ విలువ రూ.3,800 కోట్లు. -
హెచ్‌పీసీఎల్ చేతికి ఎమ్ఆర్పీఎల్ !
న్యూఢిల్లీ: మంగళూర్ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ (ఎమ్ఆర్పీఎల్) కంపెనీని కొనుగోలు చేసే అవకాశాలున్నట్లు హెచ్‌పీసీఎల్ వెల్లడించింది. నగదు, షేర్ల మార్పిడి రూపేణా ఎమ్ఆర్పీఎల్ను కొనుగోలు చేసే అవకాశాలున్నట్లు హెచ్‌పీసీఎల్ సీఎండీ ముకేశ్ కుమార్ సురానా చెప్పారు. కాగా హెచ్‌పీసీఎల్‌ను ఓఎన్జీసీ రూ.36,915 కోట్లకు కొనుగోలు చేయనున్న విషయం తెలిసిందే. ఈ టేకోవర్ తర్వాత ఓఎన్జీసీకి రెండు రిఫైనరీ అనుబంధ సంస్థలు– హెచ్‌పీసీఎల్, ఎమ్‌ఆర్‌పీఎల్‌లు ఉంటాయి. హెచ్‌పీసీఎల్‌ను స్వతంత్ర లిస్టెడ్ కంపెనీగా కొనసాగించాలని, డౌన్‌స్ట్రీమ్ విభాగాలన్నింటినీ హెచ్‌పీసీఎల్ నేతృత్వంలోకి తీసుకురావాలని కూడా ఓఎన్జీసీ యోచిస్తోంది. త్వరలో విలీన నిర్ణయం.. హెచ్పీసీఎల్లో ఎమ్ఆర్పీఎల్ విలీనాన్ని పరిశీలిస్తున్నామని ఇటీవలే ఓఎన్జీసీ సీఎండీ శశి శంకర్ కూడా చెప్పారు. రెండు కంపెనీల బోర్డ్‌లు దీనిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాయని పేర్కొన్నారు. ఎమ్ఆర్పీఎల్లో ఓఎన్జీసీకి 71.63 శాతం వాటా ఉండగా, హెచ్‌పీసీఎల్‌కు 16.96 శాతం వాటా ఉంది. సోమవారం నాటి ట్రేడింగ్ ధరతో పోలిస్తే ఓఎన్జీసీ వాటా షేర్లను హెచ్‌పీసీఎల్ రూ.16,000 కోట్లకు కొనుగోలు చేయవచ్చు. లేదా షేర్ల మార్పిడి రూపంలో అయినా కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ఎమ్ఆర్పీఎల్లో వాటాను వదులుకోవడం ద్వారా మరిన్ని హెచ్‌పీసీఎల్ షేర్లను ఓఎన్జీసీ పొందే అవకాశాలుంటాయి. ఇక మూడో ఆప్షన్.. ఈ రెండింటిని కలగలపడం.. ఇదే అత్యుత్తమమైన మార్గమని సురానా చెబుతున్నారు. మూడో రిఫైనరీ... హెచ్‌పీసీఎల్‌కు ఎమ్ఆర్పీఎల్ మూడో రిఫైనరీ అవుతుంది. ఇప్పటికే హెచ్‌పీసీఎల్‌కు ముంబై, విశాఖల్లో రెండు రిఫైనరీలున్నాయి. ఓఎన్జీసీలో హెచ్‌పీసీఎల్ విలీనం పూర్తయితే. హెచ్‌పీసీఎల్‌కు చెందిన 23.8 మిలియన్ టన్నుల వార్షిక రిఫైనరీ సామర్థ్యం ఓఎన్జీసీ పరమవుతుంది. 15 మిలియన్ టన్నుల ఎమ్ఆర్పీఎల్ రిఫైనరీ సామర్థ్యాన్ని కూడా కలుపుకుంటే, భారత్‌లో మూడో అతి పెద్ద ఆయిల్ రిఫైనరీగా (రెండో అతి పెద్ద ప్రభుత్వ రంగ) ఓఎన్జీసీ అవతరిస్తుంది. ఇండియన్ ఆయిల్ కార్పొ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఎమ్ఆర్పీఎల్ తమ చేతికి వస్తే, హెచ్‌పీసీఎల్ మరింత పటిష్టమవుతుందని ముకేశ్ కుమార్ సురానా చెప్పారు. హెచ్‌పీసీఎల్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న దానికంటే అధికంగా పెట్రోలియం ఉత్పత్తులను విక్రయిస్తోందని, ఎమ్ఆర్పీఎల్ తమ చేతికి వస్తే, ఈ లోటు భర్తీ అవుతుందని వివరించారు. ఎమ్ఆర్పీఎల్ తమకు తెలియని కంపెనీయేమీ కాదని సురానా చెప్పారు. -
ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్ మెగా డీల్
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణల వ్యూహంలో మెగా మెర్జర్‌కు పునాది పడింది. ముఖ్యంగా 2018 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని చేరుకునే లక్ష్యంలో భాగంగా ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ లో మెగా డీల్ కుదిరింది. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లో (హెచ్‌పీసిఎల్) లో ప్రభుత్వం మొత్తం వాటాను కొనుగోలు చేసేందుకు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (ఒఎన్జీసీ) ఆమోదం తెలిపింది. అంతేకాదు గతంలో ప్రకటించిన 25 వేలకోట్ల రూపాయల ఆఫర్‌ను 35వేల కోట్ల రూపాయలకు పెంచి మరీ ప్రభుత్వ వాటాను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు బోర్డు ఆమోదం లభించిందని ఓఎన్జీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శశి శంకర్ తెలిపారు. ఈ డీల్ భాగంగా మొత్తం 51.11 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఒఎన్జీసీ అంగీకరించింది. ఇందుకు రూ. 36,915 కోట్లను చెల్లించనున్నామని ఓఎన్జీసీ వర్గాలు రెగ్యులైటరీ ఫైలింగ్‌లో ప్రకటించాయి. మొత్తం నగదు రూపంలో జరిగే ఒప్పందం ఈ నెలాఖరుకు పూర్తికానుందని, ఒక్కో షేరుకు రూ. 473.97 చొప్పున ప్రభుత్వానికి చెల్లిస్తామని ఓఎన్జీసీ తెలిపింది. ఈ డీల్ ప్రభావంతో ఓఎన్జీసీ కౌంటర్ భారీగా లాభపడుతోంది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో 4.93 శాతం లాభంతో ట్రేడవుతోంది. మరోవైపు హెచ్‌పీసీఎల్ 2 శాతం నష్టపోతోంది. -
ఓఎన్జీసీ చేతికి హెచ్‌పీసీఎల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు రిఫైనింగ్ సంస్థ హెచ్పీసీఎల్లో ప్రభుత్వ వాటాలను ఓఎన్జీసీ కొనుగోలు చేయనుంది. ‘రూ.36,915 కోట్లకు హెచ్పీసీఎల్లో 51.11 శాతం వాటాల వ్యూహాత్మక విక్రయానికి సంబంధించి శనివారం ఓఎన్జీసీతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది’ అని కేంద్ర ఆర్థిక శాఖ ట్విటర్లో పేర్కొంది. పూర్తి నగదు చెల్లింపుల రూపంలో ఉండే ఈ ఒప్పందం జనవరి చివరి వారం కల్లా పూర్తి కానుంది. ఓఎన్జీసీ వద్ద ఇప్పటికే రూ.12,000 కోట్ల నగదు నిల్వలుండగా, మిగిలిన మొత్తాన్ని రుణం రూపంలో సమీకరించనుంది. ఈ కొనుగోలుతో ఇటు చమురు ఉత్పత్తి నుంచి రిటైల్ విక్రయాల దాకా అన్ని విభాగాల్లోనూ కార్యకలాపాలున్న దిగ్గజంగా ఓఎన్జీసీ అవతరించనుంది. హెచ్‌పీసీఎల్ దేశీయంగా మూడో అతి పెద్ద చమురు రిఫైనింగ్, ఇంధన మార్కెటింగ్ కంపెనీ. దీనికి దేశవ్యాప్తంగా 15,000 పెట్రోల్ బంకులు ఉన్నాయి. -
హెచ్‌పీసీఎల్ లాభం 147 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియమ్ కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో 147 శాతం వృద్ధి చెందింది. గత క్యూ2లో రూ.701 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,735 కోట్లకు పెరిగిందని హెచ్‌పీసీఎల్ తెలిపింది. ఉత్పత్తి అధికంగా ఉండడం, రిఫైనరీ మార్జిన్ దాదాపు రెట్టింపుకు పైగా పెరగడం, అధిక ఇన్వెంటరీ లాభాలు, దేశీయ అమ్మకాలు అధికంగా ఉండడం తదితర అంశాల కారణంగా ఈ స్థాయి నికర లాభం సాధించామని కంపెనీ సీఎండీ ముకేశ్ కె. సురానా చెప్పారు. ఒక బ్యారెల్ చమురును ఇంధనంగా మార్చే విషయంలో గత క్యూ2లో 3.23 డాలర్ల రిఫైనరీ మార్జిన్ సాధించామని, ఈ క్యూ2లో అది 7.61 డాలర్లకు పెరిగిందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ రిఫైనరీ ఉత్పత్తి సామర్థ్యాన్ని 8.33 మిలియన్ టన్నుల నుంచి 2020 కల్లా 15 మిలియన్ టన్నులకు పెంచనున్నామని, దీని కోసం రూ.20,928 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని వివరించారు. -
గతవారం బిజినెస్
ప్రపంచంలో తొలి డైమండ్ ఫ్యూచర్స్! అనిల్ అంబానీ గ్రూప్‌కు చెందిన ఇండియన్ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఐసీఈఎక్స్).. డైమండ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తద్వారా ప్రపంచంలోనే డైమండ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌ను ప్రారంభించిన మొట్టమొదటి డెరివేటివ్స్ ఎక్సే్ఛంజ్‌గా నిలిచింది. నిఫ్టీ–50లోకి బజాజ్ ఫైనాన్స్, హెచ్‌పీసీఎల్ నిఫ్టీ–50 ఇండెక్స్‌లో కొత్తగా బజాజ్ ఫైనాన్స్, హెచ్‌పీసీఎల్, యునైటెడ్ పాస్ఫరస్ లిమిటెడ్ (యూపీఎల్)లు ప్రవేశించనున్నాయి. ఈ ఇండెక్స్‌లో ఇప్పటివరకూ భాగమైన ఏసీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), టాటా పవర్ షేర్లను నిఫ్టీ–50 నుంచి తొలగించనున్నారు. ఈ మార్పులు సెప్టెంబర్ 29నుంచి అమల్లోకి వస్తాయి. అలాగే నిఫ్టీ నెక్ట్స్–50 నుంచి బజాజ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్స్, హెచ్‌పీసీఎల్, యునైటెడ్ స్పిరిట్స్లను తొలగించి.. ఏసీసీ, ఎవెన్యూ సూపర్‌మార్ట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎంఆర్ఎఫ్, టాటా పవర్లను చేర్చారు. బీఎస్ఎన్ఎల్.. లక్ష వై–ఫై స్పాట్స్!! ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ ’బీఎస్ఎన్ఎల్’ దేశవ్యాప్తంగా 2019 మార్చి నాటికి లక్ష వై–ఫై స్పాట్స్‌ను ఏర్పాటు చేయనుంది. వీటిల్లో 25,000 వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని బీఎస్ఎన్ఎల్ చైర్మన్,ఎండీ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు. జూలైలో లక్ష్యాన్ని దాటిన జీఎస్టీ వసూళ్లు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు తొలి నెల జూలైలో లక్ష్యాలను అధిగమించినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఈ వసూళ్ల మొత్తం రూ.92,283 కోట్లని పేర్కొన్నారు. 59.57 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ విధానం కింద రిజిస్టర్ అయ్యారని, వీరిలో ఇప్పటివరకూ 64.4 శాతం మంది నుంచి పన్ను వసూళ్లు జరిగాయని వివరించారు. కాగా మొత్తంగా రూ.91,000 కోట్లు మాత్రమే జూలైలో జీఎస్టీ ద్వారా లభిస్తాయని వార్షిక బడ్జెట్ అంచనా వేసింది. హచిసన్‌కు పన్ను నోటీసులు బ్రిటన్ సంస్థ వొడాఫోన్‌కు టెలికం వ్యాపార విక్రయ డీల్‌కు సంబంధించి రూ. 32,320 కోట్లు పన్ను కట్టాలంటూ హాంకాంగ్‌కి చెందిన హచిసన్ సంస్థకు ఆదాయ పన్ను శాఖ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఇందులో పన్ను రూపంలో రూ. 7,900 కోట్లు, వడ్డీ కింద రూ. 16,430 కోట్లు, జరిమానా కింద మరో రూ. 7,900 కోట్లు కట్టాలంటూ సూచించింది. అనుబంధ సంస్థ హచిసన్ టెలికమ్యూనికేషన్స్ ఇంటర్నేషనల్ (హెచ్టీఐఎల్)కి ఈ మేరకు నోటీసులు వచ్చినట్లు బిలియనీర్ లీ కాషింగ్కి చెందిన సీకే హచిసన్ హోల్డింగ్స్ హాంకాంగ్ స్టాక్ ఎక్సే్ఛంజీకి తెలియజేసింది. విప్రో బైబ్యాక్‌కు షేర్ హోల్డర్ల అనుమతి దేశంలో మూడో పెద్ద ఐటీ కంపెనీ విప్రో ప్రతిపాదించిన రూ. 11,000 కోట్ల బైబ్యాక్‌కు షేర్‌హోల్డర్ల అనుమతి లభించింది. షేరుకు రూ. 320 ధరతో 34.37 కోట్ల షేర్ల కొనుగోలుకు గత నెలలో విప్రో బైబ్యాక్ ప్రతిపాదనను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనకు మెజారిటీ షేర్హోల్డర్లకు పోస్టల్ బ్యాలెట్, ఈ–ఓటింగ్ ద్వారా ఆమోదం తెలిపినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. పెద్ద కార్లపై సెస్సుకు గ్రీన్ సిగ్నల్ పెద్ద కార్లపై సెస్సును ప్రస్తుతమున్న 15 శాతం నుంచి గరిష్టంగా 25 శాతానికి పెంచే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో మధ్య, పెద్ద కార్లు, లగ్జరీ వాహనాలు, హైబ్రీడ్ వాహనాలు, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ మొదలైన వాటి రేట్లు పెరగనున్నాయి. సెస్సు రేటును పెంచేందుకు జీఎస్టీ చట్టానికి ఆర్డినెన్స్ ద్వారా తగు సవరణలు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. డిసెంబర్ 31 వరకు ఆధార్–పాన్ అనుసంధానం కేంద్ర ప్రభుత్వం ఆధార్–పాన్ అనుసంధానానికి గడువు పొడిగించింది. డిసెంబర్ 31 వరకు ఆధార్, పాన్ రెండింటిని అనుసంధానం చేసుకోవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే సెప్టెంబర్ 30 వరకు రిటర్న్స్ దాఖలుకు అవకాశం కలిగిన పన్ను చెల్లింపుదారులందరికీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్‌కు, ఆడిట్ రిపోర్ట్‌ల సమర్పణకు అక్టోబర్ 31 వరకు సమయమిచ్చినట్లు పేర్కొంది. నోట్ల రద్దు.. ఓ ఫ్లాప్ షో!! నల్లధన నియంత్రనే లక్ష్యంగా ప్రధాని మోదీ అనూహ్యంగా ప్రకటించిన డీమోనిటైజేషన్ పెద్ద ఫ్లాప్ షోగా మిగిలింది. పెద్ద నోట్ల రద్దు నాటికి చెలామణిలో ఉన్న రూ.1,000, రూ.500 నోట్లలో రద్దు తర్వాత దాదాపు 99 శాతం వెనక్కి వచ్చేశాయి. మొత్తంగా రూ.15.44 లక్షల కోట్ల విలువైన నోట్లు రద్దు కాగా.. అందులో రూ.15.28 లక్షల కోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయి. కేవలం రూ.16,050 కోట్లు మాత్రమే డిపాజిట్ కాలేదు. వృద్ధి చక్రాలు వెనక్కి..! 2017–18 తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) జీడీపీ వృద్ధి కేవలం 5.7 శాతంగా నమోదయ్యింది. విలువ రూపంలో చూస్తే ఇది రూ.31.10 లక్షల కోట్లు. 2014 జనవరి–మార్చి మధ్య 4.6 శాతం కనిష్ట వృద్ధి రేటు నమోదు కాగా... ఆ తర్వాత అత్యంత తక్కువ ఇదే. గతేడాది ఇదే కాలంలో నమోదైన వృద్ధి రేటు ఏకంగా 7.9 శాతం కావటం గమనార్హం. గతేడాది 4వ త్రైమాసికంలోనూ 6.1 శాతం నమోదయ్యింది. డీల్స్.. దేశీ అతిపెద్ద టెలికం ఆపరేటర్ ’భారతీ ఎయిర్టెల్’.. సెమాంటెక్ కార్పొరేషన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత్‌లోని కంపెనీలకు సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ను అందించడమే ఈ ఒప్పందం లక్ష్యం. అల్జీరియా సంస్థ సెవిటాల్ గ్రూప్‌కు చెందిన అఫెర్పీ స్టీల్ మిల్లును కొనుగోలు చేయాలని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ యోచిస్తోంది. ఇందుకోసం సుమారు 100 మిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు, సెవిటాల్ గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. æ సోలార్, విండ్‌పవర్ వ్యాపారంలో నిమగ్నమైన తమ గ్రూప్ కంపెనీ సెంబ్‌కార్ప్ గ్రీన్ ఎనర్జీ (ఎస్జీఐ)లో మిగిలిన వాటాను ఐడీఎఫ్సీ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ నుంచి రూ. 1,410 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్ తెలిపింది. æ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ దిశగా స్వీడన్‌కి చెందిన దిగ్గజ సంస్థ శాబ్‌తో అదానీ గ్రూప్ చేతులు కలిపింది. భారతీయ వైమానిక దళాలకు కావాల్సిన సింగిల్ ఇంజిన్ ఫైటర్ జెట్స్ కాంట్రాక్టు దక్కించుకోవడం లక్ష్యంగా ఇరు సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. నియామకాలు ♦ నీతి ఆయోగ్ కొత్త వైస్‌చైర్మన్‌గా రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ♦ ప్రపంచపు అతిపెద్ద కోల్ మైనింగ్ కంపెనీ ’కోల్ ఇండియా’కు సీఎండీ నియామకం జరిగింది. సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) చీఫ్ గోపాల్ సింగ్.. కోల్ ఇండి యా తాత్కాలిక సీఎండీగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ♦ ప్రభుత్వ రంగ హిందుస్తాన్ కాపర్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా సంతోష్ శర్మ బాధ్యతలు స్వీకరించారు. ♦ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సెక్రటరీ జనరల్‌గా సంజయ బారు బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇదివరకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (2004–08)కి మీడియా అడ్వైజర్‌గా వ్యవహరించారు. -
పెట్రోల్ బంకుల్లో బ్యాంకింగ్ సేవలు
న్యూఢిల్లీ: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తాజాగా హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్)తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకుల్లో కొత్తగా ఖాతాను ప్రారంభించొచ్చు. అలాగే క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. కస్టమర్ల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, వారికి ఉపయోగకరమైన సేవలను అందించడం సహా దేశంలో డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది. ‘‘దాదాపు 14,000కు పైగా ఉన్న హెచ్‌పీసీఎల్ పెట్రోలు బంకులన్నీ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు బ్యాంకింగ్ పాయింట్లుగా వ్యవహరిస్తాయి. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు వీటి వద్ద ఖాతాను ప్రారంభించటం, నగదు డిపాజిట్, విత్‌డ్రాయెల్స్, మనీ ట్రాన్స్ఫర్ వంటి బ్యాంకింగ్ సేవలను పొందొచ్చు’’ అని అలాగే బ్యాంక్ కస్టమర్లు వారి హ్యాండ్సెట్స్ సాయంతో డిజిటల్ పేమెంట్స్ ద్వారా హెచ్‌పీసీఎల్ స్టేషన్లలో ఫ్యూయెల్‌ను కొనుగోలు చేయవచ్చని తెలిపింది. -
ఈ బ్యాంకింగ్ సేవలు..పెట్రోల్ బంకుల్లో కూడా
న్యూఢిల్లీ: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తన ఖాతాదారుల సౌలభ్యం కోసం హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్)తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తమ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకునేందుకు గాను దేశ వ్యాప్తంగా హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకుల సుమారు 14 వేల పాయింట్లను ఏర్పాటు చేయనుంది. తద్వారా ఎయిర్టెల్ బ్యాంక్ ఖాతాదారులకు కొత్త ఖాతాలను తెరిచేందుకు, నగదు ఉపసంహరణ నిమిత్తం ఈ పాయింట్లను వినియోగించుకోవచ్చని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. కస్టమర్ సౌలభ్యంతో పాటు దేశంలో డిజిటల్ చెల్లింపులను పెంపొందించే వ్యూహాత్మక భాగస్వామ్య లక్ష్యమనీ, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కోసం అన్ని 14,000 హెచ్‌పిసిఎల్ ఇంధన స్టేషన్లు బ్యాంకింగ్ పాయింట్లుగా పనిచేస్తాయని ఎయిర్టెల్ చెల్లింపుల బ్యాంక్ తెలిపింది. తమ వినియోగదారులు ఈ పాయింట్ల ద్వారా కొత్త ఖాతాలు తెరవడానికి, నగదు డిపాజిట్లు , ఉపసంహరణ, బదిలీ లాంటి సేవలను అందించనున్నామని పేర్కొంది. దీంతోపాటు కస్టమర్లు తమ మొబైల్ ఫోన్ల ద్వారా ఈ ఇంధన స్టేషన్లలో ఇంధన కొనుగోళ్లకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన డిజిటల్ చెల్లింపులను ఎంచుకోవచ్చని ఎయిర్టెల్ పే మెంట్స్ బ్యాంక్ వెల్లడించింది. తద్వారా ప్రస్తుతం 300,000 ఎయిర్టెల్ రిటైల్ అవుట్లెట్ల తో ఉన్న ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ రీటైల్-ఆధారిత నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించనుంది. -
హెచ్పీసీఎల్లో మొత్తం వాటాల విక్రయం
న్యూఢిల్లీ: చమురు మార్కెటింగ్ సంస్థ హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్)లో ప్రభుత్వానికి ఉన్న మొత్తం 51.11 శాతం వాటాలను ఓఎన్జీసీకి విక్రయించనున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విలీనానంతరం కూడా హెచ్‌పీసీఎల్ ప్రత్యేక బ్రాండ్, బోర్డుతో ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని ఆయన వివరించారు. ఈ డీల్‌తో హెచ్‌పీసీఎల్ దేశీయంగా మూడో అతి పెద్ద ఆయిల్ రిఫైనర్‌గా మారుతుందని మంత్రి పేర్కొన్నారు. హెచ్‌పీసీఎల్ యాజమాన్య హక్కుల బదలాయింపుతో పాటు 51.11 శాతం వాటాలను ఓఎన్జీసీకి వ్యూహాత్మక ప్రాతిపదికన విక్రయించేందుకు కేంద్ర క్యాబినెట్ కమిటీ జూలై 19న సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసిందని లోక్‌సభకు మంత్రి వివరించారు. ఈ డీల్‌ను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి ఈ లావాదేవీ పూర్తి కావొచ్చని పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ ప్రధాన్ వివరించారు. -
ఓఎన్జీసీ చేతికి హెచ్‌పీసీఎల్
♦ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం ♦ రూ.30,000 కోట్లు కేంద్ర ఖజానాకు ♦ దేశంలో భారీ చమురు కంపెనీ అవతరణ ♦ నేడు పార్లమెంటులో మంత్రి ప్రకటన న్యూఢిల్లీ: దేశంలో భారీ చమురు కంపెనీ ఏర్పాటు దిశగా బుధవారం తొలి అడుగు పడింది. హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో (హెచ్‌పీసీఎల్) కేంద్ర ప్రభుత్వానికి 51.11 శాతం వాటా ఉండగా... ఆ వాటాను ఓఎన్జీసీకి విక్రయించే ప్రతిపాదనకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఓ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విక్రయం వల్ల ప్రభుత్వానికి రూ.26,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్ల మేర నిధులు సమకూరనున్నాయి. పెట్టుబడుల ఉపసంహరణతో ఈ ఏడాది రూ.72,500 కోట్లను సమీకరించాలన్న కేంద్ర సర్కారు లక్ష్యంలో సగం ఈ డీల్ ద్వారా రానున్నాయి. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండడంతో కేబినెట్ నిర్ణయాలను బయటకు వెల్లడించలేదు. పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ గురువారం పార్లమెంటులో దీనిపై ఓ ప్రకటన చేస్తారు. ఇతర విలీనాలపై కూడా ఆయన స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. చమురు ఉత్పత్తి నుంచి విక్రయం వరకూ అన్ని కార్యకలాపాలూ నిర్వహించే ఓ అతిపెద్ద కంపెనీని ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగం సందర్భంగా జైట్లీ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అందుకు సంబంధించిన తొలి అడుగు ఇప్పుడు పడింది. ఈ డీల్ తర్వాత కూడా హెచ్‌పీసీఎల్ లిస్టెడ్ కంపెనీగా ప్రస్తుత తీరులోనే కొనసాగుతుంది. ఓఎన్జీసీతో కలిసి ఒకే లిస్టెడ్ కంపెనీగా కొనసాగే అవకాశం ఉండదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోగా డీల్ పూర్తయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. హెచ్‌పీసీఎల్ బుధవారం నాటి క్లోజింగ్ ధర రూ.384 ప్రకారం ప్రభుత్వానికి రూ.30,000 కోట్లు లభించే అవకాశం ఉండగా, ఏడాది, 26 వారాలు, 60 రోజుల సగటు ధర ఆధారంగా విక్రయ ధర ఉంటుందని ఆ అధికారి తెలిపారు. హెచ్పీసీఎల్లో ఎంఆర్‌పీఎల్ విలీనం! ఈ డీల్ కంటే ముందే ఓఎన్జీసీ అనుబంధ సంస్థగా ఉన్న మంగళూరు రిఫైనరీస్ అండ్ పెట్రోకెమికల్స్‌ను (ఎంఆర్‌పీఎల్) హెచ్‌పీసీఎల్ విలీనం చేసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీంతో ఓఎన్జీసీ పరిధిలోని రిఫైనరీ వ్యాపారం అంతా హెచ్‌పీసీఎల్ నిర్వహణ కిందకు వస్తుంది. ఎంఆర్పీఎల్లో ఓన్జీసీకి 71.63 శాతం వాటా ఉండగా, హెచ్‌పీసీఎల్‌కు 16.96 శాతం వాటా ఉంది. ఎంఆర్‌పీఎల్‌ను తనలో విలీనం చేసుకుంటున్నందున ఓఎన్జీసీకి ఉన్న 71.63 శాతం వాటాకు గాను హెచ్‌పీసీఎల్ సుమారు రూ.16,414 కోట్లను చెల్లించాల్సి రావచ్చు. ఇది కాకుండా ఓఎన్జీసీకి ప్రస్తుతం రూ.13,014 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. ఐవోసీఎల్‌లో 13.77 శాతం వాటా ఉండగా, దాన్ని విక్రయించడం ద్వారా రూ.25,000 కోట్లను సమకూర్చుకునే అవకాశం ఉంది. ఈ రూపేణా హెచ్‌పీసీఎల్ వాటా కొనుగోలుకు అవసరమైన నిధుల సమీకరణకు ఓఎన్జీసీకి అవకాశాలున్నాయి. ఇవేవీ కార్యరూపం దాల్చకుంటే రూ.10,000 కోట్ల మేర రుణాలను సమీకరించాల్సి రావచ్చు. ఓఎన్జీసీ చమురు ఉత్పత్తి కంపెనీ కాగా, హెచ్‌పీసీఎల్ చమురు రిఫైనరీ, రిటైల్ విక్రయాల సంస్థ. తదుపరి మరో విలీనం అంతర్జాతీయంగా చమురు దిగ్గజ కంపెనీలకు పోటీనిచ్చే స్థాయిలో కనీసం ఓ కంపెనీ అయినా ఉండాలన్న ప్రభుత్వ యత్నాలకు తాజా డీల్ కీలకం కానుంది. ఈ మార్గంలో తదుపరి ఆయిల్ ఇండియాను విలీనం చేసుకోవాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్)ను ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. ఆయిల్ ఇండియా ప్రమోటర్ కేంద్రమే. ఇందులో ప్రభుత్వానికి 66.13% వాటా ఉంది. అలాగే, గెయిల్‌లో బీపీసీఎల్‌ను విలీనం చేసే అవకాశాలున్నాయి. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలను విలీనం చేస్తే ఉపయోగమేంటన్న సందేహాలు రావచ్చు. దీనివల్ల వాటి సమర్థత మెరుగుపడడానికి అవకాశం ఉంది. ఒకే కంపెనీ చేతిలో అధిక సామర్థ్యం ఉండడంతో సవాళ్లను తట్టుకునే శక్తి పెరుగుతుంది. అంతర్జాతీయంగా ఆయిల్ మార్కెట్లలోని అస్థిరతలను తట్టుకోగలదు. ఈటీఎఫ్‌లపై ప్రత్యామ్నాయ యంత్రాంగం న్యూఢిల్లీ: ఎక్సే్ఛంజీ ట్రేడెడ్ ఫండ్ల (ఈటీఎఫ్) మార్గంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎస్ఈ) వాటాల్ని విక్రయించే విషయమై నిర్ణయానికి ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ ప్రత్యామ్నాయ యంత్రాంగానికి అరుణ్‌జైట్లీ సారథ్యంలోని మంత్రుల బృందం నాయకత్వం వహిస్తుంది. దీన్లో రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీతో పాటు సంబంధిత శాఖల మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఏయే లిస్టెడ్ ఆర్థిక సంస్థల షేర్లను ఈటీఎఫ్‌లో చేర్చాలి వంటి అంశాలను ప్రత్యామ్నాయ యంత్రాంగం ఖరారు చేస్తుంది. మరోవైపు, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్లో 51.11 శాతం ప్రభుత్వ వాటాలను ఓఎన్జీసీకి విక్రయించే ప్రతిపాదనకు కూడా సీసీఈఏ ఆమోదముద్ర వేసింది. -
హెచ్‌పీసీఎల్ విశాఖ రిఫైనరీ భారీ విస్తరణ
♦ రూ.21,000 కోట్ల వ్యయం ప్రాజెక్టులు, మార్కెటింగ్ ♦ సదుపాయలపై మొత్తం 61,000 కోట్లు ♦ కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీ హెచ్‌పీసీఎల్ రానున్న నాలుగేళ్లలో ప్రాజెక్టుల విస్తరణపై భారీగా రూ.61,000 కోట్లు వ్యయం చేయనుంది. అధిక నాణ్యతా నిబంధనలను పాటించేందుకు గాను ప్రస్తుతమున్న రిఫైనరీల సామర్థ్యాన్ని మెరుగుపరచడంతోపాటు, విస్తరించనున్నట్టు కంపెనీ తెలిపింది. ముంబై, విశాఖపట్నం రిఫైనరీలను యూరో–4 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం రిఫైనరీ ప్రస్తుతం వార్షికంగా 8.33 మిలియన్ టన్నుల సామర్థ్యంతో నడుస్తుండగా, దాన్ని రూ.20,928 కోట్లతో 2020 నాటికి 15 మిలియన్ టన్నులకు విస్తరించనుంది. ముంబై రిఫైనరీని రూ.4,199 కోట్లతో 7.5 మిలియన్ టన్నుల నుంచి 9.5 మిలియన్ టన్నుల సామర్థ్యానికి పెంచనుంది. రిఫైనరీ విభాగంలో పెట్రోలియం, ఆయిల్, లూబ్రికెంట్లపై ప్రధానంగా పెట్టుబడులు పెట్టనున్నట్టు కంపెనీ తెలిపింది. హెచ్పీసీఎల్లో ప్రభుత్వానికి ఉన్న 51 శాతం వాటాను ఓఎన్జీసీ కొనుగోలు చేసే ప్రతిపాదన ఒకటి ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనకు ఈ నెలలోనే కేంద్ర కేబినెన్ ఆమోదం లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై కంపెనీ అధికారి ఒకరు స్పందిస్తూ... ఓఎన్జీసీ కిందకు వెళ్లినప్పటికీ ప్రభుత్వ ఆమోదం లభిస్తే పెట్టుబడుల ప్రణాళికలు మారవని స్పష్టం చేశారు. విశాఖ–విజయవాడ పైప్‌లైన్ విస్తరణ ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జాయింట్ వెంచర్ ప్రాతిపదికన పెట్రో కెమికల్ కాంప్లెక్స్, 9 మిలియన్ టన్నుల రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను రాజస్తాన్‌లోని పచపద్ర వద్ద నిర్మిస్తున్నట్టు హెచ్‌పీసీఎల్ వెల్లడించింది. అలాగే, పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చేందుకు గాను విశాఖ–విజయవాడ, ముంద్రా–ఢిల్లీ, రామన్‌మండి–బహదూర్గఢ్ పైపులైన్ మార్గాలను విస్తరించనున్నట్టు తెలిపింది. వీటికితోడు వంటగ్యాస్ డిమాండ్ పెరిగిన దృష్ట్యా కొత్తగా ఎల్పీజీ పైపులైన్లు, బాట్లింగ్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. మహారాష్ట్రలో ఐవోసీ 60 మిలియన్ టన్నుల మెగా రిఫైనరీ ప్రాజెక్టును ఏర్పాటు చేసే ప్రణాళికతో ఉండగా అందులో హెచ్‌పీసీఎల్‌కు 25 శాతం వాటా ఉండనుంది. -
రూ.2 లక్షల కోట్లతో భారీ రిఫైనరీ!
♦ మహారాష్ట్రలో ఏర్పాట్లు ♦ చేతులు కలిపిన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) సంస్థలు సంయుక్తంగా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో భారీ ఆయిల్ రిఫైనరీని ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు బుధవారం ఒక ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 60 మిలియన్ టన్నుల రిఫైనరీ సామర్థ్యంతో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2 లక్షల కోట్లు. ఒక్క ఐవోసీయే ఇందులో సగం వాటా తీసుకోనుంది. మిగిలిన రెండు సంస్థలు మరో సగం పెట్టుబడులతో 50 శాతం వాటాను పొందుతాయి. -
ఈ ఏడాదే హెచ్పీసీఎల్లో డిజిన్వెస్ట్‌మెంట్
♦ ఓఎన్జీసీకి 51.1 శాతం వాటాల విక్రయం ♦ విలువ సుమారు రూ. 28,770 కోట్లు ముంబై: అంతర్జాతీయ స్థాయి చమురు దిగ్గజానికి రూపకల్పన చేసే దిశగా కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. హెచ్పీసీఎల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌ని ఈ ఏడాదే పూర్తి చేయాలని యోచిస్తోంది. మరో ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (ఓఎన్జీసీ)కి హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్లో (హెచ్‌పీసీఎల్)లో 51.1 శాతం వాటాల విక్రయ విధివిధానాలపై మరికొద్ది నెలల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హెచ్‌పీసీఎల్ షేరు ధర ప్రకారం ఈ వాటాల విలువ సుమారు రూ. 28,770 కోట్ల మేర ఉండనుంది. రెండు కంపెనీలను విలీనం చేయడానికి బదులుగా హెచ్‌పీసీఎల్‌ని ఓఎన్జీసీలో భాగమైన యూనిట్‌గా మాత్రమే ఉంచాలని కేంద్ర చమురు శాఖ భావిస్తున్నట్లు సమాచారం. రెండూ ప్రభుత్వ రంగ సంస్థలే కావడంతో యాజమాన్యంలో మార్పులేమీ ఉండనందున ఓపెన్ ఆఫర్ అవసరం రాకపోవచ్చని పరిశీలకులు తెలిపారు. దేశీయంగా టేకోవర్ నిబంధనల ప్రకారం ఏదైనా కంపెనీ మరో లిస్టెడ్ కంపెనీలో 25 శాతం పైగా వాటాలు కొన్న పక్షంలో సదరు టార్గెట్ సంస్థలో కనీసం మరో 26 శాతం వాటాలను పబ్లిక్ నుంచి కొనుగోలు చేసేందుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి ఉంటుంది. హెచ్‌పీసీఎల్ దేశీయంగా మూడో అతి పెద్ద రిఫైనర్. డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యానికీ తోడ్పాటు.. చమురు ధరల హెచ్చుతగ్గులను తట్టుకోవడంతో పాటు ఆయిల్ కంపెనీల విలీనాల ద్వారా ప్రపంచ స్థాయి చమురు దిగ్గజాన్ని దేశీయంగా తీర్చిదిద్దాలని యోచిస్తున్నట్లు కేంద్రం ఫిబ్రవరిలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓఎన్జీసీకి హెచ్పీసీఎల్లో వాటాలను విక్రయించడం ద్వారా భారీ సంస్థ ఆవిర్భావంతో పాటు ప్రభుత్వం నిర్దేశించుకున్న డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం కూడా నెరవేరగలదు. గత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 46,247 కోట్లు సమీకరించిన కేంద్రం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ. 72,500 కోట్లు సమీకరించాలని నిర్దేశించుకుంది. ఈ దిశలో 11 ప్రభుత్వ రంగ సంస్థల్లో 25 శాతం దాకా వాటా విక్రయాలు జరగనున్నాయి. -
ఓఎన్జీసీ చేతికి హెచ్‌పీసీఎల్!
⇒ మెగా చమురు పీఎస్‌యూ వచ్చేస్తోంది! ⇒ డీల్ విలువ రూ.44,000 కోట్లుగా అంచనా... ⇒ ప్రభుత్వానికి చెందిన 51.1 శాతం వాటా ⇒ కొనుగోలుకు త్వరలో కేబినెట్ నోట్... ⇒ మరో 26 శాతం ఓపెన్ ఆఫర్‌కు అవకాశం విలీన వార్తల నేపథ్యంలో సోమవారం హెచ్‌పీసీఎల్ షేరు ధర 2% క్షీణించి రూ.560 వద్ద ముగిసింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ.56,859 కోట్లుగా ఉంది. ఇక ఓఎన్జీసీ షేరు కూడా స్వల్పంగా 0.61% నష్టంతో రూ.194 వద్ద స్థిరపడింది. దీని మార్కెట్ విలువ రూ. 2,49,543 కోట్లు. న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో మెగా చమురు దిగ్గజాన్ని నెలకొల్పాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పం త్వరలోనే సాకారం కాబోతోంది. ఇందుకోసం ప్రభుత్వ రంగ చమురు సంస్థ(ఆయిల్ పీఎస్‌యూ)ల విలీనాలు చేపడతామంటూ తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన కార్యరూపం దాల్చనుంది. చమురు–గ్యాస్ ఉత్పత్తిలో అగ్రగామి ఓఎన్జీసీ.. చమురు మార్కెటింగ్ కంపెనీ హెచ్పీఎసీఎల్ను కొనుగోలు చేసే అవకాశం ఉందని సోమవారం విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ డీల్ విలువ దాదాపు రూ.44,000 కోట్లు(6.6 బిలియన్ డాలర్లు) ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కేంద్రానికి హెచ్పీసీఎల్లో 51.11 శాతం వాటా ఉంది. ఒప్పందంలో భాగంగా దీన్ని ఓఎన్జీసీ కొనుగోలు చేయనుంది. అయితే, సెబీ నిబంధనల ప్రకారం ఇతర హెచ్‌పీసీఎల్ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఓఎన్జీసీ ఓపెన్ఆఫర్ను ప్రకటించాల్సి ఉంటుంది. సిద్ధమవుతున్న కేబినెట్ నోట్... ప్రతిపాదిత విలీనానికి సంబంధించి కేబినెట్ నోట్ సిద్ధం అవుతోందని సమాచారం. అయితే, దీనికి రెండు అంచెల్లో కేబినెట్ ఆమోదం అవసరమవుతుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ముందుగా ఓఎన్జీసీలో తనకున్న 51.11 శాతం వాటాను విక్రయించేందుకు, ఆతర్వాత ఓఎన్జీసీ ఈ వాటా కొనుగోలు కోసం నిధులను ఖర్చుచేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. సోమవారం నాటి హెచ్‌పీసీఎల్ షేరు ధర ప్రకారం ప్రభుత్వ వాటా 51.11 శాతానికి గాను ఓఎన్జీసీ రూ.29,128 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. ఇక మరో 26 శాతం ఓపెన్ ఆఫర్ కోసం రూ.14,817 కోట్లు వెచ్చించాలి. మొత్తంమీద ఈ డీల్ విలువ సుమారు రూ.44,000 కోట్లుగా లెక్కతేలుతోంది. ఆప్షన్లు తక్కువే... ‘ఈ విలీనాలకు సంబంధించి ఆప్షన్లు తక్కువే. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌ను ఓఎన్జీసీతో విలీనం చేయడం ఇందులో ఒకటి. ఐఓసీ, ఆయిల్ ఇండియాలను కలిపేయడం రెండో ఆప్షన్. అయితే, దీనివల్ల చమురు మార్కెటింగ్ రంగంలో రెండే కంపెనీలు ఉన్నట్లవుతుంది. కస్టమర్లకు ఇంధనం కొనుగోలులో చాయిస్ ఉండదు. అందుకే హెచ్‌పీసీఎల్‌ను ఓఎన్జీసీతో విలీనం చేసి.. బీపీసీఎల్‌ను ప్రత్యేకంగానే కొనసాగించడం మంచిది. బీపీసీఎల్ అనుబంధ సంస్థ భారత్ పెట్రోరిసోర్సెస్ లిమిటెడ్‌ను పటిష్టం చేసే వీలుంటుంది. ఈ ప్రణాళిక ప్రకారమైతే ఐఓసీ, ఓఎన్జీసీ–హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ ఇలా 3 చమురు రిటైలర్ల సేవలు లభిస్తాయి’ అని సంబంధిత ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. మూడో అతిపెద్ద రిఫైనరీగా... హెచ్‌పీసీఎల్‌ను విలీనం చేసుకోవడం ద్వారా ఓఎన్జీసీకి 23.8 మిలియన్ టన్నుల వార్షిక చమురు రిఫైనింగ్ సామర్థ్యం జతవుతుంది. దీనిద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), ఐఓసీ తర్వాత దేశంలో మూడో అతిపెద్ద రిఫైనరీగా ఓఎన్జీసీ–హెచ్‌పీసీఎల్ అవతరిస్తుంది. దేశంలో చమురు–గ్యాస్ రంగంలో ప్రస్తుతం ప్రధానంగా ఆరు పీఎస్‌యూలు ఉన్నాయి. ఇందులో ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా(ఓఐఎల్)లు చమురు ఉత్పత్తిని చేపడుతున్నాయి. ఇండియన్ ఆయిల్(ఐఓసీ), హిందుస్థాన్ పెట్రోలియం(హెచ్‌పీసీఎల్), భారత్ పెట్రోలియం(బీపీసీఎల్)లు పెట్రోఉత్పత్తుల మార్కెటింగ్‌లో ఉన్నాయి. ఇక గెయిల్ గ్యాస్ రవాణా వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఇవికాకుండా ఓఎన్జీసీ విదేశ్, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్(సీపీసీఎల్), నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్, మంగళూరు రిఫైనరీ(ఎంఆర్‌పీఎల్)లు కూడా ఉన్నాయి. ఇవి ప్రధాన చమురు పీఎస్‌యూలకు అనుబంధ సంస్థలుగా కొనసాగుతున్నాయి. ఎంఆర్పీఎల్లో మెజారిటీ వాటా ఇప్పటికే ఓఎన్జీసీ చేతిలో ఉంది. ఎంఆర్‌పీఎల్ రిఫైరింగ్ సామర్థ్యం 15 మిలియన్ టన్నులు. ఈ డీల్‌ద్వారా విదేశీ చమురు–గ్యాస్ నిక్షేపాలు, ఆస్తుల కొనుగోలు విషయంలో ప్రపంచ దిగ్గజాలతో పోటీపడేందుకు దోహదం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గుల ప్రభావాన్ని కూడా తట్టుకోవడానికి వీలవుతుందనేది వారి అభిప్రాయం. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద చమురు–గ్యాస్ ఉత్పత్తి సంస్థగా, అత్యధిక లాభాలను నమోచేస్తున్న కంపెనీగా ఓఎన్జీసీ నిలుస్తోంది. 12 ఏళ్ల క్రితమే బీజం... వాస్తవానికి పీఎస్‌యూ ఆయిల్ కంపెనీల విలీనాలకు 12 ఏళ్ల క్రితం బీజం పడింది. అప్పటి యూపీఏ సర్కారు హయాంలో పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న మణిశంకర్ అయ్యర్ ఈ ప్రతిపాదనను 2004లో తెరపైకి తీసుకొచ్చారు. దీనిప్రకారం.. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌లను ఓఎన్జీసీతో విలీనం చేయడం... ఓఐఎల్‌ను ఐఓసీలో కలిపేసే ప్రణాళికలను రూపొందించారు. అదేవిధంగా ఆయిల్ పీఎస్‌యూల అనుబంధ సంస్థల్లో కోచి రిఫైనరీని బీపీసీఎల్‌తో, చెన్నై పెట్రోలియంను ఐఓసీతో విలీనం చేయాలని కూడా భావించారు. అయితే, 2015 సెప్టెంబర్‌లో ఒక అత్యున్నత స్థాయి కమిటీ మాత్రం ఈ ప్రతిపాదనలకు మొగ్గుచూపలేదు. దీనికిబదులు చమురు పీఎస్‌యూల్లోని ప్రభుత్వ వాటాలను ఒక ప్రొఫెషనల్ ట్రస్ట్‌కు బదలాయింది... వాటికి మరింత స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించాలని సూచించింది. అయితే, మోదీ సర్కారు మాత్రం విలీనాలకే సై అంది. పీఎస్‌యూ ఆయిల్ కంపెనీలను విలీనం చేసి ప్రపంచ స్థాయి మెగా చమురు దిగ్గజాన్ని నెలకొల్పే ప్రతిపాదనను 2017–18 బడ్జెట్లో ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించారు. -
ఎంఆర్పీఎల్లో వాటాల విక్రయం
న్యూఢిల్లీ: కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధన మేరకు ఎంఆర్పీఎల్లో తమకున్న వాటాల్లో కొద్ది మేర ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్ విక్రయించే అంశాన్ని పరిశీలించనున్నాయి. ప్రస్తుతం ఎంఆర్పీఎల్లో ప్రజల వాటా 11.42 శాతం మాత్రమే ఉంది. ఓఎన్జీసీకి 71.63 శాతం, హెచ్‌పీసీఎల్‌కు 16.96 శాతం వాటా ఉంది. సెబీ నిబంధనల మేరకు లిస్టెడ్ కంపెనీలో కనీస ప్రజల వాటా 25 శాతం ఉండాలి. వచ్చే ఏడాది ఆగస్ట్‌కి ఈ నిబంధనను అమలు పరచాలని సెబీ ప్రభుత్వ రంగ సంస్థలకు గడువు నిర్దేశించింది. దీంతో వచ్చే నెల 1న బోర్డు సమావేశమై పబ్లిక్ వాటా పెంచేందుకు అవకాశాలను పరిశీలించనున్నట్టు ఓ అధికారి తెలిపారు. ప్రమోటర్లు (ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్) తమ వాటాను కొద్దిగా ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయించడం లేదా పబ్లిక్ ఆఫర్ ద్వారా తాజా షేర్లను జారీ చేయడం కంపెనీ ముందున్న మార్గాలుగా వెల్లడించారు. -
హెచ్‌పీసీఎల్ బోనస్ షేర్లు...
ప్రతి రెండు షేర్లకు ఒక షేరు జారీ.. న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ హెచ్‌పీసీఎల్ 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇవ్వనున్నది. ఇన్వెస్టర్ల వద్ద ఉన్న రూ.10ముఖ విలువ గల ఒకో షేరుకు 2 షేర్లను బోనస్‌గా ఇవ్వనున్నట్లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ 8న జరిగే వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో ఈ బోనస్ షేర్ల ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉంటుంది. అధీకృత వాటా మూలధనాన్ని రూ.2,500 కోట్లకు పెంచుకోవడానికి, రిజర్వ్‌లను మూలధనంగా మార్చుకోవడానికి గురువారం జరిగిన డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. అంతే కాకుండా ముంబై రిఫైనరీ వార్షిక సామర్థ్యాన్ని 6.6 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 7.5 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచుకోవడానికి కూడా డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని వివరించింది. కాగా విశాఖ రిఫైనరీ సామర్థ్యాన్ని 8.3 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 15 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచుకునే రూ.20,928 కోట్ల పెట్టుబడి ప్రణాళికకు డెరైక్టర్ల బోర్డ్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. బోనస్ షేర్ల జారీ, ముంబై రిఫైనరీ విస్తరణ తదితర వార్తల కారణంగా హెచ్‌పీసీఎల్ షేర్ బీఎస్ఈలో ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిని(రూ.1,233) తాకింది. చివరకు 3.5 శాతం లాభంతో రూ.1,161 వద్ద ముగిసింది. -
17వేల కోట్లతో విశాఖ రిఫైనరీ విస్తరణ
♦ కరీంనగర్లో ఎల్పీజీ ప్లాంట్ ♦ నాలుగేళ్లలో 45,000 కోట్లు ♦ ఇన్వెస్ట్ చేస్తున్న హెచ్‌పీసీఎల్ న్యూఢిల్లీ: హిందుస్తాన్ పెట్రోలియమ్ కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) రిఫైనరీల విస్తరణను భారీ స్థాయిలో చేపడుతోంది. విశాఖపట్టణంలోని రిఫైనరీ విస్తరణ కోసం 2020 కల్లా రూ.17,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని హెచ్‌పీసీఎల్ పేర్కొంది. ప్రస్తుతం విశాఖ రిఫైనరీ వార్షిక ఉత్పాదక సామర్థ్యం 8.3 మిలియన్ టన్నులని, దీనిని 15 మిలియన్ టన్నులకు పెంచడానికి ఈ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నామని ఇన్వెస్టర్లకు ఇచ్చిన ప్రజెంటేషన్‌లో హెచ్‌పీసీఎల్ వివరించింది. అంతేకాకుండా తెలంగాణలోని కరీంనగర్లో కొత్తగాఎల్‌పీజీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంది. మార్కెటింగ్ కోసం రూ.14,000 కోట్లు... రిఫైనరీల విస్తరణ, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు, ఇతర అంశాల కోసం 2020 కల్లా మొత్తం రూ.45,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని హెచ్‌పీసీఎల్ తెలిపింది. రిఫైనరీల సామర్థ్య విస్తరణ కోసం రూ.21,000 కోట్లు, మార్కెటింగ్ మౌలిక సదుపాయాల కోసం రూ.9,000 కోట్లు పెట్టుబడులు, జాయింట్ వెంచర్ రిఫైనరీ ప్రాజెక్టుల కోసం, సహజ వాయువు వ్యాపారం, చమురు అన్వేషణ కోసం మొత్తం రూ. 14,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నామని వివరించింది. ముంబై రిఫైనరీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 6.5 మిలియన్ టన్నులని, దీనిని 9.5 మిలియన్ టన్నులకు విస్తరించడానికి రూ.4,199 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నామని పేర్కొంది. అలాగే భటిండా రిఫైనరీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 9 మిలియన్ టన్నుల నుంచి 11.25 మిలియన్ టన్నులకు పెంచడానికి మరో 35 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నామని వివరించింది. యూరో ఫైవ్/సిక్స్ ప్రమాణాలకనుగుణంగా ఉండే ఉత్పత్తుల తయారీకి ఈ పెట్టుబడులు తోడ్పడతాయని వివరించింది. పంజాబ్‌లోని భటిండా రిఫైనరీలో హెచ్‌పీసీఎల్‌కు, ప్రపంచ స్టీల్ దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ ప్రమోటర్ లక్ష్మీనాథ్ మిట్టల్‌కు చెరిసమానంగా భాగస్వామ్యం ఉంది. చరా పోర్ట్‌లో ఎల్ఎన్జీ దిగుమతి టెర్మినల్ ముంబైకి చెందిన మౌలిక రంగ దిగ్గజం షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు చెందిన ఎస్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి గుజరాత్‌లోని చరా పోర్ట్‌లో 5 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఎల్ఎన్జీ ఇంపోర్ట్ టెర్మినల్‌ను ఏర్పాటు చేయనున్నామని హెచ్‌పీసీఎల్ తెలిపింది. రూ.5,411 కోట్ల ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణ పూర్తయిందని పేర్కొంది. నవీకరణ విద్యుదుత్పత్తిని రెట్టింపు(100 మెగావాట్లు) చేయనున్నామని వివరించింది. దేశవ్యాప్తంగా 13,561 పెట్రోల్ పంప్‌లు ఉన్నాయని, కొత్త పైప్లైన్ల నిర్మాణానికి, ఇంధన డిపోలు, ఎల్పీజీ ప్లాంట్ల కోసం రూ.1,782 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నామని వివరించింది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్, మహారాష్ట్రలోని లొని టెర్మినల్ ఇంధన డిపోలను పునర్వ్యస్థీకరిస్తున్నామని పేర్కొంది. కరీంనగర్‌తో పాటు షోలాపూర్(మహారాష్ట్ర), భోపాల్(మధ్యప్రదేశ్), పనఘర్(పశ్చిమ బెంగాల్)ల్లో కొత్త ఎల్పీజీ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని హెచ్‌పీసీఎల్ తెలిపింది. -
హెచ్ పీసీఎల్ సీఎండీగా ఏప్రిల్ లో సురానా బాధ్యతలు
న్యూఢిల్లీ: భారత్ మూడవ అతి పెద్ద అయిల్ మార్కెటింగ్ కంపెనీ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) కొత్త సీఎండీగా ముకేశ్ కుమార్ సురానా ఏప్రిల్ 1న బాధ్యతలు చేపడతారు. ఈయన పదవీకాలం ఐదేళ్లు. ప్రస్తుతం సురానా హెచ్‌పీసీఎల్ అనుబంధ కంపెనీ ప్రైజ్ పెట్రోలియం కార్పొరేషన్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత హెచ్‌పీసీఎల్ సీఎండీ నిషి వాసుదేవ పదవీ కాలం మార్చి నెలతో ముగుస్తుంది. -
హెచ్‌పీసీఎల్ కొత్త సీఎండీ ఎం కే సురన
న్యూఢిల్లీ: దేశీ మూడవ అతి పెద్ద అయిల్ మార్కెటింగ్ కంపెనీ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) కొత్త సీఎండీగా ఎం.కె.సురన నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం హెచ్‌పీసీఎల్ అనుబంధ కంపెనీ ప్రైజ్ పెట్రోలియం కార్పొరేషన్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రస్తుత హెచ్‌పీసీఎల్ సీఎండీ నిషి వాసుదేవ పదవీ కాలం మార్చి నెలతో ముగియనుంది. హెచ్‌పీసీఎల్ సీఎండీగా సురన ఏప్రిల్ 1 నుంచి బాధ్యతలు చేపడతారు. పదవీకాలం ఐదేళ్లు.