బీపీసీఎల్‌తో సహా సుమారు 12 ప్రభుత్వరంగ షేర్లు శుక్రవారం 5శాతం నుంచి 13శాతం లాభపడ్డాయి. అంతర్జాతీయ ఆయిల్ దిగ్గజ కంపెనీలు బీపీసీఎల్‌లో వాటా కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇది అండర్‌వాల్యూ వేయబడిన పీఎస్‌యూ స్టాక్స్‌ల రీ-రేటింగ్‌కు దారీతీయవచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు పీఎస్‌యూ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా నిన్న మార్కెట్ ముగిసేసరికి బీపీఎసీఎల్ 12.50శాతం, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ 12శాతం, భారత్ డైనమిక్స్, చెన్నై పెట్రోలియం, హెచ్‌పీసీఎల్, హిందూస్థాన్ కాపర్, ఎన్‌బీసీసీ షేర్లు 10శాతం నుంచి 5శాతం లాభడపడ్డాయి.
ఈ అంశాలూ సహకరించాయ్:
వ్యూహాత్మక వాటాల ఉపసంహరణతో పాటు, మెరుగైన వాల్యుయేషన్ లిక్విడిటీ కూడా పీఎస్‌యు స్టాక్స్‌ల ర్యాలీని నడిపించాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. హెచ్‌పీసీఎల్, ఇక్రాన్ ఇంటర్నేషనల్, బీఈఎంఎల్, ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, ఎన్‌ఎండీసీ షేర్లు ప్రస్తుతం వాటి బుక్ వాల్యూ వద్ద లేదా బుక్‌వాల్యూ దిగువునన ట్రేడ్ అవుతున్నాయి.
అన్ని ఓఎంసీలకు కలిసొస్తుంది: రిలయన్స్ సెక్యూరిటీస్
పెట్రోల్, డీజిల్‌పై అధిక నికర మార్కెటింగ్ మార్జిన్ల ద్వారా పటిష్టమైన ఫైనాన్సియల్ కొనసాగిస్తూ బీపీసీఎల్‌లో అధిక వ్యాల్యూను పొందడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రిలయన్స్ సెక్యూరిటీస్ బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. అధిక నికర మార్కెటింగ్ మార్జిన్లు కేవలం బీపీసీఎల్‌కు మాత్రమే లాభాన్ని చేకూర్చడమే కాకుండా, హెచ్‌పీసీఎల్, ఆయిల్ కార్పోరేషన్ ఇండియాతో పాటు అన్ని అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు సానుకూలమే అవుతుందని రియలన్స్ సెక్యూరిటీస్ తెలిపింది.
బిడ్ల దాఖలకు చివరి తేది పొడగింపు:
బీపీసీఎల్‌లో 51శాతం నియంత్రణ వాటాను దక్కించుకునేందుకు గ్లోబల్ ఇంధన సంస్థలైన సౌదీ అరేబియాకు చెందిన ఆర్‌కామ్‌కో, రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్,, ఎగ్జాన్ మొబిల్, అబుధబీ నేషనల్ ఆయిల్ తదితరాలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇటీవల బీపీసీఎల్ వాటా కోసం ముగింపు బిడ్ల తేదీని జూలై 31కు పొడిగించింది. బీపీసీఎల్ ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .96,000 కోట్లుగా ఉంది. వాటాను చేజిక్కుంచుకునేందుకు కంపెనీలు సమర్పించిన బిడ్ విలువ రూ.1.2లక్షల కోట్లుగా ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment