OMC
-
పెట్రో ధరలపై ‘ధర్మ్ సంకట్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల విపరీతమైన సమస్య. దీనికి ధరలు తగ్గించడం తప్ప వేరే ప్రత్యామ్నాయ సమాధానం ఏమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం అన్నారు. ‘వాస్తవికతను వివరించేందుకు నేను ఏది చెప్పినా సమాధానాన్ని దాటవేయటం లేదా బ్లేమ్ చేయడం వంటిదే అవుతుంది. ఇంధన ధరలను తగ్గించడమే సరైన పరిష్కారం. పెట్రో ధరల పెరుగుదల ‘ధర్మ్ సంకట్’ పరిస్థితి. వినియోగదారులకు తుది ధర లేదా రిటైల్ ధర సహేతుకమైన స్థాయిలో ఉండటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన మార్గాన్ని గుర్తించాలి’ అని నిర్మల వ్యాఖ్యానించారు. ఇంధన ధరలను చమురు మార్కెటింగ్ సంస్థ(ఓఎంసీ)లు నిర్ణయిస్తాయ ని, వీటిపై కేంద్రానికి నియంత్రణ ఉండదని ఆమె పేర్కొన్నారు. చమురు దిగుమతులు, శుద్ధి చేయడం, పంపిణీ, లాజిస్టిక్స్ వంటి ఖర్చులను బట్టి ఓఎంసీలు చమురు ధరలను నిర్ణయిస్తాయన్నారు. -
ప్రభుత్వరంగ షేర్లలో అనూహ్య ర్యాలీ ఎందుకంటే..?
బీపీసీఎల్‌తో సహా సుమారు 12 ప్రభుత్వరంగ షేర్లు శుక్రవారం 5శాతం నుంచి 13శాతం లాభపడ్డాయి. అంతర్జాతీయ ఆయిల్ దిగ్గజ కంపెనీలు బీపీసీఎల్‌లో వాటా కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇది అండర్వాల్యూ వేయబడిన పీఎస్‌యూ స్టాక్స్‌ల రీ-రేటింగ్‌కు దారీతీయవచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు పీఎస్‌యూ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా నిన్న మార్కెట్ ముగిసేసరికి బీపీఎసీఎల్ 12.50శాతం, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ 12శాతం, భారత్ డైనమిక్స్, చెన్నై పెట్రోలియం, హెచ్‌పీసీఎల్, హిందూస్థాన్ కాపర్, ఎన్బీసీసీ షేర్లు 10శాతం నుంచి 5శాతం లాభడపడ్డాయి. ఈ అంశాలూ సహకరించాయ్: వ్యూహాత్మక వాటాల ఉపసంహరణతో పాటు, మెరుగైన వాల్యుయేషన్ లిక్విడిటీ కూడా పీఎస్‌యు స్టాక్స్‌ల ర్యాలీని నడిపించాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. హెచ్‌పీసీఎల్, ఇక్రాన్ ఇంటర్నేషనల్, బీఈఎంఎల్, ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, ఎన్ఎండీసీ షేర్లు ప్రస్తుతం వాటి బుక్ వాల్యూ వద్ద లేదా బుక్‌వాల్యూ దిగువునన ట్రేడ్ అవుతున్నాయి. అన్ని ఓఎంసీలకు కలిసొస్తుంది: రిలయన్స్ సెక్యూరిటీస్ పెట్రోల్, డీజిల్‌పై అధిక నికర మార్కెటింగ్ మార్జిన్ల ద్వారా పటిష్టమైన ఫైనాన్సియల్ కొనసాగిస్తూ బీపీసీఎల్‌లో అధిక వ్యాల్యూను పొందడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రిలయన్స్ సెక్యూరిటీస్ బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. అధిక నికర మార్కెటింగ్ మార్జిన్లు కేవలం బీపీసీఎల్‌కు మాత్రమే లాభాన్ని చేకూర్చడమే కాకుండా, హెచ్‌పీసీఎల్, ఆయిల్ కార్పోరేషన్ ఇండియాతో పాటు అన్ని అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు సానుకూలమే అవుతుందని రియలన్స్ సెక్యూరిటీస్ తెలిపింది. బిడ్ల దాఖలకు చివరి తేది పొడగింపు: బీపీసీఎల్‌లో 51శాతం నియంత్రణ వాటాను దక్కించుకునేందుకు గ్లోబల్ ఇంధన సంస్థలైన సౌదీ అరేబియాకు చెందిన ఆర్కామ్కో, రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్,, ఎగ్జాన్ మొబిల్, అబుధబీ నేషనల్ ఆయిల్ తదితరాలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇటీవల బీపీసీఎల్ వాటా కోసం ముగింపు బిడ్ల తేదీని జూలై 31కు పొడిగించింది. బీపీసీఎల్ ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .96,000 కోట్లుగా ఉంది. వాటాను చేజిక్కుంచుకునేందుకు కంపెనీలు సమర్పించిన బిడ్ విలువ రూ.1.2లక్షల కోట్లుగా ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
మరింతగా అప్పుల ‘చమురు’!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీలు) రుణాలపై ఆధారపడడం రానురాను మరింత పెరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్నే (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) ఉమ్మడి రుణాలను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మూడింటి రుణాలూ ఈ ఏడాది మార్చి నాటికి ఐదేళ్ల గరిష్ట స్థాయి 1.62 లక్షల కోట్లకు పెరిగిపోయాయి. ఏడాది క్రితం ఉన్న రూ.1.25 లక్షల కోట్ల రుణాలతో పోలిస్తే ఇవి ఏకంగా 30 శాతం పెరిగిపోయాయి. ముఖ్యంగా వీటిల్లో ఒక్క ఐవోసీ రుణాలే 2019 మార్చి నాటికి రూ.92,712 కోట్లు కావడం గమనార్హం. ఆ తర్వాత బీపీసీఎల్ రుణాలు రూ.42,915 కోట్లు, హెచ్‌పీసీఎల్ రుణ భారం రూ.26,036 కోట్లు చొప్పున ఉన్నాయి. ఈ మూడు కంపెనీలూ కలసి కొత్తగా రూ.36,402 కోట్ల మేర రుణాలను సమీకరించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా మూలధన విస్తరణ కార్యక్రమాలకు తోడు ప్రభుత్వం నుంచి సబ్సిడీలు సకాలంలో రాకపోవడమే రుణ భారం పెరిగేందుకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ), కిరోసిన్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి రూ.33,900 కోట్ల మేర సబ్సిడీ ఓఎంసీలకు రావాల్సి ఉంది. ద్రవ్యలోటు సర్దుబాటు కోసమని ఓఎంసీల సబ్సిడీల చెల్లింపులను ప్రభుత్వం వాయిదా వేయడంగమనార్హం. భారీ విస్తరణ కార్యక్రమాలు అయితే 2018–19 ఆర్థిక సంవత్సరం నాటికి ఓఎంసీల ఉమ్మడి రుణ భారం రూ.1.62 లక్షల కోట్లుగా ఉన్నప్పటికీ... 2014 ఆర్థిక సంవత్సరం కంటే తక్కువే ఉందని చెప్పాలి. అప్పట్లో చమురు ధరలు చారిత్రక గరిష్టాలకు చేరిన సమయం కావడంతో ఓఎంసీల ఉమ్మడి రుణ భారం రూ.1.76 లక్షల కోట్ల స్థాయికి పెరిగిపోయింది. ‘‘బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీలతో పోలిస్తే ఐవోసీ భారీగా మూలధన వ్యయ ప్రణాళికలను అమలు చేస్తోంది. హెచ్‌పీసీఎల్‌కు ఎక్కువ శాతం మార్కెటింగ్ కార్యకలాపాలు కావడంతో నగదు ప్రవాహాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే, మోస్తరు విస్తరణ ప్రణాళికలను అమల్లో పెట్టింది. బీపీసీఎల్‌కు మాత్రం చమురు వెలికితీత, ఉత్పత్తితో పాటు పట్టణ గ్యాస్ పంపిణీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి’’ అని ఆయిల్ అండ్ గ్యాస్ రంగ విశ్లేషకుడు ఒకరు పేర్కొన్నారు. రావాల్సిన బకాయిలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ చెల్లింపుల్లో జాప్యం చేయడం కారణంగానే ఓఎంసీలకు ఒక్కోదానికి మార్చి నెలలో రూ.5,000– 10,000 కోట్ల వరకు రుణం పెరిగినట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక పేర్కొంది. ‘‘మా రుణభారం ఇప్పటి వరకైతే రూ.81,000 కోట్లకు పెరిగింది. ప్రధానంగా ప్రభుత్వం నుంచి రూ.19,000 కోట్ల మేర బకాయిలు రాకపోవడం వల్లే. ఇందులో ఎల్పీజీకి సంబంధించి ప్రత్యక్ష నగదు బదిలీ రూ.13,883 కోట్లుగా ఉంటే, కిరోసిన్ సబ్సిడీ రూ.3,395 కోట్ల మేర ఉంది. మిగిలిన రూ.2,000 కోట్లు పీఎంయూవై డిపాజిట్’’ అని ఈ నెల 17న ఇండియన్ ఆయిల్ డైరెక్టర్ ఏకే శర్మ పేర్కొనడం గమనార్హం. ఇక కేంద్ర ప్రభుత్వానికి అధిక డివిడెండ్ చెల్లించాల్సి రావడం, మధుర రిఫైనరీకి సంబంధించి ఎంట్రీ ట్యాక్స్ సైతం ఇండియన్ ఆయిల్ రుణ భారం పెరిగిపోవడానికి కారణాలుగా ఉన్నాయి. -
ఆకాశానికి ‘పెట్రో’ మంట
సాక్షి, సిటీబ్యూరో / న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ)లు వినియోగదారులకు మరోసారి షాకిచ్చాయి. ఆదివారం లీటర్ పెట్రోల్‌పై 33 పైసలు, డీజిల్‌పై 26 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తాజా నిర్ణయంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.76.24, డీజిల్ రూ.67.57కు చేరుకుంది. దీంతో పెట్రోల్, డీజిల్‌లు ఆల్‌టైం గరిష్టానికి చేరుకున్నట్లయింది. కర్ణాటక ఎన్నికల అనంతరం మే 14 నుంచి వరుసగా ఏడు రోజులపాటు చమురు ధరల్ని ఓఎంసీలు పెంచాయి. దీంతో వారంలో లీటర్ పెట్రోల్‌పై రూ.1.61, డీజిల్‌పై రూ.1.64 మేర ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం గతేడాది జూన్‌లో రోజువారీ చమురు ధరల సవరణ విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.84.07తో ముంబై తొలిస్థానంలో నిలవగా.. అమరావతి(రూ.82.35), భోపాల్(రూ.81.83), పట్నా(రూ.81.73), హైదరాబాద్(రూ.80.76)లు తర్వాతిస్థానాల్లో నిలిచినట్లు ఓఎంసీలు ధరల నోటిఫికేషన్లో పేర్కొన్నాయి. లీటర్ డీజిల్ ధర రూ.74.75తో అమరావతి దేశంలోనే తొలిస్థానంలో నిలవగా.. హైదరాబాద్(రూ.73.45), తిరువనంతపురం(రూ.73.34), రాయ్‌పూర్(రూ.72.96), గాంధీనగర్(రూ.72.63) తర్వాతిస్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్ అమరావతి పెట్రోల్ రూ.80.76 రూ.82.35 డీజిల్ రూ.73.45 రూ.74.75 పన్నుల మోత.. దేశంలో పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ సుంకాలను, రాష్ట్ర ప్రభుత్వం అమ్మకపు పన్నుతో పాటు వ్యాట్‌ను విధిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ కింద పెట్రోల్‌పై రూ.21.48, డీజిల్‌పై రూ.17.33 వసూలు చేస్తోంది. మరోవైపు ఒక్కో రాష్ట్రం ఒక్కో రేటుతో వ్యాట్, అమ్మకపు పన్నును వసూలు చేస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్ 27 శాతం వ్యాట్‌ను విధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్ విధిస్తున్నప్పటికీ ప్రతి లీటర్‌పై రూ.4 లు అదనపు వ్యాట్ వసూలు చేస్తుండటంతో మొత్తం పన్ను 38.82 శాతానికి చేరుకుంది. అలాగే డీజిల్‌పై 22.25 శాతం పన్నుతో పాటు అదనంగా లీటర్‌పై రూ.4 వ్యాట్‌ను విధిస్తున్నారు. దీంతో స్థూలంగా డీజిల్‌పై వ్యాట్ 30.71 శాతానికి చేరుకుంది. మొత్తంమీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పెట్రోల్‌పై 57 శాతం, డీజిల్‌పై 44 శాతం పన్నులతో వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. -
పెట్రో కంపెనీలకు క్రూడ్ సెగ
ముంబై: ముడి చమురు ధరలు భగ్గుమంటుండటంతో దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) లాభదాయకతకు చిల్లుపడే అవకాశాలు కనిపిసున్నాయి. భారత్ తన అవసరాలకు భారీగా దిగుమతి చేసుకునే బ్రెంట్ క్రూడ్ ధర బుధవారం రాత్రి 9.30 గంటల సమయానికి అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా బ్యారెల్ 67.50 డాలర్ల స్థాయికి చేరింది. 2016 చివరి నాటికి బ్యారెల్ ధర 48 డాలర్ల స్థాయిలో ఉండేది. అంటే గడిచిన ఏడాది కాలంలో ఏకంగా 40 శాతానికిపైగా పెరిగింది. ధరలెందుకు పెరుగుతున్నాయంటే... ►అమెరికాలో సంభవించిన ‘ఇర్మా’ హరికేన్‌తో రిఫైనరీలు కొన్నాళ్లు మూతబడ్డాయి. కానీ తుఫాను ప్రభావం తగ్గడంతో రిఫైనరీలన్నీ తెరుచుకుని ఒక్కసారిగా క్రూడ్‌కు డిమాండ్ పెరిగింది. ►దాదాపు ఇదే సమయంలో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి కోతను పొడిగించాలని ఒపెక్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మరింత భారీ పెరుగుదలకు దారితీసింది. ►డాలర్ ఇండెక్స్ బలహీనత కూడా క్రూడ్ ధరల పెరుగుదలకు కారణాల్లో ఒకటిగా చెప్పొచ్చు. డాలర్ తగ్గుదల వల్ల చమురు ప్రాజెక్టులపై వ్యయాలు తగ్గుతాయి. ►ఇక ఉత్తరకొరియా, ఇరాక్ దేశాలకు సంబంధించి భౌగోళిక ఉద్రికత్తలు చమురు మంటకు ఆజ్యం పోశాయి. ►ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మెరుగుపడుతున్న ధోరణి కూడా ముడి చమురుకు డిమాండ్‌ను పెంచింది. ►వీటన్నింటికీ తోడు కొన్ని దేశాల్లో పైపులైన్లు పేలుళ్లు, అంతర్గత ఉద్రిక్తతల వంటి అంశాలు చమురు ధరలను పెంచాయి. దేశీయ ఓఎంసీలపై ప్రభావం... బీఎస్ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ గడచిన 3 నెలల్లో 9.71% పెరిగింది. బెంచ్‌మార్క్ సెన్సెక్స్ సూచీ 8.86 శాతం ఎగసింది. కానీ బీపీసీఎల్, ఐఓసీ, హెచ్‌పీసీఎల్ వంటి చమురు మార్కెటింగ్ కంపెనీల షేర్లు మాత్రం తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాయి. ఐఓసీ షేర్ 3 శాతం, హెచ్‌పీసీఎల్ షేర్ 2.5 శాతం తగ్గింది. అయితే గెయిల్ కొనుగోలు వార్తలతో బీపీసీఎల్ 10% పెరిగింది. పడిపోతున్న మార్జిన్లు...రక్షిస్తున్న రూపాయి నిజానికి క్రూడ్ ధరలు పెరగటం వల్ల చమురు కంపెనీల మార్జిన్లు గణనీయంగా పడిపోతున్నాయి. రూపాయి బాగా బలపడటం వీటిని కొంతవరకూ ఆదుకున్నదనే చెప్పాలి. ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో డీజిల్, పెట్రోల్‌పై మార్కెటింగ్ మార్జిన్ లీటరుకు 3.10 పైసలు ఉంటే, ప్రస్తుతం ఇది రూపాయికి పడింది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, దీనికనుగుణంగా దేశీయంగా ధరలు పెంచకపోవడం దీనికి కారణమనేది కంపెనీల మాట. అయితే, అం తర్జాతీయంగా ధరలు తగ్గినపుడు దేశీయంగా తగ్గలేదన్న విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కష్టకాలమే..! క్రూడ్ ఆయిల్ ధరల్లో పెరుగుదల చమురు మార్కెటింగ్ కంపెనీల రోజూవారీ వ్యయ అవసరాలను పెంచుతుంది. దీనికితోడు స్వల్పకాలిక రుణ స్థాయిలపై సైతం ఇది ప్రభావం చూపుతుంది. భారత ఎంసీఏల లాభదాయకతపై ఇది ప్రభావం చూపుతుంది. స్థూల అండర్ రికవరీలల్లో నుంచి కేటాయింపులు జరుపుకోవాలని ప్రభుత్వ రంగంలోని ఓఎంసీలకు ఆదేశాలు జారీ అయినా... అదీ ఆయా కంపెనీల లాభదాయకతకు దెబ్బే. ఇక మార్కెట్ నిర్ధారిత స్థాయిల వద్ద ఆటో ఫ్యూయెల్స్ ధరలను కొనసాగించాలన్న ప్రభుత్వ నిర్ణయానికీ తాజా పరిస్థితి పరీక్ష వంటిదే. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో పెట్రో ధర పెంచితే, దేశంలో అన్ని స్థాయిల్లో ధరల పరిస్థితి తీవ్రరూపం దాల్చుతుంది. ఇక దేశీయంగా ఆర్థిక అంశాలను చూస్తే, 2016–17తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) రెట్టింపయ్యే అవకాశం ఉంది. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) క్యాడ్ 1.5%కి చేరే వీలుంది. – కె.రవిచంద్రన్, ఇక్రా ముడి చమురు ధరలు పెరిగితే చమురు కంపెనీల మార్కెటింగ్ మార్జిన్లు తగ్గుతాయి. మూలధన ప్రణాళికలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నగదు నిల్వలు హరించుకుపోతాయి. ఈ కంపెనీల షేర్ల అవుట్‌లుక్ పెద్దగా ఆశావహంగా కూడా ఏమీ లేదు. – కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ -
నిర్లక్ష్యానికి పరాకాష్ట
► ఓఎంసీలో రూ.కోటిన్నర నిధులు వెనక్కి.. ► నగరపాలక సంస్థ అధికారుల బాధ్యతారాహిత్యం ► ఫైల్ సరిగా లేదంటున్న ట్రెజరీ అధికారులు ► ట్రెజరీలోనే తప్పిదం జరిగిందంటున్న ఓఎంసీ అధికారులు ► కాంట్రాక్టర్లు చెప్పే వరకు తెలుసుకోలేని దుస్థితి ఒంగోలు నగరపాలక సంస్థకు అప్పులు లేవు... నిధుల కొరత లేదు. కార్పొరేషన్ సాధారణ నిధులతోపాటు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు.. ఫైనాన్స్ గ్రాంట్లతో నిండు కుండలా ఉంది. ఎన్నికలు జరగాల్సిన కార్పొరేషన్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అభివృద్ధి గ్రాంటు కూడా కేటాయించింది. నిధులు ఎక్కువగా ఉండటం, కౌన్సిల్ లేకపోవడం, ప్రత్యేక అధికారి అయిన కలెక్టర్ పట్టించుకోకపోవడంతో నగరపాలక సంస్థలో అధికారుల్లో బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం పెరిగిపోయింది. ముఖ్యంగా అకౌంట్స్ సెక్షన్లో అకౌంటెంట్‌తో పాటు ఇతర సిబ్బంది బిల్లులు చెల్లింపుల్లో తీవ్రమైన జాప్యం చేయడం పరిపాటిగా మారింది. ఫలితంగా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల్లో సుమారు రూ.1.50 నిధులు వెనక్కి వెళ్లాయి. ఆ విషయం కాంట్రాక్లర్లు చెప్పే వరకు నగరపాలక అధికారులకు తెలియకపోవడం వారి నిద్రమత్తుకు నిదర్శనం. జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు నిధులు లేక అభివృద్ధికి నోచుకోవడం లేదు. రాష్ట్రంలో పలు మున్సిపాలిటీలు ఉద్యోగులకు, కార్మికులకు వేతనాలు కూడా చెల్లించే పరిస్థితుల్లో లేవు. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉన్న ఓఎంసీలో అధికారులు మాత్రం పుష్కలంగా ఉన్న నిధులను వినియోగించుకునే పరిస్థితుల్లో లేరు. ఫలితంగా కోటిన్నర నిధులు వెనక్కి వెళ్లాయి. 13వ ఆర్థిక సంఘం నిధులు నగరపాలక కార్యాలయానికి రూ.6కోట్ల పైగానే వచ్చాయి. ఆ నిధులకి సంబంధించి 41 పనులు చేయాలని అధికారులు నిర్ణయించారు. వాటిలో సుమారు 50శాతం పనులు పూర్తికాగా వాటికి సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. మిగిలిన 50శాతం పనులు కూడా దాదాపు పూర్తి అయ్యాయి. ఈ పనుల విలువ రూ.3కోట్లు ఉంది. వాటికి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. మార్చి 31లోపు బిల్లులు చెల్లించాలి. బిల్లులకు సంబంధించిన ఫైళ్లు నగరపాలక సంస్థ అకౌంట్స్ సెక్షన్ అధికారులు మార్చి 20 తర్వాత సబ్‌ట్రెజరీ కార్యాలయానికి పంపారు. అంతటితో తమ పని అయిందకొని మిన్నకున్నారు. ఫైల్ పంపిన తర్వాత వాటి గురించి తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు. మార్చి నెలాఖరు కావడంతో కాంట్రాక్టర్లు బిల్లులు తమ అకౌంట్లకు జమకాకపోవడంతో సబ్‌ట్రెజరీలో ఆరా తీశారు. బిల్లులకు సంబంధించిన ఫైళ్లలో లోపాలున్నాయని సక్రమంగా లేవని ట్రెజరీ అధికారులు సమాధానం చెప్పడంతో అవాక్కయ్యారు. ఈ విషయం తెలుసుకున్న నగరపాలక సంస్థ అకౌంట్స్ అధికారులు నానా హడావుడి చేసి ఫైళ్లలో చిన్న చిన్న సవరణలు చేసి మార్చి 31వ తేదీ తిరిగి ట్రెజరీకి అందచేశారు. నెల చివరి రోజు కావడంతో ట్రెజరీలో అన్ని శాఖలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు జరుగుతుండటంతో సర్వర్ మోరాయించింది. దీంతో ట్రెజరీకి అందించిన రూ.3 కోట్ల బిల్లులో సగం మాత్రమే పాస్ అయ్యి మిగిలిన మొత్తం వెనక్కి పోయింది. దీంతో నగరపాలక అధికారులు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. తలలు పట్టుకుంటున్న అధికారులు.. నిధులు వెనక్కి పోవడంతో స్థానిక ఎమ్మెల్యే ట్రెజరీ, ఓఎంసీ అధికారులపై మండిపడినట్లు సమాచారం. ఇప్పుడు ఆ నిధుళకు చెల్లింపులు ఎక్కడి నుంచి సర్ధుబాటు చేయాలో అర్ధంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అకౌంట్స్ సెక్షన్ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఉన్నతాధికారులు నిర్థరణకు వచ్చినా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. తప్పు కప్పిపుచ్చుకునేందుకు ఓఎంసీ అధికారులు ట్రెజరీలో పొరపాటు జరిగిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇకనైనా నగరపాలక కమిషనర్ నిద్రమత్తు వదిలి ఉద్యోగుల పట్ల కొంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కౌన్సిల్ లేకపోవడంతో ప్రత్యేక అధికారి అయినా ఓఎంసీపై ప్రత్యేక దృష్టి సారించి పాలనను గాడిన పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు. -
ప్రభుత్వ ఓఎంసీలతో ప్రైవేట్ రిఫైనరీల ఒప్పందం
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ కొనుగోళ్ల కోసం ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ)-ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీలు ప్రైవేట్ రిఫైనరీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్సార్ ఆయిల్ కంపెనీలతో తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఉత్పత్తి కొరత కారణంగా ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీలు 12 మిలియన్ టన్నుల డీజిల్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ జామ్ నగర్ రిఫైనరీ, ఎస్సార్ ఆయిల్ వాదినర్ రిఫైనరీల నుంచి ప్రతి ఏటా కొనుగోలు చేస్తాయి. ఈ రెండు కంపెనీలు ఇంధనాలను తమ గుజరాత్ ప్లాంట్ల నుంచి ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్లకు సరఫరా చేసేవి. దీనికి గాను కేంద్ర అమ్మకపు పన్ను, తీర రవాణా వ్యయాలను ప్రైవేట్ కంపెనీలే భరించేవి. అయితే దీన్ని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలే భరించాలని ఈ ప్రైవేట్ రిపైనరీ కంపెనీలు కోరడంతో ఈ ఒప్పందం ఈ ఏడాది మొదట్లో నిలిచిపోయింది. -
బెయిల్ డీల్ కేసులో గాలికి బెయిల్
-
బెయిల్ డీల్ కేసులో గాలికి బెయిల్
హైదరాబాద్: ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓంఎసీ) అధినేత గాలి జనార్ధన రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరైంది. బెయిల్ డీల్ కేసులో ఆయనకు ఈ బెయిల్ మంజూరైంది. ఓఎంసీ కేసులో బెయిలు కోసం న్యాయమూర్తికి డబ్బు ఇచ్చినట్లు ఆయనపై ఆరోపణ. ఓఎంసి కేసులో ఆయనకు ఇంకా బెయిల్ మంజూరుకాలేదు. ఓఎంసీ కేసుకు సంబంధించి 2012 సెప్టెంబరు 18న గాలి అరెస్ట్ అయ్యారు. ** -
వైఎస్ చేశారు కాబట్టి తప్పా?
అదే లీజును బాబు హయాంలో ఇస్తే మాత్రం తప్పులేదా? ఓఎంసీకి లీజు మంజూరు చేసింది చంద్రబాబు కాదా? ఎవరి హయాంలో లీజుకిచ్చినా ప్రభుత్వానికొచ్చే సొమ్ము ఒకటేగా? అప్పటికే ఉన్న కంపెనీకి ఇవ్వలేదంటూ పిచ్చి రాతలెందుకు? కొత్త కంపెనీకి ఇస్తే కొత్త ఉద్యోగాలు వస్తాయి కదా! ఓఎంసీకి నాణ్యమైన, విలువైన ఖనిజం కట్టబెట్టేశారని రాసింది మీరేగా? అక్కడ నాసిరకం తప్ప నాణ్యమైన ఖనిజం లేనేలేదని సీబీఐ తేలిస్తే మీ అబద్ధపు రాతలకు క్షమాపణ చెప్పలేదెందుకు? అఖిలపక్షం డిమాండ్ చేయగానే ఓఎంసీకి కమిటీని పంపింది వైఎస్ కాదా? బ్లాక్ గెలాక్సీపై చంద్రబాబు డ్రామాను ఎన్నడూ బయటపెట్టలేదేం? వేల కోట్ల ముడుపులు చేతులు మారినా మీకు కనిపించలేదా? ఇంకెన్నాళ్లు రామోజీ ఈ విషపురాతలు ఇవి ఎన్నికల కామెర్లు. ‘పచ్చ’ పార్టీ కోసం కొనితెచ్చుకున్న పచ్చకామెర్లు. అంతే!! వచ్చే నెల 7న సీమాంధ్రలో పోలింగ్ ముగిసేదాకా రామోజీకి ఈ వ్యాధి తగ్గే చాన్సే లేదు. అందుకే రోజూ ప్రత్యేక పేజీలు పెట్టి మరీ విషం గక్కటం. లేకపోతే బాబు లీజుకిస్తే తప్పులేదట గానీ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన లీజులు మాత్రం అన్నీ తప్పేనట!! ఒక కంపెనీకి బాబు ఇస్తే తప్పులేదు గానీ అదే కంపెనీకి వైఎస్సార్ ఇస్తే మాత్రం ఘోరమట!! నామా నాగేశ్వరరావుకు గ్రానైట్ లీజులిచ్చినా, రిలయన్స్‌కు కోస్తా తీరం మొత్తాన్ని కబళించేసుకోవచ్చని వీలునామా రాసేసినా... అవన్నీ జాతి ప్రయోజనాల కోసం చేసినవట!! ఎందుకంటే నామా బాబు అనుచరుడు కాబట్టి... రిలయన్స్ సంస్థ తన కంపెనీల్లో రూ.2,400 కోట్లు ‘‘పెట్టుబడి’’ పెట్టింది కాబట్టి!! ఇది ఏ మార్కు పాత్రికేయం రామోజీ? ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎంతకాలం మీ రాతలతో అంధకారంలో ఉంచుతారు? గురువారంనాడు ‘ఘనులు తీసిన గోతులు’ అంటూ ఒక పేజీ నిండా వండేసిన మీ కథనం ఏ మార్కు జర్నలిజం? భూమిలో ఉన్న ఖనిజం తవ్వకుండా బయటికొస్తుందా? గనులు తవ్వాక గోతులు రాకుండా ఇంకేం వస్తాయి? ఇవెక్కడి రాతలు? వైఎస్సార్ హయాంలో జరిగిన ప్రతి పనికీ దురుద్దేశం అంటగట్టి... దానికి ఆయన్ను బాధ్యుడిని చేస్తూ రాస్తున్న రాతల్లో ‘‘ఏది నిజం?’’ అనంతపురం జిల్లా డి.హీరేహళ్ మండలం ఓబుళాపురం గ్రామంలో ఓఎంసీకి 25.99 హెక్టార్లను లీజుకిచ్చింది సాక్షాత్తూ చంద్రబాబు నాయుడు. 1996, డిసెంబర్ 10న జీవో నంబరు 236 ద్వారా రామ్మోహన్‌రెడ్డికి ఈ లీజుకు అనుమతినిచ్చారు. 1997లో లీజు అగ్రిమెంట్ చేసుకున్నారు. 2002లో రామ్మోహన్‌రెడ్డి నుంచి ఈ లీజును ఓఎంసీకి బదలాయించింది కూడా చంద్రబాబు నాయుడి ప్రభుత్వమే. తర్వాత కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తామన్న హామీతో వైఎస్ హయాంలో మరో రెండు లీజుల్ని ఓఎంసీ తీసుకుంది. ఇదీ... జరిగిన కథ. వైఎస్ ఇలా చేయటం వల్ల ప్రజా సంపద దుర్వినియోగమెలా అవుతుంది? ఎవరి హయాంలో లీజుకిచ్చినా ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో గానీ, పన్నుల రూపంలో గానీ వచ్చే సొమ్ములో తేడాలుంటాయా? ఏ కంపెనీకిచ్చినా సర్కారుకు వచ్చే సొమ్ము ఒకటేకదా! అయినా వెనకబడిన కడప జిల్లాలో 2 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఆరంభించి 10 మిలియన్ టన్నుల స్థాయికి విస్తరించేలా ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించబట్టే ఓఎంసీకి వైఎస్ ప్రభుత్వం లీజు మంజూరు చేసింది తప్ప ఊరికేకాదు. ఈ విషయాన్ని వైఎస్ అసెంబ్లీలోనే చెప్పారు. ఇందులో తప్పేంటి? అప్పటికే నడుస్తూ ఉన్న శాతవాహన లాంటి సంస్థలను పక్కనబెట్టి ఓఎంసీకి లీజుకు ఇచ్చేశారంటూ రామోజీ గగ్గోలు పెట్టారు. శాతవాహన ప్లాంటు నడుస్తోందంటే దానర్థమేంటి? దానికి ఖనిజం ఉన్నట్లేగా? దీనికి లీజు ఇవ్వడం కంటే కొత్త సంస్థకు ఇస్తే మరో ఫ్యాక్టరీ వస్తుందని, దీనివల్ల మరికొన్ని వేల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఆలోచించటం తప్పా? రామోజీకి ఈ మాత్రం లేదా? అడ్డగోలుగా లీజులు కేటాయించారన్న రామోజీ వాదనలో నిజమెంత? లీజు కోసం వచ్చిన 30 దరఖాస్తుల వివరాలనూ కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపించటం, వాటన్నిటినీ పరిశీలించాక కేంద్రం ఓఎంసీకి లీజుకివ్వటం... ఇవన్నీ రామోజీకి మాత్రమే అడ్డగోలుగా కనిపిస్తాయెందుకు? తన కవల లాంటి చంద్రబాబు చేయలేదనా? లీజుల కేటాయింపులు, రాయల్టీ వసూలుకు సంబంధించిన నియమ నిబంధనలను కేంద్రం గానీ, రాష్ట్రం గానీ ఓఎంసీ కోసం ఏమైనా సవరించాయా? అందరికీ వర్తించిన నిబంధనల్నే దీనికీ అమలు చేశారుగా? చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనూ ఈ విధానం ప్రకారమే లక్షల హెక్టార్లకు లీజులు ఇచ్చారుగా? దీన్లో వైఎస్ మాత్రమే చేసిన తప్పేంటి? ఈ మతలబు మీకు తెలీదా రామోజీ? ప్రకాశం జిల్లాలో వేల కోట్ల రూపాయల విలువైన అత్యంత అరుదైన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలను ప్రైవేటు సంస్థలకు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు రిజర్వు చేయాలంటూ 1998 డిసెంబర్ 23న చంద్రబాబు నేతృత్వంలోని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఏపీఎండీసీకి గనులను రిజర్వు చేయాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించడంతో ప్రైవేటు సంస్థలు రంగంలోకి దిగాయి. ఈ ప్రతిపాదనలు విరమించుకుంటే అత్యంత భారీ స్థాయిలో ముడుపులు ముట్టజెబుతామంటూ అప్పటి ప్రభుత్వ పెద్దతో కొందరు ప్రైవేటు ప్రతినిధులు రాయబారాలు నడిపారు. ఆయన కోరుకున్నదీ అదే. ఆయన ఆశించిందీ అదే. బాబు వ్యూహం మేరకు చర్చలు జరిగాయి. మంతనాల్లో కుదిరిన ఒప్పందం ప్రకారం... ప్రభుత్వ పెద్ద నుంచి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు లేఖ రాశారు. ‘చీమకుర్తి, తాళ్లూరు మండలాల్లో బ్లాక్ గ్రానైట్ నిక్షేపాలున్న ప్రాంతాన్ని ఏపీఎండీసీకి రిజర్వు చేయాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది’ అన్నదే ఆ లేఖ సారాంశం. ఏపీఎండీసీకి గనుల రిజర్వేషన్ ప్రతిపాదనను విరమించుకున్న చంద్రబాబు సర్కారు చకచకా ప్రైవేటు సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి లీజులు మంజూరు చేసేసింది. జూలై 2000 నుంచి మార్చి 2004 మధ్య ఏకంగా 155 లీజుల కింద 363.945 హెక్టార్ల గ్రానైట్ క్వారీలను లీజుకు ఇచ్చేసింది. ఈ మొత్తం తతంగం ‘ఈనాడు’కు ఏనాడూ తప్పుగా అనిపించలేదు. ఎందుకంటే ఈ గలీజు కథ నడిపింది తన కవల లాంటి చంద్రబాబు కాబట్టి. వేరే రకంగా ఈ కుంభకోణం బయటకు రాలేదెందుకంటే... అప్పట్లో ‘సాక్షి’ లాంటి మీడియా లేదు కాబట్టి. ఉన్నదల్లా బాకా పత్రికలు, తోకపత్రికలే కాబట్టి!!! ఏమంటారు రామోజీ? ఇది కాదా అసలు నిజం!! ఇవీ... ‘ఈనాడు‘ అడ్డగోలు రాతలు.. వైఎస్ ప్రభుత్వం ఓఎంసీకి అత్యంత నాణ్యమైన, విలువైన ఖనిజాన్ని కట్టబెట్టిందని, దాన్ని తవ్వేసి లక్షల కోట్లు గడించారని గతంలో రాసింది ‘ఈనాడే’. అయితే సీబీఐ దర్యాప్తు జరిపి... ఈ ప్రాంతంలో నాసిరకం ఖనిజం మాత్రమే ఉందని తేల్చటంతో మరో రాగం అందుకుంది. చుట్టుపక్కల వేరేవారు తవ్విన ఖనిజాన్ని... బెదిరించి గాలి జనార్దనరెడ్డి తక్కువ రేటుకు కొని, ఈ లీజు పర్మిట్‌తో ఎగుమతి చేశారని!! అంతే తప్ప తాను మొదట్లో రాసిన కథనాలన్నీ తప్పయినందుకు ఏనాడూ క్షమాపణ చెప్పింది లేదు. మరి దీన్నెలా అర్థం చేసుకోవాలి? రామోజీ రాతల్లో నిజమెంతో అర్థం కావటం లేదా? పెపైచ్చు తానేం చెప్పినా ‘ఎస్’ అనే అధికారుల్నే వైఎస్ పెట్టుకున్నారంటూ మరో దిగజారుడు రాత. ఏం! శ్రీలక్ష్మిని గానీ, కృపానందాన్ని గానీ ఐఏఎస్‌కు ఎంపిక చేసింది వై.ఎస్.రాజశేఖరరెడ్డా? వాళ్లు చంద్రబాబు హయాంలో పనిచేయలేదా? పర్మిట్లపై ఓఎంసీకి అంటగడుతున్న అభియోగాలన్నీ కోర్టులో ఉన్నవేగా? వాటిపై రామోజీ తీర్పులెందుకు? అయినా క్షేత్ర స్థాయిలో అధికారులో, సిబ్బందో తప్పు చేస్తే అది ముఖ్యమంత్రికెలా తెలుస్తుంది? ఆంధ్ర-కర్ణాటకల మధ్య గనుల సరిహద్దు రేఖలను తేల్చాలని రెండు రాష్ట్రాలూ ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్నా ఇప్పటికీ తేలలేదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సరిహద్దును ఖరారు చేయాలని సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించి ఏడాదైనా ఇంకా మల్లగుల్లాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ సరిహద్దు రేఖ తేలే వరకూ ఏ లీజు సంస్థ ఎక్కడ అక్రమ తవ్వకాలు జరిపిందో నిర్ధారించలేమని సీబీఐ కూడా చెప్పింది. మరి ఈ వాస్తవాలన్నీ పక్కనబెట్టి రామోజీ రాస్తున్న రాతల్లో నిజం ఎంత? అయినా ఓఎంసీని వైఎస్ ఏనాడైనా వెనకేసుకొచ్చారా? ఆ సంస్థ మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడుతోందని, అఖిలపక్షాన్ని పంపాలని విపక్షాలు అడగ్గానే విపక్ష కమిటీని ఓబుళాపురం గనులకు పంపింది వైఎస్ కాదా? అక్కడికి వెళ్లొచ్చిన సభ్యులు తమ దృష్టికి ఎలాంటి అక్రమాలూ రాలేదని మీడియా సమక్షంలోనే ప్రకటించారు. ఇక బళ్లారి ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు, ఓఎంసీకి మధ్య సరిహద్దు వివాదం తలెత్తగా దానిపై ఉన్నతస్థాయి సర్వే బృందాన్ని నియమించిందీ వైఎస్సే. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇంతకంటే ఏం చేస్తారు? ఇవన్నీ వదిలిపెట్టి రామోజీ రాస్తున్న రాతలకు అర్థమేంటి? -
ఎమ్మార్, ఓఎంసీ నిందితుల రిమాండ్ పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్, ఓఎంసీ కేసులో నిందితునిగా ఉన్న సునీల్‌రెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి, అలీఖాన్ రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 26 వరకు పొడిగించింది. వీరి రిమాండ్ ముగియడంతో జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు. ఎమ్మార్ కేసులో నిందితులుగా ఉన్న బీపీ ఆచార్య, కోనేరు రాజేంద్రప్రసాద్, విజయరాఘవ హాజర య్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యం సహా ఇతర నిందితులు హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు అనుమతించింది. ఓఎంసీ కేసులో రాజగోపాల్ కోర్టు ఎదుట హాజరుకాగా.. అనారోగ్య కారణాలతో కోర్టుకు హాజరు కాలేకపోతున్నట్లు శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. వచ్చే వాయిదాకు హాజరు కాలేకపోతే శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఇచ్చిన అభిప్రాయాన్ని కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేస్తూ విచారణను ఈనెల 26కు వాయిదా వేశారు. మరోవైపు ఈనెల 25 నుంచి అక్టోబర్ 25 వరకు కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలోని ఎమ్మార్ ఎంజీఎఫ్ కార్యాలయాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ ఎమ్మార్ ఎంజీఎఫ్ దక్షిణాది ఇన్చార్జి విజయరాఘవ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటర్ దాఖలు చేసింది -
ఎమ్మార్, ఓఎంసీ నిందితుల రిమాండ్ పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్, ఓఎంసీ కేసులో నిందితునిగా ఉన్న సునీల్‌రెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి, అలీఖాన్ రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 26 వరకు పొడిగించింది. వీరి రిమాండ్ ముగియడంతో జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు. ఎమ్మార్ కేసులో నిందితులుగా ఉన్న బీపీ ఆచార్య, కోనేరు రాజేంద్రప్రసాద్, విజయరాఘవ హాజర య్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యం సహా ఇతర నిందితులు హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు అనుమతించింది. ఓఎంసీ కేసులో రాజగోపాల్ కోర్టు ఎదుట హాజరుకాగా.. అనారోగ్య కారణాలతో కోర్టుకు హాజరు కాలేకపోతున్నట్లు శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. వచ్చే వాయిదాకు హాజరు కాలేకపోతే శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఇచ్చిన అభిప్రాయాన్ని కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేస్తూ విచారణను ఈనెల 26కు వాయిదా వేశారు. మరోవైపు ఈనెల 25 నుంచి అక్టోబర్ 25 వరకు కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలోని ఎమ్మార్ ఎంజీఎఫ్ కార్యాలయాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ ఎమ్మార్ ఎంజీఎఫ్ దక్షిణాది ఇన్చార్జి విజయరాఘవ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటర్ దాఖలు చేసింది