సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్, ఓఎంసీ కేసులో నిందితునిగా ఉన్న సునీల్‌రెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి, అలీఖాన్ రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 26 వరకు పొడిగించింది. వీరి రిమాండ్ ముగియడంతో జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు. ఎమ్మార్ కేసులో నిందితులుగా ఉన్న బీపీ ఆచార్య, కోనేరు రాజేంద్రప్రసాద్, విజయరాఘవ హాజర య్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్‌వీ సుబ్రమణ్యం సహా ఇతర నిందితులు హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు అనుమతించింది.
ఓఎంసీ కేసులో రాజగోపాల్ కోర్టు ఎదుట హాజరుకాగా.. అనారోగ్య కారణాలతో కోర్టుకు హాజరు కాలేకపోతున్నట్లు శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. వచ్చే వాయిదాకు హాజరు కాలేకపోతే శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఇచ్చిన అభిప్రాయాన్ని కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేస్తూ విచారణను ఈనెల 26కు వాయిదా వేశారు. మరోవైపు ఈనెల 25 నుంచి అక్టోబర్ 25 వరకు కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలోని ఎమ్మార్ ఎంజీఎఫ్ కార్యాలయాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ ఎమ్మార్ ఎంజీఎఫ్ దక్షిణాది ఇన్‌చార్జి విజయరాఘవ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటర్ దాఖలు చేసింది
ఎమ్మార్, ఓఎంసీ నిందితుల రిమాండ్ పొడిగింపు
Published Tue, Aug 13 2013 2:50 AM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM
Advertisement