G. Janardhana Reddy
-
అంగరంగ వైభవంగా.. గాలివారి పెళ్లి సందడి
-
కుమార్తె వివాహానికి ’గాలి’ ఆహ్వానం
బళ్లారి : కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి బళ్లారి లో ప్రముఖుల ఇంటింటికీ వెళ్లి తన కుమార్తె బ్రహ్మణీ పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. ఐదేళ్ల అనంతరం ఆయన ఈనెల 1న బళ్లారికి విచ్చేశారు. కుమార్తె వివాహానికి 21 రోజుల పాటు ప్రస్తుతం బళ్లారిలో ఉండేందుకు గాలి జనార్దనరెడ్డికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. రెండు రోజుల నుంచి ఆయన బళ్లారి నగరంలో పలువురు ప్రముఖుల ఇళ్లకు వెళ్లి పెళ్లికి ఆహ్వానం పలుకుతున్నారు. ఈనెల 16న బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో వివాహం జరుగుతుంది. నగరంలోని పలువురు ప్రముఖ డాక్టర్లతో పాటు జిల్లా బీజేపీ అధ్యక్షుడు గురులింగనగౌడ, బీజేపీ నాయకులు తిమ్మారెడ్డి, ప్రముఖులకు ఇళ్లకు వెళ్లి ఆహ్వానిస్తున్నారు. పెళ్లికి సంబంధించి వినూత్న తరహాలో పత్రిక ఉండటంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. -
అపూర్వ స్వాగతం
ఐదేళ్ల అనంతరం బళ్లారికి గాలి జనార్దనరెడ్డి దారి పొడవునా కిక్కిరిసిన జనం బళ్లారి : రాష్ర్ట మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి బళ్లారి జిల్లాలో అపూర్వ స్వాగతం లభించింది. ఐదేళ్ల తర్వాత ఆయన మంగళవారం బళ్లారికి విచ్చేయడంతో జిల్లా ప్రజలు నీరాజనం పలికారు. హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా వచ్చిన ఆయనకు హగరి వద్ద వేలాదిగా తరలివచ్చిన జనం భారీ పూలమాలలు వేస్తూ స్వాగతం పలికారు. హగరి నుంచి అమరాపురం, కక్కబేవినహళ్లి, బేవినహళ్లి, బిసిలహళ్లి మీదుగా బళ్లారి వరకు దారి పొడవునా ప్రజలు హారతులు ఇస్తూ స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చుతూ తమ అభిమాన నాయకుడికి కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. దీంతో హగరి-బళ్లారి మధ్య ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టాప్ లేని వాహనంపై జనార్దన్‌రెడ్డి నిలబడి దాడి పొడవునా అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు. నగరంలోని శ్రీకనకదుర్గమ్మ దేవాలయంలో గాలి పూజలు నిర్వహించిన అనంతరం వాల్మీకి, భువనేశ్వరి దేవి విగ్రహాలకు పూజలు నిర్వహించిన అనంతరం హవంబావిలోని తన స్వగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ... తన ఊపిరి ఉన్నంత వరకు బళ్లారి జిల్లా ప్రజల సేవకే అం కితమవుతాయని అన్నారు. ఎంపీ బీ.శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి, బళ్లారి మాజీ ఎంపీ శాంత, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ ఇబ్రహీం బాబు, మాజీ ఉప మేయర్ శశికళ, పలువురు కార్పొరేటర్లు, జిల్లా పంచాయతీ మెంబర్లు, బళ్లారి జిల్లా బీజేపీ అధ్యక్షుడు గురులింగనగౌడ, బళ్లారి జిల్లా బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు ప్రకాష్‌రెడ్డి ఆయన వెంట ఉన్నారు. -
‘గాలి’ బళ్లారి వెళ్లేందుకు అనుమతి
సాక్షి, బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి నవంబర్ 1 నుంచి 21 వరకు బళ్లారికి వెళ్లేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతిచ్చింది. గనుల కేసులో జైలుకు వెళ్లిన గాలి జనార్దనరెడ్డికి 2015 జూన్ 20న బెయిల్ లభించడం తెలిసిందే. అయితే.. ఆయన బళ్లారి, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాలకు వెళ్లేందుకు మాత్రం ఆంక్షలు విధించింది. దీంతోఆయన ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. కాగా.. ఆయన కుమార్తె బ్రహ్మణి వివాహం హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామిక వేత్తతో నవంబర్ 16న జరగనుంది. కుమార్తె పెళ్లి ఏర్పాట్లు చూసుకునేందుకు బళ్లారికి వెళ్లేందుకు అనుమతివ్వాలని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయమూర్తులు ఏకే సిక్రీ, ఎన్వీ రమణ నవంబర్ 1 నుంచి 21వ తేదీ వరకు గాలి జనార్దనరెడ్డి బళ్లారిలో ఉండొచ్చని తీర్పు ఇచ్చారు. -
గాలి జనార్దనరెడ్డి రూ.37 కోట్ల ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ: ఇనుప ఖనిజం తవ్వకాలకు సంబంధించిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి, ఆయన భార్య అరుణకు చెందిన రూ. 37.88 కోట్ల విలువైన ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక కోర్టు అటాచ్ చేసుకుంది. బెంగళూరులోని రూ. 4 కోట్ల విలువైన ఫ్లాట్, బళ్లారిలోని రూ. 14 లక్షల విలువైన ఇంటితో సహా పలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఈ అటాచ్ చేసిన ఆస్తుల్లో ఉన్నాయి. -
గాలి జనార్దనరెడ్డికి బెయిలు
బెంగళూరు: అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ(ఏఎంసీ) వ్యవహారానికి సంబంధించిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి ఇక్కడి సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.10 లక్షలకు వ్యక్తిగత బాండుతో పాటు ఇద్దరు పూచీకత్తులను సమర్పించాలని, సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించకూడదని, విచారణకు హాజరు కావాలని షరతులు విధించింది. రెండున్నర సంవత్సరాల క్రితం అరెస్టు అయినప్పటి నుంచీ జనార్దన రెడ్డికి బెయిల్ లభించడం ఇదే తొలిసారి. ఈ కేసుకు సంబంధించి గతంలో సీబీఐ ప్రత్యేక కోర్టుతో పాటు హైకోర్టు తన బెయిల్ అర్జీలను తిరస్కరించడంతో జనార్దనరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండున్నరేళ్లవుతున్నా ఇంకా విచారణే ప్రారంభం కాలేదని, అలాంటప్పుడు తననెందుకు నిర్బంధంలో ఉంచాలని ప్రశ్నిస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. విచారణ ప్రారంభం కానప్పుడు, ఆయన దాఖలు చేసే బెయిల్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సీబీఐ కోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. కాగా, కీలకమైన ఈ కేసులోనే బెయిల్ లభించడంతో మిగిలిన కేసుల్లో కూడా ఆయనకు బెయిల్ లభించవచ్చని పలువురు భావిస్తున్నారు. -
ఎమ్మార్, ఓఎంసీ నిందితుల రిమాండ్ పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్, ఓఎంసీ కేసులో నిందితునిగా ఉన్న సునీల్‌రెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి, అలీఖాన్ రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 26 వరకు పొడిగించింది. వీరి రిమాండ్ ముగియడంతో జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు. ఎమ్మార్ కేసులో నిందితులుగా ఉన్న బీపీ ఆచార్య, కోనేరు రాజేంద్రప్రసాద్, విజయరాఘవ హాజర య్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యం సహా ఇతర నిందితులు హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు అనుమతించింది. ఓఎంసీ కేసులో రాజగోపాల్ కోర్టు ఎదుట హాజరుకాగా.. అనారోగ్య కారణాలతో కోర్టుకు హాజరు కాలేకపోతున్నట్లు శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. వచ్చే వాయిదాకు హాజరు కాలేకపోతే శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఇచ్చిన అభిప్రాయాన్ని కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేస్తూ విచారణను ఈనెల 26కు వాయిదా వేశారు. మరోవైపు ఈనెల 25 నుంచి అక్టోబర్ 25 వరకు కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలోని ఎమ్మార్ ఎంజీఎఫ్ కార్యాలయాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ ఎమ్మార్ ఎంజీఎఫ్ దక్షిణాది ఇన్చార్జి విజయరాఘవ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటర్ దాఖలు చేసింది -
ఎమ్మార్, ఓఎంసీ నిందితుల రిమాండ్ పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్, ఓఎంసీ కేసులో నిందితునిగా ఉన్న సునీల్‌రెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి, అలీఖాన్ రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 26 వరకు పొడిగించింది. వీరి రిమాండ్ ముగియడంతో జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు. ఎమ్మార్ కేసులో నిందితులుగా ఉన్న బీపీ ఆచార్య, కోనేరు రాజేంద్రప్రసాద్, విజయరాఘవ హాజర య్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యం సహా ఇతర నిందితులు హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు అనుమతించింది. ఓఎంసీ కేసులో రాజగోపాల్ కోర్టు ఎదుట హాజరుకాగా.. అనారోగ్య కారణాలతో కోర్టుకు హాజరు కాలేకపోతున్నట్లు శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. వచ్చే వాయిదాకు హాజరు కాలేకపోతే శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఇచ్చిన అభిప్రాయాన్ని కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేస్తూ విచారణను ఈనెల 26కు వాయిదా వేశారు. మరోవైపు ఈనెల 25 నుంచి అక్టోబర్ 25 వరకు కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలోని ఎమ్మార్ ఎంజీఎఫ్ కార్యాలయాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ ఎమ్మార్ ఎంజీఎఫ్ దక్షిణాది ఇన్చార్జి విజయరాఘవ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటర్ దాఖలు చేసింది