కుమార్తె వివాహానికి ’గాలి’ ఆహ్వానం
బళ్లారి : కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి బళ్లారి లో ప్రముఖుల ఇంటింటికీ వెళ్లి తన కుమార్తె బ్రహ్మణీ పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. ఐదేళ్ల అనంతరం ఆయన ఈనెల 1న బళ్లారికి విచ్చేశారు. కుమార్తె వివాహానికి 21 రోజుల పాటు ప్రస్తుతం బళ్లారిలో ఉండేందుకు గాలి జనార్దనరెడ్డికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. రెండు రోజుల నుంచి ఆయన బళ్లారి నగరంలో పలువురు ప్రముఖుల ఇళ్లకు వెళ్లి పెళ్లికి ఆహ్వానం పలుకుతున్నారు.
ఈనెల 16న బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో వివాహం జరుగుతుంది. నగరంలోని పలువురు ప్రముఖ డాక్టర్లతో పాటు జిల్లా బీజేపీ అధ్యక్షుడు గురులింగనగౌడ, బీజేపీ నాయకులు తిమ్మారెడ్డి, ప్రముఖులకు ఇళ్లకు వెళ్లి ఆహ్వానిస్తున్నారు. పెళ్లికి సంబంధించి వినూత్న తరహాలో పత్రిక ఉండటంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.