‘గాలి’ బళ్లారి వెళ్లేందుకు అనుమతి
సాక్షి, బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి నవంబర్ 1 నుంచి 21 వరకు బళ్లారికి వెళ్లేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతిచ్చింది. గనుల కేసులో జైలుకు వెళ్లిన గాలి జనార్దనరెడ్డికి 2015 జూన్ 20న బెయిల్ లభించడం తెలిసిందే. అయితే.. ఆయన బళ్లారి, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాలకు వెళ్లేందుకు మాత్రం ఆంక్షలు విధించింది. దీంతోఆయన ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. కాగా.. ఆయన కుమార్తె బ్రహ్మణి వివాహం హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామిక వేత్తతో నవంబర్ 16న జరగనుంది. కుమార్తె పెళ్లి ఏర్పాట్లు చూసుకునేందుకు బళ్లారికి వెళ్లేందుకు అనుమతివ్వాలని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయమూర్తులు ఏకే సిక్రీ, ఎన్‌వీ రమణ నవంబర్ 1 నుంచి 21వ తేదీ వరకు గాలి జనార్దనరెడ్డి బళ్లారిలో ఉండొచ్చని తీర్పు ఇచ్చారు.