sunil reddy
-
ఆరెంజ్ ట్రావెల్స్.. సునీల్‌రెడ్డి ఇంట్లో విషాదం..!
నిజామాబాద్: కాంగ్రెస్ నాయకుడు, ఆరెంజ్ ట్రావె ల్స్ అధినేత ముత్యాల సునీల్‌రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. గురువారం రాత్రి ఆయన కుమార్తె సమన్వి (16) అనారోగ్యంతో హైదరాబాద్‌లో మృతి చెందింది. అదే రోజు రాత్రి మృతదేహన్ని మెండోరా మండలం సావెల్ గ్రామంలో ఆయన స్వగృహానికి తరలించారు. శుక్రవారం ఉదయం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. సునీల్‌రెడ్డిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ అర్వింద్, మాజీ ప్ర భుత్వ విప్ ఈరవత్రి అనిల్, డీసీసీ అధ్యక్షు డు మానాల మోహన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నా యకుడు ఏలేటి మల్లికార్జున్‌రెడ్డిలు శుక్రవారం ఆయన నివాసంలో పరామర్శించారు. -
ప్రియుడిని పరిచయం చేసిన పూనమ్ బజ్వా..
దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించిన నటి పూనమ్ బజ్వా.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. పూనమ్ తెలుగులో నటించిన ‘మొదటి సినిమా’తోనే తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ప్రేమంటే ఇంతే, బాస్, వేడుక, పరుగు వంటి చిత్రాల్లో నటించి టాలీవుడ్ అభిమానులకు చేరువయ్యారు. అనంతరం తెలుగులో సరైన అవకాశాలు రాకపోవడంతో తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నటించారు. మళ్లీ ఇటీవల బాలకృష్ణ ప్రధాన పాత్రలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఎన్టీర్ కథానాయకుడు ’సినిమాలో అతిధి పాత్రలో కనిపించారు. చదవండి: సాయి పల్లవికి బంఫర్ ఆఫర్.. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఆమె అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. ఇన్స్టాగ్రామ్ వేదికగా పూనమ్ తనకు కాబోయే భర్తను పరిచయం చేశారు. బుధవారం ప్రియుడు సునీల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను షేర్చేస్తూ రిలేషన్లో ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ‘ పుట్టినరోజు శుభాకాంక్షలు సునీల్ రెడ్డి. అందమైన వ్యక్తి, జీవిత భాగస్వామి, నా కలలకు రెక్కలు ఇచ్చిన వ్యక్తి, నా ఆనందం, ఉత్సాహం, నా సర్వస్వం నువ్వే. నీతో కలిసి ఉండే ప్రతి మూమెంట్ ఓ మ్యాజిక్‌లా ఉంటుంది. నీ జీవితంలో ప్రేమ, ఫన్, సంతోషం, ఆరోగ్యం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. నిన్ను మాటల్లో చెప్పలేనంతంగా ప్రేమిస్తున్నాను’ అంటూ ప్రియుడిని పొగడ్తాలతో ముంచేస్తూ కామెంట్ చేశారు. మెహందీ వేడుక అయిపోంది.. ఇవాళ హల్ది ఫంక్షన్ ఇక వీరి ప్రేమను చూసిన అభిమానులు మాత్రం సర్ప్రైజ్ అవుతున్నారు. కాగా పూనమ్ పోస్ట్‌కు నెటిజన్స్‌తోపాటు సినీ సెలబ్రిటీస్ సందీప్ కిషన్, కామ్నా జఠ్మలానీ, ఆర్తి చబ్రియా తదితరులు స్పందిస్తూ నటికి బెస్ట్ విషెస్ చెప్పారు. ఇదిలా ఉండగా పూనమ్ బజ్వా చివరిసారిగా కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ దర్శకత్వంలో తమిళ చిత్రం ‘కుప్పతు రాజా’లో కనిపించారు. View this post on Instagram Birthday greetings🖤🖤🖤@suneel1reddy!!!To My roots, my ground and my wings!Happy Happy Birthday to this handsome guy, beautiful soul, my partner in crime,life mate, romantic date,play mate ,soul mate,my co creator in all dreams gigantic,all moments magical!! I intend for you, all the happiness ,joy, good health,excitement love ,fun, frolic ,travel from this moment on, forever! Many many happy returns of the day booboo! !! I love you more than words could ever say ! P.s.much as I never believed in pda ,esp on IG,the bug has gotten to me and here it is .🙃🙃🙃🙃 A post shared by Poonam Bajwa (@poonambajwa555) on Oct 27, 2020 at 10:45pm PDT -
టీఆర్ఎస్లోనూ ఎవరికి వారే..
అధికార టీఆర్ఎస్ పార్టీలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఆధిపత్య పోరు ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి సస్పెన్షన్‌కు దారితీస్తుండటం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించిన విషయం విదితమే. ఈ పరిస్థితులు ఒక్క రూరల్ నియోజకవర్గానికే పరిమితం కాలేదు. బాల్కొండ నియోజకవర్గంలో కూడా ఇద్దరు ముఖ్య నేతల మధ్య వర్గ పోరు ఇటీవల తారా స్థాయికి చేరింది. ఇక్కడ ఎమ్మెల్యే, మిషన్ భగీరథ వైస్‌చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్‌రెడ్డిల వ్యవహారం నువ్వా..నేనా అన్నట్లుగా తయారైంది. ఈ నేతలిద్దరు ఎవరికి వారే వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: నియోజకవర్గంలో పట్టునిలుపుకునేందుకు ఇద్దరు నేతలు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రశాంత్‌రెడ్డి దృష్టి సారించగా, సేవా కార్యక్రమాలను సునీల్‌రెడ్డి ముమ్మరం చేస్తున్నారు. గ్రామాల్లో పరామర్శలు, శుభ కార్యాలకు హాజరవుతున్నారు. భీంగల్ మండలం బెజ్జోర గ్రామపంచాయతీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో సునీల్‌రెడ్డి అనుచరుడిని గెలిపించుకున్నారని అప్పట్లో చర్చ జరిగింది. ఇలా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా రెండు వర్గాలుగా విడిపోయి పనిచేస్తోంది. కాగా సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రశాంత్‌రెడ్డికి పార్టీలో ప్రత్యేక స్థానం ఉంది. మిషన్‌భగీరథ వైస్ చైర్మన్ పదవిని ఇచ్చిన అధినేత కేసీఆర్ ప్రశాంత్‌రెడ్డి విషయంలో మంత్రితో సమానంగా ప్రొటోకాల్ పాటించాలని ఆదేశించారు. తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షునిగా చాలా కాలం పనిచేసిన సునీల్‌రెడ్డి నిజామాబాద్ ఎంపీ కవితకు ప్రధాన అనుచరుల్లో ఒకరు. పార్టీలో చెప్పుకోదగిన పదవులేవీ లేకపోయినప్పటికీ సునీల్‌రెడ్డి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని అనుచరులతో స్పష్టం చేస్తున్నారు. భూపతిరెడ్డి సస్పెన్షన్ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో ఇద్దరు ముఖ్య నేతలు వేర్వేరుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు చర్చకు దారితీస్తోంది. సీఎం కేసీఆర్ దృష్టికి వ్యవహారం.. బాల్కొండ నియోజకవర్గంలో వర్గ పోరు కూడా సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. సునీల్‌రెడ్డి తీరుపై ప్రశాంత్‌రెడ్డి పలుమార్లు కేసీఆర్‌కు ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయాలని కోరుతూ తీర్మానం చేసేందుకు ఇటీవల హైదరాబాద్‌లో మంత్రి పోచారం నివాసంలో జరిగిన ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశం సందర్భంగా కూడా బాల్కొండ నియోజవర్గంలోని వర్గపోరుపై స్వల్ప చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులే దాదాపు ఇక్కడ కూడా నెలకొనడం ఇప్పుడు ప్రత్యేక చర్చకు దారితీస్తోంది. -
‘అక్రమ బస్సులు నడపడంలో కేశినేని దిట్ట’
విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేనిపై పలు ట్రావెల్స్ యజమానుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని నాని అక్రమ బస్సుల జాబితాను మీడియాకు విడుదల చేశారు. బస్సు నంబర్లతో సహా 27 బస్సుల జాబితా మీడియాకు విడుదల చేశారు. ఇన్నాళ్లుగా కేశినేని వ్యాపారం నిబంధనలకు విరుద్ధంగా చేశారంటూ ఆరంజ్, మార్నింగ్ స్టార్ యజమానులు సునీల్ రెడ్డి, నివాస్‌లు శనివారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు. కేశినేని ట్రావెల్స్ 27 ఓవవర్ హ్యాంగ్ బస్సులను నడిపిందని అన్నారు. అక్రమ బస్సులను నడపడంలో కేశినేని నానీ దిట్ట అని చెప్పారు. ఏపీలో రిజిస్ట్రయిన బస్సులు కూడా నిబంధనలకు విరుద్ధంగానే నడిచాయంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'టీడీపీ ఎంపీ కేశినేని నాని పెద్ద దొంగ'
-
కేశినేని నాని మమ్మల్ని బతకనిచ్చేవారు కాదు
-
కేశినేని నాని మమ్మల్ని బతకనిచ్చేవారు కాదు
రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం చాలా మంచి అధికారి అని, ఆయనవల్లే తాము బస్సులు నడపగలుగుతున్నామని ఆరంజ్ ట్రావెల్స్ సంస్థ అధినేత సునీల్ రెడ్డి అన్నారు. అలాంటివాళ్లు లేకపోతే కేశినేని నాని తమను బతకనిచ్చేవారు కాదని చెప్పారు. టీడీపీ ఎంపీ అయిన కేశినేని నాని పెద్ద దొంగ అని, రూ. 9 కోట్ల సర్వీస్ టాక్స్ ఎగ్గొట్టారని ఆరోపించారు. తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఫైనాన్స్ వ్యాపారులను బెదిరిస్తున్నారని, తన మూడు బస్సులపై అక్రమంగా కేసులు నమోదు చేయించారని ఆయన తెలిపారు. బస్సు ప్రమాదం కేసులో పోలీసుల మీద కూడా నాని ఒత్తిడి తెచ్చారన్నారు. తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలని అధికారులను బెదిరించారని చెప్పారు. గత ఆరు నెలల నుంచి కేశినేని నాని తమను ఇబ్బంది పెడుతున్నారని, తామంతా కలిసి ఆయనను ఎంపీగా గెలిపించినా తనపై కక్ష పెట్టుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నాని కారణంగా ప్రైవేటు ట్రావెల్స్ అన్నీ దెబ్బతిన్నాయని, చాలామంది బస్సులు నడపడం మానేశారని వివరించారు. ఆయన లాంటి అహంకారులు ఎంపీగా ఉండటం విజయవాడ ప్రజల దురదృష్టమని సునీల్ రెడ్డి అన్నారు. తానే గొప్పవాడినని, మిగతావాళ్లు లేమీ చేయలేరని నాని విర్రవీగుతున్నారని మండిపడ్డారు. తాము అన్నిరకాల అనుమతులతో ధైర్యంగా బస్సులు నడుపుతున్నందునే తమ బస్సులను ఆయన టార్గెట్ చేశారని తెలిపారు. -
మరో ప్రేమికుడు!
‘‘ప్రతి ఒక్కరి లైఫ్‌లో ప్రేమ అనేది మర్చిపోలేని అనుభూతి. వినూత్న కథ, చక్కని సంగీతంతో ఆహ్లాదంగా సాగిపోయే యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ఇది. వినోదంతో ఎంటర్టైన్ చేస్తూ, ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది. కథలోని పాత్రల్లో యువతరం తమను తాము చూసుకుంటారు’’ అని దర్శకుడు ‘కళా’ సందీప్ తెలిపారు. మానస్, సనమ్ శెట్టి జంటగా డిజి పోస్ట్ సమర్పణలో ఎస్ఎస్ సినిమా పతాకంపై లక్ష్మి నారాయణరెడ్డి, కె. ఇసనాక సునీల్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘ప్రేమికుడు’. పాటలను ఈనెల 13న విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఇప్పటి యువతకు కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నెలలో పాటలను, వేసవిలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజీ, కెమేరా: శివ కె, సహ నిర్మాత: వరికుంట్ల సురేశ్‌బాబు(రాజ). -
తుపాకీతో బెదిరించిన ట్రావెల్స్ యజమాని
హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో రెండు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల మధ్య బస్సు కొనుగోలు వివాదం గురువారం తారాస్థాయికి చేరింది. దీంతో ఓ బస్సు ట్రావెల్స్ యజమానిని తుపాకీతో బెదిరించాడు. దీంతో మరో బస్సు ట్రావెల్స్ యజమాని అయిన బాధితుడు కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి బెదిరించిన ట్రావెల్స్ యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.... కూకట్‌పల్లిలోని ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని సునీల్ రెడ్డ్ వద్ద కృష్ణవేణి ట్రావెల్స్ యజమాని ప్రతాప్ రెడ్డి మూడు బస్సులు కొనుగోలు చేశాడు. మొత్తం నగదు చెల్లించేందుకు కొద్దిగా గడువు కావాలని ప్రతాప్ రెడ్డి కోరాడు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించాడు. గడువు ముగిసిన నగదు చెల్లించకపోవడంతో ప్రతాప్ రెడ్డి వైఖరిపై సునీల్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతాప్ రెడ్డిని గురువారం సునీల్ రెడ్డి తుపాకీతో బెదిరించారు. దీంతో తనకు ప్రాణ హాని ఉందని సునీల్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. -
ఫోటోలు తీసి ఫేస్'బుక్కయ్యాడు'
నిజామాబాద్ : ఓ విద్యార్థిని ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఇంటర్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిక్కనూరు మండలం గుర్జకుంటకు చెందిన విద్యార్థినిని అదే గ్రామానికి చెందిన సునీల్ రెడ్డి ఫోటోలు తీశాడు. వాటిని మార్ఫింగ్ చేసి అశ్లీలంగా మార్చాడు. అనంతరం ఆ ఫోటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో నిందితుడిపై నిర్భయ, ఐటీ యాక్టుల కింద కేసులు నమోదు చేసినట్లు కామారెడ్డి రూరల్ సీఐ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. నిందితుడిని కోర్టులో హారజపరిచి రిమాండ్‌కు తరలించారు. -
నారాయణను మంత్రి పదవి నుంచి తొలగించాలి
కర్నూలు(న్యూసిటీ): నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను రాష్ట్ర నూతన మంత్రివర్గం నుంచి తొలగించాలని అఖిలభారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) రాష్ట్ర కార్యదర్శి సునిల్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నారాయణ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారాయణకు మంత్రి పదవి ఇవ్వడంతో కార్పొరేట్ విద్యావ్యవస్థకు మరింత ఆయువు పోసినట్లవుతుందన్నారు. కొన్ని సంవత్సరాలుగా కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలు పెరిగిపోయాయని, దీని కారణంగా ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడ్డాయని వివరించారు. ఎంసెట్, ఇంటర్ వార్షిక ప్రశ్నాపత్రాల లీకేజీలలో నారాయణ హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయని వివరించారు. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సూర్యకుమార్, నగర సంయుక్త కార్యదర్శి ప్రశాంత్, నగర సంఘటనా కార్యదర్శి రంజిత్, రాజేష్, సుభాకర్, సాయి, జనార్ధన్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి నాయకుల అరెస్టు, విడుదల... ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులు సునిల్‌రెడ్డి, సూర్యకుమార్, ప్రశాంత్, రంజిత్, రాజేష్, జనార్దన్, శివ, సతీష్, నంద, ప్రతాప్, సందీప్‌ను పోలీసులు అరెస్టు చేసి మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కలెక్టరేట్ ఎదుట 144వ సెక్షన్ అమలులో ఉందని, ధర్నాలు చేయరాదని పోలీసులు చెప్పారని సునిల్‌రెడ్డి వివరించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. -
తడిగుడ్డతో గొంతు కోశారు
కేసీఆర్‌పై సునీల్‌రెడ్డి ధ్వజం మంథని, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తండ్రిలా భావిస్తే తడిగుడ్డతో తన గొంతు కోశారని ఆ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చందుపట్ల సునీల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా మంథనిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నాలుగేళ్ల నుంచి ఉద్యమంలో తనను అన్ని విధాలుగా ఉపయోగించుకుని ఇప్పుడు తీరని అన్యాయం చేశారని వాపోయారు. పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమను పక్కన పెట్టి తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేయడం దుర్మార్గమన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి జెడ్పీటీసీగా పోటీలో ఉండమని సూచించడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రెండురోజుల్లో పార్టీకి రాజీనామా చేసి భవిష్యత్ నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. -
కారులో కయ్యుం
గులాబీ దండులో టికెట్ల లొల్లి మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘనతను ప్రచారాస్త్రంగా వులుచుకొని అధికారం చేపట్టాలని తహతహలాడుతున్న టీఆర్ఎస్లో అంతర్గత పోరు రాజుకుంటోంది. జిల్లాలో రెండు ఎంపీ స్థానాలతో పాటు 13 అసెంబ్లీ నియోజకవర్గాలున్నారుు. అన్ని చోట్ల టికెట్లను ఆశిస్తున్నవారు రోజురోజుకు పెరిగిపోతుండడంతో గొడవలు వుుదురుతున్నారుు. కొత్తవాళ్లకు టికెట్లు ఇస్తే ఊరుకొనేది లేదని.. సావుూహికంగా రాజీనావూలు చేస్తావుని తాజాగా మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి హెచ్చరించారు. దీంతో టీఆర్ఎస్ టికెట్ల పోరు బజారుకెక్కింది. మంథని నుంచి రాంరెడ్డి, ఆయన తనయుడు సునీల్‌రెడ్డి పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. తవుకే టికెట్ వస్తుందని నమ్మకంతో ఉన్న రాంరెడ్డి కుటుంబానికి, అదేస్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పుట్ట మధు టీఆర్ఎస్లో చేరుతుండడం ఇబ్బందిగా మారింది. కేసీఆర్‌తో పాటు ముఖ్య నేతలతో వుధు చర్చలు జరపడం, పార్టీ కూడా ఆయనకు టిక్కెటు ఇచ్చేం దుకు మొగ్గు చూపుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇంతకాలం ఉద్యవుంతో పాటు పార్టీకి పని చేసిన తవుకు నచ్చజెప్పేందుకు పార్టీ నేతలు చేస్తున్న ప్రయుత్నాలతో రాంరెడ్డి అసంతృప్తితో ఉన్నారు. అందుకే పార్టీకి అల్టిమేటమ్ జారీ చేశారు. రామగుండంలోనూ అదే పరిస్థితి నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, కోరుకంటి చందర్ పార్టీ టికెట్ కోసం పోటీపడుతున్నారు. గత ఎన్నికల్లో కోరుకంటి చందర్ టీఆర్ఎస్ నుంచి పోటీ చేయగా, పొత్తును ఉల్లంఘించి సోమారపు సత్యనారాయణ టీడీపీ నుంచి నామినేషన్ వేయడానికి రావడం, సకాలంలో బీ-ఫారం అందచేయకపోవడంతో స్వతంత్రుడిగా బరిలోకి దిగి విజయం సాధించడం తెలిసిందే. ఈసారి ఇరువురు ఒకే పార్టీలో ఉన్నా సమాంతరంగా గ్రూపులకు సారథ్యం వహిస్తున్నారు. చొప్పదండి నుంచి నియోజకవర్గ ఇన్చార్జి బొడిగె శోభ టికెట్ ఆశిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య టీఆర్ఎస్లోకి వస్తారని, లేదంటే టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సువున్‌కు టికెట్ వస్తుందనే ప్రచారంతో శోభ పార్టీపై గుర్రుగా ఉన్నారు. జగిత్యాలలో నియోజకవర్గ ఇన్చార్జి ఎం.జితేందర్‌రావు, వి.రమణారావుల నడుమ టికెట్ కోసం పోరు కొనసాగుతోంది. కోరుట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు టికెట్ తనకే అనే ధీమాతో ఉండగా, టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ సైతం ఇదే స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. జెడ్పీ చైర్పర్సన్ సీటు బీసీ వుహిళకు రిజర్వు కావటంతో ఆమెను జెడ్పీటీసీకి పోటీ చేసేలా పార్టీ నేతలు రూటు వుళ్లించారు. మానకొండూరు నుంచి మరోసారి టికెట్ తనకే అని నియోజకవర్గ ఇన్చార్జి ఓరుగంటి ఆనంద్ ధీమాతో ఉండగా, ధూంధాం కళాకారుడు రసమయి బాలకిషన్ తెరపైకి వచ్చారు. కాంగ్రెస్ కూడా రసవురుుని పార్టీలోకి ఆహ్వానిస్తుండటంతో ఆనంద్ సందిగ్ధంలో ఉన్నారు. పెద్దపల్లిలో నియోజకవర్గ ఇన్చార్జి దాసరి వునోహర్‌రెడ్డికి టికెట్ ఇస్తున్నట్లు పార్టీ నేత టి.హరీష్‌రావు ఇటీవల ప్రకటించడంతో, అదే స్థానాన్ని ఆశిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి అంతర్గతంగా నేతల వైఖరిపై ఫైర్ అయ్యారు. ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని, తాము కూడా రేసులో ఉన్నామని కరీంనగర్లో పార్టీ సీనియర్ నేతలతో వాదనకు దిగారు. పార్టీలో ఉన్న వాళ్లతోనే ఈ సమస్యలు ఉండగా, కొత్తగా పార్టీలోకి వస్తున్న వాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండడంతో, టికెట్ల లొల్లి జయాపజయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలో పార్టీ నాయకత్వం ఉంది. -
పరీక్ష కేంద్రం వద్ద యువతిపై కత్తితో దాడి
అనంతపురం, న్యూస్‌లైన్: తనతో స్నేహంగా ఉన్న యువతి, మరో వ్యక్తిని వివాహం చేసుకుందని ఆగ్రహించిన ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. అనంతరం విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈసంఘటన అనంతపురంలో ఆదివారం చోటుచేసుకుంది. గార్లదిన్నె మండలం కోటంకకు చెందిన సునీల్ రెడ్డి, నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన యువతి స్థానిక ఎస్ఎస్బీఎన్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో స్నేహంగా ఉండేవారు. అనంతరం ఉన్నత చదువుల కోసం సునీల్ వైఎస్సార్ జిల్లా యోగివేమన యూనివర్సిటీలో చేరగా, ఆ యువతి స్థానిక ఎస్వీ పీజీ కళాశాలలో చేరింది. సునీల్ ఆదివారం స్థానిక ఆర్ట్స్ కాలేజీలో ఏపీసెట్ పరీక్షలు రాస్తూ అదే గదిలో ఆ యువతిని చూశాడు. ఆమెకు వివాహమైనట్లు గుర్తించాడు.పరీక్ష రాసి కళాశాల ఆవరణలో ఉన్న యువతి వద్దకు వెళ్లి, తనను మోసం చేసి, మరొకరిని వివాహం చేసుకుంటావా? అంటూ కత్తితో దాడి చేశాడు. గాయపడిన ఆమె ప్రాణ భయంతో కళాశాల ఆవరణ నుంచి బయటకు పరుగెత్తి ఆటోలో వెళ్లిపోయింది. దాడి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన సనీల్‌రెడ్డి కక్కలపల్లి క్రాస్ సమీపంలోని ఓ తోటలో విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. -
బెయిల్‌పై సునీల్‌రెడ్డి విడుదల
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎమ్మార్ ప్రాపర్టీస్ వివాదం కేసులో గత 20 నెలలుగా చంచల్‌గూడ జైల్లో ఉన్న సునీల్‌రెడ్డి సోమవారం బెయిల్‌పై విడుదలయ్యారు. శనివారం సునీల్‌రెడ్డికి సీబీఐ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా ఆదివారం సెలవుదినం కావడంతో సోమవారం విడుదలయ్యారు. ఈ సందర్భంగా సునీల్‌రెడ్డిని తోడ్కొని వెళ్లేందుకు ఆయన అభిమానులు, బంధువులు, మిత్రులు భారీ సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నారు. ఆయనకు పుష్పగుచ్ఛాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. -
ఎమ్మార్ కేసులో సునీల్ రెడ్డికి బెయిల్ మంజూరు
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు సునీల్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల రూపాయల పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కూడా షరతు విధించింది. ఎమ్మార్ కేసులో ఏడో నిందితుడిగా ఉన్న సునీల్‌రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు మంగళవారం, గురువారం విచారించింది. ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న తుమ్మల రంగారావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సునీల్‌రెడ్డిని అక్రమంగా ఈ కేసులో ఇరికించారని సునీల్ రెడ్డి తరఫు న్యాయవాది శ్రీరామ్ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐపీసీ సెక్షన్ 409 (ప్రభుత్వ ఉద్యోగి/బ్యాంకరు/వ్యాపారి/ఏజెంట్ నమ్మకద్రోహానికి పాల్పడడం) సునీల్‌రెడ్డికి వర్తించదని కోర్టుకు వివరించారు. ఏపీఐఐసీ వ్యవహారాల్లో, ఎమ్మార్‌తో జరిగిన ఒప్పందంలో ఎక్కడా ఆయన పాత్ర లేదని తెలిపారు. ఈ కేసులో గతేడాది జనవరి 25న సునీల్‌రెడ్డిని అరెస్టు చేశారు. అప్పట్నుంచీ ఆయన జ్యుడీషియల్ రిమాం డ్లో ఉన్నారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారితోపాటు ఇతర నిందితులందరికీ కోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని శ్రీరామ్ కోర్టుకు గుర్తుచేశారు. అయితే, సునీల్‌రెడ్డికి బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇరు పక్షాల వాదనలు ముగిసిన తరువాత సునీల్ రెడ్డికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. -
సునీల్‌రెడ్డిని అక్రమంగా ఇరికించారు : శ్రీరామ్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్ కేసులో సహ నిందితుడిగా ఉన్న తుమ్మల రంగారావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సునీల్‌రెడ్డిని అక్రమంగా ఈ కేసులో ఇరికించారని ఆయన తరఫు న్యాయవాది శ్రీరామ్ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మార్ కేసులో ఏడో నిందితుడిగా ఉన్న సునీల్‌రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు మంగళవారం విచారించారు. సునీల్‌రెడ్డి తరఫు న్యాయవాది శ్రీరామ్ వాదిస్తూ.. ఐపీసీ సెక్షన్ 409 (ప్రభుత్వ ఉద్యోగి/బ్యాంకరు/వ్యాపారి/ఏజెంట్ నమ్మకద్రోహానికి పాల్పడడం) సునీల్‌రెడ్డికి వర్తించదని.. ఏపీఐఐసీ వ్యవహారాల్లో, ఎమ్మార్‌తో జరిగిన ఒప్పందంలో ఎక్కడా ఆయన పాత్ర లేదని తెలిపారు. ఒకవేళ సహ నిందితుడు రంగారావు వాంగ్మూలం ఆధారంగా అభియోగాలు మోపాల్సి వచ్చినా.. ఐపీసీ సెక్షన్ 405 (ప్రైవేటు వ్యక్తుల నమ్మకద్రోహం) మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. ఈ కేసులో గతేడాది జనవరి 25న సునీల్‌రెడ్డిని అరెస్టు చేశారని, అప్పట్నుంచీ ఆయన జ్యుడీషియల్ రిమాం డ్లో ఉన్నారని... ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారితోపాటు ఇతర నిందితులందరికీ కోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఈ కేసుకు సంబంధించిన రికార్డులన్నింటినీ సీబీఐ ఇప్పటికే సీజ్ చేసిందని, ఈ నేపథ్యంలో ఆధారాలను మాయం చేస్తారని, సాక్షులను ప్రభావితం చేస్తారనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. సునీల్‌రెడ్డికి వ్యతిరేకంగా రంగారావు మాత్రమే సాక్ష్యం ఇచ్చారని.. అయితే, ఆయనకు కోర్టు క్షమాభిక్ష ప్రసాదించి నిందితుడిగా తొలగించి సాక్షిగా మార్చిందని తెలిపారు. ఒకవేళ రంగారావు.. సునీల్‌రెడ్డికి అనుకూలంగా సాక్ష్యమిస్తే తిరిగి నిందితుడిగా పరిగణించబడతారని... అందువల్ల ఆయన ప్రభావితమయ్యే అవకాశమే ఉండదని చెప్పారు. పారదర్శకంగా తుదివిచారణ జరగాలంటే, నిందితులు సమర్థంగా తమ వాదన వినిపించుకోవాలంటే వారికి బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. దర్యాప్తు పూర్తికాలేదన్న కారణంతో గతంలో కోర్టు సునీల్‌రెడ్డికి బెయిల్‌ను నిరాకరించిందని, ప్రస్తుతం దర్యాప్తు పూర్తయినందున బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇందుకు న్యాయస్థానం ఎటువంటి షరతులు విధించినా పాటించేందుకు సునీల్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే, సునీల్‌రెడ్డికి బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. వాదనకు గడువు కావాలని సీబీఐ డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ బళ్లా రవీంద్రనాథ్ విజ్ఞప్తి చేయడంతో విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది. -
ఎమ్మార్, ఓఎంసీ నిందితుల రిమాండ్ పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్, ఓఎంసీ కేసులో నిందితునిగా ఉన్న సునీల్‌రెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి, అలీఖాన్ రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 26 వరకు పొడిగించింది. వీరి రిమాండ్ ముగియడంతో జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు. ఎమ్మార్ కేసులో నిందితులుగా ఉన్న బీపీ ఆచార్య, కోనేరు రాజేంద్రప్రసాద్, విజయరాఘవ హాజర య్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యం సహా ఇతర నిందితులు హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు అనుమతించింది. ఓఎంసీ కేసులో రాజగోపాల్ కోర్టు ఎదుట హాజరుకాగా.. అనారోగ్య కారణాలతో కోర్టుకు హాజరు కాలేకపోతున్నట్లు శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. వచ్చే వాయిదాకు హాజరు కాలేకపోతే శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఇచ్చిన అభిప్రాయాన్ని కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేస్తూ విచారణను ఈనెల 26కు వాయిదా వేశారు. మరోవైపు ఈనెల 25 నుంచి అక్టోబర్ 25 వరకు కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలోని ఎమ్మార్ ఎంజీఎఫ్ కార్యాలయాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ ఎమ్మార్ ఎంజీఎఫ్ దక్షిణాది ఇన్చార్జి విజయరాఘవ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటర్ దాఖలు చేసింది -
ఎమ్మార్, ఓఎంసీ నిందితుల రిమాండ్ పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్, ఓఎంసీ కేసులో నిందితునిగా ఉన్న సునీల్‌రెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి, అలీఖాన్ రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 26 వరకు పొడిగించింది. వీరి రిమాండ్ ముగియడంతో జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు. ఎమ్మార్ కేసులో నిందితులుగా ఉన్న బీపీ ఆచార్య, కోనేరు రాజేంద్రప్రసాద్, విజయరాఘవ హాజర య్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యం సహా ఇతర నిందితులు హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు అనుమతించింది. ఓఎంసీ కేసులో రాజగోపాల్ కోర్టు ఎదుట హాజరుకాగా.. అనారోగ్య కారణాలతో కోర్టుకు హాజరు కాలేకపోతున్నట్లు శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. వచ్చే వాయిదాకు హాజరు కాలేకపోతే శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఇచ్చిన అభిప్రాయాన్ని కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేస్తూ విచారణను ఈనెల 26కు వాయిదా వేశారు. మరోవైపు ఈనెల 25 నుంచి అక్టోబర్ 25 వరకు కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలోని ఎమ్మార్ ఎంజీఎఫ్ కార్యాలయాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ ఎమ్మార్ ఎంజీఎఫ్ దక్షిణాది ఇన్చార్జి విజయరాఘవ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటర్ దాఖలు చేసింది