తుపాకీతో బెదిరించిన ట్రావెల్స్ యజమాని | Quarrel with two private bus travel operators in kukatpally | Sakshi
Sakshi News home page

తుపాకీతో బెదిరించిన ట్రావెల్స్ యజమాని

Published Thu, Sep 18 2014 11:56 AM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM

తుపాకీతో బెదిరించిన ట్రావెల్స్ యజమాని

తుపాకీతో బెదిరించిన ట్రావెల్స్ యజమాని

హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో రెండు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల మధ్య బస్సు కొనుగోలు వివాదం గురువారం తారాస్థాయికి చేరింది. దీంతో ఓ బస్సు ట్రావెల్స్ యజమానిని తుపాకీతో బెదిరించాడు. దీంతో మరో బస్సు ట్రావెల్స్ యజమాని అయిన బాధితుడు కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి బెదిరించిన ట్రావెల్స్ యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.... కూకట్పల్లిలోని ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని సునీల్ రెడ్డ్ వద్ద కృష్ణవేణి ట్రావెల్స్ యజమాని ప్రతాప్ రెడ్డి మూడు బస్సులు కొనుగోలు చేశాడు. మొత్తం నగదు చెల్లించేందుకు కొద్దిగా గడువు కావాలని ప్రతాప్ రెడ్డి కోరాడు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించాడు. గడువు ముగిసిన నగదు చెల్లించకపోవడంతో ప్రతాప్ రెడ్డి వైఖరిపై సునీల్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతాప్ రెడ్డిని గురువారం సునీల్ రెడ్డి తుపాకీతో బెదిరించారు. దీంతో తనకు ప్రాణ హాని ఉందని సునీల్ రెడ్డి పోలీసులను
ఆశ్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement